📢 ముఖ్యమైన సూచనలు:
🕒 20 MCQs | 30 నిమిషాలు.
🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).
❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).
✏️ Answer Editing కి అవకాశం లేదు.
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
బెంగాల్ విభజనను ఏ సంవత్సరంలో రద్దు చేశారు?
1909.
1913.
1916.
1911.
1905లో లార్డ్ కర్జన్ ప్రతిపాదనపై అమలైన బెంగాల్ విభజనకు భారతీయుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం బలంగా సాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని లార్డ్ హార్డింజ్ II, 1911 డిసెంబర్ 12న Delhi Durbar సందర్భంగా బెంగాల్ విభజనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
“అమర్ సోనార్ బంగ్లా” అనే గీతాన్ని రచించిన వారు ఎవరు?
కాజీ నజ్రుల్ ఇస్లాం.
ముహమ్మద్ ఇక్బాల్.
రవీంద్రనాథ్ ఠాగూర్.
బంకించంద్ర ఛటర్జీ.
అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ రచించారు. ఇది బెంగాళీ ప్రజల మాతృభూమి పట్ల ప్రేమను, ఐక్యతను ప్రతిబింబిస్తుంది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమర సమయంలో ఈ గీతాన్ని అక్కడి ప్రొవిజనల్ గవర్నమెంట్ జాతీయ గీతంగా స్వీకరించింది. ఠాగూర్ రెండు దేశాల జాతీయ గీతాల రచయితగా గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తి
1909 భారతీయ కౌన్సిల్ చట్టం అమలులోకి వచ్చిన సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు?
లార్డ్ హార్డింజ్.
లార్డ్ మార్లే.
లార్డ్ మింటో.
లార్డ్ డల్హౌసీ.
1909 భారతీయ కౌన్సిల్ చట్టం ప్రవేశపెట్టిన సమయంలో లార్డ్ మింటో భారతదేశ వైస్రాయ్‌గా, లార్డ్ జాన్ మార్లే బ్రిటిష్ ప్రభుత్వం లో భారత వ్యవహారాల కార్యదర్శి (Secretary of State for India) గా ఉన్నారు.
క్రిందివారిలో India Wins Freedom అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
రాజేంద్రప్రసాద్.
మౌలానా అబుల్ కలాం ఆజాద్.
సుభాష్ చంద్రబోస్.
India Wins Freedom గ్రంథాన్ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించారు. ఇది భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రపై ఆయన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రచించిన ఆత్మకథాత్మక గ్రంథం. ఇందులో ఆయన బ్రిటిష్ పాలన, కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంఘటనలు, నేతల మధ్య విభేదాలు, మరియు పాకిస్థాన్ విభజన వంటి విషయాలను వివరంగా పేర్కొన్నారు.
జాతీయోద్యమ కాలంలో గణేశ్ ఉత్సవాలు మరియు శివాజీ ఉత్సవాలు నిర్వహించిన నాయకుడు ఎవరు?
గోపాలకృష్ణ గోఖలే.
బాల గంగాధర్ తిలక్.
బిపిన్ చంద్ర పాల్.
లాలా లజపతిరాయ్.
బాల గంగాధర్ తిలక్ ప్రజల్లో జాతీయతా చైతన్యాన్ని పెంపొందించేందుకు గణేశ్ ఉత్సవాలు (1893) మరియు శివాజీ ఉత్సవాలను (1895) ప్రారంభించారు. ఇవి ప్రజలలో ఐక్యత కలిగించే సాధనాలుగా మారాయి. ఈ ఉత్సవాలు సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కలగలిపిన జాతీయ ఉద్యమ పద్ధతులుగా మారాయి
బెంగాల్ కెమికల్ వర్క్స్‌ను ప్రారంభించిన వ్యక్తి ఎవరు?
బిపిన్ చంద్ర పాల్.
ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే.
సురేంద్రనాథ్ బెనర్జీ.
రవీంద్రనాథ్ ఠాగూర్.
