వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు – Test 1


🕒 21 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 21
🟢 0 🔴 0
35:00
కింది వాటిలో వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగించే విశ్లేషణలు ఏవి?
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ.
ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ.
ఉత్పత్తి విశ్లేషణ.
A మరియు B మాత్రమే సరైనవి.
సమోపాంత ప్రయోజన సూత్రాన్ని ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
గరిష్ట సంతృప్తి సూత్రం.
చరానుపాతాల సూత్రం.
గాసెన్ ద్వితీయ సూత్రం.
A మరియు C మాత్రమే సరైనవి.
క్రిందివాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క పరిమితులు (Limitations) ఏవి?
మన్నిక గల వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
పూరక వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు.
స్టాంపులు, నాణేల సేకరణ వంటి హాబీలకు ఈ సూత్రం వర్తించదు.
పైవన్నీ సరైనవే.
ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను అభివృద్ధి చేసింది ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్.
ఆడమ్ స్మిత్.
హిక్స్ మరియు అలెన్.
అమర్త్య సేన్.
ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది?
ప్రయోజనాన్ని సంఖ్యల రూపంలో కొలవడం.
ప్రయోజనాన్ని ర్యాంకుల రూపంలో కొలవడం.
వినియోగదారుని తృప్తిని utils ద్వారా కొలవడం.
ఇది H.H. గాసెన్ అభివృద్ధి చేసిన సిద్ధాంతం.
క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించి, మొత్తం ప్రయోజనం మరియు ఉపాంత ప్రయోజనాల మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
ఉపాంత ప్రయోజనం ధనాత్మకంగా ఉండి తగ్గుతున్నప్పుడు, మొత్తం ప్రయోజనం తగ్గుతున్న రేటుతో పెరుగుతుంది.
ఉపాంత ప్రయోజనం సున్నాకి సమానంగా ఉన్నప్పుడు, మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంటుంది.
ఉపాంత ప్రయోజనం రుణాత్మకమైనప్పుడు, మొత్తం ప్రయోజనం తగ్గుతుంది.
పైవన్నీ సరైనవే.
"ఉదాసీనతా వక్రరేఖల" విశ్లేషణ ఏ సిద్ధాంతానికి చెందింది?
కార్డినల్ ప్రయోజన సిద్ధాంతం.
మార్కెట్ విశ్లేషణ సిద్ధాంతం.
ఉత్పత్తి విశ్లేషణ సిద్ధాంతం.
ఆర్డినల్ ప్రయోజన సిద్ధాంతం.
క్రిందివాటిలో "కార్డినల్ సంఖ్యలు"ను గుర్తించండి.
1, 2, 3, 4, ....
1st, 2nd, 3rd, 4th, …….
A, B, C, D, .....
A మరియు B మాత్రమే సరైనవి.
సమోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా వివరించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్.
లయనెల్ రాబిన్స్.
H.H. గాసెన్.
పాల్ శామ్యూల్ సన్ .
క్రిందివాటిలో దేనిని "గాసెన్ ప్రథమ సూత్రం"గా పరిగణిస్తారు?
సమోపాంత ప్రయోజన సూత్రం.
వినియోగదారుని సమతుల్యత సిద్ధాంతం.
క్షీణోపాంత ప్రయోజన సూత్రం.
డిమాండ్ సూత్రం.
క్రిందివాటిలో కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగా రూపొంచబడినవి ఏవి?
క్షీణోపాంత ప్రయోజన సూత్రం.
సమోపాంత ప్రయోజన సూత్రం.
ఉదాసీనతా వక్రరేఖల విశ్లేషణ.
A మరియు B మాత్రమే సరైనవి.
క్రిందివాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రమేయం కానిది ఏది?
ఈ సూత్రం కార్డినల్ ప్రయోజన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది.
వినియోగదారుని అభిరుచులు, ప్రాధాన్యతలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు.
ద్రవ్యంయొక్క ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది.
వస్తువు యొక్క వినియోగం క్రమంగా లేదా నిరాటంకంగా ఉండాలి.
క్రిందివాటిలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
పన్ను విధానాలను రూపొంచడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.
డిమాండ్ సూత్రానికి ప్రాతిపదికగా పనిచేస్తుంది.
ఆదాయ-సంపద పునఃపంపిణీలో ముఖ్య పాత్ర వహిస్తుంది.
పైవన్నీ సరైనవే.
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ద్వారా వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేసిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
పాల్ శామ్యూల్ సన్.
ఆల్ఫ్రెడ్ మార్షల్.
H.H. గాసెన్.
R.J.D. హిక్స్.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని మొదటిసారిగా వివరించిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్.
R.J.D. హిక్స్.
H.H. గాసెన్.
పాల్ శామ్యూల్ సన్ .
కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏమిటి?
ప్రయోజనాన్ని సంఖ్యా రూపంలో కొలవడం.
ప్రయోజనాన్ని ర్యాంకుల రూపంలో కొలవడం.
A మాత్రమే సరైనది.
A మరియు B రెండూ సరైనవే.
సమోపాంత ప్రయోజన సూత్రం ప్రకారం వినియోగదారుడు ఏ విధంగా తన ఆదాయాన్ని ఖర్చు చేస్తాడు?
ఎక్కువ ప్రయోజనం కలిగించే వస్తువుపై మాత్రమే ఖర్చు చేస్తాడు.
ప్రతి వస్తువుకి సమాన ఖర్చు కలిగేలా ఖర్చు చేస్తాడు.
ఉపాంత ప్రయోజనం సమానంగా వచ్చేలా ఖర్చు చేస్తాడు.
ధర తక్కువగా ఉన్న వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తాడు.
అర్థశాస్త్ర పరిభాషలో "ప్రయోజనం" అంటే ఏమిటి?
వస్తువు లేదా సేవలకు ఉండే కోరికను సంతృప్తి పరచగలిగే శక్తి.
వినియోగదారుడు ఖర్చు చేసిన మొత్తం ఆధారంగా లభించే లాభం.
వస్తువు మార్కెట్ విలువ ఆధారంగా గల లాభదాయకత.
వినియోగదారుడి ఆదాయాన్ని వృద్ధి చేసే సామర్థ్యం.
క్రిందివాటిలో "ఉపాంత ప్రయోజనం" (Marginal Utility) దేనిని తెలియజేస్తుంది?
ప్రతి అదనపు యూనిట్ వినియోగం ద్వారా పొందే మొత్తం ప్రయోజనం.
ప్రతి అదనపు యూనిట్ వినియోగం ద్వారా పొందే అదనపు ప్రయోజనం.
ప్రతి యూనిట్ వినియోగం తర్వాత పొందే సగటు ప్రయోజనం.
వినియోగదారుడు కోరిన గరిష్ఠ యూనిట్ల పరిమితి.
క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని శాస్త్రీయ పద్ధతిలో అభివృద్ధి చేసిన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరు?
ఆల్ఫ్రెడ్ మార్షల్.
R.J.D. హిక్స్.
H.H. గాసెన్.
లయనెల్ రాబిన్స్.
వినియోగదారుని సమతౌల్యం (Consumer Equilibrium) సాధించబడే సమీకరణం ఏమిటి?
Px/MUx = Py/Muy.
MUx/Px = MUy/Py.
TU = MU × Q.
Px × Qx = Py × Qy..

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


1 thought on “వినియోగదారుని ప్రవర్తనా సిద్ధాంతాలు – Test 1”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top