GK Quiz – 4


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
ముంబయి.
న్యూఢిల్లీ.
కోల్‌కతా.
చెన్నై.
భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. భారతీయ రైల్వేల మొత్తం కార్యకలాపాలు, పాలన, మరియు నిర్వహణ న్యూఢిల్లీలోని రైల్ భవన్ నుండి జరుగుతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
మార్చి 22.
జూన్ 5.
అక్టోబర్ 24.
సెప్టెంబర్ 16.
ప్రపంచ ఓజోన్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న జరుపుకుంటారు. 1987లో మాంట్రియల్ ప్రోటోకాల్‌పై సంతకాలు చేసిన రోజును గుర్తు చేసేందుకు మరియు ఓజోన్ పొర రక్షణకు సంబంధించిన అవగాహనను పెంచేందుకు ఐక్యరాజ్యసమితి ఈ రోజును ప్రపంచ ఓజోన్ దినంగా ప్రకటించింది.
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్.
బీహార్.
పశ్చిమ బెంగాల్.
మహారాష్ట్ర.
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా గల రాష్ట్రం మహారాష్ట్ర. దీని జనాభా సుమారు 11.24 కోట్లు (112,374,333). మహారాష్ట్ర జనాభా భారతదేశ జనాభాలో సుమారు 9.29 శాతం వాటాను కలిగి ఉంది.
నాణేలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
న్యూమరాలజీ.
ఎకాలజీ.
న్యూమిస్మాటిక్స్.
ఎపిగ్రఫీ.
నాణేలు, టోకెన్లు, కాగితపు డబ్బు, పతకాలు మరియు ద్రవ్య సంబంధిత వస్తువులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ఈ శాస్త్రం కరెన్సీ నమూనాల భౌతిక లక్షణాలను, వాటి తయారీ సాంకేతికతను, మరియు చారిత్రక సందర్భాన్ని అధ్యయనం చేస్తుంది.
ఖండాలన్నింటిలో రెండవ అతిపెద్ద ఖండం ఏది?
ఆఫ్రికా.
ఉత్తర అమెరికా.
యూరప్.
దక్షిణ అమెరికా.
ప్రపంచంలో అతిపెద్ద ఖండం ఆసియా కాగా, రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. దీని విస్తీర్ణం సుమారుగా 30.37 మిలియన్ చ.కిమీ. ఆఫ్రికా ఖండాన్ని "చీకటి ఖండం" అని కూడా పిలుస్తారు. ఇది యూరోపియన్లు అన్వేషించని కారణంగా మరియు దాని కఠినమైన భౌగోళిక పరిస్థితులు మరియు వాతావరణం వల్ల ఈ పేరు పొందింది.
ప్రపంచ నీటి దినోత్సవం (World Water Day) ఏ రోజున జరుపుకుంటారు?
మార్చి 22.
మార్చి 15.
ఏప్రిల్ 7.
జూన్ 5.
1993 నుండి ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం జరుపుకుంటారు. 2025 ప్రపంచ నీటి దినోత్సవం థీమ్: 'గ్లేసియర్ ప్రిజర్వేషన్' (Glacier Preservation). అంటే 'హిమానీనదాల సంరక్షణ'. ఈ థీమ్ మంచినీటి సరఫరాకు హిమానీనదాలు ఎంత ముఖ్యమో, వాతావరణ మార్పుల నేపథ్యంలో వాటిని కాపాడాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది.
ఆక్సీజన్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు?
అవతార్ సింగ్ చీమా.
టెన్సింగ్ నార్గే.
ఫూదోర్జీ.
నావాంగ్ గొంబూ.
ఆక్సీజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఫూదోర్జీ. అతను 1984 మే 5న ఈ ఘనతను సాధించాడు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు అవతార్ సింగ్ చీమా, అయితే అతను ఆక్సిజన్‌తోనే అధిరోహించాడు.
భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య గల సరిహద్దు రేఖ ఏది?
మాజినాట్ రేఖ.
రాడ్‌క్లిఫ్ రేఖ.
డ్యురాండ్ రేఖ.
హిండెన్‌బర్గ్ రేఖ.
భారత్–పాకిస్తాన్ దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దును రాడ్‌క్లిఫ్ రేఖ అని పిలుస్తారు. అయితే కాశ్మీర్‌లోని సరిహద్దును నియంత్రణ రేఖ (Line of Control లేదా LoC) అంటారు. రాడ్‌క్లిఫ్ రేఖను 1947లో భారత విభజన సమయంలో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ అనే బ్రిటిష్ న్యాయవాది రూపొందించారు. ఇది భారతదేశంలోని గుజరాత్ నుండి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ వరకు విస్తరించి ఉంది. ఈ రేఖ పొడవు సుమారు 3,323కి.మీ. ఉంటుంది.
ప్రపంచంలో తొలి భూగర్భ రైల్వే మార్గం (Underground Railway) ఏర్పాటు చేసిన దేశం ఏది?
ఫ్రాన్స్.
జర్మనీ.
