TG High Court Office Subordinate and Process Server – Model Paper 3


తెలంగాణ High Court మరియు జిల్లా కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) మరియు ప్రాసెస్ సర్వర్ (Process Server) పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ Model Paper (Mock Test) 3 ని ప్రత్యేకంగా రూపొందించాము. 2026 Telangana High Court and District Court నోటిఫికేషన్ మరియు లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ఈ ప్రశ్నపత్రం rఉపొందించబడింది.

ఈ Model Paper 3 లో 45 GK (General Knowledge) questions తో పాటుగా వివరణాత్మకమయిన explanations ని కూడా ప్రతి ప్రశ్నకు ఇవ్వడం జరిగింది. Free గా Practice చేసుకోవచ్చును.

📝 మొత్తం ప్రశ్నలు: 45 (జనరల్ నాలెడ్జ్).

⏱️ సమయం: 60 నిమిషాలు.

🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.

🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 45
🟢 0 🔴 0
00:00
వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది?
హైగ్రోమీటర్.
ఆల్టిమీటర్.
ఎనిమోమీటర్.
బారోమీటర్.
వాతావరణంలోని గాలి పీడనాన్ని కొలవడానికి బారోమీటర్‌ను ఉపయోగిస్తారు. దీనిని 1643లో ఇవాంజెలిస్టా టోరిసెల్లి కనిపెట్టారు. మిగిలిన ఆప్షన్లలో: హైగ్రోమీటర్ గాలిలోని తేమను; ఆల్టిమీటర్ సముద్ర మట్టం నుండి ఎత్తును; మరియు ఎనిమోమీటర్ గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు.
“సింగిచామ్” అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
అరుణాచల్ ప్రదేశ్.
సిక్కిం.
నాగాలాండ్.
మణిపూర్.
సిక్కింలోని భుటియా తెగకు చెందిన సింగిచామ్ నృత్యాన్ని 'స్నో లయన్ డాన్స్' అని కూడా పిలుస్తారు. అక్కడి ప్రజలు మంచు సింహాన్ని తమ సంరక్షకుడిగా భావిస్తూ, మతపరమైన పండుగల సందర్భంలో ఈ ముసుగు నృత్యాన్ని ప్రదర్శిస్తారు.
ఇరాన్ రాజధాని ఏది?
బాగ్దాద్.
టెహ్రాన్.
కాబూల్.
మస్కట్.
ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద నగరం. మిగిలిన వాటిలో: బాగ్దాద్ (ఇరాక్), కాబూల్ (ఆఫ్ఘనిస్తాన్), మరియు మస్కట్ (ఒమన్) దేశాల రాజధానులు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి మహిళ ఎవరు?
ఫాతిమా బీవీ.
అన్నా చాందీ.
లీలా సేథ్.
ఇందు మల్హోత్రా.
లీలా సేథ్ 1991లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో తొలి మహిళా న్యాయమూర్తి కాగా, ఇందు మల్హోత్రా న్యాయవాది నుండి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళ మరియు అన్నా చాందీ దేశంలోనే తొలి మహిళా హైకోర్టు న్యాయమూర్తి.
తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
జమ్మి చెట్టు.
వేప చెట్టు.
రావి చెట్టు.
మర్రి చెట్టు.
తెలంగాణ ప్రభుత్వం 'జమ్మి చెట్టు' (Prosopis Cineraria)ను రాష్ట్ర వృక్షంగా ప్రకటించింది. ఇది రాష్ట్ర సంస్కృతిలో మరియు దసరా పండుగలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేప చెట్టు ఆంధ్రప్రదేశ్ యొక్క అధికారిక రాష్ట్ర వృక్షంగా ఉంది.
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన తొలి తెలంగాణ వ్యక్తి ఎవరు?
విశ్వనాథ సత్యనారాయణ.
సి. నారాయణ రెడ్డి.
రావూరి భరద్వాజ.
