India GK Bits – Part 1


🕒 25 MCQs | 35 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
35:00
భారత జాతీయ వృక్షం ఏది?
రావి చెట్టు.
వేప చెట్టు.
మామిడి చెట్టు.
మర్రి చెట్టు.
భారత జాతీయ వృక్షం మర్రి చెట్టు (Banyan Tree). దీని శాస్త్రీయనామం Ficus bengalensis. ఇది దీర్ఘాయుష్షు, విశాలత మరియు చెదరని భారతీయ సాంస్కృతిక విలువలకు ప్రతీక. దీనినే బృహత్ వృక్షం అని కూడా అంటారు.
ఆరెంజ్ సిటీ అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు?
నాగ్‌పూర్.
పుణే.
భోపాల్.
జైపూర్.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరాన్ని “ఆరెంజ్ సిటీ” అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ నారింజ పండ్లు విస్తారంగా పండుతాయి మరియు వాటి నాణ్యత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. నారింజపండ్ల ఉత్పత్తిలో ఇది దేశంలో అగ్రగామిగా ఉంది.
జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు (Spokes) ఉంటాయి?
12
18
20
24
భారత జాతీయ పతాకం మధ్యలో ముదురు నీలి రంగులో ఉన్న అశోక చక్రంలో 24 spokes (ఆకులు/చువ్వలు) ఉంటాయి. దీనిని ధర్మ చక్రం అని కూడా పిలుస్తారు. ఇది సారనాథ్‌లోని అశోక స్తంభం నుండి తీసుకోబడింది.
పంచనదుల ప్రాంతం (Land of Five Rivers) అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
హర్యానా.
ఉత్తరప్రదేశ్.
గుజరాత్.
పంజాబ్.
భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రాన్ని "పంచనదుల ప్రాంతం" (Land of Five Rivers) అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రం గుండా ఐదు నదులు ప్రవహిస్తాయి: జీలం, చీనాబ్, రావి, బియాస్, మరియు సట్లెజ్. అందుకే ఈ ప్రాంతానికి "పంజాబ్" అని పేరు వచ్చింది. ఇక్కడ "పంజ్" అంటే ఐదు మరియు "ఆబ్" అంటే నీరు అని అర్థం.
భారత జాతీయ జలచరం ఏది?
సముద్ర తాబేలు.
గంగా నది డాల్ఫిన్.
తిమింగలం.
మొసలి.
భారత జాతీయ జలచర జంతువుగా గంగా నది డాల్ఫిన్ (Platanista gangetica) ను 2009లో ప్రకటించారు. ఇది భారతదేశంలోని గంగా, బ్రహ్మపుత్ర, మేఘన వంటి నదులలో నివసించే ఒక అంతరించి పోతున్న జాతి. ఇది దేశంలో నదీ పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను మరియు దాని పరిరక్షణ అవసరాన్ని సూచిస్తుంది.
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
హిమాచల్ ప్రదేశ్.
కాశ్మీర్.
సిక్కిం.
ఉత్తరాఖండ్.
“వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్” ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గార్వాల్ హిమాలయాల్లో ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. వేసవి కాలంలో అనేక రకాల వన్య పూలతో ఈ లోయ అందంగా విరబూసి పూల సముద్రంలా మారుతుంది.
లాండ్ అఫ్ టెంపుల్స్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
తమిళనాడు.
ఒడిశా.
కర్ణాటక.
ఆంధ్రప్రదేశ్.
భారతదేశంలో, తమిళనాడు రాష్ట్రాన్ని "లాండ్ ఆఫ్ టెంపుల్స్" అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సుమారు 33,000కి పైగా ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, రామేశ్వరం ఆలయం వంటి వేలాది ప్రాచీన చారిత్రక దేవాలయాలు ఉన్నాయి.
సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
అమృతసర్.
అలప్పుజ.
కాంచీపురం.
వారణాసి.
పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్ నగరాన్ని “సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్” అని పిలుస్తారు. ఇక్కడ సిక్కుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) ఉంది. ఇది బంగారు పూతతో నిర్మించబడినందున దీనికి "గోల్డెన్ టెంపుల్" అనే పేరు వచ్చింది.
భారత జాతీయ గేయం (National Song) ఏది?
జనగణమన.
సారే జహాసే అచ్చా.
వందేమాతరం.
మా తుఝే సలాం.
భారత జాతీయ గేయం "వందేమాతరం". దీనిని బంకిమ్ చంద్ర చటర్జీ రచించారు. ఇది ఆయన రచించిన ఆనందమఠ్ నవల నుండి తీసుకోబడింది. దీనిని జాతీయ గేయంగా 24 జనవరి, 1950న ఆమోదించారు.
వెనిస్ ఆఫ్ ది ఈస్ట్ అని దేనిని అంటారు?
