5th Class EVS Bits: Part 6


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
మూత్రపిండాల ప్రధాన విధి ఏమిటి?
ఆక్సిజన్ ను సరఫరా చేయడం.
పోషకాలను సరఫరా చేయడం.
రక్తాన్ని సరఫరా చేయడం.
రక్తాన్ని వడగట్టి మలినాలను తొలగించడం.
మూత్రపిండాలు శరీరంలో ఫిల్టర్ల వలె పనిచేస్తాయి. వీటి ప్రధాన విధి రక్తాన్ని శుభ్రపరిచి, వడగట్టి, రక్తంలోని మలినాలను మరియు అధికమైన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపివేయడం. అవి శరీర ద్రవ సమతౌల్యాన్ని కాపాడుతాయి.
శరీరంలోని అన్ని వ్యవస్థల సరైన పనితీరును సమన్వయం చేసే వ్యవస్థ ఏది?
జీర్ణ వ్యవస్థ.
నాడీ వ్యవస్థ.
రక్త ప్రసరణ వ్యవస్థ.
శ్వాస వ్యవస్థ.
నాడీ వ్యవస్థ శరీరంలోని అన్ని వ్యవస్థల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది మెదడు, వెన్నుపాము, నాడుల ద్వారా శరీర భాగాల నుండి సంకేతాలను స్వీకరించి, విశ్లేషించి, ఏమి చేయాలో ఆదేశిస్తుంది. ఈ వ్యవస్థ కదలిక, స్పందన, ఆలోచన, అవయవాల పనితీరు వంటి అంశాలను నియంత్రించడం ద్వారా మొత్తం శరీరాన్ని సమన్వయం చేస్తుంది.
మానవ శరీరంలో మూత్రపిండాలు ఎక్కడ ఉంటాయి?
ఉదరకుహరంలో వెన్నెముకకు ఎడమ వైపున.
ఉదరకుహరంలో వెన్నెముకకు కుడివైపున.
ఉదరకుహరంలో వెన్నెముకకు ఇరువైపులా.
ఉరఃకుహరంలో గుండెకు ఇరువైపులా.
మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు ఉదరకుహరంలోని ఉదరవితానం (Diaphragm) కింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా అమరి ఉంటాయి.
నాడీ వ్యవస్థలో నాడుల యొక్క ప్రధాన విధి ఏమిటి?
శరీర భాగాల నుండి మెదడుకు సమాచారాన్ని తీసుకువెళ్లడం.
శరీరంలో ఒక భాగం నుండి మరొక భాగానికి సమాచారాన్ని తీసుకువెళ్లడం.
మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువెళ్లడం.
శరీర భాగాల నుండి మెదడుకు, మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువెళ్లడం.
నాడులు నాడీ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగం. నాడులు శరీర భాగాల నుండి మెదడుకు మరియు మెదడు నుండి శరీర భాగాలకు సమాచారాన్ని తీసుకువెళతాయి. మెదడు మరియు శరీర భాగాల మధ్య సమాచారాన్ని చేరవేయడమే నాడుల యొక్క ప్రధాన విధి.
మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
బటానీ గింజ ఆకారంలో.
చిక్కుడు గింజ ఆకారంలో.
గుర్రపుడెక్క ఆకారంలో.
స్పాంజిలాంటి ఆకారంలో.
మానవ శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి.
రక్తం నిర్వర్తించే విధులకు సంబంధించి క్రిందివాటిలో సరి కానిది ఏది?
ఆక్సిజన్ మరియు పోషకాలను శరీర భాగాలకు సరఫరా చేస్తుంది.
శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.
జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.
వ్యాధులకు కారణమైన రోగకారక క్రిములతో పోరాడుతుంది.
రక్తం జీర్ణక్రియను నేరుగా నిర్వహించదు. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. జీర్ణమైన పోషకాలను రక్తం శోషించుకుంటుంది. రక్తం నిర్వర్తించే విధులు:- ఆక్సిజన్ మరియు పోషకాలను శరీరభాగాలకు సరఫరా చేయడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, రోగకారక క్రిములతో పోరాడటం మరియు CO₂ లాంటి వ్యర్ధ పదార్థాలను శరీరం నుండి తొలగించడంలో సహాయపడడం.
రక్తంలో కనిపించే ప్రధాన రక్త కణాలు ఏవి?
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు ధమనులు.
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు రక్త ఫలకికలు.
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు పుపుస ధమనులు.
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు మరియు సిరలు.
