ఈ Exams కి సంబందించిన కొన్ని కామన్ Questions:
ప్రశ్న 1: ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏ పుస్తకాలు చదవాలి?
జవాబు: 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న తెలంగాణ స్కూల్ పుస్తకాలు చదివితే సరిపోతుంది.
ప్రశ్న 2: GK మరియు ఇంగ్లీష్ వెయిటేజీ ఎంత?
జవాబు: జనరల్ నాలెడ్జ్ 60 మార్కులు మరియు జనరల్ ఇంగ్లీష్ 40 మార్కులు.
ప్రశ్న 3: కోర్టు ఉద్యోగాలకు నెగటివ్ మార్కులు ఉంటాయా?
జవాబు: ఉండవు, ఈ పరీక్షలో ఎటువంటి నెగటివ్ మార్కింగ్ లేదు.
ప్రశ్న 4: ప్రిపరేషన్ కోసం ఎన్ని రోజులు ప్లాన్ చేసుకోవాలి?
జవాబు: సుమారుగా 60 రోజులు పక్కా ప్లాన్‌తో చదవాలి.
ప్రశ్న 5: లోకల్ రిజర్వేషన్ ఎంత శాతం ఉంటుంది?
జవాబు: 95% పోస్టులు ఆయా జిల్లాల లోకల్ అభ్యర్థులకే కేటాయించబడతాయి.
ప్రశ్న 6: పరీక్ష ఏ పద్ధతిలో జరుగుతుంది?
జవాబు: ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో జరుగుతుంది.
ప్రశ్న 7: ఇంగ్లీష్ గ్రామర్ కోసం ఏ పుస్తకం బాగుంటుంది?
జవాబు: రెన్ అండ్ మార్టిన్ (Wren & Martin) లేదా డి.వి. రమణ గారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్.
ప్రశ్న 8: కరెంట్ అఫైర్స్ ఎన్ని నెలలవి చదవాలి?
జవాబు: గత 12 నెలల వార్తలు (ముఖ్యంగా అవార్డులు, క్రీడలు, నియామకాలు) చదవాలి.
ప్రశ్న 9: సేఫ్ స్కోర్ లేదా కట్-ఆఫ్ ఎంత ఉండవచ్చు?
జవాబు: పోటీ తీవ్రత దృష్ట్యా 75 నుండి 85 మార్కులు సాధించడం సేఫ్ జోన్.
ప్రశ్న 10: టైపిస్ట్/కాపీయిస్ట్ పోస్టులకు సిలబస్ ఏ స్థాయిలో ఉంటుంది?
జవాబు: స్కూల్ పుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే బేసిక్ అంశాల మీద అవగాహన ఉండాలి.
ప్రశ్న 11: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యమా?
జవాబు: అవును, సిలబస్‌లో తెలంగాణ ప్రభుత్వ పథకాలు అత్యంత ముఖ్యమైన విభాగం.
ప్రశ్న 12: పరీక్షా సమయం (Time Duration) ఎంత?
జవాబు: 100 ప్రశ్నలకు గాను మొత్తం 120 నిమిషాలు (2 గంటలు) సమయం ఉంటుంది.
ప్రశ్న 13: జిల్లా స్థాయి పోస్టులు అంటే ఏమిటి?
జవాబు: మీరు ఏ జిల్లాకు అప్లై చేస్తే ఆ జిల్లాలోని ఖాళీలకు మాత్రమే మీరు పోటీ పడతారు.
ప్రశ్న 14: జూనియర్ అసిస్టెంట్ కు ఏ అదనపు పుస్తకాలు చదవాలి?
జవాబు: తెలుగు అకాడమీ డిగ్రీ స్థాయి ప్రామాణిక పుస్తకాలను రిఫరెన్స్‌గా తీసుకోవాలి.
ప్రశ్న 15: రివిజన్ కోసం ఎన్ని రోజులు కేటాయించాలి?
జవాబు: ప్రిపరేషన్ ప్లాన్ లో చివరి 20 రోజులు పూర్తిగా రివిజన్ మరియు మాక్ టెస్టులకే కేటాయించాలి.
ప్రశ్న 16: రాజ్యాంగంలో ఏ భాగాలు ఎక్కువగా చదవాలి?
జవాబు: న్యాయవ్యవస్థ, సుప్రీం కోర్టు, హైకోర్టు మరియు ప్రాథమిక హక్కులు.
