📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
ఖండతీరపు అంచు ఎందుకు అతి ముఖ్యమైనది?
ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ.
ఈ ప్రాంతంలోనే ముడి చమురు, సహజవాయువులు లభిస్తాయి.
ఈ ప్రాంతంలో ఓడరేవులను నిర్మించవచ్చు.
పైవన్నీ సరైనవే.
ఖండతీరపు అంచు అనేది భూమికి సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం. ఇది 200 మీటర్ల లోతు వరకు ఉండి, సముద్ర విస్తీర్ణంలో 7.6% వరకు ఉంటుంది. ఖండతీరపు అంచు మత్స్య సంపద సమృద్ధిగా ఉండే ప్రదేశం. ముడి చమురు, సహజవాయువులు వంటి ఖనిజ వనరులు కూడా ఇక్కడ లభిస్తాయి. అలాగే ఓడరేవులను నిర్మించడానికి ఇది అనుకూలమైన ప్రదేశం.
ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖండాలను వేరుచేసే మహాసముద్రం ఏది?
పసిఫిక్ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
హిందూ మహాసముద్రం.
ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖండాలను వేరుచేసే మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద మహాసముద్రం. ఈ మహాసముద్రం ఆఫ్రికా ఖండం యొక్క తూర్పు తీరానికి, ఆస్ట్రేలియా ఖండం యొక్క పశ్చిమ తీరానికి మధ్య ఉంది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య వాణిజ్యానికి ఇది కీలకమైన జల మార్గం.
భూమిపై మొత్తం జలభాగంలో మహాసముద్రాలు ఎంత శాతం ఆక్రమించాయి?
59%
71.56%
97.21%
89.21%
భూమిపై ఉన్న మొత్తం నీటిలో సుమారు 97.21% ఉప్పు నీరుగా మహాసముద్రాలలోనే ఉంది. భూమి ఉపరితలంలో మహాసముద్రాలు దాదాపు 71% వరకు ఆక్రమించాయి. అంతరిక్షం నుండి చూసినప్పుడు భూమి నీలం రంగులో కనిపించడానికి ఈ సముద్రాలే కారణం.
భూగోళంపై ఉన్న మొత్తం జలభాగంలో మంచినీటి వాటా ఎంత శాతం?
2.78%
10.3%
3.10%
5.06%
భూమిపై ఉన్న మొత్తం జలభాగంలో కేవలం 2.78% మాత్రమే మంచినీటిగా ఉంటుంది. ఇందులో ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ పర్వతాలలో మంచు గడ్డలుగా ఉన్న నీరు 69.56% కాగా భూగర్భ జాలం 30.1%. మొత్తం మంచినీటిలో చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉన్న మంచినీరు 0.34% మాత్రమే.
భూగోళంపై గల మొత్తం మంచి నీటిలో భూగర్భ జల శాతం ఎంత?
69.5%
30.1%
0.4%
97.5%
భూమిపై లభించే మంచి నీటిలో సుమారు 30.1% శాతం భూగర్భ జలాలు ఉన్నాయి. చెరువులు, ఆనకట్టలు, నదులలో ఉన్న మంచినీరు 0.34% మాత్రమే. సుమారు 69.56% హిమానీనదాలు, మంచు గడ్డల రూపంలో ఉంది.
మహాసముద్ర మైదానాలు సాధారణంగా ఎంత లోతు వరకు ఉంటాయి?
200–1000 మీటర్లు.
1000–3000 మీటర్లు.
3000–6000 మీటర్లు.
6000–9000 మీటర్లు.
మహాసముద్ర మైదానాలు (Abyssal Plains) సుమారు 3000 నుండి 6,000 మీటర్లు లోతు వరకు ఉంటాయి. ఇవి సముద్రపు అడుగుభాగంలో విస్తరించి ఉన్న చదునైన ప్రాంతాలు. ఇవి ఖండతీరపు వాలు తర్వాత ప్రారంభమై, అగాధదరుల వరకు విస్తరించి ఉంటాయి. సముద్రపు అడుగుభాగంలో 30 శాతం వరకు ఈ మైదానాలు ఆక్రమించి ఉంటాయి.
శీతల ప్రవాహాలు సాధారణంగా ఎటువైపు ప్రవహిస్తాయి?
భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు.
ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు.
