Geography – Test 1


🕒 30 MCQs | 40 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 30
🟢 0 🔴 0
40:00
భూమి తన అక్షం చుట్టూ తాను తిరిగే ప్రక్రియను ఏమంటారు?
భూకేంద్రీకరణ.
భూపరిభ్రమణం.
భూభ్రమణం.
భూవికిరణం.
భూమి తన అక్షం చుట్టూ తాను తిరిగే ప్రక్రియను భూభ్రమణం (Earth's rotation) అంటారు. ఇది పడమర నుండి తూర్పు దిశగా జరుగుతుంది. ఈ భ్రమణం కారణంగానే భూమిపై పగలు, రాత్రులు ఏర్పడతాయి. భూ భ్రమణం వల్ల భూమిపై సూర్యుని కాంతి పడే భాగంలో పగలు మరియు దాని వెనుకవైపు కాంతి పడని భాగంలో రాత్రి ఏర్పడతాయి.
రింగ్ ప్లానెట్ (వలయ గ్రహం) గా ప్రసిద్ధి పొందిన గ్రహం ఏది?
బృహస్పతి (Jupiter).
నెప్ట్యూన్ (Neptune).
యురేనస్ (Uranus).
శని (Saturn).
“రింగ్ ప్లానెట్” లేదా వలయ గ్రహం అని శని గ్రహాన్ని పిలుస్తారు. శని గ్రహం దాని చుట్టూ ఉన్న అందమైన, విశాలమైన వలయాలకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రహానికి సౌర వ్యవస్థలోనే అత్యంత పెద్ద, స్పష్టమైన వలయాలు ఉంటాయి. అందుకే దీనిని 'రింగ్డ్ ప్లానెట్' (వలయ గ్రహం) అని పిలుస్తారు.
గ్రహాలన్నింటిలో అత్యంత వేడిగా ఉండే గ్రహం ఏది?
బుధుడు (Mercury).
అంగారకుడు (Mars).
శుక్రుడు (Venus).
గురుడు (Jupiter).
సూర్యునికి అతి దగ్గరగా ఉన్నది బుధుడు అయినా, దానిపై వాతావరణం లేకపోవడంతో వేడి నిలవదు. అయితే శుక్రునిపై దట్టమైన కార్బన్ డయాక్సైడ్ వాతావరణం ఉండటంతో గ్రీన్‌హౌస్ ప్రభావం ఏర్పడి, ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 465 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. అందువల్ల శుక్రుడు సౌరవ్యవస్థలో అత్యంత వేడి గ్రహం.
సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత?
6 నిమిషాల 20 సెకన్లు.
8 నిమిషాల 20 సెకన్లు.
10 నిమిషాలు 40 నిమిషాలు.
5 నిమిషాల 20 సెకన్లు.
సూర్యుని కాంతి భూమిని చేరడానికి సగటున సుమారు 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది. ఎందుకంటే సూర్యుడి నుంచి భూమికి ఉన్న సగటు దూరం దాదాపు 150 మిలియన్ కిలోమీటర్లు మరియు కాంతి సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
23½ డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
భూమధ్యరేఖ.
మకర రేఖ.
కర్కట రేఖ.
ఆర్కిటిక్ వలయం.
23½ డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కాటక రేఖ (Tropic of Cancer) అని పిలుస్తారు. ఇది భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ఒక ఊహాజనిత రేఖ. ఇది అట్లాంటిక్, హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రంతో పాటు తైవాన్ జలసంధి, ఎర్ర సముద్రం, మరియు మెక్సికో గల్ఫ్ వంటి వాటి గుండా వెళ్తుంది. ఇది ఉష్ణమండల ప్రాంతానికి ఉత్తర సరిహద్దు.
కర్కటరేఖపై ఏ రోజు సూర్యకిరణాలు లంబంగా పడుతాయి?
మార్చి 21.
డిసెంబర్ 22.
సెప్టెంబర్ 23.
జూన్ 21.
ప్రతి సంవత్సరం జూన్ 21న ఉత్తర ధృవం 23½° సూర్యుని వైపుకు వంగి ఉండటం వలన సూర్యకిరణాలు కర్కట రేఖ పై నేరుగా లంబంగా పడతాయి. ఈ రోజున ఉత్తరార్థగోళంలో అతి పెద్ద పగలు మరియు చిన్న రాత్రి సంభవిస్తుంది. ఇది సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు కూడా. ఈ రోజునుండి ఉత్తరార్థగోళంలో వేసవి కాలం మొదలవుతుంది.
సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం ఏది?
బుధుడు (Mercury).
అంగారకుడు (Mars).
శుక్రుడు (Venus).
నెప్ట్యూన్ (Neptune).
సౌరవ్యవస్థలో అతి చిన్న గ్రహం బుధుడు (Mercury). దీని వ్యాసం సుమారు 4,879 కి.మీ. ఇది భూమి కన్నా 2.6 రెట్లు చిన్నది. బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం మరియు ఇది మన సౌర వ్యవస్థలో ద్రవ్యరాశి, పరిమాణం రెండింటిలోనూ అతి చిన్నది.
నీలి గ్రహం (Blue Planet) గా పిలవబడే గ్రహం ఏది?
భూమి (Earth).
యురేనస్ (Uranus).
నెప్ట్యూన్ (Neptune).
శుక్రుడు (Venus).
భూమి ఉపరితలంలో దాదాపు 71% నీటితో కప్పబడి ఉంది, ఇందులో సముద్రాలు మరియు మహాసముద్రాలు ఉన్నాయి. ఈ నీటి సమృద్ధి కారణంగా అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి ప్రధానంగా నీలం రంగులో కనిపిస్తుంది. అందుకే భూమిని 'నీలి గ్రహం' అని పిలుస్తారు.
భూభ్రమణానికి (Earth's rotation) సరిగ్గా పట్టే సమయం ఎంత?
24 గంటల 56 నిమిషాల 4 సెకన్లు.
23 గంటల 56 నిమిషాల 4 సెకన్లు.
364 రోజుల 6 గంటలు.
365 రోజుల 6 గంటలు.
భూమి తన అక్షం చుట్టూ ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టే సమయం సుమారు 23 గంటలు 56 నిమిషాల 4 సెకన్లు. ఈ కాలాన్ని సిడీరియల్ డే (Sidereal Day) అంటారు. ఈ సమయం సుదూర స్థిర నక్షత్రాల దృష్ట్యా భూమి తన అక్షం చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని సూచిస్తుంది. 24 గంటల రోజును ఒక సౌర దినంగా (Solar Day) పరిగణిస్తారు.
విషువత్తులు (Equinoxes) ఏ రోజుల్లో సంభవిస్తాయి?
మార్చి 21 మరియు సెప్టెంబర్ 23.
జూన్ 21 మరియు డిసెంబర్ 22.
జనవరి 3 మరియు జూలై 4.
మార్చి 23 మరియు డిసెంబర్ 21.
విషువత్తులు (Equinoxes) సంవత్సరంలో రెండు సార్లు సంభవిస్తాయి. ఇవి సాధారణంగా మార్చి 21 (వసంత విషువత్తు) మరియు సెప్టెంబర్ 23 (శరద్ విషువత్తు) రోజుల్లో సంభవిస్తాయి. ఈ రోజుల్లో పగలు మరియు రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు భూమధ్యరేఖకు సరిగ్గా పైన ఉంటాడు.
ట్విన్ ప్లానెట్స్ (కవల గ్రహాలు) అని వేటిని అంటారు?
బృహస్పతి మరియు శని (Jupiter and Saturn).
భూమి మరియు శుక్రుడు (Earth and Venus).
అంగారకుడు మరియు భూమి (Mars and Earth).
బుధుడు మరియు అంగారకుడు (Mercury and Mars).
ట్విన్ ప్లానెట్స్ (కవల గ్రహాలు) అంటే ఒకదానికొకటి దగ్గరగా ఉండే, ఒకేలాంటి పరిమాణం, ద్రవ్యరాశి, మరియు రసాయన కూర్పు కలిగిన గ్రహాలు. మన సౌర వ్యవస్థలో శుక్రుడు (Venus) భూమి యొక్క కవల గ్రహంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రెండూ దాదాపు ఒకే పరిమాణంలో, ఒకే ద్రవ్యరాశిలో, మరియు ఒకే రకమైన పదార్థంతో తయారుచేయబడ్డాయి.
గ్రీనిచ్ వద్ద సమయం సోమవారం 12:00 AM అయితే, 90° పశ్చిమ రేఖాంశం వద్ద సమయం ఎంత?
సోమవారం 6:00 AM.
సోమవారం 6:00 PM.
ఆదివారం 6:00 PM.
ఆదివారం 6:00 AM.