ప్రశ్న 17: పరీక్షలు ఏ ఏ నెలల్లో ఉండే అవకాశం ఉంది?
జవాబు: 2026 ఏప్రిల్ లేదా మే నెలల్లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది.
ప్రశ్న 18: వయోపరిమితి సడలింపు వల్ల ప్రభావం ఏమిటి?
జవాబు: వయస్సును 46 ఏళ్లకు పెంచడం వల్ల సీనియర్ అభ్యర్థుల నుండి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది.
ప్రశ్న 19: ప్రతిరోజూ ఎన్ని మాక్ టెస్టులు రాయాలి?
జవాబు: కనీసం ఒక మోడల్ పేపర్ లేదా గత సంవత్సరాల పేపర్లను సాల్వ్ చేయడం వల్ల టైమ్ మేనేజ్‌మెంట్ పెరుగుతుంది.
ప్రశ్న 20: నాన్-లోకల్ అభ్యర్థులు ఎంత శాతం పోస్టులకు పోటీ పడవచ్చు?
జవాబు: నాన్-లోకల్ వారు కేవలం 5% ఓపెన్ కోటా పోస్టులకు మాత్రమే పోటీ పడవచ్చు.
తెలంగాణ జిల్లా కోర్టుల నోటిఫికేషన్ గురించి పూర్తి అవగాహన పొంది పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత, ప్రతి అభ్యర్థి ముందున్న తదుపరి సవాలు – “ప్రిపరేషన్?”. 859 ఖాళీలు ఉన్నప్పటికీ, వయోపరిమితి సడలింపు వల్ల పోటీ చాలా తీవ్రంగా ఉండబోతోంది. కేవలం చదవడం మాత్రమే కాదు, ఏది చదవాలి? ఎలా చదవాలి? అనే స్పష్టమైన ప్రణాళిక ఉన్నప్పుడే మీరు విజయం సాధించగలరు. ఇందులో మనం 100 మార్కుల సిలబస్ విశ్లేషణ, ఉత్తమమైన రిఫరెన్స్ పుస్తకాలు మరియు కేవలం 60 రోజుల్లో ఉద్యోగం సాధించడానికి అవసరమైన పక్కా ప్రిపరేషన్ స్ట్రాటజీ మొదలైన వాటి గురించి తెలుసుకుందాం.

1. సిలబస్ విశ్లేషణ (Syllabus Analysis):
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అన్ని పోస్టులకూ జికె (GK) మరియు ఇంగ్లీష్ సిలబస్ పేర్లు ఒకేలా ఉన్నా, ప్రశ్నలు అడిగే విధానం మారుతుంది.
1. ఆఫీస్ సబార్డినేట్ & ప్రాసెస్ సర్వర్: వీటికి మీరు 6వ తరగతి నుండి 10వ తరగతి స్కూల్ పుస్తకాలు, GK చదివితే సరిపోతాయి. ఎందుకంటే ప్రశ్నలు చాలా సూటిగా ఉంటాయి.
2. జూనియర్ అసిస్టెంట్ & ఫీల్డ్ అసిస్టెంట్ (డిగ్రీ స్థాయి): వీటికి స్కూల్ పుస్తకాలు కేవలం పునాది (Base) మాత్రమే. మీరు వీటితో పాటు డిగ్రీ స్థాయి స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్స్ (ఉదాహరణకు: తెలుగు అకాడమీ డిగ్రీ పుస్తకాలు) చదవాలి. ఇందులో ప్రశ్నలు కొంచెం లోతుగా, అనలిటికల్ గా (Analytical) ఉంటాయి.
3. ఇంటర్ స్థాయి పోస్టులు (Typist/Copyist): వీటికి స్కూల్ పుస్తకాలతో పాటు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉండే బేసిక్ అంశాల మీద అవగాహన ఉండాలి.
గత ప్రశ్నా పత్రాల విశ్లేషణను బట్టి syllabus క్రిందివిధంగా ఉండవచ్చు.
