📢 ముఖ్యమైన సూచనలు:
📝 మొత్తం ప్రశ్నలు: 25 (జనరల్ నాలెడ్జ్).
⏱️ సమయం: 40 నిమిషాలు.
🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.
🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
‘థయామిన్’ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
స్కర్వీ.
బెరి-బెరి.
రికెట్స్.
పెల్లాగ్రా.
'థయామిన్' అనేది విటమిన్ B1 యొక్క రసాయన నామం. ఆహారంలో ఈ విటమిన్ లోపం వల్ల 'బెరిబెరి' అనే వ్యాధి వస్తుంది. ఇది ప్రధానంగా నరాల బలహీనత, గుండె పనితీరు మందగించడం మరియు కండరాల క్షీణతకు దారితీస్తుంది. పాలిష్ పట్టిన బియ్యాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వల్ల ఈ విటమిన్ లోపిస్తుంది.
2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది?
పశ్చిమ బెంగాల్.
కేరళ.
ఉత్తరప్రదేశ్.
బీహార్.
2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ చదరపు కిలోమీటరుకు 1,106 మందితో దేశంలోనే అత్యధిక జనసాంద్రతను కలిగి ప్రథమ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ (1,028) రెండవ స్థానంలో ఉంది. అయితే అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ - 17 మంది/చ.కి.మీ.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు?
తెలుగు.
తమిళం.
కన్నడ.
మలయాళం.
ఇటాలియన్ భాష వలె తెలుగు భాషలోని పదాలు కూడా అచ్చులతో (Vowels) అంతమవుతాయి కాబట్టి దీనిని 'అజంత భాష' అని అంటారు. ఈ ప్రత్యేకతను గమనించి నికోలో డి కాంటి అనే ఇటాలియన్ యాత్రికుడు తెలుగును "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని అభివర్ణించారు.
‘నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్’ (NRSC) ఎక్కడ కలదు?
బెంగళూరు.
అహ్మదాబాద్.
డెహ్రాడూన్.
హైదరాబాద్.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) హైదరాబాద్‌లోని బాలానగర్ (ప్రధాన కార్యాలయం) మరియు షాద్‌నగర్ (శాటిలైట్ డేటా ఎర్త్ స్టేషన్) వేదికగా పనిచేస్తోంది. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కింద పనిచేస్తుంది. ఉపగ్రహాల ద్వారా భూమికి సంబంధించిన సమాచారాన్ని, మ్యాప్‌లను సేకరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తంలో తెల్ల రక్త కణాల (WBC) ముఖ్యమైన విధి ఏమిటి?
ఆక్సిజన్ రవాణా.
రక్తం గడ్డకట్టేలా చేయడం.
రోగనిరోధక శక్తిని అందించడం.
కార్బన్ డయాక్సైడ్ రవాణా.
రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు (WBC) శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడి, శరీరానికి రోగనిరోధక శక్తిని (Immunity) అందిస్తాయి. అందుకే వీటిని 'శరీర రక్షక భటులు' (Soldiers of the Body) అని కూడా పిలుస్తారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో అమరుడైన విద్యార్థి శ్రీకాంతాచారి ఏ జిల్లాకు చెందినవాడు?
నల్గొండ.
ఖమ్మం.
మెదక్.
కరీంనగర్.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన విద్యార్థి కాసోజు శ్రీకాంతాచారి ఉమ్మడి నల్గొండ జిల్లా (ప్రస్తుత యాదాద్రి భువనగిరి జిల్లా) మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందినవాడు. 2009 నవంబర్ 29న కేసీఆర్ అరెస్టుకు నిరసనగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఆత్మబలిదానం చేసుకొని మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశాడు.
‘బ్రహ్మ ప్రకాశిక’ పత్రికను స్థాపించిన వారు ఎవరు?
కందుకూరి వీరేశలింగం.
రఘుపతి వెంకటరత్నం నాయుడు.
రాజా రామ్మోహన్ రాయ్.
ఎ.సి. పార్థసారథి నాయుడు.
ఆంధ్రదేశంలో బ్రహ్మసమాజ వ్యాప్తికి, సామాజిక సంస్కరణల ప్రచారానికి గాను రఘుపతి వెంకటరత్నం నాయుడు 'బ్రహ్మ ప్రకాశిక' పత్రికను స్థాపించి నడిపారు. ఈ పత్రిక ద్వారా ఆయన సమాజంలోని మూఢనమ్మకాలను, అస్పృశ్యతను తీవ్రంగా ఖండిస్తూ ప్రజలలో సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకువచ్చారు.
‘రావత్‌భాట అణు విద్యుత్ కేంద్రం’ ఏ రాష్ట్రంలో కలదు?
మహారాష్ట్ర.
తమిళనాడు.
గుజరాత్.
రాజస్థాన్.
రావత్‌భాట అణు విద్యుత్ కేంద్రం (రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్) రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో చంబల్ నది సమీపంలో కలదు. కెనడా సాంకేతిక సహకారంతో నిర్మించిన ఈ కేంద్రం, భారతదేశంలో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ (PHWR) సాంకేతికతతో పనిచేస్తున్న ప్రముఖ అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటి.