ఉదయపూర్.
కోచి.
అలప్పుజ.
శ్రీనగర్.
కేరళలోని అలప్పుజ (అలెప్పీ) పట్టణాన్ని "వెనిస్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలుస్తారు. లార్డ్ కర్జన్ ఈ పట్టణాన్ని "వెనిస్ ఆఫ్ ది ఈస్ట్" అని పిలిచారు, ఎందుకంటే ఇక్కడి కాలువలు, బ్యాక్ వాటర్స్ మరియు బోట్ ప్రయాణాలు ఇటలీలోని వెనిస్ నగరాన్ని పోలి ఉంటాయి. ఇది కేరళలోని ప్రసిద్ధమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి.
భారతదేశంలో అతిపెద్ద ఎడారి ఏది?
కచ్ ఎడారి.
ట్రాన్స్-హిమాలయన్ ఎడారి.
లడఖ్ ఎడారి.
థార్ ఎడారి.
భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి. ఇది ఉప ఉష్ణమండల ఎడారి. ఇది సుమారు 2,00,000 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది, ప్రధానంగా రాజస్థాన్‌లో విస్తరించి ఉంది. దీనిని "గ్రేట్ ఇండియన్ డెజర్ట్" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో 85% విస్తరించి ఉంది, మిగిలిన 15% పాకిస్తాన్ లో ఉంది.
భారతదేశంలో అతి పెద్ద అడవి ఏది?
గిర్ అడవి.
సుందర్బన్స్ అడవి.
పెరియార్ అడవి.
కాజిరంగా అడవి.
సుందర్‌బన్స్ అడవి భారతదేశంలో అతి పెద్ద అడవి మరియు ప్రపంచంలో అతి పెద్ద మడ అడవి. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గంగా నదీ డెల్టాలో సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది రాయల్ బెంగాల్ టైగర్లకు నివాసంగా ప్రసిద్ధి చెందింది.
మాంచెస్టర్ అఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు?
ముంబై.
సూరత్.
లక్నో.
అహ్మదాబాద్.
మాంచెస్టర్ అఫ్ ఇండియా అని అహ్మదాబాద్ నగరాన్ని పిలుస్తారు. దీనికి కారణం అహ్మదాబాద్ లో విస్తారంగా అభివృద్ధి చెందిన వస్త్ర పరిశ్రమ. ఇది ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లోని వస్త్ర పరిశ్రమతో సమానంగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది.
భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట (Rose Garden) ఎక్కడ ఉంది?
ఉధగమండలం (ఊటీ).
చండీగఢ్.
బెంగళూరు.
జైపూర్.
భారతదేశంలో అతిపెద్ద గులాబీ తోట జాకీర్ హుస్సేన్ రోజ్ గార్డెన్, ఇది చండీగఢ్‌లో ఉంది. ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో 50,000 కంటే ఎక్కువ గులాబీ పొదలను కలిగి ఉంది, ఇందులో 1600 వివిధ రకాల గులాబీ జాతులు ఉన్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద గులాబీ తోటగా గుర్తించబడింది.
అరేబియా సముద్రపు రాణి అని దేనిని అంటారు?
ముంబై.
గోవా.
కోచి (కొచ్చిన్).
గుజరాత్.
“అరేబియా సముద్రపు రాణి” (Queen of the Arabian Sea) అని కేరళలోని కోచి నగరాన్ని పిలుస్తారు. ఇది భారతదేశానికి పశ్చిమంగా అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రాత్మక ఓడరేవు మరియు సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రంగా ఉండటం వల్ల అంతర్జాతీయ గుర్తింపు పొందింది.
స్వతంత్ర భారత తొలి ఓటర్ ఎవరు?
సుకుమార్ సేన్.
శ్యామ్ శరణ్ నేగి.
పి.వి.కే. అయ్యర్.
బి.ఆర్. అంబేద్కర్.
స్వతంత్ర భారతదేశపు తొలి ఓటర్ హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యామ్ శరణ్ నేగి. అతడు 1951-52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలలో హిమాచల్ ప్రదేశ్‌లోని కల్పా గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు, అప్పటి నుండి "దేశపు మొదటి ఓటరు"గా ప్రసిద్ధి చెందాడు. అతడు తన 106 సంవత్సరాల వయసులో 2022 నవంబరు 5న మరణించారు.
భారతదేశ జాతీయ పక్షి ఏది?
పావురం.
పాలపిట్ట.
నెమలి.
పెంగ్విన్.
భారతదేశ జాతీయ పక్షి నెమలి. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటస్ (లిన్నేయస్). 1963లో భారత ప్రభుత్వం దీనిని జాతీయ పక్షిగా ప్రకటించింది.
భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్ ఏది?
భాక్రానంగల్ డ్యామ్.
తెహ్రీ డ్యామ్.
