📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్రిందివాటిలో తప్పుగా జతచేయబడినది ఏది?
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ – సరిహద్దు గాంధీ.
మార్టిన్ లూథర్ కింగ్ – అమెరికన్ గాంధీ.
నెల్సన్ మండేలా – దక్షిణాఫ్రికా గాంధీ.
వావిలాల గోపాలకృష్ణయ్య – తెలంగాణా సరిహద్దు గాంధీ.
వావిలాల గోపాలకృష్ణయ్యను "ఆంధ్ర గాంధీ" అని పిలుస్తారు. జమాలపురం కేశవరావును తెలంగాణ సరిహద్దు గాంధీ అని పిలుస్తారు.
విజయ్ ఘాట్ అనేది క్రింది వారిలో ఎవరి సమాధి?
రాజీవ్ గాంధీ.
చరణ్ సింగ్.
బి.ఆర్. అంబేద్కర్.
లాల్ బహదూర్ శాస్త్రి.
విజయ్ ఘాట్ న్యూ ఢిల్లీలో ఉన్న భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి స్థలం. 1966లో ఆయన మరణం తరువాత ఈ స్మారకాన్ని నిర్మించారు.
భారతదేశ జాతీయ ఫలం ఏది?
ఆపిల్.
అరటి.
ద్రాక్ష.
మామిడి.
భారతదేశ జాతీయ ఫలం మామిడి. దీనినే “Pride fruit of India” మరియు “King of the fruits” అని కూడా పిలుస్తారు. దీనిని 1950లో జాతీయ ఫలంగా గుర్తించారు.
అమార్ సోనార్ బంగ్లా (Amar Sonar Bangla) అనేది ఏ దేశం యొక్క జాతీయగీతం?
కంబోడియా.
బంగ్లాదేశ్.
నేపాల్.
బహ్రెయిన్.
అమార్ సోనార్ బంగ్లా అనేది బంగ్లాదేశ్ దేశానికి చెందిన జాతీయగీతం. ఈ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. ఇది బంగ్లాదేశ్ ప్రజల దేశభక్తి మరియు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు?
తెలుగు.
హిందీ.
తమిళం.
మలయాళం.
తెలుగు భాషను “ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్” అని పిలుస్తారు. ఇటాలియన్ భాషలో పదాలు ఎక్కువగా అచ్చులతో (vowels) ముగుస్తాయి, అలాగే తెలుగులో కూడా పదాలు అచ్చులతో ముగియడం వల్ల ఇది సౌందర్యభరితమైన భాషగా గుర్తించబడింది.
తెల్ల ఏనుగుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు?
భారతదేశం.
శ్రీలంక.
థాయిలాండ్.
మయన్మార్.
తెల్ల ఏనుగులు థాయిలాండ్‌లో అరుదైన, పవిత్రమైన జంతువులుగా రాజవంశానికి ఐశ్వర్యం, ప్రతిష్టను సూచిస్తాయి. అందుకే థాయిలాండ్‌ను “తెల్ల ఏనుగుల దేశం” అని పిలుస్తారు.
గేట్‌వే టు సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
హైదరాబాద్.
చెన్నై.
ముంబయి.
ఢిల్లీ.
చెన్నై నగరాన్ని “Gateway to South India” అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశానికి ప్రధాన ప్రవేశ ద్వారం లాంటిది. ఇది బంగాళాఖాత తీరంలో ఉండి, దక్షిణ భారత వాణిజ్య, సాంస్కృతిక, రవాణా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. సముద్ర, రైల్వే, రహదారి మార్గాలు విస్తృతంగా ఉండటం వలన ఈ పేరు వచ్చింది.
నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్.
సి.వి. రామన్.
అమర్త్య సేన్.
కైలాష్ సత్యార్థి.
రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయన "గీతాంజలి" అనే కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. ఈ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు మరియు ఆసియావాసి ఆయనే.
భారతదేశంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది?
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా.
వాంఖడే స్టేడియం, ముంబై.
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.
చిదంబరం స్టేడియం, చెన్నై.
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా 1,32,000 సీటింగ్ సామర్థ్యంతో ప్రసిద్ధి చెందింది. ఇది ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి మైదాన ప్రమాణాలతో భారత క్రికెట్‌కు ప్రతిష్టను చేకూర్చింది.
క్రిందివాటిలో 'ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
హైదరాబాద్.
బెంగళూరు.
చెన్నై.
పుణే.
ఐటి పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు, అనేక అంతర్జాతీయ మరియు దేశీయ టెక్నాలజీ కంపెనీలకు కేంద్రంగా నిలిచింది. అధునాతన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ పరిశ్రమల అభివృద్ధి కారణంగా దీనిని 'ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. బెంగళూరు భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా కూడా ప్రసిద్ధి చెందింది.
అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏది?
ఏనుగు.
ఒంటె.
సింహం.
ఖడ్గమృగం.
అత్యధిక గర్భావధి కాలం గల జంతువు ఏనుగు. ఏనుగుల గర్భావధి కాలం సుమారు 22 నెలలు ఉంటుంది, అంటే దాదాపు 660 రోజులు.
పిడుగుల దేశం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
వెనిజులా.
భూటాన్.
నేపాల్
ఇండోనేషియా.
పిడుగుల దేశం అనే బిరుదు భూటాన్‌కు ఉంది. భూటాన్‌ను స్థానికంగా 'ద్రుక్ యుల్' అని పిలుస్తారు, దీని అర్థం 'పిడుగు డ్రాగన్ దేశం'. ఈ పేరు దేశపు పురాణాలు, సంస్కృతి, మరియు జెండాపై ఉన్న పిడుగు డ్రాగన్ చిత్రంతో అనుబంధించబడి ఉంది. ఇది ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపుగా ఉంది, పిడుగుల సంఖ్య ఆధారంగా కాదు.
క్రింది వారిలో "సిల్వర్ టంగ్డ్ ఆరేటర్" అనే బిరుదు ఎవరికి కలదు?
బిపిన్ చంద్ర పాల్.
సురేంద్రనాథ్ బెనర్జీ.
మహదేవ్ గోవింద్ రనడే.
గోపాలకృష్ణ గోఖలే.
సురేంద్రనాథ్ బెనర్జీ తన ఆంగ్ల వాక్చాతుర్యం, రాజకీయ చైతన్యం, మరియు ప్రభావవంతమైన ప్రసంగాల వల్ల "సిల్వర్ టంగ్డ్ ఆరేటర్"అనే బిరుదును పొందారు.
ముంబయికి సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
లాస్ ఏంజిల్స్ అఫ్ ఇండియా.
గేట్ వే అఫ్ ఇండియా.
ఏడు ద్వీపాల నగరం.
పైవన్నీ సరైనవే.
ముంబయి భారతదేశంలోని బాలీవుడ్ సినిమా పరిశ్రమకు కేంద్రంగా ఉండటంతో "లాస్ ఏంజిల్స్ అఫ్ ఇండియా" గా, ముంబయిలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడం "గేట్ వే అఫ్ ఇండియా"గా ప్రసిద్ధి చెందింది. ముంబయి మొదట ఏడు ద్వీపాల సమూహంగా ఉండేది, తరువాత అవి కలిపి ఒక నగరంగా అభివృద్ధి చెందాయి.
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు?
దక్షిణ కొరియా.
జపాన్.
నార్వే.
కెనడా.
నార్వేను “అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం” (Land of Midnight Sun) అని పిలుస్తారు. వేసవి కాలంలో ఆర్కిటిక్ సర్కిల్‌లోని ప్రాంతాలలో సూర్యుడు అర్ధరాత్రి సమయంలో కూడా అస్తమించకుండా కనిపిస్తాడు. అంటే, 24 గంటల పాటు వెలుతురు ఉంటుంది. దీని వల్ల నార్వేకు ఈ ప్రత్యేక బిరుదు వచ్చింది.
టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్ ఎవరు?
అనిల్ కుంబ్లే.
కపిల్ దేవ్.
హర్భజన్ సింగ్.
ఇర్ఫాన్ పఠాన్.
హర్భజన్ సింగ్ 2001లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో రిక్కీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి, టెస్ట్ క్రికెట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా నిలిచాడు.
ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది?
అమెజాన్ నది.
నైలు నది.
సింధు నది.
గంగా నది.
నైలు నది సుమారు 6,650 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతి పొడవైన నది. నైలు నది ఈశాన్య ఆఫ్రికాలో ప్రవహించే ఒక ప్రధాన నది. ఇది 11 దేశాల గుండా ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.
వెయ్యి సరస్సుల దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు?
థాయ్‌లాండ్.
లావోస్.
హాలండ్.
ఫిన్లాండ్.
ఫిన్లాండ్‌ను “Land of a Thousand Lakes” అని పిలుస్తారు. వాస్తవానికి ఈ దేశంలో ఒక్క వెయ్యి కాదు, సుమారు 1,80,000కి పైగా సరస్సులు ఉన్నాయి. వీటి వల్ల ఫిన్లాండ్ ప్రకృతి అందాలు, జీవవైవిధ్యం, పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. ఈ భౌగోళిక విశేషం కారణంగా దేశానికి ఈ పేరు వచ్చింది.
భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి మహిళ ఎవరు?
ఇందిరా గాంధీ.
అరుణా అసఫ్ అలీ
మదర్ థెరిస్సా.
