📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
రెండవ ప్రతాపరుద్రుడి జన్మకు సంబంధించి క్రిందివాటిలో సరైనదానిని గుర్తించండి?
ఇతడు గణపతి దేవుని కుమారుడు.
ఇతడు రుద్రదేవుడి కుమారుడు.
ఇతడు రుద్రమదేవి మనువడు.
ఇతడు రుద్రమదేవి కుమారుడు.
రెండవ ప్రతాపరుద్రుడు రుద్రమదేవి మనువడు మరియు కాకతీయ వంశానికి చెందిన చివరి రాజు. రుద్రమదేవికి మగ సంతానం లేకపోవడంతో, తన పెద్ద కుమార్తె ముమ్ముడమ్మకు జన్మించిన ప్రతాపరుద్రుడిని దత్తత తీసుకొని వారసునిగా ప్రకటించారు. అతడి పాలన కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల దాడులతో తీవ్రంగా ప్రభావితమైంది.
కాకతీయుల పరిపాలనలో ఎన్ని గ్రామాలను కలిపి ఒక “స్థలం”గా వ్యవహరించేవారు?
40 గ్రామాలు.
30 గ్రామాలు.
20 గ్రామాలు.
10 గ్రామాలు.
కాకతీయుల పరిపాలనా వ్యవస్థను మూడు స్థాయిలుగా విభజించేవారు—నాడు, స్థలం, గ్రామం. ఒక స్థలం అనేది సుమారు 20 గ్రామాలను కలిపి ఏర్పడేది. ఇది మధ్యస్థాయి పరిపాలనా విభాగంగా ఉండేది. "నాడు" అనేది పెద్ద పరిమాణంలోని పరిపాలనా యూనిట్ కాగా, గ్రామం ప్రాథమికమైనది. కాబట్టి, 20 గ్రామాల కలయికే ఒక స్థలం.
సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేసిన గిరిజన యోధుడు ఎవరు?
గోవింద రాజు.
జంపన్న.
పగిడిద్ద రాజు.
ధర్మా నాయుడు.
జంపన్న కాకతీయుల సేనలతో జరిగిన యుద్ధంలో తీవ్రంగా గాయపడుతాడు. తన కుటుంబ సభ్యుల మరణ వార్త విని, శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక, సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటి నుంచి ఆ వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఈ వాగు గిరిజనుల ధైర్యానికి, త్యాగానికి గుర్తుగా నిలిచింది. మేడారం జాతరలో భక్తులు ముందుగా జంపన్న వాగులో స్నానం చేసి, ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు.
క్రిందివాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
తలారి – గ్రామ రక్షకుడు.
లెంకలు – న్యాయాధికారులు.
బోయా – గ్రామాధిపతి.
కరణం – గ్రామ లేఖకుడు.
కాకతీయుల పరిపాలనలో లెంకలు అంటే రాజును ఎల్లవేళలా తమ ప్రాణాలను సైతం అర్పించి కాపాడే అంగరక్షకులు అని అర్థం. వీరు న్యాయాధికారులు కాదు.
కాకతీయుల పరిపాలనలో రాజ్యాన్ని ఏయే భాగాలుగా విభజించారు?
నాడులు – స్థలాలు– గ్రామాలు.
స్థలాలు – మండలాలు – గ్రామాలు.
గ్రామాలు – స్థలాలు – జిల్లాలు.
జిల్లాలు – నాడులు – మండలాలు.
కాకతీయులు తమ పరిపాలనలో రాజ్యాన్ని ప్రధానంగా 3భాగాలుగా విభజించారు. అది వరుసగా నాడులు, స్థలాలు, గ్రామాలు అనే శ్రేణిలో విభజించబడింది. ఇది ఒక స్పష్టమైన పరిపాలనా నిర్మాణం. “నాడు” ఒక పెద్ద పరిపాలనా ప్రాంతం, “స్థలాలు” మధ్యస్థాయి, “గ్రామాలు” ప్రాథమిక పరిపాలనా కేంద్రాలు.
