Geography – Test 2


🕒 30 MCQs | 40 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 30
🟢 0 🔴 0
40:00
సూర్యకేంద్రక (Heliocentric) సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు?
టాలమీ.
గెలీలియో.
కోపర్నికస్.
కేప్లర్.
సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని 16వ శతాబ్దంలో నికోలస్ కోపర్నికస్ అభివృద్ధి చేశాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు విశ్వం కేంద్రంలో ఉంటాడని, భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని వివరించారు. ఇది భూకేంద్రక సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా శాస్త్రీయ విప్లవానికి బాటలు వేసింది.
భౌమ గ్రహాలు లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు అని వేటిని పిలుస్తారు?
బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్.
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు.
భూమి, గురుడు, శని, అంగారకుడు.
శుక్రుడు, నెప్ట్యూన్, యురేనస్, బుధుడు.
భౌమ గ్రహాలు లేదా టెరెస్ట్రియల్ గ్రహాలు అనేవి రాతి, లోహాలతో ఏర్పడిన గ్రహాలు. వీటికి దట్టమైన, లోహపు కోర్ మరియు సిలికేట్ మాంటిల్ ఉంటాయి. సౌర వ్యవస్థలో, సూర్యుడికి దగ్గరగా ఉన్న అంతర్గత గ్రహాలైన బుధుడు, శుక్రుడు, భూమి మరియు అంగారక గ్రహాలను భౌమ గ్రహాలు అంటారు. ఎందుకంటే ఇవి ఘన ఉపరితలాలను కలిగి ఉంటాయి.
ఒక ప్రదేశం గ్రీనిచ్ కంటే 60° పడమర ఉంటే, సమయం ఎంత వెనకబడి ఉంటుంది?
4 గంటలు 30 నిమిషాలు.
4 గంటలు.
5 గంటల 30 నిమిషాలు.
5 గంటలు.
భూమి 1° రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి, 60°×4 నిమిషాలు = 240 నిమిషాలు = 4 గంటలు. అయితే 60° పడమర వైపున అంటే, గ్రీనిచ్ నుండి పడమరకు వెళ్ళేకొలది సమయం వెనకబడి పోతుంది లేదా తగ్గుతుంది. కాబట్టి 60° పడమర వైపున ప్రదేశం సమయం గ్రీనిచ్ కంటే 4 గంటలు వెనకబడి ఉంటుంది.
రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
భూమి (Earth).
శుక్రుడు (Venus).
బుధుడు (Mercury).
అంగారకుడు (Mars).
'రెడ్ ప్లానెట్' (ఎరుపు గ్రహం) అని అంగారక గ్రహాన్ని పిలుస్తారు. ఎందుకంటే దాని ఉపరితలంపై ఉన్న ఐరన్ ఆక్సైడ్ (తుప్పు) కారణంగా అది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అలాగే దాని ఎరుపు రంగును బట్టి దీనికి రోమన్ యుద్ధ దేవుడైన మార్స్ (Mars) పేరు పెట్టారనే వాదన కూడా ఉంది.
భారతదేశంలో కర్కట రేఖను రెండు సార్లు దాటే నది ఏది?
గోదావరి నది.
నర్మదా నది.
మాహి నది.
కృష్ణా నది.
భారతదేశంలో కర్కట రేఖను రెండుసార్లు దాటే ఏకైక నది మాహి నది (Mahi River). ఈ నది మధ్యప్రదేశ్‌లో ఉద్భవించి మొదటిసారి కర్కట రేఖను దాటుతుంది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని వాగడ్ ప్రాంతం గుండా ప్రవహించి గుజరాత్‌లోకి ప్రవేశించి, అక్కడ రెండవసారి కర్కట రేఖను దాటి, చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది.
జోవియన్ లేదా బాహ్య గ్రహాలు అని వేటిని పిలుస్తారు?
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు.
గురుడు, శని, అంగారకుడు, భూమి.
శుక్రుడు, యురేనస్, బుధుడు, నెప్ట్యూన్.
గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్.
