🥇 టాప్ 3 విజేతలకు తలా రూ. 500 చొప్పున నగదు బహుమతి! 🥇
మీ ప్రిపరేషన్‌ను కొనసాగిస్తూనే ప్రతిభను నిరూపించుకోండి. ఇది పూర్తిగా ఉచితం మరియు ప్రతి నెల నిర్వహించబడుతుంది.
గవర్నమెంట్ జాబ్స్ మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ తమ ఎగ్జామ్స్‌లో విజయం సాధించాలని withchari.in ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మిమ్మల్ని మరింతగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, ప్రతి నెల ఈ ‘మెగా క్విజ్ కాంటెస్ట్’ నిర్వహించి, ఒక చిన్న నగదు బహుమతిని అందించాలని మేము నిశ్చయించాము.
గమనిక: విజేతలను క్రింద తెలిపిన నియమాల (Criteria) ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుంది.
-
Criteria 1 (ఆన్‌లైన్ టెస్ట్): మన వెబ్‌సైట్‌లో నిర్వహించే ప్రత్యేక ఆన్‌లైన్ టెస్ట్‌లో పాల్గొనడం. ఇందులో మొత్తం 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది.(గమనిక: ఈ పరీక్షలో నెగెటివ్ మార్కులు (0.25 Negative Marking) ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గించబడతాయి. కాబట్టి జాగ్రత్తగా సమాధానాలు గుర్తించండి). ఈ టెస్ట్ 5 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది.
-
Criteria 2 (సోషల్ మీడియా): మన YouTube ఛానల్ లోని ఈ టెస్ట్‌కు సంబంధించిన వీడియో మరియు Facebook పోస్ట్ కింద తప్పనిసరిగా కామెంట్ చేయాలి. +20 Bonus Points(వివరణ: వీడియో మరియు ఫేస్‌బుక్ పోస్ట్ కింద కామెంట్ చేయడం ద్వారా 20 పాయింట్లు బోనస్‌గా పొందండి. ఇందులో YouTube కామెంట్‌కు 10 మరియు Facebook కామెంట్‌కు 10 పాయింట్లు కేటాయించబడతాయి).
-
Criteria 3 (అంతర్గత పద్ధతులు): కొన్ని రివీల్ చేయలేనటువంటి ఇతర అంతర్గత సిస్టమ్ పద్ధతులు (ఇవి కేవలం 10% వరకు మాత్రమే ప్రభావం చూపుతాయి). 1 – 5 Points(గమనిక: ఈ పాయింట్లు పరీక్షా సమయం మొత్తం పూర్తయిన తర్వాత మ్యాన్యువల్‌గా అప్‌డేట్ చేయబడి ఓవరాల్ స్కోర్‌కు యాడ్ చేయబడతాయి. అంతవరకు లీడర్‌బోర్డ్‌లో “Pending…” అని చూపిస్తుంది. Ex: వీడియోలను Likes చేయడం, Share చేయడం, Subscribe చేసుకోవడం మరియు మీరు ఎంత తరచుగా మన వెబ్‌సైట్‌ను విజిట్ చేస్తున్నారు అనే అంశాల ఆధారంగా ఈ పాయింట్లు ఇవ్వబడతాయి).
వెబ్‌సైట్‌లో మీకు వచ్చిన User ID ని మీ YouTube మరియు Facebook కామెంట్లలో తప్పకుండా టైప్ చేయాలి. దీని ద్వారా మాత్రమే మీరు కామెంట్ చేశారో లేదో మాకు తెలుస్తుంది. ఆ తర్వాతే ఈ పాయింట్స్‌ను మీ ఫైనల్ స్కోర్‌కు యాడ్ చేయడం జరుగుతుంది.
టై బ్రేకర్ రూల్: ఒకవేళ పైన పేర్కొన్న అన్ని నిబంధనల తర్వాత కూడా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానమైన పాయింట్లు/మార్కులు వస్తే, లక్కీ డ్రా (Lottery) పద్ధతి ద్వారా పారదర్శకంగా టాప్ 3 విజేతలను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఒక అభ్యర్థి నెలలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఒక వ్యక్తి ఒకే మొబైల్ నంబర్, ఒకే UPI ఐడి లేదా ఒకే యూజర్ ఐడితో ఒక్కసారి మాత్రమే టెస్ట్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మల్టిపుల్ ఎంట్రీలు (ఒకటి కంటే ఎక్కువసార్లు రాయడం) ఇస్తే, వారు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా పోటీ నుండి పూర్తిగా డిస్క్వాలిఫై (Disqualify) చేయబడతారు.
ఈ ఐదు రోజుల టెస్ట్ కాలపరిమితి ముగిసిన 2 రోజుల తర్వాత విజేతల వివరాలను ప్రకటిస్తాము. టాప్ 3 విజేతల పేర్లను మన Website (withchari.in) లో, YouTube Video లో మరియు మన Facebook Page లో పోస్ట్ చేయడం జరుగుతుంది. విజేతలకు నేరుగా రూ. 500 చొప్పున UPI చేయబడుతుంది.
“అభ్యర్థులందరినీ withchari.in టీమ్ తరఫున ఒకటే అభ్యర్థిస్తున్నాము. ఈ క్విజ్ కాంటెస్ట్‌ను మీరు పూర్తి నీతిగా, నిజాయితీగా రాయండి. ఎక్కడా కాపీ చేయడానికి ప్రయత్నించకుండా.. గూగుల్ (Google) లేదా ఇతర AI టూల్స్ (AI Tools) సహకారం తీసుకోకుండా మీకు తెలిసిన సమాధానాలనే గుర్తించండి. మీ నిజాయితీనే మీ విజయానికి మొదటి మెట్టు. మీ స్వంత ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇదొక మంచి అవకాశం, కాబట్టి ఈ పోటీని ఎగ్జామ్ రూల్స్ ప్రకారం సీరియస్‌గా రాయాలని కోరుకుంటున్నాము.”
