Free Online Model Paper 12: Office Subordinate and Process Server | Telangana Court Jobs Exams 2026


తెలంగాణ High Court మరియు జిల్లా కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) మరియు ప్రాసెస్ సర్వర్ (Process Server) పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ Model Paper (Mock Test) 12 ని ప్రత్యేకంగా రూపొందించాము. 2026 Telangana High Court and District Court నోటిఫికేషన్ మరియు లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ఈ ప్రశ్నపత్రం ఉపొందించబడింది.

ఈ Model Paper 12 లో 45 GK (General Knowledge) questions తో పాటుగా వివరణాత్మకమయిన explanations ని కూడా ప్రతి ప్రశ్నకు ఇవ్వడం జరిగింది. Free గా Practice చేసుకోవచ్చును.

📝 మొత్తం ప్రశ్నలు: 45 (జనరల్ నాలెడ్జ్).

⏱️ సమయం: 60 నిమిషాలు.

🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.

🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 45
🟢 0 🔴 0
00:00
భారతదేశంలో సూర్యుడు చివరగా అస్తమించే రాష్ట్రం ఏది?
గుజరాత్.
రాజస్థాన్.
మహారాష్ట్ర.
గోవా.
గుజరాత్ లోని, కచ్ జిల్లాలో గుహార్ మోతీ అనే ప్రాంతం భారతదేశపు అత్యంత పశ్చిమ సరిహద్దు. అందువల్ల దేశంలోనే చివరి సూర్యాస్తమయం ఇక్కడే సంభవిస్తుంది. తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌తో పోలిస్తే, రేఖాంశాల వ్యత్యాసం కారణంగా గుజరాత్‌లో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలు సంభవిస్తాయి.
'ప్రజల మనిషి' నవలను రాసిన తెలంగాణ ప్రముఖ రచయిత ఎవరు?
దాశరథి రంగాచార్య.
సురవరం ప్రతాపరెడ్డి.
సి. నారాయణరెడ్డి.
వట్టికోట ఆళ్వారుస్వామి.
తెలంగాణ తొలి నవలగా గుర్తింపు పొందిన 'ప్రజల మనిషి' నవలను ప్రముఖ రచయిత, సామాజిక ఉద్యమకారుడు వట్టికోట ఆళ్వారుస్వామి రచించారు. నిజాం పాలన నాటి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, ప్రజల కష్టాలను మరియు దొరల అణచివేతను ఈ నవల కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
ఎగిరే ఉడుతలకు (Flying Squirrels) ప్రసిద్ధి చెందిన 'నామ్దఫా జాతీయ పార్క్' ఎక్కడ ఉంది?
అరుణాచల్ ప్రదేశ్.
మిజోరాం.
నాగాలాండ్.
మణిపూర్.
నామ్దఫా జాతీయ పార్క్ (Namdapha National Park) అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇది విస్తీర్ణం పరంగా భారతదేశంలో నాల్గవ అతిపెద్ద జాతీయ పార్క్ మరియు ఈశాన్య భారతదేశంలోనే అతిపెద్దది. తీవ్రంగా అంతరించిపోతున్న 'నామ్దఫా ఎగిరే ఉడుత'కు ఇది ప్రసిద్ధి చెందింది.
ప్రస్తుతం భారతదేశ రక్షణ మంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు?
అమిత్ షా.
ఎస్. జైశంకర్.
రాజ్‌నాథ్ సింగ్.
నితిన్ గడ్కరీ.
ప్రస్తుతం భారతదేశ కేంద్ర రక్షణ మంత్రిగా (Union Defense Minister) రాజ్‌నాథ్ సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన మే 2019 నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు.
'మొదటి పానిపట్టు యుద్ధం' ఏ సంవత్సరంలో జరిగింది?
1526.
1528.
1556.
1761.
మొదటి పానిపట్టు యుద్ధం 1526 ఏప్రిల్ 21న బాబర్ మరియు ఇబ్రహీం లోఢీ మధ్య జరిగింది. ఈ యుద్ధంలో బాబర్ విజయం సాధించి, భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశాడు. ఈ యుద్ధంలోనే బాబర్ మొదటిసారిగా ఫిరంగులు మరియు తుపాకులను (ఫైర్‌ఆర్మ్స్) పెద్ద ఎత్తున ఉపయోగించాడు.
