4th Class EVS Bits: Part 1


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
కుటుంబ వ్యవస్థలో మార్పులు రావడానికి ముఖ్య కారణం ఏది?
పెళ్ళిళ్ళు.
పిల్లలు పుట్టడం.
కొత్త ప్రదేశాలలో ఉద్యోగాలు రావడం.
పైవన్నీ సరైనవే.
కుటుంబంలో పెళ్ళిళ్ళు జరగడం, కొత్త పిల్లలు పుట్టడం, ఉద్యోగాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లడం, బదిలీ కావడం, వ్యాపారం, చదువులు, బ్రతుకు తెరువు కోసం వలసపోవడం, భూకంపాలు – వరదలు రావడం, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం వంటి కారణాల వల్ల కుటుంబంలో మార్పులు వస్తాయి.
పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి?
సముద్రతీర ప్రాంతాలలో.
ఎడారి ప్రాంతాలలో.
పర్వత ప్రాంతాలలో.
మైదాన ప్రాంతాలలో.
పైన్, ఓక్ వంటి పొడవుగా పెరిగే వృక్షాలు ఎక్కువగా పర్వత ప్రాంతాలలో పెరుగుతాయి. ఈ వృక్షాలకు చల్లని వాతావరణం, తక్కువ ఉష్ణోగ్రతలు, మరియు మంచి నీటి ప్రవాహం అవసరం. ఎడారి ప్రాంతాల్లో తక్కువ నీరు ఉండటం వల్ల ఇవి పెరగవు. సముద్రతీర ప్రాంతాలు తేమతో నిండినవిగా ఉండి, వీటికి అనుకూలం కాదు.
బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కలు ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి?
ఎడారి ప్రాంతాలలో.
తేమతో నిండిన తీరప్రాంతాలలో.
మైదాన ప్రాంతాలలో.
పర్వత ప్రాంతాలలో.
బ్రహ్మజెముడు, నాగజెముడు మొక్కలు ఎడారి మరియు పొడి ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతాయి. ఎడారి మొక్కలు వాటి దళసరి కాండాలలో నీటిని నిల్వ చేసుకొని ఉపయోగించుకుంటాయి. ఇవి తక్కువ నీటి అవసరంతో పెరుగతాయి.
క్రింది వాటిలో వేర్లలో ఆహారాన్ని నిల్వ చేసుకునే మొక్కలు ఏవి?
క్యారెట్.
ముల్లంగి.
బీట్ రూట్.
పైవన్నీ సరైనవే.
క్యారెట్, ముల్లంగి, బీట్‌రూట్ వంటి మొక్కలు తమ వేర్లలోనే ఆహారాన్ని నిల్వ చేస్తాయి. అందువల్ల ఈ వేర్లు ఉబ్బిపోతాయి మరియు మనం కూరగాయలుగా ఉపయోగించేవి కూడా ఈ నిల్వైన భాగాలే.
క్రిందివాటిలో నీటిపై తేలే మొక్కలు ఏవి?
డక్ వీడ్, తామర.
గుర్రపుడెక్క, తామర.
తామర, కలువ.
డక్ వీడ్, గుర్రపుడెక్క.
నీటిపై తేలే మొక్కలు డక్ వీడ్ మరియు గుర్రపుడెక్క. ఇవి నీటిలో స్వేచ్ఛగా తేలుతూ, నీటి ఉపరితలంపై చిన్న ఆకులుగా విస్తరిస్తాయి. ఈ మొక్కలు నీటిలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి.
మడ చెట్లు ఏ రకమైన నేలల్లో పెరుగుతాయి?
మైదానాలు.
బురద లేదా చిత్తడి నేలలు.
ఇసుక నేలలు.
ఎర్రమట్టి నేలలు.
మడ చెట్లు బురద మరియు చిత్తడి నేలల్లో పెరుగుతాయి. ఈ చెట్లు నీటి ప్రవాహానికి దగ్గరగా ఉండే తడి ప్రాంతాల్లో జీవించడానికి అనుకూలంగా ఉంటాయి మరియు వేర్లు నీటిలోనే పెరిగే సామర్థ్యం కలిగి ఉంటాయి.
తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
చిన్న కుటుంబం.
ఉమ్మడి కుటుంబం.
పెద్ద కుటుంబం.
ఏదీ కాదు.
తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబాన్ని చిన్న కుటుంబం అంటారు. ఇది పరిమిత కుటుంబ నిర్మాణం. దీనినే వ్యష్టి కుటుంబం అని కూడా పిలుస్తారు.
బ్లాక్ బెర్రీ వృక్షాలు సాధారణంగా ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి?
పర్వత ప్రాంతాలలో.
మైదాన ప్రాంతాలలో.
సముద్రతీర ప్రాంతాలలో.
పైవన్నీ సరైనవే.
బ్లాక్ బెర్రీ, మర్రి, రావి, మామిడి, చింత వంటి వృక్షాలు ఎక్కువగా మైదాన ప్రాంతాలలో పెరుగుతాయి. మైదాన ప్రాంతాల్లో తక్కువ తేమ, మితమైన ఉష్ణోగ్రతలు, మరియు సారవంతమైన నేలలు ఉండడం వల్ల ఇవి బాగా అభివృద్ధి చెందుతాయి. పర్వత ప్రాంతాలు లేదా తీరప్రాంతాలు వీటి పెరుగుదలకు అంత అనుకూలం కావు.
క్రిందివాటిలో వేటి వినియోగంలో ఉపయోగించే వాయువులవల్ల వాతావరణం కలుషితం అవుతుంది?
ఎయిర్ కండిషనర్లు, ఎయిర్ కూలర్లు.
ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు.
ఎయిర్ కండిషనర్లు, సీలింగ్ ఫ్యాన్లు.
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు.
ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం ప్రస్తుత కాలంలో సర్వ సాధారణం అయ్యింది. ఈ ఉపకరణాలలో చల్లదనం కోసం ఉపయోగించే వాయువులు బయటకు వెలువడిన తర్వాత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి.
మొక్కలలో వేర్లు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉంటాయి?
2 రకాలు.
3 రకాలు.
4 రకాలు.
5 రకాలు.
మొక్కలలో వేర్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. 1) తల్లి వేరు: ఇది ఒక బలమైన ప్రధాన వేరును కల్గి ఉంటుంది. ఇది నేలలోకి బలంగా చొచ్చుకు పోతుంది. ప్రధాన వేరుకి అన్నివైపులా సన్నని వేర్లు పెరుగుతాయి. 2) గుబురు లేదా పీచు వేర్లు: ఇందులో కాండం అడుగు భాగం నుండి అనేక సన్నని చిన్న వేర్లు గుంపుగా, గుబురుగా పెరుగుతాయి.
క్రిందివాటిలో ఏ కుటుంబాలు నేటికీ సమాజంలో కనబడుతూ ఉంటాయి?
ఏక సంరక్షక కుటుంబాలు.
తాతయ్య నాయనమ్మల కుటుంబాలు.
తల్లిపై ఆధారపడే కుటుంబాలు.
పైవన్నీ సరైనవే.
నేటికీ సమాజంలో వివిధ రకాల కుటుంబాలు ఉన్నాయి. ఏక సంరక్షక కుటుంబాలు, తాతయ్య నాయనమ్మల కుటుంబాలు, తల్లిపై ఆధారపడే కుటుంబాలు—అన్ని సాంప్రదాయ, ఆధునిక సమాజంలో కనబడతాయి.
మొక్కలను వాటి నివాస స్థలాల ఆధారంగా ఎన్నిరకాలుగా వర్గీకరించవచ్చు?
2 రకాలు.
5 రకాలు.
4 రకాలు.
3 రకాలు.
మొక్కలను వాటి నివాస స్థలాల ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి 1) నేలపై పెరిగే మొక్కలు: ఇవి మైదానాలు, పర్వతాలపై పెరిగే మొక్కలు. 2) నీటిలో పెరిగే మొక్కలు: ఇవి నీటిలో పెరుగుతాయి.
వేప, చింత చెట్లు ఏ రకమైన వేర్లను కలిగి ఉంటాయి?
గుబురు వేర్లు.
తల్లి వేర్లు.
పీచు వేర్లు.
పైవన్నీ సరైనవే.
వేప, చింత చెట్లు లోతుగా నేలను ఛేదించి పెరుగుతున్న తల్లి వేర్లను కలిగి ఉంటాయి. ఇవి మొక్కలకు బలమైన ఆధారం అందించి, లోతైన నేల నుంచి నీరు, పోషకాలు గ్రహించడంలో సహాయపడతాయి.