కాకతీయుల సైనిక పరిపాలనను వివరించే గ్రంథం ఏది?
శివరాహస్యం.
ప్రకాశిక.
కృతికర్మ.
నీతి సారం.
కాకతీయుల సైనిక పరిపాలన విధానాన్ని వివరించే ప్రముఖ గ్రంథం ‘నీతి సారం’. ఇది నాయంకర వ్యవస్థ, సైనిక నియమాలు, విధులు, అధికారాల గురించి వివరంగా తెలియజేస్తుంది. మిగతా గ్రంథాలు ధార్మిక, తత్వ శాస్త్ర సంబంధమైనవి. కానీ కాకతీయుల పరిపాలనకు సంబంధం లేదు.
కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతాన్ని పరిపాలించినవారు ఎవరు?
పగిడిద్ద రాజు.
రేచర్ల రుద్రుడు.
గణపతిదేవుడు.
బద్దెన.
పగిడిద్ద రాజు కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతాన్ని పరిపాలించిన కోయ తెగకు చెందిన సామంతుడు. ఆయన భార్య సమ్మక్క, కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన్న, సారలమ్మ భర్త గోవిందరాజు, అంటే పగిడిద్ద రాజు అల్లుడు.
కాకతీయుల కాలంలో “అరిగాపులు” అనే పదం ఎవరిని సూచించేది?
గ్రామ పరిపాలనలో న్యాయాధికారులు.
నాయంకర్లకు భూమి అప్పగించిన అధికారులు.
భూమి శిస్తు చెల్లించే రైతులు.
రాజు యొక్క సైనిక సేవలలో ఉన్నవారు.
కాకతీయుల కాలంలో భూమి శిస్తును అరి అని, దానిని చెల్లించే రైతులను అరిగాపులు అని పిలిచేవారు.
“నవలక్ష ధనుర్ధారాధీశులు” అనే బిరుదు ఎవరు పొందారు?
శాతవాహనులు.
కాకతీయ చక్రవర్తులు.
విష్ణుకుండినులు.
ఇక్ష్వాకులు.
కాకతీయ చక్రవర్తులు, ముఖ్యంగా రుద్రమదేవి మరియు రెండవ ప్రతాపరుద్రుడు, భారీ సైనిక బలగంతో రాజ్యం పరిపాలించారు. వారు "నవలక్ష ధనుర్ధారాధీశులు" (9 లక్షల బాణసనుల యజమానులు) అనే బిరుదుతో ప్రసిద్ధులయ్యారు. ఇది వారి సైనికశక్తి ప్రతాపాన్ని సూచించే ప్రాముఖ్యమైన బిరుదు. ఇతర వంశాలకు ఈ బిరుదుతో సంబంధం లేదు.
కాకతీయుల పన్నులకు సంబంధించి క్రిందివాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
ఇల్లరి – ఇంటిపన్ను.
గణాచారి – మోటబావిపై పన్ను.
పుల్లరి – పచ్చిక బయలుపై పన్ను.
ముదార – ఉప్పు సంచులపై పన్ను.
కాకతీయుల కాలంలో వేశ్యల నుండి, బిక్షగాళ్లనుండి వసూలు చేసే పన్నును గణాచారి పన్ను అని పిలిచేవారు. మోటబావిపై విధించే పన్నును గాండి సుంకం అని పిలిచేవారు.
స్వయంభూ దేవాలయం ఓరుగల్లులోని ఏ కోటలో కలదు?
బయటికోట.
మట్టికోట.
రాతికోట.
ఏదీ కాదు.
రాతికోట కాకతీయుల కాలంలో ఓరుగల్లులో రాయితో నిర్మించబడిన ప్రధాన కోట. అందులోనే స్వయంభూ దేవాలయం ఉంది. ఇది ఓరుగల్లులోని ప్రముఖ శైవ దేవాలయంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు శిల్పకళా తోరణ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి.
