📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
అశోకుని శిలా స్తంభంలో ఉపయోగించిన శిల్ప కళ ఏది?
పర్షియన్ శిల్పకళా.
రాజస్థాన్ శిల్పకళా.
గుజరాత్ శిల్పకళా.
ద్రావిడ శిల్పకళా.
సారనాథ్ లోని అశోకుని శిలా స్థంభం రాజస్థాన్ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఈ నిర్మాణంలో ఉపయోగించిన ఇసుకరాయి రాజస్థాన్ శిల్పకళా శైలికి అనుగుణంగా మెరుపుతో, బలంగా ఉండేది.
అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు?
మొదటి పానిపట్టు యుద్ధం.
తళ్ళికోట యుద్ధం.
రెండవ పానిపట్టు యుద్ధం.
కళింగ యుద్ధం.
అశోకుడు కళింగ యుద్ధం తర్వాత కలత చెంది బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈ యుద్ధంలో జరిగిన అపారమైన ప్రాణనష్టం మరియు హింస కారణంగా కలిగిన బాధ అతన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, బౌద్ధమతం వైపు ఆకర్షించింది. ఆయన అహింసా మార్గాన్ని ప్రభోదిస్తూ బౌద్ధమత వ్యాప్తికి, ప్రజా సంక్షేమానికి కృషి చేసాడు.
కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించింది, పూర్తి చేసింది వరుసగా ఎవరు?
కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్ టుట్ మిష్.
ఇల్ టుట్ మిష్ మరియు కుతుబుద్దీన్ ఐబక్.
కుతుబుద్దీన్ ఐబక్ మరియు సాలార్ జంగ్.
ఇల్ టుట్ మిష్ మరియు 7వ నిజాం.
కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించారు. అయితే అతను మొదటి అంతస్తును మాత్రమే పూర్తి చేయగలిగారు. అతని తరువాత, అతని వారసుడు ఇల్ టుట్ మిష్ మరో మూడు అంతస్తులను జోడించి, నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఫిరోజ్ షా తుగ్లక్ ఐదవ మరియు చివరి అంతస్తును పూర్తి చేశారు.
స్థూపం అని దేనిని అంటారు?
గుమ్మటం ఆకారంలో గల నిర్మాణం.
త్రికోణ ఆకారంలో గల నిర్మాణం.
చతురస్ర ఆకారంలో గల నిర్మాణం.
గుడిముందు ఉండే ద్వారం వంటి నిర్మాణం.
స్థూపం అనేది బౌద్ధ సాంప్రదాయంలో శరీర అవశేషాలు, పవిత్ర వస్తువులను నిల్వ చేసేందుకు ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటం ఆకారంలో నిర్మించబడిన నిర్మాణం. ఇది భక్తులకు ఆధ్యాత్మిక ప్రేరణను ఇస్తుంది మరియు బౌద్ధ శిల్పకళను ప్రతిబింబిస్తుంది.
కుతుబ్ మీనార్ యొక్క ఎత్తు ఎంత?
సుమారు 58 మీటర్లు.
సుమారు 62.5 మీటర్లు.
సుమారు 72.5 మీటర్లు.
సుమారు 82.5 మీటర్లు.
కుతుబ్ మీనార్ ఎత్తు సుమారు 72.5 మీటర్లు. ఇది ఇటుకలతో నిర్మించబడింది. ఇది భారతదేశం లోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన ఇటుక మీనార్‌గా గుర్తించబడింది.
తెలంగాణ అమరవీరుల స్థూపం హైదరాబాద్ లో ఎక్కడ కలదు?
అసెంబ్లీ భవనం ఎదురుగా.
చార్మినార్ ఎదురుగా.
గోల్కొండ కోట ఎదురుగా.
హైకోర్టు భవనం ఎదురుగా.
తెలంగాణ అమరవీరుల స్థూపం హైదరాబాద్ లో అసెంబ్లీ భవనం ఎదురుగా ఉంది. దీనిని 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి గుర్తుగా నిర్మించారు. ఇది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఎల్లప్పుడూ గుర్తు చేసే స్థూపం.
సాలార్‌జంగ్ మ్యూజియం ఎక్కడ కలదు?
కోల్‌కతా.
విజయవాడ.
ఢిల్లీ.
హైదరాబాద్.
సాలార్‌జంగ్ మ్యూజియం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో, మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న దార్-ఉల్-షిఫా వద్ద ఉంది. దీనిని 1951లో భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఇది భారతదేశంలోని ప్రముఖ జాతీయ మ్యూజియంలలో ఒకటి.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎవరు ఎగురవేస్తారు?
రాష్ట్రపతి.
ప్రధానమంత్రి.
ఉపరాష్ట్రపతి.
చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియా.
