📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్రిందివారిలో 1885లో స్థాపించబడిన Bombay Presidency Association స్థాపకులు కానివారు ఎవరు?
ఫిరోజ్ షా మెహతా.
M.G. రనడే.
బద్రుద్దీన్ త్యాబ్జీ.
K.T. తెలాంగ్.
Bombay Presidency Associationను 1885లో ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్యాబ్జీ, K.C. తెలాంగ్ కలిసి స్థాపించారు. M.G. రనడే పూనాలో “పూనా సార్వజనిక సభ” ను నెలకొల్పారు.
భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరైన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి ఎవరు?
సరోజినీ నాయుడు.
కమలా నెహ్రూ.
కాదంబినీ గంగూలీ.
అనిబీసెంట్.
కాదంబినీ గంగూలీ 1890లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన తొలి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధిగా చరిత్రలో నిలిచారు. ఇది భారత జాతీయోద్యమంలో మహిళల పాత్రకు ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ఆమె ఇండియాలో ప్రాక్టీస్ చేసిన మొదటి మహిళా వైద్యురాలుగా కూడా గుర్తింపు పొందారు.
“డ్రెయిన్ సిద్ధాంతం” (Drain Theory) ద్వారా బ్రిటిష్ పాలనను ఎవరు తీవ్రంగా విమర్శించారు?
జవహర్‌లాల్ నెహ్రూ.
ఫిరోజ్ షా మెహతా.
దాదాభాయ్ నౌరోజీ.
లాలా లాజపతిరాయ్.
దాదాభాయ్ నౌరోజీ ప్రతిపాదించిన Drain Theory ప్రకారం, బ్రిటిష్ పాలకులు భారతదేశ సంపదను విదేశాలకు తరలిస్తూ భారత దేశాన్ని పేదరికంలోకి నెట్టేశారని పేర్కొన్నారు. ఈ సిద్ధాంతాన్ని ఆయన “Poverty and Un-British Rule in India” అనే గ్రంథంలో వివరించారు.
'సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ'ని స్థాపించిన వారు ఎవరు?
బాల గంగాధర్ తిలక్.
గోపాల కృష్ణ గోఖలే.
జ్యోతిబా ఫూలే.
దేవేంద్రనాథ్ ఠాగూర్.
గోపాల కృష్ణ గోఖలే 1905లో పూణే లో 'Servants of India Society' ను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం: భారతీయులలో రాజకీయ చైతన్యం పెంపొందించడం. సామాజిక సేవ, విద్యా విస్తరణ, మరియు స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు ఇవ్వడం. సభ్యులు త్యాగం, సేవా భావం తో దేశానికి సేవ చేయాలని ప్రమాణం చేయడం. ఈ సంస్థ ద్వారా గోఖలే మితవాద సిద్ధాంతాలను ప్రచారం చేశారు, మరియు గాంధీకి మార్గదర్శకుడిగా నిలిచారు.
క్రిందివారిలో “Grand Old Man of India” (భారతదేశ కురువృద్ధుడు) అని ఎవరిని అంటారు?
గోపాల కృష్ణ గోఖలే.
దాదాభాయ్ నౌరోజీ.
బాల గంగాధర్ తిలక్.
సురేంద్రనాథ్ బెనర్జీ.
దాదాభాయ్ నౌరోజీ భారత జాతీయోద్యమానికి పితామహుడిగా భావించబడతారు. ఆయనను "Grand Old Man of India" అని గౌరవంగా పిలుస్తారు. ఇతడు భారత జాతీయోద్యమంలో మితవాద నాయకుడిగా, ఆర్థిక సిద్ధాంతకర్తగా, మరియు బ్రిటిష్ పార్లమెంటులో ఎన్నికైన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. ఆయన రచించిన "Poverty and Un-British Rule in India" అనే గ్రంథం బ్రిటిష్ పాలనపై తీవ్ర విమర్శలు చేసింది.
భారత జాతీయ కాంగ్రెస్ (INC) కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరు?
భోగరాజు పట్టాభి సీతారామయ్య.
టంగుటూరి ప్రకాశం.
పుట్టపర్తి సూర్యనారాయణమూర్తి.
P. ఆనందాచార్యులు.
P. ఆనందాచార్యులు 1891 లోనాగపూర్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడుగా చరిత్రలో నిలిచారు. తద్వారా ఆయన ఆంధ్రుల రాజకీయ చైతన్యానికి మార్గదర్శకునిగా నిలిచారు.
క్రింది వాటిలో INC (భారత జాతీయ కాంగ్రెస్) కార్యకలాపాలకు సంబంధించి సరైనది ఏది?
భారత ప్రజలందరిలో జాతీయతాభావాన్ని కలిగించి సమైక్య పరచడం.
ఏ ఒక్క మత బృందం వ్యతిరేకించినా సరే, ఆ తీర్మానాన్ని ఆమోదించకూడదని నిర్ణయించారు.
ప్రతి సంవత్సరం కాంగ్రెస్ సమావేశాలను దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించడం.