జోవియన్ లేదా బాహ్య గ్రహాలు అని బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ అనే నాలుగు గ్రహాలను పిలుస్తారు. ఇవి ప్రధానంగా వాయువులు (హైడ్రోజన్, హీలియం) మరియు మంచుతో ఏర్పడి ఉంటాయి. వీటికి ఘన ఉపరితలం ఉండదు, కానీ వలయాలు మరియు ఉపగ్రహాలు ఎక్కువగా ఉంటాయి.
సూర్యుని పరిమాణం భూమి కంటే సుమారు ఎన్ని రెట్లు ఎక్కువ?
1.3 మిలియన్ రెట్లు.
1.8 మిలియన్ రెట్లు.
2.3 మిలియన్ రెట్లు.
2.7 మిలియన్ రెట్లు.
సూర్యుని పరిమాణం (Volume) భూమి కంటే సుమారు 1.3 మిలియన్ (13 లక్షల) రెట్లు ఎక్కువ. అంటే ఖాళీలు లేకుండా సూర్యుని లోపల నింపితే సుమారు 1.3 మిలియన్ భూములు (భూమి గోళాలు) ఇమిడిపోతాయి.
సూర్యుని నుండి దూరం ఆధారంగా గ్రహాల వరుసక్రమం ఏమిటి?
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్.
బుధుడు, భూమి, శుక్రుడు, అంగారకుడు, శని, బృహస్పతి, నెప్ట్యూన్, యురేనస్.
బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, ప్లూటో.
భూమి, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్.
దూరాన్ని బట్టి సూర్యునికి అత్యంత సమీపంలో బుధుడు ఉండగా, తరువాత శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు వరుస క్రమంలో ఉంటాయి.
భూమి సూర్యుని చుట్టూ ఎంత వేగంతో తిరుగుతుంది?
49.65 km/s
25.46 km/s
46.27 km/s
29.78 km/s
భూమి సూర్యుని చుట్టూ సగటున సుమారు 29.78 km/s (1,07,200 km/h) వేగంతో తిరుగుతుంది. ఈ సగటు వేగం అనేది భూమి కక్ష్య ఖచ్చితమైన వృత్తాకార స్వభావం కానందువల్ల, కొద్దిగా దీర్ఘవృత్తాకారంగా ఉండడం వలన కొంచెం మారుతూ ఉంటుంది.
మధ్యాహ్న రేఖలు అని వేటిని పిలుస్తారు?
అక్షాంశాలు.
కాంటూర్ రేఖలు.
సమాంతర రేఖలు.
రేఖాంశాలు.
ఒక రేఖాంశంపై ఎప్పుడైతే సూర్యుడు నడినెత్తిన ఉంటాడో, ఆ సమయం మధ్యాహ్నం అవుతుంది. ఈ కారణంతో రేఖాంశాలను 'మధ్యాహ్న రేఖలు' అని కూడా అంటారు. రేఖాంశాలు భూమి యొక్క ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు నిలువుగా వెళ్లే ఊహాత్మక రేఖలు.
66½ డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
ఆర్కిటిక్ వలయం.
ఆంటార్కిటిక్ వలయం.
ఉత్తర ధృవం.
కర్కట రేఖ.
భూమిపై 66½° ఉత్తర అక్షాంశం వద్ద గల రేఖను ఆర్కిటిక్ వలయం (Arctic Circle) అంటారు. ఇక్కడ వేసవిలో "మధ్యాహ్న సూర్యుడు" 24 గంటల పాటు ఆకాశంలో కనిపిస్తాడు మరియు శీతాకాలంలో "ధృవ రాత్రి" సూర్యుడు 24 గంటల పాటు ఆకాశంలో కనిపించక పోవడం వంటి ప్రత్యేకమైన సౌర దృగ్విషయాలు సంభవిస్తాయి.
గ్రహాలన్నింటిలో అతి వేగంగా తిరిగే గ్రహం ఏది?
భూమి (Earth).
అంగారకుడు (Mars).
శని (Saturn).
బృహస్పతి (Jupiter).
సౌరవ్యవస్థలోని గ్రహాలన్నింటిలో బృహస్పతి తన అక్షంపై అత్యంత వేగంగా తిరుగుతుంది. దాని భ్రమణ కాలం కేవలం 9 గంటలు 56 నిమిషాలు మాత్రమే. అంటే భూమి రోజంతా (24 గంటలు) తిరుగుతుండగా, బృహస్పతి ఒక రోజును 10 గంటలకు లోపలే పూర్తి చేస్తుంది.
