TS TET Paper 1 (SGT) Previous Question Paper 20th June 2025 (Shift-1): Psychology Free Online Test


30 ప్రశ్నలు (Qns)
30 నిమిషాలు (Mins)
30 మార్కులు (Marks)

ముఖ్యమైన సూచనలు (Instructions):

  • Syllabus: ఈ Test లో Psychology 24 ప్రశ్నలు మరియు Pedagogy 6 ప్రశ్నలు ఉన్నాయి.
  • Exam Pattern: ఇది 20th June 2025 TS TET Paper-1 (Shift-1) Psychology Subject అధికారిక ప్రశ్నాపత్రము.
  • Solved: ప్రతి ప్రశ్నకు ఆన్సర్లతో పాటు క్లియర్ వివరణ (Detailed Explanations) ఇవ్వడం జరిగింది.
  • Analysis: మీ స్కోర్ ను మరియు Preparation స్థాయిని వెంటనే సమీక్షించుకోవచ్చును.
  • Speed: 30 ప్రశ్నలను నిర్దేశిత సమయం (30 నిమిషాల) కంటే ముందుగానే పూర్తి చేయడం ద్వారా మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని మరింత మెరుగుపరుచుకోండి.
  • Negative Marks: ఈ పరీక్షలో తప్పుడు సమాధానాలకు సంబంధించి ఎలాంటి నెగెటివ్ మార్క్స్ ఉండవు.
Start Psychology Test

మీ ప్రిపరేషన్‌ను ఇప్పుడే ప్రారంభించండి – withchari.in

Question 1 of 30
🟢 0 🔴 0
30:00
కింది వాటిలో ఏది గైర్హాజరుకు ఒక కారణం కాదు?
ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి.
పిల్లల శారీరక మరియు మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం.
తల్లిదండ్రుల ప్రోత్సాహం.
పాఠశాలల్లో నిరంకుశ పరిపాలన.
గైర్హాజరు (Truancy) అంటే విద్యార్థి కావాలని బడికి రాకుండా ఉండటం. దీనికి ఉపాధ్యాయుల ప్రతికూల వైఖరి,అనారోగ్యం లేదా పాఠశాల కఠిన వాతావరణం కారణమవుతాయి. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అనేది విద్యార్థిని బడికి వచ్చేలా ప్రేరేపించే సానుకూల అంశం కాబట్టి,అది గైర్హాజరుకు కారణం కాదు.
ఉష ప్రతి సెషన్ 15 నిమిషాల నిడివిగల పది సెషన్లలో ఒక పాటలోని ఒక చరణము కంఠస్థం చేసింది. అదే పాటలోని రెండవ చరణాన్ని కంఠస్థం చేయడానికి ఆమె అదే నిడివిగల మరో పది సెషన్లు తీసుకుంది. ఇక్కడ జరిగిన అభ్యసన బదలాయింపు ఏది?
చురుకైన బదలాయింపు.
సానుకూల బదలాయింపు.
ప్రతికూల బదలాయింపు.
శూన్య బదలాయింపు.
ఒక అభ్యసనం మరొక అభ్యసనానికి సహాయపడకపోయినా లేదా ఆటంకం కలిగించకపోయినా దానిని శూన్య బదలాయింపు అంటారు. ఇక్కడ ఉష మొదటి చరణాన్ని నేర్చుకోవడం వల్ల రెండవ చరణం నేర్చుకునే వేగంలో మార్పు రాలేదు కాబట్టి, మొదటి అభ్యసన ప్రభావం రెండవ దానిపై ఏమాత్రం లేదని అర్థమవుతోంది.
కేతకి సివిల్ సర్వెంట్ కావాలని కోరుకుంది మరియు పరీక్షకు హాజరైంది. ఆమె సివిల్ సర్వీసెస్‌కు కాకుండా కేంద్ర సర్వీసుల తదుపరి తక్కువ కేడర్ పదవికి ఎంపికైంది. ఈలోగా స్వయం పోషణ కోసం ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరి సివిల్ సర్వీసెస్‌కు చదవడం కొనసాగించింది. ఇది దేనిని సూచిస్తుంది?
ప్రేరేపిత ప్రవర్తన అనేది అబద్దం.
ప్రేరేపిత ప్రవర్తన లక్ష్యాన్ని అంటిపెట్టుకొని ఉండదు.
ప్రేరేపిత ప్రవర్తన ఎప్పటికీ నిలబడదు.
ప్రేరేపిత ప్రవర్తన అవసరాలు మరియు వాటి సంతృప్తి మధ్య సమతుల్యతను కోరుకుంటుంది.