రక్తంలో ప్రధానంగా మూడు రకాల రక్త కణాలు ఉంటాయి. అవి: 1) ఎర్ర రక్త కణాలు (RBCs): ఇవి హిమోగ్లోబిన్ ద్వారా ఆక్సిజన్‌ను మోసుకెళ్తాయి. 2) తెల్ల రక్త కణాలు (WBCs):ఇవి రోగకారక క్రిములతో పోరాడి వ్యాధులను అడ్డుకుంటాయి. 3) రక్త ఫలకికలు (Platelets):ఇవి రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి.
మానవ శరీరంలో గుండె ఎక్కడ ఉంటుంది?
ఉదరకుహరంలో.
ఛాతీలో కుడి వైపు.
ఛాతీలో ఎడమ వైపు.
ఊపిరితిత్తుల క్రింద, ఉదరవితానం పైన.
గుండె ఛాతీ భాగంలో (ఉరఃకుహరంలో) ఎడమ వైపు ఉంటుంది. ఇది రెండు ఊపిరితిత్తుల మధ్యలో కొద్దిగా ఎడమ వైపుకు వాలి ఉంటుంది. ఇది నిరంతరం పనిచేసే కండరాల అవయవం. ఛాతీలో ఉండే పక్కటెముకల గూడు (ఉరఃపంజరం) గుండెను రక్షిస్తుంది.
క్రిందివాటిలో మన శరీరంలోని వ్యర్ధాలను తొలగించడానికి ఉపయోగపడేవి ఏవి?
నీరు ఎక్కువగా తాగడం.
పీచుపదార్థాలు ఎక్కువగా తినడం.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా తొలగించడానికి నీరు మరియు పీచుపదార్థాలు రెండూ అవసరం. ఎక్కువ నీరు త్రాగడం వలన మూత్రం మరియు చెమట ద్వారా మలినాలు బయటకు వెళ్తాయి. పీచుపదార్థాలు తినడం వలన జీర్ణం కాని వ్యర్థాలు సులభంగా మలం రూపంలో బయటకు విసర్జించబడతాయి.
విసర్జక వ్యవస్థ యొక్క ప్రధాన విధి ఏమిటి?
ఆహారాన్ని జీర్ణం చేయడం.
రక్తాన్ని రవాణా చేయడం.
వాయువుల మార్పిడి చేయడం.
శరీరంలోని వ్యర్థాలను తొలగించడం.
మన శరీరంలోని అధికమైన, అనవసరమైన పదార్థలను బయటకు పంపించే వ్యవస్థను విసర్జక వ్యవస్థ అంటారు. దీని ప్రధాన విధి రక్తం నుండి మలినాలను వడపోసి, మూత్రం, చెమట, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వ్యర్థాలను తొలగించడం.
మూత్రం శరీరంనుండి బయటకు విసర్జించడానికి ముందు ఎక్కడ నిల్వ ఉంటుంది?
కుడి మూత్రపిండంలో.
మూత్రాశయంలో.
ఎడమ మూత్రపిండంలో.
మూత్రనాళాలలో.
మూత్రపిండాలలో రక్తం శుద్ధి అయిన తరువాత తయారైన మూత్రం మూత్ర నాళాల ద్వారా ప్రయాణించి, మూత్రాశయం అనే సంచి లాంటి అవయవంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. అవసరమైనపుడు అది ప్రశేకం ద్వారా బయటకు విసర్జించబడుతుంది.
మానవ శరీరంలో ప్రధాన విసర్జక అవయవాలు ఏవి?
అండాశయం, వృషణాలు, మూత్రపిండాలు.
గుండె, కాలేయం, క్లోమం.
మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం.
గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు.
మానవ శరీరంలోని విసర్జక అవయవాలలో ప్రధానమైనవి:- 1) మూత్రపిండాలు: ఇవి రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. 2) ఊపిరితిత్తులు: ఇవి కార్బన్ డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తాయి. 3) చర్మం: ఇది చెమట ద్వారా నీరు మరియు లవణాలను విసర్జిస్తుంది.
రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి గల కారణం ఏమిటి?
హిమోగ్లోబిన్.
క్లోరోఫిల్.
రైజోగ్లోబిన్.
క్లోరోపాస్.
రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి ప్రధాన కారణం హిమోగ్లోబిన్ అనే పదార్థం. హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ప్రోటీన్. ఇది ఆక్సిజన్‌తో కలిసినప్పుడు ఎరుపు రంగును ఇస్తుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు వచ్చే శబ్దం ఏది?
