5th Class EVS Bits: Part 2


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
క్రిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
భూమి మీద ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం తగ్గుతున్నాయి.
భూమి మీద ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.
భూమి మీద ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం స్థిరంగా ఉంటున్నాయి.
పైవన్నీ సరైనవే.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా భూమి మీద సగటు ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. ఇది గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల జరుగుతుంది.
“గ్లోబల్ వార్మింగ్” అంటే ఏమిటి?
భూమి రోజు రోజుకు వేడెక్కడం.
భూమి రోజు రోజుకు చల్లబడడం.
భూమి వేడెక్కుతూ చల్లబడడం.
భూమి ఉష్ణోగ్రత ఎప్పుడూ మైనస్ డిగ్రీలకు పడిపోవడం.
గ్లోబల్ వార్మింగ్ అనేది భూమి ఉపరితల ఉష్ణోగ్రత రోజు రోజుకు క్రమంగా పెరుగుతున్న ప్రక్రియ. ఇది ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల అధిక ఉద్గారాల వల్ల జరుగుతుంది. ఉష్ణోగ్రత పెరగడం వాతావరణ మార్పులకు దారితీస్తూ పర్యావరణం, జీవవైవిధ్యం, వ్యవసాయం మరియు మానవ జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
క్రిందివాటిలో వినాయక విగ్రహాలను దేనితో తయారు చేస్తారు?
ప్లాస్టర్ అఫ్ పారిస్.
ప్లాస్టర్ అఫ్ జింక్.
ప్లాస్టర్ అఫ్ మెగ్నీషియం.
ప్లాస్టర్ అఫ్ పొటాషియం.
వినాయక విగ్రహాలను ప్లాస్టర్ అఫ్ పారిస్ (POP)తో తయారు చేస్తారు. వీటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల, నీరు కలుషితమవుతుంది. ఇది ఆ నీటిలోని జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
జీవ వైవిధ్యం ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది?
ఎడారులు.
చెరువులు.
సముద్రాలు.
అడవులు.
జీవ వైవిధ్యం అనేది అత్యధికంగా అడవులలో కనిపిస్తుంది. ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో వేలాది రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సహజంగా సహవాసం చేస్తాయి. వాతావరణం, ఆహారం, నీరు సమృద్ధిగా ఉండటం వల్ల జీవులకు అనుకూలమైన జీవావరణం ఏర్పడుతుంది.
క్రిందివాటిలో పంటలు, ఆహార ఉత్పత్తి పైన పెను ప్రభావాన్ని చూపించే అంశాలు ఏవి?
అకాల వర్షాలు మాత్రమే.
సుదీర్ఘ వేసవి కాలం మాత్రమే.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తాయి, మొక్కలు నీటిలో మునిగిపోవడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. అలాగే సుదీర్ఘ వేసవి కాలం అధిక వేడి కారణంగా నేల ఎండిపోవడం, నీటి కొరత పెరగడం వల్ల పంటల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ రెండూ ఆహార ఉత్పత్తిని పెద్ద ఎత్తున తగ్గిస్తాయి.
నేల, నీరు, గాలి కలుషితం కావడానికి గల కారణం:
అడవులను విచక్షణా రహితంగా నరకడం.
పరిశ్రమలు హానికరమైన వాయువులను విడుదల చేయడం.
పరిశ్రమలు హానికరమైన వ్యర్ధాలను విడుదల చేయడం.
పైవన్నీ సరైనవే.
అడవులను విచక్షణా రహితంగా నరకడం వల్ల నేల నాశనం అవుతుంది. పరిశ్రమలు విడుదల చేసే హానికరమైన వాయువులు గాలిని కలుషితం చేస్తాయి మరియు వ్యర్ధాలు నీటిని కలుషితం చేస్తాయి. ఇవన్నీ కలిపి పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తాయి.
క్రిందివాటిలో తమ స్వప్రయోజనాల కోసం పర్యావరణానికి హాని చేసేవి ఏవి?
జంతువులు.
జలచరాలు.
మానవులు.
పైవన్నియు.
మానవులు తమ అవసరాలు,సౌకర్యాలు, అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పరిశ్రమల కాలుష్యం, వాహనాల కాలుష్యం, అధిక వనరుల వినియోగం వంటి చర్యల ద్వారా పర్యావరణానికి ఎక్కువ హాని కలిగిస్తారు. ప్రకృతి సమతుల్యతను అత్యధికంగా దెబ్బతీసేది మానవ చర్యలే.
