TS TET Paper 2 Social 29 June 2025 (Shift-2) Psychology Previous Year Question Paper – Free Online Test


30 ప్రశ్నలు (Qns)
30 నిమిషాలు (Mins)
30 మార్కులు (Marks)

ముఖ్యమైన సూచనలు (Instructions):

  • Syllabus: ఈ Test లో Psychology 24 ప్రశ్నలు మరియు Pedagogy 6 ప్రశ్నలు ఉన్నాయి.
  • Exam Pattern: ఇది 29th June 2025 TS TET Social Paper- 2 (Shift-2) Psychology Subject అధికారిక ప్రశ్నాపత్రము.
  • Solved: ప్రతి ప్రశ్నకు ఆన్సర్లతో పాటు క్లియర్ వివరణ (Detailed Explanations) ఇవ్వడం జరిగింది.
  • Analysis: మీ స్కోర్ ను మరియు Preparation స్థాయిని వెంటనే సమీక్షించుకోవచ్చును.
  • Speed: 30 ప్రశ్నలను నిర్దేశిత సమయం (30 నిమిషాల) కంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని మరింత మెరుగుపరుచుకోండి.
  • Negative Marks: ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండవు.
Start Psychology Test

మీ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించండి – withchari.in

Question 1 of 30
🟢 0 🔴 0
30:00
పునశ్చరణ' ఇందులో భాగం: A) పాఠ్య ప్రణాళిక. B) యూనిట్ ప్రణాళిక. C) వార్షిక ప్రణాళిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
C మాత్రమే.
B మాత్రమే.
A మాత్రమే.
A, B & C.
ఒక పీరియడ్‌లో బోధించిన అంశాలను విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవడానికి పాఠం చివరలో చేసే ప్రక్రియను పునశ్చరణ అంటారు. ఇది నిర్దిష్టమైన ఒక పాఠానికి సంబంధించి ఉంటుంది, కాబట్టి ఇది పాఠ్య ప్రణాళిక లో ఒక ముఖ్యమైన సోపానం.
జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 కింద స్థాపించబడిన జువెనైల్ జస్టిస్ బోర్డులు ఏవి?
జిల్లా స్థాయి సంస్థలు.
రాష్ట్ర స్థాయి సంస్థలు.
జాతీయ స్థాయి సంస్థలు.
బ్లాక్ స్థాయి సంస్థలు.
జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం చట్టాన్ని అతిక్రమించిన పిల్లల కేసులను విచారించడానికి ప్రతి జిల్లాలో ఒక జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో ఒక మెజిస్ట్రేట్ మరియు ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.
ఏ రకమైన మంత్రణంలో, మంత్రణం పొందే వ్యక్తి తక్షణ దృష్టిని పొందుతాడు మరియు సమస్యకు పరిష్కారాన్ని ఒక నిపుణుని నుండి పొందుతాడు?
నిర్దేశిత (Directive).
అనిర్దేశిత (Non-directive).
ఎక్లెక్ట్రిక్ (Eclectic).
నివారణాత్మక (Preventive).
నిర్దేశిత మంత్రణంలో మంత్రణకుడు (Counselor - సలహా ఇచ్చే నిపుణుడు) క్రియాశీల పాత్ర పోషిస్తాడు. సమస్యను విశ్లేషించి, దానికి తగిన పరిష్కారాన్ని నేరుగా మంత్రణార్థికి (Counselee - సలహా తీసుకునే వ్యక్తి) సూచిస్తాడు. ఇక్కడ మంత్రణార్థి కంటే మంత్రణకుడి నిర్ణయానికే అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.
బండూరా ప్రకారం బలమైన స్వీయ-సమర్థత భావాన్ని పెంపొందించడంలో ఈ క్రింది వాటిలో ఏది సహాయపడదు?
తక్కువ ఆత్మవిశ్వాసం.
ఒక పనిని విజయవంతంగా నిర్వహించడం.