యునైటెడ్ కింగ్‌డమ్.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
ప్రపంచంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే మార్గాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ (UK) ఏర్పాటు చేసింది. లండన్‌లో 1863లో ప్రారంభమైన మెట్రోపాలిటన్ రైల్వే, వీధుల్లో రద్దీని తగ్గించేందుకు నిర్మించబడింది మరియు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పట్టణ, భూగర్భ రైల్వే మార్గం.
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏది?
చిరపుంజీ, భారత్.
మాసిన్‌రామ్, భారత్.
టుటునెండో, కొలంబియా.
క్రాప్ రివర్, న్యూజిలాండ్.
ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ఉన్న మాసిన్‌రామ్. ఇక్కడ సగటు వార్షిక వర్షపాతం 11,872 మిల్లీమీటర్లు (సుమారు 11.8 మీటర్లు). ఇది భూమిపై అత్యంత తేమతో కూడిన ప్రదేశంగా పరిగణించబడుతుంది.
సిటీ అఫ్ అరేబియన్ నైట్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
బాగ్దాద్.
కైరో.
దుబాయ్.
తెహ్రాన్.
"సిటీ అఫ్ అరేబియన్ నైట్స్" గా బాగ్దాద్ ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే "One Thousand and One Nights" కథలలో ప్రధాన నేపథ్యంగా ఇది కనిపిస్తుంది. మధ్యయుగ కాలంలో బాగ్దాద్ ఇస్లామిక్ ప్రపంచానికి సాంస్కృతిక, శాస్త్రీయ కేంద్రంగా నిలిచింది.
భారతదేశం ఏ దేశంతో అతి పొడవైన భూ సరిహద్దు పంచుకుంటుంది?
పాకిస్తాన్.
చైనా.
బంగ్లాదేశ్.
నేపాల్.
భారతదేశం మొత్తం 15,106 కిలోమీటర్ల భూ సరిహద్దును 7 దేశాలతో పంచుకుంటుంది. అందులో బంగ్లాదేశ్‌తో సుమారు 4,096 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ఇది భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య అత్యంత పొడవైన భూ సరిహద్దు. బంగ్లాదేశ్‌తో సరిహద్దును పంచుకునే భారత రాష్ట్రాలు ఐదు ఉన్నాయి: పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మరియు మిజోరం.
హెర్మిట్ కింగ్‌డమ్ అనే బిరుదుతో ఏ దేశాన్ని పిలుస్తారు?
మయన్మార్.
భూటాన్.
దక్షిణ కొరియా.
ఉత్తర కొరియా.
"హెర్మిట్ కింగ్‌డమ్" అని ఉత్తర కొరియాను పిలుస్తారు. ఎందుకంటే అది బయటి ప్రపంచం నుండి చాలా వరకు విడిపోయి, ద్వైపాక్షిక సంబంధాలకు, విదేశీ ప్రభావాలకు కఠినమైన నియంత్రణలను అమలు చేస్తుంది. ఈ పదం ఉత్తర కొరియా యొక్క స్వయం-నియంత్రణ, రాజకీయ మరియు ఆర్థిక ఒంటరితనాన్ని వివరిస్తుంది.
నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని అధ్యయనం చేయుటను ఏమంటారు?
ఫోనెటిక్స్.
హార్టికల్చర్.
హైడ్రోపోనిక్స్.
అగ్రోనమీ.
నేల సహాయం లేకుండా మొక్కలు పెంచే విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. ఈ పద్ధతిలో మొక్కలను నీటిలో కరిగిన ఖనిజ పోషక ద్రావణాన్ని ఉపయోగించి పెంచుతారు. ఈ విధానం ద్వారా మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలను నేలకు బదులుగా నేరుగా నీటి ద్వారా అందిస్తారు.
ఎడారి నక్క (Desert Fox) అనే బిరుదు ఎవరికి కలదు?
ఎర్విన్ రోమెల్.
బెర్నార్డ్ మాంట్గొమెరీ.
ఐజెన్‌హవర్.
జార్జ్ ప్యాటన్.
జర్మన్ ఫీల్డ్ మార్షల్‌ అయిన ఎర్విన్ రోమెల్‌కు "ఎడారి నక్క" (Desert Fox) అనే బిరుదు కలదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తమ వ్యూహవేత్తగా గుర్తింపు పొందిన ఆయన, ఉత్తర ఆఫ్రికాలోని ఎడారి యుద్ధాల్లో తన తెలివైన వ్యూహాలతో ప్రసిద్ధి చెందారు. ఈ బిరుదు ఆయనకు అక్కడి విజయాల కారణంగా లభించింది.
భారతదేశంలో మొట్టమొదట ఏర్పాటు చేసిన రైల్వే జోన్ ఏది?
తూర్పు రైల్వే జోన్.
దక్షిణ రైల్వే జోన్.
ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్.
దక్షిణమధ్య రైల్వే జోన్.
