GK Quiz – 7


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
“మధ్యధరా ప్రాంతపు తాళపుచెవి” (Key to the Mediterranean) అని దేనిని పిలుస్తారు?
జిబ్రాల్టార్ జలసంధి.
పనామా కాలువ.
బేరింగ్ జలసంధి.
బాబ్-ఎల్-మాండబ్ జలసంధి.
"మధ్యధరా ప్రాంతం తాళపుచెవి" (Key to the Mediterranean) అని జిబ్రాల్టర్ జలసంధిని పిలుస్తారు. ఈ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలుపుతుంది. ఇది మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించడానికి ఏకైక మార్గం కాబట్టి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది. అందుకే ఈ జలసంధిని ఒక తాళపుచెవిగా పరిగణిస్తారు.
రక్తం మరియు దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు?
హిప్నాలజీ.
హెపటాలజీ.
హెమటాలజీ.
హెప్తాలజీ.
రక్తం మరియు దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనాన్ని హెమటాలజీ (Hematology) అంటారు. ఈ అధ్యయనంలో రక్తం, రక్త కణాలు, రక్తం గడ్డకట్టడం, మరియు రక్తానికి సంబంధించిన క్యాన్సర్లు (లుకేమియా, లింఫోమా వంటివి) మరియు ఇతర రుగ్మతలను పరిశీలిస్తారు. హెమటాలజీ నిపుణులను "హెమటాలజిస్టులు"అని పిలుస్తారు.
“శాంతి మనిషి” (Man of Peace) అనే బిరుదుతో ఎవరు ప్రసిద్ధి చెందారు?
జవహర్‌లాల్ నెహ్రూ.
లాల్ బహదూర్ శాస్త్రి.
మొరార్జీ దేశాయ్.
చౌదరి చరణ్ సింగ్.
"శాంతి మనిషి" (Man of Peace) అనే బిరుదుతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రసిద్ధి చెందారు. ఆయన భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా 1964 నుండి 1966 వరకు పనిచేశారు. 1965 భారత–పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా శాంతి మార్గాన్ని ప్రాధాన్యంగా తీసుకొని, యుద్ధాన్ని ముగించడానికి 1966లో తాష్కెంట్ ఒప్పందంపై సంతకం చేశారు. ఆయన ఎల్లప్పుడూ శాంతియుత మార్గాలను అనుసరించే వ్యక్తి కావడంతో “శాంతి మనిషి” అనే బిరుదు పొందారు.
ఖండాలన్నింటిలో విస్తీర్ణపరంగా అతిచిన్న ఖండం ఏది?
యూరప్.
ఆంటార్కిటికా.
ఆస్ట్రేలియా.
దక్షిణ అమెరికా.
ఖండాలన్నింటిలో అతి చిన్న ఖండం ఆస్ట్రేలియా. దీనిని ఓషియానియా అని కూడా పిలుస్తారు. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం దాదాపు 7.69 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఇది భూమిపైనే అతి చిన్న ఖండం కానీ విస్తీర్ణం పరంగా ప్రపంచంలో ఆరవ అతిపెద్ద దేశం.
విస్తీర్ణపరంగా భారత్‌లో రెండవ అతి చిన్న రాష్ట్రం ఏది?
సిక్కిం.
గోవా.
త్రిపుర.
మణిపూర్.
విస్తీర్ణపరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం గోవా (3,702 చ. కిమీ) కాగా, రెండవ అతి చిన్న రాష్ట్రం సిక్కిం. దీని విస్తీర్ణం సుమారు 7,096 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశం మొత్తం విస్తీర్ణంలో కేవలం 0.21% మాత్రమే కల్గి ఉంది.
భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దు లేని భూపరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత?
5 రాష్ట్రాలు.
10 రాష్ట్రాలు.
12 రాష్ట్రాలు.
14 రాష్ట్రాలు.
భారతదేశంలో అంతర్జాతీయ సరిహద్దులు లేని భూపరివేష్టిత రాష్ట్రాలు 5 ఉన్నాయి. అవి 1) ఛత్తీస్‌గఢ్, 2) హర్యానా, 3) జార్ఖండ్, 4) మధ్యప్రదేశ్ మరియు 5) తెలంగాణ. ఈ రాష్ట్రాలు ఏ అంతర్జాతీయ సరిహద్దును పంచుకోవు మరియు దేశంలోని ఇతర భూభాగాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటాయి.