0 డిగ్రీల అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
భూమధ్యరేఖ.
కర్కట రేఖ.
మకర రేఖ.
ఆర్కిటిక్ వలయం.
0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్యరేఖ అని పిలుస్తారు. ఇది భూమిని రెండు సమాన భాగాలు (ఉత్తర మరియు దక్షిణార్ధగోళాలు) గా భాగాలుగా విభజిస్తుంది. ఇది ఒక ఊహాత్మక రేఖ. ఇది భూమి యొక్క అక్షరేఖ మరియు అత్యంత పొడవైన అక్షాంశ రేఖ. దీని పొడవు సుమారు 40,075 కిలోమీటర్లు.
మకరరేఖ పై ఏ రోజు సూర్యకిరణాలు లంబంగా పడుతాయి?
జూన్ 21.
మార్చి 21.
డిసెంబర్ 22.
సెప్టెంబర్ 23.
మకరరేఖపై సూర్యకిరణాలు డిసెంబర్ 22న లంబంగా పడతాయి. ఈ రోజున దక్షిణ ధృవం 23½° సూర్యుని వైపుకు వంగి ఉండటం వలన మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. అందువల్ల దక్షిణార్ధగోళంలో అత్యంత పొడవైన పగటిపూట మరియు అతి తక్కువ రాత్రి ఉంటుంది, వేసవి కాలం మొదలవుతుంది. ఉత్తరార్ధగోళంలో శీతాకాలం ప్రారంభమవుతుంది.
భూమియొక్క సగటు వ్యాసార్ధం ఎంత?
5,371 కి.మీ.
6,371 కి.మీ.
7,371 కి.మీ.
8,371 కి.మీ.
భూమి సగటు వ్యాసార్థం సుమారుగా 6,371 కిలోమీటర్లు. భూమి ఒక పరిపూర్ణ గోళం కాదు, ఓబ్లేట్ స్పిరాయిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే భూమధ్యరేఖ వద్ద కొద్దిగా ఉబ్బెత్తుగా, ధ్రువాల వద్ద కొంచెం చదునుగా ఉంటుంది. భూమధ్యరేఖ వద్ద వ్యాసార్థం సుమారు 6378 కి.మీ గాను, ధృవాల వద్ద వ్యాసార్థం సుమారు 6357 కి.మీ. గాను ఉంటుంది.
రెండు రేఖాంశాల మధ్య గల కాల వ్యవధి ఎంత?
15 నిమిషాలు.
4½ నిమిషాలు.
8 నిమిషాలు.
4 నిమిషాలు.
రెండు రేఖాంశాల మధ్య గల కాల వ్యవధి 4 నిమిషాలు. భూమి తన అక్షం చుట్టూ 360° తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంటే ప్రతి గంటకు 15° తిరుగుతుంది. 1° రేఖాంశం తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. భూమి పశ్చిమం నుండి తూర్పుకు తిరుగుతుంది కాబట్టి తూర్పు రేఖాంశాలు, పశ్చిమ రేఖాంశాల కంటే ముందు ఉంటాయి.
రేఖాంశాలు (Longitudes) ఎక్కడ కలుస్తాయి?
ఉత్తర ధ్రువం వద్ద మాత్రమే.
దక్షిణ ధ్రువం వద్ద మాత్రమే.
భూమధ్యరేఖ వద్ద మాత్రమే.
ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల వద్ద.
రేఖాంశాలు భూమధ్యరేఖ వద్ద పరస్పరం దూరంగా ఉంటాయి. కానీ ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవం వద్ద రేఖాంశాలన్నీ కలుస్తాయి. ఎందుకంటే అక్షాంశాల వలే ఇవి సమాంతర రేఖలు కావు కాబట్టి ధృవాలవద్ద ఒకటిగా కలుస్తాయి.
భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది?
82° 30′ తూర్పు రేఖాంశం.
90° తూర్పు రేఖాంశం.
75° తూర్పు రేఖాంశం.
0° రేఖాంశం.
భారతదేశ ప్రామాణిక కాలాన్ని (IST) నిర్ణయించే ప్రామాణిక రేఖాంశం 82° 30′ తూర్పు రేఖాంశం. ఇది భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వంటి నగరాల గుండా వెళుతుంది. ఈ రేఖాంశం వద్ద సమయం GMT కంటే 5 గంటల 30 నిమిషాలు ముందుంటుంది.