1. జనరల్ నాలెడ్జ్ (60 మార్కులు) – ముఖ్యమైన టాపిక్స్:
GK లో 60 మార్కులు ఉన్నాయి కాబట్టి ఈ క్రింది అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి:
- తెలంగాణ ప్రత్యేక అంశాలు: తెలంగాణ రాష్ట్ర అవతరణ, ఉద్యమ చరిత్ర, సంస్కృతి, కళలు, పండుగలు (బోనాలు, బతుకమ్మ) మరియు ప్రముఖ పర్యాటక ప్రాంతాలు.
- ప్రభుత్వ పథకాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంక్షేమ పథకాలు.
- భారత రాజ్యాంగం & పాలిటీ: ఇది కోర్టు ఉద్యోగం కాబట్టి న్యాయవ్యవస్థ (Judiciary), సుప్రీం కోర్టు, హైకోర్టు, ప్రాథమిక హక్కులు మరియు విధులకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి.
- కరెంట్ అఫైర్స్: గత 12 నెలల జాతీయ, అంతర్జాతీయ మరియు ప్రాంతీయ వార్తలు. ముఖ్యంగా అవార్డులు, క్రీడలు మరియు కొత్త నియామకాలు.
- భారత దేశ చరిత్ర & భూగోళశాస్త్రం: సింధు నాగరికత నుండి స్వాతంత్రోద్యమం వరకు ముఖ్య ఘట్టాలు. భారతదేశ నదులు, పర్వతాలు మరియు శీతోష్ణస్థితి.
- జనరల్ సైన్స్: నిత్యజీవితంలో సైన్స్ మరియు పర్యావరణ అంశాలు.
2. జనరల్ ఇంగ్లీష్ (40 మార్కులు) – ముఖ్యమైన టాపిక్స్:
ఇంగ్లీష్‌లో 40 మార్కులు సాధించడం చాలా సులభం, ఈ క్రింది అంశాలు ప్రాక్టీస్ చేయండి:
- Reading Comprehension
- Grammar: Parts of Speech, Tenses, Articles, Prepositions.
- Vocabulary: Synonyms, Antonyms.
- Error Detection.
- Fill in the Blanks.
- Basic usages of sentences
- Spelling mistakes
- One Word Substitutes
2. ప్రిపరేషన్ ప్లాన్ – ఎలా చదవాలి? (How to Prepare):
సిలబస్ తెలుసుకుంటే సరిపోదు, దానిని ఎలా చదవాలో ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఈ ఉద్యోగం సాధించడానికి మీరు ఫాలో అవ్వాల్సిన 4 ముఖ్యమైన స్టెప్స్ ఇవే:
స్టెప్ 1: సిలబస్‌పై పట్టు (Understand the Weightage): ముందుగా మీరు అప్లై చేసిన పోస్టులో ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉన్నాయో చూడండి. ఉదాహరణకు జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులు జికె (60 మార్కులు) కి ఎక్కువ సమయం కేటాయించాలి. ఆఫీస్ సబార్డినేట్ అభ్యర్థులు కేవలం జికె మీద మాత్రమే దృష్టి పెట్టాలి.
స్టెప్ 2: English బేసిక్స్: English కు సంబంధించి Basics నుండి చదవడం మొదలుపెట్టాలి. ఏ చిన్న అంశాన్ని కూడా వదిలివేయకూడదు.
స్టెప్ 3: తెలంగాణ అంశాలకే మొదటి ప్రాధాన్యత (Focus on Telangana): ఇది తెలంగాణ స్టేట్ నోటిఫికేషన్ కాబట్టి.. తెలంగాణ జాగ్రఫీ, చరిత్ర, సంస్కృతి మరియు ముఖ్యంగా ప్రభుత్వ పథకాల (Government Schemes) నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వీటిని అస్సలు వదలకండి.
స్టెప్ 4: ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్! చదవడం ఎంత ముఖ్యమో, ప్రాక్టీస్ చేయడం అంతకంటే ముఖ్యం. ప్రతిరోజూ కనీసం ఒక మోడల్ పేపర్ లేదా గత సంవత్సరాల పరీక్షా పేపర్లను (Previous Year Papers) సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
3. ప్రిపరేషన్ సమయం (Expected Preparation Days):
ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న.. పరీక్ష ఎప్పుడు ఉంటుంది? మనకు ప్రిపరేషన్‌కు ఎన్ని రోజులు సమయం దొరుకుతుంది?