రంగులంటే భయపడడాన్ని ఏ ఫోబియా అంటారు?
క్రోమోఫోబియా (Chromophobia).
క్రోనోఫోబియా (Chronophobia).
కార్సినోఫోబియా (Carcinophobia).
కాటోప్ట్రోఫోబియా (Catoptrophobia).
రంగులంటే భయపడడాన్ని క్రోమోఫోబియా (Chromophobia) లేదా క్రోమాటోఫోబియా (Chromatophobia) అని అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రంగుల పట్ల తీవ్రమైన, అహేతుకమైన లేదా మితిమీరిన భయాన్ని కలిగి ఉంటారు. ఇది గ్రీకు పదాలైన "క్రోమోస్" (రంగు) మరియు "ఫోబోస్" (భయం) నుండి ఉద్భవించింది. క్రోనోఫోబియా - కాలానికి భయం, కార్సినోఫోబియా - క్యాన్సర్‌కి భయం, కాటోప్ట్రోఫోబియా - అద్దాలంటే భయం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
మే 5.
జూన్ 5.
జూలై 5.
ఆగస్టు 5.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) ను ప్రతి సంవత్సరం జూన్ 5 తేదిన జరుపుకుంటారు. దీనిని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP) ద్వారా నిర్వహిస్తారు. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క థీమ్ "ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం" (End Plastic Pollution).
భారతదేశం ఎన్ని దేశాలతో భూ-సరిహద్దును కల్గి ఉంది?
5 దేశాలు.
6 దేశాలు.
7 దేశాలు.
8 దేశాలు.
భారతదేశం ఏడు దేశాలతో భూ-సరిహద్దును కలిగి ఉంది: ఇందులో వాయువ్య దిశలో: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్. ఉత్తరాన: చైనా, భూటాన్, నేపాల్. తూర్పున: మయన్మార్, బంగ్లాదేశ్ ఉన్నాయి. అలాగే భారతదేశం 2 దేశాలతో సముద్ర సరిహద్దును పంచుకుంటుంది. అవి మాల్దీవులు మరియు శ్రీలంక.
“ఆధునిక బాబిలోన్” అనే బిరుదుతో చారిత్రికంగా ఏ నగరాన్ని పిలుస్తారు?
న్యూయార్క్.
దుబాయ్.
బాగ్దాద్.
లండన్.
"ఆధునిక బాబిలోన్" (Modern Babylon) అనే బిరుదుతో లండన్ నగరాన్ని చారిత్రికంగా పిలుస్తారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క కేంద్రంగా, అనేక సంస్కృతులు మరియు భాషలు ఒకచోట చేరిన ఒక వైవిధ్యమైన నగరంగా ఇది గుర్తింపు పొందింది. బ్రిటిష్ ప్రధానమంత్రి బెంజమిన్ డిస్రేలీ లండన్‌ను "ఆధునిక బాబిలోన్" అని వర్ణించారు.
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
చెన్నై.
హుబ్లీ.
సికింద్రాబాద్.
విశాఖపట్నం.
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) 1966 అక్టోబరు 2న ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్, తెలంగాణలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం సికింద్రాబాద్, హైదరాబాద్, మరియు నాందేడ్ అనే మూడు డివిజన్లను కలిగి ఉంది. మిగిలిన గుంటూరు, గుంతకల్, మరియు విజయవాడ డివిజన్లు ఇటీవల 2025లో కొత్తగా ఏర్పడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లోకి మార్చబడ్డాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
న్యూయార్క్, USA.
జెనీవా, స్విట్జర్లాండ్.
రోమ్, ఇటలీ.
మాంట్రియాల్, కెనడా.
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) 1995 జనవరి 1 న పూర్వపు GATT స్థానంలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. WTO ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యాన్ని సులభతరం చేయడం, నియంత్రించడం మరియు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడం. అలాగే సభ్య దేశాల మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి వేదికగా వ్యవహరిస్తుంది.
