📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
క్రిందివాటిలో వేటికి సునిశితమైన ఘ్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది?
పిల్లులు, కుక్కలు.
మేకలు, గొర్రెలు.
కుందేళ్ళు, జింకలు.
కుక్కలు, ఆవులు.
ఘ్రాణశక్తి అంటే వాసనను గుర్తించే శక్తి. పిల్లులు మరియు కుక్కలు వేట జంతువులు కావడంతో, వీటికి అత్యంత సునిశితమైన ఘ్రాణశక్తి ఉంటుంది.
చెవిలో ఉండే అత్యంత సున్నితమైన భాగం ఏది?
కర్ణిక.
కర్ణభేరి.
చెవి చిప్ప.
చెవి కాలువ.
చెవిలో ఉండే అత్యంత సున్నితమైన భాగం కర్ణభేరి. ఇది శబ్ద తరంగాలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడుకు పంపుతుంది. ఇందులో ఉన్న సున్నితమైన కణాలు శబ్దాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈగకు ఎన్ని కళ్ళు ఉంటాయి?
2 కళ్ళు.
3 కళ్ళు.
4 కళ్ళు.
5 కళ్ళు.
ఈగకు మొత్తం ఐదు కళ్ళు ఉంటాయి: అవి, రెండు పెద్ద సమ్మేళన కళ్ళు (compound eyes): ఇవి విస్తృత దృష్టి కోణంతో వస్తువుల చిత్రాలను చూపిస్తాయి. మూడు సాధారణ చిన్న కళ్ళు (ocelli eyes): ఇవి తల మీద చిన్నవిగా ఉంటాయి మరియు కాంతిని గుర్తించడానికి సహాయపడతాయి.
క్రిందివాటిలో ఏ జంతువు పొడవైన నాలుకను కల్గి ఉంటుంది?
కంగారూ.
జిరాఫీ.
ఒంటె.
పైవన్నీ సరైనవే.
జిరాఫీ నాలుక చాలా పొడవుగా ఉంటుంది. ఇది సుమారు 18–20 అంగుళాల (45–50 సెం.మీ.) వరకు ఉంటుంది. చెట్లపై ఉన్న ఆకులను సులభంగా తెంచి తినడంలో మరియు చెట్ల ముళ్లను తప్పించుకుని ఆహారం పొందడంలో ఈ పొడవైన నాలుక ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ఏనుగులు సుమారు ఎంత దూరం నుండి నీటి జాడను గుర్తించగలవు?
1 కిలో మీటరు.
2 కిలో మీటర్లు.
3 కిలో మీటర్లు.
1.5 కిలో మీటర్లు.
ఏనుగులకు అత్యంత అద్భుతమైన ఘ్రాణశక్తి ఉంటుంది. ఇవి సుమారు 3 కిలోమీటర్ల దూరం నుండి నీటి జాడలను గుర్తించగలవు. ఇది వాటి తొండం మరియు ముక్కు నిర్మాణం వల్ల సాధ్యమవుతుంది. ఈ సామర్థ్యం వలన అడవుల్లో నీటి వనరులను గుర్తించి తమ మందలను దారి తీస్తాయి.
క్రిందివాటిలో నిశాచర జీవులు ఏవి?
గబ్బిలాలు, గద్దలు.
గుడ్లగూబలు, డేగలు.
గబ్బిలాలు, గుడ్లగూబలు.
గద్దలు, డేగలు.
నిశాచర జీవులు అంటే రాత్రిపూట చురుకుగా ఉండే జీవులు. గబ్బిలాలు మరియు గుడ్లగూబలు రాత్రిలో ఆహారం కోసం బయటకు వస్తాయి. ఇవి రాత్రి దృష్టిని మరియు అత్యంత వినికిడి సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. అందుకే ఇవి నిశాచర జీవులుగా చెప్పబడతాయి.
బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఎవరు?
నికోలస్ బ్రెయిలీ.
హెర్మన్ బ్రెయిలీ.
లూయిస్ బ్రెయిలీ.
బ్రెయిలీ రస్కిన్.
బ్రెయిలీ లిపిని కనుగొన్నవారు ఫ్రెంచ్ విద్యావేత్త అయిన లూయిస్ బ్రెయిలీ. చిన్నతనంలో ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయిన ఆయన, అంధులు మరియు దృష్టి లోపం ఉన్నవారి కోసం స్పర్శ ద్వారా చదవడానికి మరియు రాయడానికి వీలుగా ఈ లిపిని అభివృద్ధి చేశారు.
