సూక్ష్మ మరియు స్థూల అర్ధశాస్త్రాలు – Test 1


🕒 30 MCQs | 40 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 30
🟢 0 🔴 0
40:00
క్రింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించి సరైన దానిని గుర్తించండి
ఇది సార్వజనీన ప్రతిపాదనల నుంచి ఆరంభమై ప్రత్యేక ప్రతిపాదనలకు దారితీస్తుంది
ఇది ప్రత్యేక ప్రతిపాదనలనుంచి ఆరంభమై సార్వజనీన ప్రతిపాదనలకు దారితీస్తుంది
ఇది ప్రత్యేక ప్రతిపాదనలనుంచి ఆరంభమై సార్వజనీన ప్రతిపాదనలకు దారితీస్తుంది
ఇది ప్రత్యేక ఉదాహరణల ద్వారా సాధారణ సూత్రాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుంది
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం (Great Depression) ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1914
1929
1935
1945
1969లో అర్థశాస్త్రంలో తొలిసారిగా నోబెల్ బహుమతి పొందిన ఆర్థికవేత్తలు ఎవరు?
రాగ్నర్ ఫ్రిష్ మరియు జాన్ టిన్‌బెర్గెన్
జాన్ మైనార్డ్ కీన్స్ మరియు ఆడమ్ స్మిత్
రాగ్నర్ ఫ్రిష్ మరియు పాల్ శామ్యూల్‌సన్
లయోనెల్ రాబిన్స్ మరియు డేవిడ్ రికార్డో
"స్థూల అర్థశాస్త్రానికి" ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన ఆర్థికవేత్త ఎవరు?
ఆడమ్ స్మిత్
ఆల్ఫ్రెడ్ మార్షల్
J.M. కీన్స్
J.S. మిల్
1998లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన వారు ఎవరు?
అమర్త్య సేన్
పాల్ శామ్యూల్‌సన్
అభిజిత్ బెనర్జీ
రాగ్నర్ ఫ్రిష్
క్రింది వాటిలో ఆగమన పద్ధతిని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
సూత్ర ప్రయోగ పద్ధతి
అనుభవపూర్వక పద్ధతి
సూత్ర పునఃస్థాపనా పద్ధతి
నిగమన పద్ధతి
మొత్తం ఆర్థిక వ్యవస్థను గురించి అధ్యయనం చేసే అర్థశాస్త్రాన్ని ఏమంటారు?
సూక్ష్మ అర్థశాస్త్రం
స్థూల అర్థశాస్త్రం
అభివృద్ధి అర్థశాస్త్రం
స్థూల అర్థశాస్త్రం
క్రింది వాటిలో J.M. కీన్స్ రచించిన గ్రంధం ఏది?
The General Theory of Employment, Interest and Money
Principles of Economics
Wealth of Nations
Principles of Political Economy and Taxation
క్రింది వాటిలో నిగమన పద్ధతికి సంబంధించి సరైన దానిని గుర్తించండి.
ఇది సార్వత్రిక ప్రతిపాదనల నుంచి ఆరంభమై ప్రత్యేక ప్రతిపాదనలకు దారితీస్తుంది
ఇది ప్రత్యేక ప్రతిపాదనలనుంచి ఆరంభమై సార్వత్రిక ప్రతిపాదనలకు దారితీస్తుంది
ఇది అనుభవపూర్వక పరిశీలనల ఆధారంగా సూత్రాన్ని రూపొందిస్తుంది
ఇది ప్రత్యేక ఉదాహరణల ద్వారా సాధారణ సూత్రాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుంది
క్రింది వాటిలో సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేసే అంశం ఏది?
జాతీయ ఆదాయం
వ్యక్తిగత వినియోగదారుల ప్రవర్తన
నిరుద్యోగం
మొత్తం ధరల స్థాయి
"సూక్ష్మ అర్థశాస్త్రం" అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది?
Micro అనే గ్రీకు పదం నుండి
Micro అనే లాటిన్ పదం నుండి
Macro అనే గ్రీకు పదం నుండి
Macro అనే లాటిన్ పదం నుండి
అర్థశాస్త్రంలో సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాల భావనలను మొదటిసారిగా ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఎవరు?
లయనెల్ రాబిన్స్
ఆడమ్ స్మిత్
రాగ్నర్ ఫ్రిష్
పాల్ శామ్యూల్‌సన్
క్రింది వాటిలో సరైన దానిని ఎన్నుకోండి.
వస్తువుకు ఉండే కోరికలను తీర్చగలిగే శక్తిని ఉపయోగితా విలువ అంటారు
ఒక వస్తువు యొక్క కొనుగోలు శక్తిని వినిమయ విలువ అంటారు
A మాత్రమే సరైనది
A మరియు B రెండూ సరైనవే
అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వృద్ధిలో ఉత్పత్తి పద్ధతుల ఎంపికను ముఖ్యమైన అంశంగా పరిగణించిన ఆర్థికవేత్త ఎవరు?