ఐక్యరాజ్యసమితి యొక్క ఏ ప్రధాన అంగం ప్రస్తుతం తన విధులను తాత్కాలికంగా నిలిపివేసింది?
ఆర్థిక మరియు సామాజిక మండలి.
ధర్మకర్తృత్వ మండలి.
సచివాలయం.
అంతర్జాతీయ న్యాయస్థానం.
ఐక్యరాజ్యసమితి ఆధీనంలో ఉన్న చివరి ట్రస్ట్ భూభాగమైన 'పలావు' దేశానికి 1994లో స్వాతంత్ర్యం రావడంతో ధర్మకర్తృత్వ మండలి (Trusteeship Council) తన విధులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం ఇది పూర్తిగా రద్దు కాలేదు కానీ, అవసరమైనప్పుడు మాత్రమే సమావేశమయ్యేలా తన నిబంధనలను సవరించుకుంది.
తెలంగాణలోని ఏ కోటను 'ఏకశిలా నగరం' అని పిలుస్తారు?
గోల్కొండ కోట.
భువనగిరి కోట.
రామగిరి ఖిల్లా.
వరంగల్ కోట.
వరంగల్ కోట ఆవరణలో ఒకే ఒక భారీ రాతి గుట్ట ఉండటం వల్ల ఈ నగరానికి తెలుగులో 'ఓరుగల్లు' అని, సంస్కృతంలో 'ఏకశిలా నగరం' అని పేరు వచ్చింది. కాకతీయ సామ్రాజ్యానికి ప్రధాన రాజధానిగా విరాసిల్లిన ఈ మైదాన దుర్గాన్ని కాకతీయ పాలకులు అత్యంత వైభవంగా నిర్మించారు.
బతుకమ్మ పండుగ చివరిరోజు దేనితో ముగుస్తుంది?
అలిగిన బతుకమ్మ.
ముద్దపప్పు బతుకమ్మ.
సద్దుల బతుకమ్మ.
అట్ల బతుకమ్మ.
తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ పండుగ భాద్రపద అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ చివరి రోజున గౌరమ్మను నిమజ్జనం చేసి, మహిళలందరూ ఒకరికొకరు సద్దుల ప్రసాదాలను మార్చుకుంటారు.
పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎంటమాలజీ.
మైకాలజీ.
ఆర్నిథాలజీ.
పాలియంటాలజీ.
పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ (Ornithology) అని అంటారు. ఇది జంతుశాస్త్రంలో (Zoology) ఒక ముఖ్యమైన విభాగం. ఇందులో పక్షుల శరీర నిర్మాణం, జీవన విధానం, ప్రవర్తన, వలసలు మరియు వాటి పరిరక్షణ వంటి అంశాల గురించి సమగ్రంగా అధ్యయనం చేస్తారు.
'మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్' పుస్తక రచయిత ఎవరు?
మహాత్మా గాంధీ.
జవహర్‌లాల్ నెహ్రూ.
సుభాష్ చంద్రబోస్.
రవీంద్రనాథ్ ఠాగూర్.
మహాత్మా గాంధీ తన జీవిత విశేషాలు మరియు సత్యాన్వేషణను వివరిస్తూ ఈ ఆత్మకథను గుజరాతీ భాషలో రాశారు. ఆయన బాల్యం నుండి 1921 వరకు జరిగిన ముఖ్య సంఘటనలను పొందుపరిచిన ఈ గ్రంథాన్ని మహాదేవ్ దేశాయ్ ఆంగ్లంలోకి అనువదించారు.
మానవ శరీరంలో 'రక్త శుద్ధి' చేసే అవయవం ఏది?
మూత్రపిండాలు.
గుండె.
ఊపిరితిత్తులు.
కాలేయం.
మానవ శరీరంలో రక్తాన్ని వడపోసి, అందులోని వ్యర్థ పదార్థాలను, అదనపు నీటిని మూత్రం రూపంలో వేరు చేసి రక్తాన్ని శుద్ధి చేసే ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు (Kidneys). గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగపడితే, ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్‌ను అందిస్తాయి. కాలేయం శరీరంలో విషపదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది.