నరాలకు (nerves) సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
న్యూమరాలజీ.
న్యూరోబయాలజీ.
న్యూరాలజీ.
నెఫ్రాలజీ.
నరాలకు (nerves) మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని న్యూరాలజీ అంటారు. ఇది మెదడు, వెన్నుపూస, నరాల సమస్యలు సంబంధిత రుగ్మతలను గుర్తించడం, చికిత్స చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. న్యూరాలజీ వైద్యుడిని "న్యూరాలజిస్టు" అని పిలుస్తారు.
“ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా” అని భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
ఆంధ్రప్రదేశ్.
మహారాష్ట్ర.
తమిళనాడు.
పంజాబ్.
భారతదేశంలో “ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా” బిరుదుతో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది భారతదేశంలోనే అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం కాబట్టి దీనిని "ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా" అని పిలుస్తారు. దేశ మొత్తం గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దాదాపు 18% వాటాను అందిస్తోంది. గుడ్లు మరియు గుడ్డు పొడి కోసం ప్రపంచ మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
2025 IPL విజేతగా ఏ జట్టు నిలిచింది?
గుజరాత్ టైటాన్స్ (GT).
ముంబై ఇండియన్స్ (MI).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB).
పంజాబ్ కింగ్స్ (PBKS).
2025 జూన్ 3న నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS)పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు జట్టు 190/9 పరుగులు చేసింది, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ 184 పరుగులకే ఆలౌటయ్యారు. RCB 2008 నుండి ప్రతి సీజన్‌లో ఆడినా ఇదే ఆ జట్టుకు మొదటి IPL ట్రోఫీ.
“గరీబీ హఠావో” అనే నినాదాన్ని ఇచ్చిన భారత ప్రధాని ఎవరు?
రాజీవ్ గాంధీ.
ఇందిరా గాంధీ.
అటల్ బిహారీ వాజ్‌పేయి.
జవహర్‌లాల్ నెహ్రూ.
"గరీబీ హఠావో దేశ్ బచావో" (పేదరికాన్ని తొలగించండి, దేశాన్ని రక్షించండి) అనేది ఇందిరా గాంధీ 1971 ఎన్నికల ప్రచారం నినాదం. ఈ నినాదం ద్వారా ఆమె పేదల సంక్షేమం, ఆర్థిక సమానత్వం, మరియు స్వయం ఆధారిత అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ నినాదం ఐదవ పంచవర్ష ప్రణాళిక (Fifth Five-Year Plan)లో భాగంగా పేదరిక నిర్మూలనకు కేంద్రంగా నిలిచింది.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత?
324 వ్యక్తులు/చ.కి.మీ.
382 వ్యక్తులు/చ.కి.మీ.
421 వ్యక్తులు/చ.కి.మీ.
468 వ్యక్తులు/చ.కి.మీ.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 382 మంది. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం బీహార్ (1102 వ్యక్తులు/చ.కిమీ) కాగా, అత్యల్ప జనసాంద్రత కలిగిన రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ (17 వ్యక్తులు/చ.కిమీ).
భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణం ఎంత?
29,87,263 చ.కి.మీ.
32,87,263 చ.కి.మీ.
34,87,263 చ.కి.మీ.
31,87,263 చ.కి.మీ.
భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఈ విస్తీర్ణంతో, భారతదేశం ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద దేశంగా ఉంది. ప్రపంచంలోని మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో భారతదేశం 2.4 శాతాన్ని కలిగి ఉంది.
డ్యూరాండ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య గల అంతర్జాతీయ సరిహద్దు రేఖ?
భారత్ – పాకిస్తాన్.
భారత్ – ఆఫ్ఘనిస్తాన్.
చైనా – పాకిస్తాన్.
ఆఫ్ఘనిస్తాన్ – పాకిస్తాన్.
డ్యూరాండ్ రేఖ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ. ఈ సరిహద్దు 1893లో బ్రిటీష్ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ఏర్పడింది. 1947లో బ్రిటీష్ ఇండియా విభజన తర్వాత, ఈ రేఖ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ దేశాల మధ్య సరిహద్దుగా మారింది. ఈ రేఖ సుమారు 2,640 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
శ్వేత విప్లవ పితామహుడు (Father of White Revolution) ఎవరు?
