📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
మహాత్మా గాంధీకి రాజకీయ గురువుగా పరిగణించబడిన వ్యక్తి ఎవరు?
గోపాల కృష్ణ గోఖలే.
రవీంద్రనాథ్ టాగూర్.
సురేంద్రనాథ్ బెనర్జీ.
జ్యోతిరావ్ ఫూలే.
గోపాల కృష్ణ గోఖలే మహాత్మా గాంధీకి రాజకీయంగా ప్రేరణనిచ్చిన వ్యక్తి. గాంధీ ఆయన్ని తన రాజకీయ గురువుగా గౌరవించాడు. గోఖలే మితవాద విధానాలను అనుసరిస్తూ శాంతియుత మార్గంలో భారత స్వాతంత్ర్య పోరాటానికి బలమైన మద్దతునిచ్చారు. గోఖలే యొక్క శాంతియుత, రాజ్యాంగబద్ధ మార్గాలు గాంధీజీ రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయి.
మితవాదుల విధానాలను “భిక్షం అడుక్కోవడం”గా పేర్కొంటూ, “భిక్షం ఎత్తడం కాదు, శివం ఎత్తాలి” అని వ్యాఖ్యానించిన నాయకుడు ఎవరు?
రాస్ బిహారీ ఘోష్.
బాల గంగాధర్ తిలక్.
బిపిన్ చంద్ర పాల్.
అరవిందో ఘోష్.
బాల గంగాధర్ తిలక్ మితవాదుల విధానాలను తీవ్రంగా విమర్శించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వేచి చూసే విధానాలు ప్రజల స్వాభిమానాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆయన “భిక్షం ఎత్తడం కాదు, శివం ఎత్తాలి” అని వ్యాఖ్యానించారు. అంటే, భిక్షం అడగడం కాదు, శక్తివంతమైన స్వరాజ్య పోరాటం చేయాలి. ఇది అతివాద సిద్ధాంతానికి బలమైన నినాదంగా మారింది
భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు?
పి.సి. మహాలనోబిస్.
వీ.కే.ఆర్.వి. రావు.
దాదాభాయ్ నౌరోజీ.
ఎస్.డి. తెందుల్కర్.
దాదాభాయ్ నౌరోజీ 1867–68లో భారతదేశ జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేశారు. ఇది బ్రిటిష్ పాలన ఆర్థిక ప్రభావాన్ని వెల్లడించే తొలి శాస్త్రీయ విశ్లేషణగా గుర్తించబడింది. ఇది ఆధునిక ఆర్థిక విశ్లేషణకు పునాది వేసింది. పి.సి. మహాలనోబిస్ నేతృత్వంలో 1949లో National Income Committee ఏర్పడింది.
మితవాదుల కృషి ఫలితంగా ఏర్పడిన 1892 భారత కౌన్సిల్ చట్టంలో అంశం కానిది ఏది?
సభ్యులకు బడ్జెట్ పై ఓటువేసే హక్కు కల్పించడం.
బడ్జెట్ పై చర్చకు సభ్యులకు హక్కు కల్పించడం.
సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలగడం.
స్థానిక సంస్థలకు సభ్యులను సిఫారసు చేసే హక్కు కల్పించడం.
1892 భారత కౌన్సిల్ చట్టం ద్వారా సభ్యులకు బడ్జెట్‌పై చర్చించే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కల్పించబడినప్పటికీ, బడ్జెట్‌పై ఓటువేసే హక్కు మాత్రం ఇవ్వలేదు.
ఏ INC సమావేశంలో మితవాదులు మరియు అతివాదులు మధ్య చీలిక ఏర్పడి విడిపోయారు?
1905 – బెనారస్ సమావేశం.
1906 – కలకత్తా సమావేశం.
1907 – సూరత్ సమావేశం.
1916 – లక్నో సమావేశం.
