GK Quiz – 5


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
భారత జాతీయ జెండాలోని కాషాయ రంగు దేనికి సంకేతం?
ధైర్యం, త్యాగం.
సత్యం, పవిత్రత, శాంతి.
విశ్వాసం, పరాక్రమం.
ప్రగతి, ప్రశాంతత.
భారత జాతీయ జెండాలోని కాషాయపు రంగు - ధైర్యం, త్యాగం మరియు దేశభక్తికి సంకేతం. తెలుపురంగు -సత్యం, పవిత్రత, శాంతికి సంకేతం. ఆకుపచ్చ రంగు - విశ్వాసం, పరాక్రమం, పాడిపసిడి పంటలు, నైతికతను తెలియజేస్తాయి.
రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
పశ్చిమ బెంగాల్.
ఆంధ్రప్రదేశ్.
తెలంగాణ.
పంజాబ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని "రైస్ బౌల్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. ఇక్కడ గోదావరి, కృష్ణా నదుల డెల్టా ప్రాంతాల్లో అధిక వరి ఉత్పత్తి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాను "రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్" అని పిలుస్తారు. కృష్ణా మరియు గోదావరి నదుల పరీవాహక ప్రాంతం, సారవంతమైన నేల కారణంగా ఈ జిల్లాలో అధికంగా వరి పండుతుంది, అందుకే ఈ పేరు వచ్చింది.
ఆసియా నోబెల్ అని ఏ అవార్డును పిలుస్తారు?
టెంపుల్టన్ అవార్డు.
రైట్ లైవ్లీహుడ్ అవార్డు.
రామన్ మెగససే అవార్డు.
భారతరత్న అవార్డు.
రామన్ మెగసెసే అవార్డును "ఆసియా నోబెల్ బహుమతి" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ అవార్డు కేవలం ఆసియా వాసులకే అందజేయబడుతుంది. 1957లో ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రామన్ మెగసెసే జ్ఞాపకార్థం ఈ అవార్డును స్థాపించారు. ఈ అవార్డును ఆరు రంగాలలో ప్రదానం చేస్తారు. ఈ అవార్డు కింద 50,౦౦౦ డాలర్ల నగదు బహుమతిని ప్రతి యేటా ఆగస్టు 31 న ప్రధానం చేస్తారు.
జింబాబ్వేను గతంలో ఏ పేరుతో పిలిచేవారు?
ఉత్తర రోడీషియా.
పశ్చిమ రోడీషియా.
తూర్పు రోడీషియా.
దక్షిణ రోడీషియా.
జింబాబ్వేను గతంలో దక్షిణ రోడేషియా అని పిలిచేవారు. ఇది బ్రిటిష్ వలస పాలనలో ఉన్నప్పుడు వాడిన పేరు. 1980లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశం అధికారికంగా జింబాబ్వేగా పేరు మార్చబడింది, మరియు రాబర్ట్ ముగాబే తొలి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది?
కాలేయం.
చిన్న ప్రేగు.
ఊపిరితిత్తులు.
చర్మం .
మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం. ఇది శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మానవ చర్మం సగటున 1.5 నుండి 2 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది మరియు మొత్తం శరీర బరువులో దాదాపు 16% వరకు ఉంటుంది.
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు?
సరోజిని నాయుడు.
సావిత్రీబాయి ఫూలే.
పండిత రమాబాయి.
కమలాదేవి చట్టోపాధ్యాయ.
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే. ఆమె 1848లో పూణేలో తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి బాలికల కోసం భారతదేశపు మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. ఆ పాఠశాలలో ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు మరియు స్త్రీ విద్య కోసం ఎంతో కృషి చేశారు.
Do or Die అనే నినాదం ఎవరిది?
భగత్ సింగ్.
సుభాష్ చంద్రబోస్.
చంద్రశేఖర్ ఆజాద్.
మహాత్మా గాంధీ.