వర్గీస్ కురియన్.
ఎం. ఎస్. స్వామినాథన్.
నార్మాన్ బోర్లాగ్.
ట్రిభువన్‌దాస్ పటేల్.
శ్వేత విప్లవ పితామహుడు (Father of White Revolution) గా డాక్టర్ వర్గీస్ కురియన్ ప్రసిద్ధి చెందారు. ఆయన "Operation Flood" కార్యక్రమం ద్వారా భారతదేశాన్ని పాల ఉత్పత్తిలో స్వావలంబిగా తీర్చిదిద్దారు. ఆయన "మిల్క్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" అనే బిరుదుతో కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన గౌరవార్థం తన జన్మదినమైన నవంబర్ 26న భారతదేశంలో జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటారు.
భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?
గుజరాత్.
రాజస్థాన్.
అరుణాచల్ ప్రదేశ్.
పశ్చిమ బెంగాల్.
భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది బంగ్లాదేశ్‌తో సుమారు 2,217 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది.
NASA అనే సంక్షిప్త పదాన్ని విస్తరించండి?
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అసోసియేషన్.
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్.
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ శాటిలైట్ అడ్మినిస్ట్రేషన్.
న్యూ అమెరికన్ స్పేస్ ఏజెన్సీ.
NASA అంటే "నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్". ఇది 1958లో అమెరికాలో స్థాపించబడిన అంతరిక్ష పరిశోధన సంస్థ. NASA ప్రధానంగా అంతరిక్ష ప్రయోగాలు, ఉపగ్రహాలు, మరియు వైజ్ఞానిక రాకెట్స్, స్పేస్ మిషన్లను రూపొందించడం, నిర్వహించడం వంటి కార్యకలాపాలను చేపడుతుంది. NASA ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ D.C లో ఉంది.
భారత్–చైనా దేశాల మధ్య గల సరిహద్దు రేఖ ఏది?
డ్యూరాండ్ రేఖ.
హిండెన్‌బర్గ్ రేఖ.
రాడ్‌క్లిఫ్ రేఖ.
మెక్‌మోహన్ రేఖ.
భారత్–చైనా దేశాల మధ్య గల ప్రధాన సరిహద్దు రేఖ మెక్‌మోహన్ రేఖ. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య జరిగిన సిమ్లా సమావేశంలో బ్రిటిష్ దౌత్యవేత్త హెన్రీ మెక్‌మోహన్ ఈ రేఖను ప్రతిపాదించారు. దీనికి అదనంగా, భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను వాస్తవ నియంత్రణ రేఖ (Line of Actual Control - LAC) అని పిలుస్తారు.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యల్ప జనాభా గల రాష్ట్రం ఏది?
మిజోరం.
అరుణాచల్ ప్రదేశ్.
గోవా.
సిక్కిం.
2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం సిక్కిం. సిక్కిం జనాభా సుమారు 6.10లక్షలు. సిక్కిం రాష్ట్ర జనాభా భారతదేశ మొత్తం జనాభాలో 0.05% ఉంది. ఇది విస్తీర్ణ పరంగా రెండవ చిన్న రాష్ట్రం అయినా, జనాభా పరంగా అత్యల్ప జనాభా గల రాష్ట్రంగా గుర్తించబడింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఏది?
ఉషికు దైబుత్సు (జపాన్).
లైక్యూన్ సెక్క్యా (మయన్మార్).
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (అమెరికా).
స్టాట్యూ ఆఫ్ యూనిటీ (భారతదేశం).
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం భారతదేశంలోని గుజరాత్‌లో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ (ఐక్యతా విగ్రహం). సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ విగ్రహం 182 మీటర్ల (597 అడుగులు) ఎత్తుతో ఉంది. ఈ విగ్రహ నిర్మాణాన్ని 2018లో పూర్తి చేశారు. దీని నిర్మాణకర్త ప్రముఖ శిల్పి రామ్ వి. సుతార్.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


GK Questions in Telugu - Part 7

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top