4th Class EVS Bits: Part 3


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
అంధులు ఉపయోగించే లిపిని ఏమంటారు?
మోర్స్ కోడ్ లిపి.
బ్రెయిన్ లిపి.
బ్రెయిలీ లిపి.
బ్రోమాన్ లిపి.
అంధులు ఉపయోగించే లిపిని బ్రెయిలీ లిపి అంటారు. ఇది అంధులు లేదా దృష్టి లోపం ఉన్నవారు స్పర్శ ద్వారా చదవడానికి, వ్రాయడానికి ఉపయోగించే ఒక స్పర్శాత్మక వ్యవస్థ. ఈ లిపిలో, అక్షరాలు, సంఖ్యలు మరియు విరామ చిహ్నాలను సూచించడానికి ఎంబోస్డ్ (పైకి లేచిన) చుక్కల అమరికలు ఉంటాయి.
శిశోత్పాదకాలకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.
చెవులు బయటకు కనిపించవు, చర్మంపై వెంట్రుకలు ఉండవు.
చెవులు బయటకు కనిపించవు, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.
చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉండవు.
శిశోత్పాదకాలు అనేవి పిల్లలను కనడంతో పాటు పాలను ఇస్తాయి. వీటి చెవులు బయటకు స్పష్టంగా కనిపిస్తాయి మరియు వీటి శరీరంపై వెంట్రుకలు ఉంటాయి.
ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లతో గూడును అల్లుకునే పక్షి ఏది?
దర్జీ పిట్ట.
పావురం.
గిజిగాడు.
బుల్బుల్.
గిజిగాడు పక్షి ఆకులు, గడ్డి, కొమ్మలు, వేర్లను అల్లుతూ బలమైన బుట్టలలాంటి గూడు నిర్మిస్తుంది. ఇవి చెట్ల కొమ్మలపై వేలాడుతూ ఉంటాయి.
అడవిలోని ఒక్కో ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి?
12-15 ఏనుగులు.
10-20 ఏనుగులు, వాటి పిల్లలు.
20-30 ఏనుగులు.
10-12 ఏనుగులు, వాటి పిల్లలు.
అడవిలో ఒక్కో ఏనుగుల గుంపులో సాధారణంగా 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి. వీటిలో ఎక్కువగా ఆడ ఎనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి 15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడుతాయి.
కాకి తన గూడును వేటితో నిర్మిస్తుంది?
చిన్న కొమ్మలు, ఎండుటాకులు.
ఆకులు మాత్రమే.
పొడవైన పుల్లలు, గడ్డి.
ఆకులు, గడ్డి, వేర్లు.
కాకి సాధారణంగా చెట్ల కొమ్మలపై చిన్న చిన్న కొమ్మలు, ఎండిన ఆకులను సేకరించి గూడును నిర్మిస్తుంది. ఇవి బలంగా ఉండి గూడును స్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి.
క్రిందివాటిలో ఉభయాహార జంతువు ఏది?
ఖడ్గమృగం.
ఎలుగుబంటి.
పెద్దపులి.
సింహం.
ఎలుగుబంటి మొక్కలు మరియు జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటుంది. ఇది పండ్లు, తేనె, ఆకులు, చేపలు, ఇతర చిన్న జంతువులను తింటుంది. అందువల్ల ఇది ఉభయాహార జంతువు.
క్రిందివాటిలో చీకటిలో కూడా చూడగలిగే పక్షి ఏది?
గద్ద.
గుడ్లగూబ.
రాబందు.
డేగ.
చీకటిలో కూడా చూడగలిగే పక్షి గుడ్లగూబ. ఇది రాత్రిపూట ఆహారం కోసం వేటాడుతుంది. దీని కళ్ల నిర్మాణం ప్రత్యేకంగా ఉండటం వల్ల చీకటిలో కూడా స్పష్టంగా చూడగలదు. చెవులు కూడా చాలా సంజ్ఞాశీలకంగా ఉండి, చిన్న శబ్దాన్నికూడా పట్టుకుంటాయి. అందువల్ల ఇది రాత్రి జీవిగా ప్రసిద్ధి పొందింది.