క్రిందివాటిలో సరైన దానిని గుర్తించండి?
తండ్రికి సోదరుడు – మామ.
తండ్రికి తల్లి – అమ్మమ్మ.
తల్లికి తల్లి – నాయనమ్మ.
తండ్రికి సోదరి – అత్త.
తండ్రికి సోదరిని అత్త లేదా మేనత్త అని పిలుస్తారు. తండ్రికి సోదరుడిని పెద్దనాన్న లేదా బాబాయి అని, తండ్రికి తల్లిని నాయనమ్మ అని, తల్లికి తల్లిని అమ్మమ్మ అని పిలుస్తారు.
క్రిందివాటిలో నీటిలోపల పెరిగే మొక్కలు ఏవి?
హైడ్రిల్లా, టేప్ గ్రాస్.
తామర, కలువ.
డక్ వీడ్, గుర్రపుడెక్క.
తామర, హైగ్రోఫిలా.
నీటిలోపల పెరిగే మొక్కలు హైడ్రిల్లా, టేప్ గ్రాస్. నీటి అడుగున వేర్లు ఉండి, మొత్తం మొక్క నీటిలోనే పెరుగుతుంది. ఇవి ఆక్వాటిక్ జీవులకు ఆహారం, ఆశ్రయం కల్పిస్తాయి మరియు నీటిలో ఆక్సిజన్ విడుదల చేస్తాయి.
వేర్లు సాధారణంగా ఏ రంగులో ఉంటాయి?
పసుపు రంగు.
ఆకుపచ్చ రంగు.
నీలం రంగు.
బూడిద రంగు.
వేర్లలో సాధారణంగా పచ్చని రంగు (క్లోరోఫిల్) ఉండదు. అవి నేలలో పెరుగుతూ మట్టితో సన్నిహితంగా ఉండే కారణంగా ఎక్కువగా బూడిద రంగులో కనిపిస్తాయి.
వరి, జొన్న, మొక్క జొన్న మొదలైనవి ఏ రకమైన వేర్లను కలిగి ఉంటాయి?
ప్రధాన వేర్లు.
తల్లి వేర్లు.
గుబురు వేర్లు.
పైవన్నీ సరైనవే.
వరి, జొన్న, మొక్క జొన్న వంటి మొక్కలు గుబురు లేదా పీచు వేర్ల వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ రకమైన వేర్లు మట్టిలో సమతలంగా విస్తరించి, మట్టిలోని నీరు, పోషకాలను సమర్థవంతంగా గ్రహిస్తాయి.
పూర్వకాలంలో కుటుంబాలు ఎలా ఉండేవి?
వ్యష్టి కుటుంబాలు.
పెద్ద కుటుంబాలు.
ఏక సంరక్షక కుటుంబాలు.
చిన్న కుటుంబాలు.
పూర్వకాలంలో పెద్ద కుటుంబాలు ఉండేవి. వీటినే ఉమ్మడి లేదా సమిష్టి కుటుంబాలు అని కూడా పిలుస్తారు. ఈ కుటుంబాలలో తాతయ్య, నానమ్మ, పెద్ద నాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మ, తల్లిదండ్రులు, పిల్లలంతా కలసి ఉంటారు.
కుటుంబ సభ్యులు, పూర్వీకుల వివరాలను గురించి ఏది తెలియజేస్తుంది?
కల్పవృక్షం.
వంశకుటుంబం.
వంశవృక్షం.
వంశపాదుకం
ఒక కుటుంబానికి చెందిన పూర్వీకుల వివరాలను, వారి సంబంధాలను, తరాల వారీగా చూపించే చిత్ర రూపమే వంశవృక్షం. ఇది కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడానికి మరియు వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
మొక్కలలో ఉండే వ్యవస్థలకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
ప్రకాండ వ్యవస్థ .
వేరు వ్యవస్థ.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
మొక్కలలో ప్రధానంగా రెండు వ్యవస్థలు ఉంటాయి — వేరు వ్యవస్థ మరియు ప్రకాండ వ్యవస్థ. వేరు వ్యవస్థ మొక్కను నేలలో పాతుకుపోయి ఉంచి నీరు, పోషకాలు గ్రహిస్తుంది. ప్రకాండ వ్యవస్థలో కాండం, ఆకు, పుష్పం వంటి భాగాలు ఉంటాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top