క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కోచ్‌లకు ఇచ్చే అవార్డు ఏది?
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు.
ద్రోణాచార్య అవార్డు.
అర్జున అవార్డు.
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్.
క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దిన క్రీడా శిక్షకులకు (Coaches) భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం 'ద్రోణాచార్య అవార్డు'. మహాభారతంలోని కౌరవ పాండవుల గురువైన ద్రోణాచార్యుడి పేరు మీదుగా 1985లో ఈ అవార్డును ప్రారంభించారు. ఇందులో భాగంగా గురు ద్రోణాచార్యుని కాంస్య విగ్రహం, ప్రశంసా పత్రం మరియు నగదు బహుమతిని అందజేస్తారు.
సూర్యరశ్మి ద్వారా మన శరీరానికి లభించే విటమిన్ ఏది?
విటమిన్ A.
విటమిన్ C.
విటమిన్ E.
విటమిన్ D.
మన చర్మంపై సూర్యరశ్మి పడినప్పుడు, చర్మం క్రింద ఉండే కొలెస్ట్రాల్ సాయంతో శరీరం సొంతంగా విటమిన్ Dని తయారుచేసుకుంటుంది. అందుకే దీనిని "సన్‌షైన్ విటమిన్" అంటారు. ఇది ఎముకలను బలంగా ఉంచడానికి మరియు శరీరానికి అవసరమైన కాల్షియంను గ్రహించడానికి ఎంతో సహాయపడుతుంది.
మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు?
శ్వాసక్రియ.
కిరణజన్య సంయోగ క్రియ.
బాష్పోత్సేక ప్రక్రియ.
అభిసరణ ప్రక్రియ.
మొక్కలు సూర్యరశ్మి, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్ మరియు నీటిని ఉపయోగించుకుని తమ ఆహారాన్ని (గ్లూకోజ్) తామే తయారుచేసుకునే విధానాన్ని కిరణజన్య సంయోగ క్రియ (Photosynthesis) అంటారు. ఈ ప్రక్రియలో మొక్కలు ఆహారంతో పాటు జీవకోటికి అవసరమైన ఆక్సిజన్‌ను కూడా వాతావరణంలోకి విడుదల చేస్తాయి.
'ప్రాథమిక హక్కులు' భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి?
4వ భాగం.
5వ భాగం.
2వ భాగం.
3వ భాగం.
భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో (Part III) ఆర్టికల్ 12 నుండి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి వివరించారు. ఈ హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు. ప్రజల హక్కులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే భాగం కాబట్టి, దీనిని "భారతదేశ మగ్నా కార్టా" అని పిలుస్తారు.
భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియను తెలిపే ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 352.
ఆర్టికల్ 360.
ఆర్టికల్ 368.
ఆర్టికల్ 370.
భారత రాజ్యాంగంలోని 20వ భాగంలో ఉన్న ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారాలను, మరియు అందుకు అనుసరించాల్సిన ప్రక్రియను తెలుపుతుంది. ఈ రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించాము.
'సతీసహగమన నిషేధ చట్టం' తేవడానికి కృషి చేసిన భారతీయ సంస్కర్త ఎవరు?
రాజా రామ్మోహన్ రాయ్.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
స్వామి దయానంద సరస్వతి.
జ్యోతిరావు పూలే.
'భారత పునరుజ్జీవన పితామహుడు' అయిన రాజా రామ్మోహన్ రాయ్ తీవ్ర కృషి వల్ల బ్రిటీష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ 1829 డిసెంబర్ 4న 'సతీసహగమన నిషేధ చట్టాన్ని' తీసుకువచ్చారు. ఈ చట్టం ద్వారా హిందూ సమాజంలో ఉన్న అమానుషమైన సతీ సాంప్రదాయాన్ని పూర్తిగా చట్టవిరుద్ధంగా మరియు శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు.
'శాంతినికేతన్' ను స్థాపించింది ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్.
బంకిమ్‌చంద్ర చటర్జీ.
ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
స్వామి వివేకానంద.
