4th Class EVS Bits: Part 2


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
మొక్కలలో ఆహార ఉత్పత్తి ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది?
కిరణజన్య సంయోగ క్రియ.
పరపరాగ సంపర్క ప్రక్రియ.
ఉష్ణ సంవహన ప్రక్రియ.
ఉష్ణ వికిరణ ప్రక్రియ.
మొక్కలు సూర్యకాంతి, నీరు, గాలిలోని కార్బన్ డై ఆక్సైಡ್ ఉపయోగించి స్వంతంగా తమ ఆహారాన్ని తయారుచేసుకునే ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) అంటారు. ఈ ప్రక్రియలో పత్రహరితం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.
పువ్వు యొక్క రంగు రంగుల భాగాన్ని ఏమని పిలుస్తారు?
ఆకర్షక పత్రం.
వికర్షక పత్రం.
సంరక్షక పత్రం.
పత్రహరితం.
పువ్వులో కనిపించే రంగురంగుల భాగాన్ని ఆకర్షక పత్రం అంటారు. ఇవి పురుగులను, తేనెటీగలను తనవైపుకు ఆకర్షించడంలో సహాయపడతాయి. పరాగసంపర్కం జరగడానికి ఈ ఆకర్షణ అత్యంత ముఖ్యమైనది.
డాల్ఫిన్లకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
ఇవి గుడ్లు మాత్రమే పెడుతాయి.
ఇవి గుడ్లుపెట్టి పొదిగి, పిల్లల్ని కని పెంచుతాయి.
ఇవి పిల్లల్ని కంటాయి, కాని పాలిచ్చి పెంచవు.
ఇవి పిల్లల్ని కని, పాలిచ్చి పెంచుతాయి.
డాల్ఫిన్లు నీటిలో నివసించే జలచర జీవులు. ఇవి గుడ్లు పెట్టవు, పిల్లలను నేరుగా కంటాయి. తల్లులు పాలిచ్చి పిల్లలను పెంచుతాయి. అందుకే వీటిని స్తన్యజీవులు (mammals) అంటారు.
క్రిందివాటిలో మందార పుష్పంలో ఉండే భాగాలు ఏవి?
రక్షకపత్రం.
ఆకర్షకపత్రం.
అండకోశం, కేసరం.
పైవన్నీ సరైనవే.
మందార పుష్పం లోని పుష్ప భాగాలు: 1) రక్షకపత్రం (Sepals): పువ్వును రక్షించేందుకు ఉపయోగపడతాయి. 2) ఆకర్షకపత్రం (Petals): రంగు రంగులుగా ఉండి పురుగులను, తేనెటీగలను ఆకర్షిస్తాయి. 3) కేసరం (Stamen): పరాగధానాన్ని ఉత్పత్తి చేస్తుంది. 4) అండకోశం (Ovary): ఇది గర్భధారణకు అవసరమైన భాగం
ఉగాది పచ్చడి క్రింది ఏ రాష్ట్రాలలో ఉగాది పండుగ యొక్క ప్రత్యెక వంటకంగా ప్రసిద్ధి చెందింది?
ఆంధ్రప్రదేశ్.
తమిళనాడు.
కర్నాటక.
పైవన్నీ సరైనవే.
ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా ఉగాది పండుగ నాడే తయారుచేస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇది ఉగాది పండుగ యొక్క ప్రత్యెక వంటకంగా ప్రసిద్ధి చెందింది.
మందార, వేప, తులసి మొక్కల పుష్పాలను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
సుగంధ ద్రవ్యాల తయారీలో.
సౌందర్య తైలాల తయారీలో.
ఔషధాల తయారీలో.
జీవకణాల తయారీలో.
మందార, వేప, తులసి పుష్పాలకు చికిత్సా లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలకు నివారణ, రోగనిరోధక శక్తి పెంపు వంటి ప్రయోజనాలు కలిగి ఉండటం వలన వీటిని సాంప్రదాయ వైద్యంలో మరియు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు?
అండోత్పాదకాలు.
శిశోత్పాదకాలు.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
ఏ జంతువుల చెవులైతే బయటకు కనిపిస్తాయో, అలాగే చర్మంపై వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. ఈ జంతువులనే క్షీరదాలు లేదా పాలిచ్చే జంతువులు అని కూడా అంటారు.