1907లో సూరత్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో మితవాదులు మరియు అతివాదులు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. అధ్యక్ష ఎన్నికల విషయంలో ఏర్పడిన అసమ్మతి కారణంగా కాంగ్రెస్ రెండుగా విడిపోయింది. అధ్యక్ష పదవికి రాస్ బిహారీ ఘోష్ కు మితవాదులు మద్దతు ఇవ్వగా, అతివాదులు లాలా లజపతి రాయ్ కు మద్ధతునిచ్చారు. ఇది జాతీయోద్యమంలో ఒక కీలక మలుపుగా నిలిచింది.
బెంగాల్ విభజన ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
1903, జూలై 4.
1903, అక్టోబర్ 16.
1905, జూలై 4.
1905, అక్టోబర్ 16.
1903లో బెంగాల్ ను తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించాడు. బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించిన రోజు 1905, జూలై 4. అయితే బెంగాల్ విభజన 1905, అక్టోబర్ 16న అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ చర్య తీవ్ర నిరసనలకు దారి తీసింది.
వందేమాతరం గేయాన్ని రచించింది ఎవరు?
బంకించంద్ర ఛటర్జీ.
అరవింద్ ఘోష్.
రవీంద్రనాథ్ టాగూర్.
దేవేంద్రనాథ్ ఠాగూర్.
“వందేమాతరం” అనే దేశభక్తి గీతాన్ని బంకించంద్ర ఛటర్జీ రచించారు. ఇది ఆయన రచించిన “ఆనందమఠ్” నవలలో భాగంగా 1882లో ప్రచురితమైంది. ఈ గేయం స్వదేశీ ఉద్యమ సమయంలో జాతీయ గీతంగా భావించబడింది. ఈ గేయం భారత స్వాతంత్రోద్యమంలో రణనినాదంగా మారింది
బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
గోపాల కృష్ణ గోఖలే.
దాదాభాయ్ నౌరోజీ.
మోతీలాల్ నెహ్రూ.
బాల గంగాధర్ తిలక్.
దాదాభాయ్ నౌరోజీ 1892లో బ్రిటన్‌లోని ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి పార్లమెంటు (బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్) కు ఎన్నికయ్యారు. ఆయనే బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. ఇది భారత జాతీయోద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా గుర్తించబడుతుంది.
“స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దాన్ని పొందుతాను” అనే నినాదాన్ని ఇచ్చిన నాయకుడు ఎవరు?
మహాత్మా గాంధీ.
బాల గంగాధర్ తిలక్.
అరవిందో ఘోష్.
జవహర్‌లాల్ నెహ్రూ.
“స్వరాజ్యం నా జన్మహక్కు, నేను దాన్ని పొందుతాను” (Swaraj is my birthright and I shall have it) అనే ప్రసిద్ధ నినాదాన్ని బాల గంగాధర్ తిలక్ ఇచ్చారు. ఈ నినాదం భారత జాతీయోద్యమంలో ప్రజలలో జాతీయ చైతన్యంను పెంచింది మరియు యువతలో దేశభక్తిని రగిలించింది.
బెంగాల్ విభజన (1905, అక్టోబర్ 16) రోజున జరిగిన సంఘటనలకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
ఆ రోజు విషాద దినంగా పాటిస్తూ, కలకత్తాలో హర్తాళ్ ప్రకటించారు.
ప్రజలు వీధులలో వందేమాతరం పాడుతూ, ఐక్యతకు చిహ్నంగా రాఖీలు కట్టుకున్నారు.
ఆ రోజు సాయంత్రం 75,000 మంది హాజరైన రెండు సభలలో ఆనందమోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ఉపన్యసించారు.
పైవన్నీ సరైనవే.
1905, అక్టోబర్ 16న బెంగాల్ విభజన అమలులోకి వచ్చిన రోజు కలకత్తాలో హర్తాళ్ జరిగింది. ప్రజలు విషాద దినంగా పాటించి, ఉపవాసం చేశారు, వంటలు చేయలేదు. ప్రజలు వందేమాతరం పాడుతూ రాఖీలు కట్టుకున్నారు. సాయంత్రం జరిగిన భారీ సభలలో ఆనందమోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ ప్రసంగించారు. ఈ సంఘటనలు స్వదేశీ ఉద్యమానికి బలమైన ప్రేరణగా మారాయి.