ప్రతి సంవత్సరం ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానమంత్రి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ సంప్రదాయం 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో ప్రారంభమైంది.
చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో గల కవులను ఏ పేరుతో పిలిచేవారు?
అష్టదిగ్గజాలు.
నవరత్నాలు.
అష్టరత్నాలు.
జాతిరత్నాలు.
చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో గల కవులను “నవరత్నాలు” అని పిలిచేవారు. వారు: 1) కాళిదాసు, 2) ధన్వంతరి , 3) అమరసింహుడు, 4) వరాహమిహిరుడు, 5) వరరుచి, 6) శంకభట్టు, 7) క్షపణకుడు (లేదా కహపానక), 8) ఘటకర్పరుడు, 9) వేతాళభట్టు.
జాతీయ పతాకం మధ్యలోని ధర్మ చక్రాన్ని ఎక్కడనుండి తీసుకున్నారు?
నేలకొండపల్లి స్థూపం.
అమరావతి స్థూపం.
సారనాథ్ స్థూపం.
సాంచీ స్థూపం.
భారత జాతీయ పతాకంలో మధ్యలో ఉన్న ధర్మ చక్రం సారనాథ్ స్థూపం నుండి తీసుకోబడింది. ఈ ధర్మ చక్రం 24 spokes (ఆకులు) కలిగి ఉంటుంది.
వేయి స్తంభాల గుడి ఎక్కడ కలదు?
వరంగల్.
ములుగు.
జయశంకర్ భూపాలపల్లి.
నల్గొండ.
వేయి స్తంభాల గుడి తెలంగాణలోని వరంగల్ (హన్మకొండ) లో కలదు. దీనిని రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది కాకతీయుల కాలం నాటి శివాలయం.ఇది కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే నిర్మించబడింది.
ఎర్రకోట నిర్మాణంలో గల నిర్మాణ శైలులు ఏవి?
పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు.
గాంధార, ద్రావిడ నిర్మాణ శైలులు.
పర్షియన్, ఇస్లామిక్ నిర్మాణ శైలులు.
ఇస్లామిక్, భారతీయ నిర్మాణ శైలులు.
ఎర్రకోట (Red Fort) నిర్మాణంలో పర్షియన్ మరియు భారతీయ నిర్మాణ శైలులు రెండూ కూడా సమన్వయంగా కనిపిస్తాయి. ఇది ఎర్ర ఇసుకరాయితో నిర్మించిన భారీ గోడలకు ప్రసిద్ధి చెందింది.
చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది?
1560
1575
1591
1605
చార్మినార్ ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. దీనిని ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించడం జరిగింది.
గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?
శ్రీ గుప్తుడు.
మొదటి కుమారగుప్తుడు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడు.
సముద్రగుప్తుడు.
గుప్త సామ్రాజ్యాన్ని క్రీ.శ. 320వ సంవత్సరంలో శ్రీ గుప్తుడు స్థాపించారు. ఆయన స్థాపించిన ఈ చిన్న రాజ్యాన్ని చంద్రగుప్తుడు-I మగధలో పెంచి, ఒక పెద్ద సామ్రాజ్యంగా మార్చాడు. తరువాతి కాలంలో అతడు గుప్త రాజవంశంలో ఒక ప్రముఖ పాలకుడిగా ఎదిగి, "మహారాజాధిరాజ" అనే బిరుదుతో సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
గుప్త వంశస్తుల్లో సుప్రసిద్ధుడు ఎవరు?
నరసింహగుప్తుడు.
విష్ణు గుప్తుడు.
భానుగుప్తుడు.
చంద్రగుప్త విక్రమాదిత్యుడు.
గుప్త వంశస్తుల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన రాజు చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఆయన పాలనలో గుప్త సామ్రాజ్యం శక్తివంతమైనది మరియు శాంతి, ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి చోటుచేసుకుంది. అతని పాలనలో విద్య, కళలు, విజ్ఞానం అభివృద్ధి చెందాయి. ఆయన కాలాన్ని గుప్తుల స్వర్ణ యుగం అని పిలుస్తారు.
చార్మినార్ ఎక్కడ కలదు?
ముంబై.
ఢిల్లీ.
హైదరాబాద్.
పుదుచ్చేరి.
చార్మినార్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉంది. ఇది కుతుబ్ షాహీ వంశానికి చెందిన చారిత్రక కట్టడం. ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ చారిత్రక స్మారక చిహ్నం.
సారనాథ్ స్థూపాన్ని ఎవరు నిర్మించారు?
హర్షవర్ధనుడు.
అశోకుడు.
బింబిసారుడు.
చంద్రగుప్త మౌర్యుడు.
