Online Mock Test 1: Office Subordinate & Process Server (TG (TS) Court Exam 2026) in Telugu


తెలంగాణ జిల్లా కోర్టులలో ఆఫీస్ సబార్డినేట్ (Office Subordinate) మరియు ప్రాసెస్ సర్వర్ (Process Server) పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఈ Mock Test 1 ను ప్రత్యేకంగా రూపొందించాము. 2026 Telangana District Court నోటిఫికేషన్ మరియు లేటెస్ట్ సిలబస్ ఆధారంగా ఈ ప్రశ్నపత్రం ఉంటుంది.

మీ ప్రిపరేషన్ స్థాయిని పరీక్షించుకోవడానికి మరియు తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

📝 మొత్తం ప్రశ్నలు: 45 (జనరల్ నాలెడ్జ్).

⏱️ సమయం: 60 నిమిషాలు.

🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.

🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 45
🟢 0 🔴 0
00:00
డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
మహాత్మా గాంధీ.
జవహర్‌లాల్ నెహ్రూ.
సర్వేపల్లి రాధాకృష్ణన్.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1944లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కోటలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథాన్ని రచించారు.
భారతరత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు?
ఇందిరా గాంధీ.
మదర్ థెరిస్సా.
అరుణా అసఫ్ అలీ.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి.
1971లో ఇందిరా గాంధీ భారతరత్న అవార్డును అందుకున్న తొలి మహిళగా నిలిచారు. ఆమె తర్వాత మదర్ థెరిస్సా (1980), అరుణా అసఫ్ అలీ (1997), ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (1998) లో ఈ పురస్కారాన్ని పొందారు.
మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది?
క్లోమం.
కాలేయం.
పిట్యూటరీ గ్రంథి.
థైరాయిడ్ గ్రంథి.
మానవ శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం మరియు అతిపెద్ద గ్రంథి కాలేయం. ఇది సుమారు 1.5 కేజీల బరువు ఉంటుంది. ఇది 'పిత్త రసం' (Bile Juice) ను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
అర్థశాస్త్రాన్ని రచించింది ఎవరు?
ఆర్యభట్ట.
కౌటిల్యుడు.
మెగాస్తనీస్.
కాళిదాసు.
మౌర్య సామ్రాజ్య ప్రధానమంత్రి అయిన కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించారు. ఈయనకే చాణక్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా కలవు. ఇది రాజనీతి, యుద్ధ తంత్రాలు మరియు పరిపాలనాంశాల గురించి వివరించే ప్రాచీన గ్రంథం.
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలు ఎవరు?
మాలవత్ పూర్ణ.
బచేంద్రిపాల్.
సంతోష్ యాదవ్.
అరుణిమ సిన్హా.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా (గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) కు చెందిన మాలవత్ పూర్ణ 2014, మే 25న కేవలం 13 సంవత్సరాల 11 నెలల వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది. తద్వారా ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది.
రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్ ఏది?
విటమిన్ A.
విటమిన్ B.
విటమిన్ D.
విటమిన్ K.
శరీరానికి గాయం అయినప్పుడు రక్తం కారిపోకుండా గడ్డకట్టడానికి విటమిన్ K అత్యవసరం. దీని లోపం ఉంటే చిన్న గాయం అయినా రక్తం ఆగకుండా కారుతుంది. విటమిన్ K యొక్క శాస్త్రీయ నామం ఫైలోక్వినోన్.
భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు?
డా. బాబూ రాజేంద్రప్రసాద్.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్.
డా. జాకీర్ హుస్సేన్.
వి.వి. గిరి.
భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి డా. బాబూ రాజేంద్రప్రసాద్. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (2వ), డా. జాకీర్ హుస్సేన్ (3వ), మరియు వి.వి. గిరి (4వ) రాష్ట్రపతులుగా బాధ్యతలు నిర్వహించారు.
స్వతంత్ర భారతదేశంలో తొలి జనగణన (Census) ఏ సంవత్సరంలో జరిగింది?
1947.
1948.
1952.
1951.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1951లో జనాభా గణన నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతోంది.