“పంజాబ్ కేసరి” (Lion of Punjab) అనే బిరుదు కలిగిన అతివాద నాయకుడు ఎవరు?
బాల గంగాధర్ తిలక్.
అరవిందో ఘోష్.
బిపిన్ చంద్ర పాల్.
లాలా లజపత్ రాయ్.
బ్రిటిష్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన లాలా లజపత్ రాయ్ తన తీవ్రతర ప్రసంగాలు, ఉద్యమాల వల్ల “పంజాబ్ కేసరి” అనే బిరుదును పొందారు. అతివాద త్రయం (లాల్-బాల్-పాల్)లో ఆయన పాత్ర ప్రధానమైనది. 1928లో Simon Commission కు వ్యతిరేకంగా లాహోర్ లో నిరసన ర్యాలీకి నాయకత్వం వహించారు. బ్రిటిష్ పోలీసుల లాఠీచార్జీలో తీవ్రంగా గాయపడి, 17 నవంబర్ 1928న మరణించారు
“లోకమాన్య” మరియు “భారత అశాంతి పిత” అనే బిరుదులు ఎవరికి కలవు?
గోపాలకృష్ణ గోఖలే.
లాలా లజపత్ రాయ్.
బాల గంగాధర్ తిలక్.
లాల్ బహదూర్ శాస్త్రి.
లోకమాన్య అంటే ప్రజలచే అంగీకరించబడిన నాయకుడు/ ప్రజలచే ఆదరణ పొందిన నాయకుడు — ఈ బిరుదు బాల గంగాధర్ తిలక్ కు ప్రజల ప్రేమతో లభించింది. బ్రిటిష్ రచయిత Sir Valentine Chirol తాను రాసిన Indian Unrest అనే గ్రంధంలో తిలక్ ను భారత అశాంతి పితగా అభివర్ణించాడు. ఎందుకంటే ఆయన ఉగ్రరాజకీయ భావజాలం, స్వరాజ్, స్వదేశీ, బహిష్కరణ ఉద్యమాలను నడిపించారు కాబట్టి.
భారత జాతీయోద్యమంలో “అతివాద యుగం” అని దేనిని పిలుస్తారు?
1857–1875.
1885–1905.
1905–1920.
1920–1947.
1905–1920 కాలాన్ని భారత జాతీయోద్యమంలో అతివాద యుగంగా పిలుస్తారు. ఈ సమయంలో బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లాజపతిరాయ్, అరోబిందో ఘోష్ వంటి నేతలు మితవాద ధోరణికి విరుద్ధంగా మరింత ఉత్సాహంగా, ప్రబలంగా స్వరాజ్య పోరాటాన్ని నడిపారు.
క్రిందివారిలో అతివాద నాయకులు ఎవరు?
బాల గంగాధర్ తిలక్.
బిపిన్ చంద్ర పాల్.
లాలా లజపత్ రాయ్.
పైవన్నీ సరైనవే.
బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్, లాలా లజపత్ రాయ్ — వీరిని కలిపి “లాల్-బాల్-పాల్” అని కూడా పిలుస్తారు. వీరు మితవాద విధానాలను వ్యతిరేకిస్తూ, విప్లవాత్మకమైన పద్ధతులను అనుసరించిన అతివాద నాయకులు.
క్రిందివాటిలో సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించి సరైనది ఏది?
1869లో ICS అధికారిగా ఎంపికయ్యాడు.
నేషనల్ లిబరల్ పార్టీ స్థాపించాడు.
K.K. మిత్రాతో కలిసి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం నడిపించాడు.
పైవన్నీ సరైనవే.
సురేంద్రనాథ్ బెనర్జీ భారత జాతీయోద్యమానికి ప్రముఖ నేత. 1869లో ICSకు ఎంపికై, తర్వాత జాతీయ భావజాలానికి తెరలేపాడు. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా K.K. మిత్రా, ఆనందమోహన్ బోస్ వంటి నాయకులతో కలిసి ఉద్యమం నడిపించాడు. National Liberal Partyని స్థాపించాడు.
“గీతారహస్యము” అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు?