క్రిందివాటిలో వాతావరణ మార్పు యొక్క ప్రభావాలు ఏవి?
సకాలంలో వర్షాలు కురవక కరువు ఏర్పడుతుంది.
పెను తుఫానులు, సునామీలు సంభవించవచ్చు.
మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి.
పైవన్నీ సరైనవే.
వాతావరణ మార్పుల వలన సకాలంలో వర్షాలు కురవక కరువు ఏర్పడుతుంది. కొన్నిసందర్భాలలో పెను తుఫానులు మరియు సునామీలు సంభవిస్తాయి. అలాగే ధ్రువ ప్రాంతాలలో మంచు కరుగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి సముద్ర తీర ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతాయి.
క్రిందివాటిలో క్రిస్మస్ సందర్భంగా అలంకరణ కోసం ఉపయోగించే చెట్లు ఏవి?
కొబ్బరి చెట్లు.
యూకలిప్టస్ చెట్లు.
కోనిఫర్ చెట్లు.
పైవన్నియు.
క్రిస్మస్ సందర్భంగా అలంకరణ కోసం సాధారణంగా కోనిఫర్ చెట్లను, ముఖ్యంగా ఫర్, స్ప్రూస్, పైన్ వంటి చెట్లను ఉపయోగిస్తారు. వీటి ఆకారం మరియు ఎల్లప్పుడూ పచ్చగా ఉండే స్వభావం అలంకరణకు అనుకూలంగా ఉండటం వల్ల క్రిస్మస్ చెట్లు గా వీటి వినియోగం విస్తృతంగా ఉంది.
ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్ధితులను ఏమంటారు?
వాతావరణం.
శిలావరణం.
జలావరణం.
జీవావరణం.
ఒక ప్రాంతంలో రోజువారీగా కనిపించే ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమ, గాలి పీడనం వంటి లక్షణాలను సమగ్రంగా వాతావరణం అని అంటారు. ఇది మన జీవన విధానాన్ని, వ్యవసాయాన్ని, సహజ వనరులను ప్రభావితం చేస్తుంది.
క్రిందివాటిలో భోజనం చేయడానికి పర్యావరణ హితం కాని ప్లేటు ఏది?
అరటి ఆకు.
మోదుగ విస్తరాకు.
స్టీల్ ప్లేటు.
ప్లాస్టిక్ ప్లేటు.
ప్లాస్టిక్ ప్లేట్లు పర్యావరణానికి హానికరంగా ఉంటాయి. ఎందుకంటే అవి సులభంగా కుళ్లవు మరియు భూమిలో లేదా నీటిలో చేరి కాలుష్యాన్ని పెంచుతాయి. అరటి ఆకుల్లో భోజనం చేయడం ఆరోగ్యానికి చాల మంచిది మరియు అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంటుంది.
క్రిందివాటిలో గ్లోబల్ వార్మింగ్ కు కారణం కానిది ఏది?
ఎయిర్ కండీషనర్లు.
రిఫ్రిజిరేటర్లు.
ఎయిర్ కూలర్లు.
మోటార్ వాహనాలు.
గ్లోబల్ వార్మింగ్ ప్రధానంగా గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాల వల్ల జరుగుతుంది. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మోటార్ వాహనాలు కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర హానికర వాయువులను విడుదల చేస్తాయి. కానీ ఎయిర్ కూలర్లు సాధారణంగా నీటి ఆవిరి ఆధారంగా పనిచేస్తాయి మరియు గ్రీన్‌హౌస్ వాయువులు విడుదల చేయవు.
చిప్కో ఉద్యమం మొదట ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఉత్తర ప్రదేశ్.
గుజరాత్.
పశ్చిమ బెంగాల్.
అస్సాం.
చిప్కో ఉద్యమం మొదట ఉత్తరప్రదేశ్ (ప్రస్తుత ఉత్తరాఖండ్‌) రాష్ట్రంలో 1973లో ప్రారంభమైంది. ఇది గర్వాల్ హిమాలయాల ప్రాంతంలోని చమోలి జిల్లాలోని రేణి గ్రామంలో మొదలైంది. చిప్కో ఉద్యమాన్ని సుందర్‌లాల్ బహుగుణ మరియు చండీ ప్రసాద్ భట్ ప్రారంభించారు.
