📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
భారతదేశపు తొలి కలర్ సినిమా ఏది?
రాజా హరిశ్చంద్ర.
లవకుశ.
మదర్ ఇండియా.
కిసాన్ కన్యా.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రంగుల సినిమా 1937లో విడుదలైన కిసాన్ కన్యా. మోతీ గిద్వానీ దర్శకత్వం వహించి, అర్దేశిర్ ఇరానీ నిర్మించిన ఈ హిందీ చిత్రం, సినీకలర్ ప్రక్రియను ఉపయోగించి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, భారతదేశంలోనే రూపొందించబడింది.
పదవిలో ఉండగా మరణించిన తొలి భారత రాష్ట్రపతి ఎవరు?
డా. రాజేంద్ర ప్రసాద్.
ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్.
జాకిర్ హుస్సేన్.
శంకర్ దయాల్ శర్మ.
డా. జాకిర్ హుస్సేన్ 1967 మే 13న భారతదేశ మూడవ రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1969 మే 3న పదవిలో ఉండగానే మరణించారు, తద్వారా పదవిలో ఉండగానే మరణించిన తొలి భారత రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. ఆయన అందరికంటే అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేశారు.
ఇంగ్లీష్ చానల్‌ను ఈదిన తొలి భారతీయ మహిళ ఎవరు?
బులా చౌదరి.
ఆర్తి సాహా.
అనితా సూద్..
రీనా కౌశల్.
ఇంగ్లీష్ ఛానల్‌ను ఈదిన మొదటి భారతీయురాలు ఆర్తి సాహా. ఆమె సెప్టెంబర్ 29, 1959న తన 19 సంవత్సరాల వయస్సులో ఈ ఘనత సాధించింది. ఆమె భారతదేశం మరియు ఆసియా నుండి ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి మహిళ. ఆమె 1960లో పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది.
భారతదేశంలో తొలి విమానాశ్రయం ఏది?
జుహూ ఏరోడ్రోమ్ (ముంబై).
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ).
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (కోల్‌కతా).
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (ముంబై).
భారతదేశపు తొలి విమానాశ్రయం ముంబైలోని జుహూ ఏరోడ్రోమ్. ఇది 1928లో ప్రారంభించబడింది. ప్రారంభంలో ఇది సివిల్ ఏవియేషన్ కోసం ఉపయోగించబడింది. తరువాత 1948లో మొదటి అంతర్జాతీయ వాణిజ్య విమానాలు కూడా ఇక్కడి నుండి ప్రారంభమయ్యాయి.
భారతదేశపు తొలి మహిళా IPS అధికారి ఎవరు?
కిరణ్ బేడీ.
అన్నా రాజం మల్హోత్రా.
సత్యవతి చౌహాన్.
అర్జునా రాణి.
భారతదేశపు తొలి మహిళా IPS అధికారి కిరణ్ బేడీ. ఆమె 1972లో IPSలో చేరారు. తీహార్ జైలులో జైలు సంస్కరణలు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె యునైటెడ్ నేషన్స్ పోలీస్ అడ్వైజర్ గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. ఆమె 1994లో రామన్ మెగససే అవార్డు పొందారు.
రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఎవరు?
సత్యజిత్ రే.
ఏ.ఆర్. రెహ్మాన్..
భాను అథయా.
రసూల్ పూకుట్టి.
రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏ.ఆర్. రెహ్మాన్. అతను 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి "బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్" మరియు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" విభాగాలలో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు.
భారతదేశపు తొలి రాష్ట్రపతి ఎవరు?
సర్వేపల్లి రాధాకృష్ణన్.
జాకీర్ హుస్సేన్.
రాజేంద్ర ప్రసాద్.
వి.వి.గిరి.
డా. రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న భారతదేశపు తొలి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1950 నుండి 1962 వరకు రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేశారు. ఇప్పటివరకు భారత చరిత్రలో రెండు సార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి కూడా ఆయనే. ఆయనకు 1962లో భారతరత్న లభించింది.
భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
షీలా దీక్షిత్.
రబ్రీ దేవి.
జయలలిత.
సుచేతా కృపలాని.
భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుచేతా కృపలాని. ఆమె 1963 నుండి 1967 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమె రాజ్యాంగ సభ సభ్యురాలిగా కూడా సేవలందించారు.
భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది?
INSAT-1A.
భాస్కర-1.
ఆర్యభట్ట.
రోహిణి RS-1.
భారతదేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట. ఇది 19 ఏప్రిల్ 1975న సోవియట్ యూనియన్ సహాయంతో ప్రయోగించారు. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు అయిన ఆర్యభట్ట పేరు మీద ఈ ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు.
భారతదేశపు తొలి టాకీ (sound) సినిమా ఏది?
రాజా హరిశ్చంద్ర.
ఆలం ఆరా.
కిసాన్ కాన్యా.
మదర్ ఇండియా.
భారతదేశంలో మొదటి టాకీ (sound) సినిమా "ఆలం ఆరా" (Alam Ara). అర్దేషిర్ ఇరానీ దర్శకత్వంలో నిర్మించబడిన ఈ చిత్రం, 1931 మార్చి 14న ముంబైలోని మెజెస్టిక్ సినిమా థియేటర్‌లో విడుదలైంది.
భారతదేశపు తొలి మెట్రో రైల్వే ఎక్కడ ప్రారంభమైంది?
ఢిల్లీ.
కోల్‌కతా.
ముంబై.
చెన్నై.
భారతదేశపు తొలి మెట్రో రైల్వే కోల్‌కతాలో 1984 అక్టోబర్ 24న ప్రారంభమైంది. దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్ (ప్రస్తుతం నేతాజీ భవన్) నుండి ఎస్ప్లానేడ్ వరకు 3.4 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసింది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆపరేషనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్గా చరిత్రలో నిలిచింది.
భారతదేశపు తొలి రైల్వే లైన్ ఎక్కడ ప్రారంభమైంది?
ముంబై – థానే.
హౌరా – హుగ్లీ.
మద్రాస్ – ఆర్కాట్.
ఢిల్లీ – ఆగ్రా.
భారతదేశంలో తొలి రైల్వే లైన్ 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. ఈ రైలు ముంబై (బోరీబందర్) నుండి థానే వరకు 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ రైలులో 14 బోగీలు ఉండగా, సుల్తాన్, సింధ్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో నడిపారు. ఇది ప్రయాణికుల రవాణా కోసం ప్రారంభించబడిన తొలి అధికారిక రైలు.
భారతదేశపు తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరు?
కువెంపు.
విశ్వనాథ సత్యనారాయణ.
రవీంద్రనాథ్ ఠాగూర్.
G. శంకర కురుప్.
1965లో జ్ఞానపీఠ అవార్డు మొదటిసారి ప్రదానం చేయబడింది. కేరళకు చెందిన మలయాళ కవి G. శంకర కురుప్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందిన తొలి రచయిత. ఆయన 1950లో ప్రచురించబడిన తన కవితా సంకలనం "ఓడక్కుళల్" (వెదురు వేణువు) కు 1965లో ఈ అవార్డును అందుకున్నారు.
భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
లాల్ బహాదూర్ శాస్త్రి.
ఇందిరా గాంధీ.
గుల్జారీ లాల్ నందా.
జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 1964 మే 27 వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా ఆయన రికార్డు కూడా కలిగి ఉన్నారు.
భారతదేశపు తొలి చీఫ్ జస్టిస్ ఎవరు?
పతంజలి శాస్త్రి.
మెహర్ చంద్ మహాజన్.
హెచ్. జె. కానియా.
బీజన్ కుమార్ ముఖర్జీ.
1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, హరిలాల్ జేకిసుందాస్ కానియా (H. J. Kania) భారతదేశపు తొలి ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 1951 నవంబర్ 6 వరకు ఈ పదవిలో కొనసాగి, అదే రోజు తన పదవిలో ఉన్నపుడే మరణించారు.
భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు?
సరోజిని నాయుడు.
పద్మజా నాయుడు.
విజయలక్ష్మీ పండిట్.
కాదంబినీ గంగూలీ.
సరోజిని నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నర్. ఆమె 15 ఆగస్టు 1947న యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్) గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1949 మార్చి 2 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆమె “భారత కోకిల” (Nightingale of India) అనే బిరుదుతో ప్రసిద్ధి చెందారు.
భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు?
సి.వి. రామన్.
మదర్ థెరిసా.
అమర్త్య సేన్.
రవీంద్రనాథ్ ఠాగూర్.
1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఆయన "గీతాంజలి" కవితాసంపుటికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన భారతదేశపు తొలి నోబెల్ బహుమతి గ్రహీత మాత్రమే కాకుండా, ఆసియాలోనూ ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి.
భారతదేశపు తొలి వార్తాపత్రిక ఏది?
మద్రాస్ కూరియర్.
బొంబాయి గెజిట్.
హికీస్ బెంగాల్ గెజిట్.
ఇండియా గెజిట్.
