📢 ముఖ్యమైన సూచనలు:
🕒 25 MCQs | 35 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
జోగ్ జలపాతం.
నోహ్‌కలికై జలపాతం.
కుంచికల్ జలపాతం.
దూద్‌సాగర్ జలపాతం.
భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంచికల్ జలపాతం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉంది. దీని ఎత్తు సుమారు 455 మీటర్లు (1,493 అడుగులు). ఇది వారాహి నది ద్వారా ఏర్పడింది. ఇది బహుళ-స్థాయి క్యాస్కేడ్, ఇది రాతి భూభాగంపై విస్తరించి ఉంది.
రూర్ ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని పిలుస్తారు?
మాల్వా పీఠభూమి.
చోటా నాగ్‌పూర్ పీఠభూమి.
దక్కన్ పీఠభూమి.
మేఘాలయ పీఠభూమి.
"రూర్ ఆఫ్ ఇండియా" అని చోటా నాగ్‌పూర్ పీఠభూమిని పిలుస్తారు. ఇది భారతదేశంలోని తూర్పు భాగంలో ఉంది. ఇది భారతదేశంలో అత్యధిక ఖనిజ వనరులు, బొగ్గు గనులు, ఉక్కు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందింది. ఇది దేశంలో ఒక ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా నిలిచి, జర్మనీలోని రూర్ ప్రాంతానికి సమానంగా భావించబడుతుంది. అందుకే దీనిని "రూర్ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు.
భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
NH 27.
NH 48.
NH 16.
NH 44.
భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి NH-44. ఇది పాత NH 7 మరియు ఇతర రహదారులను కలిపి NH 44గా పునర్నిర్మాణం చేయబడింది. ఇది జమ్మూ & కశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు సుమారు 3,745 కిలోమీటర్ల పొడవుతో విస్తరించి ఉంది.
భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?
వూలార్ సరస్సు.
లోక్‌టక్ సరస్సు.
దాల్ సరస్సు.
చిలికా సరస్సు.
భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు వూలార్ సరస్సు. ఇది జమ్మూ కాశ్మీర్ లోని బందిపోరా జిల్లాలో ఉంది. ఇది ఆసియాలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి.
మాంచెస్టర్ అఫ్ సౌత్ ఇండియా అని దేనికి పేరు?
చెన్నై.
గుజరాత్.
విశాఖపట్నం.
కోయంబత్తూరు.
కోయంబత్తూరును “మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన వస్త్ర పరిశ్రమ కేంద్రం (టెక్స్ టైల్ హబ్). ఈ నగరంలో అధిక సంఖ్యలో వస్త్ర పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు మరియు కాటన్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండటం వలన దీనికి ఈ పేరు వచ్చింది. ఇది వస్త్ర పరిశ్రమలో బ్రిటన్‌లోని మాంచెస్టర్ నగరంతో పోల్చబడింది.
భారతదేశంలో అత్యంత పొడవైన ఆనకట్ట ఏది?
భాక్రా నంగల్ ఆనకట్ట.
నాగార్జునసాగర్ ఆనకట్ట.
హిరాకుడ్ ఆనకట్ట.
సర్దార్ సరోవర్ ఆనకట్ట.
ఒడిశా రాష్ట్రంలోని మాహానదిపై నిర్మించబడిన హిరాకుడ్ ఆనకట్ట భారతదేశంలోనే కాక ప్రపంచంలోనూ అతి పొడవైన మల్టీపర్పస్ డ్యామ్. దీని మొత్తం పొడవు 25.79 కి.మీ. కాగా ప్రధాన ఆనకట్ట పొడవు 4.8 కి.మీ.
భారతదేశంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం (విద్యార్థుల సంఖ్య వారీగా) ఏది?
బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU).
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU).
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU).
ఉస్మానియా యూనివర్సిటీ (OU).
IGNOU భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది. ఇది 1985లో స్థాపించబడింది. ఇది దూర విద్యా (Distance Education) విధానాన్ని అందిస్తూ దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో విద్యను అందిస్తోంది.
భారతదేశంలో అత్యంత పెద్ద జైలు ఏది?
యెరవాడ జైలు.
పూసల్కర్ జైలు.
పారప్పన అగ్రహార జైలు.
తిహార్ జైలు.
భారతదేశంలో అతి పెద్ద జైలు తీహార్ జైలు. ఇది ఢిల్లీలో ఉంది మరియు ఇది తొమ్మిది సెంట్రల్ జైళ్లను కలిగి ఉంది. ఇది భారతదేశంలోనే కాక ఆసియాలోనే అతిపెద్ద జైలు. ఇది 400 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
భూలోక స్వర్గం అని భారతదేశంలో ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
కాశ్మీర్.
కేరళ.
హిమాచల్ ప్రదేశ్.
మేఘాలయ.