వాతావరణ మార్పుల ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే దేశాలు ఏవి?
అభివృద్ధి చెందుతున్న దేశాలు.
అభివృద్ధి చెందిన దేశాలు.
పైరెండూ సరైనవే.
ఏదీ కాదు.
వాతావరణ మార్పుల ప్రభావానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా లోనవుతాయి. ఎందుకంటే వీటిలో ఆర్థిక వనరులు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉండటం వల్ల వరదలు, కరువు, తుఫానులు వంటి విపత్తులను ఎదుర్కోవడం కష్టమవుతుంది.
క్రిందివాటిలో “కాగితం” దేనితో తయారవుతుంది?
చెట్ల ఆకులు.
చెట్ల తోలు.
చెట్ల గుజ్జు.
చెట్ల వేర్లు.
కాగితం సాధారణంగా చెట్ల కాండంలో ఉండే సెల్యులోజ్ గుజ్జుతో తయారవుతుంది. ఈ గుజ్జును శుద్ధి చేసి, పలుచటి పొరలుగా మార్చి ఆరబెట్టడం ద్వారా కాగితం ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కాగితం తయారీలో చెట్ల గుజ్జు అత్యంత ముఖ్యమైన ముడి పదార్థంగా ఉపయోగించబడుతుంది.
చిప్కో ఉద్యమానికి సంబంధించి “చిప్కో” అంటే హిందీ భాషలో అర్ధం ఏమిటి?
వదిలిపెట్టడం.
హత్తుకోవడం.
చూస్తూ ఉండడం.
సహకరించడం.
“చిప్కో” అనే హిందీ పదానికి “హత్తుకోవడం” లేదా “ఆలింగనం చేయడం” అనే అర్థం ఉంటుంది. చెట్లను నరికివేయకుండా కాపాడేందుకు గ్రామస్థులు ఆ చెట్లను హత్తుకుని నిలబడ్డందుకే ఈ ఉద్యమానికి “చిప్కో” అనే పేరు వచ్చింది.
“నీలి గ్రహం” (Blue Planet) అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
అంగారకుడు.
భూమి.
గురుడు.
శుక్రుడు.
“నీలి గ్రహం” (Blue Planet) అని భూమిని పిలుస్తారు. ఎందుకంటే భూమి ఉపరితలంలో ఎక్కువ భాగం నీటితో కప్పబడి ఉంటుంది. అంతరిక్షం నుండి చూసినప్పుడు సముద్రాల కారణంగా భూమి నీలి రంగులో కనిపిస్తుంది. నీరు అధికంగా ఉన్న ఏకైక గ్రహం కూడా ఇదే.
భూమికి “ఊపిరితిత్తులు” వంటివి అని వేటిని పిలుస్తారు?
చెరువులు.
అడవులు.
సముద్రాలు.
పైవన్నియు.
అడవులు గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి జీవుల శ్వాసక్రియకు అవసరమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ భూమి శ్వాస విధానంలా పనిచేస్తుంది. అందుకే అడవులను భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలుస్తారు.
వాతావరణ మార్పులపై ఎవరు చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది?
వంగారి మాథాయి.
గ్రెటా థన్‌బర్గ్.
లియోనార్డో డికాప్రియో.
అల్ గోర్.
స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ అనే పర్యావరణ కార్యకర్త “ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్” పేరుతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె ప్రసంగాలు, నిరసనలు అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందాయి. ఆమె 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది.
క్రిందివాటిలో వాతావరణ మార్పులకు గల కారణం ఏమిటి?
చెట్లు నరకడం.
వ్యర్ధాలను మండించడం.
ఇంధనాలను మండించడం.
పైవన్నీ సరైనవే.
వాతావరణ మార్పులకు అనేక మానవ చర్యలు కారణమవుతాయి. చెట్లు నరకడం వల్ల కార్బన్ డై ఆక్సైడ్‌ శోషణ తగ్గుతుంది, వ్యర్ధాలను మండించడం మరియు ఇంధనాలను మండించడం వల్ల గ్రీన్‌హౌస్ వాయువులు పెరుగుతాయి. ఇవన్నీ కలిపి వాతావరణ మార్పులను వేగవంతం చేస్తాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top