4th Class EVS Bits: Part 5


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
మాంసం, చేపలను అధిక చల్లదనం గల పెట్టెలలో నిల్వ ఉంచే పద్ధతిని ఏమంటారు?
ఫ్రీజింగ్.
రైజింగ్.
డైజింగ్.
సార్జింగ్.
మాంసం, చేపలు, కొన్ని కూరగాయలు వంటి ఆహార పదార్థాలను అధిక చల్లదనం గల పెట్టెలలో ఉంచి నిల్వ చేసే విధానాన్ని ఫ్రీజింగ్ అంటారు. ఈ విధానంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా వృద్ధి ఆగిపోతుంది మరియు అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
క్రింది వాటిలో వేటిని ఒరుగులుగా తయారుచేస్తారు?
కూరగాయలు.
మాంసం ముక్కలు.
చేప ముక్కలు.
పైవన్నీ సరైనవే.
కూరగాయలు, మాంసం, చేపముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిలువచేసి అవసరమైనపుడు వాటిని వాడుకుంటారు. వీటినే ఒరుగులు అని అంటారు.
చెరువులోని కలుషితమైన నీటిని తాగడం వల్ల ఏ జబ్బులు వ్యాపిస్తాయి?
కలరా, మలేరియా.
మలేరియా, టైఫాయిడ్.
కలరా, టైఫాయిడ్.
కలరా, టైఫాయిడ్, మలేరియా.
కాలువ కట్టలు, చెరువు గట్ల వద్ద మల విసర్జన చేసినపుడు వర్షం ద్వారా అది నీటిలోకి చేరుతుంది. ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రధానంగా కలరా, టైఫాయిడ్ మరియు నీళ్ళ విరేచనాలు వంటి జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
వరి, గోధుమ, పప్పులు మొదలైనవి నిల్వ చేసేటపుడు పురుగులు పట్టకుండా అందులో ఏ ఆకులు వేయాలి?
తుమ్మ ఆకులు.
కానుగ ఆకులు.
వేప ఆకులు.
తంగేడు ఆకులు.
వరి, గోధుమ వంటి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, వేరు శనగ వంటి నూనె గింజలు మొదలైనవి ఉన్న సంచులలో, డబ్బాలలో వేప ఆకులు వేయడం ద్వారా పురుగులు, కీటకాలు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వేప ఆకుల్లో సహజమైన క్రిమినాశక గుణాలు ఉంటాయి.
క్రిందివాటిలో చిత్తూరు జిల్లాలోని నీటి గుంట్లపల్లి గ్రామ చెరువు ఏది?
యతలవంక చెరువు.
కొలనువంక చెరువు.
చంద్రగిరి చెరువు.
పలమనేరు చెరువు.
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం లోని నీటి గుంట్లపల్లి గ్రామంలో ఉన్న చెరువుకు యతలవంక చెరువు అని పేరు. ఈ చెరువు గ్రామ ప్రజలకు పంటల సాగు మరియు నీటి అవసరాల కోసం ముఖ్యమైన వనరుగా పనిచేస్తుంది.
కాలువలు తవ్వి నదుల నీటితో నింపే చెరువులు ఏ జిల్లాల్లో కనిపిస్తాయి?
అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలు.
కృష్ణా, శ్రీ సత్య సాయి జిల్లాలు.
కర్నూలు, విజయనగరం జిల్లాలు.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు.
కృష్ణా మరియు ఉభయ గోదావరి జిల్లాల్లో చెరువులు కాలువల ద్వారా నదుల నీటితో నింపబడతాయి. ఈ పద్ధతి సాగు నీటి సరఫరా మరియు చెరువులలో నీటి నిల్వను పెంచడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఆ ప్రాంతంలోని నీటిపారుదల వ్యవస్థలో ప్రధాన భాగం.
విద్యార్ధులందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది?
మధ్యాహ్న భోజన పథకం.
సాయంత్ర భోజన పథకం.
అన్న క్యాంటీన్ల పథకం.
విద్యార్ధి సుఖీభవ పథకం.