బెంగాల్ కెమికల్ వర్క్స్ ను భారతదేశపు ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మరియు పారిశ్రామికవేత్త అయిన ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే 1901లో ప్రారంభించారు. ఇది తరువాత బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ గా అభివృద్ధి చెందింది. ఇది భారతదేశపు తొలి స్వదేశీ ఔషధ పరిశ్రమగా గుర్తింపు పొందింది. ఆయన స్వదేశీ ఉద్యమానికి ఆర్థిక స్వావలంబన ద్వారా మద్దతు ఇచ్చారు. “Father of Indian Chemistry” అనే బిరుదుతో గుర్తింపు పొందారు.
క్రిందివారిలో "Unhappy India" అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు?
లాలా లజపతిరాయ్.
జవహర్‌లాల్ నెహ్రూ.
రాజేంద్రప్రసాద్.
సుభాష్ చంద్రబోస్.
“Unhappy India” అనే గ్రంథాన్ని లాలా లజపతిరాయ్ 1928లో రచించారు. ఇది సైమన్ కమిషన్ భారత్ రావడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ రాసిన ప్రఖ్యాత రచన. ఈ గ్రంథంలో బ్రిటిష్ పాలన దుర్మార్గాలను విమర్శిస్తూ, భారత స్వాతంత్ర్యం అవసరాన్ని బలంగా వ్యక్తపరిచారు. ఇది భారత జాతీయోద్యమంలో ఒక కీలకమైన సాహిత్యంగా నిలిచింది మరియు భారతీయుల ఆత్మగౌరవాన్ని, రాజకీయ చైతన్యాన్ని పెంచేలా ప్రభావం చూపింది.
జంషెడ్‌జీ టాటా స్వదేశీ ఉద్యమ స్పూర్తితో ఇనుము–ఉక్కు కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు?
భిలాయ్ – ఛత్తీస్‌గఢ్.
రూర్కెలా – ఒడిషా.
జంషెడ్‌పూర్ – జార్ఖండ్.
దుర్గాపూర్ – పశ్చిమ బెంగాల్.
జంషెడ్‌జీ టాటా ఆధ్వర్యంలో 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO) జంషెడ్‌పూర్‌లోని వేస్తవ శాక్రీ గ్రామంలో స్థాపించబడింది. ఇది ఆసియాలోనే తొలి ఉక్కు కర్మాగారంగా మరియు భారతదేశంలో మొదటి పెద్ద ఉక్కు పరిశ్రమగా పేరు పొందింది.
Young Men’s Indian Association (YMIA) ను స్థాపించిన వారు ఎవరు?
ఆనీబిసెంట్.
లాలా లజపతిరాయ్.
సుబ్రమణ్య అయ్యర్.
బాల గంగాధర్ తిలక్.
Dr. ఆనీ బిసెంట్ 1914లో చెన్నైలో Young Men’s Indian Association (YMIA) ని స్థాపించారు. ఈ సంఘం యువతలో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసేందుకు ఏర్పాటు చేయబడింది. ఇది Theosophical Society ప్రభావంతో ఏర్పడిన సంస్థలలో ఒకటి. ఇది తరువాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వంటి ఉద్యమాలలో యువత భాగస్వామ్యం పెరగడానికి దోహదపడింది.
బ్రిటిష్ వారు రాజద్రోహం నేరం మోపి బాల గంగాధర్ తిలక్‌ను నిర్బంధించిన జైలు ఏది?
మాండలే జైలు – బర్మా.
యర్వడా జైలు – పూణె.
అలీపూర్ జైలు – కోల్‌కతా.
తిహార్ జైలు – ఢిల్లీ.
బాల గంగాధర్ తిలక్ 1908లో కేసరి పత్రికలో వ్యాసాల ద్వారా బ్రిటిష్ పాలనపై విమర్శలు చేశారు. దీనితో ఆయనపై రాజద్రోహం ఆరోపణలు మోపి మాండలే జైలు (బర్మాలో)కి పంపించారు. అక్కడే తిలక్ “గీతారహస్యము” అనే గ్రంధాన్ని రచించాడు. ఆయన నిర్బంధం స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసింది.