తూర్పు నుండి పడమర వైపు.
పడమర నుండి తూర్పు వైపు.
శీతల ప్రవాహాలు ధ్రువాల (అధిక అక్షాంశాల) నుండి భూమధ్యరేఖ (తక్కువ అక్షాంశాల) వైపు ప్రవహిస్తాయి. తద్వారా చల్లని నీటిని ఉష్ణ ప్రాంతాల వైపు తీసుకువస్తాయి. దీనివల్ల సముద్ర నీటి ఉష్ణోగ్రతలు సమతుల్యం చెందుతాయి. ఇవి సాధారణంగా ఖండాల పశ్చిమ తీరాలలో మరియు ఉత్తరార్ధగోళంలో అధిక అక్షాంశాలలో కనిపిస్తాయి.
నాలుగు వైపులా నీటిచే ఆవరించబడిన భూభాగాన్ని ఏమంటారు?
ద్వీపకల్పం.
ద్వీపం.
ఇస్తమస్.
అటోల్.
నాలుగు వైపులా నీటితో ఆవరించబడిన భూభాగాన్ని ద్వీపం అంటారు. ఉదాహరణకు, శ్రీలంక, అండమాన్-నికోబార్, గ్రీన్‌లాండ్, గ్రేట్‌బ్రిటన్ మొదలైనవి. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్ మరియు ఏకైక ద్వీపపు ఖండం ఆస్ట్రేలియా.
ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది?
25 గ్రాములు.
15 గ్రాములు.
45 గ్రాములు.
35 గ్రాములు.
ప్రతి 1000 గ్రాముల సముద్రపు నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. దీనిని లవణీయత అంటారు. లవణీయత ను సాధారణంగా ppt (parts per thousand) లో కొలుస్తారు. సగటు సముద్రపు నీటి లవణీయత ≈ 35 ppt, అంటే 35 గ్రాముల ఉప్పు / 1000 గ్రాముల నీరు.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద మహాసముద్రం ఏది?
హిందూ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం.
దక్షిణ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఇది సుమారు 106.4 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది భూమి ఉపరితలంలో 20% ఆక్రమిస్తుంది. ఇది 'S' ఆకారంలో ఉంటుంది మరియు తూర్పున యూరప్, ఆఫ్రికా ఖండాలకు, పశ్చిమాన ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య విస్తరించి ఉంది.
సముద్రంలో ఒకే లవణీయత గల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు?
ఐసోబార్స్ (Isobars).
ఐసోహైట్స్ (Isohyets).
ఐసోహాలైన్స్ (Isohalines).
ఐసోబాత్స్ (Isobaths).
సముద్రంలో ఒకే లవణీయత గల ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోహాలైన్స్ (Isohalines) అంటారు. ఈ పదం "ఐసో" (అంటే ఒకేలా) మరియు "హాలిన్" (అంటే లవణీయత) అనే పదాల నుండి వచ్చింది. ఈ రేఖలు సముద్ర ప్రవాహాలను, నీటి సాంద్రతను అర్థం చేసుకోవడానికి మరియు లవణీయత పంపిణీ విశ్లేషణలో ఉపయోగపడతాయి.
ఉష్ణ ప్రవాహాలు సాధారణంగా ఎటువైపు ప్రవహిస్తాయి?
భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు.
ధృవాల నుండి భూమధ్య రేఖ వైపు.
తూర్పు నుండి పడమర వైపు.
పడమర నుండి తూర్పు వైపు.
ఉష్ణ ప్రవాహాలు సాధారణంగా భూమధ్యరేఖ ప్రాంతాల్లో ఏర్పడి, ధృవాల వైపు ప్రవహిస్తాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో వేడెక్కిన నీరు తక్కువ సాంద్రతతో ఉపరితలంపై ప్రవహిస్తూ, చల్లని ధృవ ప్రాంతాల వైపు వెళ్తుంది. దీనివల్ల భూమి ఉష్ణ సమతుల్యం కాపాడబడుతుంది.
నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు?
బాష్పీభవనం.
సాంద్రీకరణం.
ద్రవీభవనం.
ఘనీభవనం.
నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు. ఈ ప్రక్రియలో ద్రవ రూపంలో ఉన్న నీటి అణువులు సూర్యుని వేడి ప్రభావంతో శక్తిని పొంది, వాయు స్థితిలోకి మారి నీటి ఆవిరిగా గాలిలోకి చేరుతాయి. ఇది జలచక్రంలో ముఖ్యమైన దశ. సముద్రాలు, నదులు, సరస్సుల నుండి నీరు ఆవిరై వాతావరణంలోకి వెళ్తుంది.
పర్వవేలా తరంగాలు (Spring Tides) ఎప్పుడు సంభవిస్తాయి?
భూకంపం వచ్చినపుడు.
సముద్రపు లవణీయత మారినప్పుడు.
అష్టమి మరియు దశమి రోజుల్లో.
అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో.
పర్వవేలా తరంగాలు అనేవి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సంభవిస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో సూర్యుడు, చంద్రుడు, భూమి దాదాపు ఒకే సరళ రేఖలో ఉండటం వల్ల వాటి గురుత్వాకర్షణ బలాలు కలిసి పనిచేసి, సముద్రపు తరంగాలను అత్యధిక ఎత్తులోకి ఎగసిపడేలా చేస్తాయి.
లఘువేలా తరంగాలు సాధారణంగా ఎప్పుడు సంభవిస్తాయి?
అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో.
దశమి మరియు అమావాస్య రోజుల్లో.
అమావాస్య మరియు అష్టమి రోజుల్లో.
అష్టమి మరియు దశమి రోజుల్లో.
లఘువేలా తరంగాలు (Neap Tides) అష్టమి మరియు దశమి రోజులలో సంభవిస్తాయి, ఎందుకంటే ఈ రోజులలో సూర్యుడు, చంద్రుడు భూమితో 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. దీనివల్ల వాటి గురుత్వాకర్షణ శక్తులు పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేసి, సముద్ర మట్టంలో అలలు తక్కువ ఎత్తులో ఏర్పడి తరంగాల ఎత్తు తగ్గిపోతుంది.
మహాసముద్రాలన్నింటిలో అతి చిన్నది ఏది?
అట్లాంటిక్ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
హిందూ మహాసముద్రం.
దక్షిణ మహాసముద్రం.
ప్రపంచంలోని మహాసముద్రాలలో అన్నిటికంటే చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది భూమి యొక్క ఉత్తర ధ్రువం చుట్టూ విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం సుమారు 14.05 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది చాలా శీతలంగా ఉంటుంది మరియు సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది.
మహా సముద్రాల ఉష్ణోగ్రత సాధారణంగా ఎంత పరిధిలో ఉంటుంది?
–2°C నుండి 29°C
2°C నుండి –29°C
–2°C నుండి –29°C
2°C నుండి 29°C
మహాసముద్రాల నీటి ఉష్ణోగ్రత సాధారణంగా –2°C నుండి 29°C వరకు ఉంటుంది. ధ్రువప్రాంతాల్లో మంచు కరగడం వలన –2°C కనబడుతుంది. భూమధ్యరేఖ ప్రాంతాల్లో సూర్యకిరణాలు నేరుగా పడటం వల్ల సుమారు 29°C లేదా 30°C వరకు పెరుగుతుంది. ఇది భూమధ్యరేఖ నుంచి ధ్రువాల వైపునకు వెళ్లేకొద్దీ తగ్గుతుంది.
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై గల ఏకైక మహాసముద్రం ఏది?
గొండ్వానా (Gondwana).
పాంథలస్సా (Panthalassa).
పాంజియా (Pangea).
టెథిస్ (Tethys).
కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై ఉన్న ఏకైక మహాసముద్రం పాంథలస్సా (Panthalassa). ఇది పాంజియా అనే ఒక మహాఖండం చుట్టూ విస్తరించి ఉన్నది. పాంథలస్సా అనే పదం గ్రీకు భాషలో “అన్ని సముద్రాలు” అనే అర్థం కలిగి ఉంది. కాలక్రమేణా ఈ పాంథలస్సా ఖండాల చలనంతో విడిపోయి మహాసముద్రాలు ఏర్పడ్డాయి.
ఖండతీరపు వాలు (Continental Slope) సుమారు ఎన్ని మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది?
200–1000 మీటర్లు.
200–3000 మీటర్లు.
3000–6000 మీటర్లు.
6000 మీటర్లకు పైగా.
