Telangana Geography – Test 1


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఆవిర్భవించింది?
1 జూన్ 2013.
2 జూన్ 2014.
1 మార్చి 2014.
2 జూలై 2014.
తెలంగాణా రాష్ట్రం 2 జూన్ 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు. హైదరాబాద్‌ను తెలంగాణా రాష్ట్ర రాజధానిగా, అలాగే 10 సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు.
తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య ఎంత?
23
29
31
33
తెలంగాణ రాష్ట్రం 2014లో 10 జిల్లాలతో ప్రారంభమైంది. 2016లో 21 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. 2019లో రెండు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మొత్తం జిల్లాల సంఖ్య 33కి చేరింది.
తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం ఎంత?
1,12,077 చ.కి.మీ.
1,04,586 చ.కి.మీ.
1,00,200 చ.కి.మీ.
98,765 చ.కి.మీ.
తెలంగాణ రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణం సుమారు 1,12,077 చదరపు కిలోమీటర్లు ఉంది. అయితే ప్రారంభంలో రాష్ట్ర విస్తీర్ణం 1,14,840 చ.కి.మీ.గా ఉండేది. కానీ 2014 జూలై 17న జరిగిన Andhra Pradesh Reorganisation (Amendment) Act ప్రకారం, ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడంతో విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ.కి తగ్గింది.
తెలంగాణలో అతి తక్కువ వైశాల్యం గల జిల్లా ఏది?
మేడ్చల్ మల్కాజిగిరి.
హైదరాబాద్.
ములుగు.
రంగారెడ్డి.
తెలంగాణలో అతి తక్కువ వైశాల్యం గల జిల్లా హైదరాబాద్. దీని విస్తీర్ణం సుమారు 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇది తెలంగాణలో అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని నగరాన్ని కలిగి ఉండటంతో, అత్యధిక జనసాంద్రత కలిగిన జిల్లా కూడా.
తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది?
చామంతి పువ్వు.
మల్లె పువ్వు.
తంగేడు పువ్వు.
గులాబీ పువ్వు.
తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. దీని శాస్త్రీయనామం కాసియా ఆరిక్యులేటా. బతుకమ్మ పండుగలో ఈ పువ్వుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తంగేడు పువ్వు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్నది. అందువల్ల దీనిని రాష్ట్ర పుష్పంగా అధికారికంగా ఎంపిక చేశారు.
తెలంగాణ రాష్ట్ర చేప ఏది?
కొర్రమీను చేప.
రోహు చేప.
బంగారుతీగ చేప.
బొచ్చ చేప.
తెలంగాణ రాష్ట్ర చేప కొర్రమీను (కొర్రమట్ట లేదా చారల ముర్రెల్). దీని శాస్త్రీయ నామం చన్నా స్ట్రియాటస్. 2016లో తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర చేపగా ప్రకటించి, దాని సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టింది.
తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?
నెమలి.
రామచిలుక.
పావురం.
పాలపిట్ట.
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కొరాషియస్ బెంగాలెన్సిస్. ఇది విజయానికి సూచికగా భావిస్తారు, ముఖ్యంగా దసరా పండుగనాడు దీన్ని చూడటం శుభసూచకంగా పరిగణిస్తారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత?
4,00,03,680.
3,74,00,326.
3,25,40,056.
3,50,03,674.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా మొత్తం జనాభా 3,50,03,674. ఇందులో 1,76,11,633 మంది పురుషులు, 1,73,92,041 మంది స్త్రీలు ఉన్నారు.
తెలంగాణలో అతి ఎత్తైన శిఖరం ఏది?
పెద్దకొండ.
డోలిగుట్ట.
సీతమ్మకొండ.
నాగరాజగుట్ట.
తెలంగాణలో అతి ఎత్తైన శిఖరం డోలి గుట్ట. దీని ఎత్తు సుమారు 965 మీటర్లు (3,166 అడుగులు) ఉంటుంది. ఇది ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వద్ద, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉంది. ఇది దక్కన్ పీఠభూమి ఉత్తర భాగంలో ఉంది.
తెలంగాణ రాష్ట్ర అధికారిక న్యూస్ ఛానల్ ఏది?
DD తెలంగాణ.
DD వీర తెలంగాణ.
DD సప్తగిరి.
DD యాదగిరి.