భారతదేశంలో మొదటి రైల్వే జోన్ దక్షిణ రైల్వే జోన్ (Southern Railway Zone) గా 1951 లో ఏర్పాటైంది. ఇది మద్రాస్ (ప్రస్తుత చెన్నై) కేంద్రంగా ఏర్పడింది. భారతదేశంలో మొత్తం 19 రైల్వే జోన్లు ఉన్నాయి. ఇందులో చివరిదైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం 2025లో ఆమోదం తెలిపింది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎవరు?
నార్మన్ బోర్లాగ్.
వర్గీస్ కురియన్.
ఎం.ఎస్. స్వామినాథన్.
సి. సుబ్రమణ్యం.
ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ అయితే, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. ఆయన భారతీయ వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషించి, దేశాన్ని ఆహార స్వయం సమృద్ధి సాధించేలా చేశారు. 2024లో ఆయనకు భారత రత్న కూడా లభించింది.
జాతీయ వరి పరిశోధనా సంస్థ (National Rice Research Institute) ఎక్కడ ఉంది?
హైదరాబాద్.
ఫిలిప్పీన్స్‌.
కోయంబత్తూరు.
కటక్.
జాతీయ వరి పరిశోధనా సంస్థ (National Rice Research Institute - NRRI) ఒడిశాలోని కటక్‌లో కలదు. దీనినే ఇప్పుడు ఐసీఏఆర్-జాతీయ వరి పరిశోధనా సంస్థ (ICAR-NRRI) అని కూడా పిలుస్తారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (IIRR) తెలంగాణలోని హైదరాబాద్ సమీపంలోని రాజేంద్రనగర్‌లో ఉంది. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (IRRI) ఫిలిప్పీన్స్‌లో కలదు.
ISRO ను విస్తరించుము?
ఇండియన్ సైన్స్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ఇంటర్నేషనల్ సైన్స్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ISRO అంటే Indian Space Research Organisation. ఇది 1969లో బెంగళూరులో స్థాపించబడింది. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం స్థాపించిన జాతీయ అంతరిక్ష సంస్థ. ఇది ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
చెస్‌లో గ్రాండ్ మాస్టర్ (Grandmaster) టైటిల్ సాధించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు?
కోనేరు హంపి.
విద్యాసాగర్.
భరత్ మోహన్.
విశ్వనాథన్ ఆనంద్.
భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఆయన 1988 లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ పొందారు. ఆయన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను ఐదుసార్లు గెలుచుకున్నారు. 1985లో అర్జున అవార్డు, 1987లో పద్మశ్రీ, 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2007లో పద్మవిభూషణ్ పొందారు. 2022లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) యొక్క ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు?
మేజర్ ధ్యాన్ చంద్.
మేఘనాబాయి చినాయ్.
మేజర్ ఆనంద్.
కల్జీ రమణ్.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని 'హాకీ మాంత్రికుడు' అని పిలువబడే మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న నిర్వహిస్తారు. ఆయన 1928, 1932, 1936 ఒలింపిక్ క్రీడల్లో హాకీ లో భారతదేశానికి బంగారు పతకాలు అందించారు. ఆయన అద్భుతమైన బాల్ కంట్రోల్ మరియు గోల్స్ స్కోరింగ్ నైపుణ్యం కారణంగా “హాకీ విజార్డ్” అనే బిరుదు పొందారు.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
న్యూయార్క్, USA.
పారిస్, ఫ్రాన్స్.
ది హేగ్, నెదర్లాండ్స్.
జెనీవా, స్విట్జర్లాండ్.
ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ప్రత్యేక ఏజెన్సీ, ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమాచారం, పరిశోధన మరియు డేటా మార్పిడిని సులభతరం చేస్తుంది.
భారతదేశంలో రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది?
మిజోరం.
అరుణాచల్ ప్రదేశ్.
మధ్యప్రదేశ్.
కేరళ.
భారతదేశంలో రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అత్యధిక శాతం అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం మిజోరం. 2019 అటవీ సర్వే ప్రకారం మిజోరం రాష్ట్రంలో దాదాపు 85.41% భూభాగం అడవులతో నిండి ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎక్కువ ఉన్నప్పటికీ, రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో శాతంపరంగా మాత్రం మిజోరం రాష్ట్రంలోనే అటవీ విస్తీర్ణం అధికంగా ఉంది.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యతా శాతం ఎంత?
68.4%
74.04%
79.2%
82.6%
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశ అక్షరాస్యత శాతం 74.04%. ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 82.14% కాగా, మహిళల అక్షరాస్యత రేటు 65.46%గా నమోదైంది.
ఓనం పండుగ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
తమిళనాడు.
కేరళ.
కర్ణాటక.
గుజరాత్.
ఓనం పండుగ ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇది కేరళ రాష్ట్ర అధికారిక పండుగ. ఇది పంటకోత పండుగ మరియు కేరళలో అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక వేడుక. మలయాళీలు ఈ పండుగను మహాబలి రాజును స్వాగతించే సంబరంగా, గొప్ప విందులు, సాంప్రదాయ నృత్యాలు, మరియు పూల అలంకరణలతో జరుపుకుంటారు.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


GK Questions in Telugu - Part 4

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top