పైవన్నీ సరైనవే.
INC ప్రజల మధ్య జాతీయతాభావాన్ని పెంపొందించడమే కాక, మత సామరస్యాన్ని కాపాడేందుకు ఏ మత బృందం వ్యతిరేకించినా, తీర్మానాన్ని ఆమోదించకూడదని నిర్ణయించింది. సమావేశాలను దేశవ్యాప్తంగా నిర్వహించడం వల్ల ప్రాంతీయ ఐక్యతకు బలం చేకూరింది.
భారత జాతీయ కాంగ్రెస్ (INC) కు అధ్యక్షత వహించిన తొలి ఆంగ్లేయుడు ఎవరు?
జార్జ్ యూల్.
A.O. హ్యూమ్.
హెన్రీ కాటన్.
విలియం వెడర్బర్న్.
1888లో అలహాబాద్లో జరిగిన నాలుగవ INC సమావేశానికి జార్జ్ యూల్ అధ్యక్షత వహించాడు. ఆయనే భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా ఎంపికైన తొలి ఆంగ్లేయుడు. ఆయన బ్రిటిష్ వ్యాపారవేత్త మరియు బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత?
72 మంది.
212 మంది.
436 మంది.
628 మంది.
1886లో కలకత్తాలో జరిగిన రెండవ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇది మొదటి సమావేశం (72 మంది) కంటే గణనీయంగా ఎక్కువ. INCకి దేశవ్యాప్తంగా పెరిగిన ఆదరణకు ఇది నిదర్శనం. ఈ సమావేశానికి దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించారు, మరియు ఇది INC విస్తరణకు కీలక ఘట్టంగా నిలిచింది.
భారత జాతీయోద్యమంలో "మితవాద యుగం" (Moderate Era) అని దేనిని పిలుస్తారు?
1857–1875.
1885–1905.
1905–1920.
1920–1947.
భారత జాతీయోద్యమంలో 1885–1905 మధ్య కాలాన్ని "మితవాద యుగం"గా పరిగణిస్తారు. ఈ దశలో నాయకులు సంయమిత చర్యలతో, రాజనీతిక విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. వీరు శాంతియుత, రాజ్యాంగబద్ధ మార్గాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలని ప్రయత్నించారు. దాదాభాయ్ నౌరోజీ, గోపాల కృష్ణ గోఖలే, WC బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా వంటి నాయకులు ఈ దశకు చెందినవారు.
“ఈస్ట్ ఇండియా అసోసియేషన్” ను స్థాపించిన వారు ఎవరు?
దాదాభాయ్ నౌరోజీ.
సురేంద్రనాథ్ బెనర్జీ.
ఆనంద మోహన్ బోస్.
WC బెనర్జీ.
ఈస్ట్ ఇండియా అసోసియేషన్‌ను 1866లో లండన్‌లో దాదాభాయ్ నౌరోజీ స్థాపించాడు. ఇది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల హక్కుల కోసం పోరాడేందుకు ఏర్పడింది. ఇది భారత జాతీయోద్యమానికి మౌలిక ఆలోచనలను అందించిన తొలి సంస్థలలో ఒకటి.
క్రిందివాటిలో మితవాదుల కోర్కెలకు సంబంధించి సరైనదాన్ని గుర్తించండి?
ప్రభుత్వంలో, పరిపాలనలో భారతీయులకు మరింత స్థానం కల్పించాలి.
ఉన్నతాధికార స్థానాల్లో భారతీయులను నియమించాలి.
సివిల్ సర్వీస్ పరీక్షలు లండన్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా నిర్వహించాలి.
పైవన్నీ సరైనవే.
మితవాదుల ముఖ్యమైన డిమాండ్లు: భారతీయులకు పరిపాలనలో ప్రాతినిధ్యం. ఉన్నత పదవుల్లో భారతీయుల నియామకం. సివిల్ సర్వీస్ పరీక్షలు భారతదేశంలో నిర్వహించాలి. ఇంపీరియల్ విధాన సభలలో మరింతమందికి ప్రాతినిధ్యం ఉండాలి, వారికీ మరిన్ని అధికారాలు కల్పించాలి. పరిపాలనలో జాతి వివక్షతను తొలగించాలి.
క్రింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కంటే ముందుగా ఏర్పడిన సంస్థలు ఏవి?
East India Association.
Indian Association of Calcutta.
Madras Mahajana Sabha.
పైవన్నీ సరైనవే.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు, భారతదేశంలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు పలు సంస్థలు ఏర్పడ్డాయి. East India Association (1866), Indian Association of Calcutta (1876), Madras Mahajana Sabha (1884) — ఇవన్నీ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన (1885) కంటే ముందుగానే ఏర్పడ్డ సంస్థలు. ఈ సంస్థలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయి.
క్రిందివారిలో “విన్నపాలు, అర్జీలు మరియు ఆందోళనలు” ద్వారా తమ కార్యాచరణను కొనసాగించిన వారు ఎవరు?
