📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లా ఏది?
హైదరాబాద్.
రంగారెడ్డి.
నల్గొండ.
మహబూబ్‌నగర్.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా హైదరాబాద్. ఈ జిల్లాలో 39,43,323 మంది జనాభా ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర స్థానం ఎంత?
10వ స్థానం.
12వ స్థానం.
14వ స్థానం.
16వ స్థానం.
2011 లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,03,674. ఈ సంఖ్య ఆధారంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 12వ స్థానంలో నిలిచింది. తెలంగాణ జనాభా భారతదేశ మొత్తం జనాభాలో సుమారు 2.89%.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతా రేటు ఎంత?
82.14%
66.54%
75.04%
57.99%
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతా రేటు 66.54%. ఇది జాతీయ సగటు 74.04% కన్నా తక్కువ. తెలంగాణలో పురుషుల అక్షరాస్యత 75.04% కాగా, స్త్రీల అక్షరాస్యత 57.99%గా నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరు?
పోచారం శ్రీనివాస్ రెడ్డి.
తుమ్మల నాగేశ్వరరావు.
పద్మా దేవేందర్ రెడ్డి.
టి. పద్మారావు గౌడ్.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తొలి డిప్యూటీ స్పీకర్ గా పద్మా దేవేందర్ రెడ్డి 2014 జూన్ 12న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. మధుసూదనాచారి స్పీకర్‌గా ఉన్న సమయంలో, ఆమె డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రి ఎవరు?
సబితా ఇంద్రా రెడ్డి.
సత్యవతి రాథోడ్.
పద్మా దేవేందర్ రెడ్డి.
కోవా లక్ష్మి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి మహిళా మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆమె 2019లో TRS ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ఆమె గతంలో (2009–2013) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా కూడా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర దక్షిణ దిశలో ఉన్న కొండలు ఏవి?
నల్లమల కొండలు.
రామగిరి కొండలు.
పాండవుల కొండలు.
నిర్మల్ కొండలు.
తెలంగాణ రాష్ట్ర దక్షిణ దిశలో నల్లమల కొండలు విస్తరించాయి. ఇవి నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కనిపిస్తాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, శ్రీశైలం వంటి ప్రముఖ ప్రాంతాలు ఈ కొండల పరిధిలో ఉన్నాయి.
కొమరం భీం యొక్క ప్రసిద్ధమైన నినాదం ఏది?
వందే మాతరం.
జై జవాన్ జై కిసాన్.
జల్, జంగల్, జమీన్.
జై తెలంగాణ.
కొమరం భీం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోండ్ గిరిజన నాయకుడు. ఆయన "జల్, జంగల్, జమీన్"(నీరు, అడవి, భూమి) అనే నినాదంతో ప్రసిద్ధి చెందాడు. ఈ నినాదం ద్వారా అతను ఆదివాసుల హక్కులను, ముఖ్యంగా భూమి, అడవులు, నీటి వనరులపై వారి హక్కును నిజాం ప్రభుత్వం నుండి రక్షించుకోవడానికి పోరాడారు.
తెలంగాణ శాసనమండలిలో మొత్తం MLC స్థానాల సంఖ్య ఎంత?
36
38
40
42
తెలంగాణ శాసనమండలిలో మొత్తం 40 ఎమ్మెల్సీ (MLC) స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య మొత్తం అసెంబ్లీ సభుల సంఖ్యలో 1/3 వంతుకు మించరాదు. అయితే శాసన మండలిలో కనీస సభ్యుల సంఖ్య 40గా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ (MLA) స్థానాల సంఖ్య ఎంత?
175
121
123
119
తెలంగాణ శాసనసభ (Legislative Assembly) లో మొత్తం 119 MLA స్థానాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఖ్య 294 గా ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు 175 స్థానాలు ఉన్నాయి.
నాగోబా జాతర తెలంగాణలో ఎక్కడ జరుగుతుంది?
ధర్మపురి.
బుర్నూరు.
కొత్తపల్లి.
కేస్లాపూర్.
తెలంగాణలో ప్రసిద్ధ నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది, ఇది సుమారు 10 రోజుల పాటు కొనసాగుతుంది. గోండు తెగలకు చెందిన మేస్రం వంశీయులు దీనిని ఘనంగా జరుపుకుంటారు.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్ ఎవరు?
నేతి విద్యాసాగర్.
కడియం శ్రీహరి.
ధర్మపురి శ్రీనివాస్.
కె. స్వామి గౌడ్.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్‌గా కె. స్వామి గౌడ్ 2014 జూన్ 10న ఎన్నికయ్యారు. 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పదవిలో కొనసాగారు.
తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రి ఎవరు?
తన్నీరు హరీష్ రావు.
కె. కేశవరావు.
విజయరామారావు.
ఈటల రాజేందర్.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో ఏర్పాటైన తొలి మంత్రివర్గంలో ఈటల రాజేందర్‌ను తొలి ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆయన రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత తన్నీరు హరీష్ రావు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణలో జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ కలదు?
బాసర.
భద్రాచలం.
వరంగల్.
యాదాద్రి.
