📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్షేత్రనీటి పారుదల యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
చాళ్ళు మరియు కందకాలు తవ్వి నీరు సరఫరా చేయడం.
నేరుగా పంట మొక్కల వేళ్ళకు నీరు అందించడం.
ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలే నీటిని చల్లడం.
వర్షపాతం తగినంతగా లేనప్పుడు పొలానికి నీరు సరఫరా చేయడం.
క్షేత్రనీటి పారుదల అనేది ఒక ప్రాథమిక నీటిపారుదల పద్ధతి. వర్షపాతం తగినంతగా లేనప్పుడు, ఈ విధానం ద్వారా రైతులు పొలానికి నీరు సరఫరా చేస్తారు. దీనివల్ల పంటలు ఎదగడానికి కావాల్సిన నీరు అందుతుంది.
వ్యవసాయానికి నీటి సరఫరా చేయడానికి ఎన్ని రకాల నీటిపారుదల పద్దతులు కలవు?
మూడు.
నాలుగు.
ఐదు.
ఆరు.
వ్యవసాయానికి నీటిని అందించడానికి ప్రధానంగా నాలుగు రకాల నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి: అవి: 1. క్షేత్రనీటిపారుదల, 2. చాళ్ళు నీటిపారుదల, 3. స్ప్రింక్లర్ నీటిపారుదల, 4. బిందు సేద్యం.
కిందివాటిలో ఆధునిక వ్యవసాయ పనిముట్టు ఏది?
కొడవలి.
గడ్డపార.
వరికోత యంత్రం.
నాగలి.
వరికోత యంత్రం (Harvester) అనేది ఆధునిక యాంత్రిక వ్యవసాయ పనిముట్టు. ఇది పంట కోతను సులభతరం మరియు వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే కొడవలి, గడ్డపార మరియు నాగలి వంటివి శ్రమ ఎక్కువ అవసరమయ్యే సాంప్రదాయ వ్యవసాయ పనిముట్లు.
క్రిందివాటిలో వేటిని కలిపి నాడీ వ్యవస్థ అని అంటారు?
మెదడు, కండరాలు, నాడులు.
మెదడు, వెన్నెముక, నాడులు.
కపాలం, వెన్నెముక,కండరాలు.
గుండె, మెదడు, నాడులు.
నాడీ వ్యవస్థలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి 1) మెదడు, 2) వెన్నెముక, 3) నాడులు. ఇవి కలిసి శరీరంలోని అన్ని కార్యకలాపాలను నియంత్రించి,సమన్వయం చేస్తాయి.
ఎక్కువ నీటి పారుదల అవసరమయ్యే పంట ఏది?
చెరకు.
పప్పు దాన్యాలు.
వరి.
మొక్కజొన్న.
వరి పంట సాగుకి ఇతర పంటల కంటే ఎక్కువ నీటి పారుదల అవసరం ఉంటుంది. నిరంతర నీటి సరఫరా లేకుండా వరి పంట సరిగా పెరగదు. అందువలన రైతులు వరి పొలాలకు ఎక్కువసార్లు నీటిని పెడతారు. వాతావరణ పరిస్థితులు మరియు సాగు విధానం కూడా నీటి అవసరాన్ని ప్రభావితం చేస్తాయి.
జ్ఞానేంద్రియాలు వేటి ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి?
నాడులు.
కండరాలు.
రక్తనాళాలు.
కర్ణికలు.
జ్ఞానేంద్రియాలు అయిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఏదైనా సమాచారాన్ని (స్పర్శ, ధ్వని, వాసన) గ్రహించినప్పుడు, నాడులు ఆ సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. అప్పుడు మెదడు విశ్లేషించి, ఏమి చేయాలో ఆదేశిస్తుంది.
శరీరంలోని వివిధ భాగాల పనితీరును సమన్వయం చేయడంలో నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన పాత్ర ఏమిటి?
ఇది ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.
ఇది ఆక్సిజన్‌ను అందిస్తుంది.
ఇది రక్తాన్ని సరఫరా చేస్తుంది.
ఇది సమాచారాన్ని అనుసంధానించి, ప్రతిస్పందనలను నియంత్రిస్తుంది.
నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని భాగాల నుండి సమాచారాన్ని సేకరించి, వాటిని మెదడుకు పంపిస్తుంది. మెదడు వాటిని విశ్లేషించి సరైన ప్రతిస్పందనను పంపుతుంది. ఈ విధంగా నాడీ వ్యవస్థ ప్రతి అవయవం, ప్రతి చర్యను సమన్వయం చేస్తుంది.
బిందు సేద్యం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి?
వర్షపాతం లేనప్పుడు పొలానికి నీటిని సరఫరా చేస్తుంది.
