భారత రాజ్యాంగం – Part 1


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారు?
అధికరణం 352.
అధికరణం 356.
అధికరణం 360.
అధికరణం 368.
భారత రాజ్యాంగంలోని అధికరణం 356 ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వము రాజ్యాంగ నిబంధనలను అనుసరించడంలో విఫలమైతే, రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం అసాధ్యమని రాష్ట్రపతి భావించినప్పుడు, రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అధికరణం 352: దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించడానికి, అధికరణం 360: ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడానికి, అధికరణం 368: రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించినది.
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఉన్నాయి?
భాగం III.
భాగం IV.
భాగం V.
భాగం VI.
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని భాగం IVలో ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు పొందుపరచబడ్డాయి. ఇవి ప్రభుత్వానికి సామాజిక మరియు ఆర్థిక న్యాయం సాధించడంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. అయితే, ఇవి న్యాయపరంగా అమలు చేయదగినవి కాకపోయినా, పాలన తీరును ప్రభావితం చేసే కీలక అంశాలు. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు.
రాజ్యాంగంలోని ఏ అధికరణం ద్వారా రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు సంక్రమిస్తాయి?
అధికరణం 72.
అధికరణం 74.
అధికరణం 76.
అధికరణం 161.
భారత రాజ్యాంగంలోని అధికరణం 72 ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు సంక్రమిస్తాయి. రాష్ట్రపతికి ఉన్న ఈ శక్తిని ‘Mercy Power’ అంటారు. రాష్ట్రపతికి 5రకాల క్షమాభిక్ష అధికారాలు కలవు. అవి, 1) పార్డన్, 2) కమ్యుటేషన్, 3) రెమిషన్, 4) రెస్పైట్, 5) రిప్రైవ్.
అస్పృశ్యతను ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధం అని తెలిపే రాజ్యాంగ అధికరణ (Article) ఏది?
Article 14.
Article 15.
Article 17.
Article 21.
భారత రాజ్యాంగంలోని Article 17 ప్రకారం, అస్పృశ్యతను ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధించబడింది. ఇది అస్పృశ్యతను చట్టబద్ధంగా రద్దు చేస్తుంది మరియు దీనిని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. ఇది సామాజిక సమానత్వానికి ప్రాధాన్యమిస్తూ, కుల వివక్షకు వ్యతిరేకంగా కీలకంగా నిలుస్తుంది.
ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి?
అశోక్ మెహతా కమిటీ.
జలగం వెంగళరావు కమిటీ.
స్వరణ్ సింగ్ కమిటీ.
బల్వంతరాయ్ మెహతా కమిటీ.
1976లో ఏర్పాటైన స్వరన్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. వీటిని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భాగం IV-A నందు 51(A) అధికరణం కింద పేర్కొన్నారు. మొత్తం 10 ప్రాథమిక విధులు చేర్చబడి, పౌరులపై సామాజిక బాధ్యతలు విధించబడ్డాయి. 2002లో 86వ సవరణ ద్వారా 11వ విధి (6-14 ఏళ్ల పిల్లలకు విద్య కల్పించాల్సిన బాధ్యత) చేర్చబడింది.
క్రిందివారిలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానివారు ఎవరు?
గోపాలస్వామి అయ్యంగార్.
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్.
T.T. కృష్ణమాచారి.
P.V. ఆనందాచార్యులు.
భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ (Drafting Committee) ను 1947 ఆగస్టు 29న ఏర్పాటు చేశారు. దీనికి డా. B.R. అంబేద్కర్ అధ్యక్షులు. సభ్యుల్లో గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మహ్మద్ సాదుల్లా, కె.యం. మున్షి, బి.యల్. మిట్టల్ (ఎన్. మాధవరావు), డి.పి. ఖైతాన్ (టి.టి. కృష్ణమాచారి) ఉన్నారు.
భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు పొందుపరచబడ్డాయి?
భాగం III.
భాగం IV.
భాగం II.
భాగం V.
ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలోని భాగం IIIలో ఆర్టికల్స్ 12 నుండి 35 వరకూ పొందుపరచబడ్డాయి. ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. వీటిని న్యాయస్థానాల ద్వారా పరిరక్షించుకోవచ్చు. ఈ హక్కులు భారత పౌరులకు మౌలిక స్వేచ్ఛలు, సమానత్వం, వ్యక్తిగత స్వాతంత్ర్యం లాంటి హక్కులను అందిస్తాయి.