పాఠశాలలో చదువుతున్న పిల్లలకు పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడమే కాకుండా, విద్యార్థుల పాఠశాల హాజరు శాతం పెరగడానికి కూడా దోహదపడుతుంది.
మత్తడి అంటే ఏమిటి?
పంట పొలాలకు నీటిని అందించే కాలువ.
చెరువు నిండినపుడు అదనపు నీటిని బయటకు పంపే మార్గం.
వరద నీరు చెరువులోకి రావడానికి ఏర్పరిచే మార్గం.
చెరువు నిండినపుడు చేపలు బయటకు పోకుండా కాపాడే మార్గం.
చెరువు నిండినప్పుడు ఎక్కువైన నీరు బయటకు పోవడానికి వీలుగా చెరువుకు ఒకవైపు అడ్డంగా రాళ్ళతో నిర్మించేదాన్ని మత్తడి అంటారు. దీనినే అలుగు అని కూడా అంటారు. మత్తడి పైనుండి నీరు క్రింద పడే చోట నేల కోతకు గురి కాకుండా పెద్ద పెద్ద రాళ్ళను పేర్చుతారు.
క్రినిదివాటిలో గ్రామీణ ప్రాంతాలలో స్వచ్ఛమైన తాగునీటిని అందించే బాధ్యత ఎవరిది?
గ్రామ పంచాయితీ.
మున్సిపాలిటీ.
మిన్సిపల్ కార్పోరేషన్.
జిల్లా పరిషత్ కార్యాలయం.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడం, నీటి వనరుల సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ వంటి పనుల బాధ్యత గ్రామ పంచాయితీదే. ఇది స్థానిక స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తుంది.
మాంసం ఎక్కువ కాలం పాటు నిల్వ చేయాలంటే ఏమి కలపాలి?
చక్కర, నూనె, కారం.
ఉప్పు, కారం, నూనె.
నూనె, బేకింగ్ సోడా, HCL.
ఉప్పు, నూనె, బేకింగ్ సోడా.
మాంసాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉప్పు, కారం, నూనె వంటివి ఉపయోగిస్తారు. ఉప్పు → సూక్ష్మజీవుల వృద్ధిని అడ్డుకుంటుంది. కారం → రుచి పెంచడమే కాక, కొంతవరకు పరిరక్షణలో సహాయపడుతుంది. నూనె → గాలికి తాకకుండా కప్పి, పాడవకుండా ఉంచుతుంది.
నీరు ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు?
బాష్పీభవనం.
ద్రవీభవనం.
ఘనీభవనం.
పైవన్నీ సరైనవే.
చెరువులు, నదులు, సముద్రం లోని నీరు సూర్యరశ్మి వలన ఆవిరై గాలిలో కలుస్తుంది. ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఇది నీటి చక్రంలో మొదటి దశగా పనిచేస్తుంది మరియు వర్షం ఏర్పడే ప్రక్రియకు మూలం అవుతుంది.
క్రిందివాటిలో సాధారణంగా నిల్వ చేసే ఆహార పదార్థాలు ఏవి?
పచ్చళ్ళు, చట్నీలు.
జామ్ లు
వడియాలు.
పైవన్నీ సరైనవే.
పచ్చళ్ళు, చట్నీలు, జామ్‌లు, వడియాలు వంటి ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా తయారు చేస్తారు. వీటిలో ఉప్పు, నూనె, చక్కెర లేదా సూర్యకాంతి వంటి పద్ధతులు ఉపయోగించి పాడవకుండా ఉంచుతారు. ఇవన్నీ నిల్వ ఆహారాలుగా పరిగణించబడతాయి.
నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎలుకలు, చుంచుల బారినుండి కాపాడుకోవడానికి ఎందులో నిల్వ చేస్తారు?
టిన్, స్టీలు పాత్రలు మాత్రమే.
అల్యూమినియం పాత్రలు మాత్రమే.
వెదురు బుట్టలు మాత్రమే.
పైవన్నీ సరైనవే.