జ్ఞాన సరస్వతి దేవాలయం తెలంగాణలోని నిర్మల్ జిల్లా, బాసర గ్రామంలో, గోదావరి నదీ తీరంలో ఉంది. భారత దేశంలో గల రెండే రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి శారదా పీఠం కాశ్మీరులో ఉండగా, రెండవది జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో కలదు. ఇక్కడ తల్లిదండ్రులు తమ పిల్లలకు “అక్షరాభ్యాసం” పూజా కార్యక్రమాలు జరిపిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
ఆగస్టు 29.
సెప్టెంబరు 9.
అక్టోబర్ 9.
నవంబర్ 19.
తెలంగాణ భాషా దినోత్సవం ప్రతీ సంవత్సరం సెప్టెంబరు 9న జరుపుకుంటారు. ఇది ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రకటించింది.
అనంతగిరి కొండలు తెలంగాణలోని ఏ జిల్లాలో ఉన్నాయి?
ఖమ్మం.
నిజామాబాద్.
వికారాబాద్.
భద్రాద్రి కొత్తగూడెం.
అనంతగిరి కొండలు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు హైదరాబాద్‌కు సమీపంలో, దట్టమైన అడవులతో కూడి ఉన్నాయి. ఈ కొండలలోనే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. మూసీ నదికి ఈ అనంతగిరి కొండలే జన్మస్థానం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లకు ఈ కొండల నుంచే నీరు ప్రవహిస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో గల స్థానాల సంఖ్య ఎంత?
5
9
7
11
తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో మొత్తం 7 స్థానాలు ఉన్నాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సీట్లు కేటాయించబడ్డాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఖ్య 18గా ఉండేది.
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి ఎవరు?
మహమూద్ అలీ.
నాయిని నర్సింహా రెడ్డి.
సబితా ఇంద్రా రెడ్డి.
కే. చంద్రశేఖర్ రావు.
2014 నుంచి 2018 వరకు నాయిని నర్సింహా రెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారు. జైళ్లు, అగ్నిమాపక సేవలు, కార్మిక, ఉపాధి వంటి శాఖల బాధ్యతలను కూడా చేపట్టారు. ఆయన తర్వాత మహమూద్ అలీ హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్త్రీ-పురుష లింగ నిష్పత్తి ఎంత?
943
971
988
1013
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్త్రీ-పురుష లింగ నిష్పత్తి 988. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 988 మంది స్త్రీలు ఉన్నారు. ఇది భారత దేశ సగటు కంటే మెరుగ్గా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత ఎంత?
290 వ్యక్తులు/చ.కి.మీ.
382 వ్యక్తులు/చ.కి.మీ.
350 వ్యక్తులు/చ.కి.మీ.
312 వ్యక్తులు/చ.కి.మీ.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత 312 వ్యక్తులు ప్రతి చ.కి.మీ. ఇది జాతీయ సగటు 382 కన్నా తక్కువ. హైదరాబాద్ జిల్లా అత్యధిక జనసాంద్రత కలిగి ఉంది.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ ఎవరు?
బండా ప్రకాష్.
నేతి విద్యాసాగర్.
గుత్తా సుఖేందర్ రెడ్డి.
స్వామి గౌడ్.
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శాసనమండలి లో ఆయనను డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
కిన్నెరసాని జింకల పార్కు తెలంగాణాలోని ఏ జిల్లాలో కలదు?
ఖమ్మం.
ములుగు.
వరంగల్.
భద్రాద్రి కొత్తగూడెం.
కిన్నెరసాని జింకల పార్క్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ సమీపంలో కిన్నెరసాని ప్రాజెక్టుకు దగ్గరగా ఉంది. ఇది ముఖ్యంగా జింకలు మరియు ఇతర వన్యప్రాణులను కాపాడేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యంలో భాగంగా ఉంది.
తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని లోక్‌సభ స్థానాలు కేటాయించబడ్డాయి?
20
17
25
28
భారత పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 17 లోక్‌సభ స్థానాలు కేటాయించబడ్డాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఇది అధికారికంగా అమలులోకి వచ్చింది.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా ఏది?
హైదరాబాద్.
నిజామాబాద్.
వరంగల్.
మేడ్చల్–మల్కాజిగిరి.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 66.54% కాగా, అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లా హైదరాబాద్. హైదరాబాద్ జిల్లా 83.25% అక్షరాస్యత రేటుతో మొదటి స్థానంలో ఉంది.
అతి పిన్న వయస్సులో ఎవరెస్ట్ అధిరోహించిన మాలావత్ పూర్ణ ఏ రాష్ట్రానికి చెందినవారు?
ఆంధ్రప్రదేశ్.
తెలంగాణ.
ఒడిశా.
కర్ణాటక.
మాలావత్ పూర్ణ 2014 మే 25న, 13 సంవత్సరాల 11 నెలల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలో అతి పిన్న వయస్సు కలిగిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, పాకాల గ్రామంకు చెందినవారు.
తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు?
తమిళిసై సౌందరరాజన్.
విద్యాసాగర్ రావు.
ఈ.ఎస్.ఎల్. నరసింహన్.
ఎస్. అబ్దుల్ నజీర్.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఈ.ఎస్.ఎల్. నరసింహనే తెలంగాణ తొలి గవర్నర్‌గా నియమించబడ్డారు. ఆయన రెండు రాష్ట్రాలకు ఒకేసారి గవర్నర్‌గా కొనసాగారు. ఆయన తర్వాత తమిళిసై సౌందరరాజన్ తెలంగాణాకు రెండవ గవర్నర్‌గా నియమించబడ్డారు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

