భారత జాతీయోద్యమం – Part 7


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
క్రిందివారిలో 'అమృత్ బజార్ పత్రిక'ను ప్రారంభించినవారు ఎవరు?
బిపిన్ చంద్ర పాల్.
రవీంద్రనాథ్ టాగూర్.
అరబింద ఘోష్.
శిశిర్ కుమార్ ఘోష్.
శిశిర్ కుమార్ ఘోష్ మరియు అతని సోదరుడు మోతీలాల్ ఘోష్ కలిసి 1868లో బెంగాల్‌లో ‘అమృత్ బజార్ పత్రిక’ను ప్రారంభించారు. ఇది మొదటగా బెంగాలీ భాషలో ప్రారంభమైంది, తరువాత ఇంగ్లీష్ భాషలోకి మారింది. ఇది బ్రిటిష్ పాలనను విమర్శిస్తూ జాతీయ చైతన్యాన్ని పెంపొందించింది. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ (1878)కు నిరసనగా, ప్రజలకి సమాచారం అందించడంలో కీలక పాత్ర పోషించింది.
1946లో భారతదేశాన్ని సందర్శించిన కేబినెట్ మిషన్‌కు నాయకత్వం వహించినవారు ఎవరు?
స్టాఫర్డ్ క్రిప్స్.
లార్డ్ వేవెల్.
ఎ.వి. అలెగ్జాండర్.
లార్డ్ పెథిక్-లారెన్స్.
1946లో బ్రిటిష్ ప్రభుత్వం పంపిన కేబినెట్ మిషన్‌కి నాయకత్వం వహించినవారు లార్డ్ పెథిక్-లారెన్స్. ఇతనితోపాటు స్టాఫర్డ్ క్రిప్స్ మరియు ఎ.వి. అలెగ్జాండర్ ఈ మిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. లార్డ్ వేవెల్ కేబినెట్ మిషన్‌లో లేరు, ఆయన అప్పటికి వైస్రాయ్‌గా ఉన్నారు.
క్రింది వారిలో కాంగ్రెసు సోషలిస్ట్ పార్టీ సభ్యుడు కానివారు ఎవరు?
ఆచార్య నరేంద్ర దేవ.
జయప్రకాష్ నారాయణ.
మోతీలాల్ నెహ్రూ.
అచ్యుత పట్వర్ధన్.
కాంగ్రెసు సోషలిస్ట్ పార్టీ (CSP) 1934లో స్థాపించబడింది. ఈ పార్టీని ఆచార్య నరేంద్ర దేవ, జయప్రకాష్ నారాయణ, అచ్యుత పట్వర్ధన్ వంటి నాయకులు స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ 1931లో మరణించారు కాబట్టి ఈ పార్టీ స్థాపనకు ముందే వారు లేరు. అతను లిబరల్ నేషనలిస్ట్ అభిప్రాయాల వ్యక్తి కాగా, CSP మాత్రం సోషలిస్ట్ భావజాలాన్ని ఆదరిస్తుంది.
తెభాగ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
బెంగాల్.
పంజాబ్.
ఆంధ్ర.
బీహార్.
తెభాగ ఉద్యమం 1946లో బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభమైంది. బెంగాల్ లో పెద్ద భూస్వాముల నుండి భూమిని సాగుకు తీసుకున్న చిన్న, పేద రైతులు తమ వాటాను మూడింట రెండు వంతులకు పెంచాలని కోరుతూ ఆందోళనలు చేసారు. దానికే తెభాగ ఉద్యమం అని పేరు. ఈ ఉద్యమం లక్ష్యం: భూమి యజమానులకు ఇవ్వాల్సిన వాటాను తగ్గించి, రైతులకు ఎక్కువ వాటా కల్పించడమే. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది.
భారతదేశంలో సంస్థానాలను విలీనం చేయడానికి బాధ్యత తీసుకున్న నాయకుడు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
డా. బి.ఆర్. అంబేద్కర్.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
రాజేంద్ర ప్రసాద్.