సారనాథ్ స్థూపాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడు. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ లో ఉంది. ఇది అతి ప్రాచీనమైన కట్టడం. ఇది బౌద్ధ మతానికి సంబంధించిన ప్రముఖ శిల్పకళా నిర్మాణం. ఇది బుద్ధుడు తన మొదటి ధర్మోపదేశం ఇచ్చిన ప్రదేశం కాబట్టి ఇది బౌద్ధులకు పవిత్ర స్థలం.
గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకునే గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ కలదు?
ఖమ్మం.
భద్రాద్రి కొత్తగూడెం.
శ్రీశైలం.
ములుగు.
గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను పరిచయం చేసే గిరిజన ప్రదర్శనశాల (Tribal Museum) శ్రీశైలంలో ఉంది. ఇందులో గిరిజనుల జీవనశైలి, వృత్తులు, కళలు, వస్త్రధారణ, పనిముట్లు, నృత్యాలు, ఆచారాలు, విశ్వాసాలను ప్రతిబింబించే వస్తువులు, నమూనాలు ప్రదర్శించబడతాయి.
చార్మినార్ ఎత్తు ఎంత?
సుమారు 85 మీటర్లు.
సుమారు 46 మీటర్లు.
సుమారు 64 మీటర్లు.
సుమారు 58 మీటర్లు.
చార్మినార్ యొక్క ఎత్తు సుమారు 58 మీటర్లు. ఇది నాలుగు మినార్లతో కూడిన ఒక అద్భుతమైన చతురస్రాకారపు నిర్మాణ కళాఖండం. చార్మినార్ నిర్మాణంలో గ్రానైట్ మరియు సున్నపు మోర్టార్‌ను ఉపయోగించారు. దీనికి నాలుగు వైపులా కమాన్‌లు ఉన్నాయి.
అశోకుని స్తంభంపై ఎన్ని సింహాలు చెక్కబడి ఉంటాయి?
6 సింహాలు.
5 సింహాలు.
4సింహాలు.
3 సింహాలు.
అశోకుని స్తంభ శిఖరంపై 4 సింహాలు చెక్కబడి ఉంటాయి. ఈ నాలుగు సింహాలు నాలుగు వేర్వేరు దిశలలో చూస్తూ ఉంటాయి. ఈ సింహాలు శక్తి, ధైర్యం, విశ్వాసం మరియు గర్వాన్ని సూచిస్తాయి. ఈ లయన్ క్యాపిటల్ నే భారత ప్రభుత్వం జాతీయ చిహ్నంగా స్వీకరించింది.
చంద్రగుప్త మౌర్యునికి అశోకుడు ఏమవుతాడు?
కొడుకు.
మనువడు.
అల్లుడు.
బావ.
అశోకుడు చంద్రగుప్త మౌర్యుని మనువడు. చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు, బిందుసారుడి కుమారుడే అశోకుడు. బిందుసారుడి తరువాత ఆయన కుమారుడైన అశోకుడు రాజ్యాన్ని స్వీకరించాడు.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు?
విక్రమాదిత్యుడు.
బిందుసారుడు.
చంద్రగుప్త మౌర్యుడు.
అశోకుడు.
మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన తన తల్లి ముర పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. అతడు చాణక్యుడు (కౌటిల్యుడు) అనే గురువు సహాయంతో నంద రాజవంశాన్ని ఓడించి, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సామ్రాజ్యం యొక్క రాజధాని పాటలీపుత్రం.
ఎర్రకోట ఏ నగరంలో కలదు?
ముంబై.
కోల్‌కతా.
ఆగ్రా.
ఢిల్లీ.
ఎర్రకోట (Red Fort) భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉంది. ఇది మొఘల్ శిల్ప కళకు చెందిన గొప్ప చారిత్రక నిర్మాణం. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు. ఆయన తన రాజధానిని ఆగ్రా నుండి ఢిల్లీకి మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత, ఎర్రకోట నిర్మాణాన్ని ప్రారంభించారు.
అశోకుని స్థంభం నిర్మాణంలో ఉపయోగించిన ఇసుకరాయిని ఎక్కడనుండి తీసుకున్నారు?
కోయంబత్తూర్.
గోవా.
చంబల్.
చూనార్.
సారనాథ్ లోని అశోకుని స్థంభం నిలువుగా ఉన్న ఒక రాతి స్థంభం. దీనిని వారణాసి సమీపంలోని చూనార్ నుండి తవ్వి తీసిన ఇసుక రాయితో నిర్మించారు.
కుతుబ్ మీనార్ ఎక్కడ కలదు?
హైదరాబాద్.
ఢిల్లీ.
ఆగ్రా.
ముంబై.
కుతుబ్ మీనార్ భారతదేశ రాజధాని ఢిల్లీలో కలదు. ఇది ఢిల్లీలోని మెహ్రౌలీ అనే ప్రాంతంలో ఉన్న కుతుబ్ కాంప్లెక్స్‌లో భాగం.