నూర్పిడి చేసిన ధాన్యాన్ని ఎలుకలు, చుంచుల నుండి రక్షించాలంటే టిన్, స్టీలు లేదా అల్యూమినియం పాత్రలు, వెదురు బుట్టలు వంటి సురక్షిత పాత్రల్లో నిల్వ చేయడం ఉత్తమం. ఇవి ధాన్యాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
కాలువలు, చెరువులనుండి మొక్కలను, పూడికలను ఎవరు తీయిస్తారు?
సహకార పరపతి సంఘాలు.
రైతు సమన్వయ సంఘాలు.
రైతు పరపతి సంఘాలు.
నీటి వినియోగదారుల సంఘాలు.
చెరువులు, కాలువల్లో పూడిక పేరుకుపోతే నీటి ప్రవాహం తగ్గుతుంది. ఈ సమస్యను నివారించడానికి నీటి వినియోగదారుల సంఘాలు మొక్కలను, పూడికలను తొలగిస్తాయి. ఇవి రైతుల సహకారంతో పనిచేస్తూ నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు బాధ్యత వహిస్తాయి.
క్రిందివాటిలో వేటి ఆకులతో విస్తరాకులు (plates) తయారు చేస్తారు?
మర్రి, రావి ఆకులు.
మోదుగ, రావి ఆకులు.
మోదుగ, మర్రి ఆకులు.
మోదుగ, బొమ్మిడి ఆకులు.
గ్రామీణ ప్రాంతాల్లో విస్తరాకులు తయారు చేయడానికి ప్రధానంగా మర్రి మరియు మోదుగ ఆకులను ఉపయోగిస్తారు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు. పల్లెలలో ఇప్పటికీ ఇవి పర్యావరణహితమైన పళ్లెములుగా విస్తృతంగా వాడబడుతున్నాయి.
జలచక్రం అంటే ఏమిటి?
నీరు బాష్పీభవనం చెంది మేఘాలు ఏర్పడడం.
మేఘాలు చల్లబడి వర్షం పడడం.
పైరెండూ సరైనవే.
A మాత్రమే సరైనది.
జలచక్రం అనేది నీటి నిరంతర ప్రసరణ. ఇందులో నీరు బాష్పీభవనం చెంది మేఘాలుగా మారుతుంది, తర్వాత ఘనీభవనం ద్వారా వర్ష రూపంలో భూమిపైకి వస్తుంది. ఈ ప్రక్రియ పునరావృతం అవుతూ భూమిపై నీటి సమతుల్యతను కాపాడుతుంది.
మేఘాలు చల్లబడి చిన్న బిందువులుగా మారడాన్ని ఏమంటారు?
ఆవిరీకరణం.
ఘనీభవనం.
ద్రవీభవనం.
బాష్పీభవనం.
మేఘాలు చల్లబడినప్పుడు అందులోని నీటి ఆవిరి చిన్న నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రక్రియను ఘనీభవనం అంటారు.
ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి వేటిని ఉపయోగించరాదు?
ప్లాస్టిక్ ప్లేట్లు.
కవర్లు.
సీసాలు.
పైవన్నీ సరైనవే.
ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్లు, కొన్ని రకాల సీసాలను ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించినట్లైతే ఆహారపదార్థాల్లోకి ప్లాస్టిక్ రేణువులు చేరి, అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి వ్యాధులను కలుగజేస్తాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం కావడంతో వీటిని ఆహార నిల్వకు ఉపయోగించరాదు.
బుక్కపట్నం, ధర్మవరం చెరువులు ఏ రకానికి సంబంధించినవి?
ఇవి కాలువలతో అనుసంధానం చేయబడ్డాయి.
ఇవి వేటికవే స్వతంత్ర చెరువులు.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి, వర్షా కాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ప్రవహిస్తుంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నం మరియు ధర్మవరం చెరువులు ఈ రకానికి చెందినవే.
తూము అంటే ఏమిటి?
చెరువులో చేపలను పెంచే లోతైన ప్రాంతం.
వరద నీటిని చెరువులోకి పంపే నిర్మాణం.
