📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
సింధు ప్రజల లిపి ఏది?
బ్రాహ్మీ లిపి.
ఖరోష్టి లిపి.
చిత్ర లిపి.
ద్రావిడ లిపి.
సింధు నాగరికత ప్రజలు బొమ్మలతో కూడిన చిత్ర లిపి (పిక్టోగ్రాఫిక్ లిపి)ని ఉపయోగించేవారు. ఈ లిపిలో చిహ్నాలు, చిత్రాలు, గుర్తుల ద్వారా భావాలను వ్యక్తం చేసేవారు. ఇప్పటివరకు ఈ లిపి పూర్తిగా చదవబడలేదు. కానీ తవ్వకాలలో కనిపించిన ముద్రలు, పాత్రలు, గుర్తులు చిత్ర లిపిగా ఉన్నాయని సూచిస్తుంది.
హరప్పా ప్రజల ముఖ్య వృత్తి ఏమిటి?
వేట.
వ్యవసాయం.
మత్స్యకార వృత్తి.
కట్టడాల నిర్మాణం.
హరప్పా ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. నదీ తీర ప్రాంతాల సారవంతమైన నేలలు, నీటి సౌకర్యం ఉండడం వల్ల వ్యవసాయం హరప్పా నాగరికతలో ప్రముఖమైన స్థానాన్ని సంపాదించింది.
ప్రాచీన ఆదిమ మానవులకు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది?
వ్యవసాయం చేసి పంటలు పండించారు.
సంచార జీవనం చేసేవారు.
కొండ గుహలలోను, చెట్ల తోర్రలలోను నివసించేవారు.
జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు.
ప్రాచీన ఆదిమ మానవులు వ్యవసాయం చేయడం తెలియని కాలంలో జీవించారు. వారు సంచార జీవులు. కొండ గుహలలోను, చెట్ల తోర్రలలోను నివసించేవారు. జంతువులను వేటాడి పచ్చి మాంసం తినేవారు. వ్యవసాయం అనేది తరువాతి దశలో అభివృద్ధి చెందిన జీవనశైలి.
TIMS అనే పదాన్ని విస్తరించండి?
ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం.
ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం.
ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం.
టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టం.
బస్సులలో ఇపుడు మెషిన్ ద్వారా టికెట్లు ఇస్తున్నారు. దీనిని TIMS (Ticket Issuing Machine System) అని అంటారు. టికెట్లు చించి, పంచ్ చేసి ఇచ్చే ఇబ్బంది ఇందులో ఉండదు. దీని ద్వారా టికెట్ల జారీ వేగంగా, సౌకర్యంగా జరుగుతుంది.
సింధు (హరప్పా) ప్రజలు క్రింది ఏ దేశాలతో వర్తకం చేసేవారు?
చైనా, శ్రీలంక.
రోమ్, గ్రీస్.
పశ్చిమాసియా, ఈజిప్ట్.
ఇండోనేషియా, నేపాల్.
హరప్పా ప్రజలు సముద్ర మార్గం ద్వారా పశ్చిమాసియా (మెసపొటేమియా, పర్షియా) మరియు ఈజిప్ట్ దేశాలతో వాణిజ్యం చేసేవారు. ఇది వారి అంతర్జాతీయ వర్తక నైపుణ్యాన్ని సూచిస్తుంది.
హరప్పా నాగరికతా కాలం నాటి ప్రధాన ఓడరేవు ఏది?
కాలీభంగన్.
చాన్హుదారో.
మొహెంజోదారో.
లోథాల్.
హరప్పా నాగరికత కాలంలో లోథాల్ ప్రముఖ ఓడరేవుగా పేరు గాంచింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ సముద్ర వాణిజ్యానికి ఉపయోగించే డాక్‌యార్డ్ తవ్వకాల్లో బయటపడింది. ఇది హరప్పా ప్రజలు సముద్ర వాణిజ్యంలో నైపుణ్యం కలిగి ఉన్నారని సూచిస్తుంది.
పాదాచారులు రోడ్డును ఎక్కడ దాటాలి?
ఎల్లో క్రాసింగ్ వద్ద.
ట్రాఫిక్ సిగ్నల్ మధ్యలో.
జీబ్రా క్రాసింగ్ వద్ద.
