GK Quiz – 3


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
రక్తపోటు (Blood Pressure) ను ఏ పరికరం సహాయంతో కొలుస్తారు?
మానోమీటర్.
థర్మామీటర్.
మాగ్నటోమీటర్.
స్పిగ్మోమానోమీటర్.
రక్తపోటు ను కొలవడానికి ఉపయోగించే పరికరం పేరు స్పిగ్మోమానోమీటర్ (Sphygmomanometer). ఇది రక్త నాళాల్లో రక్త ఒత్తిడిని సరిగా కొలుస్తుంది. మానోమీటర్ → వాయువుల పీడనాన్ని కొలుచుటకు, మాగ్నటోమీటర్ → అయస్కాంత భ్రామకాలను, క్షేత్రాలను పోల్చుటకు ఉపయోగిస్తారు.
ఆగ్నేయ రైల్వే మండలం (South Eastern Railway) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
భువనేశ్వర్, ఒడిశా.
బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్.
గార్డెన్ రీచ్, కోల్‌కతా.
రాంచీ, జార్ఖండ్.
ఆగ్నేయ రైల్వే (South Eastern Railway) ప్రధాన కార్యాలయం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో ఉన్న గార్డెన్ రీచ్‌లో ఉంది. ఇది భారతీయ రైల్వేల 19 రైల్వే జోన్లలో ఒకటి మరియు దాని కార్యకలాపాలను కోల్‌కతా కేంద్రంగా నిర్వహిస్తుంది. ఈ జొన్ పరిధిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి: ఆద్రా, చక్రధర్‌పూర్, ఖరగ్‌పూర్, రాంచీ.
బర్మా దేశాన్ని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తారు?
బార్బడోస్.
బల్గేరియా.
మయన్మార్.
బెలారస్.
బర్మా దేశాన్ని ప్రస్తుతం మయన్మార్ (Myanmar) అనే పేరుతో పిలుస్తారు. 1989లో బర్మా యొక్క పేరును అధికారికంగా మయన్మార్‌ గా మార్చారు. మయన్మార్ అనేది ఆగ్నేయాసియాలో ఉన్న ఒక దేశం. దీనికి భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, లావోస్ మరియు థాయ్‌లాండ్‌లతో సరిహద్దులు ఉన్నాయి. మయన్మార్ రాజధాని నేపిడా .
నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
పొటమాలజీ (Potamology).
పోమాలజీ (Pomology).
పెడాలజీ (Pedology).
ఓరాలజీ (Orology).
నదుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ (Potamology) అంటారు. ఇది నదుల ప్రవాహం, వనరులు, భౌగోళిక లక్షణాలు, చరిత్ర మరియు వాటి పరిణామాన్ని పరిశీలిస్తుంది. పోమాలజీ (Pomology) → పండ్లను అధ్యయనం చేసే శాస్త్రం. పెడాలజీ → నేలను, మట్టిని అధ్యయనం చేసే శాస్త్రం. ఓరాలజీ → పర్వతాలపై అధ్యయనం చేసే శాస్త్రం.
వైశాల్యం పరంగా ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?
కెనడా.
చైనా.
రష్యా.
అమెరికా.
వైశాల్యం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా. దీని మొత్తం వైశాల్యం దాదాపు 17.1 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. భూమి మొత్తం భూభాగంలో రష్యా సుమారు ఎనిమిదవ వంతు (1/8) కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించింది. రష్యా దేశం రెండు ఖండాలలో అనగా యూరప్ మరియు ఆసియా ఖండాలలో విస్తరించి ఉంది.
భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఏది?
ఉత్తరప్రదేశ్.
బీహార్.
రాజస్థాన్.
మధ్యప్రదేశ్.
భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 75 జిల్లాలు ఉన్నాయి. ఇది భౌగోళికంగా పెద్ద రాష్ట్రం మరియు అధిక జనాభా కలిగి ఉండటంతో, సమర్థవంతమైన పరిపాలన కోసం ఎక్కువ జిల్లాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ రాష్ట్రం 18 డివిజన్‌లుగా విభజించబడింది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం (World Tourism Day) ఏ తేదీన జరుపుకుంటారు?
సెప్టెంబర్ 27.
అక్టోబర్ 4.
మార్చి 21.
జూన్ 5.