ప్రేరేపిత ప్రవర్తన అనేది వ్యక్తి తన తక్షణ అవసరాలు మరియు అంతిమ లక్ష్యం మధ్య సమతుల్యతను కాపాడుకునేలా చేస్తుంది. ఇక్కడ కేతకి ఆర్థిక అవసరాల కోసం ప్రస్తుత ఉద్యోగంలో చేరుతూనే, తన ఆశయమైన సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నం కొనసాగించడం ద్వారా లక్ష్యానికి మరియు సంతృప్తికి మధ్య సమతుల్యతను సాధించింది.
'మన సామర్థ్యాలు, లక్షణాల గురించి మన అవగాహన, ఆలోచన'ను ఏమని అంటారు?
స్వీయ భావన.
ఆత్మగౌరవం.
స్వీయ నియంత్రణ.
స్వీయ-సమర్థత.
ఒక వ్యక్తి తన గురించి తాను కలిగి ఉండే నమ్మకాలు, సామర్థ్యాలు మరియు లక్షణాల సమగ్ర రూపాన్నే స్వీయ భావన (Self-concept) అంటారు. ఇది "నేను ఎవరు? నా శక్తులు ఏమిటి?" అనే ప్రశ్నలకు సమాధానంగా ఏర్పడే ఒక మానసిక చిత్రం.
కింది వాటిలో ఏది సమ్మిళిత ఏర్పాటులో (Inclusive Setup) ఉపాధ్యాయుడు చేయకూడనిది ఏది?
వైకల్యత లేని పిల్లలకు వైకల్యత గల పిల్లల గురించి సంవేదనాత్మకతను పెంపొందించడం.
వైకల్యత, సమ్మిళితపర్చుట మరియు విద్యలో ప్రస్తుత ధోరణుల గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం.
సమవయస్కుల ట్యూటరింగ్‌ను నిరుత్సాహపరచడం.
వైకల్యత ఉన్న పిల్లల అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తరగతి యొక్క భౌతిక పరిసరాన్ని రూపొందించడం.
సమ్మిళిత విద్యలో సాధారణ విద్యార్థులు మరియు ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు కలిసి అభ్యసిస్తారు. ఈ విధానంలో సమవయస్కుల ట్యూటరింగ్ (Peer tutoring) అంటే ఒక విద్యార్థి మరో విద్యార్థికి సహాయం చేయడం అనేది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఉపాధ్యాయుడు దీనిని ప్రోత్సహించాలే తప్ప, నిరుత్సాహపరచకూడదు. కాబట్టి ఇది ఉపాధ్యాయుడు చేయకూడని పని.
థార్న్‌డైక్ సంసిద్ధత నియమం ప్రకారం నేర్చుకోవడానికి సరైన క్షణాలు అని మనం చెప్పినప్పుడు, అది అభ్యాసకుడికి సంబంధించిన దేని సంసిద్ధతను సూచిస్తుంది?
విశ్రాంతి సమయం.
మానసిక స్థితి.
ప్రజ్ఞ.
సహజ సామర్థ్యం.
థార్న్‌డైక్ సంసిద్ధత నియమం ప్రకారం, ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకోవడానికి శారీరకంగా మరియు ముఖ్యంగా మానసిక స్థితి సరిగా ఉండి, నేర్చుకోవాలనే ఆసక్తితో సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసనం సమర్థవంతంగా జరిగి అతనికి తృప్తిని ఇస్తుంది. ఒకవేళ సిద్ధంగా లేనప్పుడు బలవంతంగా నేర్పిస్తే అది అసంతృప్తికి లేదా విసుగుకు దారితీస్తుంది.
కింది స్టేట్‌మెంట్‌లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి? A) వికాస కృత్యాలు అనేవి వ్యక్తి జీవితంలో ఒక నిర్దిష్ట కాలంలో తలెత్తేవి మరియు వాటిని సాధించడంలో విఫలమైతే తరువాతి కృత్యాలు సాధించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. B) రచన తన 6 నెలల కొడుకు ఇంకా స్వయంగా పక్కకు తిరగడం లేదని ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఇది అతని తరువాతి కృత్యాలైన పాకడం, నిలబడటం మొదలైన వాటిపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె భావించింది.
స్టేట్‌మెంట్‌ A సరికానిది.
స్టేట్‌మెంట్‌ A సరైనది కానీ స్టేట్‌మెంట్‌ B కి సరైన వివరణ ఇవ్వదు.
స్టేట్‌మెంట్‌ A సరైనది మరియు స్టేట్‌మెంట్‌ B కి సరైన వివరణను అందిస్తుంది.