కందకాలు తవ్వి వాటి ద్వారా నీటిని సరఫరా చేస్తారు.
మొక్కల వేళ్ళకు రంధ్రాల ద్వారా నీటిని నేరుగా సరఫరా చేస్తారు.
ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలే నీటిని చల్లుతారు.
బిందు సేద్యంలో నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. ఈ రంధ్రాల ద్వారా నీరు నేరుగా పంట మొక్కల వేళ్ళకు చేరుతుంది. దీనివలన నీరు వృథా కాకుండా పొదుపు అవుతుంది. కాబట్టి తక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
వరి సాగులో మొదటి దశ ఏమిటి?
పొలాన్ని చదును చేయడం.
పొలాన్ని దుక్కిదున్నడం.
నాట్లు వేయడం.
నీరు పెట్టడం.
వరి సాగులో మొదటి దశ పొలాన్ని దుక్కిదున్నడం. ఈ దశలో రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. దుక్కిదున్నడం ద్వారా మట్టి మెత్తగా అవుతుంది మరియు కలుపు మొక్కలు తొలిగిపోతాయి. దీని కోసం ఎడ్లతో గాని, ట్రాక్టర్‌తో గాని పొలాన్ని దున్నుతారు.
నాడీ వ్యవస్థ దేనిని నియంత్రిస్తుంది?
జీర్ణక్రియను మాత్రమే నియంత్రిస్తుంది.
గుండెను మాత్రమే నియంత్రిస్తుంది.
శ్వాసక్రియను మాత్రమే నియంత్రిస్తుంది.
శరీరాన్ని నియంత్రిస్తుంది.
నాడీ వ్యవస్థ మొత్తం శరీరపు కార్యకలాపాలను నియంత్రిస్తుంది. ఆలోచనలు, కదలికలు, అంతర్గత అవయవాల పని, స్పందనలు, మరియు వివిధ వ్యవస్థల సమన్వయాన్ని నిర్వహించడం నాడీ వ్యవస్థ యొక్క ప్రధాన బాధ్యత. దీని వల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది.
వరి గింజలను మరియు ఊకను వేరుచేసే ప్రక్రియను ఏమంటారు?
ఎగరబోయడం.
నూర్చడం.
మరపట్టించడం.
సస్యరక్షణ.
వరి గింజలను ఊక నుండి వేరుచేసే సంప్రదాయ ప్రక్రియను ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం అని అంటారు. ఈ దశలో గింజలు మరియు ఊక వేరు వేరు అవుతాయి. గాలి సహాయంతో ఊక ఎగిరిపోతుంది, గింజలు కింద పడతాయి.
ఆధునిక వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి?
తక్కువ పెట్టుబడి.
ఎక్కువ శ్రమ.
యంత్రాల వినియోగం.
పర్యావరణ అనుకూలత.
ఆధునిక వ్యవసాయంలో ప్రధాన లక్షణం యంత్రాల వినియోగం. వ్యవసాయంలో వరినాట్ల యంత్రం, వరికోత యంత్రం వంటి ఆధునిక యంత్రాలను ఉపయోగించడం వలన వ్యవసాయ పనులు వేగంగా పూర్తై, మానవ శ్రమ గణనీయంగా తగ్గుతుంది.
వరి సాగులో మొదటి నాలుగు దశల సరైన వరుస క్రమం ఏది?
పొలాన్ని దుక్కిదున్నడం, చదును చేయడం, నాట్లు వేయడం, ఎరువులు వేయడం.
పొలాన్ని దుక్కిదున్నడం, చదును చేయడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం.
పొలాన్ని చదును చేయడం, దుక్కిదున్నడం, నాట్లు వేయడం, నీరు పెట్టడం.
పొలాన్ని చదును చేయడం, దుక్కిదున్నడం, నాట్లు వేయడం, ఎరువులు వేయడం.
వరి సాగులో మొదటి నాలుగు దశలు వరుసగా: 1. పొలాన్ని దుక్కిదున్నడం (పొలాన్ని సిద్ధం చేయడం), 2. చదును చేయడం (పొలాన్ని నీటితో నింపి, నాట్లు వేయడానికి సిద్ధం చేయడం), 3. నాట్లు వేయడం (నారును పొలంలో నాటడం), 4. నీరు పెట్టడం (వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం కాబట్టి నీరు పెట్టడం).
వరి సాగులో చివరి దశ ఏది?
మరపట్టించడం.
ఎగరబోయడం.
నూర్చడం.
నిల్వ చేయడం.
వరి సాగులో చివరి దశ మరపట్టించడం. పంటను కోసి, ఎండబెట్టి, నూర్చి, తూర్పారబట్టి, నిల్వచేసిన తర్వాత ధాన్యాన్ని మరపట్టించడం ద్వారా బియ్యంగా మారుస్తారు. ఇది పంటను పూర్తిగా సిద్ధం చేసే చివరి దశగా పరిగణించబడుతుంది.
సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి?
పురుగుమందుల వాడకం.
రసాయన ఎరువుల వాడకం.
పురుగుమందుల వాడకం మరియు రసాయన ఎరువుల వాడకం.
సహజ మరియు సాంప్రదాయ పద్ధతులు.
సేంద్రియ వ్యవసాయం యొక్క ప్రధాన లక్షణం సహజ మరియు సాంప్రదాయ పద్ధతుల వినియోగం. ఈ పద్ధతిలో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా, పశువుల వ్యర్థాలు, వర్మికంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించి నేల సారాన్ని కాపాడుతూ పర్యావరణానికి అనుకూలంగా పంటలు పండిస్తారు.
వరి సాగులో చివరి నాలుగు దశల వరుస క్రమం ఏది?
నూర్చడం, ఎగరబోయడం, నిల్వచేయడం, మరపట్టించడం.
ఎగరబోయడం, నూర్చడం, నిల్వచేయడం, మరపట్టించడం.
నూర్చడం, ఎగరబోయడం, మరపట్టించడం, నిల్వచేయడం.
ఎగరబోయడం, నూర్చడం, మరపట్టించడం, నిల్వచేయడం.
వరి సాగులో చివరి నాలుగు దశలు పంట కోసిన తర్వాత జరుగుతాయి. ఈ దశలు వరుసగా: 1) నూర్చడం: పంటను కోసిన తరువాత గింజలను వేరు చేయడం. 2) ఎగరబోయడం/తూర్పారబట్టడం: గింజల నుంచి ఊకను వేరు చేయడం. 3) నిల్వ చేయడం: గింజలను గోనె సంచులలో నింపి గోదాములలో నిల్వ చేయడం. 4) మరపట్టించడం: నిల్వ చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడం.
కప్ప లార్వాలను ఏమని పిలుస్తారు?
కాళ్ళు కల్గిన టాడ్‌పోల్స్.
టాడ్‌పోల్స్.
చిరుకప్ప.
ప్యూప.
కప్ప జీవిత చక్రంలో గుడ్ల తరువాత వచ్చే లార్వాల దశను టాడ్‌పోల్స్ (తోకకప్పలు) అని అంటారు. తోకకప్పలు చేపపిల్లలను పోలి ఉంటాయి. ఇవి పెరిగి కాళ్ళు కలిగిన టాడ్‌పోల్స్గా మారి, ఆపై చిరుకప్పగా, చివరకు కప్పగా మారుతాయి.
వరి సాగు చేయడంలోని ఐదవ దశ దేనికి సంబంధించింది?
సస్యరక్షణ.
నీరు పెట్టడం.
పంట కోత.
ఎరువులు వేయడం.
వరి సాగులో ఐదవ దశలో పంట పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందించడానికి ఎరువులు వేయడం జరుగుతుంది. ఇది మొక్కల ఆరోగ్యం, పంటలో వృద్ధి, మరియు ఎరువుల సక్రమ వినియోగం ద్వారా అధిక దిగుబడి పొందడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
మానవ శరీరంలోని వివిధ అవయవ వ్యవస్థలకు సంబంధించి క్రిందివాటిలో సరి కానిది ఏది?
విసర్జక వ్యవస్థ – రక్తంలోని మలినాలను మూత్రం రూపంలో తొలగించడం.
శ్వాస వ్యవస్థ – ఆక్సిజన్‌ను అందించడం ద్వారా శక్తిని విడుదల చేయడం.
ఉరఃపంజర వ్యవస్థ – మెదడును రక్షించే ప్రధాన వ్యవస్థ.
రక్త ప్రసరణ వ్యవస్థ – ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేయడం.
ఉరఃపంజర వ్యవస్థ (పక్కటెముకల వ్యవస్థ) గుండె మరియు ఊపిరితిత్తులను రక్షించడానికి పనిచేస్తుంది. కానీ మెదడును రక్షించే పని కపాలం (పుర్రె) చేస్తుంది. కాబట్టి ఉరఃపంజరానికి మెదడుతో ఎలాంటి సంబంధం లేదు.
క్రిందివాటిలో దేనిని నీరు ఆధారిత పంట అని అంటారు?
వరి.
జొన్న.
మొక్కజొన్న.
గోధుమ.
ఇతర పంటల సాగుతో పోలిస్తే వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం అవుతుంది. అందుకే వరి పంటను నీరు ఆధారిత పంటగా పిలుస్తారు. వరి సాగు సాధారణంగా నీటితో నిండిన పొలాల్లో జరుగుతుంది. నిరంతర నీటి సరఫరా లేకుండా వరి పంట పెరగదు.