తెలంగాణ రాష్ట్ర అధికారిక న్యూస్ ఛానల్ DD యాదగిరి. ఇది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పేరు మీద పెట్టబడింది. ఇది ప్రసార్ భారతి ఆధ్వర్యంలో దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం చేయబడుతుంది.
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన పురాతన జానపద వాద్యం ఏది?
తంబురా.
నాదస్వరమ్.
సితార్.
కిన్నెర.
తెలంగాణకు ప్రత్యేకమైన "కిన్నెర" అనే సంగీత వాద్యం ఉంది. ఇది దర్శనం మొగిలయ్య వంటి కళాకారుల ద్వారా ప్రాచుర్యం పొందింది. కిన్నెర అనేది తెలంగాణకు చెందిన ఒక పురాతన, రెండు తీగల జానపద వాద్యం. ఇది వెదురు, ఎండిన గుండ్రని బయటి షెల్, తేనెగూడు, ఎద్దు కొమ్ము, పూసలు, అద్దాలు, నెమలి ఈకలు వంటి సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడుతుంది.
తెలంగాణ రాష్ట్ర అధికారిక మాసపత్రిక ఏది?
తెలుగు వెలుగు.
యాదగిరి.
తెలంగాణ.
నమస్తే తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రచురించే మాసపత్రిక పేరు “తెలంగాణ”. ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రచురించబడుతుంది మరియు అధికారిక న్యూస్, గవర్నమెంట్ పబ్లికేషన్స్, చట్టాలు, సర్క్యులర్లు, పబ్లిక్ నోటీసులు వంటి సమాచారాన్ని అందిస్తుంది.
తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ ఎవరు?
ఎస్. మధుసూదనాచారి.
గడ్డం ప్రసాద్ కుమార్.
పోచారం శ్రీనివాస్ రెడ్డి.
నాయిని నరసింహారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఆయన మొదటి శాసనసభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆయన భూపాలపల్లి నియోజకవర్గం నుండి MLAగా ఎన్నికయ్యారు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) ను తెలంగాణలో ఏ నదిపై నిర్మించారు?
కృష్ణా.
మానేరు.
గోదావరి.
మంజీరా.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (SRSP) తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పోచంపాడు గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్‌ను పోచంపాడ్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు.
విస్తీర్ణపరంగా తెలంగాణలో అతి పెద్ద జిల్లా ఏది?
భద్రాద్రి కొత్తగూడెం.
నిజామాబాద్.
నల్గొండ.
నాగర్ కర్నూల్.
విస్తీర్ణపరంగా తెలంగాణలో అతి పెద్ద జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. సుమారు 7,483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ జిల్లా అడవులు, పర్వతాలు, మరియు పరిశ్రమలతో ప్రాధాన్యం కలిగి ఉంది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం (State Emblem) లో ఉన్న నిర్మాణాలు ఏవి?
కాకతీయ కళా తోరణం మరియు గోల్కొండ కోట.
కాకతీయ కళా తోరణం మరియు చార్మినార్.
కాకతీయ కళా తోరణం మరియు బిర్లా మందిర్.
చార్మినార్ మరియు తెలంగాణ సచివాలయం.
తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో కాకతీయ కళా తోరణం ప్రధానంగా మధ్యలో ఉంటుంది. దాని లోపల చార్మినార్ నిర్మాణం కనిపిస్తుంది, పైభాగంలో సారనాథ్ సింహ స్తంభం ఉంటుంది. చిహ్నం చుట్టూ వృత్తాకారంలో ఆకుపచ్చ border ఉంటుంది, మరియు “తెలంగాణా ప్రభుత్వం ” (తెలుగు), “Government of Telangana” (ఇంగ్లీష్), "తెలంగాణ సర్కార్"(ఉర్దూ) అనే పదాలు ఉంటాయి. మరియు సంస్కృతంలో సత్యమేవ జయతే అని వ్రాయబడింది .
తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
బొగత జలపాతం.
పోచెర జలపాతం.
కుంటాల జలపాతం.
గాయత్రి జలపాతం.
తెలంగాణలో అతి పెద్ద (అత్యంత ఎత్తైన) జలపాతం కుంటాల జలపాతం. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నేరడిగొండ మండలంలో, కుంతాల గ్రామానికి సమీపంలో కడెం నదిపై ఉంది. ఇక్కడ దాదాపు 150 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకు పడుతుంది.
తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది?
చిత్తడి జింక (Swamp Deer).
కస్తూరి జింక (Musk Deer).