చెరువులోని నీటిని కాలువల ద్వారా పొలాలకు విడుదలచేసే నిర్మాణం.
చెరువు కట్టను బలంగా ఉంచే రాళ్ళ నిర్మాణం.
తూము అనేది చెరువులోని నీటిని కాలువల ద్వారా పొలాలకు విడుదల చేయడానికి ఏర్పాటుచేసే ఒక ప్రత్యేక నిర్మాణం. తూము పైభాగంలో గల దిమ్మెను పైకి తిప్పితే చెరువులోని నీరు కాలువలోకి ప్రవహిస్తుంది, అలాగే కిందికి తిప్పితే నీటి ప్రవాహం ఆగిపోతుంది.
నీటి శుద్ధి కేంద్రంలో ఉండే దశలు ఏవి?
తేర్చే తొట్టె, వడపోత తొట్టె.
క్లోరినేషన్ తొట్టె.
నిల్వ చేయు తొట్టె.
పైవన్నీ సరైనవే.
నీటి శుద్ధి కేంద్రంలో మట్టి, చెత్త వంటి మలినాలను తొలగించడానికి తేర్చే తొట్టె, సూక్ష్మ కణాలను వడపోసేందుకు వడపోత తొట్టె, సూక్ష్మజీవులను, రోగకారకాణువులను నాశనం చేయడానికి క్లోరినేషన్ తొట్టె మరియు శుద్ధి చేసిన నీటిని నిల్వ చేయడానికి నిల్వ చేయు తొట్టె ఉంటాయి.
క్లోరినేషన్ ప్రక్రియలో నీటికి ఏమి కలుపుతారు?
బేకింగ్ సోడా.
సోడియం క్లోరైడ్.
బ్లీచింగ్ పౌడర్.
సోడియం హైడ్రాక్సైడ్.
క్లోరినేషన్ ప్రక్రియలో నీటిలో ఉన్న హానికారక జీవాణువులను, సూక్ష్మజీవులను నాశనం చేయడానికి బ్లీచింగ్ పౌడర్‌ను కలుపుతారు. ఇది నీటిని శుద్ధి చేసి తాగదగిన నీటిగా మారుస్తుంది. ఇది శుద్ధికరణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాటికి ఏమి కలపాలి?
ఉప్పు, హైడ్రోక్లోరికామ్లం.
నూనె, ఉప్పు.
నూనె, హైడ్రోక్లోరికామ్లం.
నీరు, ఉప్పు.
పచ్చళ్ళు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నూనె, ఉప్పు ఉపయోగిస్తారు. ఉప్పు సూక్ష్మజీవుల పెరుగుదలను అడ్డుకుంటుంది. నూనె పచ్చళ్ళకు తేమ, గాలి తగలకుండా కప్పివేస్తుంది. అందువల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
తాజా పండ్లను ఏవిధంగా నిల్వ ఉంచవచ్చు?
చక్కర పాకంలో మాత్రమే.
జామ్ గా తయారుచేసి మాత్రమే.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
తాజా పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే చక్కర పాకంలో ఉంచడం లేదా జామ్‌లుగా తయారు చేయడం ద్వారా నిల్వ ఉంచవచ్చు. చక్కర పాకం లేదా జామ్‌లో చక్కెర అధికమవడం వల్ల సూక్ష్మజీవులు పెరగవు, పండ్లు పాడవకుండా ఉంటాయి.
చెరువులలో నీరు కలుషితం కావడానికి గల కారణాలు ఏవి?
చెరువులో స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం.
చెరువు గట్లపై మలవిసర్జన చేయడం.
చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేయడం.
పైవన్నీ సరైనవే.
చెరువులలో నీరు స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, విగ్రహాల నిమజ్జనం, మలవిసర్జన వంటి చర్యల వలన కలుషితం అవుతుంది. ఈ కారణాల వల్ల నీటి నాణ్యత తగ్గిపోతుంది, దాంతో జీవవైవిధ్యం మరియు ఆరోగ్యం దెబ్బతింటాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top