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రకృతి ఒడిలో విద్యను అందించే లక్ష్యంతో 'శాంతినికేతన్' ఆశ్రమాన్ని స్థాపించారు. ఇది కాలక్రమేణా విశ్వభారతి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది మరియు దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తించింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ప్రస్తుత చైర్మన్ ఎవరు?
బి. జనార్ధన్ రెడ్డి.
బుర్రా వెంకటేశం.
ఎం. మహేందర్ రెడ్డి.
ఘంటా చక్రపాణి.
సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం, IAS (VR) గారు డిసెంబర్ 5, 2024న TGPSC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఈ పదవిలో మాజీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి గారు కొనసాగారు.
తెలంగాణలో ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరేమిటి?
మహాలక్ష్మి పథకం.
గృహలక్ష్మి పథకం.
చేయూత పథకం.
స్త్రీ నిధి పథకం.
తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల హామీలలో భాగంగా మహిళలు, బాలికలు మరియు ట్రాన్స్‌జెండర్ల కోసం మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన వారు తెలంగాణ సరిహద్దుల లోపల పల్లె వెలుగు మరియు ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ ఎవరు?
అరవింద్ పనగరియా.
అశోక్ కుమార్ లాహిరి.
రాజీవ్ కుమార్.
సుమన్ బేరి.
ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి 2026 ఏప్రిల్‌లో నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమన్ బేరి స్థానంలో నియమితులైన ఆయన, గతంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా మరియు 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా కూడా విశేష సేవలందించారు.
గాంధీజీ దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి శాశ్వతంగా ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు?
1911.
1915.
1919.
1920.
మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణ ఆఫ్రికా నుండి భారతదేశానికి శాశ్వతంగా తిరిగి వచ్చారు. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చిన ఈ చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని, భారత ప్రభుత్వం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జనవరి 9వ తేదీని 'ప్రవాసి భారతీయ దివస్'గా అధికారికంగా నిర్వహిస్తోంది.
‘రెడ్ ప్లానెట్’ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
అంగారకుడు.
శుక్రుడు.
గురుడు.
శని.
అంగారక గ్రహం / కుజుడు (Mars) ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ (ఇనుప తుప్పు) విస్తారంగా ఉండటం వల్ల ఇది ఎరుపు రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని 'రెడ్ ప్లానెట్' (ఎరుపు గ్రహం) అని పిలుస్తారు. ఇది సౌర కుటుంబంలోనే రెండవ అత్యంత చిన్న గ్రహం మరియు సూర్యుని నుండి నాల్గవ గ్రహం.
రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ అవసరం?
విటమిన్ A.
విటమిన్ C.
విటమిన్ E.
విటమిన్ K.
గాయాలైనప్పుడు రక్తం కారకుండా రక్తాన్ని గడ్డకట్టించే 'ప్రోత్రాంబిన్' అనే ప్రోటీన్ ఉత్పత్తికి విటమిన్ K ఎంతో అవసరం. K విటమిన్ లోపిస్తే చిన్న గాయాలైనా రక్తం నిరంతరాయంగా ప్రవహించే ప్రమాదం ఉంటుంది.
భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది?
వ్యాస్ సమ్మాన్.
సరస్వతి సమ్మాన్.
జ్ఞానపీఠ్ అవార్డు.
సాహిత్య అకాడమీ అవార్డు.
భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డును 1961లో స్థాపించగా, మొదటి అవార్డును 1965లో మలయాళ రచయిత జి. శంకర కురుప్‌కు అందజేశారు. ఈ అవార్డును రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో ఉన్న 22 భాషలతో పాటు ఇంగ్లీష్‌లో విశేష కృషి చేసిన జీవించి ఉన్న భారతీయ రచయితలకు బహూకరిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం 'రాజీవ్ ఆరోగ్యశ్రీ' పథకం కింద ఉచిత వైద్య పరిమితిని ఎంతకు పెంచింది?
₹5 లక్షలు.
₹10 లక్షలు.
₹15 లక్షలు.
