GK Quiz – 6


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏది?
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.
నరేంద్ర మోదీ స్టేడియం.
ఈడెన్ గార్డెన్స్.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్.
నరేంద్ర మోదీ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉంది. దీనిని 1,32,000 మంది కూర్చునే సీటింగ్ సామర్ధ్యంతో నిర్మించారు.
భారతదేశంలో అత్యంత పొడవైన నది ఏది?
గోదావరి.
బ్రహ్మపుత్ర.
గంగ.
కృష్ణ.
భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా నది. దీని పొడవు సుమారు 2,525 కిలోమీటర్లు (1,569 మైళ్ళు).
ప్రపంచంలో అతి పెద్ద ఉష్ణ ఎడారి ఏది?
గోబీ ఎడారి.
కలహారి ఎడారి.
అరేబియా ఎడారి.
సహారా ఎడారి.
ప్రపంచంలోనే అతి పెద్ద ఉష్ణ ఎడారి సహారా ఎడారి. ఇది ఉత్తర ఆఫ్రికాలో ఉంది మరియు దాదాపు 9.2 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది ఉత్తర ఆఫ్రికాలో 11 దేశాల్లో విస్తరించి ఉంది.
ఆసియాలో పొడవైన నది ఏది?
మెకాంగ్ నది.
గంగా నది.
యాంగ్జీ నది.
అమూర్ నది.
యాంగ్జీ నది చైనా మరియు ఆసియా రెండింటిలోనూ పొడవైన నది మరియు ప్రపంచంలో మూడవ పొడవైన నది. ఈ నది పొడవు 6,300 కిలో మీటర్లు (3,915 మైళ్ళు). ఈ నది టిబెటన్ పీఠభూమిలోని తంగ్గులా పర్వతాలలో ఉద్భవించి, చైనా అంతటా ప్రవహించి, తూర్పు చైనా సముద్రంలో కలుస్తుంది.
ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది?
పాల ఉత్పత్తి.
గోధుమల ఉత్పత్తి.
చేపల ఉత్పత్తి.
నీటి పారుదల.
"ఆపరేషన్ ఫ్లడ్", లేదా శ్వేత విప్లవం, లేదా “వైట్ రివల్యూషన్” భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. ఇది 1970లో ప్రారంభమైంది. ఇది భారతదేశాన్ని పాల కొరత ఉన్న దేశం నుండి ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చిన ఉద్యమం. డాక్టర్ వర్గీస్ కురియన్ ను "భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు" అని పిలుస్తారు.
ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏది?
నయాగరా జలపాతం.
ఏంజెల్ జలపాతం.
విక్టోరియా జలపాతం.
తుగేలా జలపాతం.
ఏంజెల్ జలపాతం (Angel Falls) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సహజ జలపాతం. ఇది వెనిజులాలో ఉంది మరియు దీని ఎత్తు 979 మీటర్లు (3,212 అడుగులు).
ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు ఏది?
కుందేలు.
సింహం.
గుర్రం.
చిరుత పులి.
ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుత పులి. దాని గరిష్ట వేగం సుమారు 112–120 km/h (70–75 mph). అది 0 నుండి 100 km/h వేగాన్ని 3 సెకన్లలో చేరగలదు.
ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి 'రాబర్ట్ వాడ్లో' ఎత్తు ఎంత?
2.50 మీటర్లు.
2.60 మీటర్లు.
2.80 మీటర్లు.
2.72 మీటర్లు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి అయిన రాబర్ట్ వాడ్లో ఎత్తు 8 అడుగుల 11 అంగుళాలు (2.72 మీటర్లు). ఇతడు 1940లో తన 22 ఏళ్ల వయసులో మరణించాడు.
ప్రపంచంలో అతి చిన్న పక్షి ఏది?
స్పారో.
సన్‌బర్డ్.
లవ్ బర్డ్.
బీ హమ్మింగ్‌బర్డ్.
"బీ హమ్మింగ్‌బర్డ్" ప్రపంచంలోనే అతి చిన్న పక్షి. ఇది క్యూబా ద్వీపంలో కనిపిస్తుంది. దీని పొడవు 5 నుండి 6 సెంటీమీటర్ల వరకు ఉంటుంది మరియు బరువు 1.6 నుండి 2 గ్రాముల వరకు ఉంటుంది.
