📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
పాతకాలంలో గోడలను నిర్మించడానికి వేటి మిశ్రమాన్ని వాడేవారు?
మట్టి, సున్నం మిశ్రమం.
ఇసుక, సిమెంట్ మిశ్రమం.
మట్టి, సిమెంట్ మిశ్రమం.
ఇసుక, సున్నం మిశ్రమం.
పాతకాలంలో సిమెంట్ అందుబాటులో లేకపోవడంతో గోడలను నిర్మించడానికి ప్రధానంగా ఇసుక, సున్నం మిశ్రమాన్ని ఉపయోగించేవారు. ఈ మిశ్రమం గోడలకు బలం, నిలకడనిచ్చి ఎక్కువకాలం మన్నికగా నిలిచేలా చేసేది.
చెత్తను సేకరించి దానితో “రాక్ గార్డెన్” నిర్మించింది ఎవరు?
గోపీ చంద్.
పున్నం చంద్.
లేక్ చంద్.
గిరిజా చంద్.
చండీఘడ్ లో లేక్ చంద్ అనే వ్యక్తి ప్రజలు పారేసిన చెత్తను సేకరించి దాన్ని నిర్మాణ సామాగ్రిగా మార్చి అందమైన “రాక్ గార్డెన్” నిర్మించాడు.
క్రిందివాటిలో ఈశాన్య రాష్ట్రాలలోని చెక్క ఇండ్ల లక్షణం ఏది?
వెదురు బొంగులను పేర్చి గోడవలె ఉపయోగిస్తారు.
వెదురు గోడలకు ఆవు పేడను కలిపిన బంకమట్టిని పూస్తారు.
ఇండ్ల పైకప్పులు రేకులతో ఏటవాలుగా ఉంటాయి.
పైవన్నీ సరైనవే.
ఈశాన్య రాష్ట్రాల్లోని చెక్క ఇండ్లు స్థానిక వాతావరణానికి అనుగుణంగా నిర్మించబడతాయి. వెదురు బొంగులను పేర్చి గోడవలె నిర్మిస్తారు. ఆ వెదురు గోడలకు ఆవు పేడ + బంకమట్టి మిశ్రమంతో పూత పూస్తారు. వర్షం నీరు సులభంగా పోవడానికి రేకులతో ఏటవాలుగా ఇంటి పైకప్పులు నిర్మిస్తారు.
ఏ మెషీన్ సహాయంతో పెద్ద పెద్ద రాళ్ళను చిన్న చిన్న కంకర రాళ్ళుగా మారుస్తారు?
స్టోన్ ఇంపాక్ట్ మెషీన్.
స్టోన్ క్రషర్ మెషీన్.
స్టోన్ డిఫాల్ట్ మెషీన్.
పైవన్నీ సరైనవే.
పెద్ద రాళ్లను చిన్న చిన్న కంకర రాళ్లుగా మార్చడానికి స్టోన్ క్రషర్ మెషీన్ ఉపయోగిస్తారు. ఇది నిర్మాణ, రోడ్లు, భవనాల కోసం కావలసిన కంకరను సులభంగా తయారుచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
నిర్మల్ పురస్కార్ అవార్డును ఎవరి చేతులమీదుగా బహుకరిస్తారు?
ప్రధానమంత్రి.
రాష్ట్రపతి.
ఉపరాష్ట్రపతి.
లోక్‌సభ స్పీకర్.
నిర్మల్ పురస్కార్ అవార్డు వంద శాతం పారిశుధ్యం కలిగిన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. ఈ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి చేతులమీదుగా బహుకరిస్తారు. ఇది గ్రామీణ పారిశుధ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక గుర్తింపు అవార్డు.
క్రిందివాటిలో అపార్టుమెంట్ల నిర్మాణానికి అవసరమయ్యే పరికరాలు ఏవి?
కంకర మిశ్రమం కలిపే యంత్రం.
క్రేన్ యంత్రం.
సామాగ్రిని పైకి తీసుకువెళ్ళే లిఫ్ట్ యంత్రం.
పైవన్నీ సరైనవే.
అపార్టుమెంట్ల వంటి భవనాల నిర్మాణంలో కంకర మిశ్రమం కలిపే యంత్రం, క్రేన్ యంత్రం, లిఫ్ట్ యంత్రం వంటి పరికరాలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇవన్నీ కలిపి నిర్మాణ పనులను వేగంగా మరియు సులభతరం చేసి సమయాన్ని ఆదా చేస్తాయి.