క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
1940.
1942.
1945.
1947.
1942 ఆగస్టు 8న ముంబైలో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీ 'క్విట్ ఇండియా' ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే ఆయన 'డూ ఆర్ డై' (Do or Die) అనే నినాదాన్ని ఇచ్చారు.
కాజీరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో కలదు?
పశ్చిమ బెంగాల్.
గుజరాత్.
కర్ణాటక.
అస్సాం.
కాజీరంగా జాతీయ పార్కు అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది ప్రపంచంలోని ఒంటికొమ్ము ఖడ్గమృగాల జనాభాలో మూడింట రెండు వంతులకు నిలయంగా ఉంది మరియు దీనిని UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
బౌద్ధమత పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు?
అంగాలు.
త్రిపీటకాలు.
జాతక కథలు.
ఆగమాలు.
బౌద్ధమత పవిత్ర గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. ఇవి పాలీ భాషలో రాయబడ్డాయి. వీటిలో వినయ, సుత్త మరియు అభిధమ్మ అనే మూడు పీటకాలు ఉంటాయి.
పట్టు పురుగుల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
సెరీకల్చర్.
ఎపీకల్చర్.
పిసికల్చర్.
విటికల్చర్.
పట్టు పురుగులను పెంచి, వాటి నుండి పట్టును ఉత్పత్తి చేసే విధానాన్ని సెరీకల్చర్ అంటారు. భారతదేశం పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP) ఏ నదిపై నిర్మించబడింది?
కృష్ణ.
తుంగభద్ర.
గోదావరి.
మంజీర.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించబడింది. దీనిని గతంలో 'పోచంపాడు ప్రాజెక్ట్' అని పిలిచేవారు. ఇది ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రధాన నీటి వనరు. అందుకే దీనిని 'ఉత్తర తెలంగాణ జీవధార' అని కూడా పిలుస్తారు.
భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
1947 ఆగస్టు 15.
1949 నవంబర్ 26.
1950 జనవరి 24.
1950 జనవరి 26.
భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడినప్పటికీ, అది 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చింది. ఈ రోజునే మనం ప్రతి సంవత్సరం 'గణతంత్ర దినోత్సవం' (Republic Day) గా జరుపుకుంటాము.
వైశాల్యం పరంగా తెలంగాణలో అతిపెద్ద జిల్లా ఏది?
భద్రాద్రి కొత్తగూడెం.
నల్గొండ.
నాగర్ కర్నూల్.
అదిలాబాద్.
సుమారు 7,483 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణలో అతిపెద్ద జిల్లాగా ఉంది. అత్యంత తక్కువ వైశాల్యం కలిగిన జిల్లా హైదరాబాద్.
భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు?
సుచేతా కృపలానీ.
విజయలక్ష్మి పండిట్.
సరోజినీ నాయుడు.
పద్మజా నాయుడు.
'నైటింగేల్ ఆఫ్ ఇండియా' గా ప్రసిద్ధి చెందిన సరోజినీ నాయుడు 1947లో ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి, భారతదేశంలో ఈ పదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది?
లక్ష్మీదేవి పేట కొండలు.
అనంతగిరి కొండలు.
పాపి కొండలు.
డోలి గుట్ట.
ములుగు జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఉన్న 'డోలి గుట్ట' (965 మీటర్లు) తెలంగాణలో ఎత్తైన శిఖరం. గతంలో ఖమ్మం జిల్లాలోని పెద్దకొండ ఎత్తైనదిగా ఉండేది, కానీ విభజన తర్వాత అది ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిపోయింది.
తెలంగాణ రాష్ట్ర గేయం ఏది?
పొడుస్తున్న పొద్దు మీద.
బండెనక బండి కట్టి.
జై బోలో తెలంగాణ.
జయ జయహే తెలంగాణ.
తెలంగాణ రాష్ట్ర గేయం జయ జయహే తెలంగాణ. ఈ గేయాన్ని ప్రముఖ కవి అందెశ్రీ రచించగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. తెలంగాణ ప్రభుత్వం దీనిని జూన్ 2, 2024న అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రి ఎవరు?