భారతదేశపు తొలి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్ (Hicky's Bengal Gazette). దీనిని జేమ్స్ అగస్టస్ హికీ 1780, జనవరి 29న కలకత్తాలో ప్రారంభించారు. ఇది ఆంగ్ల భాషలో వెలువడిన మొదటి వారపత్రిక. దీనిని Calcutta General Advertiser అని కూడా పిలిచేవారు. ఇది ఆసియాలోనే ముద్రించబడిన మొట్టమొదటి వార్తాపత్రిక.
భారతదేశపు తొలి మహిళా ఒలింపిక్ పతక విజేత ఎవరు?
పి.టి. ఉషా.
సైనా నెహ్వాల్.
మేరీ కోమ్.
కర్ణం మల్లేశ్వరి.
కర్ణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించి, భారతదేశపు తొలి మహిళా ఒలింపిక్ పతక విజేతగా నిలిచారు. ఆమె ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది.
భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు?
ప్రతిభా పాటిల్.
సరోజిని నాయుడు.
ద్రౌపది ముర్ము.
సుచేతా కృపలాని.
ప్రతిభా దేవిసింగ్ పాటిల్ 2007 జూలై 25న భారతదేశపు 12వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె భారతదేశపు తొలి మహిళా రాష్ట్రపతిగా చరిత్రలో నిలిచారు. ఆమె పదవీకాలం 2007 నుండి 2012 వరకు సాగింది. రాష్ట్రపతి పదవికి ముందు ఆమె రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేశారు.
భారతదేశపు మొదటి మహిళా కళాశాల ఏది?
బెథూన్ మహిళా కళాశాల, కోల్‌కతా.
సారా టకర్ మహిళా కళాశాల, తిరునెల్వేలి.
సరోజినీ నాయుడు మహిళా కళాశాల, భోపాల్.
లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల, ఢిల్లీ.
1879లో కోల్‌కతాలో స్థాపించబడిన బెథూన్ మహిళా కళాశాల భారతదేశపు మొదటి మహిళా కళాశాల. ఇది 1849లో బాలికల పాఠశాలగా ప్రారంభమై, 1879లో కళాశాలగా రూపాంతరం చెందింది. ఇది కోల్‌కతా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఎవరు?
సరోజిని నాయుడు.
సుచేతా కృపలాని.
సుశీలా నాయర్.
ఇందిరా గాంధీ.
ఇందిరా గాంధీ 1966 జనవరి 24న భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె. ఆమె పదవీకాలం రెండు విడతలుగా సాగింది—1966 నుండి 1977 వరకు, మరియు 1980 నుండి 1984 వరకు.
భారతదేశపు తొలి లోక్‌సభ స్పీకర్ ఎవరు?
బలరాం జఖర్.
ఎం. ఏ. అయ్యంగార్.
జి.వి. మావలంకర్.
సోమనాథ్ చటర్జీ.
గణేశ్ వాసుదేవ్ మావలంకర్ (G. V. Mavalankar) భారతదేశపు తొలి లోక్‌సభ స్పీకర్. 1952 మే 15న మొదటి లోక్‌సభ ఏర్పడినప్పుడు ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 1956లో ఆయన మరణం వరకు ఈ పదవిలో కొనసాగారు. జవహార్ లాల్ నెహ్రు ఆయనను “Father of Lok Sabha” అని వర్ణించారు.
భారతదేశపు తొలి అణు పరీక్ష ఎక్కడ జరిగింది?
తారాపూర్.
పోఖ్రాన్.
బికానేర్.
నారోరా.
భారతదేశపు తొలి అణు పరీక్ష 1974 మే 18న రాజస్థాన్‌లోని పొఖ్రాన్ అణు పరీక్షా స్థావరంలో జరిగింది. ఈ పరీక్షకు Smiling Buddha అనే కోడ్ నేమ్ ఇవ్వబడింది. ఇది భారతదేశపు మొదటి విజయవంతమైన అణు ఆయుధ పరీక్షగా చరిత్రలో నిలిచింది.
భారతదేశపు తొలి జాతీయ పార్క్ ఏది?
గిర్ నేషనల్ పార్క్.
కాజిరంగ నేషనల్ పార్క్.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్.
రణథంబోర్ నేషనల్ పార్క్.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ 1936లో హేలీ నేషనల్ పార్క్గా స్థాపించబడింది. ఇది భారతదేశపు మొట్టమొదటి జాతీయ పార్క్. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో ఉంది. 1956లో ఈ పార్క్‌కు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనే పేరు పెట్టారు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Thank you sir for providing information