దాశరథి కృష్ణమాచార్య.
డాక్టర్ సి. నారాయణ రెడ్డి (సినారె) తన 'విశ్వంభర' కావ్యానికి గాను 1988లో జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు, తద్వారా ఈ గౌరవం పొందిన తొలి తెలంగాణ వ్యక్తిగా నిలిచారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణ గారు (రామాయణ కల్పవృక్షం) జ్ఞానపీఠ్ అందుకున్న తొలి తెలుగు వ్యక్తి కాగా, 2012లో రావూరి భరద్వాజ గారు (పాకుడురాళ్లు) ఈ పురస్కారాన్ని అందుకున్న మూడవ తెలుగు వ్యక్తి.
రామప్ప దేవాలయం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు?
వరంగల్.
హన్మకొండ.
భూపాలపల్లి.
ములుగు.
యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రకారం ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. దీనిని క్రీ.శ. 1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని కాలంలో రేచర్ల రుద్రుడు నిర్మించగా, దీనికి ఆ శిల్పి 'రామప్ప' పేరు మీదుగానే గుర్తింపు రావడం ఒక ప్రత్యేకత.
2023 ఐసిసి వన్డే ప్రపంచ కప్ విజేత ఎవరు?
ఆస్ట్రేలియా.
భారతదేశం.
న్యూజిలాండ్.
దక్షిణ ఆఫ్రికా.
2023లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐసిసి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి రికార్డు స్థాయిలో 6వ సారి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు (765) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును అందుకున్నారు.
పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు?
మేజర్ సోమనాథ్ శర్మ.
కెప్టెన్ విక్రమ్ బత్రా.
మేజర్ ధన్ సింగ్ థాపా.
అబ్దుల్ హమీద్.
భారతదేశంలో యుద్ధ సమయంలో ప్రదర్శించే అసమాన ధైర్యసాహసాలకు ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం 'పరమవీర చక్ర'. 1947లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో కాశ్మీర్ రక్షణలో ప్రాణాలర్పించిన మేజర్ సోమనాథ్ శర్మ మరణానంతరం ఈ గౌరవాన్ని పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 21 మందికి ఈ పురస్కారం లభించింది.
"మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అని ఎవరిని పిలుస్తారు?
సి.వి. రామన్.
హోమీ జె. బాబా.
విక్రమ్ సారాభాయ్.
డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
భారతదేశ క్షిపణి వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను డా. ఎ.పి.జె. అబ్దుల్ కలాం గారిని "మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతి మరియు భారతరత్న గ్రహీత కూడా. విక్రమ్ సారాభాయ్‌ను భారత అంతరిక్ష పితామహుడిగా మరియు హోమీ జె. బాబాను భారత అణుశక్తి పితామహుడిగా పిలుస్తారు.
భారతదేశంలో అతిపెద్ద మంచి నీటి సరస్సు ఏది?
చిలికా సరస్సు.
ఉలార్ సరస్సు.
పులికాట్ సరస్సు.
కొల్లేరు సరస్సు.
జమ్మూ కాశ్మీర్‌లోని బండిపోరా జిల్లాలో ఉన్న ఉలార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది జీలం నది ద్వారా నీటిని పొందుతుంది. మిగిలిన వాటిలో చిలికా సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు (Lagoon) కాగా, పులికాట్ రెండవ అతి పెద్ద ఉప్పునీటి సరస్సు. కొల్లేరు ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద మంచినీటి సరస్సు.
"ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని ఏ భాషను పిలుస్తారు?
తమిళం.
కన్నడ.
మలయాళం.
తెలుగు.
తెలుగు భాషలోని పదాలు అచ్చులతో (Vowels) అంతమవుతాయి (అజంత భాష). ఈ లక్షణం ఇటాలియన్ భాషలో కూడా ఉండటంతో, 15వ శతాబ్దపు ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని వర్ణించారు. భారత ప్రభుత్వం తెలుగు భాషకు 2008లో అధికారికంగా ప్రాచీన భాషా హోదా (Classical Language Status) కల్పించింది.