ఖండతీరపు వాలు ఖండతీరపు అంచు తర్వాత ప్రారంభమవుతుంది. ఇది వేగంగా లోతు పెరిగే ప్రాంతం. సుమారు 200 మీటర్ల లోతు నుండి 3000 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలోనే సముద్ర అగాధదరులు ఉంటాయి. మహాసముద్రపు విస్తీర్ణంలో ఖండతీరపు వాలు 15% వరకు ఉంటుంది.
మహాసముద్రాలన్నింటిలో అతి పెద్దది ఏది?
పసిఫిక్ మహాసముద్రం.
హిందూ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
ప్రపంచంలోనే అతి పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఇది సుమారు 165 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి, భూమి ఉపరితలంలో సుమారు మూడింట ఒక వంతు భాగాన్ని ఆక్రమిస్తుంది. ఇది పశ్చిమాన ఆసియా, ఆస్ట్రేలియా మరియు తూర్పున ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య విస్తరించి ఉంది. దీనిని ప్రశాంత మహాసముద్రం అని కూడా అంటారు.
ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
టోలమీ.
కోపర్నికస్.
ఆల్ఫ్రెడ్ వెజినర్.
గెలీలియో.
ఖండచలన సిద్ధాంతాన్ని 1912లో జర్మనీకి చెందిన వాతావరణ, భూ భౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజినర్ ప్రతిపాదించారు. ఆయన ప్రకారం ఖండాలు ఒకప్పుడు పాంజియా అనే మహాఖండంగా కలసి ఉండి, తరువాత విడిపోయి ప్రస్తుత స్థానాలకు చేరుకున్నాయి. గ్రీకు భాషలో పాంజియా అనే పదానికి మొత్తం భూమి అని అర్ధం.
అమెరికా ఖండాన్ని యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల నుండి వేరుచేసే మహాసముద్రం ఏది?
పసిఫిక్ మహాసముద్రం.
హిందూ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం అమెరికా ఖండాన్ని యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల నుండి వేరుచేస్తుంది. దీనిపై అనేక ప్రధాన నౌకాయాన మార్గాలు ఉన్నాయి, కాబట్టి ఇది వాణిజ్యంలో అత్యంత ప్రాముఖ్యమైన సముద్రం. అలాగే ఇది జిబ్రాల్టర్ జలసంధి ద్వారా ఇది మధ్యధరా సముద్రంతో కలుస్తుంది.
ప్రపంచంలో అత్యంత లోతైన అగాధం ఏది?
జావా ట్రెంచ్.
ప్యూర్టోరికో ట్రెంచ్.
మెరియానా ట్రెంచ్.
టోంగా ట్రెంచ్.
ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర అగాధం మెరియానా ట్రెంచ్ (Mariana Trench). ఇది పసిఫిక్ మహాసముద్రంలో గ్వామ్ దీవుల దగ్గర ఉంది. దీని లోతు సుమారు 11,022 మీటర్లు.
సముద్రపు లోతు సమానంగా ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఏమని పిలుస్తారు?
ఐసోబార్స్.
ఐసోహైట్స్.
ఐసోబాత్స్.
ఐసోహాలైన్స్.
సముద్రపు లోతు సమానంగా ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోబాత్స్ (Isobaths) అంటారు. ఈ రేఖలను ఉపయోగించి సముద్రపు అడుగుభాగం యొక్క భౌతిక స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. సముద్రాలు ఎంత లోతుగా ఉన్నాయి, ఎక్కడ లోతు ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
మహాసముద్రాలన్నింటిలో అత్యంత లోతైనది ఏది?
పసిఫిక్ మహాసముద్రం.
హిందూ మహాసముద్రం.
అట్లాంటిక్ మహాసముద్రం.
ఆర్కిటిక్ మహాసముద్రం.
ప్రపంచంలోని మహాసముద్రాలన్నింటిలో పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైనది. ఈ మహాసముద్రంలో ఉన్న మెరియానా ట్రెంచ్‌లోని ఛాలెంజర్ డీప్ భూమిపై అత్యంత లోతైన ప్రదేశం. ఈ కారణంగా పసిఫిక్ మహాసముద్రం అన్ని మహాసముద్రాల కంటే లోతైనదిగా పరిగణించబడుతుంది.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