2025 నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించింది?
నర్గీస్ మొహమ్మది.
నిహోన్ హిదాంక్యో.
మరియా రెస్సా.
మరియా కోరినా మచాడో.
వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య హక్కుల పునరుద్ధరణ కోసం చేసిన శాంతియుత పోరాటానికి గాను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలైన మరియా కోరినా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) మొదటిసారిగా వినియోగించిన రాష్ట్రం ఏది?
కేరళ.
గోవా.
రాజస్థాన్.
మధ్యప్రదేశ్.
1982 మే నెలలో కేరళలోని ఉత్తర పరవూర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రయోగాత్మకంగా 50 పోలింగ్ కేంద్రాల్లో మొదటిసారిగా EVM లను ఉపయోగించారు. అయితే, రాష్ట్రం మొత్తంలో అన్ని నియోజకవర్గాల్లో పూర్తిస్థాయిలో EVM లతో ఎన్నికలు నిర్వహించిన మొదటి రాష్ట్రం మాత్రం గోవా (1999).
‘వొడువని ముచ్చట్లు’ అనే గ్రంథం ఎవరి యొక్క స్వీయ చరిత్ర?
కాళోజీ నారాయణరావు.
ప్రొఫెసర్ జయశంకర్.
కొండా లక్ష్మణ్ బాపూజీ.
రావి నారాయణరెడ్డి.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జీవిత చరిత్ర, ఉద్యమ కాలపు అనుభవాలు మరియు జ్ఞాపకాల సమాహారమే ‘వొడువని ముచ్చట్లు’ గ్రంథం. జయశంకర్ గారు జ్ఞాపకాలుగా పంచుకున్న వివిధ అంశాలను సేకరించి, కొంపల్లి వెంకట్ గౌడ్ ఈ పుస్తకాన్ని రూపకల్పన చేశారు.
పల్లెటూరి పిల్లగాడా... పసులు గాసే మొనగాడా పాట రచయిత ఎవరు?
సుద్దాల హనుమంతు.
సుద్దాల అశోక్ తేజ.
గూడ అంజయ్య.
డా.సి. నారాయణ రెడ్డి.
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ మరియు నిజాం పాలన నాటి భూస్వాముల దోపిడీని ఎండగడుతూ ప్రజాకవి సుద్దాల హనుమంతు ఈ విప్లవాత్మక పాటను రచించారు. ఈ పాట 'మా భూమి' (1980) సినిమాలో ఉపయోగించబడి విశేష ప్రజాదరణ పొందింది.
రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించినవారు ఎవరు?
దంతిదుర్గుడు.
అమోఘవర్షుడు.
ఒకటవ కృష్ణుడు.
ధ్రువుడు.
క్రీ.శ. 753లో బాదామి చాళుక్యుల చివరి రాజు రెండవ కీర్తివర్మను ఓడించి దంతిదుర్గుడు (దంతివర్మన్) స్వతంత్ర రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సామ్రాజ్య ప్రాథమిక రాజధాని ఎలిచ్‌పూర్ కాగా, ఆ తర్వాత మాన్యఖేటం (ప్రస్తుత కర్ణాటకలోని మల్ఖేడ్) వీరి ప్రధాన రాజధానిగా మారింది.
వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక ఏది?
మొదటి పంచవర్ష ప్రణాళిక.
రెండవ పంచవర్ష ప్రణాళిక.
మూడవ పంచవర్ష ప్రణాళిక.
ఐదవ పంచవర్ష ప్రణాళిక.
భారతదేశ మొదటి పంచవర్ష ప్రణాళిక (1951-56) లో వ్యవసాయం, నీటిపారుదల మరియు విద్యుత్ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రణాళికా కాలంలోనే భాక్రానంగల్, హీరాకుడ్, నాగార్జునసాగర్ వంటి ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారు. రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు.
రబ్బర్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
త్రిపుర.
కర్ణాటక.
కేరళ.
అస్సాం.
భారతదేశంలో మొత్తం సహజ రబ్బరు ఉత్పత్తిలో కేరళ ప్రథమ స్థానంలో (సుమారు 70% కంటే ఎక్కువ వాటాతో) ఉండగా, త్రిపుర రెండవ స్థానంలో ఉంది. అయితే ప్రపంచంలోనే రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం థాయిలాండ్.
‘తెలంగాణ అమరనాథ్’గా ప్రసిద్దిచెందిన జాతర ఏది?
మన్నెంకొండ జాతర.
సిద్దులగుట్ట జాతర.
సలేశ్వరం జాతర.
ఏడుపాయల జాతర.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అభయారణ్యంలోని లోతైన లోయలో వెలిసిన సలేశ్వరం లింగమయ్య జాతరను "తెలంగాణ అమరనాథ్" (లేదా దక్షిణాది అమరనాథ్)గా పిలుస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో, కఠినమైన కొండ మార్గాల గుండా ప్రయాణించి దర్శించుకోవాల్సి రావడం వల్ల ఈ జాతరకు ఆ పేరు వచ్చింది.