ఇతర వ్యక్తులు ఒక పనిని విజయవంతంగా పూర్తి చేయడాన్ని చూడటం.
ఇతరుల నుండి సానుకూల మరియు ప్రోత్సాహకరమైన స్టేట్‌మెంట్లు.
ఆల్బర్ట్ బండూరా ప్రకారం 'స్వీయ-సమర్థత' అంటే ఒక పనిని తాను చేయగలననే నమ్మకం. విజయాలు, ఇతరులను చూసి నేర్చుకోవడం మరియు ప్రోత్సాహం దీనిని పెంచుతాయి. అయితే తక్కువ ఆత్మవిశ్వాసం అనేది స్వీయ-సమర్థతను దెబ్బతీస్తుంది తప్ప పెంపొందించదు.
కింది వాటిలో ఏది రక్షక తంత్రానికి ఉదాహరణ కాదు?
భాషలో చాలా పేలవమైన నైపుణ్యాలు కలిగిన కపిల్ ఒక ప్రముఖ శాస్త్రవేత్త అయ్యాడు.
USA కి వీసా తిరస్కరించబడ్డ కబీర్ 'ఎలాగు తన గమ్యస్థానాన్ని వేరే దేశానికి మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నాను' అని అన్నాడు.
తన పాఠశాల రోజుల్లో జరిగిన బస్సు ప్రమాదంలో తన స్నేహితుడిని కోల్పోయిన కోకిల ఆ బస్సు ప్రమాదాన్ని మరచిపోవడం.
కాలేజ్ 'A' లో అడ్మిషన్ పొందలేకపోయిన కశ్యప్ కాలేజ్ 'B' లో అడ్మిషన్ తీసుకున్నాడు.
మొదటి మూడు ఆప్షన్లు మనస్సును సమాధానపరుచుకోవడానికి వాడే రక్షక తంత్రాలు (1. పరిహారం, 2. హేతుబద్ధీకరణ, 3. దమనం). కాని నాల్గవ ఆప్షన్ కేవలం ఒక ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడం అనే సామాన్యమైన నిర్ణయం మాత్రమే, ఇందులో ఎటువంటి రక్షక తంత్రం లేదు.
ఒక రాష్ట్రం పాఠశాల విద్యా ప్రణాళికలో కోడింగ్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి ICT కోర్సులను ప్రవేశపెట్టింది. ఇక్కడ ICTని ఎలా ఉపయోగిస్తున్నారు?
మదింపు కోసం.
అధ్యయన వస్తువుగా.
బోధనాభ్యసన ప్రక్రియను మెరుగుపరచడానికి.
వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి.
కోడింగ్ మరియు వెబ్ డెవలప్‌మెంట్ వంటివి కేవలం పాఠాలు మాత్రమే కావు, అవి ఒక నైపుణ్యం. వీటిని నేర్పించడం వల్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉద్యోగాలు సంపాదించడానికి లేదా సొంతంగా ఎదగడానికి అవసరమైన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పొందుతారు.
కింది వాటిలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం (NCF) 2005లో నిర్దేశించిన విధంగా ఉపాధ్యాయ తయారీకి సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి?
స్వీకరించే తత్త్వం కలిగి ఉండి నిరంతరం నేర్చుకుంటూ వుండడం.
పిల్లల కంటే వారి స్వంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం.
సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉండడం.
పిల్లల పట్ల శ్రద్ధ వహించడం మరియు వారితో ఉండటానికి ఇష్టపడడం.
NCF-2005 ప్రకారం, ఉపాధ్యాయుడు విద్యార్థి కేంద్రీకృత బోధనను అనుసరించాలి. ఉపాధ్యాయుడు ఎప్పుడూ పిల్లల అభ్యసనానికి మరియు వారి సర్వతోముఖాభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తన స్వంత అభివృద్ధి కంటే పిల్లల ప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇవ్వడం ఉపాధ్యాయుని ప్రధాన బాధ్యత.