శాకాహార జంతువుల దంతాలు ఏ విధంగా ఉంటాయి?
పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు.
పదునైన కొరికే దంతాలు, బలమైన చీల్చే దంతాలు.
బలమైన నమిలే దంతాలు, బలమైన చీల్చే దంతాలు.
పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు.
శాకాహార జంతువులు మొక్కలను, మొక్కలనుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. వీటికి పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు ఉంటాయి. ఆకులు, కాండాలను కొరికేందుకు ముందు దంతాలు పదునుగా ఉంటాయి. నమిలి మృదువుగా చేసేందుకు వెనుక భాగంలో బలమైన నమిలే దంతాలు ఉంటాయి.
క్రిందివాటిలో వెంట్రుకలను శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే ఫలాలు ఏవి?
శీకాకాయ, తుమ్మకాయ.
కుంకుడుకాయ, జామకాయ.
కుంకుడుకాయ, శీకాకాయ.
శీకాకాయ, బొమ్మిడికాయ.
కుంకుడుకాయ, శీకాకాయలను సహజ హెయిర్ క్లీనర్లుగా ఉపయోగిస్తారు. ఇవి వెంట్రుకలను శుభ్రపరచడానికి, జుట్టును నిగారింపు గా ఉంచడానికి సహాయపడతాయి. రసాయనాలు లేకుండా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇవి పూర్వం నుండి వాడుతున్న సహజ ఉత్పత్తులు.
మాంసాహార జంతువుల దంతాలు ఏ విధంగా ఉంటాయి?
పొడవైన, బలమైన నమిలే దంతాలు.
పొడవైన, బలమైన చీల్చే దంతాలు.
పొట్టి, బలమైన చీల్చే దంతాలు.
పొట్టి, బలమైన నమిలే దంతాలు.
మాంసాహార జంతువులు ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తింటాయి. మాంసాన్ని చీల్చడానికి వీటి దంతాలు పొడవుగా, బలంగా, పదునుగా ఉంటాయి. ఇవి బలంగా ఉండటం వలన ఆహారాన్ని పట్టుకోవడంలో, ముక్కలు చేయడంలో సహాయపడతాయి.
కూల్ మ్యాట్స్ తయారీలో సాధారణంగా ఏ వేర్లను ఉపయోగిస్తారు?
కొబ్బరి వేర్లు.
మామిడి వేర్లు.
వట్టి వేర్లు.
నిమ్మ వేర్లు.
వట్టి వేర్లు నీటిని శోషించి చల్లదనాన్ని ఇస్తాయి. అందుకే వాటిని వేసవిలో చల్లదనం కోసం ఉపయోగించే కూల్ మ్యాట్స్ తయారీలో వాడుతారు. అలాగే దుస్తులు ఉంచే అలమర్లలో మంచి వాసన కోసం కూడా ఉపయోగిస్తారు.
లావెండర్ పుష్పాలను వేటి తయారీలో ఉపయోగిస్తారు?
ఔషధాలు.
సెంట్లు, సౌందర్య తైలాలు.
కృత్రిమ జీవకణాలు.
పైవన్నీ సరైనవే.
లావెండర్ పుష్పాలకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. అందువల్ల వీటిని సెంట్లు, అత్తర్లు, సౌందర్య తైలాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే గులాబీ, మల్లె, లిల్లీ వంటి పుష్పాలను కూడా వీటి తయారీలో ఉపయోగిస్తారు.
ఉగాది పచ్చడిని ఎన్ని రుచుల మేళవింపుతో తయారు చేస్తారు?
షడ్రుచులు.
పంచరుచులు.
అష్టరుచులు.
సప్తరుచులు.
ఉగాది పచ్చడిని తీపి, చేదు, పులుపు, ఉప్పు, కారం, వగరు అనే ఆరు రుచులు కలిపి తయారు చేస్తారు. వీటినే షడ్రుచులు అంటారు. ఉగాది పచ్చడిలోని ఈ షడ్రుచులు జీవితంలో ఎదురయ్యే మంచి, చెడులను, సుఖదుఃఖాలను సంయమనంతో స్వీకరించాలనే సందేశాన్ని తెలియజేస్తాయి.