"Do or Die" అనే నినాదాన్ని మహాత్మా గాంధీ గారు 1942 లో "క్విట్ ఇండియా ఉద్యమం" సమయంలో ఇచ్చారు. ఈ నినాదం ద్వారా ఆయన భారతీయులను బ్రిటిష్ పాలనను ముగించేందుకు ఏకమై పోరాడాలని, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ప్రేరేపించారు.
ప్రతి సంవత్సరం ఏ రోజును ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు?
జనవరి 26.
జనవరి 9.
ఆగస్టు 15.
అక్టోబర్ 2.
భారతదేశ అభివృద్ధిలో విదేశీ భారతీయ సమాజం చేసిన కృషికి గుర్తుగా 2003 నుండి ప్రతి సంవత్సరం జనవరి 9 న ప్రవాసీ భారతీయ దివస్ (PBD) జరుపుకుంటారు. 1915లో అదే రోజున మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపును ఇచ్చింది కాబట్టి ఆ రోజునే ఈ దినోత్సవం జరుపుకుంటారు.
బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు?
సలీం అలీ.
కె.ఎస్. శ్రీవాస్తవ్.
రఘునాథ్ జలాన్.
ఎం.కె.రంగనాథన్.
డాక్టర్ సలీం అలీని "Birdman of India" అని పిలుస్తారు. ఆయన ప్రసిద్ధ భారతీయ పక్షిశాస్త్రవేత్త (ornithologist). ఆయన భారతదేశంలో పక్షుల అధ్యయనానికి మరియు వాటి సంరక్షణకు చేసిన విస్తృతమైన కృషి కారణంగా ఆయనకు ఈ బిరుదు లభించింది.
నీలి విప్లవం (Blue Revolution) దేనికి సంబంధించింది?
ఆహార ధాన్యాల ఉత్పత్తి.
పాల ఉత్పత్తి.
చేపల ఉత్పత్తి.
నూనెగింజల ఉత్పత్తి.
నీలి విప్లవం అనేది ప్రధానంగా చేపలు, రొయ్యలు, ఇతర జలచరాల పెంపకం మరియు ఉత్పత్తిని పెంచడానికి సంబంధించిన ఉద్యమం. ఇది సముద్రాలు, నదులు మరియు సరస్సుల వంటి నీటి వనరుల నుండి లభించే ఉత్పత్తుల అభివృద్ధిని సూచిస్తుంది.
పట్టుపురుగుల పెంపకాన్ని ఏమంటారు?
సెరికల్చర్.
ఎపికల్చర్.
హార్టికల్చర్.
విటికల్చర్.
పట్టుపురుగుల పెంపకం మరియు వాటి నుండి పట్టును వెలికితీసే ప్రక్రియను సెరికల్చర్ లేదా పట్టు వ్యవసాయం అంటారు.
రొట్టెల దేశం (Land of Bread) అని ఏ దేశాన్ని పిలుస్తారు?
మెక్సికో.
ఫ్రాన్స్.
ఇటలీ.
స్కాట్లాండ్.
స్కాట్లాండ్ ను "రొట్టెల దేశం" (Land of Bread) అని పిలుస్తారు. అక్కడ గోధుమ మరియు బార్లీ ఉత్పత్తి విస్తారంగా ఉండటం, అలాగే బ్రెడ్, బిస్కెట్‌ల తయారీకి చారిత్రక ప్రాధాన్యం ఉన్నందున ఈ బిరుదు వచ్చింది. స్కాటిష్ ఆహార సంస్కృతిలో రొట్టె ముఖ్యమైన స్థానం పొందింది.
రైతు బాంధవుడుగా ప్రసిద్ధి చెందిన భారత ప్రధాని ఎవరు?
జవహార్ లాల్ నెహ్రూ.
చౌదరీ చరణ్ సింగ్.
వి.పి. సింగ్.
లాల్ బహదూర్ శాస్త్రి.