దక్ష అనే చిన్న అమ్మాయి తన తల్లితో “నిన్నటి మామిడి పండు తియ్యగా ఉంది కానీ నేడు పుల్లగా ఉంది. కాబట్టి మామిడి పండ్లు తియ్యగా లేదా పుల్లగా ఉండవచ్చు” అని చెబుతోంది. పియాజె సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఏ దశ నుండి పిల్లలు ఇలాంటి నిగమనాత్మక వివేచనం ప్రారంభిస్తారు?
అమూర్త ప్రచాలక దశ.
మూర్త ప్రచాలక దశ.
అంతర్బుద్ధి దశ.
పూర్వ భావనాత్మక దశ.
పియాజె ప్రకారం 7-11 ఏళ్ల మధ్య ఉండే మూర్త ప్రచాలక దశలో పిల్లలు తాము చూసిన లేదా అనుభవించిన విషయాల ఆధారంగా తార్కికంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇక్కడ దక్ష తాను రుచి చూసిన పండ్ల ఆధారంగా ఒక సామాన్యీకరణకు రావడం ఈ దశలోని తార్కిక వివేచనను సూచిస్తుంది.
చార్మి తన తరగతిలో ప్రవర్తనా సమస్యలు తలెత్తకుండా చూసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కొత్త తరగతికి వెళ్ళిన మొదటి రోజు నుండే ఆమె పిల్లలను జాగ్రత్తగా గమనించి, విద్యార్థులు చూపిన మంచి ప్రవర్తనను పునర్బలనం చేయడానికి బహుమతినిచ్చి ఇతర విద్యార్థులు బాగా ప్రవర్తించడానికి ప్రేరేపించే విధంగా చేయడం ఆమె ఉపయోగించే టెక్నిక్. ఇక్కడ చార్మి అనుసరించిన చర్య ఏమిటి?
శిక్షాత్మక.
సహాయక.
దిద్దుబాటు.
నివారణ.
సమస్యలు తలెత్తిన తర్వాత సరిదిద్దడం కంటే, అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడాన్ని నివారణ (Preventive) చర్య అంటారు. చార్మి మొదటి రోజు నుండే మంచి ప్రవర్తనను ప్రోత్సహించడం ద్వారా క్రమశిక్షణారాహిత్యం కలగకుండా నిరోధిస్తోంది, కాబట్టి ఇది నివారణా పద్ధతి కిందకు వస్తుంది.
ఒక విద్యార్థి మొదట 'P' అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. ఆ తరువాత 'Q' అనే పద్యాన్ని నేర్చుకున్నాడు. అతను Q అనే పద్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనుకున్నప్పుడు, P అనే పద్యం జోక్యం చేసుకుంటోంది. ఇది ఏ రకమైన అవరోధం?
పురోగమన.
తిరోగమన.
క్షయం.
అనారోగ్యకరమైన.
పాత అభ్యాసం (పద్యం P) కొత్త అభ్యాసాన్ని (పద్యం Q) గుర్తుకు తెచ్చుకోవడంలో అడ్డుపడితే/జోక్యం చేసుకుంటే దానిని పురోగమన అవరోధం (Proactive Interference) అంటారు. ఒకవేళ కొత్తగా నేర్చుకున్నది పాత దానిని మర్చిపోయేలా చేస్తే దానిని 'తిరోగమన అవరోధం' (Retroactive Interference) అంటారు.
ఒక వ్యక్తి ఆశించిన విధంగా అభ్యసించడం లేదని అనిపిస్తే, సమస్య బహుశా ఇందులో ఉంటుంది: A) లక్ష్య దిశ. B) ప్రేరణ. C) అనుభవం. D) శిక్షణ. సరైన వాటిని ఎంచుకోండి?
A, B & C మాత్రమే.
A, B, C, D.
B, C & D మాత్రమే.
A, C & D మాత్రమే.