క్రిందివాటిలో ఏ పక్షులు మంచి కనుదృష్టిని కలిగి ఉంటాయి?
గద్ద, రాబందు, డేగ.
గద్ద, పావురం, డేగ.
గద్ద, గిజిగాడు, రాబందు.
గద్ద, టైలర్ బర్డ్, గిజిగాడు.
గద్ద, రాబందు, మరియు డేగ పక్షులు వేటపక్షులుగా ప్రసిద్ధి. వీటికి దూరంలోని చిన్న ఆహారాన్ని కూడా చూసే అత్యంత పదునైన మరియు శక్తివంతమైన కనుదృష్టి ఉంటుంది. వీటి కంటి నిర్మాణం, రెటీనా లోని కణాల సాంద్రత, మరియు దృష్టి కోణం చాలా అధికంగా ఉంటుంది.
మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది?
కాలేయం.
చర్మం.
ఊపిరితిత్తులు.
ఫీమర్.
మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. ఇది శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచి రక్షణనిస్తుంది. సగటున, మానవ శరీరంలో చర్మం యొక్క విస్తీర్ణం సుమారు 1.5 నుండి 2.0 చదరపు మీటర్లు (15 నుండి 20 చదరపు అడుగులు) ఉంటుంది.
జ్ఞానేంద్రియాలన్నింటిలో స్పర్శ పరంగా అత్యంత సున్నితమైనది ఏది?
చర్మం.
కళ్ళు.
ముక్కు.
నాలుక.
జ్ఞానేంద్రియాలన్నింటిలో స్పర్శ పరంగా అత్యంత సున్నితమైనది చర్మం. మన శరీరంలో చర్మం మొత్తం మీద నాడులు విస్తరించి ఉండటం వల్ల అది స్పర్శ, చలి, వేడి, నొప్పి వంటి అనుభూతులను వెంటనే గుర్తిస్తుంది.
క్రిందివాటిలో PWD చట్టం - 2016 ప్రకారం దివ్యాంగులు అంటే ఎవరు?
నడువలేనివారు, చూడలేనివారు మాత్రమే.
వినలేనివారు, మాట్లాడలేనివారు మాత్రమే.
నడువలేనివారు, మాట్లాడలేనివారు మాత్రమే.
నడువలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారందరూ.
PWD (Persons with Disabilities) చట్టం 2016 ప్రకారం నడువలేనివారు, చూడలేనివారు, వినలేనివారు, మాట్లాడలేనివారిని దివ్యాంగులు అంటారు. వారినే విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని కూడా అంటారు. వారికి సమాన అవకాశాలు, రక్షణ, సదుపాయాలు కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం.
ఆగస్టు 15 న ఏ దినోత్సవాన్నిజరుపుకుంటారు?
గణతంత్ర దినోత్సవం.
స్వాతంత్ర్య దినోత్సవం.
రాజ్యాంగ దినోత్సవం.
ఓటర్ల దినోత్సవం.
ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటారు. గణతంత్ర దినోత్సవం → జనవరి 26న, రాజ్యాంగ దినోత్సవం → నవంబర్ 26న, ఓటర్ల దినోత్సవం → జనవరి 25న జరుపుకుంటారు.
వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏమిటి?
స్నానం చేయడం.
దంతాలను శుభ్రపరచుకోవడం.
చేతులను కడుక్కోవడం.
పైవన్నీ సరైనవే.
వ్యక్తిగత పరిశుభ్రత అంటే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం, దంతాలను శుభ్రపరచడం, గోళ్ళను కత్తిరించడం, వస్త్రాలు శుభ్రంగా ఉంచడం వంటి అలవాట్లు మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
పాములు దేని ద్వారా వాసనను పసిగడుతాయి?
చర్మం ద్వారా.
తోక ద్వారా.
నాలుక ద్వారా.
పైవన్నీ సరైనవే.
పాములు ఇతర జంతువుల వలె ముక్కుతో వాసన చూడవు. ఇవి నాలుకను బయటకు తీసి, గాలిలోని రసాయనాలను జాకబ్సన్ అవయవం అనే ప్రత్యేక భాగానికి పంపిస్తాయి. ఇది మెదడుకు సంకేతాలు పంపి వాసనను గుర్తించేందుకు సహాయపడుతుంది.