గత రికార్డులను బట్టి చూస్తే, నోటిఫికేషన్ ముగిసిన తర్వాత సుమారు 2 నెలల్లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. అంటే మనకు సుమారుగా 60 రోజులు సమయం ఉండవచ్చు. ఈ 60 రోజులను మీరు ఒక యుద్ధంలా భావించి ప్రిపేర్ అవ్వాలి.
ఈ 60 రోజుల ప్లాన్ ఇలా ఉండాలి:
- మొదటి 40 రోజులు: సిలబస్‌ను పూర్తిగా చదవాలి. జికె మరియు ఇంగ్లీష్ లోని ప్రతి టాపిక్ కవర్ చేయాలి.
- చివరి 20 రోజులు: కొత్తవి ఏవీ చదవకుండా, కేవలం చదివిన దాన్ని రివిజన్ చేస్తూ.. ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు రాయాలి.
సమయం తక్కువగా ఉందని కంగారు పడకండి, పక్కా ప్లాన్‌తో చదివితే ఈ 60 రోజులు ఉద్యోగం సాధించడానికి సరిపోతాయి.
ఏప్రిల్‌లో పరీక్ష ఉంటె మనకు ఉన్నది కేవలం 60 రోజులే. ఒక్క రోజు వృథా చేసినా మీరు వేల మంది కంటే వెనుకబడిపోతారు. అందుకే ఈ రోజు నుండే మీ ప్రిపరేషన్ గట్టిగా మొదలుపెట్టండి. మీకు తోడుగా మా ఛానల్ నుండి ప్రతిరోజూ వీడియోలు మరియు ప్రాక్టీస్ బిట్స్ వస్తూనే ఉంటాయి.
4. రిఫరెన్స్ బుక్స్ (Reference Books):
సిలబస్ అంతా చదివినా.. సరైన పుస్తకాలు ఎంచుకోకపోతే మార్కులు రావు. ఈ కోర్టు ఉద్యోగాలకు మీరు ఫాలో అవ్వాల్సిన పుస్తకాలు:
1. జనరల్ నాలెడ్జ్ (GK) కోసం:
- 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న తెలంగాణా స్కూల్ పుస్తకాలు (Social & Science) చదవండి.
- ఉన్నత స్థాయి పోస్టులకు తెలుగు అకాడమీ, డిగ్రీ పుస్తకాలు కూడా చదవండి.
- స్టాటిక్ జికె కోసం లూసెంట్ (Lucent’s GK) లేదా విజేత కాంపిటీషన్స్ వారి GK బుక్ చాలా బాగుంటుంది.
2. తెలంగాణ అంశాల కోసం:
- తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ మరియు సంస్కృతి కోసం తెలుగు అకాడమీ వారి పుస్తకాలు ప్రామాణికం. లేదా సీనియర్ ఫ్యాకల్టీ రాసిన ఏదైనా మంచి పబ్లికేషన్ బుక్ (ఉదాహరణకు: విన్నర్స్ లేదా బి.కృష్ణారెడ్డి గారి బుక్స్) సరిపోతాయి.
3. జనరల్ ఇంగ్లీష్ కోసం:
- బేసిక్ గ్రామర్ కోసం రెన్ అండ్ మార్టిన్ (Wren & Martin) లేదా తెలుగు మీడియం విద్యార్థులైతే డి.వి. రమణ గారి ఇంగ్లీష్ గ్రామర్ బుక్ చాలా సులభంగా ఉంటుంది.
4. కరెంట్ అఫైర్స్:
- గత 12 నెలల కరెంట్ అఫైర్స్ కోసం షైన్ ఇండియా లేదా వివేక్ లేదా విజేత కాంపిటీషన్స్ వంటి మ్యాగజైన్లను ఫాలో అవ్వండి.”
5. పరీక్ష ఎప్పుడు నిర్వహించవచ్చు? (Expected Exam Dates):
ఇప్పుడు అందరినీ తొలిచే ప్రశ్న.. అసలు పరీక్ష ఎప్పుడు ఉంటుంది?
తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ సాధారణంగా చాలా వేగంగా ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 13న ముగిసిన తర్వాత సుమారు 2 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే, మనకు పరీక్షలు ఏప్రిల్ లేదా మే 2026 లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. హైకోర్టు పరీక్షలు అన్నీ ఒకే రోజు జరగవు. పోస్టుల సంఖ్య మరియు అభ్యర్థుల సంఖ్యను బట్టి వేర్వేరు షిఫ్టుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. అంటే ఏప్రిల్ మధ్యలో పరీక్షలు మొదలైతే, అవి కొన్ని రోజుల పాటు వరుసగా జరుగుతాయి.