అపూర్వమైన ప్రకృతి సౌందర్యం, మంచుతో కప్పబడిన కొండలు, లోయలు, సరస్సులు, పూల తోటలు మరియు ప్రశాంతమైన వాతావరణం వలన కాశ్మీర్‌ను “భూలోక స్వర్గం” (Heaven on Earth) అని పిలుస్తారు.
స్కాట్లాండ్ అఫ్ ది ఈస్ట్ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
గ్యాంగ్‌టక్.
షిల్లాంగ్.
ఐజ్వాల్.
ఇంఫాల్.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌ను "స్కాట్లాండ్ అఫ్ ది ఈస్ట్" అని పిలుస్తారు. ఇక్కడి పచ్చని కొండలు, చల్లని వాతావరణం, అందమైన జలపాతాలు, గడ్డి మైదానాలు స్కాట్లాండ్ దృశ్యాలకు పోలికగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఇది ఈశాన్య భారతదేశంలో ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.
అతిపిన్న వయసులో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన మహిళ ఎవరు?
బచేంద్రీ పాల్.
సంతోష్ యాదవ్.
మాలావత్ పూర్ణ.
అరుణిమ సిన్హా.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాలావత్ పూర్ణ 2014 మే 25న కేవలం 13 సంవత్సరాల 11 నెలల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, భారత జాతీయ జెండాను ఎగురవేసింది. దీంతో ఆమె ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ఎవరెస్టును అధిరోహించిన మహిళగా రికార్డు సృష్టించింది.
భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?
రాజస్థాన్.
మహారాష్ట్ర.
మధ్యప్రదేశ్.
ఉత్తరప్రదేశ్.
భారతదేశంలో విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. దీని వైశాల్యం సుమారు 3,42,239 చ.కి.మీ. భారతదేశం మొత్తం భూభాగంలో రాజస్థాన్ 10.41% విస్తీర్ణాన్ని కలిగి ఉంది.
భారతదేశంలో అతి పెద్ద ప్లానెటేరియం ఏది?
బిర్లా ప్లానెటేరియం, హైదరాబాద్.
నెహ్రూ ప్లానెటేరియం, ముంబయి.
ఎం.పి. బిర్లా ప్లానెటేరియం, కోల్‌కతా.
నెహ్రూ ప్లానెటేరియం, న్యూ ఢిల్లీ.
భారతదేశంలో అతి పెద్ద ప్లానెటేరియం కోల్‌కతా లోని ఎం.పి. బిర్లా ప్లానెటోరియం. ఇది 1963లో ప్రారంభించబడింది మరియు ఇది భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద ప్లానెటోరియంలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఏది?
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్‌కతా.
కానెమారా పబ్లిక్ లైబ్రరీ, చెన్నై.
ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ, న్యూఢిల్లీ.
సరోజిని నాయుడు లైబ్రరీ, హైదరాబాద్.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా కోల్‌కతాలో ఉంది. ఇది భారతదేశంలో అత్యంత పెద్ద గ్రంథాలయం. ఇది 2.2 మిలియన్ల పుస్తకాల కంటే ఎక్కువ సేకరణతో భారతదేశంలో అతి పెద్దదిగా ఉంది. స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది బెంగాల్ లెఫ్టినెంట్ గవర్నర్ అధికార నివాసంగా ఉండేది.
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు?
చెన్నై.
బెంగళూరు.
హైదరాబాద్.
పూణె.
బెంగళూరు నగరాన్ని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అని అంటారు, ఎందుకంటే ఇది భారతదేశంలోని అతిపెద్ద సమాచార సాంకేతిక (ఐటీ) ఎగుమతిదారు మరియు దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ప్రధానంగా ఐటి పరిశ్రమ, సాఫ్ట్వేర్ కంపెనీలు, స్టార్టప్‌ల కేంద్రంగా అభివృద్ధి చెందింది.
భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ ఏది?
జూహూ బీచ్.
గిర్సోమ్ బీచ్.
పలోలెం బీచ్.
మెరీనా బీచ్.
భారతదేశంలో అత్యంత పొడవైన బీచ్ మెరీనా బీచ్, ఇది చెన్నైలో ఉంది. దీని పొడవు బంగాళాఖాతం వెంబడి 13 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనూ రెండవ పొడవైన నగర బీచ్‌గా ప్రసిద్ధి చెందింది.
భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
ఇందిరా గాంధీ కాలువ.
సట్లెజ్ కాలువ.
శ్రీరామసాగర్ కాలువ.
నర్మదా కాలువ.
భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఇందిరా గాంధీ కాలువ. ఇది సుమారు 650 కి.మీ పొడవుగా రాజస్థాన్‌లో ఉంది. దీనినే రాజస్థాన్ కాలువ అని కూడా పిలుస్తారు. ఇది ఎడారి ప్రాంతాలకు నీటిని అందించి వ్యవసాయం మరియు తాగునీటి అవసరాలకు ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది.