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. ఈ తేదీని ఎంపిక చేయడానికి కారణం 1970లో ఇదే రోజున యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) తన రాజ్యాంగాన్ని ఆమోదించడం. 1980లో UNWTO ఈ రోజును ప్రపంచ పర్యాటక దినోత్సవంగా ప్రకటించి, మొదటిసారిగా జరుపుకుంది.
యూరప్ ఆట స్థలం (Playground of Europe) అని ఏ దేశాన్ని పిలుస్తారు?
స్పెయిన్.
ఫ్రాన్స్.
ఇటలీ.
స్విట్జర్లాండ్.
యూరప్ ఆట స్థలం (Playground of Europe) అని స్విట్జర్లాండ్ దేశాన్ని పిలుస్తారు. ఇది అల్ప్స్ పర్వతాలు, స్కీయింగ్, హైకింగ్, సాహసక్రీడలు, మరియు ప్రకృతి సౌందర్యం కోసం ప్రసిద్ధి చెందింది. సాహస క్రీడల నుండి సహజ సౌందర్యాన్ని ఆస్వాదించే వరకు అనేక రకాల వినోద అవకాశాలు ఇక్కడ లభిస్తాయి. 1870లలో, లెస్లీ స్టీఫెన్ అనే రచయిత తన రచనల్లో స్విట్జర్లాండ్‌ను “యూరప్ ఆట స్థలం” గా పేర్కొన్నారు.
యూరప్ అత్తగారు (Mother-in-law of Europe) అని ఏ దేశాన్ని పిలుస్తారు?
డెన్మార్క్.
ఇంగ్లాండ్.
జర్మనీ.
పోలాండ్.
"యూరప్ అత్తగారు" (Mother-in-law of Europe) అని డెన్మార్క్ ను పిలుస్తారు. దీనికి కారణం 19వ శతాబ్దంలో డెన్మార్క్ రాజు క్రిస్టియన్ - IX తన యొక్క పిల్లలను అనేక యూరోపియన్ దేశాల రాజ కుటుంబాల యొక్క యువరాజులు, యువరాణులతో వివాహాలు చేయించడం ద్వారా ఈ పేరు వచ్చింది.
పెర్ల్ మిల్లెట్ (Pearl Millet) ను ఏ పేరుతో పిలుస్తారు?
సజ్జ (Bajra).
జొన్న (Jowar).
కొర్ర (Korra).
రాగి (Ragi).
పెర్ల్ మిల్లెట్ (Pearl Millet) అనేది సజ్జ లేదా బజ్రా అని పిలువబడే ఒక రకమైన చిన్న గింజల తృణ ధాన్యం. దీనిని ముఖ్యంగా భారతదేశం, ఆఫ్రికా వంటి ఉష్ణమండల, పాక్షిక శుష్క ప్రాంతాలలో పెంచుతారు. ఇది ఆహారం, పశుగ్రాసం రెండింటికీ ఉపయోగించబడుతుంది. పెర్ల్ మిల్లెట్ ప్రోటీన్, ఫైబర్, ఫాస్పరస్, మెగ్నీషియం, ఇనుము వంటి అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) లో ఎన్ని శాశ్వత సభ్యదేశాలు కలవు?
5 దేశాలు.
10 దేశాలు.
15 దేశాలు.
20 దేశాలు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) లో మొత్తం 15 సభ్యదేశాలు ఉంటాయి. ఇందులో 5 శాశ్వత సభ్యదేశాలు ఉన్నాయి: 1) అమెరికా, 2) రష్యా, 3) చైనా, 4) ఫ్రాన్స్, 5) బ్రిటన్. వీటికి వీటో హక్కు ఉంటుంది. మిగతా 10 తాత్కాలిక సభ్యదేశాలు జనరల్ అసెంబ్లీ చేత 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడుతాయి.
భారత రాష్ట్రపతి యొక్క శీతాకాల విడిది కేంద్రం ఎక్కడ కలదు?
మైసూర్, కర్ణాటక.
బొల్లారం, తెలంగాణ.
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్.
భారత రాష్ట్రపతి యొక్క అధికారిక శీతాకాల విడిది కేంద్రం తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలో గల బొల్లారంలో ఉంది. దీనిని రాష్ట్రపతి శీతాకాలంలో అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, మరియు విందులు నిర్వహించడానికి ఉపయోగిస్తారు. అలాగే అధికారిక వేసవి విడిది కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో కలదు.
కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు?
పశ్చిమ బెంగాల్.
అస్సాం.
ఒడిశా.
మేఘాలయ.
కజిరంగా నేషనల్ పార్క్ భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడింది. ఒక్క కొమ్ము ఖడ్గమృగాల (one-horned rhinoceros) సంరక్షణకు ప్రసిద్ధి చెందింది. ఈ పార్క్‌లో పులులు, ఏనుగులు, అడవి ఎద్దులు వంటి వన్యప్రాణులు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి.
నీలి విప్లవం (Blue Revolution) దేనికి సంబందించింది?
పెట్రోలియం ఉత్పత్తులు.
మత్స్య సంపద.
రసాయనిక ఎరువులు.
నూనె గింజలు.
నీలి విప్లవం అనేది ప్రధానంగా మత్స్య, ఆక్వాకల్చర్ (జలచరాల పెంపకం) రంగాలలో చేపలు మరియు ఇతర జలచరాల ఉత్పత్తిని, వాటి నిర్వహణను పెంచడానికి ఉద్దేశించబడిన ఒక కార్యక్రమం. భారతదేశంలో నీలి విప్లవం 7వ పంచవర్ష ప్రణాళిక (1985-1990) కాలంలో ప్రారంభమైంది. డాక్టర్ హీరాలాల్ చౌధురి మరియు డాక్టర్ అరుణ్ కృష్ణన్ లను నీలి విప్లవ పితామహులుగా పరిగణిస్తారు.
NABARD ను విస్తరించండి.
National Association for Banking and Rural Development.
National Bank for Agriculture and Rural Development.
National Authority for Budget and Rural Development.
National Bureau for Agricultural Research and Development.
NABARD పూర్తి రూపం నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్. ఇది వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించే భారతదేశ అత్యున్నత అభివృద్ధి బ్యాంకు. ఇది పార్లమెంటు చట్టం ప్రకారం 1982లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ముంబయి, మహారాష్ట్రలో ఉంది.
సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) ఎక్కడ ఉంది?
పూణే, మహారాష్ట్ర.
బెంగళూరు, కర్ణాటక.
లక్నో, ఉత్తరప్రదేశ్.
సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) 1949లో బీహార్‌లోని పాట్నాలో స్థాపించబడింది. అయితే 1956లో హిమాచల్ ప్రదేశ్‌ లోని సిమ్లాకు మార్చబడింది. ఇది భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇది బంగాళాదుంపల సాగు, పెంపకం, మరియు తెగుళ్ల నివారణ వంటి అంశాలపై పరిశోధనలు చేస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో బంగాళాదుంపల సాగు అవసరాలకు అనుగుణంగా దీనికి అనేక ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.
భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నవారు ఎవరు?
ఫెర్డినాండ్ మాజిలాన్.
వాస్కోడగామా.
జాన్ కేబాట్.
క్రిస్టఫర్ కొలంబస్.
భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్నది పోర్చుగీస్ అన్వేషకుడు వాస్కోడగామా. అతను 1498 మే లో ఆఫ్రికా పశ్చిమ తీరం గుండా, కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా భారతదేశంలోని కాలికట్ (ప్రస్తుత కొజికోడ్) కు చేరుకోవడం జరిగింది. ఇది యూరప్ నుండి భారతదేశానికి మొదటి నేరుగా సముద్ర మార్గం.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
న్యూయార్క్.
జెనీవా.
వాషింగ్టన్ D.C.
లండన్.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) 1944లో స్థాపించబడింది. దాని ప్రధాన కార్యాలయం అమెరికా రాజధాని వాషింగ్టన్ D.C.లో ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, దేశాలకు ఆర్థిక సహాయం చేయడానికి మరియు అధిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి కృషి చేసే ఒక అంతర్జాతీయ సంస్థ.
భారతదేశపు ఉద్యానవన పంటల (Horticultural Crops) పితామహుడు ఎవరు?
బి.పి. పాల్.
హీరాలాల్ చౌధురి.
ఎల్.బి. బెయిలీ.
ఎం.హెచ్. మారిగౌడ.