భూమి అక్షం ఎన్ని డిగ్రీలు వాలి ఉంటుంది?
23½°
45°
66½°
90°
భూమి అక్షం దాని కక్ష్యా తలానికి 23½° కోణంలో వాలి ఉంటుంది. ఈ వాలు వల్లనే భూమిపై ఋతువులు ఏర్పడతాయి. ఎందుకంటే సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు భూమి యొక్క అర్ధగోళాలు వేర్వేరు సమయాల్లో ఎక్కువ లేదా తక్కువ సౌర వికిరణాన్ని పొందుతాయి. భూమి అక్షం వాలిపోకపోతే వాతావరణంలో పెద్ద మార్పులు ఉండేవి కావు.
పరిహేళి (Perihelion) ఏ రోజు సంభవిస్తుంది?
జనవరి 3.
జూలై 4.
మార్చి 21.
సెప్టెంబర్ 23.
పరిహేళి అనేది భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థితి. ఇది సాధారణంగా జనవరి 3 నాడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి సూర్యుని నుండి సుమారు 147.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉంటుంది. గ్రీకు భాషలో పెరి అంటే దగ్గర, హేలియో అంటే సూర్యుడు అని అర్ధం.
భూపరిభ్రమణానికి (Earth’s revolution) ఎంత సమయం పడుతుంది?
24 గంటలు.
365 రోజులు.
365 రోజులు 6 గంటలు.
366 రోజులు.
భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే, సూర్యుని చుట్టూ ఒక నిర్దిష్ట మార్గంలో తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూపరిభ్రమణానికి సుమారు 365 రోజుల 6 గంటలు (365¼ రోజులు) పడుతుంది. ఈ అదనపు 6 గంటల వల్ల ప్రతి 4 సంవత్సరాలకు ఒక అధిక సంవత్సరం (Leap Year) వస్తుంది, దాంతో లీపు సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి.
సౌరవ్యవస్థలో అతి పెద్ద సహజ ఉపగ్రహం ఏది?
చంద్రుడు (Moon).
టైటాన్ (Titan).
గనిమీడ్ (Ganymede).
యూరోపా (Europa).
సౌరవ్యవస్థలో అతి పెద్ద సహజ ఉపగ్రహం గనిమీడ్. ఇది బృహస్పతి గ్రహం యొక్క ఉపగ్రహం మరియు మెర్క్యురీ గ్రహం కంటే పెద్దది. దీని వ్యాసం 5,268 కి.మీ. ఇది సౌరవ్యవస్థలో magnetic field కలిగిన ఏకైక ఉపగ్రహం.
2006 లో Dwarf Planet (మరుగుజ్జు గ్రహం) గా వర్గీకరించబడినది ఏది?
నెప్ట్యూన్.
యురేనస్.
ప్లూటో.
శని (Saturn).
2006లో అంతర్జాతీయ ఖగోళ సంఘం (IAU) చేసిన వర్గీకరణలో ప్లూటో గ్రహాన్ని ప్రధాన గ్రహాల జాబితా నుండి తొలగించి 'డ్వార్ఫ్ ప్లానెట్' గా వర్గీకరించారు. IAU గ్రహం కావడానికి నిర్దేశించిన ప్రమాణాలలో దాని కక్ష్య పరిసర ప్రాంతాలను శుభ్రం చేయలేకపోవడం వల్ల ప్లూటోను మరుగుజ్జు గ్రహంగా మార్చింది.
ప్రపంచంలో మొత్తం ఎన్ని ప్రామాణిక కాల మండలాలు (Standard Time Zones) ఉన్నాయి?
12 మండలాలు.
18 మండలాలు.
24 మండలాలు.
36 మండలాలు.
భూమి 360° రేఖాంశాలను కలిగి ఉంటుంది. ప్రతి 15° రేఖాంశానికి 1 గంట సమయ వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి భూమి మొత్తం 360° ÷ 15° = 24 కాల మండలాలు గా విభజించబడింది. అందువల్ల ప్రపంచంలో మొత్తం 24 ప్రామాణిక కాల మండలాలు ఉన్నాయి.
90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు?