భూమి ప్రతి 15° రేఖాంశాలు తిరగడానికి 1 గంట సమయం పడుతుంది. అంటే 90° తిరగడానికి 90 ÷ 15 = 6 గంటలు పడుతుంది. అయితే 90° పశ్చిమ రేఖాంశం అంటే గ్రీనిచ్ (0°) కంటే పడమర దిశలో ఉంది. గ్రీనిచ్ నుండి పడమరకు వెళ్ళేకొలది సమయం వెనుకబడుతుంది లేదా తగ్గుతుంది. కాబట్టి గ్రీనిచ్ వద్ద ఉన్న సోమవారం 12:00 AM నుండి 6 గంటలు తగ్గించినట్లయితే ఆదివారం 6:00 PM అవుతుంది.
భారతదేశం ఏ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది?
68°7′ తూర్పు మరియు 97°25′ తూర్పు.
68°7′ పడమర మరియు 97°25′ పడమర.
68°7′ పడమర మరియు 97°25′ తూర్పు.
68°7′ తూర్పు మరియు 97°25′ పడమర.
భారతదేశం 68°7′ తూర్పు (E) రేఖాంశం నుండి 97°25′ తూర్పు (E) రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఇది సుమారు 29° రేఖాంశాల విస్తీర్ణం. ఈ విస్తీర్ణం వల్ల దేశంలో తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌కు, పశ్చిమాన ఉన్న గుజరాత్ కంటే సూర్యోదయం సుమారు రెండు గంటల ముందుగా జరుగుతుంది.
అక్షాంశాలన్నిటిలో కెల్లా అతిపెద్ద వృత్తం ఏది?
భూమధ్యరేఖ.
మకరరేఖ.
ఆర్కిటిక్ వలయం.
అంటార్కిటిక్ వలయం.
భూమి మీద అక్షాంశాలన్నిటిలో కెల్లా అతిపెద్ద వృత్తం భూమధ్యరేఖ (Equator). ఎందుకంటే ఇది భూమి యొక్క కేంద్రం గుండా వెళుతుంది. భూమధ్యరేఖ (0° అక్షాంశం) భూమిని ఉత్తర, దక్షిణ అర్ధగోళాలుగా రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ధృవాల వైపు వెళ్లే కొద్దీ అక్షాంశాల పొడవు తగ్గుతుంది.
సూర్యుని యొక్క మధ్య భాగం (కోర్) లో ఉష్ణోగ్రత సుమారుగా ఎంత ఉంటుంది?
6,000°C
1 మిలియన్°C
15 మిలియన్°C
50 మిలియన్°C
సూర్యుని మధ్య భాగం (కోర్) లో ఉష్ణోగ్రత సుమారుగా 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్ (లేదా 27 మిలియన్ డిగ్రీల ఫారెన్‌హీట్) వరకు ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల కేంద్రక సంలీనం (nuclear fusion) జరిగి హైడ్రోజన్ అణువులు హీలియం అణువులుగా మారి సూర్యుని ప్రకాశవంతమైన శక్తి ఉత్పత్తి అవుతుంది.
90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
ఉత్తర ధృవం.
దక్షిణ ధృవం.
ఆర్కిటిక్ వలయం.
భూమధ్యరేఖ.
90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధృవం (North Pole) అని పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత ఉత్తరాన ఉన్న బిందువును సూచిస్తుంది. ఇది ఆర్కిటిక్ ప్రాంతానికి కేంద్ర బిందువు. ఈ ప్రాంతంలో వేసవి సమయంలో సూర్యుడు 24 గంటలు కనిపిస్తాడు (Midnight Sun) మరియు శీతాకాలంలో సూర్యుడు అసలే కనిపించడు (Polar Night).
భూమికి చంద్రునికి మధ్య సుమారుగా ఎంత దూరం ఉంటుంది?
1,50,000 కిలోమీటర్లు.
3,84,400 కిలోమీటర్లు.
5,00,000 కిలోమీటర్లు.
1,00,000 కిలోమీటర్లు.
భూమి మరియు చంద్రుని మధ్య సగటు దూరం సుమారు 3,84,400 కి.మీ. ఉంటుంది. అయితే చంద్రుని కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉండటం వల్ల ఈ దూరం మారుతూ ఉంటుంది. చంద్రుడు భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు (పెరిజీ) సుమారు 3,63,300 కి.మీ. గాను, అత్యంత దూరంలో ఉన్నపుడు (అపోజీ) సుమారు 4,05,696 కి.మీ. గాను ఉంటుంది.