పగిడిద్ద రాజుతో యుద్ధం చేసిన కాకతీయ రాజు ఎవరు?
గణపతిదేవుడు.
మహాదేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
రుద్రదేవుడు.
మేడారం పరగణాలో వరుసగా 4 సం.లు. కరువు ఏర్పడడంవల్ల పగిడిద్ద రాజు కాకతీయ రాజులకు పన్నులు చెల్లించలేక పోయాడు. రెండవ ప్రతాపరుద్రుడు దీన్ని తిరుగుబాటుగా పరిగణించి మేడారం పైకి తన సైన్యాన్ని పంపించి పగిడిద్ద రాజుతో యుద్ధం చేశాడు. ఈ సంఘటన సమ్మక్క–సారలమ్మ గిరిజన తిరుగుబాటుకు నాంది పలికింది.
ఓరుగల్లు లోని రాతి కోట యొక్క వెడల్పు ఎంత?
తూర్పు నుండి పడమరకు 9 కి.మీ.
ఉత్తరం నుండి దక్షిణానికి 1 కి.మీ.
తూర్పు నుండి పడమరకు 5 కి.మీ.
ఉత్తరం నుండి దక్షిణానికి 9 కి.మీ.
రాతి కోట తూర్పు-పడమర దిశలో పొడవుగా విస్తరించి ఉంటుంది. కానీ వెడల్పు అంటే ఉత్తరం నుండి దక్షిణ దిశలో కేవలం 1 కి.మీ. మాత్రమే ఉంది. ఇది పురాతన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన కట్టడంగా చరిత్రలో గుర్తింపు పొందింది. బయటి కోట వెడల్పు తూర్పు నుండి పడమరకు 9 కి.మీ. ఉంటుంది.
మేడారం జాతర (సమ్మక్క, సారలమ్మ జాతర) కు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది?
ఇది ఆసియాలోనే రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది.
తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది.
ఇది దక్షిణ భారత దేశ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన తెలంగాణా పండుగ.
ఇది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలం లోని మేడారం గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఇది కోయ తెగ గిరిజనుల త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తించే జాతర. కుంభమేళా తర్వాత ఆసియాలో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందింది. జంపన్న వాగు, బంగారం (బెల్లం) నైవేద్యం, వనప్రవేశం వంటి ప్రత్యేక ఆచారాలు ఇందులో ఉంటాయి.
కాకతీయుల పరిపాలనలో “నాడులు” అనే పదం ఏ సముదాయాన్ని సూచించేది?
కొన్ని స్థలాల సముదాయం.
కొన్ని గ్రామాల సముదాయం.
కొన్ని మండలాల సముదాయం.
కొన్ని జిల్లాల సముదాయం.
కాకతీయుల పరిపాలన మూడు స్థాయిలుగా ఉండేది. కొన్ని గ్రామాలు కలిపి ఒక స్థలం, కొన్ని స్థలాలు కలిపి ఒక నాడుగా ఏర్పడేది. ప్రతి స్థలంలో సుమారు 20 గ్రామాలు ఉండేవి. అందువల్ల, “నాడు” అనేది కొన్ని స్థలాల సముదాయం.
కాకతీయుల నాయంకర విధానానికి సంబంధించి క్రిందివాక్యాల్లో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి:
రాజుకు విధేయత చూపడం నాయంకర్ల ప్రధాన లక్షణం.
శిస్తుల ద్వారా వచ్చే ఆదాయంతో రాజు కోసం సైన్యాన్ని పోషించాలి.
రాజుల విశ్వాసం ఉన్నంత కాలం నాయంకర్లు పదవిలో కొనసాగేవారు.
తిరుగుబాట్లను అణచివేయడంలో నాయంకర్లు పాల్గొనేవారు కాదు.