ఎక్కడైనా దాటవచ్చు.
పాదాచారులు రోడ్డును “జీబ్రా క్రాసింగ్” వద్ద మాత్రమే దాటాలి. ఇది రోడ్డుపై తెల్లటి చారల రూపంలో గీయబడి ఉంటుంది. ఇది పాదాచారుల భద్రత కోసం ఏర్పాటు చేయబడింది.
బియ్యం, పప్పులు మొదలైనవి నిల్వ చేసేటపుడు పురుగులు పట్టకుండా అందులో ఏ ఆకులు వేయాలి?
వేప ఆకులు.
తుమ్మ ఆకులు.
తంగేడు ఆకులు.
కానుగ ఆకులు.
బియ్యం, పప్పులు ఉన్న సంచులలో, డబ్బాలలో వేప ఆకులు వేయడం ద్వారా పురుగులు, కీటకాలు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వేప ఆకుల్లో సహజమైన క్రిమినాశక గుణాలు ఉంటాయి. ఇది పాతకాలం నుంచి పాటిస్తున్న సాంప్రదాయ సహజ సంరక్షణ విధానం.
తెలంగాణలో ఆర్డినరీ బస్సులను ఏ పేరుతో పిలుస్తారు?
పట్టణ వెలుగు.
పల్లె వెలుగు.
నగర వెలుగు.
పైవన్నీ సరైనవే.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు నడిపే ఆర్డినరీ బస్సులను పల్లె వెలుగు బస్సులు అనే పేరుతో పిలుస్తారు. మిగతా అన్ని రకాల బస్సులకంటే వీటిలో ప్రయాణ చార్జీలు కొంచెం తక్కువగా ఉంటాయి.
క్రింది ఏ కారణాలచేత రైళ్ళు జాతీయ సమైక్యతను చాటుతాయని చెప్పవచ్చు?
రైళ్ళు వివిధ రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాయి.
రైళ్ళు వివిధ రకాల వ్యక్తులను పరిచయం చేస్తాయి.
రైళ్ళో అన్నిరకాల భాషలు మాట్లాడేవాళ్ళు ప్రయాణిస్తుంటారు.
పైవన్నీ సరైనవే.
రైళ్ళు వివిధ రాష్ట్రాల ద్వారా ప్రయాణించడం, వివిధ రకాల వ్యక్తులను పరిచయం చేయడం, విభిన్న రకాల భాషలు మాట్లాడేవాళ్ళతో కలిసి ప్రయాణించడం మొదలైనవి జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి. అందువల్ల రైళ్ళు జాతీయ సమైక్యతను చాటుతాయని చెప్పవచ్చును.
హరప్పా ప్రజలు ఏ లోహాలతో వస్తువులు తయారు చేసేవారు?
రాగి, కంచు, సీసం, తగరం.
రాగి, ఇనుము, తగరం, ఇత్తడి.
తగరం, ఇత్తడి, ఇనుము, సీసం.
వెండి, ఇత్తడి, రాగి, ఇనుము.
హరప్పా ప్రజలు రాగి, కంచు, సీసం, తగరం వంటి లోహాలతో వస్తువులు, ఆభరణాలు, ఆయుధాలు తయారు చేసేవారు. ఇనుము వారికి తెలియదు. ఈ లోహాలతో వారు రోజువారీ అవసరాలకు ఉపయోగించే వస్తువులు రూపొందించేవారు.
క్రింది వాటిలో వేటిని "ఒరుగులు" గా తయారుచేస్తారు?
కూరగాయలు.
మాంసం ముక్కలు.
చేప ముక్కలు.
పైవన్నీ సరైనవే.
కూరగాయలు, మాంసం, చేపముక్కలకు తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిలువచేసి అవసరమైనపుడు వాటిని వాడుకుంటారు. వీటినే ఒరుగులు అని అంటారు.
తెలంగాణ రాష్ట్రంలో గల రైల్వే జోన్ ఏది?
దక్షిణ మధ్య రైల్వే.
దక్షిణ తీర రైల్వే.
తూర్పు మధ్య రైల్వే.
తూర్పు తీర రైల్వే.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైల్వే జోన్ పేరు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway Zone). దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్ లో ఉంది. ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలకు కూడా సేవలు అందిస్తుంది.