మకర రేఖ.
దక్షిణ ధృవం.
ఆంటార్కిటిక్ వలయం.
భూమధ్యరేఖ.
90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధృవం (South Pole) అని పిలుస్తారు. ఇది భూమిపై అత్యంత దక్షిణాన ఉన్న బిందువును సూచిస్తుంది. దక్షిణ ధృవం చుట్టూ ఆంటార్కిటికా ఖండం ఉంది. ఇది మంచుతో కప్పబడిన పొడవైన భూభాగం. వేసవి కాలంలో సూర్యుడు 24 గంటల పాటు కనిపిస్తాడు, శీతాకాలంలో మాత్రం అసలే కనిపించడు.
గ్రీనిచ్ రేఖాంశం అని దేనిని పిలుస్తారు?
90° రేఖాంశం.
180° రేఖాంశం.
0° రేఖాంశం.
82½° రేఖాంశం.
0° రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తారు. ఇది లండన్‌లోని గ్రీనిచ్‌ పట్టణంలో గల ఒక నక్షత్రశాల గుండా వెళుతుంది. అందుకే దీనికి గ్రీనిచ్ రేఖాంశం అనే పేరు వచ్చింది. ప్రపంచంలోని అన్ని దేశాల సమయాలను లెక్కించడానికి దీనిని ఆధారంగా తీసుకుంటారు, దీనినే GMT అంటారు. గ్రీనిచ్ రేఖాంశాన్ని ప్రధాన రేఖాంశం (Prime Meridian) అని కూడా పిలుస్తారు.
ప్రధాన రేఖాంశం (Prime Meridian) ఆధారంగా లెక్కించే సమయాన్ని ఏమంటారు?
భారత ప్రామాణిక సమయం (IST).
గ్రీనిచ్ ప్రామాణిక సమయం (GMT).
స్థానిక సమయం (Local Time).
జాతీయ సమయం (National Time).
ప్రధాన రేఖాంశం ఆధారంగా లెక్కించే సమయాన్ని గ్రీనిచ్ ప్రామాణిక సమయం (GMT) అంటారు. ఇది 0° రేఖాంశాన్ని సూచిస్తుంది మరియు దీన్ని గ్రీనిచ్ మెరిడియన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది లండన్‌లోని గ్రీనిచ్ గుండా వెళుతుంది మరియు అన్ని ఇతర సమయ మండలాలకు ఇది ప్రామాణికంగా పనిచేస్తుంది.
సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది?
యురేనస్.
నెప్ట్యూన్.
ప్లూటో.
బృహస్పతి (Jupiter).
సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం నెప్ట్యూన్. నెప్ట్యూన్ మన సౌర వ్యవస్థలో ఎనిమిదవ గ్రహం మరియు సూర్యుడి నుండి అత్యంత సుదూర గ్రహం.
సౌరవ్యవస్థలో అత్యధిక గురుత్వాకర్షణ కలిగిన గ్రహం ఏది?
భూమి (Earth).
బృహస్పతి/గురుడు (Jupiter).
శని (Saturn).
నెప్ట్యూన్.
సౌర వ్యవస్థలోనే అతిపెద్ద గ్రహం బృహస్పతి మరియు అన్నిటికంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. గురుత్వాకర్షణ అనేది ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అధిక ద్రవ్యరాశి కలిగిన బృహస్పతి అత్యధిక గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది. దాని గురుత్వాకర్షణ శక్తి భూమి కంటే 2.5 రెట్లు ఎక్కువ.
భూగోళం పై మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత?
360 రేఖాంశాలు.
180 రేఖాంశాలు.
181 రేఖాంశాలు.
361 రేఖాంశాలు.
భూమి చుట్టూ మొత్తం 360° ఉండటంతో 1డిగ్రీ అంతరంతో 360 రేఖాంశాలు ఉంటాయి. ఇవి ఉత్తర ధృవం నుండి దక్షిణ ధృవం వరకు కలుస్తూ ఉంటాయి. 179 తూర్పు రేఖాంశాలు + 179 పశ్చిమ రేఖాంశాలు + 0° రేఖాంశం + 180° తూర్పు, పశ్చిమ రేఖాంశం = 360 రేఖాంశాలు (179 + 179 + 1 + 1 = 360).
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Geography – Test 2

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top