స్టేట్‌మెంట్‌ A మరియు B లకు సంబంధం లేదు.
రాబర్ట్ హవిగర్స్ట్ ప్రకారం వికాసం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఒక దశలోని వికాస కృత్యాలను సకాలంలో పూర్తి చేస్తేనే తదుపరి దశ సులభమవుతుంది. ఇక్కడ రచన కుమారుడు పక్కకు తిరగడం అనే ప్రాథమిక కృత్యాన్ని చేయకపోవడం వల్ల, ఆ తర్వాత రావాల్సిన పాకడం, నిలబడటం వంటి పనులపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందడం వికాస కృత్యాల సూత్రానికి అనుగుణంగా ఉంది.
పిల్లల దుర్వినియోగం (Child abuse) అనేది వీరు పిల్లలను ఉద్దేశపూర్వకంగా, ప్రమాదవశాత్తు కాకుండా గాయం చేయడం, దుర్వినియోగ పరచడం: A) తల్లిదండ్రులు. B) సంరక్షకులు. C) యజమానులు. D) ఇతరులు. సరియైన సమాధానాన్నిఎంచుకోండి?
B, C & D మాత్రమే.
A, B, C & D.
A, B & C మాత్రమే.
B & C మాత్రమే.
పిల్లల దుర్వినియోగం (Child Abuse) అనేది శారీరక, మానసిక లేదా లైంగిక పరంగా ఎవరి ద్వారా అయినా జరగవచ్చు. ఇందులో పిల్లలకు దగ్గరగా ఉండే తల్లిదండ్రులు, సంరక్షకులు, యజమానులు లేదా సమాజంలోని ఇతర వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా పిల్లలకు హాని కలిగించే ఏ వ్యక్తి అయినా ఈ పరిధిలోకి వస్తారు.
జయ అనే పాఠశాల విద్యార్థిని అన్ని పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి చాలా నిజాయితీగా చదువుతుంది, ఎందుకంటే ఆమె తల్లి ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత ఆమెకు బహుమతి ఇస్తుంది. ఇక్కడ అనుసరించబడిన పునర్బలన నియమం ఏది?
నిరంతర పునర్బలన నియమం.
స్థిర నిష్పత్తి పునర్బలన నియమం.
స్థిర విరామ పునర్బలన నియమం.
చరశీల పునర్బలన నియమం.
బి.ఎఫ్. స్కిన్నర్ ప్రకారం, ఒక నిర్ణీత కాల వ్యవధి (Time interval) ముగిసిన తర్వాత ఇచ్చే పునర్బలనాన్ని స్థిర విరామ పునర్బలనం అంటారు. ఇక్కడ జయకు ప్రతి టెర్మినల్ పరీక్ష తర్వాత (నిర్దిష్ట కాలం తర్వాత) బహుమతి లభిస్తోంది కాబట్టి, ఇది ఈ నియమానికి సరైన ఉదాహరణ.
రామ ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి దుకాణాలను ధ్వంసం చేసి పారిపోయారు. పోలీసులు కేసు బుక్ చేశారు. పోలీసుల అభ్యర్థనమేరకు, ప్రత్యక్ష సాక్షిగా రామ కొన్ని నెలల తర్వాత మేజిస్ట్రేట్ ముందు జరిగిన సంఘటనను వివరించాడు. ఈ సందర్భంలో రామ స్మృతి ఏ రకమైనది?
ఎపిసోడిక్ స్మృతి.
సెమాంటిక్ స్మృతి.
స్వల్పకాలిక స్మృతి.
తక్షణ స్మృతి.
ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన నిర్దిష్ట సంఘటనలను (ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగాయి అనేవి) సమయం మరియు ప్రదేశంతో సహా గుర్తుంచుకోవడాన్ని ఎపిసోడిక్ స్మృతి అంటారు. ఇక్కడ రామ షాపింగ్ మాల్‌లో జరిగిన అల్లర్లను నెలల తర్వాత కూడా ఒక ప్రత్యక్ష సాక్షిగా వివరించడం అనేది అతని జీవితంలోని ఒక నిర్దిష్ట సంఘటన లేదా 'ఎపిసోడ్'కు సంబంధించింది కాబట్టి ఇది ఎపిసోడిక్ స్మృతి అవుతుంది.
కింది వాటిలో సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి?
పరిపక్వత ఒక వికాస ప్రక్రియ.
పరిపక్వత అభ్యసనం పై ఆధారపడి ఉంటుంది.