టక్-టక్.
డుబ్-లబ్.
లబ్-లబ్.
లబ్-డబ్.
గుండె మోటార్ పంపు వలే పనిచేస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేటప్పుడు “లబ్-డబ్” అనే శబ్దం వస్తుంది. ఈ లబ్-డబ్ శబ్దం యొక్క క్రమం గుండె యొక్క కవాటాలు (Valves) తెరుచుకోవడం మరియు మూసుకోవడం వలన ఏర్పడుతుంది.
మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి?
నాలుగు.
మూడు.
రెండు.
ఒకటి.
మానవుని గుండె నాలుగు గదులతో నిర్మితమై ఉంటుంది. పై భాగంలో ఉండే రెండు చిన్న గదులను కర్ణికలు (Atria) అని, క్రింది భాగంలో ఉండే రెండు పెద్ద గదులను జఠరికలు (Ventricles) అని అంటారు. ఇవి రక్తాన్ని స్వీకరించడానికి మరియు పంప్ చేయడానికి సహాయపడతాయి.
“రక్తహీనత” ఏర్పడడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉండడం వలన.
రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వలన.
శరీరంలో తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉండడం వలన.
శరీరంలో తెల్ల రక్త కణాలు తక్కువగా ఉండడం వలన.
రక్తహీనతకు ప్రధాన కారణం రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయి తగ్గిపోవడం. దీనివల్ల శరీర కణాలకు సరిపడా ఆక్సిజన్ చేరదు. దాంతో అలసట, బలహీనత, తల తిరుగుడు వంటి లక్షణాలు వస్తాయి. ఐరన్,ఫోలిక్ యాసిడ్, విటమిన్–B12 వంటి పదార్థాల లోపం రక్తహీనతకు కారణమవుతుంది.
చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే విసర్జక అవయవం ఏది?
చర్మం.
కాలేయం.
ఊపిరితిత్తులు.
మూత్రపిండాలు.
చెమట ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే విసర్జక అవయవం చర్మం. చర్మంపై ఉండే చెమట గ్రంథులు శరీరంలోని అదనపు నీటిని మరియు లవణాలను చెమట రూపంలో బయటకు విసర్జిస్తాయి. చెమటలో నీరు, ఉప్పు, యూరియా వంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి.
A.P ప్రభుత్వం పిల్లలలో హిమోగ్లోబిన్ పెంచడానికి మధ్యాహ్న భోజనంలో ఏమి సరఫరా చేస్తుంది?
పల్లీ చిక్కీలు.
మైసూర్ పాకులు.
మొక్కజొన్న అటుకులు.
సపోటా పళ్ళు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలకు రక్తహీనత రాకుండా నివారించడానికి, వారి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి మధ్యాహ్న భోజన పథకంలో అదనంగా పల్లీ చిక్కీలను సరఫరా చేస్తుంది. పల్లీలు మరియు బెల్లంలో ఐరన్ మరియు ప్రొటీన్లు ఉంటాయి. ఇవి రక్త ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ పెరుగుదలకు తోడ్పడతాయి.
మానవ శరీరంలో అతిపెద్ద విసర్జక అవయవం ఏది?
చర్మం.
ఊపిరితిత్తులు.
మూత్రపిండాలు.
పెద్దపేగు.
మానవ శరీరంలో చర్మం పైకి కనిపించే అతిపెద్ద విసర్జక అవయవం. చర్మం చెమట గ్రంధుల్ని కలిగి ఉంటుంది. ఇది మన శరీరంలోని అదనపు నీటిని మరియు లవణాలను చెమట రూపంలో స్వేద రంధ్రాల ద్వారా బయటకు విసర్జిస్తుంది. ఈ విసర్జన ప్రక్రియ శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.
శరీరంలో రక్తం సరిపోయే స్థాయిలో ఉండాలంటే తప్పనిసరిగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
వేరుశెనగలు, బెల్లం.
నువ్వులు, గుడ్లు.
పాలు, ఆకుకూరలు.
పైవన్నియు.
శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే ఇనుము, ప్రోటీన్, విటమిన్లు ఉన్న ఆహారం అవసరం. వేరుశెనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైన ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి హిమోగ్లోబిన్ లోపాన్ని నివారించి, రక్త ఉత్పత్తికి సహాయపడే ఐరన్ మరియు ప్రొటీన్లతో కూడిన పోషకాలను అందిస్తాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top