స్వాతంత్ర్యం అనంతరం భారతదేశాన్ని ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర వహించారు. ఆయన హోం మంత్రి హోదాలో 562 సంస్థానాల విలీనాన్ని శాంతియుతంగా పూర్తిచేశారు. ఆయన ప్రయత్నాల వల్లే భారతదేశ ప్రస్తుత భౌగోళిక ఆకృతి ఏర్పడింది. అందుకే ఆయనను "ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. హైదరాబాద్ (Operation Polo), జునాగఢ్ (Plebiscite), కాశ్మీర్ (Instrument of Accession) వంటి సంస్థానాల విలీనంలో ఆయన ధైర్యంగా వ్యవహరించారు.
చౌరీ చౌరా సంఘటన యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం.
సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల.
శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం.
శాసనోల్లంఘన ఉద్యమం నిలుపుదల.
1922లో ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా ప్రాంతంలో హింసాత్మక ఘటన చోటుచేసుకోవడంతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని వెంటనే నిలిపివేశారు. ఇది హింసా మార్గానికి వ్యతిరేకంగా గాంధీ గారి సంకల్పాన్ని ప్రతిబింబించింది. ఈ సంఘటన స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో అహింసా సిద్ధాంతానికి కీలక మలుపు, ఉద్యమ నిర్మాణంలో భావనాత్మక పరిణామంగా గుర్తించబడింది.
క్రిందివారిలో మొత్తం మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న వారెవరు?
జవహార్ లాల్ నెహ్రు.
మహాత్మా గాంధి.
డా. బి. ఆర్. ఆంబేద్కర్.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
డా. బి. ఆర్. ఆంబేద్కర్ లండన్ లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో (1930, 1931, 1932) పాల్గొన్న ఏకైక ప్రముఖ నేత. ఆయన అణగారిన వర్గాల హక్కులపై బలమైన వాదనలు చేశారు. గాంధీ రెండవ సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ సమావేశాల్లో పాల్గొనలేదు.
"మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను" అనే నినాదం ఇచ్చినవారు ఎవరు?
లాలా లజపతిరాయ్.
బిపిన్ చంద్రపాల్.
సుభాష్ చంద్ర బోస్.
బాల గంగాధర్ తిలక్.
సుభాష్ చంద్ర బోస్ భారతీయ జాతీయ సైన్యం (INA) ను ప్రేరేపించేందుకు “మీరు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” (Give me blood, and I will give you freedom!) అనే శక్తివంతమైన నినాదాన్ని వినిపించారు. ఇది స్వాతంత్ర్యం కోసం త్యాగానికి ప్రేరణనిచ్చిన నినాదంగా గుర్తించబడుతుంది.
కలకత్తాలో ‘బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ (Asiatic Society of Bengal)’ను స్థాపించినవారు ఎవరు?
ఉల్లాస్ ముఖర్జీ.
రాజా రామ్ మోహన్ రాయ్.
విలియమ్ జోన్స్.
రవీంద్రనాథ్ ఠాగూర్.
1784లో కలకత్తాలో విలియమ్ జోన్స్ బెంగాల్ ఏసియాటిక్ సొసైటీని స్థాపించారు. ఇతడు బ్రిటీష్ న్యాయవాది మరియు భారత పురాతన సాహిత్యంపై ఆసక్తి కలిగిన పండితుడు. ఈ సంస్థ భారతీయ సంస్కృతి, భాషలు, సాహిత్యం, చరిత్ర అధ్యయనానికి, పరిశోధనలకు ముఖ్య కేంద్రంగా మారింది.
క్రింది వారిలో లాహోర్‌లో సాండర్స్ హత్యతో సంబంధం లేని వారు ఎవరు?
రాజ్ గురు.
భగత్ సింగ్.
చంద్రశేఖర్ అజాద్.
ఉద్దం సింగ్.
సాండర్స్‌ హత్య 1928లో లాహోర్‌లో జరిగింది. భగత్ సింగ్, రాజ్ గురు, చంద్రశేఖర్ అజాద్ కలిసి ఈ హత్య చేశారు. ఈ ముగ్గురు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA) సభ్యులు. ఉద్దం సింగ్ సాండర్స్ హత్యలో పాల్గోనలేదు. ఆయన 1940లో జలియన్‌వాలాబాగ్ పేలుళ్లకు ప్రతీకారంగా మైఖేల్ ఓ'డ్వైర్ అనే మాజీ లెఫ్టినెంట్ గవర్నర్‌ ను హత్య చేశాడు.
బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
వారెన్ హేస్టింగ్స్.
రాబర్ట్ క్లైవ్.