హేలీ తోకచుక్క ప్రతి ఎన్ని సంవత్సరాలకొకసారి కనిపిస్తుంది?
25 సంవత్సరాలు.
50 సంవత్సరాలు.
76 సంవత్సరాలు.
100 సంవత్సరాలు.
హేలీ తోకచుక్క సుమారుగా ప్రతి 75-76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వచ్చి కనిపిస్తుంది. ఇది ప్రతి మనిషి జీవితకాలంలో గరిష్టంగా రెండు సార్లు చూడగల తోకచుక్క. ఈ తోకచుక్క చివరిసారిగా 1986లో కనిపించింది. మళ్ళీ తిరిగి 2061 లేదా 2062 లో కనిపించనుంది.
కర్కటరేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలగుండా పోతుంది?
6 రాష్ట్రాలు.
7 రాష్ట్రాలు.
8 రాష్ట్రాలు.
9 రాష్ట్రాలు.
కర్కటరేఖ భారతదేశంలోని మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళుతుంది. అవి: 1) గుజరాత్, 2) రాజస్థాన్, 3) మధ్యప్రదేశ్, 4) ఛత్తీస్‌గఢ్, 5) జార్ఖండ్, 6) పశ్చిమ బెంగాల్, 7) త్రిపుర మరియు 8) మిజోరాం.
ఒక ప్రదేశం గ్రీనిచ్ కంటే 75° తూర్పు వైపున ఉంటే, అక్కడ సమయం ఎంత ముందుంటుంది?
4 గంటలు.
5 గంటలు.
6 గంటలు.
9 గంటలు.
భూమి 1° రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి, 75°×4 నిమిషాలు = 300 నిమిషాలు = 5 గంటలు. అయితే 75° తూర్పు వైపున అంటే, గ్రీనిచ్ నుండి తూర్పుకు వెళ్ళేకొలది సమయం ముందుకు పోతుంది లేదా పెరుగుతుంది. కాబట్టి 75° తూర్పు వైపున ప్రదేశం సమయం గ్రీనిచ్ కంటే 5 గంటలు ముందుంటుంది.
కర్కట రేఖకు, మకర రేఖకు మధ్య గల ప్రాంతాన్ని ఏమంటారు?
శీతల మండలం (Frigid Zone).
సమశీతోష్ణ మండలం (Temperate Zone).
ఉపఉష్ణ మండలం (Sub-tropical Zone).
అత్యుష్ణ మండలం (Tropical zone).
కర్కట రేఖకు మరియు మకర రేఖకు మధ్య గల ప్రాంతాన్ని అత్యుష్ణ మండలం (Tropical zone) అంటారు. సూర్యకిరణాలు ఈ ప్రాంతంపై నేరుగా నిటారుగా పడటం వల్ల ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి ఇది భూమిపై అత్యంత వేడి వాతావరణంతో కూడిన ప్రాంతంగా ఉంటుంది.
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం ఏది?
టైటాన్ (Titan).
ఫోబోస్ (Phobos).
డైమోస్ (Deimos).
చంద్రుడు (Moon).
భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. దీని వ్యాసం సుమారు 3,474 కి.మీ. చంద్రుడు భూమి చుట్టూ 3,84,400 కి.మీ. సగటు దూరంలో స్థిరమైన కక్ష్యలో పరిభ్రమిస్తూ, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ద్వారా నియంత్రించబడుతుంది.
23½ డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
మకర రేఖ.
కర్కట రేఖ.
భూమధ్యరేఖ.
దక్షిణ ధృవం.
23½° దక్షిణ అక్షాంశాన్ని మకర రేఖ (Tropic of Capricorn) అని పిలుస్తారు. ఇది భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న ఒక ఊహాజనిత రేఖ. ఇది ఆఫ్రికా, దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా ఖండాల గుండా మరియు పసిఫిక్, అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్తుంది. ఇది ఉష్ణమండల ప్రాంతానికి దక్షిణ సరిహద్దు.
66½ డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
ఆర్కిటిక్ వలయం.
మకర రేఖ.
భూమధ్యరేఖ.
అంటార్కిటిక్ వలయం.
66½ డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం (Antarctic Circle) అని అంటారు. దీని దక్షిణ వైపు ఆంటార్కిటికా ఖండం ఉంటుంది. ఈ రేఖకు దాటి కొన్ని రోజులు సూర్యుడు పూర్తిగా కనిపించకపోవడం లేదా కొన్ని రోజులు సూర్యుడు మధ్యాహ్నం కూడా కనిపించడం జరుగుతుంది.