క్రిందివాటిలో చెవులు బయటకు కనిపించని జీవులు ఏవి?
పక్షులు.
బల్లులు.
మొసళ్ళు.
పైవన్నీ సరైనవే.
పక్షుల చెవులు బయటకు కన్పించవు. పక్షి తలకు ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి.సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడుతాయి. అలాగే బల్లి తలపై, మొసలి తలపై రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిద్వారా అవి వినగల్గుతాయి.
గుడ్లు పెట్టి పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు?
శిశోత్పాదకాలు.
క్షీరదాలు.
అండోత్పాదకాలు.
ఏదీ కాదు.
ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా, వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడుతాయి. గుడ్లుపెట్టి, పొదిగి పిల్లల్ని కనే ఈ జంతువులను “అండోత్పాదకాలు” అని అంటారు. ఉదా:- పక్షులు, చేపలు, బల్లులు.
క్రిందివాటిలో ఔషధ విలువలు గల ఫలాలు ఏవి?
నిమ్మ, మామిడి.
నిమ్మ, ఉసిరి.
మామిడి, ఉసిరి.
మామిడి, సపోటా.
నిమ్మలో విటమిన్ C అధికంగా ఉండి జలుబు, జ్వరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచి శరీరానికి పోషణ ఇస్తుంది. ఈ రెండు పండ్లు వైద్య ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్రస్తుత కాలంలో విత్తనాలు లేని పండ్లను ఏ పద్ధతిలో పండిస్తున్నారు?
విలోమీకరణ పద్ధతి.
కృత్రిమ పరాగసంపర్క పద్ధతి.
విత్తన సంశ్లేషణ పద్ధతి.
సంకరణీకరణ పద్ధతి.
సంకరణీకరణ పద్ధతిలో రెండు వేర్వేరు మొక్కల మంచి లక్షణాలను కలిపి కొత్త రకాల పండ్లను ఉత్పత్తి చేస్తారు. ఈ విధంగా అభివృద్ధి చేసిన పండ్లలో సహజంగా విత్తనాలు తగ్గడం లేదా లేకపోవడం జరుగుతుంది. ద్రాక్ష వంటి విత్తనంలేని పండ్లు కూడా ఈ శాస్త్రీయ పద్ధతుల ప్రయోజనమే.
నిమ్మగడ్డి వేర్లను క్రింది వేటి తయారీలో ఉపయోగిస్తారు?
సువాసన తైలాలు.
దోమల నిరోధక పదార్థాలు.
A మాత్రమే సరైనది.
A, B రెండూ సరైనవే.
నిమ్మగడ్డి వేర్లలో ఉండే తైలాలు మంచి వాసన కలిగి ఉంటాయి. అందుకే వాటిని సువాసన తైలాల తయారీలో ఉపయోగిస్తారు. ఇవి దోమలను దూరంగా ఉంచే లక్షణం కూడా కలిగి ఉంటాయి. అందువల్ల నిమ్మగడ్డి వేర్లను దోమల నిరోధక పదార్థాల తయారీలో కూడా వాడుతారు.
క్రిందివాటిలో ఆహారంగా ఉపయోగపడే పువ్వు ఏది?
కాలీప్లవర్.
రోల్ ప్లవర్.
డోలీ ప్లవర్.
రఫ్లేషియ ప్లవర్.
కాలీప్లవర్ మనం కూరగా తినే పుష్ప కూరగాయ. ఇది మొక్కలో పుష్ప భాగంగా అభివృద్ధి చెందుతుంది మరియు పోషకాలు అధికంగా ఉంటాయి. మిగతా పుష్పాలు సాధారణంగా ఆహారంగా వాడరు. కానీ కాలీప్లవర్ మాత్రమే ఆహార పుష్పంగా ఉపయోగపడుతుంది.
పాము దేనిద్వారా అలికిడి, ధ్వనులను గుర్తిస్తుంది?
నాలుక.
ముక్కు.
చర్మం.
కళ్ళు.
చెవులు చేసే పనిని పాము యొక్క చర్మం చేస్తుంది. పాము ఈ చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top