మచ్చల జింక (Spotted Deer).
కృష్ణజింక (Blackbuck).
తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక (Spotted Deer/ Chital). ఇది అడవులలో గుంపులుగా సంచరించే అందమైన జంతువు. 2014లో అధికారికంగా దీన్ని రాష్ట్ర జంతువుగా ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది?
ఖో-ఖో.
హాకీ.
చదరంగం.
కబడ్డీ.
తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇది రాష్ట్రంలో ప్రజల మధ్య ప్రసిద్ధి గాంచిన సంప్రదాయ క్రీడ. తెలంగాణలో దీన్ని చెడుగుడు అని కూడా పిలుస్తారు. శారీరక దృఢత్వం, వ్యూహాత్మక నైపుణ్యం కలయికగా ఈ ఆట ప్రత్యేకతను కలిగి ఉంది.
తెలంగాణలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన స్థలం ఏది?
గోల్కొండ కోట.
చార్మినార్.
రామప్ప దేవాలయం.
బాసర సరస్వతి ఆలయం.
తెలంగాణలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడినది రామప్ప దేవాలయం (కాకతీయ రుద్రేశ్వర ఆలయం). ఈ ఆలయం ములుగు (పూర్వపు వరంగల్‌) జిల్లాలోని పాలంపేట గ్రామం వద్ద ఉంది. దీనిని 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు.
తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది?
వేపచెట్టు.
జమ్మి చెట్టు.
మామిడిచెట్టు.
మర్రిచెట్టు.
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. దీని శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సినెరరియా. దసరా పండుగ సమయంలో ప్రజలు జమ్మి చెట్టును పూజిస్తారు మరియు జమ్మి ఆకులను బంగారంగా భావిస్తారు. పాండవులు అరణ్యవాసంలో తమ ఆయుధాలను జమ్మి చెట్టులో దాచినట్లు పురాణ గాథలు చెబుతాయి.
తెలంగాణ రాష్ట్ర అధికార భాష ఏది?
తెలుగు.
ఉర్దూ.
ఇంగ్లీష్.
హిందీ.
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన అధికార భాష తెలుగు. ఉర్దూ భాషను రెండవ అధికార భాషగా 2017లో Telangana Official Languages (Amendment) Act ద్వారా గుర్తించారు. ఇంగ్లీష్ భాషను కొన్ని పరిపాలనా అవసరాల కోసం ఉపయోగిస్తారు, కానీ అది అధికారికంగా రాష్ట్ర భాష కాదు.
2019లో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఏవి?
ములుగు మరియు నారాయణపేట.
నారాయణపేట మరియు వనపర్తి.
ములుగు మరియు భద్రాద్రి.
నారాయణపేట మరియు జోగులాంబ.
2019 ఫిబ్రవరి లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ములుగు మరియు నారాయణపేట అనే రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. జయశంకర్-భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో ములుగు జిల్లాను మరియు మహబూబ్‌నగర్ జిల్లాను పునర్వ్యవస్థీకరించి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర గీతం ఏది?
మా తెలుగు తల్లికి.
జయ జయహే తెలంగాణ.
పొడుస్తున్న పొద్దు మీద.
పల్లె కన్నీరు పెడుతుందో.
2024లో తెలంగాణ ప్రభుత్వం “జయ జయహే తెలంగాణ” అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించింది. ఈ గీతాన్ని ప్రముఖ కవి అందెశ్రీ రచించారు. ఈ గీతం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది.
తెలంగాణలోని మూడు జాతీయ పార్కులు ఏవి?
కాసు బ్రహ్మానంద రెడ్డి, మహావీర్ హరిణ వనస్థలి, మృగవాణి.
నల్లమల, కాసు బ్రహ్మానంద రెడ్డి, అమ్రాబాద్.
మృగవాణి, ఎటూరునాగారం, కాసు బ్రహ్మానంద రెడ్డి.
మహావీర్ హరిణ వనస్థలి, కవ్వాల్, మృగవాణి.
తెలంగాణలో మూడు ప్రధాన జాతీయ పార్కులు ఉన్నాయి: 1) కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (KBR National Park), 2) మహావీర్ హరిణ వనస్థలి జాతీయ ఉద్యానవనం, మరియు 3) మృగవాణి జాతీయ ఉద్యానవనం. ఈ పార్కులు హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Telangana Geography – Test 1

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top