హిరాకుడ్ డ్యామ్.
సర్దార్ సరోవర్ డ్యామ్.
భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్ ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ డ్యామ్. దీని ఎత్తు సుమారు 260.5 మీటర్లు, ఇది ఆసియాలోనే అత్యంత ఎత్తైన రాక్ అండ్ ఎర్త్ ఫిల్ డ్యామ్‌గా ప్రసిద్ధి చెందింది. గంగానదీ ఉపనది అయిన భగీరథీ నది పై ఈ డ్యామ్ నిర్మించబడింది. ఇది బహుళ ప్రయోజన డ్యామ్.
భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది?
గోవా.
సిక్కిం.
త్రిపుర.
మణిపూర్.
భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రం గోవా. దీని మొత్తం విస్తీర్ణం 3,702 చ.కి.మీ. మాత్రమే. ఇది దేశం మొత్తం భూభాగంలో కేవలం 0.11% మాత్రమే ఆక్రమించింది. గోవా రాష్ట్రం 1987లో ఏర్పడింది. గోవా రాజధాని పనాజీ.
సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
ముంబై.
విశాఖపట్నం.
చెన్నై.
కోల్‌కతా.
ముంబై నగరాన్ని “సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్” (ఏడు ద్వీపాల నగరం) అని పిలుస్తారు. ఎందుకంటే ఇది మొదట ఏడు ద్వీపాల సముదాయం. అవి: 1) బాంబే ద్వీపం, 2) మజగావ్, 3) పరేల్, 4) వర్లి, 5) మాహిమ్, 6) లిటిల్ కొలాబా, 7) కొలాబా. అయితే కాలక్రమేణా ఈ 7 ద్వీపాలను కలిపి ఒకే భూభాగంగా అభివృద్ధి చేశారు.
భారతదేశపు చిలుక (Parrot of India) అని ఎవరిని పిలుస్తారు?
రవీంద్రనాథ్ ఠాగూర్.
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం.
అమీర్ ఖుస్రో.
ఎ.ఆర్. రెహమాన్.
అమీర్ ఖుస్రోని "టుటీ-ఎ-హింద్" అని పిలుస్తారు. దీనికి "భారతదేశపు చిలుక" (Parrot of India) అని అర్థం. అమీర్ ఖుస్రో ఒక ప్రసిద్ధ సూఫీ కవి, సంగీతకారుడు మరియు పండితుడు. అతడిని "భారతదేశపు చిలుక" అని పిలవడానికి గల కారణం, అతని కవితలు, పాటలు మరియు సంగీతం భారతీయ సంస్కృతి మరియు భాషల యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి.
భారతదేశంలో సూర్యుడు ముందుగా ఉదయించే రాష్ట్రం ఏది?
నాగాలాండ్.
అరుణాచల్ ప్రదేశ్.
మణిపూర్.
అస్సాం.
భారతదేశంలో సూర్యుడు ముందుగా ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. దీనిని ఉదయించే సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది దేశంలోనే తూర్పున ఉన్న రాష్ట్రం మరియు సూర్యుడు ముందుగా ఇక్కడే ఉదయిస్తాడు. ముఖ్యంగా డోంగ్ లోయ దేశంలో తొలి సూర్యోదయాన్ని చూస్తుంది.
భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది?
నందా దేవి.
కాంచన్‌జంగ.
మౌంట్ ఎవరెస్ట్.
అనైముడి.
భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం కాంచన్‌జంగ. ఇది సిక్కిం రాష్ట్రంలో భారత్-నేపాల్ సరిహద్దులో ఉంది. దీని ఎత్తు 8,586 మీటర్లు (28,169 అడుగులు). ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన శిఖరం కూడా.
భారతదేశంలో అతి చిన్న నది ఏది?
అర్వారీ నది.
సబర్మతి నది.
శరావతి నది.
కావేరి నది.
భారతదేశంలోని అతి చిన్న నది అర్వారీ నది. ఇది రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ప్రవహించే చిన్న నది. దీని పొడవు సుమారు 45 కిమీ మాత్రమే. ఈ నది 60 సంవత్సరాల పాటు ఎండిపోయిన తర్వాత, గ్రామస్థుల సహకారంతో పునరుజ్జీవనం పొందింది.
భారత జాతీయ వారసత్వ జంతువు ఏది?
ఆఫ్రికన్ ఏనుగు.
భారతీయ ఖడ్గమృగం.
భారతీయ ఏనుగు.
రాయల్ బెంగాల్ టైగర్.
భారత జాతీయ వారసత్వ జంతువు భారతీయ ఏనుగు (Indian Elephant). దీని శాస్త్రీయనామం Elephas maximus indicus. దీనిని అక్టోబరు 22, 2010న జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించారు.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


India GK Bits – Part 1

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top