Telangana District Courts Jobs Recruitment – 2026

ఈ జాబ్స్ నోటిఫికేషన్ 2026 కి సంబందించిన కొన్ని కామన్ Questions:

ప్రశ్న 1: ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు?

జవాబు: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని మొత్తం 859 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.


ప్రశ్న 2: మొత్తం ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి?

జవాబు: 9 రకాల పోస్టులు ఉన్నాయి.


ప్రశ్న 3: దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏది?

జవాబు: ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 13, 2026.


ప్రశ్న 4: పరీక్షలో నెగటివ్ మార్కులు ఉంటాయా?

జవాబు: ఉండవు, ఈ పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ ఉండవు.


ప్రశ్న 5: లోకల్/నాన్ లోకల్ (Local/Non Local) ని ఏవిధంగా గుర్తిస్తారు ?

జవాబు: 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు (వరుసగా 4 ఏళ్లు) ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకే లోకల్ అవుతారు. ఒకవేళ మీరు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు వేర్వేరు జిల్లాల్లో చదివి ఉంటే మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే ఆ జిల్లాకే లోకల్ అవుతారు.


ప్రశ్న 6: పరీక్ష ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో ఉంటుందా ?

జవాబు: అవును, ఆన్‌లైన్ (CBT) పద్ధతిలో ఉంటుంది.


ప్రశ్న 7: ఆఫీస్స బార్డినేట్ & ప్రాసెస్సర్వర్ పోస్టులకు exam ఎలా ఉంటుంది?

జవాబు: OMR Based Exam ఉంటుంది. కేవలం GK నుండి 45 ప్రశ్నలకు 45 మార్కులు ఉంటుంది, సమయం 60 నిమిషాలు. అలాగే 5 మార్కులకు గాను Oral Interview (Viva-voce) ఉంటుంది.


ప్రశ్న 8: ఈ పోస్ట్ లకు పరీక్షా విధానం (Exam Pattern) ఎలా ఉంటుంది?

జవాబు: జనరల్ నాలెడ్జ్ (GK) 60 ప్రశ్నలు 60 మార్కులు మరియు జనరల్ ఇంగ్లీష్ (English) 40 ప్రశ్నలు 40 మార్కులు. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు. సమయం 120 నిముషాలు (2 hours).

నమస్కారం! తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. తెలంగాణ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో 859 ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మనం Telangana District Courts Posts Recruitment Notification కు సంబంధించిన ముఖ్యాంశాలను విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం.

Telangana District Courts Posts Recruitment – 2026

1. ఈ నోటిఫికేషన్ దేని గురించి? (About the Recruitment):

తెలంగాణ హైకోర్టు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి TGPSC ద్వారా కాకుండా, నేరుగా హైకోర్టు ద్వారానే భర్తీ చేయబడతాయి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి జాయినింగ్ ఇచ్చే వరకు కూడా తెలంగాణ హైకోర్టు ఆధ్వర్యంలో  ప్రాసెస్ చాలా వేగంగా ఉంటుంది. మీరు 7వ తరగతి చదివినా, లేదా డిగ్రీ పూర్తి చేసినా.. మీ అర్హతకు తగ్గట్టుగా ఇందులో ఉద్యోగాలు ఉన్నాయి.

2. అధికారిక వెబ్‌సైట్ (Official Website):

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు పూర్తి నోటిఫికేషన్ చదవాలన్నా లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నా.. కేవలం తెలంగాణ హైకోర్టు వారి అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించండి. ఆ వెబ్‌సైట్ అడ్రస్: tshc.gov.in. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాక, అక్కడ మీకు ‘Recruitment’ అనే సెక్షన్ కనిపిస్తుంది. అందులో జిల్లా కోర్టులకు సంబంధించిన పోస్టులకు సంబంధించి విడివిడిగా నోటిఫికేషన్ PDFలు ఉంటాయి. పొరపాటున కూడా ఇతర వెబ్‌సైట్లలో మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయకండి, కేవలం ఈ అఫీషియల్ సైట్ మాత్రమే వాడండి.

  • దరఖాస్తులు ప్రారంభం: జనవరి 24, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 13, 2026.

ఉద్యోగాల రకాలు – అర్హతలు (Job Types & Eligibility):

ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 859 పోస్టులు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకే రకమైన పోస్టులు కావు. ఇందులో మొత్తం 9 రకాల పోస్టులు ఉన్నాయి. మీ విద్యార్హతను బట్టి మీరు ఏ పోస్టులకు అర్హులో ఇప్పుడు తెలుసుకుందాం.