భారతదేశంలో మొట్టమొదటి రైల్వే యూనివర్సిటీ ఎక్కడ కలదు?
సికింద్రాబాద్ (తెలంగాణ).
వడోదర (గుజరాత్).
వారణాసి (ఉత్తరప్రదేశ్).
కపుర్తలా (పంజాబ్).
భారతదేశంలోనే మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే మూడవ రైల్వే యూనివర్సిటీ అయిన 'నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్స్టిట్యూట్' (NRTI) ను 2018 లో గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేశారు. 2022 లో పార్లమెంట్ చట్టం ద్వారా దీనిని సెంట్రల్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేసి, ప్రస్తుతం దీని పేరును గతి శక్తి విశ్వవిద్యాలయం (GSV) గా మార్చారు.
తెలంగాణలో ‘గొల్లభామ చీరలకు’ ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
గద్వాల.
సిద్దిపేట.
నారాయణపేట.
పోచంపల్లి.
సిద్దిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలకు ప్రతిష్టాత్మక భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. చేనేత పద్ధతిలో కాటన్ మరియు సిల్క్ నూలుతో రూపొందించే ఈ చీరల కొంగు, అంచుల భాగాలపై చేత్తో నేసే గొల్లభామ (పాలు అమ్మే మహిళ) ఆకృతులు ఇక్కడి ప్రత్యేకత.
S.I పద్ధతిలో పొడవుకు ప్రామాణిక ప్రమాణం ఏది?
సెంటీమీటర్.
కిలోమీటర్.
మిల్లీమీటర్.
మీటర్.
అంతర్జాతీయ ప్రమాణాల (S.I) పద్ధతిలో పొడవును కొలవడానికి 'మీటర్ (m)'ను ప్రామాణిక ప్రమాణంగా ఉపయోగిస్తారు. సెంటీమీటర్ అనేది C.G.S పద్ధతిలో పొడవుకు ప్రమాణంగా ఉంటుంది.
పాలను పెరుగుగా మార్చడంలో తోడ్పడే బాక్టీరియా ఏది?
రైజోబియం.
ఈస్ట్.
లాక్టోబాసిల్లస్.
స్ట్రెప్టోకాకస్.
'లాక్టోబాసిల్లస్' అనే బాక్టీరియా పాలలో ఉండే లాక్టోజ్ చక్కెరను లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది. ఈ ప్రక్రియ వల్ల పాలు గడ్డకట్టి పెరుగుగా మారుతాయి. ఈ ప్రక్రియను కిణ్వ ప్రక్రియ (ఫెర్మెంటేషన్) అని పిలుస్తారు.
షోయబుల్లా ఖాన్ స్థాపించిన ప్రముఖ ఉర్దూ పత్రిక ఏది?
మీజాన్.
ఇమ్రోజ్.
రయ్యత్.
సియాసత్.
హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని, రజాకార్ల అరాచకాలను ఎండగడుతూ షోయబుల్లా ఖాన్ 'ఇమ్రోజ్' అనే ఉర్దూ దినపత్రికను స్థాపించి నడిపారు. ఈ పత్రిక ద్వారా నిజాం నిరంకుశత్వాన్ని తీవ్రంగా విమర్శించినందుకు గాను 1948 ఆగస్టు 22న రజాకార్లు ఆయనను కాల్చి చంపారు.
భారత్, పాకిస్తాన్ ల మధ్యగల సరిహద్దు రేఖను ఏమంటారు?
మెక్‌మోహన్ రేఖ.
డ్యూరాండ్ రేఖ.
రాడ్‌క్లిఫ్ రేఖ.
మాజినాట్ రేఖ.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖను 'రాడ్‌క్లిఫ్ రేఖ' అని పిలుస్తారు. 1947లో దేశ విభజన సమయంలో సరిహద్దుల కమిషన్ చైర్మన్ సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ నేతృత్వంలో ఈ సరిహద్దు రేఖను నిర్ణయించి, దానికి ఆయన పేరే పెట్టారు.
చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది?
1920.
1921.
1924.
1922.
1922 ఫిబ్రవరి 4న ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా చౌరీ చౌరాలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో, ఆగ్రహించిన ఉద్యమకారులు పోలీస్ స్టేషన్‌కు నిప్పు పెట్టి 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. దీనితో కలత చెందిన మహాత్మా గాంధీ ఫిబ్రవరి 12న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు.
ICC మహిళల ODI వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు?
దక్షిణాఫ్రికా.
ఆస్ట్రేలియా.
భారత్.
ఇంగ్లాండ్.
ICC మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
1857 సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది?
ఝాన్సీ.
మీరట్.
ఢిల్లీ.
కాన్పూర్.
1857 మే 10న ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ సైనిక స్థావరంలో సిపాయిల తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది. మార్చి 29న బారక్‌పూర్‌లో మంగళ్ పాండే కొవ్వు రాసిన తుపాకీ తూటాలను వాడనని తిరగబడినప్పటికీ, దేశవ్యాప్త తిరుగుబాటు అధికారికంగా ప్రారంభమైంది మాత్రం మీరట్ నుంచే.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