వ్యక్తి కణాలలో పరిపక్వతకు సంబంధించిన బ్లూ ప్రింట్లు గర్భధారణ సమయం నుండే ఉంటాయి.
పరిపక్వత అంటే అనువంశికంగా వచ్చే ధోరణుల సహజ వివర్తన.
పరిపక్వత అనేది వయస్సుతో పాటు జన్యుపరంగా వచ్చే సహజ ప్రక్రియ. అభ్యసనం అనేది పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది కానీ, పరిపక్వత అనేది అభ్యసనంపై ఆధారపడదు. ఉదాహరణకు, ఒక శిశువు నడవడానికి కావలసిన కండరాల పరిపక్వత రాకుండా, ఎంత అభ్యసనం (Learning) చేసినా నడవలేడు.
ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం (RTE), 2009లోని సెక్షన్ 12లోని నియమం 1(c) ప్రకారం నవోదయ విద్యాలయాలు 1వ తరగతిలో పొరుగున ఉన్న బలహీన మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలను ఆ తరగతి విద్యార్థుల సంఖ్యలో ఎంత మేరకు చేర్చుకోవాలి?
33%.
50%.
10%.
25%.
RTE చట్టం-2009 లోని సెక్షన్ 12(1)(c) ప్రకారం, ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు మరియు నవోదయ వంటి ప్రత్యేక కేటగిరీ పాఠశాలలు తమ 1వ తరగతి (లేదా ప్రవేశ స్థాయి) సీట్లలో కనీసం 25% సీట్లను బలహీన వర్గాలు (EWS) మరియు వెనుకబడిన వర్గాల పిల్లల కోసం కేటాయించాలి. సామాజిక సమానత్వాన్ని పెంపొందించడానికి ఈ నిబంధనను చేర్చారు.
ఒక తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల సంవేదనాత్మకతను పెంపొందించడానికి ఒక అనాథాశ్రమానికి తీసుకెళ్లాడు. తండ్రి లక్ష్యంగా పెట్టుకున్న అభ్యసన రంగం ఏది?
చలనాత్మక.
భావావేశ.
సంజ్ఞానాత్మక.
మానసిక చలనాత్మక.
బ్లూమ్స్ వర్గీకరణ ప్రకారం, భావాలు, విలువలు, సానుభూతి మరియు వైఖరులకు సంబంధించిన అంశాలు భావావేశ రంగం కిందికి వస్తాయి. ఇక్కడ తండ్రి తన కూతురిలో అనాథ పిల్లల పట్ల జాలి, దయ వంటి సంవేదనాత్మకతను పెంపొందించాలని ఆశించడం ఆమె ఉద్వేగాలకు, మానసిక విలువలు పెంపొందడానికి సంబంధించింది. కాబట్టి ఇది భావావేశ రంగానికి చెందింది.
కింది వాటిలో ఏది బోధన యొక్క ప్రీ-ఆక్టివ్ (Pre-active) దశలో జరుగుతుంది? A) బోధనాభ్యసన లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలను నిర్ణయించడం. B) విషయాన్ని క్రమంలో అమర్చడం. సరియైన సమాధానాన్నిఎంచుకోండి?
A & B రెండూ.
A మాత్రమే.
B మాత్రమే.
A లేదా B రెండూ కాదు.
జాక్సన్ ప్రకారం బోధనలో మూడు దశలు ఉంటాయి. అందులో ప్రీ-ఆక్టివ్ దశ అనేది తరగతి గదికి వెళ్లకముందు ఉపాధ్యాయుడు చేసే ప్లానింగ్‌కు సంబంధించింది. ఈ దశలో బోధనా లక్ష్యాలను నిర్ణయించుకోవడం, మరియు పాఠ్యాంశాన్ని ఏ క్రమంలో బోధించాలో సిద్ధం చేసుకోవడం అనేవి చాలా ముఖ్యమైన అంశాలు.
ఏ నాయకత్వ శైలిని 'జోక్య రహితం' అని కూడా అంటారు?
లైసెజ్ ఫెయిర్ (Laissez Faire).
నిరంకుశ (Autocratic).
ప్రజాస్వామ్య (Democratic).
అధికారయుత (Authoritative).
లైసెజ్ ఫెయిర్ (Laissez-faire) నాయకత్వాన్ని'అనుమతించే' లేదా 'జోక్య రహిత' నాయకత్వం అని కూడా అంటారు. ఇందులో నాయకుడు తన కింద ఉన్నవారికి పూర్తి స్వేచ్ఛనిస్తూ, వారి నిర్ణయాల్లో లేదా పనుల్లో జోక్యం చేసుకోడు. సభ్యులే స్వయంగా బాధ్యత తీసుకుని పనులు పూర్తి చేసేలా ఈ శైలి పూర్తి అధికారాన్ని ఇస్తుంది.