అభ్యసన ప్రక్రియ విజయవంతం కావడానికి సరైన లక్ష్యం, తగిన ప్రేరణ, పూర్వ అనుభవాలు మరియు సరైన శిక్షణ అనేవి అత్యంత కీలకం. వీటిలో ఏ ఒక్కటి లోపించినా లేదా సరిగా లేకపోయినా వ్యక్తి ఆశించిన స్థాయిలో అభ్యసించలేడు.
అభ్యసన విజయం మరియు వైఫల్యం వీటిపై ఆధారపడి ఉంటుంది: A) అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నాణ్యత. B) అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల నియంత్రణ మరియు నిర్వహణ. సరైన వాటిని ఎంచుకోండి?
A & B రెండూ.
A మాత్రమే.
B మాత్రమే.
A, B రెండూ కాదు.
అభ్యసనానికి అవసరమైన వనరుల నాణ్యత ఉండటంతో పాటు, వాటిని సరిగ్గా ఉపయోగించుకునే నియంత్రణ కూడా ఉండాలి. ఈ రెండూ సక్రమంగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసనంలో విజయం సాధిస్తాడు.
ఎనిమిదేళ్ల నితిన్ క్రికెట్ కోచింగ్‌లో చేరాలని అనుకుంటున్నాడు. చదువు మరియు క్రికెట్ మధ్య ఎలా సంతులనం చేయాలనుకుంటున్నది ఒక షెడ్యూల్ చేసి తన తండ్రికి చూపించి, ఒప్పించాలనుకున్నాడు. ఇది అతని వయస్సుకు తగిన మానసిక వికాసం యొక్క ఏ లక్షణానికి ఉదాహరణ?
అపరిపక్వత.
ఆధారపడటం.
అనుకూలత.
వివేచన లోపించడం.
తన లక్ష్యం (క్రికెట్) కోసం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చదువును, క్రీడను సమన్వయం చేసుకుంటూ షెడ్యూల్ రూపొందించుకోవడం నితిన్ యొక్క అనుకూలతను సూచిస్తుంది. ఇది సమస్యలను పరిష్కరించుకుంటూ తన అవసరాలకు తగ్గట్లుగా ప్రవర్తనను మార్చుకునే వికాస లక్షణం.
స్వీయ భావన అనేది తన గురించి తాను వీటి ఆధారంగా చేసుకొనే నిర్ధారణ: A) ఒకరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల నుండి వచ్చే అభిప్రాయం. B) ఒకరి అనుభవాలు. సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
A కాదు B కాదు.
A మాత్రమే.
B మాత్రమే.
A & B రెండూ.
స్వీయ భావన (Self-concept) అనేది ఒక వ్యక్తి తన గురించి తాను పొందే అనుభవాలు మరియు సమాజం లేదా కుటుంబ సభ్యుల నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఏర్పడుతుంది. వ్యక్తిగత విజయాలు లేదా వైఫల్యాలతో పాటు ఇతరుల గుర్తింపు కూడా ఈ భావనను ప్రభావితం చేస్తాయి.
కింది స్టేట్‌మెంట్లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. A) సాంఘిక మరియు సాంస్కృతిక సమూహంలో ప్రబలంగా ఉన్న జీవన విధానాల స్వభావం ద్వారా వికాస కృత్యాలు ప్రభావితమవుతాయి. B) తక్కువ సాంఘిక ఆర్థిక స్థితి ఉన్న పిల్లలు, ఉన్నత సాంఘిక ఆర్థిక స్థితి ఉన్న వారి కంటే త్వరగా ఇంటి కార్యకలాపాల్లో పాల్గొంటారు.
A మరియు B రెండూ సరికావు.
A సరైనది మరియు B కి సరైన వివరణను అందించదు.
A సరికాదు.
A సరైనది మరియు B కి సరైన వివరణను అందిస్తుంది.