క్రింది వీటో అధికారాలలో ఏది భారత రాష్ట్రపతికి లేదు?
Absolute వీటో.
Suspensive వీటో.
Pocket వీటో.
Qualified వీటో.
భారత రాష్ట్రపతికి మూడు రకాల వీటో అధికారాలు మాత్రమె ఉన్నాయి: Absolute, Suspensive, మరియు Pocket Veto. అయితే Qualified Veto అనే అధికారం భారత రాజ్యాంగంలో లేదు. ఇది అమెరికా వంటి కొన్ని విదేశీ రాజ్యాంగాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి భారత రాష్ట్రపతికి ఇది వర్తించదు.
పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
భారత రాష్ట్రపతి.
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్.
రాజ్యసభ ఛైర్మన్.
లోక్‌సభ స్పీకర్.
భారత రాజ్యాంగంలోని అధికరణం 108 ప్రకారం పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహించబడుతుంది. రాష్ట్రపతి సంయుక్త సమావేశాన్ని ఆహ్వానిస్తాడు కానీ లోక్‌సభ స్పీకర్ ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఇప్పటివరకు 3 సార్లు ఉభయసభల సంయుక్త సమావేశాలు జరిగాయి. 1) వరకట్న నిషేధ బిల్లు -1961, 2) బ్యాంకింగ్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు మరియు రద్దు బిల్లు- 1978, 3) POTO బిల్లు – 2002.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రిందివాటిలో సరికాని వ్యక్తి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి గవర్నర్ C.M. త్రివేది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి అసెంబ్లీ స్పీకర్ B.V. సుబ్బా రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి అసెంబ్లీ స్పీకర్ అయ్యదేవర కాలేశ్వరరావు (1956–1962). B.V. సుబ్బా రెడ్డి 1962లో స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1953లో C.M. త్రివేది ఆంధ్ర రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కొనసాగారు. 1956లో నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా, దామోదరం సంజీవయ్య 1960లో తొలి దళిత ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు?
రఘురామ కృష్ణంరాజు.
చింతకాయల అయ్యన్న పాత్రుడు.
తమ్మినేని సీతారాం.
కొనక రఘుపతి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ యొక్క ప్రస్తుత స్పీకర్‌గా చింతకాయల అయ్యన్న పాత్రుడు 22 జూన్ 2024 న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన TDP పార్టీకీ చెందినవారు, నర్సీపట్నం నియోజకవర్గం నుంచి M.L.Aగా గెలిచారు. ఉండి నియోజకవర్గం నుంచి M.L.Aగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ గా 2024 నవంబర్ 14న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
భారత రాజ్యాంగం ప్రకారం, ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత?
3 నెలల 6 వారాలు.
5 నెలల 6 వారాలు.
6 నెలలు 6 వారాలు.
1 సంవత్సరం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం, పార్లమెంట్ సమావేశాల్లో లేని సమయంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఇది పార్లమెంట్ తిరిగి సమావేశమైన 6 వారాల లోపు ఆమోదం పొందాలి లేకపోతే అది చెల్లుబాటు కాదు. కాబట్టి గరిష్టంగా ఒక ఆర్డినెన్స్ నిలిచే సమయం 6 నెలలు + 6 వారాలు మాత్రమే.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాల సంఖ్య వరుసగా ఎంత?
294 మరియు 42.
200 మరియు 30.
119 మరియు 17.
175 మరియు 25.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 294 అసెంబ్లీ మరియు 42 లోక్‌సభ స్థానాలు ఉండేవి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణకు 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలున్నాయి.
ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు?
42వ రాజ్యాంగ సవరణ.
44వ రాజ్యాంగ సవరణ.
52వ రాజ్యాంగ సవరణ.
36వ రాజ్యాంగ సవరణ.
మొరార్జీ దేశాయ్ నాయకత్వం లోని జనతా ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, ఆర్టికల్ 19(1)(f) మరియు ఆర్టికల్ 31లను రద్దు చేసి, 12వ భాగంనందు దీన్ని ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కుగా, ఆర్టికల్ 300-A క్రింద చేర్చారు. ఇది 1979 జూన్ 20 నుండి అమలులోకి వచ్చింది.