వ్యక్తి మానసిక సామర్థ్యాలు వేటి యొక్క ఉత్పత్తి?
అనువంశికత మరియు పరిసరం రెండూ.
అనువంశికత మాత్రమే.
పరిసరం మాత్రమే.
అనువంశికత లేదా పరిసరం రెండూ కావు.
వ్యక్తి యొక్క వికాసం లేదా మానసిక సామర్థ్యాలు అనువంశికంగా వచ్చే జన్యువులు మరియు అతను పెరిగే పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ఫలితం. అందుకే ఉడ్ వర్త్ వికాసాన్ని అనువంశికత, పరిసరాల సంకలనం కాదని, వాటి గుణలబ్ధం (Development = Heredity x Environment) అని నిర్వచించారు. అంటే ఇందులో ఏది సున్నా అయినా వ్యక్తి పూర్తి వికాసం సాధ్యపడదు.
సమస్య పరిష్కార పద్ధతి యొక్క ప్రతికూలతను గుర్తించండి?
తక్కువ సమయాన్ని తీసుకుంటుంది.
సమస్యను పరిష్కరించడానికి అవసరమైన సామగ్రిని మరియు వనరులను అందించడం.
ఉపయోగించడానికి సులభం.
అన్ని పాఠాలకు ఉపయోగించవచ్చు.
సమస్య పరిష్కార పద్ధతి విద్యార్థులలో ఆలోచనా శక్తిని పెంపొందించినప్పటికీ, దీనిని అమలు చేయడం ఉపాధ్యాయునికి కొంత సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా ప్రతి సమస్యకు తగిన సామగ్రిని, వనరులను సేకరించి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం అనేది ఒక ప్రతికూలతగా పరిగణించబడుతుంది. ఇది ఎక్కువ సమయం మరియు శ్రమతో కూడుకున్నది.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TGTET) ఒక: A) నార్మ్- రిఫరెన్స్‌డ్ టెస్ట్. B) క్రైటీరియన్- రిఫరెన్స్‌డ్ టెస్ట్. సరియైన సమాధానాన్నిఎంచుకోండి?
B మాత్రమే.
A మాత్రమే.
A & B రెండూ.
A కాదు B కాదు.
ఒక పరీక్షలో అభ్యర్థి సామర్థ్యాన్ని ముందుగా నిర్ణయించిన ఒక నిర్దిష్ట అర్హత మార్కులతో (Criteria) పోల్చినప్పుడు దానిని క్రైటీరియన్-రిఫరెన్స్‌డ్ టెస్ట్ అంటారు. ఉదా: TG-TET.ఇది కేవలం ఒక అర్హత పరీక్ష మాత్రమే, అంటే పాస్ కావడానికి నిర్ణీత శాతం మార్కులు సాధించడం. దీనికి భిన్నంగా, అభ్యర్థుల మధ్య పోలికను లేదా ర్యాంకులను తెలియజేసే పరీక్షను (ఉదా: DSC) నార్మ్-రిఫరెన్స్‌డ్ టెస్ట్ అంటారు.
'పరోక్ష బోధనా మార్గాల' కు సంబంధించి సరికాని స్టేట్‌మెంట్‌ను గుర్తించండి?
రోల్ ప్లే పరోక్ష బోధనా పద్ధతికి ఉదాహరణ.
పరోక్ష బోధనా పద్ధతుల్లో విద్యార్థులు అభ్యసనంలో చురుకుగా పాల్గొంటారు.
పరోక్ష బోధనా పద్ధతులు అధిక ధారణకు సహాయపడతాయి.
పరోక్ష బోధనా పద్ధతుల్లో ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉంటాడు.
పరోక్ష బోధనా పద్ధతులు అనేవి విద్యార్థి కేంద్రంగా సాగుతాయి. ఇక్కడ ఉపాధ్యాయుడు కేవలం ఒక మార్గదర్శి (Facilitator) గా మాత్రమే ఉంటాడు. విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వల్ల విషయం బాగా గుర్తుంటుంది. కానీ ఉపాధ్యాయుడు కేంద్రంగా ఉండటం అనేది ప్రత్యక్ష బోధనా పద్ధతి యొక్క లక్షణం, కాబట్టి 4వ ఆప్షన్ సరికానిది.