ఏనుగుల గుంపుకు సాధారణంగా ఏ ఏనుగు నాయకత్వం వహిస్తుంది?
పెద్ద వయసున్న ఆడ ఏనుగు.
చిన్న వయసున్న మగ ఏనుగు.
పెద్ద వయసున్న మగ ఏనుగు.
ఆడ ఏనుగు మరియు మగ ఏనుగు.
సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని మిగతా ఎనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. ఈ ఆడ ఏనుగు అనుభవంతో గుంపును రక్షణ, ఆహారం, మరియు మార్గదర్శకత్వంలో ముందుకు నడిపిస్తుంది.
జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతాయి?
జంతువుల చర్మంతో చెప్పులు మరియు డోలు వంటి వాయిద్యాల తయారీకీ.
జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేయడానికి.
జంతువుల మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేయడానికి.
పైవన్నీ సరైనవే.
జంతువులు మన జీవితంలో బహుముఖ ఉపయోగాలను అందిస్తాయి. జంతువుల చర్మం ద్వారా చెప్పులు, డోలు, వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేస్తారు. మాంసం ద్వారా ఆహార పదార్థాలు పొందుతారు.
చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడు నిర్మించుకునే పక్షి ఏది?
గిజిగాడు.
టైలర్ బర్డ్.
కాకి.
పావురం.
మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారుచేసుకునే పక్షి టైలర్ బర్డ్. దీనినే దర్జీ పిట్ట అని కూడా పిలుస్తారు. ఈ పక్షులు తమ ముక్కును సూదిలా ఉపయోగించి ఆకుల అంచులను కుట్టి, వాటిని మొక్కల నారలతో కలిపి గూడును నిర్మిస్తాయి.
క్రిందివాటిలో కంటి చూపుపైన ప్రభావం చూపించే అంశం ఏది?
అదేపనిగా సెల్ ఫోన్, కంప్యుటర్లో గేమ్స్ ఆడడం.
ఎక్కువగా T.V చూడడం.
తీవ్ర కాంతివైపు ప్రత్యక్షంగా చూడడం.
పైవన్నీ సరైనవే.
సెల్ ఫోన్ మరియు కంప్యుటర్లో అదేపనిగా గేమ్స్ ఆడడం వలన, ఎక్కువగా T.V చూడడం వలన, సూర్యుని వైపు మరియు తీవ్ర కాంతివైపు ప్రత్యక్షంగా చూడడం వలన కంటి చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.
తేనెటీగలు ఎలాంటి జీవనాన్ని గడుపుతాయి?
సామూహిక జీవనం.
వ్యక్తిగత జీవనం.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
కొన్ని వందల తేనెటీగలు కలిసి సామూహిక జీవనం గడుపుతాయి. ఇవి గుంపులుగా కలిసి జీవిస్తూ, గూళ్ళను నిర్మించి, తేనెను తయారుచేస్తాయి. ప్రతి తేనెటీగకు సమూహంలో ప్రత్యేక పాత్ర ఉంటుంది. తేనెటీగలన్నీ కలిసి ఆహారాన్ని పంచుకుంటూ, తమ లార్వాలకు ఆహారాన్ని అందిస్తాయి.
చీమలకు వాటి తల ముందు భాగంలో ఎన్ని ఫీలర్స్ ఉంటాయి?
4 ఫీలర్స్.
2 ఫీలర్స్.
8 ఫీలర్స్.
6 ఫీలర్స్.
చీమలకు వాటి తల ముందు భాగంలో ఏంటినాల వంటి 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఉపయోగపడుతాయి. చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. దీని సహాయంతో ఒక దారిని ఏర్పరిచి, ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి.
టెలివిజన్ ను కనీసం ఎంత దూరం నుండి వీక్షించాలి?
6 అడుగులు.
12 అడుగులు.
18 అడుగులు.
20 అడుగులు.