పిల్లలు నేర్చుకునే పనులు వారి సామాజిక, ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటాయని ఈ స్టేట్‌మెంట్లు వివరిస్తున్నాయి. సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల తక్కువ ఆర్థిక స్థితి ఉన్న పిల్లలు బాధ్యతలను త్వరగా స్వీకరిస్తారని స్టేట్‌మెంట్ B, స్టేట్‌మెంట్ Aకు ఉదాహరణగా నిలుస్తుంది.
తరగతి గది వైవిధ్యాన్ని ఎదుర్కోవడానికి ఈ క్రింది వాటిలో ఏది ఒక వ్యూహం కాదు?
సహకార మరియు సహభాగి అభ్యసనం.
సామాన్య బోధన.
సారువ (Scaffolding).
వైవిధ్యాన్ని గుర్తించడం మరియు పాఠ్యాంశాలను పునఃరూపకల్పన చేయడం.
తరగతిలో విద్యార్థులు వేర్వేరు సామర్థ్యాలు కలిగి ఉంటారు. అందరికీ ఒకే రకమైన సామాన్య బోధన చేయడం వల్ల వారి వ్యక్తిగత అవసరాలు తీరవు. వైవిధ్యాన్ని ఎదుర్కోవాలంటే బోధనలో మార్పులు ఉండాలి తప్ప, అందరికీ ఒకే మూస పద్ధతి (సామాన్య బోధన) సరిపోదు.
పెరుగుదల మరియు వికాస సూత్రాలకు అనుగుణంగా కింది వాటిలో ఏది సరైనది?
వికాసం యొక్క వివిధ అంశాలైన శారీరక, సాంఘిక, ఉద్వేగ మరియు బౌద్ధికం పరస్పరం ఆధారపడి ఉంటాయి.
వ్యక్తి వికాసం కౌమార దశతో ఆగిపోతుంది.
ప్రస్తుత సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా మనం పిల్లల భవిష్యత్తు సాధనను అంచనా వేయలేము.
ఒక వ్యక్తి వికాసం స్థిరమైన వేగంతో రేఖీయ మార్గంలో జరుగుతుంది.
వికాసం అనేది ఒక పరస్పర సంబంధిత ప్రక్రియ. దీనిలో శారీరక మార్పులు ఇతర మానసిక మరియు సామాజిక అంశాల అభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఒక రంగంలో జరిగే వికాసం మిగిలిన రంగాల వికాసానికి దారితీస్తుందని ఈ 'పరస్పర సంబంధిత సూత్రం' వివరిస్తుంది.
ఒక సందర్భంలో అభ్యసించినది మరొక సందర్భంలో ఎటువంటి ప్రభావాన్ని చూపనప్పుడు దానిని ఏమంటారు?
ప్రతికూల బదలాయింపు.
సానుకూల బదలాయింపు.
శూన్య బదలాయింపు.
సరికాని బదలాయింపు.
ఒక రంగంలో నేర్చుకున్న జ్ఞానం లేదా నైపుణ్యం, మరొక రంగంలో అభ్యసనానికి సహాయపడకపోయినా లేదా ఆటంకం కలిగించకపోయినా దానిని శూన్య బదలాయింపు (Zero Transfer) అంటారు. ఉదాహరణకు, క్రికెట్ ఆడటం నేర్చుకోవడం అనేది చరిత్ర పాఠాన్ని చదవడంపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు.
వికాసం యొక్క కింది అంశాలలో పరిపక్వత దీనిపై ప్రభావం చూపుతుంది: A) శారీరక. B) మానసిక. C) ఉద్వేగ. D) సాంఘిక. సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
A, B & D మాత్రమే.
A, B, C & D.
A, B & C మాత్రమే.
A, C & D మాత్రమే.
పరిపక్వత అనేది కేవలం శారీరక మార్పులకే పరిమితం కాకుండా, మెదడు అభివృద్ధి ద్వారా మానసిక, ఉద్వేగ మరియు సామాజిక ప్రవర్తనలలో మార్పులకు కారణమవుతుంది. వికాసం యొక్క అన్ని రంగాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉండటం వల్ల, పరిపక్వత ఈ నాలుగింటిపై ప్రభావం చూపుతుంది.