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
ఫిబ్రవరి 28.
సెప్టెంబర్ 5.
నవంబర్ 11.
అక్టోబర్ 31.
1928 ఫిబ్రవరి 28న సర్ సి.వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నందుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము మరియు దీనికి గానూ ఆయనకు 1930లో నోబెల్ బహుమతి లభించింది. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం, నవంబర్ 11న విద్యా దినోత్సవం మరియు అక్టోబర్ 31న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటాము.
“శాంతివనం” అనేది క్రింది వారిలో ఎవరి యొక్క సమాధి స్థలం?
మహాత్మా గాంధీ.
లాల్ బహదూర్ శాస్త్రి.
జవహర్‌లాల్ నెహ్రూ.
శంకర్ దయాళ్ శర్మ.
భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గారి సమాధిని 'శాంతివనం' అని పిలుస్తారు. ఇది ఢిల్లీలోని యమునా నది ఒడ్డున ఉంది. మిగిలిన వాటిలో రాజ్ ఘాట్ (మహాత్మా గాంధీ), విజయ్ ఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి), మరియు కర్మ భూమి (శంకర్ దయాళ్ శర్మ) లకు సంబంధించినవి.
రంగులకు భయపడడాన్ని ఏ ఫోబియా అని పిలుస్తారు?
ఫోటోఫోబియా.
ఏరోఫోబియా.
క్రోమోఫోబియా.
హైడ్రోఫోబియా.
రంగులను చూసి విపరీతంగా భయపడడాన్ని క్రోమోఫోబియా అంటారు. 'క్రోమా' అంటే గ్రీకు భాషలో 'రంగు' అని అర్థం. మిగిలిన వాటిలో: ఫోటోఫోబియా అంటే వెలుతురుకు భయపడటం, ఏరోఫోబియా అంటే గాలి లేదా విమాన ప్రయాణాలకు భయపడటం, మరియు హైడ్రోఫోబియా అంటే నీటిని చూసి భయపడటం.
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలోని ఏ జిల్లాలో కలదు?
ఖమ్మం.
భద్రాద్రి కొత్తగూడెం.
మహబూబాబాద్.
ములుగు.
కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. ఇది కిన్నెరసాని డ్యామ్ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా విభజన తర్వాత ఈ ప్రాంతం కొత్తగూడెం జిల్లా పరిధిలోకి వచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది?
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (అమెరికా).
స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ (చైనా).
స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (భారతదేశం).
లేక్యున్ సెక్యార్ (మయన్మార్).
గుజరాత్‌లోని నర్మదా నది తీరాన ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం) 182 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా రికార్డు సృష్టించింది. దీనిని ప్రముఖ శిల్పి రామ్ వి. సుతార్ రూపొందించారు. దీని తర్వాత స్థానాల్లో స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ (128 మీటర్లు), లేక్యున్ సెక్యార్ (116 మీటర్లు) ఉన్నాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎత్తు కేవలం 93 మీటర్లు మాత్రమే.
'గేట్‌వే ఆఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
న్యూఢిల్లీ.
ముంబై.
కోల్‌కతా.
బెంగళూరు.
'గేట్‌వే ఆఫ్ ఇండియా' అని ముంబై ని పిలుస్తారు. 1911లో బ్రిటిష్ చక్రవర్తి కింగ్ జార్జ్ V మరియు క్వీన్ మేరీల భారత పర్యటనకు గుర్తుగా ముంబైలో గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు, దీని రూపశిల్పి జార్జ్ విట్టెట్. అయితే న్యూఢిల్లీలో ఉన్న 'ఇండియా గేట్' మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల స్మారకార్థం నిర్మించబడింది.
బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు?
ఛత్తీస్‌గఢ్.
ఒడిశా.
