తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
జూన్ 2, 2014.
జూన్ 2, 2015.
ఆగస్టు 15, 2014.
మే 2, 2014.
భారత దేశంలో జూన్2, 2014న 29వ రాష్ట్రంగా (ప్రస్తుతం 28) తెలంగాణ అధికారికంగా ఏర్పడింది. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు.
బృహదీశ్వర దేవాలయం ఎక్కడ కలదు?
భువనేశ్వర్ (ఒడిశా).
అమృత్ సర్ (పంజాబ్).
తంజావూరు (తమిళనాడు).
ఔరంగాబాద్ (మహారాష్ట్ర).
తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ చారిత్రాత్మక శివాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించారు. ఇది పూర్తిగా గ్రానైట్ రాతితో నిర్మించబడిన ప్రపంచంలోని మొట్టమొదటి దేవాలయం మరియు UNESCO గుర్తింపు పొందింది.
“ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా...” అనే ప్రసిద్ధ పాటను రాసింది ఎవరు?
గద్దర్.
గోరటి వెంకన్న.
అభినయ శ్రీనివాస్.
అందెశ్రీ.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ అభినయ శ్రీనివాస్ ఈ భావోద్వేగభరితమైన పాటను రచించారు. ఈ పాట ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఉంటుంది.
భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
సిస్మాలజీ.
కాస్మాలజీ.
ఓషియానోగ్రఫీ.
జియాలజీ.
భూకంపాలు మరియు భూమి లోపల సంభవించే కంపనాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'సిస్మాలజీ' అని పిలుస్తారు. భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్‌ను, భూకంప తరంగాలను నమోదు చేయడానికి సిస్మోగ్రాఫ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు?
మార్చి 8.
ఏప్రిల్ 7.
జనవరి 24.
ఫిబ్రవరి 13.
మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ విజయాలను గుర్తించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1977లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా గుర్తించింది.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుండి గ్రహించారు?
బ్రిటన్.
అమెరికా.
కెనడా.
ఐర్లాండ్.
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం (Bill of Rights) నుండి గ్రహించారు. ఇవి రాజ్యాంగంలోని 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల ఆర్టికల్స్‌లో పొందుపరచబడ్డాయి.
ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
జస్టిస్ సంజీవ్ ఖన్నా.
జస్టిస్ సూర్య కాంత్.
జస్టిస్ బి.ఆర్. గవాయ్.
జస్టిస్ డి.వై. చంద్రచూడ్.
జస్టిస్ సూర్య కాంత్ నవంబర్ 24, 2025న భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఫిబ్రవరి 2027 వరకు ఈ పదవిలో కొనసాగుతారు.
దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు?
చిత్తరంజన్ దాస్.
సి.ఎఫ్. ఆండ్రూస్.
జయప్రకాష్ నారాయణ్.
సి.ఎఫ్. అన్నాదురై.
ప్రముఖ న్యాయవాది మరియు స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చిత్తరంజన్ దాస్‌ను ప్రజలు ప్రేమగా 'దేశబంధు' (దేశానికే స్నేహితుడు) అని పిలుచేవారు. ఆయన స్వరాజ్య పార్టీ స్థాపకులలో ఒకరు.
మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది?
ఫీమర్.
స్టేపిస్.
హ్యూమరస్.
టిబియా.
మానవ శరీరంలో అత్యంత పొడవైన, బలమైన మరియు అతి పెద్ద ఎముక ఫీమర్ లేదా తొడ ఎముక. ఇది శరీర బరువును మోయడంలో మరియు నడవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రపంచంలో అత్యంత ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతం ఏది?
మాసిన్‌రామ్.
చిరపుంజి.
అగుంబే.
మహాబలేశ్వర్.
మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్‌రామ్ ప్రపంచంలోనే అత్యధిక సగటు వార్షిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీనికి ముందు చిరపుంజి మొదటి స్థానంలో ఉండేది, ప్రస్తుతం అది రెండో స్థానంలో ఉంది.
'బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' అని ఎవరిని పిలుస్తారు?
హుమాయూన్ అబ్దులాలీ.
రామ్ దేవ్ మిశ్రా.
కైలాష్ సాంఖాలా.
సలీం అలీ.
భారతదేశపు ప్రసిద్ధ పక్షి శాస్త్రవేత్త అయిన డాక్టర్ సలీం అలీని పక్షుల సంరక్షణ మరియు అధ్యయనంలో చేసిన విశేష కృషికి గాను 'బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఈయన రాసిన 'ద బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్' పక్షి శాస్త్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గ్రంథం.
భారత్ – పాకిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ ఏది?
మెక్‌మోహన్ రేఖ.
డ్యూరాండ్ రేఖ.
మాజినాట్ రేఖ.
రాడ్‌క్లిఫ్ రేఖ.
1947లో భారత్, పాకిస్తాన్ విభజన సమయంలో సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ ఈ సరిహద్దు రేఖను నిర్ణయించారు. అందుకే దీనికి రాడ్‌క్లిఫ్ రేఖ అని పేరు వచ్చింది.
భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం?
ఆంధ్రప్రదేశ్.
తమిళనాడు.
కేరళ.
కర్ణాటక.
భరతనాట్యం భారతదేశంలోని అత్యంత పురాతనమైన శాస్త్రీయ నృత్యాలలో ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో పుట్టి అభివృద్ధి చెందింది. భరతనాట్యం భావం, రాగం, తాళం అనే మూడు ప్రధానాంశాల కలయిక.
'అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం'అని దేనిని పిలుస్తారు?
జపాన్.
ఫిన్లాండ్.
ఐస్లాండ్.
నార్వే.
నార్వే దేశం ఆర్కిటిక్ సర్కిల్ పైన ఉండటం వల్ల అక్కడ వేసవి కాలంలో కొన్ని నెలల పాటు సూర్యుడు అస్సలు అస్తమించడు. అందుకే దీనిని 'ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్' లేదా 'అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం' అని పిలుస్తారు.
రాజీవ్ గాంధీ సమాధి పేరు ఏమిటి?
ఖర్మభూమి.
జ్ఞాన్‌భూమి.
శక్తి స్థల్.
వీర్ భూమి.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారక చిహ్నాన్ని 'వీర్ భూమి' అని పిలుస్తారు. ఇది న్యూ ఢిల్లీలో ఉంది. మిగతా ఆప్షన్లలో రాజ్ ఘాట్ (మహాత్మా గాంధీ), విజయ్ ఘాట్ (లాల్ బహదూర్ శాస్త్రి), శక్తి స్థల్ (ఇందిరా గాంధీ).
తెలంగాణ రాష్ట్ర మొత్తం వైశాల్యం ఎంత?
1,14,840 చ.కి.మీ.
1,12,077 చ.కి.మీ.
1,16,204 చ.కి.మీ.
1,10,022 చ.కి.మీ.
తెలంగాణ రాష్ట్రం మొత్తం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉండి భారతదేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 3.41% వాటాను ఆక్రమిస్తుంది. వైశాల్యం పరంగా భారతదేశంలో తెలంగాణ 11వ అతిపెద్ద రాష్ట్రం.
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి ఎవరు?
సి. నారాయణ రెడ్డి.
కాళోజీ నారాయణ రావు.
దాశరథి కృష్ణమాచార్య.
సురవరం ప్రతాపరెడ్డి.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ దాశరథి కృష్ణమాచార్య తన 'అగ్నిధార' కవితా సంపుటి ద్వారా ఈ ప్రసిద్ధ నినాదాన్ని వినిపించారు. ఈయన తన విప్లవ కవిత్వంతో తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆస్థాన కవిగా కూడా గుర్తింపు పొందారు.
అక్బర్ నామా గ్రంథ రచయిత ఎవరు?
అబుల్ ఫజల్.
అక్బర్.
బీర్బల్.
ఫైజీ.
అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరైన అబుల్ ఫజల్ పర్షియన్ భాషలో అక్బర్ జీవిత చరిత్ర అయిన 'అక్బర్ నామా'ను రచించారు. ఈ గ్రంథం మూడు భాగాలుగా ఉంటుంది, అందులో మూడవ భాగమైన 'ఐన్-ఇ-అక్బరీ' అక్బర్ పరిపాలనా విధానాన్ని గురించి వివరిస్తుంది.
భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్.
పింగళి వెంకయ్య.
బంకించంద్ర ఛటర్జీ.
అనిబిసెంట్.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పింగళి వెంకయ్య గారు భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. ఈ పతాకాన్ని 1947 జూలై 22న రాజ్యాంగ పరిషత్ అధికారికంగా ఆమోదించింది.
రక్తం ఎరుపు రంగులో ఉండటానికి కారణం ఏమిటి?
మెలనిన్.
క్లోరోఫిల్.
హీమోగ్లోబిన్.
ప్లాస్మా.
రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఉండే హీమోగ్లోబిన్ అనే ఇనుము (Iron) కలిగిన ప్రోటీన్ వల్ల రక్తం ఎరుపు రంగులో కనిపిస్తుంది. ఇది ఊపిరితిత్తుల నుండి శరీర భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
UNO ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?
వాషింగ్టన్ డి.సి.
లండన్.
న్యూయార్క్.
పారిస్.
ఐక్యరాజ్యసమితి (UNO) ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడటానికి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది.
ఓనం పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
కేరళ.
కర్ణాటక.
తమిళనాడు.
పంజాబ్.
ఓనం కేరళ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పంటల పండుగ. పురాణాల ప్రకారం మహాబలి చక్రవర్తి తన ప్రజలను చూడటానికి భూమిపైకి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
A, D, E, K.
A మరియు B.
C మరియు D.
B మరియు C.
విటమిన్లను అవి కరిగే స్వభావాన్ని బట్టి రెండు రకాలుగా విభజిస్తారు. బి-కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు నీటిలో కరుగుతాయి. మిగిలిన ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వులో కరుగుతాయి.
లండన్ నగరం ఏ నది ఒడ్డున కలదు?
నైలు నది.
థేమ్స్ నది.
డాన్యూబ్ నది.
హడ్సన్ నది.
ఇంగ్లాండ్ రాజధాని అయిన లండన్ నగరం థేమ్స్ నది తీరాన అభివృద్ధి చెందింది. ఈ నది లండన్ నగర ఆర్థిక మరియు చారిత్రక అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించింది.
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం ఏది?
పద్మ విభూషణ్.
పద్మ భూషణ్.
పరమ వీర చక్ర.
భారత రత్న.
భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'. దీనిని కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక మరియు ప్రజా సేవా రంగాలలో విశిష్ట కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 1954లో ప్రారంభించారు. ఈ అవార్డు పొందిన మొదటి వ్యక్తులు సి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు సి.వి. రామన్.
చార్మినార్‌ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1591.
1691.
1491.
1791.
చార్మినార్‌ను 1591లో కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ సుల్తాన్ 'మహమ్మద్ కులీ కుతుబ్ షా' నిర్మించారు. నగరంలో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా, నగరం నడిబొడ్డున ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు.
మానవ శరీరంలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత?
300.
210.
180.
206.
ఒక ఆరోగ్యవంతుడైన వయోజన మానవ శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. చిన్న పిల్లల్లో ఇవి సుమారు 300 వరకు ఉండి, పెరిగే కొద్దీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి చివరికి 206కు చేరుకుంటాయి.
మానవ శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
కార్ల్ లాండ్‌స్టీనర్.
విలియం హార్వే.
లూయిస్ పాశ్చర్.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్.
బ్రిటీష్ వైద్యుడైన విలియం హార్వే 1628లో రక్తం గుండె ద్వారా శరీరం మొత్తం ఎలా ప్రసరిస్తుందో శాస్త్రీయంగా వివరించారు. అందుకే ఆయన్ని 'రక్తప్రసరణ పితామహుడు' అని కూడా పిలుస్తారు.