యామిని రెండేళ్ల బాలిక. ఏదైనా అడిగి ఆమె తల్లి నిరాకరించినప్పుడల్లా యామిని ఆమె చుట్టూ ఉన్న వస్తువులన్నీ పారవేసేది. ఈ ప్రవర్తనను నివారించడానికి యామిని తల్లి ఆమె ఏదడిగినా ఇచ్చేది. చివరికి, యామిని పెరుగుతున్నప్పుడు ఆమె తల్లి యామిని ప్రవర్తనను మార్చాలని కోరుకుంది మరియు ఆమె వస్తువులన్ని పారవేసేటప్పుడు కూడా పట్టించుకోకుండా ఉండటం ప్రారంభించింది. నెమ్మదిగా, యామిని వస్తువులను విసరడం మానేసి, తన తల్లి మాట వినడం ప్రారంభించింది. పావ్‌లోవ్ ప్రకారం కిందివాటిలో ఈ అభ్యసన సూత్రానికి ఏది ఒక ఉదాహరణ?
సాధారణీకరణ.
అయత్న సిద్ధ స్వాస్థ్యం.
విరమణ.
విచక్షణ.
పావ్‌లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఒక నిబంధిత ప్రతిస్పందనకు (వస్తువులు విసరడం) పునర్బలనం (అడిగింది ఇవ్వడం) అందనప్పుడు, ఆ ప్రతిస్పందన క్రమంగా తగ్గిపోయి పూర్తిగా ఆగిపోతుంది. దీనినే విరమణ అంటారు. ఇక్కడ యామిని వస్తువులను విసిరినప్పుడు తల్లి పట్టించుకోకపోవడం (పునర్బలనం ఆపివేయడం) వల్ల ఆ ప్రతిస్పందన క్రమంగా బలహీనపడి, చివరికి యామిని ఆ ప్రవర్తనను పూర్తిగా మానుకుంది.
ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు విద్యార్థుల నిష్పాదనను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల ప్రమేయం యొక్క ప్రభావాన్ని చూడటానికి ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది. పట్టభద్రులైన తల్లిదండ్రుల పిల్లలను ఆమె ఎంపిక చేసుకొని, ఆ తల్లిదండ్రులను పాఠశాల తర్వాత పిల్లలతో ఖచ్చితంగా ఒక గంట సమయం గడపాలని, వారికి చదువులో సహాయం చేయాలని అభ్యర్థించింది. తల్లిదండ్రులందరూ ఉపాధ్యాయురాలి సూచనలను ఖచ్చితంగా పాటించారు. ఈ అధ్యయనంలో ఈ క్రింది వాటిలో జోక్య చరాలు ఏవి? A) విద్యార్థి సామర్థ్యం. B) విద్యార్థుల నిష్పాదన. C) తల్లిదండ్రుల ప్రమేయం. D) విద్యార్థుల అభ్యసనశైలి.
A & D మాత్రమే.
A, B, C, D.
A, B & C మాత్రమే.
B & C మాత్రమే.
ఈ ప్రయోగంలో స్వతంత్ర చరం → తల్లిదండ్రుల ప్రమేయం (కారణం); పరతంత్ర చరం → విద్యార్థుల నిష్పాదన (ఫలితం). అయితే ఫలితాన్ని ప్రభావితం చేసే విద్యార్థి యొక్క సొంత సామర్థ్యం (Ability) మరియు అభ్యసనశైలి (Learning Style) వంటివి ఉపాధ్యాయుని నేరుగా నియంత్రణలో ఉండవు కాబట్టి, వీటిని జోక్య చరాలు అంటారు.
మూడు సంవత్సరాల బాలిక తాను చూసిన పక్షి చిత్రాన్ని గీయగలిగింది. బ్రూనర్ ప్రకారం ఆమె ఏ ప్రాతినిధ్య దశలో ఉంది?
చిత్ర-ప్రతిమ (Iconic).
క్రియాత్మక (Enactive).
ప్రతీకాత్మక (Symbolic).
ప్రచాలక (Operational).
జెరోమ్ బ్రూనర్ ప్రకారం అభ్యసనంలో మూడు దశలు ఉంటాయి. అందులో చిత్ర-ప్రతిమ (Iconic) దశలో శిశువు సమాచారాన్ని దృశ్య రూపంలో లేదా చిత్రాల ద్వారా మనస్సులో నింపుకుంటుంది. ఇక్కడ బాలిక పక్షిని చూసి దాని చిత్రాన్ని గీయడం అనేది ఆమె ఆ వస్తువు యొక్క మానసిక ప్రతిమను కలిగి ఉందని సూచిస్తుంది. కాబట్టి ఇది చిత్ర-ప్రతిమ దశకు ఉదాహరణ.