ఓటుహక్కు కనీస వయోపరిమితిని 21 సం.ల నుండి 18 సం.లకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది?
61వ రాజ్యాంగ సవరణ.
42వ రాజ్యాంగ సవరణ.
86వ రాజ్యాంగ సవరణ.
44వ రాజ్యాంగ సవరణ.
1988లో చేసిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటుహక్కు పొందేందుకు అవసరమైన కనీస వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించారు. ఇది 1989 జనవరి 28 నుండి అమలులోకి వచ్చింది. ఇది యువతకు రాజకీయ వ్యవస్థలో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించే ముఖ్యమైన పరిణామంగా చరిత్రలో నిలిచింది. ఇది ఆర్టికల్ 326ను సవరించి అమలులోకి తెచ్చారు.
విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన రాజ్యాంగ సవరణ ఏది?
42వ రాజ్యాంగ సవరణ.
86వ రాజ్యాంగ సవరణ.
44వ రాజ్యాంగ సవరణ.
52వ రాజ్యాంగ సవరణ.
1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి చేర్చారు. ఇది కేంద్ర మరియు రాష్ట్రాలకు విద్యా రంగంలో ఉమ్మడిగా చట్టాలు చేయడానికి అవకాశం కల్పించింది. ఇది అత్యవసర పరిస్థితుల సమయంలో తీసుకొచ్చిన మార్పులలో ఒకటి. ఇది స్వరన్ సింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జరిగింది.
ప్రాథమిక హక్కులలో దేనిని భారత రాజ్యాంగానికి "ఆత్మ మరియు హృదయం"గా పేర్కొన్నారు?
స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు.
మతస్వాతంత్ర్యపు హక్కు.
రాజ్యాంగ పరిహారపు హక్కు.
విద్యా-సాంస్కృతిక హక్కు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా లభించే రాజ్యాంగ పరిహారపు హక్కును డా. బి.ఆర్. అంబేద్కర్ "భారత రాజ్యాంగానికి ఆత్మ మరియు హృదయం"గా అభివర్ణించారు. ఈ హక్కు ద్వారా, వ్యక్తులు తమ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినపుడు నేరుగా సుప్రీం కోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఇది ప్రజల హక్కులను రక్షించే అత్యంత ముఖ్యమైన వ్యవస్థను ప్రతిబింబిస్తుంది.
చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 19.
ఆర్టికల్ 15.
ఆర్టికల్ 21.
ఆర్టికల్ 14.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం, భారత భూభాగంలో ఉన్న ప్రతి వ్యక్తికి చట్టం ముందు సమానత్వం కల్పించబడుతుంది. దీని ప్రకారంగా కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షతలతో సంబంధం లేకుండా ప్రజలందరూ చట్టం దృష్టిలో సమానులే. ఆర్టికల్ 14 ద్వారా భారత రాజ్యాంగం Rule of Law అనే భావనను బలపరుస్తుంది, అంటే చట్టానికి ఎవరూ అతీతులు కారు.
భారత రాజ్యాంగం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?
1950 జనవరి 26.
1949 నవంబర్ 26.
1950 జనవరి 1.
1950 జనవరి 24.
భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడినా, ఇది అధికారికంగా 1950 జనవరి 26నుండి అమలులోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ రోజును “గణతంత్ర దినోత్సవం”గా జరుపుకుంటారు. 1929లో జరిగిన లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో 1930 జనవరి 26 నుండి ఆ రోజును సంపూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. కాబట్టి 1950 జనవరి 26 నుండి రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చారు.
భారత పార్లమెంటు క్రిందివాటిలో వేటిని కలిగి ఉంటుంది?
లోక్‌సభ మరియు రాజ్యసభ.
లోక్‌సభ, రాజ్యసభ మరియు సుప్రీంకోర్టు.
లోక్‌సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి.
లోక్‌సభ, రాజ్యసభ మరియు ప్రధానమంత్రి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం పార్లమెంటు మూడు భాగాల సమ్మేళనంగా ఉంటుంది. అవి 1) లోక్‌సభ, 2) రాజ్యసభ, 3) రాష్ట్రపతి. సుప్రీంకోర్టు మరియు ప్రధానమంత్రి పార్లమెంటులో భాగం కాదు. సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థకు చెందినది, మరియు ప్రధానమంత్రి కార్యనిర్వాహక శాఖకు చెందినది.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top