i) డిగ్రీ చదివిన వారి కోసం: మీరు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, పోస్టులకు అప్లై చేయొచ్చు. దీనితో పాటు మీరు క్రింది స్థాయి (SSC/Inter) పోస్టులైన ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిగ్రీతో పాటు షార్ట్‌హ్యాండ్ సర్టిఫికేట్ ఉంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్III పోస్టులకు, డిగ్రీతో పాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే టైపిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ii) ఇంటర్మీడియట్ చదివిన వారి కోసం: మీరు ఇంటర్ పాస్ అయితే ఎగ్జామినర్ మరియు రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు. దీనితో పాటు, 10వ తరగతి అర్హత ఉన్న ప్రాసెస్ సర్వర్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్ తో పాటు టైపింగ్ సర్టిఫికేట్ ఉంటే కాపియిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

iii) 10 తరగతి మరియు 7 తరగతి వారి కోసం: 10వ తరగతి పాస్ అయి ఉంటే ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఇక అతి తక్కువ చదువుతో అంటే కనీసం 7వ తరగతి చదివిన వారికి (10th Pass or Fail) ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. కానీ గుర్తుంచుకోండి, ఆఫీస్ సబార్డినేట్ కి గరిష్ట అర్హత 10వ తరగతి మాత్రమే, అంటే ఇంటర్ లేదా డిగ్రీ చదివిన వారు అనర్హులు.

4. వయోపరిమితి (Age Limit):

ఇప్పుడు చాలా మందికి ఉండే సందేహం.. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎంత వయస్సు ఉండాలి? మరియు ఫీజు ఎంత కట్టాలి?

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18 నుండి 46 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 46 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అయితే, రిజర్వేషన్ ఉన్న వారికి వయస్సులో సడలింపు (Relaxation) ఉంటుంది:

  • BC, SC, ST మరియు EWS అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది (అంటే వీరు 51 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు).
  • దివ్యాంగులకు (PHC) 10 ఏళ్ల సడలింపు ఉంటుంది (అంటే వీరు 56 ఏళ్ల వరకు అప్లై చేయొచ్చు).
కేటగిరీవయోపరిమితి (Age Limit)
జనరల్ (OC)18 – 46 ఏళ్లు
BC, SC, ST, EWS18 – 51 ఏళ్లు
దివ్యాంగులు (PH)18 – 56 ఏళ్లు

5. లోకల్/నాన్ లోకల్ (Local/Non Local):

లోకల్ అభ్యర్థిత్వం విషయంలో చాలా మంది పాత పద్ధతినే అనుకుంటున్నారు. కానీ తెలంగాణ కొత్త రూల్స్ ప్రకారం.. మీరు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు (వరుసగా 4 ఏళ్లు) ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకే లోకల్ అవుతారు. ఒకవేళ మీరు 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు వేర్వేరు జిల్లాల్లో చదివి ఉంటే మీరు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే ఆ జిల్లాకే లోకల్ అవుతారు.

6.పరీక్షా ఫీజు Limit & Exam Fee):

మీరు ఏ పోస్టుకి అప్లై చేసినా ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి:

  • OC మరియు BC అభ్యర్థులకు: రూ. 600/-
  • SC, ST మరియు EWS అభ్యర్థులకు: రూ. 400/-

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు (ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్) అప్లై చేస్తే, ప్రతి పోస్టుకి విడివిడిగా Exam fee చెల్లించాల్సి ఉంటుంది.

కేటగిరీపరీక్షా ఫీజు (Fee Amount)
OC & BC అభ్యర్థులురూ. 600/- (ప్రతి పోస్టుకి)
SC, ST & EWS అభ్యర్థులురూ. 400/- (ప్రతి పోస్టుకి)

7. పరీక్షా విధానం (Exam Pattern):

విభాగంప్రశ్నల సంఖ్యమార్కులుసమయం
జనరల్ నాలెడ్జ్ (GK)6060
జనరల్ ఇంగ్లీష్ (English)4040
మొత్తం100100120 నిమిషాలు

*ఆఫీస్సబార్డినేట్ & ప్రాసెస్సర్వర్పోస్టులకు మాత్రం OMR Based Exam ఉంటుంది.కేవలం జనరల్ నాలెడ్జ్ (GK) మాత్రమే 45 ప్రశ్నలు 45 మార్కులకు ఉంటుంది, సమయం 60 నిమిషాలు. అలాగే 5 మార్కులకు గాను Oral Interview (Viva-voce) ఉంటుంది.

*టైపిస్ట్, కాపియిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III పోస్టులకు మాత్రం Skill Tests ఉంటాయి.

8. కనీస అర్హత మార్కులు (Minimum Qualifying Marks):

పరీక్ష రాసిన ప్రతి ఒక్కరినీ ఇంటర్వ్యూకి పిలవరు. మీరు కనీసం కొన్ని మార్కులు సాధిస్తేనే మిమ్మల్ని అభ్యర్థిగా పరిగణిస్తారు. వీటినే ‘అర్హత మార్కులు’ అంటారు.

మీ కేటగిరీని బట్టి మీకు రావాల్సిన కనీస మార్కులు ఇవే:

  • OC మరియు EWS అభ్యర్థులకు కనీసం 40% మార్కులు రావాలి.
  • BC అభ్యర్థులకు కనీసం 35% మార్కులు రావాలి.
  • SC, ST మరియు దివ్యాంగులకు (PH) కనీసం 30% మార్కులు రావాలి.

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే… ఈ మార్కులు వస్తే కేవలం మీరు క్వాలిఫై అయినట్లు మాత్రమే. ఉద్యోగం రావాలంటే మాత్రం దీనికంటే చాలా ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ యొక్క full video మన YouTube channel with_chari లో కూడా ఉంది:

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top