భారతదేశంలో రైతు బాంధవుడు (Champion of Farmers) గా ప్రసిద్ధి చెందిన వ్యక్తి చౌదరీ చరణ్ సింగ్. ఆయన 1953 కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ చట్టం మరియు 1952 ఉత్తర ప్రదేశ్ జమీందారీ మరియు భూ సంస్కరణల చట్టం వంటి రైతు అనుకూల చట్టాలను ప్రవేశపెట్టడంలో ప్రసిద్ధి చెందారు.
Tiger State of India అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
మధ్యప్రదేశ్.
కర్ణాటక.
మహారాష్ట్ర.
రాజస్థాన్.
భారతదేశంలోనే అత్యధిక పులుల జనాభా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్, కాబట్టి దీనిని "Tiger State of India"అని పిలుస్తారు. 2022 పులుల జనాభా లెక్కల ప్రకారం, ఈ రాష్ట్రంలో 785 పులులు ఉన్నాయి. ఇది పులుల సంరక్షణలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. మధ్యప్రదేశ్ లో తొమ్మిది టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి. వాటిలో కన్హా, బాంధవ్‌గఢ్, పన్నా, పెంచ్, సాత్పురా, సంజయ్-దుబ్రి, వీరాంగన దుర్గావతి, రతపాని, మరియు మాధవ్ టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.
నోబెల్ బహుమతి పొందిన మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ మధ్య సంబంధం ఏమిటి?
భార్యాభర్తలు.
అక్కాచెల్లెళ్లు.
అన్నాతమ్ములు.
తల్లీకూతుళ్లు.
మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ భార్యాభర్తలు. వారిద్దరు కలిసి సైన్స్ లో పరిశోధనలు చేశారు. వారు 1903 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. రేడియోధార్మికతను కనుగొన్నందుకు మరియు ఆవిష్కరణపై పరిశోధన చేసినందుకు వారికి ఈ బహుమతి లభించింది.
భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని?
18.
19.
22.
24.
భారత రాజ్యాంగం 22 భాషలను అధికారిక భాషలుగా గుర్తించింది. ఈ భాషలన్నీ రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్‌లో పేర్కొనబడ్డాయి. రాజ్యాంగం మొదట్లో 14 భాషలను మాత్రమె గుర్తించింది, ఆ తర్వాత 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ, 71వ సవరణ ద్వారా కొంకణి, మణిపురి మరియు నేపాలీ, మరియు 92వ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలి భాషలు చేర్చబడ్డాయి.
వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ ఎవరు?
సక్లైన్ ముస్తాక్.
బ్రెట్ లీ.
చేతన్ శర్మ.
చామిందా వాస్.
ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ చేతన్ శర్మ. ఇతడు 1987 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ తో జరిగిన మాచ్ లో కెన్ రూథర్‌ఫోర్డ్ , ఇయాన్ స్మిత్ మరియు ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ప్రపంచ కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ సాధించాడు.
భారతదేశ రెండవ అత్యున్నత సైనిక పురస్కారం ఏది?
మహావీరచక్ర.
పరమవీరచక్ర.
వీరచక్ర.
అశోకచక్ర.
మహావీర చక్ర భారతదేశంలో రెండవ అత్యున్నత సైనిక పురస్కారం. త్రివిధ దళాలలో (భూమిపై, సముద్రంలో లేదా గగనంలో) శత్రుసైన్యాలకు వ్యతిరేకంగా అసాధారణ ధైర్య సాహసాలు, శౌర్యాన్ని ప్రదర్శించినవారికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేస్తారు.
క్రిందివాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
స్విట్జర్లాండ్ – స్విస్.
నెదర్లాండ్స్ – డచ్.
న్యూజిలాండ్ – న్యూజాస్.