మహమూద్ అలీ.
ఈటల రాజేందర్.
నాయిని నర్సింహారెడ్డి.
టి. హరీష్ రావు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మొట్టమొదటి హోం మంత్రిగా నాయిని నర్సింహారెడ్డి నియమితులయ్యారు. ఆయన హోం శాఖతో పాటు కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖకు కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
లాల్ బహదూర్ శాస్త్రి సమాధి పేరు ఏమిటి?
రాజ్‌ఘాట్.
కిసాన్‌ఘాట్.
అభయ్‌ఘాట్.
విజయ్‌ఘాట్.
ఢిల్లీలోని యమునా నది తీరాన ఉన్న భారతదేశపు రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని 'విజయ్ ఘాట్' అని పిలుస్తారు. 1965 పాకిస్తాన్ యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి మరియు శాస్త్రి గారు చూపిన ధైర్యానికి గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు.
భారత ఎన్నికల కమిషన్ కార్యాలయ భవనాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
యోజనా భవన్.
విజ్ఞాన్ భవన్.
నిర్వాచన్ సదన్.
ప్రతిభా భవన్.
భారత ఎన్నికల కమిషన్ (ECI) ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. దీనిని 'నిర్వాచన్ సదన్' అని పిలుస్తారు. ఈ కమిషన్ 1950, జనవరి25న స్థాపించబడింది.
'తెలంగాణ సరిహద్దు గాంధీ' అనే బిరుదు ఎవరికి కలదు?
కొండా వెంకటప్పయ్య.
పర్వతనేని వీరయ్య చౌదరి.
జమలాపురం కేశవరావు.
రావి నారాయణ రెడ్డి.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన జమలాపురం కేశవరావును 'తెలంగాణ సరిహద్దు గాంధీ' అని పిలుస్తారు. ఆయనను 'హైదరాబాద్ సర్దార్' మరియు 'దక్కన్ సర్దార్'  అని కూడా పిలుస్తారు.
రామప్ప దేవాలయం ప్రస్తుతం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?
వరంగల్.
ములుగు.
హన్మకొండ.
జయశంకర్ భూపాలపల్లి.
కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయం ప్రస్తుతం ములుగు జిల్లాలోని పాలంపేటలో ఉంది. 2021లో UNESCO ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ దేవాలయం, తన అద్భుతమైన శిల్పకళకు మరియు నీటిపై తేలే ఇటుకలకు ప్రసిద్ధి.
మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది?
ఫీమర్.
హ్యూమరస్.
స్టేపిస్.
టిబియా.
మానవ శరీరంలో అతి చిన్న మరియు తేలికైన ఎముక స్టేపిస్ (Stapes). ఇది మధ్య చెవిలో ఉంటుంది. ఇది సుమారు 2.8 నుండి 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది.
కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది?
మచిలీపట్నం.
మోటుపల్లి.
కళింగపట్నం.
విశాఖపట్నం.
కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ఓడరేవు మోటుపల్లి. గణపతి దేవుడు ఇక్కడ 'అభయ శాసనం' వేయించి విదేశీ వ్యాపారులకు రక్షణ కల్పించారు. ప్రసిద్ధ ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో కూడా ఈ ఓడరేవును సందర్శించారు.
సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది ఎవరు?
బాల గంగాధర్ తిలక్.
గోపాల కృష్ణ గోఖలే.
లాలా లజపతి రాయ్.
చిత్తరంజన్ దాస్.
గోపాల కృష్ణ గోఖలే 1905లో మహారాష్ట్రలోని పుణెలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించారు. దేశ సేవ కోసం భారతీయులను ఐక్యం చేయడం మరియు శిక్షణ ఇవ్వడం ఈ సొసైటీ ప్రధాన ఉద్దేశ్యం.
మానవ శరీరంలో ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది?
ఎనీమియా.
గాయిటర్.
స్కర్వీ.
డయాబెటిస్.
ఇన్సులిన్ అనేది రక్తంలోని గ్లూకోజ్ (చక్కెర) స్థాయిని నియంత్రించే ఒక హార్మోన్. క్లోమ గ్రంథి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ (మధుమేహం) వస్తుంది.