లార్డ్ కార్న్ వాలిస్.
లార్డ్ వెల్లెస్లీ.
1765లో అలహాబాద్ ఒప్పందం తర్వాత, రాబర్ట్ క్లైవ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధానంలో, బెంగాల్ పరిపాలన రెండు భాగాలుగా విభజించబడింది: దివానీ (ఆదాయ సేకరణ) మరియు నిజామత్ (న్యాయ మరియు పాలనా అధికారాలు). ఇందులో దివానీ అధికారాలను ఈస్ట్ ఇండియా కంపెనీ కలిగి ఉండగా, నిజామత్ అధికారాలు బెంగాల్ నవాబుకు ఉండేవి.
క్రిప్స్ రాయబారం (1942) లోని ప్రతిపాదనలలో సరైనది ఏది?
యుద్ధం తర్వాత భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వాలి.
నూతన రాజ్యాంగం ఏర్పాటు చేయుటకు ఎన్నికైన సభ్యులతో రాజ్యాంగ రచనా కమిటీ వేయాలి.
కేంద్రంలో సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి, రాష్ట్రాలు అందులో చేరుతాయో లేదో వాటి నిర్ణయానికే వదిలేయాలి.
పైవన్నీ సరైనవే.
1942లో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి రావడం ద్వారా చేసిన ప్రతిపాదనలలో ఈ మూడు ముఖ్యమైనవి ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు భారత జాతీయ నాయకత్వంను సంతృప్తిపరచలేకపోయాయి. ఇవి భారత స్వాతంత్ర్యానికి మార్గం వేయాలనే ఉద్దేశంతో రూపొందించబడ్డా, కాంగ్రెస్, ముస్లిం లీగ్ రెండూ తిరస్కరించాయి.
“దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కు” అని క్రిప్స్ ప్రతిపాదనలను విమర్శించింది ఎవరు?
జవహార్ లాల్ నెహ్రు.
మహాత్మా గాంధీ.
సర్దార్ వల్లభభాయ్ పటేల్.
మౌలానా అబుల్ కలాం ఆజాద్.
మహాత్మా గాంధీ క్రిప్స్ మిషన్ ప్రతిపాదనలను “దివాలా తీసిన బ్యాంకుపై రాబోయే తేదీ వేసిన చెక్కు” గా పేర్కొన్నారు. ఆయన దీనిని నమ్మలేని, అస్పష్టమైన హామీలుగా భావించారు. క్రిప్స్ రాయబారాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు, తద్వారా కాంగ్రెస్ దానిని తిరస్కరించింది.
హోంరూల్ లీగ్ ను స్థాపించినవారు ఎవరు?
జవహార్ లాల్ నెహ్రు.
సురేంద్రనాథ్ బెనర్జీ.
లాల్ బహుదూర్ శాస్త్రి.
బాల గంగాధర్ తిలక్ మరియు అనీబిసెంట్.
1916లో స్వశాసనాధికారాన్ని కోరుతూ బాల గంగాధర్ తిలక్ మరియు అనీ బిసెంట్ Home Rule Leagueలను స్థాపించారు. తిలక్ 1916లో బెల్గాం (మహారాష్ట్ర )లో Indian Home Rule League స్థాపించారు. అనీబిసెంట్ అదే సంవత్సరం మద్రాసు (అడయార్) లో All India Home Rule League స్థాపించారు. ఇది భారత జాతీయ ఉద్యమానికి కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ రెండు లీగ్‌లు భారతదేశానికి స్వయంపాలన సాధించాలనే లక్ష్యంతో పనిచేశాయి.
క్రిందివాటిలో దేనిలో భారతదేశ విభజన గురించిన అంశం ఉంది?
మౌంట్ బాటన్ ప్రణాళిక.
కాబినెట్ మిషన్.
వేవెల్ ప్రణాళిక.
క్రిప్స్ మిషన్.
1947 జూన్ 3న ప్రకటించిన మౌంట్ బాటన్ ప్రణాళిక భారతదేశాన్ని ఇండియా మరియు పాకిస్తాన్ గా విభజించడాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. ఈ విభజనలో హిందూ మెజారిటీ భారత్ మరియు ముస్లిం మెజారిటీ పాకిస్థాన్ గా విడిపోయే ప్రతిపాదనలు ఉన్నాయి. Radcliffe Line ద్వారా సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. కాంగ్రెస్, ముస్లీం లీగ్, మరియు బ్రిటీష్ గవర్నమెంట్ ఈ ప్రణాళికను అంగీకరించాయి.