భారతదేశపు ఉద్యానవన పంటల పితామహుడు ఎం. హెచ్. మారిగౌడ. ఆయన పండ్ల, పూల, కూరగాయల పరిశోధన, సాగు పద్ధతుల అభివృద్ధి, మరియు ఉద్యానవన రంగంలోని శాస్త్రీయ మార్గదర్శకత్వంలో ప్రధాన పాత్ర పోషించారు.ఉద్యానవన రంగంలో ఆయన చేసిన విప్లవాత్మక కృషికి ఈ బిరుదు లభించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ-పురుష నిష్పత్తి ఎంత?
933 : 1000.
948 : 1000.
950 : 1000.
943 : 1000.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ-పురుష నిష్పత్తి 943:1000. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. ఇది 2001లో 933 : 1000 గా ఉంది. అత్యధిక స్త్రీ-పురుష నిష్పత్తి గల రాష్ట్రం కేరళ → 1084 : 1000. అత్యల్ప స్త్రీ-పురుష నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా → 877 : 1000.
భారతదేశంలో గిర్ జాతి పశువులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏది?
రాజస్థాన్.
మహారాష్ట్ర.
గుజరాత్.
పంజాబ్.
భారతదేశంలో గిర్ జాతి పశువులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం గుజరాత్. ఈ జాతి పశువులు గుజరాత్‌లోని గిర్ అడవులు మరియు కతియావార్ ప్రాంతంలోని వివిధ జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి అధిక పాల ఉత్పత్తి సామర్థ్యం, ఆరోగ్యకరమైన శరీర నిర్మాణం మరియు వ్యాధి నిరోధకతకు ప్రసిద్ధి చెందాయి.
ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిని ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తారు?
చురా (Churra).
సోహ్రా (Sohra).
మౌలిన్ (Maulin).
నోంగ్‌స్టోయ్ (Nongstoin).
ప్రపంచంలో రెండవ అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజిని ప్రస్తుతం సోహ్రా (Sohra) అనే పేరుతో పిలుస్తారు. చిరపుంజి అసలు పేరు సోహ్రా అని, బ్రిటిష్ వారు దానిని "చెర్రా" అని ఉచ్చరించడం ద్వారా చిరపుంజి అనే పేరు వచ్చిందని భావిస్తారు.
ప్రపంచంలో అతిపెద్ద దేవాలయం ఏది?
పశుపతినాథ్, నేపాల్.
అంగ్కోర్ వాట్, కంబోడియా.
బొరోబుదూర్, ఇండోనేషియా.
బృహదీశ్వర ఆలయం, భారత్.
ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం కంబోడియాలోని అంగ్కోర్ వాట్ హిందూ దేవాలయం. ఇది సుమారు 162.6 హెక్టార్ల (402 ఎకరాలు) విస్తీర్ణంలో ఉంది. దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఇది యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు?
కనుప్రియ అగర్వాల్.
నాటలీ బ్రౌన్.
లూయిస్ జాయ్ బ్రౌన్.
విక్టోరియా అన్నా పెరియా.
ప్రపంచంలోనే మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్. ఆమె జూలై 25, 1978న ఇంగ్లాండ్‌లో జన్మించింది. డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ మరియు డాక్టర్ పాట్రిక్ స్టెప్టో ద్వారా IVF పద్ధతితో ఆమె ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్-ట్యూబ్ బేబీగా గుర్తింపు పొందింది. మొదటి భారతీయ టెస్ట్ ట్యూబ్ బేబీ పేరు కనుప్రియ అగర్వాల్. ఆమె అక్టోబర్ 3, 1978న జన్మించింది.
క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన తొలి జంతువు ఏది?
పాలి గొర్రె.
స్నూపీ కుక్క.
సీసీ పిల్లి.
డాలీ గొర్రె.
క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టించబడిన తొలి జంతువు డాలీ (Dolly) అనే గొర్రె. ఇది 1996లో సోమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ (SCNT) పద్ధతిలో క్షీర గ్రంధి నుండి తీసుకున్న వయోజన కణం నుండి క్లోన్ చేయబడిన మొట్టమొదటి క్షీరదం. దీనిని స్కాట్లాండ్‌లోని రోస్లిన్ ఇన్స్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు సృష్టించారు.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


GK Questions in Telugu - Part 3

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top