స్నిఫర్ కుక్కలను పోలీసులు వేటి అన్వేషణలో ఉపయోగిస్తారు?
నేరస్తులను గుర్తించడానికి.
దాచి ఉంచిన బాంబులను కనుగొనడానికి.
దాచి ఉంచిన ఆయుధాలను కనుగొనడానికి.
పైవన్నీ సరైనవే.
స్నిఫర్ కుక్కలకు అత్యంత సున్నితమైన ఘ్రాణశక్తి ఉంటుంది. వీటికి నేరస్తులను గుర్తించడానికి, దాచి ఉంచిన బాంబులను మరియు ఆయుధాలను కనుగొనడానికి, మత్తు పదార్థాలు దాచిన ప్రదేశాలను గుర్తించడానికి పోలీసువారు తర్ఫీదును ఇచ్చి వాటిని డాగ్ స్క్వాడ్ గా ఉపయోగిస్తారు.
క్రిందివాటిలో ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు ఏవి?
కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు.
కప్పలు, ఉడుతలు, పాములు.
బల్లులు, పాములు, ఉడుతలు.
ఊసరవెల్లులు, కోతులు, ఉడుతలు.
కప్పలు, బల్లులు మరియు ఊసరవెల్లులు తమ నాలుక సహాయంతో ఆహారాన్ని పట్టుకుంటాయి. ఇవి నాలుకను ప్రధానంగా ఆహార సంపాదనకు ఉపయోగించే జీవులు.
ముక్కు యొక్క ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించి క్రిందివాటిలో సరి కానిది ఏది?
ముక్కులో ఎటువంటి వస్తువులను పెట్టుకోకూడదు.
ముక్కులో ఎప్పటికప్పుడు వేళ్ళు పెట్టుకొని శుభ్రం చేసుకోవాలి.
ఎల్లప్పుడూ నోటితో కంటే, ముక్కుతోనే గాలిని పీల్చడం మంచిది.
జలుబు కారణంగా ముక్కు పూడుకు పోయినట్లయితే ఆవిరి పట్టడం మంచిది.
ముక్కులో వేళ్ళు పెట్టుకొని శుభ్రం చేసుకోవడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు మరియు అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముక్కు రక్షణ కోసం ముక్కులో ఎలాంటివస్తువులు పెట్టుకోకూడదు. నోటితో కంటే ముక్కుతో శ్వాస తీసుకోవడం మంచిది. అవసరమైనప్పుడు ఆవిరి పట్టడం ఊపిరితిత్తులకు, ముక్కుకు ఉపశమనం ఇస్తుంది.
ప్రముఖ దివ్యాంగురాలైన సుధాచంద్రన్ ఎవరు?
నర్తకి.
గాయని.
క్రీడాకారిణి.
డాక్టర్.
సుధా చంద్రన్ ఒక ప్రసిద్ధ భారతీయ భరతనాట్య నర్తకి మరియు నటి. ఆమె ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినా కృత్రిమ కాలు సాయంతో నాట్యం కొనసాగించారు. ఆమె జీవితం దివ్యాంగుల ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు ప్రతీకగా నిలిచింది.
చెవులను శుభ్రం చేసుకోవడానికి క్రిందివాటిలో దేనిని ఉపయోగించాలి?
హెయిర్ పిన్నులు మాత్రమే.
అగ్గిపుల్లలు మాత్రమే.
పిన్నీసులు మాత్రమే.
ఏదీ కాదు.
చెవులను శుభ్రం చేసుకోవడానికి హెయిర్ పిన్నులు, అగ్గిపుల్లలు, పిన్నీసులు వంటి వస్తువులు ఉపయోగించడం వల్ల చెవి లోపలి భాగం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని చెవిని శుభ్రపరచడం అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పుట్టుకతోనే అంధత్వం కలిగిఉన్న రవీంద్ర జైన్ ఎవరు?
క్రీడాకారుడు.
లాయర్.
గాయకుడు.
IAS అధికారి.
రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధత్వాన్ని కలిగి ఉన్నారు. కంటి చూపు లేకపోయినప్పటికీ ఆయనలోని ప్రతిభ, కఠోరమైన శ్రమ ఆయనకు సినిమా ప్రపంచంలో గాయకునిగా గొప్ప స్థానాన్ని, విజయాన్ని అందించాయి. అలాగే అతడు ఒక సంగీత దర్శకుడు మరియు గీత రచయిత కూడా.