పంజాబ్‌లో నవజవాన్ భారత్ సభను స్థాపించినవారు ఎవరు?
లాల్ లాజ్‌పత్ రాయ్.
భగత్ సింగ్.
చంద్రశేఖర్ ఆజాద్.
రామ్‌ప్రసాద్ బిస్మిల్.
1926లో భగత్ సింగ్ పంజాబ్‌లో యువతలో దేశభక్తిని ప్రేరేపించేందుకు నవజవాన్ భారత్ సభను స్థాపించాడు. ఇది విప్లవోత్తేజంతో కూడిన యువకుల సంఘంగా పనిచేసింది. దీని ఉద్దేశ్యం యువతలో విప్లవాత్మక భావజాలాన్ని పెంపొందించడం, సామాజిక ఒడిదుడుకులు గురించి చైతన్యం కల్గించడం, మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని ప్రేరేపించడం. ఇది హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)కి సహాయక నెట్‌వర్క్‌లా పనిచేసింది.
క్రింది వారిలో “అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ (All India Scheduled Castes Federation)” ను స్థాపించినవారు ఎవరు?
డా. బి. ఆర్. ఆంబేద్కర్.
పెరియార్.
జ్యోతిరావ్ ఫూలే.
బాబు జగ్జీవన్ రామ్.
డా. బి. ఆర్. ఆంబేద్కర్ 1942లో నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ సదస్సులో అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ (SCF)ను స్థాపించారు. ఇది షెడ్యూల్డ్ కులాల రాజకీయ హక్కుల కోసం ఏర్పాటైన తొలి అఖిల భారత రాజకీయ పార్టీ. అంబేద్కర్ ఈ సంస్థను Independent Labour Party తరువాత ప్రారంభించి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి మార్గాన్ని సుగమం చేశాడు.
రౌలత్ బిల్లులకు వ్యతిరేకంగా 1919లో వైస్రాయ్ శాసనమండలి నుండి రాజీనామా చేసిన భారతీయ సభ్యుడు ఎవరు?
బి.డి. శుకుల్.
తేజ్ బహదూర్ సప్రూ.
ఎం. ఆర్. జయకర్.
జి. ఎస్. కపార్డే.
1919లో రౌలత్ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించిన పండిట్ బిషన్ దత్ శుకుల్ బ్రిటీష్ వైస్రాయి శాసనమండలి నుంచి రాజీనామా చేసిన ప్రముఖ భారతీయుడు. ఆయన సెంట్రల్ ప్రావిన్సెస్ నుండి ఎన్నికైన భూస్వామి సభ్యుడు. ఈ చట్టం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమనీ, న్యాయనిర్ణయాన్ని పక్కనపెట్టడమనీ పేర్కొంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు.
క్రింది వారిలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారు ఎవరు?
అరుణా ఆసఫ్ అలీ.
దాదాబాయ్ నౌరోజీ.
మోతీలాల్ నెహ్రూ.
ఎం. జి. రనడే.
అరుణా ఆసఫ్ అలీ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. ఈ ఉద్యమ సమయంలో బొంబాయిలో అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. ఆమెను “ఉద్యమ బీరంగన” (Heroine of the movement) అని అభినందించారు.
క్రిందివాటిలో కేబినెట్ మిషన్‌ ప్రతిపాదనలకు సంబంధించి సరి కానిది ఏది?
స్థానిక సంస్థానాలతో కలిపి భారతదేశాన్నంతటిని సమాఖ్యగా ఏర్పాటు చేయడం.
భారతదేశాన్ని రెండుగా విభజించడం.
సంస్థానాలను వివిధ వర్గాలుగా విభజించి స్వయంప్రతిపత్తిని కల్పించడం.
ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికైన సభ్యులతో, సంస్థానాలతో కలిపి రాజ్యాంగ ఏర్పాటు కోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం.
Cabinet Mission ప్రతిపాదనలు భారతదేశాన్ని విభజించడాన్ని నిరాకరించాయి. అవి సమాఖ్య ఏర్పాటు, రాజ్యాంగ సభ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. విభజనను బహిరంగంగా వ్యతిరేకించాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top