టెలివిజన్‌ని చాలా దగ్గరగా చూసే అలవాటు కళ్లపైన ఒత్తిడిని పెంచి చూపు సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కనీసం 6 అడుగుల దూరం నుండి T.V చూడాలి.
జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్ని రకాలు?
7.
6.
5.
4.
జ్ఞానేంద్రియాలు 5 రకాలు. అవి 1) కళ్ళు: చూపు కోసం, 2) చెవులు: శబ్దం వినేందుకు, 3) ముక్కు: వాసన గుర్తించేందుకు, 4) నాలుక: రుచిని గుర్తించేందుకు, 5) చర్మం: స్పర్శను గుర్తించేందుకు ఉపయోగ పడుతాయి.
క్రిందివాటిలో అండోత్పాదకాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి?
చెవులు బయటకు కనిపించవు, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.
చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉండవు.
చెవులు బయటకు కనిపించవు, చర్మంపై వెంట్రుకలు ఉండవు.
చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.
అండోత్పాదక జంతువులు గుడ్లు పెట్టడం ద్వారా పిల్లల్ని కంటాయి. వీటి చెవులు బయటకు కనిపించవు. అలాగే వీటి శరీరంపై వెంట్రుకలు ఉండవు.
సాధారణంగా చీమల కాలనీలో ఉండే చీమల రకాలు ఏవి?
రాణి చీమలు.
మగ చీమలు.
శ్రామిక చీమలు.
పైవన్నీ సరైనవే.
చీమల కాలనీలో మూడు ప్రధాన రకాల చీమలు ఉంటాయి: అవి, రాణి చీమలు, మగ చీమలు మరియు శ్రామిక చీమలు. చీమల కాలనీ ఒక సమిష్టి జీవన విధానంతో పనిచేస్తుంది. రాణి చీమలు గుడ్లు పెడుతాయి. శ్రామిక చీమలు ఆహారం సేకరణ, గూడు సంరక్షణ, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తాయి.
చదివే సమయంలో కంటికీ, పుస్తకానికి మధ్య కనీసం ఎంత దూరం ఉండాలి?
15 సెంటీ మీటర్లు.
30 సెంటీ మీటర్లు.
50 సెంటీ మీటర్లు.
1 మీటరు.
పుస్తకం చదివేప్పుడు కంటి ఆరోగ్యం కోసం కంటికీ, పుస్తకానికి మధ్య కనీసం 30 సెంటీ మీటర్ల దూరం ఉండాలి. దూరం తక్కువగా ఉంటే కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు సమస్యలు రావచ్చు. సరైన వెలుతురు ఉన్న చోట చదవడం కూడా కళ్ల రక్షణకు చాలా అవసరం.
రాతి శిఖరాలపైన లేదా ఎత్తైన చెట్లపైన గూడు నిర్మించుకునే పక్షి ఏది?
కాకి.
పావురం.
గద్ద.
గిజిగాడు.
గద్దల గూడులు ఎత్తైన చెట్లు లేదా రాతి శిఖరాలపై నిర్మించబడతాయి. ఇవి చాలా బలంగా, పెద్దగా ఉంటాయి ఎందుకంటే అవి పెద్ద ఆహారాన్ని తెచ్చి పిల్లల్ని పెంచాలి. శత్రువుల నుండి రక్షణకోసం కూడా ఎత్తైన ప్రదేశాలను ఎంచుకుంటాయి.
ఉభయాహార జంతువుల దంతాలు ఏ విధంగా ఉంటాయి?
పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు.
పదునైన కోరికే దంతాలు, బలమైన చీల్చే దంతాలు.
పొట్టిగా ఉండే, బలమైన చీల్చే దంతాలు.
పదునైన కోరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు మరియు చీల్చే దంతాలు.
ఉభయాహార జంతువులు మొక్కలు, జంతువులు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. కాబట్టి పదునైన కోరికే దంతాలతో ఆహారాన్ని కొరికి, బలమైన నమిలే దంతాలతో నమిలి, చీల్చే దంతాలతో మాంసాన్ని చీల్చుతాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top