జార్ఖండ్.
పశ్చిమ బెంగాల్.
బొకారో స్టీల్ ప్లాంట్ జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో ఉంది. ఇది 1964లో సోవియట్ యూనియన్ (USSR) సహకారంతో నిర్మించబడిన భారతదేశంలోని నాల్గవ ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం. మిగతా ఆప్షన్లలో: ఛత్తీస్‌గఢ్‌లో భిలాయ్, పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూర్, మరియు ఒడిశాలో రూర్కెలా ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి.
పర్వతాల అధ్యయన శాస్త్రాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
ఆర్నిథాలజీ.
ఆంకోలజీ.
పెడాలజీ.
ఓరాలజీ.
పర్వతాల పుట్టుక, నిర్మాణం మరియు వాటి భౌగోళిక లక్షణాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓరాలజీ (Orology) అంటారు. మిగిలిన ఆప్షన్లలో: ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి, ఆంకోలజీ అంటే క్యాన్సర్ గురించి, మరియు పెడాలజీ అంటే నేలల (మట్టి) గురించి చేసే అధ్యయనం.
విటమిన్-B1 (థయామిన్) లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
పెల్లాగ్రా.
స్కర్వీ.
రికెట్స్.
బెరి-బెరి.
విటమిన్-B1 (థయామిన్) లోపం వల్ల నాడీ వ్యవస్థ, గుండె మరియు కండరాలపై ప్రభావం చూపే బెరి-బెరి వ్యాధి వస్తుంది. మిగతా వాటిలో పెల్లాగ్రా (విటమిన్-B3), స్కర్వీ (విటమిన్-C) మరియు రికెట్స్ (విటమిన్-D) లోపం వల్ల కలుగుతాయి.
బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఎక్కడ కలదు?
కోల్‌కతా.
హైదరాబాద్.
బెంగళూరు.
ముంబై.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న ఈ మ్యూజియం భారతదేశంలోనే మొట్టమొదటి సైన్స్ మ్యూజియం. దీనిని 1959లో స్థాపించారు. ఇది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (NCSM) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
"షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా" అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
మహారాష్ట్ర.
ఆంధ్రప్రదేశ్.
పంజాబ్.
ఉత్తరప్రదేశ్.
భారతదేశంలో అత్యధికంగా చెరకు మరియు పంచదారను ఉత్పత్తి చేస్తున్నందున ఉత్తరప్రదేశ్‌ను "షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా (భారతదేశ పంచదార పాత్ర)" అని పిలుస్తారు. ప్రపంచ స్థాయిలో అత్యధికంగా పంచదారను ఉత్పత్తి చేసే క్యూబా దేశాన్ని "షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్" అని పిలుస్తారు.
భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి ఉండవలసిన కనీస వయో పరిమితి ఎంత?
25 సంవత్సరాలు.
30 సంవత్సరాలు.
35 సంవత్సరాలు.
40 సంవత్సరాలు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తికి కనీసం 35 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్ పదవులకు కూడా ఇదే వయోపరిమితి వర్తిస్తుంది. మిగతా ఆప్షన్లలో: లోక్‌సభ సభ్యులకు / విధానసభ సభ్యులకు (MLA) 25 ఏళ్లు, రాజ్యసభ సభ్యులకు / విధాన పరిషత్ సభ్యులకు (MLC) 30 ఏళ్లు కనీస వయోపరిమితిగా నిర్ణయించబడింది.
అజంతా గుహలు ఏ రాష్ట్రంలో కలవు?
మహారాష్ట్ర.
మధ్యప్రదేశ్.
గుజరాత్.
కర్ణాటక.
అజంతా గుహలు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) జిల్లాలో ఉన్నాయి. ఇవి వాఘోరా నది తీరాన, గుర్రపు నాడా ఆకారంలో ఉన్న కొండలను తొలిచి నిర్మించిన సుమారు 30 రాక్-కట్ బౌద్ధ గుహలు. 1983లో యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఎవరు?