భారతదేశ తొలి మహిళా గవర్నర్ ఎవరు?
సరోజినీ నాయుడు.
దుర్గాభాయ్ దేశ్ ముఖ్.
విజయలక్ష్మి పండిట్.
కాదంబినీ గంగూలీ.
భారతదేశపు మొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఆమె 1947 ఆగస్టు 15 నుండి 1949 మార్చి 2 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. ఆమెకు “భారత నైటింగేల్” అనే బిరుదు కలదు.
భారతదేశపు మిసైల్ మ్యాన్ అని ఎవరిని పిలుస్తారు?
సత్యేంద్రనాథ్ బోస్.
ఏ.పి.జె. అబ్దుల్ కలాం.
హోమీ జహంగీర్ భాభా.
విక్రమ్ సారాభాయి.
భారతదేశపు మిసైల్ మ్యాన్ అని డాక్టర్ APJ అబ్దుల్ కలాంను పిలుస్తారు. ఆయన భారతదేశం యొక్క స్వదేశీ క్షిపణి సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఎంతగానో కృషి చేశారు. వీటిలో అగ్ని, పృథ్వీ వంటి క్షిపణులు ఉన్నాయి. కాబట్టి, క్షిపణి అభివృద్ధిలో ఆయన చేసిన కృషికిగాను "భారతదేశపు మిసైల్ మ్యాన్" అనే పేరు వచ్చింది.
మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది?
చెవిలో.
ముక్కులో.
చేతిలో.
కాలి పాదంలో.
మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేప్స్. ఇది మధ్య చెవిలో ఉంటుంది. మధ్య చెవిలో ఉండే మూడు చిన్న ఎముకలలో ఇది చివరిది. ఇది శబ్ద తరంగాలను అంతర్గత చెవికి చేరవేసే ముఖ్య పాత్రను పోషిస్తుంది.
పింక్ సిటీ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
బికనేర్
జోధ్‌పూర్.
ఉదయ్‌పూర్.
జైపూర్.
భారతదేశంలో "పింక్ సిటీ" అని పిలువబడే నగరం జైపూర్. ఇది రాజస్థాన్ రాష్ట్ర రాజధాని. జైపూర్ నగరానికి ఆ పేరు రావడానికి గల కారణం, 1876లో మహారాజా రామ్ సింగ్ బ్రిటన్ రాణి విక్టోరియా మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కు స్వాగతం పలకడానికి నగరంలోని భవనాలన్నింటికీ గులాబీ రంగు వేయించారు. అప్పటి నుండి, ఈ నగరం "పింక్ సిటీ"గా ప్రసిద్ధి చెందింది.
సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
శుక్రుడు.
భూమి.
గురుడు.
బుధుడు.
సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు (Mercury). ఇది సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం కూడా. బుధుడు సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి కేవలం 88 రోజులు పడుతుంది. దీన్నే బుధ గ్రహం యొక్క సంవత్సరం అని కూడా అంటారు.
చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?
బజ్ ఆల్డ్రిన్.
యూరీ గగారిన్.
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్.
మైఖేల్ కాలిన్స్.
చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అతడు 1969 జూలై 20న మొదటి మానవసహిత మిషన్ అయిన అపోలో 11 ద్వారా చంద్రునిపై కాలు పెట్టాడు.
భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం?
కేరళ.
ఆంధ్రప్రదేశ్.
తమిళనాడు.
గుజరాత్.
భరతనాట్యం తమిళనాడు రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం. ఇది భారతదేశంలోని ఎనిమిది శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి. ఈ నృత్యం పురాతన కాలం నుండి తమిళనాడులో అభివృద్ధి చెందింది మరియు దక్షిణ భారతదేశంలోని మతపరమైన ఇతివృత్తాలు మరియు ఆధ్యాత్మిక ఆలోచనలను వ్యక్తీకరించడానికి ఉపయోగించబడుతుంది.
ప్రపంచంలో అతి చిన్న దేశం ఏది?
మాల్టా.
వాటికన్ సిటీ.
మోనాకో.
నౌరు.
ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఇది ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ఇది పోప్ నివాసంగా మరియు కేథలిక్ చర్చి యొక్క కేంద్రంగా పనిచేస్తుంది. దీని విస్తీర్ణం కేవలం 0.44 చదరపు కిలోమీటర్లు (0.17 చదరపు మైళ్లు)మాత్రమే.