ఫ్రిజ్ పై గల నక్షత్రాల గుర్తుకు, దాని విద్యుత్ వినియోగానికి గల సంబంధం ఏమిటి?
నక్షత్రాల సంఖ్య పెరిగే కొలది దాని విద్యుత్ వినియోగం పెరుగుతుంది.
నక్షత్రాల సంఖ్య పెరిగే కొలది దాని విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
నక్షత్రాల సంఖ్య తగ్గిన కొలది దాని విద్యుత్ వినియోగం తగ్గుతుంది.
నక్షత్రాల సంఖ్యకు, దాని విద్యుత్ వినియోగానికి ఎలాంటి సంబంధం లేదు.
ఫ్రిజ్ పై ఉండే నక్షత్రాల గుర్తు దాని విద్యుత్ సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఎక్కువ నక్షత్రాలు ఉన్న పరికరాలు తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేస్తాయి. అందువల్ల ఫ్రిజ్ ను కొనేటపుడు దానిపై 5 నక్షత్రాల గుర్తు ఉన్నదాన్ని కొనడం మంచిది.
క్రింది ఏ ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు?
మోదుగ, మద్ది ఆకులు.
మర్రి, బొమ్మిడి ఆకులు.
మర్రి, మోదుగ ఆకులు.
మోదుగ, బొమ్మిడి ఆకులు.
గ్రామీణ ప్రాంతాల్లో విస్తరాకులు తయారు చేయడానికి ప్రధానంగా మర్రి మరియు మోదుగ ఆకులను ఉపయోగిస్తారు. ఇవి త్వరగా మట్టిలో కలిసిపోతాయి మరియు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు.
ట్రాఫిక్ సిగ్నల్స్ కు సంబంధించి ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ఏమి చేయాలి?
పూర్తిగా ఆగడం.
ముందుకు వెళ్ళడం.
వేగంగా వెళ్ళడం.
ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండడం.
ట్రాఫిక్ సిగ్నల్ కు సంబంధించి రెడ్ లైట్ వెలిగినపుడు వాహనాన్ని పూర్తిగా ఆపాలి, ఆరెంజ్ లైట్ వెలిగినపుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి మరియు గ్రీన్ లైట్ వెలిగినపుడు ముందుకు వెళ్ళాలి.
వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన నియమాలకు సంబంధించి క్రిందివాటిలో తప్పుగా ఉన్నది ఏది?
సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడుపరాదు.
ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కాదు.
ఇయర్ ఫోన్ లో పాటలు వింటూ వాహనం నడుపరాదు.
వెనుక వాహనాలకు సూచనలివ్వకుండా కుడి, ఎడమలకు తిరుగరాదు.
ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఇది రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తుంది మరియు చిన్నపాటి గాయాలతో బ్రతికి బయటపడే అవకాశం ఉంటుంది.
హరప్పా ప్రజల ప్రధాన ఆహార పంటలు ఏవి?
గోధుమ, పత్తి, మొక్కజొన్న.
గోధుమ, వరి, పత్తి.
బార్లీ, మొక్కజొన్న, బీన్స్.
గోధుమ, వరి, బార్లీ.
హరప్పా ప్రజలు ప్రధానంగా గోధుమ, వరి, బార్లీ వంటి పంటలను పండించేవారు. ఇవి వారి ప్రధానమైన ఆహార పంటలు. నదీ తీర ప్రాంతాల సారవంతమైన నేలలు, నీటిపారుదల సౌకర్యం వల్ల ఈ పంటలు విస్తృతంగా సాగు అయ్యాయి.
RTC బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే పరిణామాలు ఏమిటి?
రూ. 100/- వరకు జరిమానా లేదా 2 నెలల జైలు శిక్ష లేదా రెండూ.
రూ. 500/- వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా రెండూ.
రూ. 500/- వరకు జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ.
రూ. 1000/- వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా రెండూ.
RTC బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం. అందుకు రూ. 500/- వరకు జరిమానా విధించబడుతుంది లేదా 6 నెలలు జైలు శిక్ష విధించబడుతుంది లేదా రెండూ ఒకేసారి అమలు కావచ్చు.