సాధారణంగా ఇటుకబట్టీ ఎన్ని రోజులు కాలుతుంది?
7 రోజులు.
15 రోజులు.
30 రోజులు.
60 రోజులు.
ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కట్టెలు, వరిపొట్టు (ఉనుక)తో కాల్చుతారు. సాధారణంగా ఇటుక బట్టీ పూర్తి స్థాయిలో 30 రోజుల వరకు కాలుతుంది. ఇటుకలు ఎర్రగా కాలగానే వారం రోజులు చల్లార్చిన తర్వాత అమ్ముతారు.
ఆరుబయట మల విసర్జన వల్ల ఏమి వ్యాప్తి చెందుతాయి?
సాలె పురుగులు.
నులి పురుగులు.
మిణుగురు పురుగులు.
పైవన్నియూ సరైనవే.
ఆరుబయట మల విసర్జన వల్ల నులి పురుగులు వ్యాప్తి చెందుతాయి. వీటినే నట్టలు అని కూడా అంటారు.
కలుషితమైన నీటిని తాగడం వల్ల ఏ జబ్బులు వ్యాపిస్తాయి?
కలరా, మలేరియా.
మలేరియా, టైఫాయిడ్.
కలరా, టైఫాయిడ్, మలేరియా.
కలరా, టైఫాయిడ్.
కాలువ కట్టలు, చెరువు గట్ల వద్ద మల విసర్జన చేసినపుడు వర్షం ద్వారా అది నీటిలోకి చేరుతుంది. ఆ కలుషితమైన నీటిని తాగడం వల్ల ప్రధానంగా కలరా, టైఫాయిడ్ వంటి జీర్ణవ్యవస్థ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
ఈశాన్య రాష్ట్రాలలో ఎక్కువగా కనిపించే ఇండ్లు ఏవి?
కాంక్రీటుతో నిర్మించిన ఇండ్లు.
మట్టితో నిర్మించిన ఇండ్లు.
రాళ్లతో నిర్మించిన ఇండ్లు.
చెక్కతో నిర్మించిన ఇండ్లు.
ఈశాన్య రాష్ట్రాలు వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాలు కావడంతో అక్కడ చెక్కతో నిర్మించిన ఇండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. చెక్క వర్షాన్ని తట్టుకోగలదు, తేమను తగ్గిస్తుంది మరియు అక్కడి భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే స్థానికంగా కలప సులభంగా లభించడం వలన ఇళ్ళ నిర్మాణంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
సులభ్ శానిటేషన్ అవార్డు కింద చెల్లించే మొత్తం ఎంత?
లక్ష రూపాయలు.
2.5 లక్షల రూపాయలు.
4 లక్షల రూపాయలు.
5 లక్షల రూపాయలు.
సులభ్ శానిటేషన్ అవార్డు పొందిన వ్యక్తులకు, సంస్థలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా చెల్లిస్తుంది. ఇది పారిశుద్ధ్య రంగంలో చేసిన కృషి, సేవలను గుర్తించడానికి మరియు మరింత ప్రేరణ కలిగించడానికి ఇవ్వబడుతుంది.
కడుపులో నట్టలు ఉండడం వల్ల వచ్చే వ్యాధి ఏది?
రక్తహీనత.
డిఫ్తీరియా.
మలేరియా.
పైవన్నీ సరైనవే.
కడుపులో నట్టలు ఉండడం వల్ల రక్తహీనత (అనీమియా) ఏర్పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని, పోషకాలను అవే తీసుకుంటాయి. అందువల్ల మనం చాలా బలహీనంగా తయారవుతాము.
ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటీష్ వారు ఏ సంవత్సరంలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు?
1826.
1856.
1785.
1885.
ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ లలో బ్రిటీష్ వారు 1826 సంవత్సరంలో ఇండ్లను కట్టడం ప్రారంభించారు.
క్రింది ఇటుకల తయారీ దశలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
బంకమట్టి సేకరించడం, బూడిదతో కలపడం, మెత్తగా చేయడం.
మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి, తీయడం.
పచ్చి ఇటుకలను 15 రోజులపాటు ఎండబెట్టడం.
ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కాల్చడం.