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదైనా ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను చూపినప్పుడు, అలాంటి ప్రవర్తన నుండి వారిని ఆపడానికి వారిపై అరుస్తారు. ఇది ఏ విధమైన అభ్యసనానికి ఒక ఉదాహరణ?
యత్నదోష.
అంతర్దృష్టి.
నిబంధన.
పరిశీలన.
పిల్లల తప్పు ప్రవర్తనకు మరియు తల్లిదండ్రుల అరుపులకు మధ్య ఒక సంబంధం ఏర్పడటాన్ని నిబంధన (Conditioning)అంటారు. అరుపుల వల్ల కలిగే భయం కారణంగా పిల్లలు ఆ ప్రవర్తనను ఆపివేయడం నేర్చుకుంటారు. ఇది కార్యసాధక నిబంధనలో 'శిక్ష' అనే అంశానికి చెందుతుంది.
ఈ క్రింది వాటిలో 16 నుండి 20 సంవత్సరాల వయస్సులో ఆగిపోయే దానిని గుర్తించండి?
జ్ఞానం యొక్క సముపార్జన.
సాధన.
ప్రజ్ఞ యొక్క నిలువు పెరుగుదల.
నైపుణ్యాల సముపార్జన.
సాధారణంగా వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం లేదా ప్రజ్ఞ అనేది సుమారు 16 నుండి 20 ఏళ్ల వయస్సు నాటికి గరిష్ట స్థాయికి చేరుకుని, అక్కడితో దాని నిలువు పెరుగుదల ఆగిపోతుంది. అయితే, ఆ ప్రజ్ఞను ఉపయోగించి కొత్త విషయాలను నేర్చుకోవడం (జ్ఞానం మరియు నైపుణ్యాల సముపార్జన) అనేది జీవితాంతం కొనసాగుతుంది.
వైకల్యతలున్న వ్యక్తుల హక్కుల చట్టం (RPwD) 2016 ప్రకారం, వైకల్యతలు సంభవించకుండా నిరోధించడానికి,సంబంధిత ప్రభుత్వం పిల్లలందరినీ కనీసం ఎంత కాలానికి ఒక్కసారైనా "ప్రమాదకర” కేసులను గుర్తించే ఉద్దేశ్యంతో పరీక్షించాలి?
ఒక సంవత్సరం.
రెండు సంవత్సరాలు.
మూడు సంవత్సరాలు.
నాలుగు సంవత్సరాలు.
RPwD చట్టం 2016 ప్రకారం, వైకల్యాలను ముందుగానే గుర్తించి నివారించడంలో భాగంగా, ప్రమాదకర స్థితిలో ఉన్న పిల్లలను గుర్తించడానికి సంబంధిత ప్రభుత్వం కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
బ్రూనర్ సూచించిన ఆవిష్కరణ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి, ఉపాధ్యాయుడు ఏమి చేయాలి?
వినూత్న ఆలోచనలకుగాను విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలి.
తరగతి గదిలో విద్యార్థులు ప్రశ్నించడాన్ని విస్మరించాలి.
అధికారం ద్వారా విద్యార్థుల ఉత్సుకతను నిరోధించాలి.
పాఠ్యపుస్తకాన్ని మాత్రమే అనుసరించాలి.
జెరోమ్ బ్రూనర్ సిద్ధాంతం ప్రకారం, విద్యార్థులు తమంతట తాముగా విషయాలను కనిపెట్టడాన్ని (Discovery Learning) ప్రోత్సహించాలి. విద్యార్థులు కొత్తగా ఆలోచించినప్పుడు లేదా సందేహాలు అడిగినప్పుడు వారిని మెచ్చుకోవడం లేదా బహుమతులు ఇవ్వడం ద్వారా వారిలో నేర్చుకోవాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది.
