భారత రాజ్యాంగం – Part 2


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలకు సంబంధించి క్రిందివాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
భారత పౌరుడై ఉండాలి.
ఏదైనా హైకోర్టులో 5 సం.లు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.
సుప్రీంకోర్టులో 5 సం.లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
ఏదైనా హైకోర్టులో 10 సం.లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యేందుకు వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. అలాగే హైకోర్టులో 5 సం.లు న్యాయమూర్తిగా లేదా 10 సం.లు న్యాయవాదిగా పనిచేసి ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయ శాస్త్ర కోవిదుడై ఉండాలి. అంతేకానీ సుప్రీంకోర్టులో 5 సంవత్సరాలు న్యాయవాదిగా పని చేసి ఉండాల్సిన అవసరం లేదు.
క్రిందివారిలో ఉపరాష్ట్రపతి కాకుండానే ఏకంగా రాష్ట్రపతి అయిన వ్యక్తి ఎవరు?
శంకర్ దయాల్ శర్మ.
కె.ఆర్. నారాయణన్.
వి.వి. గిరి.
నీలం సంజీవరెడ్డి.
నీలం సంజీవరెడ్డి ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే నేరుగా భారతదేశ ఆరో రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఆయన 1977లో రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతిగా ఎన్నికవడానికి ముందు ఆయన లోక్ సభ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఆయన సమగ్ర రాజకీయ అనుభవం కలిగి ఉండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా ఎవరు వ్యవహరిస్తారు?
అడ్వకేట్ జనరల్.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా.
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అఫ్ ఇండియా.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగంలోని 76వ ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. ఆయన ప్రభుత్వానికి సంబంధించిన న్యాయపరమైన అంశాలపై సలహాలు ఇస్తారు మరియు అవసరమైనప్పుడు కోర్టులో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు.
గవర్నర్ పదవికి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది?
రాజ్యాంగం ప్రకారం గవర్నర్ పదవీకాలం 5 సంవత్సరాలు.
మహాభియోగ తీర్మానం ఆమోదం పొందినతర్వాత మాత్రమె రాష్ట్రపతి గవర్నర్‌ను పదవి నుండి తొలగిస్తారు.
రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు.
పదవీకాలం పూర్తికాకముందే రాష్ట్రపతి గవర్నర్‌ను పదవి నుండి తొలగించవచ్చు.
గవర్నర్ పదవీకాలం రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు ఉంటుంది, కానీ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం గవర్నర్ పదవిలో కొనసాగవచ్చు. రాష్ట్రపతి గవర్నర్‌ను పదవీకాలం పూర్తికాకముందే తొలగించవచ్చు. మహాభియోగ తీర్మానం గవర్నర్ పదవికి సంబంధించి వర్తించదు, ఇది రాష్ట్రపతి లేదా న్యాయమూర్తులకు మాత్రమే వర్తిస్తుంది.
ఉమ్మడి జాబితా అనే అంశాన్ని భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించింది?
అమెరికా.
ఆస్ట్రేలియా.
బ్రిటన్.
కెనడా.
ఉమ్మడి జాబితా (Concurrent List) భావనను భారత రాజ్యాంగం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకుంది. ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్రం మరియు రాష్ట్రాలు రెండూ చట్టాలు చేసేందుకు అధికారం కలిగి ఉంటాయి. అయితే ఏదైనా ఒక అంశంపైన రెండు కూడా చట్టాలు చేసినట్లైతే అంతిమంగా కేంద్రం చేసిన చట్టమే నిలుస్తుంది.
జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం ఎప్పుడు రద్దు చేసింది?
26 జనవరి 1950.
15 ఆగస్టు 2014.
1 జూలై 2020.
5 ఆగస్టు 2019.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించబడింది. అయితే, 5 ఆగస్టు 2019 న భారత ప్రభుత్వం ఈ ఆర్టికల్‌ను రద్దు చేసింది. అదే రోజు ఆర్టికల్ 35A కూడా రద్దు చేయబడింది. ఫలితంగా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. వీటిలో జమ్మూ- కాశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢక్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు.
క్రిందివారిలో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ నుంచి ముఖ్యమంత్రి అయిన వారు ఎవరు?
భవనం వెంకటరామిరెడ్డి మరియు నీలం సంజీవరెడ్డి.
దామోదరం సంజీవయ్య మరియు కొనిజేటి రోశయ్య.
నీలం సంజీవరెడ్డి మరియు దామోదరం సంజీవయ్య.
భవనం వెంకటరామిరెడ్డి మరియు కొనిజేటి రోశయ్య.