6. పోటీ ఎలా ఉంటుంది? (District wise or General?)
ఈ నోటిఫికేషన్‌లో ఉన్న పోస్టులకు పోటీ ఎలా ఉంటుందో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
1. ఇవి జిల్లా స్థాయి ఉద్యోగాలు (District Level): అవును, ఇవి పూర్తిగా జిల్లా వారీగా (District Wise) భర్తీ చేసే పోస్టులు. అంటే మీరు ఏ జిల్లాలో అప్లై చేస్తే, ఆ జిల్లాలో ఉన్న ఖాళీలకు మాత్రమే మీరు పోటీ పడతారు. ఉదాహరణకు మీరు వరంగల్ జిల్లాకు అప్లై చేస్తే, మీ పోటీ వరంగల్ జిల్లా అభ్యర్థులతోనే ఉంటుంది.
2. లోకల్ రిజర్వేషన్ (95% Local): కొత్త లోకల్ క్యాడర్ నిబంధనల ప్రకారం 95% పోస్టులు ఆయా జిల్లాల లోకల్ అభ్యర్థులకే కేటాయించబడతాయి. మిగిలిన 5% పోస్టులకు మాత్రమే నాన్-లోకల్ (వేరే జిల్లాల వారు) పోటీ పడవచ్చు.
3. మరి స్టేట్ వైడ్ పోస్టులు లేవా? హైకోర్టులో ఉండే కొన్ని ప్రత్యేక పోస్టులు తప్ప, ఈ 859 జిల్లా కోర్టు పోస్టులన్నీ పూర్తిగా మీ మీ జిల్లాల పరిధిలోనే భర్తీ చేస్తారు. కాబట్టి మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే గొప్ప అవకాశం ఇది.
7. ప్రశ్నల సరళి – లోతు (Questions Depth):
చాలా మంది అడిగే ప్రశ్న.. ‘ఈ ఎగ్జామ్ గ్రూప్స్ లెవల్లో ఉంటుందా? లేక ఈజీగా ఉంటుందా?’ అని. దీని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను.
1. పోస్ట్ ను బట్టి ప్రశ్నల స్థాయి: మీరు అప్లై చేసే పోస్ట్‌ను బట్టి ప్రశ్నల కాఠిన్యం (Difficulty) మారుతుంది. ఉదాహరణకు, డిగ్రీ అర్హత ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ప్రశ్నలు కొంచెం లోతుగా, అనలిటికల్ గా ఉంటాయి. అదే 7వ తరగతి అర్హత ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ప్రశ్నలు చాలా సూటిగా (Direct Questions) ఉంటాయి.
2. నెగటివ్ మార్కింగ్ ఉందా?: ఇది అందరికీ ఒక పెద్ద ఊరట ఇచ్చే విషయం. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు అన్ని ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు గుర్తించవచ్చు.
3. ప్రశ్నాపత్రాలు ఏ భాషలో ఉంటాయి?: పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఉంటుంది. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు అస్సలు కంగారు పడక్కర్లేదు.
8. కట్-ఆఫ్ మార్కులు పోటీ విశ్లేషణ:
ఇప్పుడు అత్యంత కీలకమైన విషయం.. కట్-ఆఫ్ మార్కులు. గతంలో కంటే ఈసారి పోటీ చాలా భిన్నంగా ఉండబోతోంది. ఎందుకు అంటే:
1. జిల్లా వారీగా మారుతుంది (District Wise Variation): కట్-ఆఫ్ అనేది రాష్ట్రమంతటా ఒకేలా ఉండదు. మీ జిల్లాలో ఉన్న ఖాళీలు మరియు అక్కడ ఎంతమంది అప్లై చేశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, రంగారెడ్డి లేదా హైదరాబాద్ వంటి జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉండి కట్-ఆఫ్ పెరగవచ్చు, ఖాళీలు ఎక్కువగా ఉన్న ఇతర జిల్లాల్లో కొంచెం తక్కువగా ఉండవచ్చు.