రెడ్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
గురుడు.
అంగారకుడు.
శని.
శుక్రుడు.
అంగారక గ్రహం (Mars) ను "రెడ్ ప్లానెట్" అని పిలుస్తారు. ఎందుకంటే దాని ఉపరితలంపై ఇనుప ఖనిజాలు ఉండటం వల్ల, అవి ఆక్సీకరణం చెంది, తుప్పు పట్టి ఎరుపు రంగులో కనిపిస్తుంది.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది?
ముంబై.
కోల్‌కతా.
న్యూ ఢిల్లీ.
బెంగళూరు.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఉంది. ఇది దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం మరియు ప్రపంచంలోనూ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటి. 1962 వరకు దీనిని సఫ్దర్‌గంజ్ విమానాశ్రయం అని పిలిచేవారు, తరువాత దీనికి పాలం విమానాశ్రయం అని పేరు మార్చారు, ఆ తర్వాత 1986లో ప్రస్తుత పేరు పెట్టారు.
భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది?
మహారాష్ట్ర.
తమిళనాడు.
గుజరాత్.
ఆంధ్రప్రదేశ్.
భారతదేశంలో అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం గుజరాత్. దీని తీరరేఖ పొడవు దాదాపు 1600 కిలోమీటర్లు. గుజరాత్ తీరం అరేబియా సముద్రం వెంబడి విస్తరించి ఉంది.
ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఏది?
గ్రీన్‌లాండ్.
న్యూజిలాండ్.
ఐస్‌లాండ్.
ఫిన్లాండ్.
ప్రపంచంలో దోమలు లేని ఏకైక దేశం ఐస్‌లాండ్. ఎందుకంటే అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు ఉండడం వలన దోమల జీవచక్రానికి (జీవించడానికి) అనుకూలంగా ఉండవు.
ప్రపంచంలో అతి ఎత్తైన భవనం ఏది?
షాంఘై టవర్.
బుర్జ్ ఖలీఫా.
ఎమ్పైర్ స్టేట్ బిల్డింగ్.
టోక్యో స్కైట్రీ.
ప్రపంచంలో అతి ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌ నగరంలో ఉంది. దీని ఎత్తు 828 మీటర్లు (2,717 అడుగులు).
ఆసియాలోకెల్లా అతి పెద్ద ఎడారి ఏది?
కలహారి ఎడారి.
సహారా ఎడారి.
అరేబియా ఎడారి.
గోబీ ఎడారి.
గోబీ ఎడారి ఆసియాలోకెల్లా అతిపెద్దది మరియు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎడారి. ఇది చైనా మరియు మంగోలియా దేశాలలో విస్తరించి ఉంది. ఇది సుమారు 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. గోబీ ఎడారిలో వివిధ రకాల భౌగోళిక లక్షణాలు ఉన్నాయి మరియు చాలా చల్లని వాతావరణం ఉంటుంది.
భారతదేశంలో చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఉత్తరాఖండ్.
హిమాచల్ ప్రదేశ్.
పశ్చిమ బెంగాల్.
మధ్య ప్రదేశ్.
చిప్కో ఉద్యమం 1973లో అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో (ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో) ప్రారంభమైంది. చిప్కో ఉద్యమం అనేది అడవుల నరికివేతను వ్యతిరేకిస్తూ, చెట్లను రక్షించడానికి ప్రజలు చెట్లను కౌగిలించుకొని నిరసన తెలిపే ఒక పర్యావరణ ఉద్యమం. ముఖ్యంగా సుందర్‌లాల్ బహుగుణ చిప్కో ఉద్యమానికి దేశవ్యాప్త గుర్తింపును తెచ్చారు.
2024లో వేసవి ఒలింపిక్ క్రీడలు ఏ నగరంలో జరిగాయి?
టోక్యో.
బీజింగ్.
పారిస్.
లాస్ ఏంజిల్స్.
2024 వేసవి ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌ నగరంలో జరిగాయి. పారిస్ లో ఇప్పటివరకు మూడు సార్లు ఒలింపిక్ క్రీడలు జరిగాయి. అవి 1900, 1924, మరియు 2024 సంవత్సరాల్లో జరిగాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


GK Questions in Telugu - Part 6

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top