బాన్ కీ మూన్.
కోఫీ అన్నన్.
ఆంటోనియో గుటెర్రెస్.
డా. బౌత్రోస్ ఘలి.
పోర్చుగల్ మాజీ ప్రధాని అయిన ఆంటోనియో గుటెర్రెస్, 2017 నుండి ఐక్యరాజ్యసమితి 9వ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన రెండో విడత పదవీ కాలంలో కొనసాగుతున్నారు, ఈ పదవిలో ఆయన 2026 డిసెంబర్ 31 వరకు ఉంటారు.
పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
ఎపికల్చర్.
సెరికల్చర్.
పిసికల్చర్.
విటికల్చర్.
పట్టు పురుగులను పెంచి, వాటి నుండి పట్టును ఉత్పత్తి చేసే విధానాన్ని సెరికల్చర్ అని పిలుస్తారు. మిగిలిన ఆప్షన్లలో: ఎపికల్చర్ అంటే తేనెటీగల పెంపకం, పిసికల్చర్ అంటే చేపల పెంపకం మరియు విటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం.
'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
హైదరాబాద్.
చెన్నై.
బెంగళూరు.
పూణే.
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో IT కంపెనీలు మరియు స్టార్టప్‌లకు నిలయం కావడంతో బెంగళూరు నగరాన్ని 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న అసలైన 'సిలికాన్ వ్యాలీ' తరహాలోనే ఇక్కడ కూడా సాంకేతిక అభివృద్ధి వేగంగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.
రోమ్ నగరం ఏ నది ఒడ్డున కలదు?
థేమ్స్.
టైబర్.
టైగ్రిస్.
హడ్సన్.
ఇటలీ రాజధాని అయిన రోమ్ నగరం టైబర్ నది ఒడ్డున విస్తరించి ఉంది. మిగిలిన ఆప్షన్లలో లండన్ (థేమ్స్), బాగ్దాద్ (టైగ్రిస్) మరియు న్యూయార్క్ (హడ్సన్) నదీ తీరాలలో ఉన్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత ఎంత?
312.
382.
412.
212.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 312, కాగా భారతదేశ సగటు జనసాంద్రత 382 గా ఉంది. తెలంగాణలో అత్యధిక జనసాంద్రత గల జిల్లా హైదరాబాద్ కాగా, అత్యల్ప జనసాంద్రత గల జిల్లా ములుగు (గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా).
“ఇంక్విలాబ్ జిందాబాద్” అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
భగత్ సింగ్.
సుభాష్ చంద్రబోస్.
వి.డి. సావర్కర్.
చంద్రశేఖర్ ఆజాద్.
ఈ నినాదాన్ని మొదట మౌలానా హస్రత్ మోహానీ రూపొందించగా, భగత్ సింగ్ దీనిని భారత స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత ప్రాచుర్యంలోకి తెచ్చారు. మిగతా వారిలో: సుభాష్ చంద్రబోస్ (జై హింద్); వి.డి. సావర్కర్ (హిందూ-పద్-పాదషాహి); చంద్రశేఖర్ ఆజాద్ (ఆజాద్ హీ రహేంగే) నినాదాలిచ్చారు.
జోరాష్ట్రియన్ల పవిత్ర మత గ్రంథం ఏది?
అనలెక్ట్స్.
జెండ్ అవెస్టా.
తావో-టి-చింగ్.
తల్ముద్ మరియు మిద్రాష్.
జోరాష్ట్రియన్ల (పార్సీల) పవిత్ర గ్రంథమైన 'జెండ్ అవెస్టా'లో ప్రవక్త జొరాస్టర్ బోధనలు ఉంటాయి. ఇతర ఆప్షన్లను గమనిస్తే: అనలెక్ట్స్ (కన్ఫ్యూషియానిజం), తావో-టి-చింగ్ (తావోయిజం), మరియు తల్ముద్/మిద్రాష్‌లు యూదు మతానికి (జుడాయిజం) సంబంధించినవి.
భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?
డా. రాజేంద్ర ప్రసాద్.
వి.వి. గిరి.
జాకీర్ హుస్సేన్.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా (1952-1962) మరియు రెండవ రాష్ట్రపతిగా (1962-1967) పని చేశారు. ఆయన గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాము. డా. రాజేంద్ర ప్రసాద్ తొలి రాష్ట్రపతిగా, జాకీర్ హుస్సేన్ తొలి ముస్లిం రాష్ట్రపతిగా మరియు వి.వి. గిరి నాలుగవ రాష్ట్రపతిగా పనిచేశారు.
టెలీఫోన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
థామస్ అల్వా ఎడిసన్.
మార్కోని.
అలెగ్జాండర్ గ్రాహం బెల్.
జె. యల్. బైయర్డ్.
టెలీఫోన్‌ను 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ కనుగొన్నారు. మిగిలిన వారిలో: థామస్ అల్వా ఎడిసన్ (విద్యుత్ బల్బు)ను, మార్కోని (రేడియో)ను మరియు జె.ఎల్. బైయర్డ్ (టెలివిజన్‌)ను కనుగొన్నారు.
మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది?
థైరాయిడ్.
పిట్యూటరీ.
కాలేయం.
క్లోమం.
మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద గ్రంథి మరియు అత్యంత బరువైన అంతర్గత అవయవం. ఇది జీర్ణక్రియకు అవసరమైన పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. మిగిలిన వాటిలో: పిట్యూటరీ (మాస్టర్ గ్లాండ్) అతిచిన్న గ్రంథి, థైరాయిడ్ మెడ భాగంలో ఉండే అతిపెద్ద వినాళ గ్రంథి, మరియు క్లోమం మిశ్రమ గ్రంథి.
"గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అని ఎవరిని పిలుస్తారు?
బాల గంగాధర్ తిలక్.
దాదాబాయి నౌరోజీ.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
లాలా లజపతి రాయ్.
దాదాబాయి నౌరోజీని "గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు మరియు ఈయన బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు. మిగిలిన వారిలో బాల గంగాధర్ తిలక్‌ను 'లోకమాన్య' అని, సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను 'ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని, లాలా లజపతి రాయ్‌ను 'పంజాబ్ కేసరి' అని పిలుస్తారు.
తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
కుంటాల జలపాతం.
పొచ్చెర జలపాతం.
గాయత్రి జలపాతం.
కనకాయ జలపాతం.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కడెం నదిపై ఉన్న కుంటాల జలపాతం సుమారు 147 అడుగుల (45 మీటర్లు) ఎత్తుతో తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా పేరుగాంచింది. ఈ జిల్లాలోనే పొచ్చెర మరియు గాయత్రి జలపాతాలు కూడా ఉన్నాయి. ములుగు జిల్లాలోని బొగత జలపాతం తెలంగాణలో రెండవ అతిపెద్ద జలపాతంగా ప్రసిద్ధి చెందింది.
భారత జాతీయ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎంత?
3:2
2:3
3:4
4:3
భారత జాతీయ పతాకం (త్రివర్ణ పతాకం) పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి ఎల్లప్పుడూ 3:2 గా ఉండాలి. దీనిని పింగళి వెంకయ్య గారు రూపొందించారు మరియు దీనిని 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీని మధ్యలో ఉండే ధర్మ చక్రంలో 24 ఆకులు (spokes) ఉంటాయి.
థామస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
టెన్నిస్.
టేబుల్ టెన్నిస్.
హాకీ.
బ్యాడ్మింటన్.
థామస్ కప్ ప్రపంచ పురుషుల బ్యాడ్మింటన్ జట్ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కాగా, దీనికి సమానమైన మహిళల టోర్నమెంట్‌ను ఉబెర్ కప్ అంటారు. 2022లో భారత పురుషుల జట్టు మొదటిసారి థామస్ కప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య ఎంత?