భూగోళంపై గల మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత?
180.
181.
360.
361.
అక్షాంశాలు భూమధ్యరేఖ నుండి రెండు ధృవాల వరకు గణించబడతాయి. ఉత్తర ధృవం వరకు 90 ఉత్తర అక్షాంశాలు + దక్షిణ ధృవం వరకు 90 దక్షిణ అక్షాంశాలు + భూమధ్యరేఖ (0°) ఒకటి = మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి.
అంతర్జాతీయ దిన రేఖ (International Date Line) అని దేనిని అంటారు?
180° ఉత్తర, దక్షిణ రేఖాంశం.
0° రేఖాంశం.
180° తూర్పు, ఉత్తర రేఖాంశం.
180° తూర్పు, పశ్చిమ రేఖాంశం.
180 డిగ్రీల తూర్పు, పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ (IDL) అని అంటారు. ఇది ఉత్తర, దక్షిణ ధృవాల మధ్య వెళుతూ ఒక క్యాలెండర్ రోజు మరియు తదుపరి రోజు మధ్య సరిహద్దును గుర్తించే ఒక ఊహాత్మక రేఖ. ఈ రేఖను దాటినప్పుడు తూర్పు నుండి పడమరకి వెళ్తే ఒక రోజు తగ్గుతుంది, పడమర నుండి తూర్పుకి వెళ్తే ఒక రోజు పెరుగుతుంది. ఈ రేఖాంశం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళుతుంది.
భూమి యొక్క రక్షకుడు (Protector of Earth) అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
శుక్రుడు (Venus).
బృహస్పతి (Jupiter).
శని (Saturn).
అంగారకుడు (Mars).
Protector of Earth' గా బృహస్పతి గ్రహాన్ని పిలుస్తారు. ఎందుకంటే ఇది తన బలమైన గురుత్వాకర్షణ క్షేత్రం ద్వారా తోకచుక్కలు మరియు గ్రహశకలాలను ఆకర్షించి, వాటిని భూమిని ఢీకొట్టకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, దీనిని భూమి యొక్క రక్షకుడు అని పిలుస్తారు.
Morning Star మరియు Evening Star అనే పేర్లతో పిలవబడే గ్రహం ఏది?
బుధుడు (Mercury).
శుక్రుడు (Venus).
అంగారకుడు (Mars).
బృహస్పతి (Jupiter).
శుక్రుడు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత ఎక్కువ వెలుగుతో ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సూర్యోదయానికి ముందు ఆకాశంలో కనిపించినప్పుడు దీనిని 'మార్నింగ్ స్టార్' (ఉదయ తారా) అని, సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో కనిపించినప్పుడు 'ఈవినింగ్ స్టార్' (సాయంత్రపు తారా) అని పిలుస్తారు.
గ్రహాలన్నింటిలో అతి పెద్ద గ్రహం ఏది?
శని (Saturn).
శుక్రుడు (Venus).
యురేనస్ (Uranus).
గురుడు (Jupiter).
సౌరవ్యవస్థలో అతి పెద్ద గ్రహం గురుడు (Jupiter). దీని వ్యాసం సుమారు 1,42,800 కిలోమీటర్లు. ఇది భూమి కన్నా 11 రెట్లు పెద్దది మరియు ద్రవ్యరాశి పరంగా భూమి కన్నా 300 రెట్లు ఎక్కువ. దాని భారం అన్ని గ్రహాలను కలిపిన భారం కంటే రెండింతలు ఎక్కువ. ఇది దూరాన్ని బట్టి సూర్యుడి నుండి ఐదవ గ్రహం.
అపహేళి (Aphelion) ఏ రోజున సంభవిస్తుంది?
జనవరి 3.
సెప్టెంబర్ 23.
మార్చి 21.
జూలై 4.
అపహేళి (Aphelion) అనేది భూమి సూర్యుని నుండి అత్యంత దూరంగా ఉండే స్థితి. ఇది సాధారణంగా జూలై 4న సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యుని నుండి సుమారు 152.1 మిలియన్ కి.మీ. దూరంలో ఉంటుంది. గ్రీకు భాషలో ఎపి అంటే దూరం, హేలియో అంటే సూర్యుడు అని అర్ధం.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Geography – Test 1

1 thought on “Geography – Test 1”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top