స్మృతి తన కుక్కను రోడ్డుపైకి నడకకు తీసుకెళ్లింది. కుక్క తనకు తాను విడిపించుకుని పారిపోయింది. స్మృతి కుక్కను వెంబడించి పట్టుకుంది కానీ చుట్టూ చూసినప్పుడు ఆమె కొత్త ప్రదేశంలో ఉందని గ్రహించింది. తన స్థలానికి తిరిగి వెళ్ళడానికి చుట్టూ చూసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న మార్కెట్‌కు దిశను చూపించే సైన్ బోర్డు ఆధారంగా ఆమె ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇది ఏ అభ్యసనానికి ఒక ఉదాహరణ?
నిబంధన.
యత్న దోష.
అంతర్‌దృష్టి.
మోడలింగ్.
కొహ్లర్ ప్రతిపాదించిన అంతర్‌దృష్టి అభ్యసనం ప్రకారం ఒక వ్యక్తి సమస్య ఎదురైనప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, అకస్మాత్తుగా పరిష్కారాన్ని కనుగొంటాడు. ఇక్కడ స్మృతి కొత్త ప్రదేశంలో చిక్కుకున్నప్పుడు, చుట్టూ ఉన్న పరిసరాలను గమనించి సైన్ బోర్డును తన ఇంటికి వెళ్లే మార్గంతో అనుసంధానించుకోవడం ద్వారా అకస్మాత్తుగా సమస్యను పరిష్కరించుకుంది.
కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం యొక్క దశలు:
సంస్కృతికి సంబంధించినవి.
సార్వత్రికమైనవి.
అబ్బాయిలు మరియు అమ్మాయిలలో వేరుగా వుంటాయి.
గుర్తించలేనివి.
లారెన్స్ కోల్బర్గ్ సిద్ధాంతం ప్రకారం నైతిక వికాస దశలు జాతి, మతం లేదా సంస్కృతితో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలందరిలో ఒకే క్రమంలో సంభవిస్తాయి. అందుకే వీటిని సార్వత్రికమైనవి (Universal) అంటారు. పిల్లలు ఏ దేశానికి చెందినవారైనా ఈ 3 స్థాయిలలోని 6 దశల ద్వారానే నైతికతను పెంపొందించుకుంటారని ఆయన వివరించారు.
కింది వాటిలో ఏది అభ్యసనంలో ప్రక్రియ సంబంధిత కారకంగా పరిగణించబడదు?
తగిన పద్ధతుల ఎంపిక.
ఇంద్రియాలను గరిష్టంగా ఉపయోగించడం.
అభ్యసన పనిని అందించడం.
ఉపాధ్యాయ అర్హత.
అభ్యసన ప్రక్రియలో బోధనా పద్ధతులు, జ్ఞానేంద్రియాల వినియోగం మరియు అభ్యాసం అనేవి అభ్యసనం జరిగే విధానానికి సంబంధించిన ప్రక్రియ కారకాలు. కానీ ఉపాధ్యాయుని అర్హత అనేది బోధకుడికి సంబంధించిన వ్యక్తిగత కారకం మాత్రమే తప్ప అభ్యసనం జరిగే ప్రక్రియలో నేరుగా భాగం కాదు.
గ్రేడ్ II విద్యార్థిని సపర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2 x 3 గా ఇవ్వడం ద్వారా గుణకారాన్ని ప్రవేశపెట్టారు మరియు 2 x 3 అంటే 2 ను 3 సార్లు కూడడం అని వివరిస్తున్నారు. పియాజె ప్రకారం గుణకారం అనే భావనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సపర్ణ ఏ స్థితిలో వుంది?
సమతుల్యత.
అసమతుల్యత.
విపర్యాత్మక భావన లోపం.
సాంశీకరణం.
పియాజె ప్రకారం, ఒక వ్యక్తికి తెలిసిన పాత జ్ఞానంతో (కూడికలు) కొత్త విషయాన్ని (గుణకారం) వివరించలేనప్పుడు లేదా అర్థం చేసుకోలేనప్పుడు కలిగే మానసిక సంఘర్షణను 'అసమతుల్యత' (Disequilibrium) అంటారు. సపర్ణ తనకు తెలిసిన కూడికల ఆధారంగా గుణకారాన్ని కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ మధ్యస్థ స్థితిలో ఆమె జ్ఞానాత్మక అసమతుల్యతను అనుభవిస్తోంది.