2. పోటీ ఎందుకు ఎక్కువ?:
- వయో పరిమితి: ప్రభుత్వం వయస్సును 46 ఏళ్లకు పెంచింది, దీనివల్ల సీనియర్ అభ్యర్థులు కూడా భారీగా పోటీ పడుతున్నారు.
- ఎక్కువ అప్లికేషన్లు: నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సంఖ్య పెరగడం వల్ల గతంలో కంటే అప్లికేషన్లు ఎక్కువగా వస్తాయి.
- నెగటివ్ మార్కింగ్ లేదు: 100 కి 100 ప్రశ్నలు attempt చేయడం వల్ల మార్కులు సహజంగానే పెరుగుతాయి.
3. సేఫ్ జోన్ అంటే ఏంటి?: 100 మార్కులకు గాను.. మీరు ఏ జిల్లాలో ఉన్నా, ఏ కేటగిరీ అయినా సరే, ఉద్యోగం రావాలంటే 75 నుండి 85 మార్కులు సాధించేలా మీ ప్రిపరేషన్ ఉండాలి. అంతకంటే తక్కువ వస్తే పోటీలో నిలవడం కష్టమవుతుంది.
9. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి?
చాలా మంది అడుగుతున్న ప్రశ్న.. ‘ఈ కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లు ప్రతి ఏటా వస్తాయా? లేక ఎప్పుడో ఒకసారి వస్తాయా? అని. దీనిపై మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి.
1. క్యాలెండర్ ఫిక్స్‌డ్ కాదు: పోలీస్ ఉద్యోగాల లాగా దీనికి ఒక నిర్దిష్టమైన వార్షిక క్యాలెండర్ (Yearly Calendar) ఉండదు. అంటే ప్రతి ఏటా జనవరిలోనో లేదా జూన్ లోనో నోటిఫికేషన్ వస్తుందని మనం గ్యారెంటీగా చెప్పలేము.
2. ఖాళీల ఆధారంగా (Need Based): సాధారణంగా జిల్లా కోర్టుల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు, హైకోర్టు అనుమతితో నోటిఫికేషన్లు విడుదలవుతాయి. అయితే గత రెండు, మూడేళ్లుగా తెలంగాణలో కోర్టు ఉద్యోగాల భర్తీ చాలా వేగంగా, క్రమ పద్ధతిలో జరుగుతోంది.
3. సగటు కాల వ్యవధి: సాధారణంగా ప్రతి ఒకటి లేదా రెండు ఏళ్లకు ఒకసారి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకసారి నోటిఫికేషన్ వస్తే మాత్రం, ప్రక్రియ అంతా చాలా స్పీడ్ గా పూర్తవుతుంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక చదవడం కంటే, ఎప్పుడూ సిద్ధంగా ఉండటం ముఖ్యం.”
10. మేము ఏమి అందిస్తున్నాము? (What We Are Offering):
ఈ భారీ పోటీని తట్టుకుని, 100 మార్కుల పరీక్షలో మీరు విజయం సాధించాలంటే కేవలం చదవడం మాత్రమే సరిపోదు, సరైన గైడెన్స్ కూడా కావాలి. అందుకే మా ఛానల్ ద్వారా మీకు ఈ క్రింది సేవలను అందిస్తున్నాము:
1. లోతైన వివరణతో కూడి నవీడియోలు (Subject-wise Videos): సిలబస్‌లోని ప్రతి అంశాన్ని.. ముఖ్యంగా 60 మార్కుల జనరల్ నాలెడ్జ్ మరియు 40 మార్కుల ఇంగ్లీష్‌ను బేసిక్స్ నుండి ఏమీ తెలియని వారికి కూడా అర్థమయ్యేలా వీడియోల రూపంలో వివరిస్తాము. తెలంగాణ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వీడియోలు ఉంటాయి.
2. ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులు (Online Practice Tests): మీరు చదివిన దాన్ని పరీక్షించుకోవడానికి మా ఆన్‌లైన్ టెస్టులు ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో:
- గత ప్రశ్నా పత్రాలు (Previous Year Papers): గతంలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయి.
మోడల్ పేపర్లు & మాక్ టెస్టులు (Mock Tests): 100 మార్కుల ప్యాటర్న్ మరియు 120 నిమిషాల సమయానికి అనుగుణంగా మేము రూపొందించిన గ్రాండ్ టెస్టులు మీ టైమ్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుస్తాయి.