₹20 లక్షలు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఇచ్చే ఉచిత వైద్య పరిమితిని గతంలో ఉన్న ₹5 లక్షల నుండి ₹10 లక్షలకు పెంచింది. 'చేయూత' గ్యారంటీలో భాగంగా పెంచిన ఈ పరిమితి ద్వారా రాష్ట్రంలోని అర్హులైన పేద కుటుంబాలకు కార్పొరేట్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యం అందుతోంది.
కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ నృత్య రూపం ఏది?
కూచిపూడి.
పేరిణి శివతాండవం.
కథక్.
భరతనాట్యం.
పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో సైనికులను యుద్ధానికి ఉత్తేజపరచడానికి పురుషులు ప్రదర్శించిన ఒక వీర నృత్యం. దీనినే 'యోధుల నృత్యం' అని కూడా పిలుస్తారు మరియు దీని భంగిమలు రామప్ప దేవాలయ శిల్పాలలో స్పష్టంగా కనిపిస్తాయి.
భారతదేశంలో వైశాల్యం పరంగా అతి చిన్న జిల్లా ఏది?
లక్షద్వీప్.
యానాం.
సెంట్రల్ ఢిల్లీ.
మాహే.
భారతదేశంలో వైశాల్యం పరంగా అత్యంత చిన్న జిల్లా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన మాహే జిల్లా. ఇది కేరళ రాష్ట్ర సరిహద్దును ఆనుకుని కేవలం 8.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. వైశాల్యం పరంగా భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లా గుజరాత్‌లోని కచ్ జిల్లా.
భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే 'మౌసిన్‌రామ్' ఏ రాష్ట్రంలో ఉంది?
అస్సాం.
త్రిపుర.
మిజోరాం.
మేఘాలయ.
భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే 'మౌసిన్‌రామ్' ప్రాంతం మేఘాలయ రాష్ట్రంలో ఉంది. ఈ ప్రాంతం ఖాసీ కొండల మధ్యలో ఉండటం వల్ల, బంగాళాఖాతం నుండి వచ్చే తేమతో కూడిన గాలులు ఇక్కడ ఆగిపోయి ప్రపంచంలోనే అత్యధిక సగటు వర్షపాతాన్ని కురిపిస్తాయి.
ఆంధ్రకేసరి అని ఎవరిని పిలుస్తారు?
అల్లూరి సీతారామరాజు.
టంగుటూరి ప్రకాశం పంతులు.
పొట్టి శ్రీరాములు.
కొండా వెంకటప్పయ్య.
1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా మద్రాసులో జరిగిన నిరసనల్లో ఆంగ్లేయుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచి రొమ్ము చూపిన ఆయన ధైర్యసాహసాలకు గాను టంగుటూరి ప్రకాశం పంతులు గారికి "ఆంధ్రకేసరి" (ఆంధ్ర సింహం) అనే బిరుదు వచ్చింది. ఆయన 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా సేవలందించారు.
గౌతమ బుద్ధుడు ఎక్కడ జన్మించాడు?
లుంబిని.
సారనాథ్.
గయ.
కుశీనగర్.
బౌద్ధమత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 563లో ప్రస్తుత నేపాల్ దేశంలో ఉన్న లుంబిని వనంలో జన్మించాడు. ఆయన శాక్య వంశానికి చెందిన రాజు శుద్ధోధనుడు మరియు రాణి మాయాదేవిల కుమారుడు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రస్తుత ఛైర్మన్ ఎవరు?
ఎస్. సోమనాథ్.
ఎ. ఎస్. కిరణ్ కుమార్.
డాక్టర్ వి. నారాయణన్.
డాక్టర్ కె. శివన్.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 11వ ఛైర్మన్‌గా డాక్టర్ వి. నారాయణన్ 2025 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కంటే ముందు ఎస్. సోమనాథ్, డాక్టర్ కె. శివన్ మరియు ఎ. ఎస్. కిరణ్ కుమార్ వరుసగా సేవలు అందించారు.
భారతదేశాన్ని మరియు శ్రీలంకను వేరుచేస్తున్న జలసంధి ఏది?
మలక్కా జలసంధి.
బేరింగ్ జలసంధి.
జిబ్రాల్టర్ జలసంధి.
పాక్ జలసంధి.