తరగతి గదిలో కృత్యాధార అభ్యసనాన్ని ఉపయోగించడంలో కింది వాటిలో సవాలుగా అనిపించేవి ఏవి? A) సౌకర్యాలను అందించడం. B) విద్యార్థుల సంఖ్యాపరంగా పెద్ద తరగతి గది. C) ఎక్కువ సమయం తీసుకుంటుంది. D) అశాస్త్రీయం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
B, C & D మాత్రమే.
A, B, C & D.
A, C & D మాత్రమే.
A, B & C మాత్రమే.
కృత్యాధార అభ్యసనం (Activity Based Learning) అనేది ఒక మంచి శాస్త్రీయ పద్ధతి. అయితే దీనిని అమలు చేయడానికి వనరులు కల్పించడం, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నప్పుడు నిర్వహించడం, సిలబస్ పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టడం వంటివి నిజమైన సవాళ్లు.
కింది వాటిలో ఏది ప్రేరణను కలిగించి మరియు నిలబెట్టడానికి సహాయపడుతుంది?
భయాన్ని కలిగించే వాతావరణం.
అభ్యాసకుడి నిష్క్రియాత్మక పాత్ర.
అభ్యాసకుడి అవసరాలు మరియు ప్రేరకాలకు పని యొక్క ఔచిత్యం.
అస్పష్టమైన లక్ష్యం.
అభ్యసించే అంశం విద్యార్థి యొక్క నిజ జీవిత అవసరాలకు లేదా ఆసక్తులకు సంబంధించి ఉన్నప్పుడు వారిలో సహజంగానే నేర్చుకోవాలనే ఉత్సాహం మరియు ప్రేరణ కలుగుతాయి. భయం లేదా అస్పష్టమైన లక్ష్యాలు అభ్యసనానికి ఆటంకం కలిగిస్తాయి తప్ప ప్రేరణను నిలబెట్టలేవు.
ఒక పరిశోధకుడు 6 నుండి 12 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో సాంఘిక వికాసం అధ్యయనం చేసి, ఒక సంవత్సరం తరువాత జరగనున్న జాతీయ కాన్ఫరెన్స్ లో ఒక పత్రాన్ని సమర్పించాలనుకున్నాడు. కింది వాటిలో పరిశోధకుడు ఉపయోగించాల్సిన ఉత్తమ పద్ధతి ఏది?
వ్యక్తి అధ్యయన.
అనుదైర్ఘ్య.
క్రాస్ సెక్షనల్.
ప్రయోగం.
ఒక సంవత్సరంలోనే ఫలితాలు రావాలి కాబట్టి, వేర్వేరు వయస్సుల వారిని ఒకేసారి పరిశీలించే క్రాస్ సెక్షనల్ పద్ధతే ఈ పరిస్థితిలో ఉత్తమమైనది. సుదీర్ఘ కాలం పట్టే అనుదైర్ఘ్య పద్ధతి కంటే, తక్కువ సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చే ఈ పద్ధతే పరిశోధకుడికి సరైన ఎంపిక అవుతుంది.
తమ విద్యార్థుల విద్యా విషయక నిష్పాదనను ప్రదర్శించే పాఠశాలలు ఏ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది?
మానసిక చలనాత్మక.
సంజ్ఞానాత్మక.
భావావేశ.
చలనాత్మక.
బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం చదువు, జ్ఞాపకశక్తి, మరియు మేధస్సుకు సంబంధించిన అంశాలన్నీ సంజ్ఞానాత్మక రంగంలోక్రి వస్తాయి. విద్యార్థుల విద్యా నిష్పాదన (Academic performance) అనేది వారి జ్ఞానాన్ని, అవగాహనను సూచిస్తుంది, కాబట్టి ఇది సంజ్ఞానాత్మక రంగానికి సంబంధించింది.