ఇటుకలు తయారు చేయడంలోని దశలు:- బంకమట్టిని సేకరించడం - బూడిదతో కలపడం – దాన్ని పశువులతో తొక్కించి మెత్తగా చేయడం - మట్టి ముద్దలను ఇటుక ఆకారంలోని అచ్చులలో వేసి, తీయడం - పచ్చి ఇటుకలను 2 రోజులపాటు ఎండబెట్టడం - ఎండిన ఇటుకలను బట్టీలలో పేర్చి కాల్చడం.
శ్రీనగర్ లో యాత్రికులు విహరించే పడవ ఇళ్ళను ఏమని పిలుస్తారు?
డోంగాలు.
ఇగ్లూలు.
లాగూన్లు.
డోమైన్లు.
శ్రీనగర్ లోని దాల్ సరస్సు వంటి ప్రాంతాల్లో యాత్రికులు విహరించేందుకు ఉపయోగించే పడవ ఇళ్ళను డోంగాలు అంటారు. ఇవి నీటిపై తేలియాడే విధంగా నిర్మించబడి, పర్యాటకులకు నివాసం మరియు విహారానికి అనువుగా ఉంటాయి.
వంద శాతం మరుగుదొడ్లు, పారిశుధ్యం ఉన్నగ్రామాలకు ఇచ్చే అవార్డు ఏది?
నిర్మల్ పురస్కార్.
సులభ్ శానిటేషన్.
స్వచ్చ భారత్ పురస్కార్.
గ్రీన్ విలేజ్ పురస్కార్.
వంద శాతం పారిశుద్ధ్యం కలిగిన గ్రామాలు అనగా ప్రధానంగా గ్రామంలోని అన్ని ఇండ్లలో మరుగుదొడ్డి సౌకర్యం ఉండి, గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా ఉంటే ఆ గ్రామానికి “నిర్మల్ పురస్కార్” అవార్డును అందజేస్తారు.
“రూఫ్ గార్డెన్” అంటే ఏమిటి?
ఇంటి ముందు భాగంలో మడులు చేసి కూరగాయలు, పూలమొక్కలు పెంచడం.
ఇంటి పైకప్పుపై మట్టితో మడులు చేసి కూరగాయలు, పూలమొక్కలు పెంచడం.
ఇంటి వెనుక భాగంలో మడులు చేసి కూరగాయలు, పూలమొక్కలు పెంచడం.
పైవన్నీ సరైనవే.
ఇంటి పైకప్పుపై ప్లాస్టిక్ షీట్లు పరిచి మట్టితో మడులు చేసి కూరగాయలు, పూలమొక్కలు పెంచడాన్ని రూఫ్ గార్డెన్ అని అంటారు. ఇది ఇల్లును చల్లగా ఉంచడంలో, పచ్చదనాన్ని పెంపొందించడంలో, స్వచ్ఛమైన కూరగాయలు అందించడంలో సహాయపడుతుంది.
చెక్క ఇండ్లకు రేకుల కింది భాగంలో వర్షపు నీరు వెళ్ళే మార్గానికి ఏమి ఏర్పాటు చేస్తారు?
బోల్టులు.
కారన్లు.
స్టిల్టులు.
మట్టి మడులు.
చెక్క ఇండ్లకు రేకుల కింది భాగంలో వర్షపు నీరు ఒకే మార్గంలో వెళ్లేందుకు స్టిల్టులు ఏర్పాటు చేస్తారు. ఇవి వర్షపు నీరు, తేమ నుండి ఇండ్లను రక్షించేందుకు సహాయపడతాయి.
పర్యావరణ పరిరక్షణకై ప్రతిఒక్కరూ పాటించాల్సిన సూత్రాలు ఏవి?
చెత్తను తగ్గించడం.
చెత్తను తిరిగి వాడడం.
చెత్తను రీ సైక్లింగ్ చేయడం.
పైవన్నీ సరైనవే.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు చెత్తను తగ్గించడం (Reduce), తిరిగి వాడడం (Reuse), రీసైక్లింగ్ చేయడం (Recycle) వంటి “3R” సూత్రాలను పాటించడం ద్వారా ప్రకృతి వనరులను కాపాడగలరు. ఈ చర్యలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.
అనితాబాయి “సులభ్ శానిటేషన్” అవార్డును ఎవరి చేతులమీదుగా అందుకుంది?