భారతదేశంలో అతి పెద్ద జిల్లా ఏది?
జైసల్మేర్ జిల్లా.
లేహ్ జిల్లా.
బస్తర్ జిల్లా.
కచ్ జిల్లా.
భారతదేశంలోని అతి పెద్ద జిల్లా కచ్ (Kutch). ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. దీని విస్తీర్ణం 45,674 చదరపు కిలోమీటర్లు.
భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది?
పులికాట్ సరస్సు.
కొల్లేరు సరస్సు.
వూలార్ సరస్సు.
చిలికా సరస్సు.
ఒడిశా రాష్ట్రంలోని చిలికా సరస్సు భారతదేశంలోనే కాదు, ఆసియాలో కూడా అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది 1,100 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంది. ఇది తీరప్రాంతంలో లగూన్ రూపంలో ఉంటుంది. పక్షుల వలస ప్రదేశంగా కూడా ప్రపంచప్రసిద్ధి గాంచింది. దీనిని Ramsar Site (1981)గా గుర్తించారు.
సిటీ అఫ్ ఫెస్టివల్స్ అని ఏ భారతీయ నగరాన్ని పిలుస్తారు?
వారణాసి.
మధురై.
జైపూర్.
మైసూర్.
తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరాన్ని "సిటీ ఆఫ్ ఫెస్టివల్స్" అని పిలుస్తారు. మధురైలో సంవత్సరం పొడవునా అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, మతపరమైన పండుగలు మరియు జాతరలు జరుపుతారు. అందుకే మధురై ఈ పేరుతో గుర్తింపు పొందింది.
భారతదేశంలో రెండవ పొడవైన నది ఏది?
గంగా నది.
బ్రహ్మపుత్ర నది.
గోదావరి నది.
నర్మదా నది.
భారతదేశంలో గంగానది తర్వాత రెండవ పొడవైన నది గోదావరి. దీనిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరియు ఒడిశా రాష్ట్రాల గుండా దాదాపు 1,465 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది.
జల్లికట్టు క్రీడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
తమిళనాడు.
కర్ణాటక.
పశ్చిమ బెంగాల్.
కేరళ.
జల్లికట్టు క్రీడ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇది పొంగల్ వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం జనవరిలో జరిగే మట్టు పొంగల్ రోజున నిర్వహించే ఒక సాంప్రదాయ ఎద్దుల పందెం క్రీడ. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని మధురై, తిరుచిరాపల్లి, తేని, పుదుక్కోట్టై, దిండిగల్ వంటి జిల్లాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది.
బీహార్ దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
గంగా నది.
కోసి నది.
దామోదర్ నది.
బ్రహ్మపుత్ర నది.
కోసి నదిని బీహార్ దుఃఖదాయని (Sorrow of Bihar) అని పిలవడానికి ప్రధాన కారణం, అది తరచుగా సంభవించే వరదల కారణంగా బీహార్ రాష్ట్రానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఈ నది తన మార్గాన్ని తరచుగా మార్చుకుంటూ ఉండటం వలన, వరదలు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురై, పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరుగుతాయి.
వైట్ సిటీ (తెల్ల నగరం) అని రాజస్థాన్‌లోని ఏ నగరాన్ని పిలుస్తారు?
జైపూర్.
జోధ్‌పూర్.
ఉదయ్‌పూర్.
అజ్మీర్.
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ నగరాన్ని వైట్ సిటీ అని పిలుస్తారు. దీనికి కారణం నగరంలోని రాజభవనాలు, సరస్సులు, భవనాలు తెల్లటి పాలరాతితో నిర్మించబడి ఉండటం. ఉదయ్‌పూర్‌లో తెల్లని పాలరాయి స్లరీ పార్క్ కూడా ఉంది, దీనిని స్థానికులు "ఉదయ్‌పూర్ వైట్ ఎడారి" అని కూడా పిలుస్తారు, ఇది కూడా నగరానికి ఈ పేరు రావడానికి ఒక కారణం.
సిటీ ఆఫ్ ప్యాలెసెస్ (ప్యాలెస్‌ల నగరం) అని ఏ నగరాన్ని పిలుస్తారు?
కోల్‌కతా.
జైపూర్.
హైదరాబాద్.
మైసూరు.
పశ్చిమ బెంగాల్ రాజధాని అయిన కోల్‌కతా నగరాన్ని సిటీ ఆఫ్ ప్యాలెసెస్ (రాజభవనాల నగరం) అని పిలుస్తారు. కోల్‌కతా నగరంలో అనేక చారిత్రక భవనాలు, రాజభవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని బ్రిటీష్ వలస పాలన కాలంలో నిర్మించబడ్డాయి. అందుకే దీనిని సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని పిలుస్తారు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