అరవిందో ఘోష్.
బాల గంగాధర్ తిలక్.
రవీంద్రనాథ్ టాగూర్.
బంకించంద్ర ఛటర్జీ.
గీతారహస్యము అనే గ్రంథాన్ని బాల గంగాధర్ తిలక్ 1909లో మాండలే జైలులో రచించారు. ఈ గ్రంథంలో ఆయన భగవద్గీతను కర్మయోగ దృష్టికోణంతో విశ్లేషించారు. ఇందులో ఆయన కర్మయోగ సిద్ధాంతాన్ని నమ్మి, బ్రహ్మజ్ఞానం కన్నా కార్యచరణకు ప్రాముఖ్యత ఇవ్వాలనన్నారు. ఇది జాతీయోద్యమంలో ప్రజలకు ప్రేరణనిచ్చిన రచన.
క్రిందివాటిలో తప్పుగా జతపరచబడిన రచన ఏది?
A Nation in the Making – బాల గంగాధర్ తిలక్.
Economic History of India – R.C. దత్.
The Principles of Political Science – గోపాలకృష్ణ గోఖలే.
Poverty & Un-British Rule in India – దాదాభాయ్ నౌరోజీ.
"A Nation in the Making" గ్రంథ రచయిత సురేంద్రనాథ్ బెనర్జీ. బాల గంగాధర్ తిలక్ రచించిన గ్రంధాలు: The Arctic Home of Aryans, గీతారహస్యం.
“Silver-Tongued Orator of India” అనే బిరుదు ఎవరికి కలదు?
బిపిన్ చంద్ర పాల్.
సురేంద్రనాథ్ బెనర్జీ.
గోపాల కృష్ణ గోఖలే.
సరోజినీ నాయుడు.
సురేంద్రనాథ్ బెనర్జీ భారతదేశంలో అత్యంత గొప్ప ప్రసంగకారులలో ఒకరుగా పేరుగాంచారు. ఆయన శైలి, స్పష్టత, శక్తివంతమైన వాక్చాతుర్యం కారణంగా “Silver-Tongued Orator of India” అనే బిరుదును పొందారు.
'Bombay Chronicle' అనే ఆంగ్ల పత్రికను స్థాపించినవారు ఎవరు?
దాదాభాయ్ నౌరోజీ.
గోపాలకృష్ణ గోఖలే.
ఫిరోజ్‌షా మెహతా.
సురేంద్రనాథ్ బెనర్జీ.
ఫిరోజ్‌షా మెహతా 1910లో 'Bombay Chronicle' అనే ఆంగ్ల పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మితవాద భావజాలాన్ని, జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేసిన ప్రముఖ పత్రిక. ఇది దేశభక్తి చైతన్యాన్ని రేకెత్తించిన ముఖ్యమైన పత్రికగా నిలిచింది. ఆయన 1890లో INC అధ్యక్షుడిగా పనిచేశారు. “Lion of Bombay” అనే బిరుదుతో ప్రసిద్ధి పొందారు.
క్రిందివాటిలో 1906లో కలకత్తాలో జరిగిన INC సమావేశంలో ఆమోదించబడిన తీర్మానం/తీర్మానాలు ఏవి?
స్వరాజ్య తీర్మానం.
బహిష్కరణ తీర్మానం.
జాతీయ విద్య తీర్మానం.
పైవన్నీ సరైనవే.
1906 కలకత్తా INC సమావేశానికి దాదాభాయ్ నౌరోజీ అధ్యక్షత వహించారు. INC లో మితవాదులు మరియు అతివాదుల మధ్య ఒప్పందంగా, నాలుగు కీలక తీర్మానాలు ఆమోదించబడ్డాయి: 1) స్వరాజ్: స్వీయ పాలన లక్ష్యంగా. 2)స్వదేశీ: దేశీయ ఉత్పత్తుల వినియోగానికి మద్దతుగా. 3)బహిష్కరణ: విదేశీ వస్తువులకు నిరాకరణ. 4)జాతీయ విద్య: స్వదేశీ విద్యా వ్యవస్థ అభివృద్ధికి.