దక్షిణ భారతదేశంలో పొడవైన నది ఏది?
గంగా నది.
కృష్ణా నది.
బ్రహ్మపుత్ర నది.
గోదావరి నది.
దక్షిణ భారతదేశంలోనే అత్యంత పొడవైన నది గోదావరి నది. దీని పొడవు సుమారు 1,465 కిలోమీటర్లు. దీని జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం. దీనిని 'దక్షిణ గంగా' లేదా 'వృద్ధ గంగా' అని కూడా పిలుస్తారు. భారతదేశం మొత్తంలో గంగా నది తర్వాత ఇది రెండవ అతిపెద్ద నది.
తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
జూన్ 2.
సెప్టెంబర్ 9.
సెప్టెంబర్ 17.
అక్టోబర్ 6.
తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ కవి మరియు పద్మవిభూషణ్ గ్రహీత కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీని 'తెలంగాణ భాషా దినోత్సవం'గా నిర్వహిస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది?
ఉత్తరప్రదేశ్.
మహారాష్ట్ర.
బీహార్.
పశ్చిమ బెంగాల్.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరప్రదేశ్ సుమారు 20 కోట్ల జనాభాతో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది భారతదేశ మొత్తం జనాభాలో 16.5%. దీని తర్వాత మహారాష్ట్ర (2వ), బీహార్ (3వ), మరియు పశ్చిమ బెంగాల్ (4వ) స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని రూపొందించింది ఎవరు?
ఏలె లక్ష్మణ్.
ఎక్కా యాదగిరి రావు.
బి. వెంకటరమణా చారి.
కాపు రాజయ్య.
ప్రముఖ చిత్రకారుడు ఏలె లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రూపొందించారు. ఇందులో కాకతీయ కళాతోరణం మరియు దాని మధ్యలో చార్మినార్‌ మరియు పైన అశోకుని ధర్మచక్రం ఉండి దాని కింద 'సత్యమేవ జయతే' అని ముద్రించబడి ఉంటుంది.
భారత రాజ్యాంగంలోని 'ఆదేశిక సూత్రాలను' ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
బ్రిటన్.
అమెరికా.
ఐర్లాండ్.
కెనడా.
భారత రాజ్యాంగ నిర్మాతలు ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించారు. వీటిని రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల ఆర్టికల్స్‌లో పొందుపరిచారు.
కొమురం భీమ్ ఇచ్చిన ప్రసిద్ధ నినాదం ఏది?
జల్, జంగల్, జమీన్.
జల్, భీమ్, కమాన్.
జల్, భీమ్, జమీన్.
జల్, జంగల్, కమాన్.
'జల్, జంగల్, జమీన్' అంటే నీరు, అడవి, భూమి అని అర్థం. అడవి బిడ్డలకు అటవీ వనరులపై హక్కు ఉండాలనే ఆశయంతో కొమురం భీమ్ ఈ నినాదాన్ని ఇచ్చారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు?
ఏప్రిల్ 7.
జూన్ 5.
డిసెంబర్ 1.
మార్చి 24.
1948 ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాపించబడింది. దాని జ్ఞాపకార్థం ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం అదే రోజున ఒక ప్రత్యేక 'థీమ్' తో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
తాజ్‌మహల్ ఏ నది ఒడ్డున కలదు?
గంగా నది.
యమునా నది.
నర్మదా నది.
తపతి నది.
ప్రపంచ ప్రసిద్ధ కట్టడం తాజ్‌మహల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా నది ఒడ్డున నిర్మించబడింది. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం నిర్మించారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
విజయవాడ.
గుంతకల్.
సికింద్రాబాద్.
గుంటూరు.
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్‌లో ఉంది. ఈ జోన్ 1966, అక్టోబర్ 2న ప్రారంభించబడింది. ఇది భారతదేశంలోని ముఖ్యమైన రైల్వే జోన్లలో ఒకటి.
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) విజేతగా నిలిచిన జట్టు ఏది?
పంజాబ్ కింగ్స్.