సింధు (హరప్పా) ప్రజలు ప్రధానంగా ఎవరిని పూజించేవారు?
విష్ణువు, సూర్యుడు.
అమ్మతల్లి, పశుపతి.
సూర్యుడు, అగ్నిదేవుడు.
అమ్మతల్లి, సరస్వతీ దేవి.
సింధు (హరప్పా) ప్రజలు సంతాన సంపత్తి మరియు సస్యశ్యామలానికి చిహ్నంగా అమ్మతల్లిని పూజించేవారు. అలాగే జంతువులకు అధిపతిగా పశుపతిని (శివుడి రూపం) ఆరాధించేవారు. తవ్వకాల్లో లభించిన ముద్రలు, శిల్పాలు, పూజా వస్తువుల ద్వారా ఇది స్పష్టమవుతుంది. ఇది వారి ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రకృతి పూజ, మరియు జంతు ప్రేమను సూచిస్తుంది.
“పేదవారి ఫ్రిజ్” అని దేనిని పిలుస్తారు?
జనతా ఫ్రిజ్.
వీడియోకాన్ ఫ్రిజ్.
ఎల్.జీ ఫ్రిజ్.
సామ్ సంగ్ ఫ్రిజ్.
పేదవారి ఫ్రిజ్ అని “జనతా ఫ్రిజ్” ను పిలుస్తారు. మట్టి లేదా సిమెంట్ తో చేసిన రెండు తొట్ల సహాయంతో ఇంటిలోనే ఈ ఫ్రిజ్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది విద్యుత్ అవసరం లేకుండా పనిచేసి పేదవారి అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది పర్యావరణాన్ని కాపాడుతుంది.
సింధునది ప్రాంతంలో మొదటిసారి తవ్వకాలు జరిపిన బ్రిటీషు పురావస్తు శాస్త్రవేత్త ఎవరు?
అలెగ్జాండర్ కనింగ్‌హామ్.
మోర్టిమర్ వీల్స్.
సర్ జాన్ మార్షల్.
జాన్ మెకెంజీ.
బ్రిటీష్ దేశానికి చెందిన సర్ జాన్ మార్షల్ అనే పురావస్తు శాస్త్రవేత్త 1921-22లో మొదటిసారిగా సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాలవల్ల సింధు (హరప్పా) నాగరికత బయట పడింది. ఈ పరిశోధన భారత పురావస్తు చరిత్రలో మైలురాయిగా నిలిచింది.
రైల్వే టికెట్ బుకింగ్ కు సంబంధించి “తత్కాల్” అంటే ఏమిటి?
తక్కువ ధరలో టికెట్ బుకింగ్.
రాత్రి సమయంలో మాత్రమే బుకింగ్.
అత్యవసర ప్రయాణాల కోసం తక్షణ టికెట్ బుకింగ్.
ప్యాకేజ్డ్ టూర్ బుకింగ్.
రైల్వే టికెట్ బుకింగ్‌లో “తత్కాల్” అనేది అత్యవసర సమయంలో టికెట్ బుక్ చేసుకునే ప్రత్యేక విధానం. సాధారణ బుకింగ్ కంటే త్వరగా, కొంత అదనపు రుసుము చెల్లించి టికెట్ పొందవచ్చు. ఇది ప్రయాణికులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ అవసరాల కోసం అందుబాటులో ఉంటుంది.
“బాలల దినోత్సవం” ఏ రోజున జరుపుకుంటారు?
జనవరి 14.
నవంబర్ 14.
జూన్ 14.
డిసెంబర్ 14.
బాలల దినోత్సవం ప్రతీ సంవత్సరం నవంబర్ 14న జరుపుకుంటారు. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలుస్తారు.
సింధు (హరప్పా) నాగరికత ఏ రకమైన నాగరికత?
పట్టణ నాగరికత.
గ్రామీణ నాగరికత.
అరణ్య నాగరికత.
ఏదీ కాదు.
సింధు లేదా హరప్పా నాగరికతను పట్టణ నాగరికతగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ సక్రమమైన పట్టణ నిర్మాణం, పెద్ద భవంతులు, వీధులు, నీటి పారుదల వ్యవస్థలు వంటివి ప్రణాళికా బద్ధంగా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి.