పాల్ శామ్యూల్ సన్
జాన్ మేనార్డ్ కీన్స్
అమర్త్య సేన్
ఆడం స్మిత్
సంప్రదాయ ఆర్ధికవేత్తల ప్రకారం, ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ ఏ రకమైన ఉద్యోగితా స్థితి ఉంటుంది?
అసంపూర్ణ ఉద్యోగిత
తాత్కాలిక నిరుద్యోగిత
ప్రచ్చన్న నిరుద్యోగిత
సంపూర్ణ ఉద్యోగిత
భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు ఏ సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి?
1951
1950
1947
1952
"స్థూల అర్థశాస్త్రం" అనే పదం ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది?
Micro అనే గ్రీకు పదం నుండి
Macro అనే గ్రీకు పదం నుండి
Micro అనే లాటిన్ పదం నుండి
Macro అనే లాటిన్ పదం నుండి
"స్థూల అర్థశాస్త్రాన్ని" ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
పొదుపు సిద్ధాంతం
ధరల సిద్ధాంతం
సమష్టి ఉత్పత్తి సిద్ధాంతం
ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం
క్రింది వారిలో 2019లో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన వారు ఎవరు?
అమర్త్య సేన్
అభిజిత్ బెనర్జీ
రాగ్నర్ ఫ్రిష్ మరియు జాన్ టిన్‌బెర్గెన్
జోసెఫ్ స్టిగ్లిట్జ్
"సూక్ష్మ అర్థశాస్త్రాన్ని" ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
ధరల సిద్ధాంతం
ఆదాయ ఉద్యోగితా సిద్ధాంతం
వినిమయ సిద్ధాంతం
వినియోగ ఖర్చుల సిద్ధాంతం
వైయక్తిక ఆర్థిక యూనిట్లను గురించి అధ్యయనం చేసే అర్థశాస్త్రాన్ని ఏమంటారు?
స్థూల అర్థశాస్త్రం
అభివృద్ధి అర్థశాస్త్రం
సూక్ష్మ అర్థశాస్త్రం
పైవన్నియు సరైనవే
క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి.
ప్రస్తుత కోరికలను సంతృప్తి పరచుకోవడానికి వస్తు సేవలను ఉపయోగించడాన్నే వినియోగం అంటారు
ముడి పదార్థాలకు ప్రయోజనం చేకూర్చి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియను ఉత్పత్తి అంటారు
వస్తువు యొక్క మార్పిడికి సంబంధించిన ప్రక్రియను వినిమయం అంటారు
పైవన్నియు సరైనవే
క్రింది వాటిలో స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేసే అంశం ఏది?
వ్యక్తిగత వినియోగదారుల ప్రవర్తన
ఒక సంస్థ యొక్క ఉత్పత్తి నిర్ణయాలు
జాతీయ ఆదాయం
ఒక పరిశ్రమలో ధరల మార్పు
వేతనాలను ఏ ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా చెల్లిస్తారు?
భూమి (Land)
శ్రమ (Labor)
మూలధనం (Capital)
వ్యవస్థాపన (Entrepreneurship)
"సూక్ష్మ అర్థశాస్త్రానికి" ఎక్కువ ప్రాచుర్యం కల్పించిన ఆర్థికవేత్త ఎవరు?
ఆడమ్ స్మిత్
జాన్ మేనార్డ్ కీన్స్
రాగ్నర్ ఫ్రిష్
ఆల్ఫ్రెడ్ మార్షల్
అర్ధశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు?
1950
1960
1969
1975
ఆదాయం అనే అంశానికి సంబంధించి క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి.
వివిధ ఆర్ధిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ఆదాయం వస్తుంది
ద్రవ్యరూపంలో వచ్చే ఆదాయాన్ని ద్రవ్య ఆదాయం అంటారు
ద్రవ్య ఆదాయాన్ని అది కొనుగోలు చేయగల వస్తుసేవల రూపంలో చెప్పినట్లయితే దానిని నిజ ఆదాయం అంటారు
ఆదాయం ఒక ప్రవాహం లాంటిది కాదు. అది అవిచ్చిన్నంగా కొనసాగుతూ ఉండదు.
పాల్ శామ్యూల్‌సన్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఏ సంవత్సరంలో పొందారు?
1969
1970
1972
1975
క్రిందివాటిలో ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలకు సంబందించి సరైనవాటిని గుర్తించండి.
భూమికి చెల్లించే ప్రతిఫలం భాటకం
వ్యవస్థాపనకు చెల్లించే ప్రతిఫలం లాభాలు
మూలాధనానికి చెల్లించే ప్రతిఫలం వడ్డీ
పైవన్నియూ సరైనవే
క్రింది వాటిలో ఆల్ఫ్రెడ్ మార్షల్ రచించిన గ్రంధం ఏది?
Wealth of Nations
Principles of Economics
The General Theory
Das Kapital

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top