మొరాకో – మొరాకన్
న్యూజిలాండ్ పౌరులను న్యూజీలాండర్స్ లేదా కివీస్ అని పిలుస్తారు. స్విట్జర్లాండ్ ప్రజలను స్విస్, నెదర్లాండ్స్ ప్రజలను డచ్, మొరాకో ప్రజలను మొరాకన్స్ అని పిలుస్తారు.
నిప్పన్ అనేది ఏ దేశం యొక్క పాత పేరు?
తైవాన్.
యాంగూన్.
ఇరాన్.
జపాన్.
"నిప్పన్" అనేది జపాన్ దేశానికి పాత పేరు. జపాన్ దేశాన్ని స్థానికంగా "నిప్పాన్" లేదా "నిహాన్" అని పిలుస్తారు. ఇది జపనీస్ భాషలో దేశానికి అసలు పేరు. "నిప్పాన్" అనే పదం చైనీస్ అక్షరాలు "నిచి" (సూర్యుడు) మరియు "హోన్" (మూలం) నుండి ఉద్భవించింది, అనగా "సూర్యుని మూలం" లేదా "సూర్యుడు ఉదయించే ప్రదేశం".
తామరపువ్వు (lotus) జాతీయ పుష్పంగా గల దేశాలలో భారతదేశం ఒకటి. మరొక దేశం ఏది?
థాయిలాండ్.
చైనా.
ఈజిప్ట్.
వియత్నాం.
భారతదేశంతో పాటు, వియత్నాం కూడా తామర పువ్వు (lotus) ను జాతీయ పుష్పంగా కలిగి ఉంది.
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశాల సంఖ్య ఎంత?
192.
193.
194.
195.
ఐక్యరాజ్యసమితి లో ప్రస్తుతం 193 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రారంభంలో సభ్యదేశాల సంఖ్యా 51 మాత్రమే. చివరిగా 2011లో దక్షిణ సూడాన్ 193వ దేశంగా చేరింది.
ప్రస్తుత భారత కరెన్సీ చిహ్నాన్ని రూపొంచినవారు ఎవరు?
షిబిన్ కెకె.
షారుఖ్ జె ఇరానీ.
డి. ఉదయకుమార్.
నొందితా కొర్రియా మెహ్రోత్రా.
భారత కరెన్సీ రూపాయి (₹) చిహ్నాన్ని డి. ఉదయ్ కుమార్ ధర్మలింగం రూపొందించారు. ఆయన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయి నుండి డిజైన్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈ చిహ్నాన్ని 2010 జూలై 15 న భారత ప్రభుత్వం ఆమోదించింది. ఇది దేవనాగరి “र” అక్షరం మరియు లాటిన్ “R” అక్షరాల సమ్మేళనంతో రూపుదిద్దుకుంది.
సప్తసముద్రాలలోని ఏడు జలసంధులను ఈదిన తొలి భారతీయురాలు ఎవరు?
ఆర్తి ప్రధాన్.
బులా చౌదరి.
అరుణా రాణి.
ఉజ్వలా రాయ్.
బులా చౌదరి ప్రపంచంలోనే సప్త సముద్రాలలోని ఏడు జలసంధులు ఈదిన తొలి భారతీయ మహిళ. ఆమె భారతదేశంలో జాతీయ మహిళా ఈత ఛాంపియన్ గా నిలిచింది. ఆమె "ఇంగ్లీషు ఛానెల్" ను రెండుసార్లు ఈది చరిత్ర సృష్టించింది.
జాతీయ జెండా యొక్క పొడవు, వెడల్పుల నిష్పత్తి ఎంత?
2 : 3
3 : 2
3 : 4
4 : 3
భారత జాతీయ జెండా యొక్క పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉంటుంది. అంటే జెండా యొక్క పొడవు మూడు భాగాలు ఉంటే, దాని వెడల్పు రెండు భాగాలుగా ఉంటుంది. ఇది Flag Code of India ప్రకారం అధికారికంగా నిర్ధారించబడిన ప్రమాణం.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


GK Questions in Telugu - Part 5

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top