ఇండియా విన్స్ ఫ్రీడం గ్రంథ రచయిత ఎవరు?
మహాత్మా గాంధీ.
జవహర్‌లాల్ నెహ్రూ.
మౌలానా అబుల్ కలాం ఆజాద్.
సుభాష్ చంద్రబోస్.
స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన స్వాతంత్ర్య పోరాట అనుభవాలను మరియు దేశ విభజన నాటి పరిస్థితులను 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' అనే ఆత్మకథలో వివరించారు.
విటమిన్ 'C'లోపం వల్ల కలిగే వ్యాధి ఏది?
రికెట్స్.
స్కర్వీ.
బెరి బెరి.
పెల్లాగ్రా.
విటమిన్ C లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది. దీనివల్ల చిగుళ్ల నుండి రక్తం కారడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఉసిరి, నిమ్మ మరియు నారింజ వంటి సిట్రస్ జాతి పండ్లను తినడం ద్వారా ఈ లోపాన్ని నివారించవచ్చు.
జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి పట్టే ప్రామాణిక సమయం ఎంత?
48 సెకన్లు.
50 సెకన్లు.
52 సెకన్లు.
55 సెకన్లు.
రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'జనగణమన'ను పూర్తిగా పాడటానికి సుమారు 52 సెకన్ల సమయం పడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనిలోని మొదటి మరియు చివరి చరణాలను సంక్షిప్తంగా 20 సెకన్లలో ఆలపిస్తారు.
నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్.
సి.వి. రామన్.
హరగోవింద్ ఖురానా.
అమర్త్యసేన్.
రవీంద్రనాథ్ ఠాగూర్ తన 'గీతాంజలి' కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ గౌరవం పొందిన మొట్టమొదటి భారతీయుడు మరియు ఆసియా వాసిగా ఆయన చరిత్ర సృష్టించారు.
తెలంగాణలో 'సమ్మక్క-సారలమ్మ' మేడారం జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
వరంగల్.
హన్మకొండ.
ములుగు.
జయశంకర్ భూపాలపల్లి.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనిని 'తెలంగాణ కుంభమేళా' అని కూడా పిలుస్తారు.
తెలంగాణలో అత్యంత ఎత్తైన జలపాతం ఏది?
పొచ్చెర జలపాతం.
గాయత్రి జలపాతం.
బొగత జలపాతం.
కుంతల జలపాతం.
నిర్మల్ జిల్లాలోని కడెం నదిపై ఉన్న కుంతల జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది సుమారు 147 అడుగుల (45మీటర్లు) ఎత్తు నుండి పడుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
జాతీయ వరి పరిశోధనా సంస్థ (NRRI) ఎక్కడ ఉంది?
రాజేంద్రనగర్ (హైదరాబాద్).
కటక్ (ఒడిశా).
మనీలా (ఫిలిప్పీన్స్).
కర్నాల్ (హర్యానా).
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) పరిధిలోని జాతీయ వరి పరిశోధనా సంస్థ (NRRI) ఒడిశాలోని కటక్ లో ఉంది. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో 'అంతర్జాతీయ' వరి పరిశోధనా సంస్థ (IRRI) ఉండగా, హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ లో 'భారతీయ వరి పరిశోధనా సంస్థ' (IIRR) ఉంది.
భారత రాజ్యాంగ రచనకు పట్టిన మొత్తం సమయం ఎంత?
2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
3 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు.
2 సంవత్సరాల, 11 నెలల, 8 రోజులు.
3 సంవత్సరాల, 11 నెలల, 8 రోజులు.
భారత రాజ్యాంగం రూపొందించడానికి ఖచ్చితంగా 2సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల సమయం పట్టింది. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరగ్గా, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది.
ఫిరోజ్ షా కోట్లా మైదానం ఎక్కడ కలదు?
ముంబై.
కోల్‌కతా.
న్యూఢిల్లీ.
అహ్మదాబాద్.
ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ మైదానం న్యూఢిల్లీలో ఉంది. దీనిని ప్రస్తుతం 'అరుణ్ జైట్లీ స్టేడియం' అని పిలుస్తున్నారు. భారత మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జ్ఞాపకార్థం 2019లో అధికారికంగా ఈ పేరు మార్చారు.
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
1931.
1935.
1949.
1950.
హిల్టన్ యంగ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏప్రిల్ 1,1935న ఆర్‌బిఐ (RBI) స్థాపించబడింది. 1937లో దీని ప్రధాన కార్యాలయాన్ని కోల్‌కతా నుండి ముంబైకి మార్చారు. ప్రారంభంలో ప్రైవేట్ బ్యాంకుగా ఉన్న దీనిని భారత ప్రభుత్వం 1949లో జాతీయం చేసి దేశ కేంద్ర బ్యాంకుగా గుర్తించింది.
గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు?
మహాత్మా గాంధీ.
జవహర్‌లాల్ నెహ్రూ.
రాజీవ్ గాంధీ.
ఇందిరా గాంధీ.
1971 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇందిరా గాంధీ గారు ఈ నినాదాన్ని ఇచ్చారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఐదవ పంచవర్ష ప్రణాళికలో దీనికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు.
బ్రహ్మసమాజమును స్థాపించిన వారు ఎవరు?
స్వామి వివేకానంద.
దయానంద సరస్వతి.
రాజారామ్ మోహన్‌రాయ్.
జ్యోతిరావు ఫూలే.
ఆధునిక భారత పునరుజ్జీవన పితామహుడిగా పేరుగాంచిన రాజారామ్ మోహన్‌రాయ్. 1828లో కలకత్తాలో బ్రహ్మసమాజాన్ని స్థాపించారు. సతీసహగమనం, బాల్య వివాహాలు వంటి సామాజిక దురాచారాలను రూపుమాపడానికి మరియు ఏకేశ్వరోపాసనను ప్రచారం చేయడానికి ఆయన ఈ సంస్థను నెలకొల్పారు.
స్టాచ్యూ అఫ్ లిబర్టీ ఎక్కడ కలదు?
లండన్.
న్యూయార్క్.
పారిస్.
బెర్లిన్.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న లిబర్టీ ఐలాండ్‌లో ఉంది. దీనిని ఫ్రాన్స్ దేశం అమెరికాకు స్నేహపూర్వక బహుమతిగా ఇచ్చింది.
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
తుంగభద్ర.
ప్రాణహిత.
గోదావరి.
కృష్ణా నది.
ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం అయిన నాగార్జున సాగర్ ప్రాజెక్టును నల్గొండ మరియు గుంటూరు జిల్లాల సరిహద్దులో కృష్ణా నదిపై నిర్మించారు. ఈ బహుళార్థసాధక ప్రాజెక్టును 1955లో ప్రారంభించగా, ఇది రెండు రాష్ట్రాల వ్యవసాయ మరియు విద్యుత్ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
IPL చరిత్రలో అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్లు ఏవి?
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.
చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్లు అత్యధికంగా చెరో 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ 3 టైటిళ్లతో తర్వాతి స్థానంలో ఉంది.
భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది?
చిల్కా సరస్సు.
పులికాట్ సరస్సు.
ఊలార్ సరస్సు.
కొల్లేరు సరస్సు.
జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న ఊలార్ సరస్సు భారతదేశంలోనే అతిపెద్ద సహజసిద్ధమైన మంచినీటి సరస్సు. ఇది జీలం నది ద్వారా నీటిని పొందుతుంది మరియు ఆసియా ఖండంలోని అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఏకగ్రీవంగా ఎన్నికైన భారత రాష్ట్రపతి ఎవరు?
డా. రాజేంద్ర ప్రసాద్.
డా. ఎస్. రాధాకృష్ణన్.
వి.వి. గిరి.
నీలం సంజీవరెడ్డి.
1977లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఆయనే. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
Need different questions
TG court subardinator model paper in telugu and english