M.S. సుబ్బలక్ష్మి.
భారతదేశపు తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ 1971లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె ఈ పురస్కారాన్ని పొందిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు.
క్రిందివారిలో 'హ్యూమన్ కంప్యూటర్' గా పేరు పొందిన వ్యక్తి ఎవరు?
సత్య నాదెళ్ల.
సుందర్ పిచాయ్.
ఎ.పి.జె. అబ్దుల్ కలాం.
శకుంతలా దేవి.
శకుంతలా దేవి అసాధారణమైన గణిత ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా 'హ్యూమన్ కంప్యూటర్'గా ప్రసిద్ధి చెందారు. క్లిష్టమైన గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించగలిగే సామర్థ్యంతో ఆమె 1982లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
క్రిందివాటిలో ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఏది?
ట్రాన్స్-సైబీరియన్ రైల్వే.
రాకీ మౌంటైన్ రైల్వే.
ఆరియంట్ ఎక్స్‌ప్రెస్ రైల్వే.
ఇండియన్ పసిఫిక్ రైల్వే.
ట్రాన్స్-సైబీరియన్ రైల్వే రష్యాలోని మాస్కో నుండి వ్లాడివోస్టోక్ వరకు సుమారు 9,289 కిలోమీటర్ల పొడవులో విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నిరంతర రైలు మార్గం, యూరప్ నుండి ఆసియా వరకు అనుసంధానిస్తుంది.
క్రిందివాటిలో ఒలింపిక్ పతాకంలోని వలయాలకు సంబంధించి తప్పుగా జతచేయబడినది ఏది?
నీలం వలయం – యూరప్ ఖండం.
ఆకుపచ్చ వలయం – ఆస్ట్రేలియా ఖండం.
నలుపు వలయం – అమెరికా ఖండం.
పసుపు వలయం – ఆసియా ఖండం.
ఒలింపిక్ పతాకంలోని ఐదు వలయాలు ఐదు ఖండాలను సూచిస్తాయి. నీలం వలయం – యూరప్; పసుపు వలయం – ఆసియా; నలుపు వలయం – ఆఫ్రికా; ఆకుపచ్చ వలయం – ఆస్ట్రేలియా; ఎరుపు వలయం – అమెరికా ఖండాలను సూచిస్తాయి.
ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు?
భాను అథయా.
సత్యజిత్ రే.
ఏ.ఆర్. రెహ్మాన్.
రసూల్ పుకుట్టి.
భాను అథయా 1983లో రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో రూపొందించిన "గాంధీ" చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో (Best Costume Designer) ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.
క్రిందివాటిలో “Spice Garden of India” గా పిలవబడే రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్.
పశ్చిమ బెంగాల్.
కేరళ.
అస్సాం.
కేరళను “Spice Garden of India” అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలో మిరియాలు, యాలకులు, లవంగాలు, జాజిపత్రి, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాల పంటలు విస్తారంగా పండుతాయి. అనుకూల వాతావరణం, భూభాగం వల్ల కేరళ మసాలా దినుసుల ఉత్పత్తిలో ప్రముఖ రాష్ట్రంగా ప్రాధాన్యం పొందింది.
బ్రహ్మపుత్ర నదిని క్రిందివాటిలో ఏ పేరుతో పిలుస్తారు?
బెంగాల్ దుఃఖదాయిని.
చైనా దుఃఖదాయిని.
అస్సాం దుఃఖదాయిని.
బీహార్ దుఃఖదాయిని.
బ్రహ్మపుత్ర నది ప్రతి సంవత్సరం భారీ వరదలతో అస్సాంలో తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. పంటలు, ప్రాణాలు, ఆస్తులు నాశనం కావడం వల్ల దీనిని “అస్సాం దుఃఖదాయిని” (Sorrow of Assam) అని పిలుస్తారు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

Common Questions about GK Quiz – 1
Q1: ఈ GK Quiz – 1 లో ఏ రకమైన ప్రశ్నలు ఉన్నాయి?
A: ఈ క్విజ్‌లో దేశాలు మరియు నగరాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, First in India, జాతీయ పురస్కారాలు, నదులు, క్రీడలు మరియు ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉన్నాయి.
Q2: ఈ GK ప్రశ్నలు ఏ పరీక్షలకు ఉపయోగపడతాయి?
A: ఈ ప్రశ్నలు Telangana, మరియు Andhra Pradesh govt exams కి మరియు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి.
Q3: ఈ GK Practice Questions రివిజన్‌కు ఉపయోగపడతాయా?
A: అవును, ఈ ప్రశ్నలు quick revision మరియు exam ముందు ప్రాక్టీస్‌కు సహాయపడతాయి.

Best test series sir
Best for all competitive exams
Thank you sir