భవనం వెంకట్రామిరెడ్డి గారు 1982లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విధాన పరిషత్‌ (శాసన మండలి) సభ్యులే. కొణిజేటి రోశయ్య గారు కూడా 2009లో ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో శాసన మండలి సభ్యులే. నీలం సంజీవరెడ్డి మరియు దామోదరం సంజీవయ్య మాత్రం విధాన సభ సభ్యులుగానే ముఖ్యమంత్రులయ్యారు.
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని స్థానాలు ఉన్నాయి?
11
7
9
13
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు రాజ్యసభలో 11 స్థానాలు కేటాయించబడ్డాయి. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో ఈ స్థానాల సంఖ్య 18 గా ఉండేది, అయితే 2014లో తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణకు 7 స్థానాలు కేటాయించబడ్డాయి. ఈ కేటాయింపు భారత రాజ్యాంగంలోని నాల్గవ షెడ్యూల్ ప్రకారం, జనాభా ఆధారంగా జరుగుతుంది.
92వ రాజ్యాంగ సవరణ (2003) ద్వారా భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో అధికారికంగా చేర్చిన భాషలు ఏవి?
బోడో, డోగ్రి, మైథిలీ, సంతాళీ.
సింధీ, మణిపురి, కొంకణి, నేపాళీ.
భోజ్‌పురి, రాజస్థానీ, గోండీ, తులూ.
సంస్కృతం, ఉర్దూ, పంజాబీ, గుజరాతీ.
2003లో జరిగిన 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బోడో, డోగ్రి, మైథిలీ, సంతాళీ భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చారు. దీంతో 8వ షెడ్యూల్‌లో భాషల సంఖ్య 18 నుండి 22కి పెరిగింది. ఈ భాషలు భారత ప్రభుత్వ మద్దతుతో అభివృద్ధికి అర్హత పొందాయి.
లోకసభలో ఎస్సీ (SC) మరియు ఎస్టీ (ST) వర్గాల వారికి వరుసగా ఎంత సంఖ్యలో స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి?
47 మరియు 84.
84 మరియు 47.
85 మరియు 46.
83 మరియు 45.
భారత రాజ్యాంగం ప్రకారం, లోకసభలో ఎస్సీ వర్గానికి 84 స్థానాలు మరియు ఎస్టీ వర్గానికి 47 స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం అమలులో ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం అమలు చేయబడ్డాయి, తద్వారా ఈ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అందించబడుతుంది.
క్రింది వాటిలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి.
వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచడం సాధ్యమవుతుంది.
వీటిని అమలు పరచడం కోసం న్యాయస్థానాలు రిట్‌లను జారీ చేస్తాయి.
ఇవి పౌరులకు న్యాయపరమైన హక్కులను కల్పిస్తాయి.
వాటిని న్యాయస్థానాల ద్వారా అమలుపరచలేము.
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని IV భాగంలో ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలుగా ఉంటాయి కానీ న్యాయపరమైన హక్కులుగా పౌరులకు అమలు చేయబడవు. న్యాయస్థానాలు వీటిని అమలు చేయలేవు, కానీ ప్రభుత్వ విధానాల రూపకల్పనలో వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.
క్రిందివాటిలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికకు చేర్చబడిన పదాలు ఏవి?
సామ్యవాద, లౌకిక.
సామ్యవాద, గణతంత్ర.
లౌకిక, గణతంత్ర.
సర్వసత్తాక, ప్రజాస్వామిక.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో “సామ్యవాద” (Socialist), “లౌకిక” (Secular) అనే పదాలు చేర్చబడ్డాయి. ఈ సవరణ ద్వారా భారతదేశ లక్ష్యాలను మరింత స్పష్టంగా ప్రకటించారు. “సర్వసత్తాక” మరియు “ప్రజాస్వామిక” పదాలు 42వ రాజ్యాంగ సవరణకు ముందే ప్రవేశికలో ఉన్నాయి.
భాషాప్రాతిపదికన భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం ఏది, మరియు అది ఎప్పుడు ఏర్పడింది?
ఆంధ్రప్రదేశ్ – 1 నవంబర్ 1956.
ఆంధ్ర రాష్ట్రం – అక్టోబర్ 1953.
మద్రాసు రాష్ట్రం – 15 ఆగస్టు 1947.
కర్నాటక – 26 జనవరి 1950.
భాషాప్రాతిపదికన భారతదేశంలో ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇది పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష మరియు ప్రాణత్యాగం అనంతరం తెలుగు మాట్లాడే ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుంచి విడగొట్టి 1953 అక్టోబర్ 1న ఏర్పాటు చేయబడింది. 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో “ఆంధ్రప్రదేశ్” ఏర్పడింది.