పాక్ జలసంధి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి మరియు శ్రీలంకలోని మన్నార్ జిల్లాకు మధ్య ఉంటూ ఈ రెండు దేశాల భూభాగాలను వేరు చేస్తుంది. ఇది ఈశాన్యంలో ఉన్న బంగాళాఖాతాన్ని, నైరుతిలో ఉన్న మన్నార్ గల్ఫ్‌ను అనుసంధానించే ఒక నిస్సారమైన జలమార్గం.
ఉల్కాపాతం వల్ల మహారాష్ట్రలో ఏర్పడిన ప్రసిద్ధ గులాబీ రంగు సరస్సు ఏది?
వెంబనాడ్ సరస్సు.
లోనార్ సరస్సు.
దాల్ సరస్సు.
పుష్కర్ సరస్సు.
మహారాష్ట్రలోని లోనార్ సరస్సు సుమారు 52,000 సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టడం వల్ల ఏర్పడిన ప్రపంచ ప్రసిద్ధ క్రేటర్ సరస్సు. ఇందులో ఉండే ప్రత్యేకమైన లవణీయత, క్షార గుణాలు మరియు 'హాలోఅర్కియా' అనే సూక్ష్మజీవుల కారణంగా ఈ సరస్సు నీరు అప్పుడప్పుడు గులాబీ రంగులోకి మారుతుంది.
ప్రతిష్టాత్మక 'బిసి రాయ్ అవార్డు' ను ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు?
జర్నలిజం.
వైద్య రంగం.
సంగీతం.
పర్యావరణం.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, వైద్యుడు మరియు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ (Dr. B. C. Roy) జ్ఞాపకార్థం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1962లో ఈ అవార్డును స్థాపించింది. ఆయన పుట్టినరోజైన జూలై 1వ తేదీని భారతదేశంలో ప్రతి ఏటా 'జాతీయ వైద్యుల దినోత్సవం'గా జరుపుకుంటారు.
జపాన్ దేశ పార్లమెంటును ఏమని పిలుస్తారు?
డ్యూమా.
నెసెట్.
నేషనల్ డైట్.
కాంగ్రెస్.
జపాన్ దేశ పార్లమెంటును 'నేషనల్ డైట్' (National Diet) అని పిలుస్తారు, దీనిలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మరియు హౌస్ ఆఫ్ కౌన్సిలర్స్ అనే రెండు సభలు ఉంటాయి. ఈ నేషనల్ డైట్ జపాన్ దేశ రాజధాని అయిన టోక్యో లో ఉంది.
మన దేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
సాలిసిటర్ జనరల్.
అటార్నీ జనరల్.
కేంద్ర న్యాయశాఖ మంత్రి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారిగా అటార్నీ జనరల్ వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారుడిగా ఉంటూ, దేశంలోని అన్ని న్యాయస్థానాలలో ప్రభుత్వ తరపున వాదనలు వినిపించే హక్కు ఈయనకు ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉండవలసిన అర్హతలు ఉన్న వ్యక్తిని కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఈ పదవిలోకి నియమిస్తారు.
నెల్సన్ మండేలా రాసిన ప్రసిద్ధ ఆత్మకథ ఏది?
లాంగ్ వాక్ టు ఫ్రీడమ్.
మై బ్రీఫ్ హిస్టరీ.
ది ఇన్‌సైడర్.
డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్.
'సౌత్ ఆఫ్రికా గాంధీ' గా పిలవబడే నెల్సన్ మండేలా రాసిన ప్రసిద్ధ ఆత్మకథే 'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్'. ఈ పుస్తకంలో ఆయన తన బాల్యం, జైలు జీవితం మరియు దేశంలో వర్ణవివక్షను అంతం చేయడానికి చేసిన సుదీర్ఘ పోరాట విశేషాలను వివరించారు.
'విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్' (VSSC) ఎక్కడ ఉంది?
బెంగళూరు.
శ్రీహరికోట.
తిరువనంతపురం.
అహ్మదాబాద్.
భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన అత్యంత కీలకమైన పరిశోధనా కేంద్రం, ఇక్కడే మన దేశానికి కావలసిన రాకెట్లు (PSLV, GSLV) మరియు ఉపగ్రహ వాహక నౌకల రూపకల్పన, తయారీ జరుగుతాయి.
మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఎంత?
98.4°F లేదా 35°C.
96.8°F లేదా 38°C.
99.2°F లేదా 36°C.
98.6°F లేదా 37°C.
ఒక ఆరోగ్యకరమైన మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత ఫారెన్‌హీట్ స్కేల్‌లో 98.6°F (ఫారెన్‌హీట్) మరియు సెల్సియస్ స్కేల్‌లో 37°C (సెల్సియస్) గా ఉంటుంది. శరీరంలో ఉష్ణోగ్రత నియంత్రణ అనేది మెదడులోని 'హైపోథాలమస్' అనే భాగం ద్వారా జరుగుతుంది. ఉష్ణోగ్రత దీనికంటే ఎక్కువైతే జ్వరంగా పరిగణిస్తారు.
'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' (NGT) ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది?
ముంబై.
కోల్‌కతా.
న్యూఢిల్లీ.
చెన్నై.
పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించడానికి 2010లో ఏర్పాటైన ఎన్‌జీటీ (NGT) ప్రధాన బెంచ్ న్యూఢిల్లీలో ఉంది. దీనికి అనుబంధంగా భోపాల్, పూణే, కోల్‌కతా మరియు చెన్నై నగరాలలో నాలుగు ప్రాంతీయ బెంచ్‌లు పనిచేస్తున్నాయి.
'కాజీరంగా జాతీయ పార్కు' ఏ జంతువు సంరక్షణకు ప్రసిద్ధి చెందింది?
బెంగాల్ టైగర్.
ఆసియా సింహం.
ఏనుగు.
ఒంటికొమ్ము ఖడ్గమృగం.
అసోం లోని 'కాజీరంగా జాతీయ పార్కు' ఒంటి కొమ్ము ఖడ్గమృగాల (One-Horned Rhinoceros) సంరక్షణకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని మొత్తం ఒంటికొమ్ము ఖడ్గమృగాల జనాభాలో దాదాపు 2/3 వంతు ఈ పార్కులోనే ఉన్నాయి. దీని విశిష్టత కారణంగా 1985లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
"దగాపడ్డ తెలంగాణ" పుస్తకాన్ని రచించింది ఎవరు?
ప్రొఫెసర్ జయశంకర్.
కొండా లక్ష్మణ్ బాపూజీ.
అల్లం నారాయణ.
గాదె ఇన్నయ్య.
దగాపడ్డ తెలంగాణ అనే ప్రముఖ పుస్తకాన్ని తెలంగాణ ఉద్యమకారుడు, రచయిత గాదె ఇన్నయ్య రచించారు. అధికారిక గణాంకాలతో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టిన ఈ గ్రంథం, మలిదశ ఉద్యమంలో ప్రజలను ఎంతగానో చైతన్య పరిచింది.
20వ శతాబ్దపు తాన్ సేన్ అని ఎవరిని అంటారు?
ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్.
ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్.
ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్.
ఉస్తాద్ జాకీర్ హుస్సేన్.
పాటియాలా ఘరానాకు చెందిన ప్రముఖ హిందుస్తానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్‌ను ఆయన అసాధారణ స్వర పరిధి, అద్భుతమైన గాత్ర నైపుణ్యం కారణంగా "20వ శతాబ్దపు తాన్ సేన్" అని పిలుస్తారు.
భారతదేశంలో దేశీవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక ట్రోఫీ ఏది?
సంతోష్ ట్రోఫీ.
ఆగాఖాన్ కప్.
రంజీ ట్రోఫీ.
నెహ్రూ ట్రోఫీ.
భారతదేశంలో పురుషుల ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ల కోసం నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశీయ టోర్నమెంట్ 'రంజీ ట్రోఫీ'. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన మొదటి భారతీయ క్రికెటర్ 'నవానగర్ జాం సాహిబ్' సర్ రంజిత్‌సింహ్‌జీ (రంజీ) జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్‌కు ఆ పేరు పెట్టారు, దీనిని BCCI నిర్వహిస్తుంది.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Free Online Model Paper 12: Office Subordinate and Process Server | Telangana Court Jobs Exams 2026

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top