కింది స్టేట్‌మెంట్‌లను చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. A) వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం, ఏకరూప కవలల వికాసంలో కూడా భేదాలు ఉండవచ్చు. B) వైయక్తిక భేదాల సూత్రం యొక్క ఒక అంతర్భావం ఏమిటంటే, పిల్లలందరు ఒకే వేగంతో పెరుగుతారు.
A మరియు B రెండూ సరికావు.
A సరికానిది B సరైనది.
A మరియు B రెండూ సరైనవి.
A సరైనది B సరికానిది.
వైయక్తిక భేదాల సూత్రం ప్రకారం ఏకరూప కవలలతో సహా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా అన్ని విషయాల్లో ఒకేలా ఉండరు, వారి వికాస వేగంలో తేడాలు ఉండవచ్చు. అలాగే వికాసం అనేది ఒక్కో బిడ్డలో ఒక్కో వేగంతో జరుగుతుంది. కాబట్టి పిల్లలందరూ ఒకే వేగంతో పెరుగుతారనే స్టేట్‌మెంట్ సరికాదు.
కింది వాటిలో అభ్యాసకుడికి సంబంధించి ఏది ప్రభావవంతమైన అభ్యసనానికి సహాయపడదు?
పరిపుష్టి పై అభ్యాసకుడి చర్య.
అభ్యసన లక్ష్యాల గురించి అభ్యాసకుడి అవగాహన.
అభ్యాసకుల నిష్క్రియాత్మక పాత్ర.
అభ్యాసకుడి గత అనుభవం.
ప్రభావవంతమైన అభ్యసనం (Effective Learning) జరగాలంటే అభ్యాసకుడు ఎప్పుడూ చురుకుగా (Active) ఉండాలి. కానీ నిష్క్రియాత్మక పాత్ర లో ఉన్నప్పుడు అభ్యాసకుడు కేవలం వినేవాడిగానే ఉంటాడు తప్ప, విషయాన్ని విశ్లేషించలేడు. దీనివల్ల అభ్యసనం ఆశించిన స్థాయిలో జరగదు. మిగిలిన మూడు అంశాలు (ఫీడ్‌బ్యాక్, లక్ష్యాల అవగాహన, గత అనుభవం) అభ్యసనాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి.
కింది కృత్యాలలో వేటిని నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట స్థాయి పరిపక్వత సాధించడం అవసరం? A) శిశువు ప్రేగు కదలికను నియంత్రించడం నేర్చుకోవడం. B) పూర్వపాఠశాలదశ పిల్లవాడు పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకోవడం. C) కౌమారుడు ఇతరుల భావాలను గౌరవించడం నేర్చుకోవడం.
A, B & C.
A & B మాత్రమే.
B & C మాత్రమే.
A & C మాత్రమే.
ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించాలన్నా లేదా నైపుణ్యాన్ని సాధించాలన్నా దానికి తగిన శారీరక, మానసిక మరియు సాంఘిక పరిపక్వత అవసరం. ప్రేగు కదలికల నియంత్రణకు శారీరక పరిపక్వత, పెన్సిల్ పట్టుకోవడానికి సూక్ష్మ చలన కండరాల పరిపక్వత, ఇతరుల భావాలను గౌరవించడానికి సాంఘిక మరియు ఉద్వేగ పరిపక్వత అవసరం.
కింది వాటిలో ఆలోచనను సూచించని కృత్యాన్ని గుర్తించండి?
కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల నుండి సలహాలను తీసుకోవడం.
తన బడ్జెట్‌ను సరిగా ఉపయోగించుకోవడానికి తన టూర్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటున్న వ్యక్తి.
ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక నిర్దిష్ట ఉత్పత్తిని ఉపయోగించడం గురించి ఒక సమూహం చర్చించడం.
ఒక గుర్రం చిత్రాన్ని చూస్తూ గుర్రం బొమ్మను గీస్తున్న అమ్మాయి.
ఆలోచన (Thinking) అనేది విశ్లేషణ లేదా సమస్య పరిష్కారంతో కూడిన మానసిక ప్రక్రియ. మొదటి మూడు ఆప్షన్స్‌లో సలహాలు ఇవ్వడం, ప్లాన్ చేయడం మరియు చర్చించడం వంటి మానసిక శ్రమ ఉంది, కానీ నాలుగో ఆప్షన్‌లో అమ్మాయి కేవలం చూసి బొమ్మ గీస్తోంది (Copying). ఇది జ్ఞానేంద్రియ మరియు చలన నైపుణ్యాలకు సంబంధించినది తప్ప ఇందులో సంక్లిష్టమైన ఆలోచన లేదు.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


TS TET Paper-I (SGT) Psychology Subject 20th June 2025 (Shift-1)

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top