కోల్‌కతా నైట్ రైడర్స్.
సన్‌రైజర్స్ హైదరాబాద్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన 2025 IPL ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి IPL టైటిల్‌ను కైవసం చేసుకుంది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB ఈ ఘనత సాధించడం విశేషం.
పెన్సిలిన్‌ను కనుగొన్నశాస్త్రవేత్త ఎవరు?
లూయీ పాశ్చర్.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్.
ఎడ్వర్డ్ జెన్నర్.
జోనాస్ సాక్.
1928లో సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీబయాటిక్ అయిన పెన్సిలిన్‌ను కనుగొన్నారు. దీనిని 'వండర్ డ్రగ్' అని కూడా పిలుస్తారు.
రక్తపోటును (Blood Pressure) ఏ పరికరం సహాయంతో కొలుస్తారు?
థర్మామీటర్.
బారోమీటర్.
స్ఫిగ్మోమానోమీటర్.
లాక్టోమీటర్.
రక్తపోటును (BP) కొలవడానికి స్ఫిగ్మోమానోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆరోగ్యవంతుడైన మానవుని సాధారణ రక్తపోటు 120/80 mm Hg గా ఉంటుంది. ఇందులో 120ని సిస్టోలిక్ పీడనం అని, 80ని డయాస్టోలిక్ పీడనం అని పిలుస్తారు.
భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
డా. బి.ఆర్. అంబేద్కర్.
డా. బాబూ రాజేంద్రప్రసాద్.
జవహర్‌లాల్ నెహ్రూ.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
డా. బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పోషించిన కీలక పాత్రకు గాను ఆయనను 'భారత రాజ్యాంగ పితామహుడు' (Father of the Indian Constitution) అని పిలుస్తారు.
"పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా…" అనే పాట రచయిత ఎవరు?
గద్దర్.
అందెశ్రీ.
గూడ అంజయ్య.
గోరటి వెంకన్న.
ఈ పాటను ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) రచించారు. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎంతో ప్రాచుర్యం పొంది, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపింది మరియు ఎంతో ప్రభావితం చేసింది.
'కథకళి' నృత్యరూపకం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
రాజస్థాన్.
తమిళనాడు.
కేరళ.
కర్ణాటక.
కథకళి అనేది కేరళ రాష్ట్రానికి చెందిన అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధ సాంప్రదాయ నృత్య రూపం. ఈ నృత్యంలో కళాకారులు భారీ అలంకరణలు, ముఖానికి రంగులు వేసుకుని పురాణ గాథలను హావభావాల ద్వారా ప్రదర్శిస్తారు.
హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎవరు?
కె. చంద్రశేఖర్ రావు.
నీలం సంజీవరెడ్డి.
మర్రి చెన్నారెడ్డి.
బూర్గుల రామకృష్ణారావు.
1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత, హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు బాధ్యతలు చేపట్టారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
తెలంగాణ శాసనసభలోని మొత్తం MLA స్థానాల సంఖ్య ఎంత?
117.
119.
120.
175.
తెలంగాణ శాసనసభలో మొత్తం 119మంది ఎన్నికైన MLA స్థానాలు ఉన్నాయి. గతంలో ఒక ఆంగ్లో-ఇండియన్ నామినేటెడ్ సభ్యుడు ఉండేవారు, కానీ ఆ విధానం రద్దు కావడంతో ప్రస్తుతం తెలంగాణలో కేవలం 119 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు.
ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో గల సభ్య దేశాల సంఖ్య ఎంత?
190.
191.
193.
195.
1945లో ఐక్యరాజ్యసమితి స్థాపించబడినప్పుడు మొత్తం 51 వ్యవస్థాపక సభ్య దేశాలు ఉండేవి. ప్రస్తుతం మొత్తం 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2011లో చేరిన దక్షిణ సూడాన్ ఇందులో సభ్యత్వం పొందిన చివరి దేశం.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Office Subordinate & Process Server (TG (TS) Court Exam 2026) in Telugu

3 thoughts on “Online Mock Test 1: Office Subordinate & Process Server (TG (TS) Court Exam 2026) in Telugu”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top