మితవాదులు.
అతివాదులు.
గాంధేయవాదులు.
ఏదీకాదు.
1885–1905 మధ్య కాలంలో మితవాదులు బ్రిటిష్ ప్రభుత్వానికి విన్నపాలు, అర్జీలు సమర్పించడం, శాంతియుత ఆందోళనల ద్వారా హక్కులు కోరడం వంటి వాటి ద్వారా కార్యాచరణను నడిపించారు. వారు న్యాయబద్ధ మార్గాలపైనే నమ్మకం ఉంచారు.
భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు?
లార్డ్ కర్జన్.
లార్డ్ డల్హౌసి.
లార్డ్ మెకాలే.
లార్డ్ మౌంట్‌బాటన్.
1835లో లార్డ్ మెకాలే తన ప్రసిద్ధ “మెకాలే మినట్” ద్వారా భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. అతడు పాశ్చాత్య శైలిలో విద్యను విస్తరించి, బ్రిటిష్ విధానాలకు అనుగుణంగా భారతీయులను ఆంగ్ల భాషలో విద్యావంతులుగా తయారు చేయడం ద్వారా బ్రిటిష్ పాలనను బలపరచవచ్చని భావించారు. ఇది భారత విద్యా వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపింది.
భారత జాతీయ కాంగ్రెస్ (INC) కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం నాయకుడు ఎవరు?
బద్రుద్దీన్ త్యాబ్జీ.
సయ్యద్ అహ్మద్ ఖాన్.
అబుల్ కలాం ఆజాద్.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
బద్రుద్దీన్ త్యాబ్జీ 1887 మద్రాస్ లో జరిగిన 3వ INC సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి ముస్లిం నాయకుడు. మత సంఘర్షణల నేపథ్యంలో ఆయన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ద్వారా INC మత సామరస్యానికి పెద్దపీట వేసింది. కాంగ్రెస్‌లో ముస్లింల ప్రాతినిధ్యం పెరగడానికి ఆయన నేతృత్వం దోహదపడింది. ఆయన Bombay Presidency Association స్థాపనలోనూ కీలక పాత్ర పోషించారు.
"Indian National Congress" అనే పేరును సూచించిన వారు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
సురేంద్రనాథ్ బెనర్జీ.
దాదాభాయ్ నౌరోజీ.
బాల గంగాధర్ తిలక్.
భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు ముందు, దాదాభాయ్ నౌరోజీ లండన్‌లో East India Association ద్వారా భారతీయుల రాజకీయ అభిప్రాయాలను ప్రచారం చేశారు. ఆయనే "Indian National Congress" అనే పేరును సూచించారు, ఇది 1885లో అధికారికంగా స్థాపించబడింది. ఈ పేరు భారతదేశం మొత్తాన్ని ప్రతినిధిగా చూపించేలా ఉండాలని ఆయన భావించారు.
క్రిందివారిలో మితవాద నాయకులు కానివారు ఎవరు?
దాదాభాయ్ నౌరోజీ.
గోపాల కృష్ణ గోఖలే.
WC బెనర్జీ.
బిపిన్ చంద్ర పాల్.
బిపిన్ చంద్ర పాల్ అతివాదానికి చెందిన ప్రముఖ నాయకుడు. ఆయన తాత్కాలిక చర్యల కన్నా తీవ్ర ఆందోళనలు, స్వదేశీ ఉద్యమానికి మద్దతుగా ఉండేవాడు. మిగిలినవారు — నౌరోజీ, గోఖలే, WC బెనర్జీ — మితవాదులు.
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు?
WC బెనర్జీ.
A.O. హ్యూమ్.
బద్రుద్దీన్ త్యాబ్జీ.
దాదాభాయ్ నౌరోజీ.
భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం 1885 డిసెంబర్ 28 -31 మధ్య బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్ పాల్ సంస్కృత కళాశాలలో WC బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. A.O. హ్యూం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు అయినప్పటికీ, అధ్యక్షుడు మాత్రం కాదు.
భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది?
1875.
1885.
1890.
1905.
భారత జాతీయ కాంగ్రెస్‌ను 1885, డిసెంబరు 28న ఏ.ఓ. హ్యూమ్ ఆధ్వర్యంలో బొంబాయిలో స్థాపించారు. ఇది భారత జాతీయోద్యమానికి వెన్నుముకగా నిలిచి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల చైతన్యాన్ని వెలికితీసింది. ఇది భారతీయుల రాజకీయ చైతన్యానికి, స్వాతంత్య్ర పోరాటానికి ఒక అఖిల భారత వేదికగా మారింది.

My ambul request sir high court subordinate moch tests ekkuva add cheyagalaru and moch test search ayyevidamuga chudagalaru sir Chalayan bhaga preparation Cesare site
Previous Question Papers: https://www.withchari.in/telangana-high-court-district-court-previous-papers
Model Papers (Mock Tests): https://www.withchari.in/mock-tests/telangana-district-court-exams
Thank you.