31.
32.
33.
34.
2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. 2016లో కొత్తగా 21 జిల్లాలు ఏర్పడటంతో ఆ సంఖ్య 31కి చేరింది. ఆ తర్వాత 2019లో నారాయణపేట మరియు ములుగు జిల్లాలను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరుకుంది.
భారత్ మరియు చైనా మధ్య గల సరిహద్దు రేఖ ఏది?
రాడ్‌క్లిఫ్ రేఖ.
మక్‌మోహన్ రేఖ.
డ్యూరాండ్ రేఖ.
మాజినాట్ రేఖ.
భారత్ మరియు చైనా దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖను మక్‌మోహన్ రేఖ అని పిలుస్తారు. దీనిని 1914లో బ్రిటీష్ ఇండియా అధికారి హెన్రీ మక్‌మోహన్ ప్రతిపాదించారు. మిగిలిన ఆప్షన్లలో: రాడ్‌క్లిఫ్ రేఖ భారత్-పాకిస్తాన్ మధ్య; డ్యూరాండ్ రేఖ పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య; మాజినాట్ రేఖ ఫ్రాన్స్-జర్మనీ మధ్య ఉన్నాయి.
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
జెనీవా (స్విట్జర్లాండ్).
పారిస్ (ఫ్రాన్స్).
వియన్నా (ఆస్ట్రియా).
ద హేగ్ (నెదర్లాండ్స్).
ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన న్యాయ విభాగమైన అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) నెదర్లాండ్స్‌లోని “ద హేగ్” నగరంలోని 'పీస్ ప్యాలెస్'లో ఉంది. ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు ప్రధాన విభాగాలలో అమెరికాలోని న్యూయార్క్ వెలుపల ఉన్న ఏకైక విభాగం ఇదే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
సరోజినీ నాయుడు.
రాజకుమారి అమృత్ కౌర్.
విజయలక్ష్మి విశ్వనాథన్.
విజయలక్ష్మి పండిట్.
జవహర్‌లాల్ నెహ్రూ సోదరి అయిన విజయలక్ష్మి పండిట్ 1953లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ మరియు తొలి భారతీయ వ్యక్తి. ఆప్షన్లలో ఉన్న సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ; రాజకుమారి అమృత్ కౌర్ స్వతంత్ర భారత తొలి ఆరోగ్య శాఖ మంత్రి; విజయలక్ష్మి విశ్వనాథన్ భారత రైల్వే బోర్డులో తొలి మహిళా సభ్యురాలు.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు?
బచేంద్రి పాల్.
సంతోష్ యాదవ్.
అరుణిమ సిన్హా.
ప్రేమలత అగర్వాల్.
బచేంద్రి పాల్ 1984లో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. సంతోష్ యాదవ్ ఎవరెస్టును రెండుసార్లు అధిరోహించిన తొలి భారతీయ మహిళ; అరుణిమ సిన్హా ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచపు తొలి దివ్యాంగురాలు; ప్రేమలత అగర్వాల్ 7 ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయ మహిళ.
భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?
సింధు నది.
బ్రహ్మపుత్ర నది.
గంగా నది.
గోదావరి నది.
భారతదేశంలో ప్రవహించే నదులలో గంగా నది సుమారు 2,525 కి.మీ.తో అత్యంత పొడవైనది. సింధు మరియు బ్రహ్మపుత్ర నదులు గంగా నది కంటే పొడవైనవి అయినప్పటికీ, వాటి ప్రవాహంలో ఎక్కువ భాగం ఇతర దేశాలలో ఉండగా, భారతదేశం లోపల ఎక్కువ దూరం ప్రవహించే నది మాత్రం గంగానది. దక్షిణ భారతదేశంలో అతి పొడవైన నది గోదావరి.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


TG High Court Office Subordinate and Process Server - Model Paper 3

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top