శ్రీరాం రమేష్.
జైరాం రమేష్.
ప్రణబ్ ముఖర్జీ.
ఏ.కె. ఆంథోనీ.
మధ్యప్రదేశ్‌కు చెందిన అనితాబాయి గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో చేసిన కృషికి “సులభ్ శానిటేషన్” అవార్డు అందుకుంది. ఈ అవార్డును ఆమెకు అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి అయిన జైరాం రమేష్ చేతులమీదుగా అందజేశారు.
తెలంగాణలోని తాండూరు, ఖమ్మం ప్రాంతాలు క్రింది వాటిలో వేటికి ప్రసిద్ధి చెందాయి?
రంగు రంగుల బండలు.
ఇనుము, ఉక్కు.
ఇనుము, సిమెంట్.
పైవన్నీ సరైనవే.
తెలంగాణలోని తాండూరు, ఖమ్మం ప్రాంతాలు ప్రత్యేకంగా రంగురంగుల బండలకు ప్రసిద్ధి చెందాయి. ఈ రాళ్లు అందమైన నిర్మాణాల్లో, ఇళ్ల ఫ్లోరింగ్, గోడల అలంకరణలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ షీట్లతో ఇంటి పైకప్పుకు సీలింగ్ వేయడం వల్ల ఉపయోగం ఏమిటి?
గదులు చల్లగా ఉంటాయి.
గదులు వేడిగా ఉంటాయి.
గదులు ఎక్కువ వెలుతురుగా ఉంటాయి.
ఏదీ కాదు.
ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ (POP) షీట్లతో పైకప్పుకు సీలింగ్ వేయడం వల్ల పైకప్పు నుండి వచ్చే వేడి తగ్గుతుంది. ఇది గదులలో ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల గదులు చల్లగా ఉంటాయి. POP సీలింగ్ థర్మల్ ఇన్సులేషన్ కలిగిన నిర్మాణ పదార్థంగా పనిచేస్తుంది.
డాబాల పైకప్పుకు బెంగుళూరు పెంకులు వేయడానికి ఏ దూలాలు ఉపయోగించేవారు?
టేకు, రేగి, వేగిస దూలాలు.
తుమ్మ, మద్ది, రేగి దూలాలు.
టేకు, మద్ది, వేగిస దూలాలు.
తుమ్మ, వేగిస, రేగి దూలాలు.
డాబాల పైకప్పుకు బెంగుళూరు పెంకులు వేయడానికి సాధారణంగా టేకు, మద్ది, వేగిస వంటి బలమైన మరియు దీర్ఘకాలిక మన్నిక గల దూలాలు ఉపయోగించేవారు. ఇవి తేమకు, వాతావరణ మార్పులకు తట్టుకునే లక్షణాలు కలిగి ఉంటాయి.
క్రిందివారిలో మధ్యప్రదేశ్ కు చెందిన పారిశుద్ధ్య విప్లవ కారకురాలు ఎవరు?
మేఘా పటేల్.
శాంత కుమారి.
అనితాబాయి.
సౌభాగ్యమ్మ.
అనితాబాయి మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని చిచౌలి గ్రామానికి చెందిన మహిళ. ఆమెకు 2011 మే లో రతన్ పూర్ కు చెందిన శివరాం తో పెళ్లి అయింది. అయితే ఆమె అత్తగారింట్లో అడుగుపెట్టిన తర్వాత అక్కడ మరుగు దొడ్డి లేకపోవడంతో, ఆమె పుట్టింటికి వెళ్లి అది కట్టే అంత వరకు కాపురానికి రానని చెప్పడంతో కట్టించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లను నిర్మించుకున్నారు.
కడుపులో నులి పురుగులు పోవడానికి సంవత్సరానికి 2 సార్లు ఏ మాత్రలు వేసుకోవాలి?
క్లోరోక్విన్ మాత్రలు.
అజిత్రోమైసిన్ మాత్రలు.
విటమిన్ మాత్రలు.
డీవార్మింగ్ మాత్రలు.
కడుపులో నులి పురుగులు నివారించడానికి ప్రతి సంవత్సరం డీవార్మింగ్ మాత్రలు 2 సార్లు వేసుకోవాలి. ఇవి కడుపులో ఉండే ప్యారాసైట్స్ ను తొలగించి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