ఎరిక్సన్ యొక్క ఏ మనో సాంఘిక వికాస దశలో, ఒక అబ్బాయి లేదా అమ్మాయి పూర్తిగా ఇతరులపై ఆధారపడటం వలన అతను / ఆమె అవసరాల సంతృప్తిని బట్టి ఇతరులపై 'నమ్మకం లేదా అపనమ్మకం' అనే భావనను పెంచుకోవచ్చు?
శైశవం.
బాల్యం.
కౌమారం.
ఎలిమెంటరీ.
ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం శైశవ దశలో ఉండే శిశువు తన అవసరాల కోసం పూర్తిగా సంరక్షకులపై ఆధారపడతాడు. ఈ సమయంలో సరైన సంరక్షణ లభిస్తే నమ్మకం, లేనిచో అపనమ్మకం అనే గుణం ఏర్పడుతుంది.
విజయ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక షాపింగ్ మాల్ కు వెళ్ళాడు. అతని తల్లిదండ్రులు ఏదో చూస్తుండగా విజయ్ ఒక అపరిచితుడితో సంభాషణ ప్రారంభించి, అతను ఏ వైపు నడుస్తున్నాడో చూడకుండా మరియు అతను తన తల్లిదండ్రుల నుండి దూరంగా వెళ్తున్నానని గ్రహించకుండా అతనితో పాటు నడిచాడు. కొంత సమయం తర్వాత ఆ అపరిచితుడు వెళ్ళిపోయాడు మరియు విజయ్ తాను దారి తప్పినట్లు గ్రహించి భయపడ్డాడు. అతను తన తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకున్నాడు మరియు మాల్ లోని అన్ని అంతస్తులలోని దుకాణాలకు పరిగెత్తాడు. అతను అకస్మాత్తుగా తన తల్లిదండ్రులతో కలిసి వచ్చిన దుకాణాన్ని కనుగొన్నాడు మరియు అక్కడ వారిని చూసాడు. విజయ్ యొక్క ఈ యత్న దోష చర్యలో ఉద్దీపన ఏది?
తాను దారి తప్పినట్లు గ్రహించడం.
అంతస్తులలో పైకి క్రిందికి పరిగెత్తడం.
అపరిచితుడితో బయటకు నడవడం.
తల్లిదండ్రులతో తిరిగి కలవాలనుకోవడం.
థార్న్‌డైక్ యత్న దోష అభ్యసన సిద్ధాంతం ప్రకారం, ఏదైనా పని చేయడానికి ప్రేరేపించే లక్ష్యమే ఉద్దీపన (Stimulus). ఇక్కడ విజయ్ అంతస్తులన్నీ తిరగడానికి ప్రధాన కారణం (లక్ష్యం) తన తల్లిదండ్రులను కలవాలనుకోవడమే.
ఒక పాఠశాల, విద్యార్థులు ఉపయోగించేందుకు ఒక అభ్యసన యాప్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో విద్యార్థులు సరైన ప్రతిస్పందన ఇస్తే ప్రశంసల ద్వారా పునర్బలనం చేయడం మరియు తప్పు ప్రతిస్పందనకు కొన్ని నిరాశ సంకేతాలను సూచించడం జరుగుతుంది. స్కిన్నర్ సిద్ధాంతంలో ఈ ప్రక్రియ ఏది?
సాధారణీకరణ.
విచక్షణ.
యత్నదోష.
ప్రయోగం చేయడం.
స్కిన్నర్ కార్యసాధక నిబంధన ప్రకారం, ఉద్దీపనల మధ్య తేడాను గుర్తించి, దేనికి ఎలా ప్రతిస్పందించాలో తెలుసుకోవడాన్ని విచక్షణ (Discrimination) అంటారు. ఇక్కడ యాప్ సరైన సమాధానానికి ఒకలా, తప్పు సమాధానానికి మరోలా స్పందించడం ద్వారా విద్యార్థి ఏది సరైనదో గుర్తించేలా (విచక్షణ చూపేలా) శిక్షణ ఇస్తోంది.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


TS TET Social Paper-II 29th June 2025 (Shift-2) Psychology Subject

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top