నాయంకర్లు కాకతీయుల పరిపాలన వ్యవస్థలో కీలక పాత్ర వహించేవారు. వారికి సైనిక బలగాల నిర్వహణతో పాటు తిరుగుబాట్లను అణచడం వంటి బాధ్యతలు ఉండేవి. కాబట్టి రాజుకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాట్లను అణచివేయడంలో నాయంకర్లు పాల్గొనేవారు.
ఓరుగల్లు కోటకు సంబంధించి బయటి కోటను నిర్మించింది ఎవరు?
రెండవ ప్రోలరాజు.
రుద్రదేవుడు.
గణపతి దేవుడు.
రెండవ ప్రతాపరుద్రుడు.
ఓరుగల్లు చుట్టూ 3 ప్రధానమైన కోటలు ఉన్నాయి. అవి 1) బయటి కోట:- దీనిని నిర్మించింది రెండవ ప్రోలరాజు. 2) మట్టికోట:- దీనిని నిర్మించింది రుద్రదేవుడు. 3) రాతికోట:- దీనిని నిర్మించింది గణపతి దేవుడు.
కాకతీయుల కాలంలో రాజు యొక్క స్వంత భూములను ఏమని పిలిచేవారు?
రాచపోలం / రాచదొడ్డి.
వెలిపోలం.
కేసరిపాటిగడ.
A మరియు B సరైనవి.
కాకతీయుల కాలంలో రాజుకు ప్రత్యేకంగా ఉండే భూములను "రాచపోలం" లేదా "రాచదొడ్డి" అని పిలిచేవారు. ఇవి రాజు స్వంతంగా నిర్వహించే భూభాగాలు. నాయంకర్ల ఆధీనంలో గల భూములను వెలిపొలం అని పిలిచేవారు. కేసరిపాటిగడ అనేది కాకతీయుల కాలంలో భూమిని కొలిచే ఒక సాధనం. మేళ్ళచెరువు శాసనంలో రాజులకు గల స్వంత భూములైన రాచపొలం లేదా రాచదొడ్డి మొదలైన వాటి గురించి పేర్కొనడం జరిగింది.
రెండవ ప్రతాపరుద్రుడి సైన్యానికి సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
పదాతిదళం (సైనికులు) – 9 లక్షలు.
అశ్వబలం (గుర్రాలు) – 20 వేలు.
గజబలం (ఏనుగులు) – 100.
పైవన్నీ సరైనవే.
చారిత్రక ఆధారాల ప్రకారం రెండవ ప్రతాపరుద్రునికి ఉన్న సైన్యములో – 9 లక్షల పదాతిదళం, 20 వేల గుర్రాలు, మరియు 100 ఏనుగులు ఉండేవని తెలుస్తుంది. ఇతని సైన్యం దక్షిణ భారతదేశంలో ఎంతో శక్తివంతంగా ప్రసిద్ధి చెందింది. రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుల దాడులను ఎదుర్కొన్న సమయంలో ఈ సైన్యం కీలకంగా నిలిచింది.
రాతి కోటకు సంబంధించి క్రిందివాటిలో సరైనదానిని ఎన్నుకోండి?
ఈ కోట మధ్యలోనే రాజధాని నగర భవనాలు, రాజాంతఃపుర నివాసాలున్నాయి.
రాతికోటకు నాల్గు దిక్కులా నాల్గు ప్రవేశ ద్వారాలున్నాయి.
ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరుకునే రోడ్డు ఉంది.
పైవన్నీ సరైనవే.
రాతికోట అనేది కాకతీయుల రాజధాని ఓరుగల్లులో నిర్మించబడిన ప్రధాన కోట. ఈ కోటకు నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు, ప్రతి ద్వారం నుంచి కోట మధ్య భాగానికే దారి వెళ్లేలా నిర్మాణం ఉంటుంది. కోట నిర్మాణ వ్యూహానికి ఇవి చాలా కీలకమైనవి. కోట మధ్యభాగంలో రాజప్రాసాదాలు, రాజాంతఃపురాలు ఉంటాయి.