ఆల్ ఇండియా ముస్లీం లీగ్ కు మొదటి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు?
ముహమ్మద్ అలీ జిన్నా.
నవాబ్ ఖ్వాజా సలీంఉల్లా.
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.
అగా ఖాన్.
తొలితరం నాయకులలో ప్రముఖులైన అగా ఖాన్ (Aga Khan) ఆల్ ఇండియా ముస్లీం లీగ్ కు మొదటి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆయన ఆ పదవిలో 1913 వరకు కొనసాగారు. ఆయన నాయకత్వం ముస్లీం కమ్యూనిటీ రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
కృష్ణా పత్రిక – ముట్నూరి కృష్ణారావుకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
కృష్ణా పత్రిక వ్యవస్థాపకుల్లో ముట్నూరి కృష్ణారావు ఒకరు.
ఇతడు 1902లో ఈ పత్రికలో ఉప సంపాదకుడిగా చేరి, 1907లో దాని సంపాదకుడైనారు.
ఇతడు 1945లో మరణించేవరకు ఈ పత్రికకోసం పనిచేశారు.
పైవన్నీ సరైనవే.
ముట్నూరి కృష్ణారావు ఆంధ్రదేశంలో స్వాతంత్ర్యోద్యమానికి పదును పెట్టిన ప్రముఖ పత్రిక “కృష్ణా పత్రిక” తో సుదీర్ఘకాలం పాటు అనుబంధమై ఉన్నారు. 1902లో ఉప సంపాదకుడిగా చేరి, 1907లో సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1945లో తన మరణం వరకు ఈ పత్రికకు అంకితంగా పనిచేశారు. ఈ పత్రిక వందేమాతరం, హోంరూల్, సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలను ప్రోత్సహిస్తూ ప్రచారం చేసింది.
మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు?
1905
1910
1915
1920
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలోని తన పౌర హక్కుల పోరాటాన్ని ముగించుకొని 1915, జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజు “ప్రవాస భారతీయ దినోత్సవం”గా కూడా పాటించబడుతుంది. గాంధీ భారతదేశానికి వచ్చిన తరువాత కొంతకాలం గోపాల కృష్ణ గోఖలే సలహా మేరకు దేశ పరిస్థితులను గమనించారు.
భారత జాతీయ కాంగ్రెస్ (INC) కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు?
సరోజినీ నాయుడు.
అనీబిసెంట్.
విజయలక్ష్మీ పండిట్.
ఇందిరా గాంధీ.
అనీబిసెంట్ 1917లో మద్రాసులో జరిగిన INC సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించిన తొలి మహిళా నాయకురాలు. ఆమె బ్రిటిష్ మూలాలతో ఉన్నప్పటికీ, భారత స్వాతంత్ర్యోద్యమానికి బలమైన మద్దతు ఇచ్చారు. హోం రూల్ ఉద్యమంను ప్రారంభించి, భారతీయులలో రాజకీయ చైతన్యం పెంచారు.
ముస్లీం లీగ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1906, ఢాకా.
1905, కలకత్తా.
1909, న్యూ ఢిల్లీ.
1911, అలహాబాద్.
ముస్లీం లీగ్ 1906, డిసెంబరు 30న ఢాకాలో స్థాపించబడింది. దీని ఉద్దేశ్యం ముస్లింల రాజకీయ ప్రయోజనాలను కాపాడటం, బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండటం. ఇది తర్వాత కాలంలో భారత విభజనకు దారితీసే కీలక సంఘటనగా మారింది.
భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి ఏ సంవత్సరంలో మార్చారు?
1905
1911
1919
1920
1911 డిసెంబర్ 12న ఢిల్లీ దర్బార్ సందర్భంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం లార్డ్ హార్డింజ్ II వైశ్రాయ్‌గా ఉన్న సమయంలో తీసుకున్నారు. వారు ఢిల్లీని రాజధానిగా మార్చడం ద్వారా భౌగోళికంగా మధ్యభాగంలో పాలన సౌకర్యంగా ఉండే విధంగా చూసారు.