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి సుప్రీం కోర్టు సలహాను కోరవచ్చు?
ఆర్టికల్ 143.
ఆర్టికల్ 124.
ఆర్టికల్ 76.
ఆర్టికల్ 32.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 ప్రకారం, రాష్ట్రపతి సుప్రీం కోర్టును దేశానికి సంబంధించిన ముఖ్యమైన చట్టపరమైన లేదా రాజ్యాంగపరమైన అంశాలపై సలహా ఇవ్వమని కోరవచ్చు. దీనిని "Advisory Jurisdiction" అని పిలుస్తారు. అయితే, సుప్రీం కోర్టు ఇచ్చే సలహాలను రాష్ట్రపతి పాటించడం తప్పనిసరి కాదు.
భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం వంటిదని వ్యాఖ్యానించినవారు ఎవరు?
B.R. అంబేద్కర్.
గ్రాన్విల్లే ఆస్టిన్.
ఐవర్ జెన్నింగ్స్.
జవహర్‌లాల్ నెహ్రూ.
బ్రిటీష్ న్యాయవేత్త మరియు విద్యావేత్త అయిన ఐవర్ జెన్నింగ్స్, భారత రాజ్యాంగంలో అధిక చట్టపరమైన పరిష్కారాలు, పునర్విమర్శలకు అవకాశం ఉండటం వల్ల మరియు దాని న్యాయపరమైన సంక్లిష్టతను చూసి, దానిని “న్యాయవాదుల స్వర్గం” గా అభివర్ణించారు. ఇది రాజ్యాంగం యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని, న్యాయ పరిధిని సూచిస్తుంది.
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని పదవినుండి తొలగించడానికి ఉపయోగించే ప్రక్రియ ఏమిటి?
రాజ్యాంగ సవరణ.
పార్లమెంటరీ తీర్మానం.
మహాభియోగ తీర్మానం.
సుప్రీం కోర్టు తీర్పు.
భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతిని పదవినుండి తొలగించడానికి 'మహాభియోగ తీర్మానం' (Impeachment) అనే ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇది రాజ్యాంగంలోని 61వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు నిర్ధారించాలి, మరియు పార్లమెంట్‌ ఉభయ సభలలోను 2/3 వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదించబడాలి.
భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
రబ్రి దేవి.
జయలలిత.
సుచేతా కృపలానీ.
మాయావతి.
మాయావతి 1995లో భారతదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె బహుజన్ సమాజ్ పార్టీకి చెందినవారు. ఆమె దళితుల హక్కుల కోసం పోరాడుతూ, రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
క్రిందివారిలో భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లకు అధిపతులను ఎవరు నియమిస్తారు?
రాష్ట్రపతి.
ఉపరాష్ట్రపతి.
ప్రధానమంత్రి.
హోం శాఖా మంత్రి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 ప్రకారం, రాష్ట్రపతి భారతదేశ సాయుధ దళాల సర్వోన్నత కమాండర్‌గా వ్యవహరిస్తారు. భారత ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ లకు అధిపతులను రాష్ట్రపతి నియమిస్తారు. ఇది కేవలం ఆచరణాత్మకమే కాక, రాజ్యాంగబద్ధమైన అధికారము కూడా. అయితే, ఈ నియామకాలు ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రివర్గం సిఫారసుల ఆధారంగా జరుగుతాయి.
భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు, మరియు ఆమె ఏ రాష్ట్రానికి చెందినవారు?
మాయావతి – ఉత్తరప్రదేశ్.
రబ్రీదేవి – బీహార్.
సుచేతా కృపలానీ – ఉత్తరప్రదేశ్.
జయలలిత – తమిళనాడు.
సుచేతా కృపలానీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి. ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 1963 నుండి 1967 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆమె, రాజకీయరంగంలోకి వచ్చి మహిళలకు ప్రేరణగా నిలిచారు.
“పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం” భారత రాజ్యాంగంలోని ఎన్నవ షెడ్యూల్‌లో కలదు?
8వ షెడ్యుల్.
9వ షెడ్యుల్.
10వ షెడ్యుల్.
11వ షెడ్యుల్.
పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో 10వ షెడ్యుల్ చేర్చబడింది. ఇది ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయింపులు చేయకుండా నియంత్రించడానికి రూపొందించబడింది. దీనిద్వారా ఓ పార్టీలో గెలిచిన సభ్యుడు మరో పార్టీలో చేరితే అనర్హతావేటు (డిస్క్వాలిఫై) చేయొచ్చని నిబంధనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇది రాజకీయ స్థిరత్వం కోసం ఏర్పాటు చేయబడింది.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


1 thought on “భారత రాజ్యాంగం – Part 2”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top