ముస్లింలకు ప్రత్యేక మత నియోజక వర్గాలను కల్పించిన చట్టం ఏది?
1892 భారతీయ కౌన్సిల్ చట్టం.
1909 భారతీయ కౌన్సిల్ చట్టం.
1919 భారత ప్రభుత్వ చట్టం.
1935 భారత ప్రభుత్వ చట్టం.
1909 భారతీయ కౌన్సిల్ చట్టం (మింటో–మార్లే సంస్కరణలు) ద్వారా ముస్లింలకు మొదటిసారి ప్రత్యేక మత నియోజక వర్గాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇది భారత రాజకీయ చరిత్రలో మత ప్రాతిపదికపై రాజకీయాల ప్రారంభాన్ని సూచించింది. ముస్లింలకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం వల్ల వర్గాల మధ్య విభజనను పెంచింది. లార్డ్ మింటో ఈ విధానానికి గాను “Father of Communal Electorate” అనే బిరుదు పొందారు.
బెంగాల్ నేషనల్ కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా ఎవరు పనిచేశారు?
సురేంద్రనాథ్ బెనర్జీ.
బిపిన్ చంద్ర పాల్.
సుభోద్ చంద్ర మల్లిక్.
అరోబిందో ఘోష్.
1906లో బెంగాల్ నేషనల్ కళాశాల స్థాపించబడింది. ఇది స్వదేశీ ఉద్యమం సమయంలో జాతీయ విద్యా ఉద్యమానికి మద్దతుగా ఏర్పడింది. దీనికి అరోబిందో ఘోష్ తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆయన విద్య ద్వారా జాతీయ చైతన్యాన్ని పెంచాలని సంకల్పించారు. ఇతను భారత జాతీయోద్యమంలో ముఖ్యమైన అతివాద నేతగా కూడా పేరుగాంచారు.
మితవాదులు మరియు అతివాదులు తిరిగి ఏ INC సమావేశంలో ఏకమయ్యారు?
1916 – లక్నో సమావేశం.
1917 – కలకత్తా సమావేశం.
1924 – బెల్గాం సమావేశం.
1929 – లాహోర్ సమావేశం.
1916లో జరిగిన లక్నో సమావేశంలో మితవాదులు మరియు అతివాదులు తిరిగి ఏకమయ్యారు. ఇది రెండు వర్గాల మధ్య విభేదాల అనంతరం ఐక్యతకు దారితీసింది. అదే సమావేశంలో కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య “లక్నో ఒప్పందం” కూడా జరిగింది, ఇది హిందూ–ముస్లిం ఐక్యతకు కీలకమైన ఘట్టంగా గుర్తించబడింది. ఈ సంఘటన భారత జాతీయోద్యమంలో ఐక్యతకు, వ్యూహాత్మక మార్పులకు దోహదపడింది.
మింటో–మార్లే సంస్కరణలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది?
కేంద్ర శాసనసభ సభ్యుల సంఖ్య 16 నుండి 60కి పెంచబడింది.
పెద్ద రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్యను 50కి పెంచారు.
చిన్న రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్యను 30కి పెంచారు.
పైవన్నీ సరైనవే.
1909 మింటో–మార్లే సంస్కరణలు భారతీయులకు శాసన మండలిలో మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు తీసుకువచ్చారు. కేంద్ర శాసనసభ లో సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. అలాగే, పెద్ద రాష్ట్రాల్లో శాసనసభ సభ్యులను 50కి, చిన్న రాష్ట్రాల్లో 30కి పెంచారు. ముస్లీంలకు ప్రత్యేక మత నియోజక వర్గాలు కల్పించబడ్డాయి. ఇవి భారత శాసన వ్యవస్థలో భారతీయుల ప్రాతినిధ్యం పెరగడానికి దోహదపడ్డాయి.
