Office Subordinate and Process Server | Free Online Model Paper 18 (Part 1)| Telangana Court Jobs Exams


📝 మొత్తం ప్రశ్నలు: 25 (జనరల్ నాలెడ్జ్).

⏱️ సమయం: 40 నిమిషాలు.

🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.

🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 25
🟢 0 🔴 0
40:00
భారతదేశపు తొలి వార్తాపత్రిక ఏది?
మద్రాస్ కూరియర్.
బొంబాయి గెజిట్.
హికీస్ బెంగాల్ గెజిట్.
ఇండియా గెజిట్.
1780 జనవరి 29న జేమ్స్ అగస్టస్ హికీ కలకత్తా నుండి 'హికీస్ బెంగాల్ గెజిట్' అనే వారపత్రికను ప్రారంభించారు. ఇది భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే ప్రచురించబడిన మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక.
వరల్డ్ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ ఎవరు?
సక్లైన్ ముస్తాక్.
చేతన్ శర్మ.
బ్రెట్ లీ.
చామిందా వాస్.
ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రికెటర్ భారతదేశానికి చెందిన చేతన్ శర్మ. ఇతడు 1987 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌ తో జరిగిన మాచ్ లో కెన్ రూథర్‌ఫోర్డ్, ఇయాన్ స్మిత్ మరియు ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ప్రపంచ కప్ చరిత్రలో తొలి హ్యాట్రిక్ సాధించాడు.
భారతదేశంలో అతి చిన్న నది ఏది?
సబర్మతి నది.
అర్వారీ నది.
శరావతి నది.
కావేరి నది.
భారతదేశంలోని అతి చిన్న నది అర్వారీ నది. ఇది రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ప్రవహించే చిన్న నది. దీని పొడవు కేవలం 45 కిమీ. మాత్రమే. ఈ నది 60 సంవత్సరాల పాటు ఎండిపోయిన తర్వాత, స్థానిక ప్రజల భాగస్వామ్యం మరియు నీటి సంరక్షణ పద్ధతుల వల్ల తిరిగి జీవం పోసుకుంది.
భారత్‌లో రాష్ట్రపతిపాలన విధించబడిన తొలి రాష్ట్రం ఏది?
పంజాబ్.
గుజరాత్.
మహారాష్ట్ర.
కర్ణాటక.
భారతదేశంలో మొదటిసారిగా పంజాబ్‌లో ఆర్టికల్ 356 ప్రకారం 1951 జూన్ 20న రాష్ట్రపతి పాలన విధించబడింది. 1952 ఏప్రిల్ 17 వరకు 302 రోజులపాటు ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల కారణంగా దీనిని విధించారు.
టి.ఎన్. కృష్ణన్ ఏ ప్రముఖ సంగీత వాయిద్య విద్వాంసుడు?
వీణ.
మృదంగం.
ఫ్లూట్.
వయోలిన్.
'త్రిప్పునితుర నారాయణయ్యర్ కృష్ణన్' (టి.ఎన్. కృష్ణన్) కేరళలో జన్మించిన ప్రముఖ కర్ణాటక సంగీత వయోలిన్ విద్వాంసులు. చెన్నైలో స్థిరపడిన ఆయన, లాల్గుడి జయరామన్ మరియు ఎం.ఎస్. గోపాలకృష్ణన్‌లతో కలిసి "కర్ణాటక సంగీత వయోలిన్ త్రిమూర్తులు"గా ప్రసిద్ధి చెందారు.
'వంగల' పండుగ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
సిక్కిం.
అస్సాం.
మేఘాలయ.
మణిపూర్.
'వంగల' పండుగను మేఘాలయలోని గారో తెగ ప్రజలు పంట చేతికి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారు, దీనిని 'వంద డ్రమ్ముల పండుగ' అని కూడా పిలుస్తారు. సూర్యదేవుడైన 'సల్జోంగ్'కు కృతజ్ఞతగా వంద డప్పుల మోతతో ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు.
రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఎవరు?
సత్యజిత్ రే.
భాను అథయా.
ఏ.ఆర్. రెహ్మాన్.
రసూల్ పూకుట్టి.
రెండు ఆస్కార్ అవార్డులు పొందిన తొలి భారతీయుడు ఏ.ఆర్. రెహ్మాన్. అతను 2009లో 81వ ఆస్కార్ (అకాడమీ) అవార్డ్స్‌లో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' చిత్రానికి "బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్" మరియు "బెస్ట్ ఒరిజినల్ సాంగ్" విభాగాలలో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నాడు.
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో ఉన్నాయి?
భాగం III.
భాగం IV.
భాగం V.
భాగం VI.
ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంలోని Part-IV లో ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు పొందుపరచ బడ్డాయి. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఇవి దేశంలో సామాజిక-ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడానికి మార్గదర్శకాలుగా పనిచేస్తాయి కానీ వీటికి న్యాయ సంరక్షణ లేదు.
భారతదేశపు తొలి స్వదేశీ కలర్ సినిమా ఏది?
రాజా హరిశ్చంద్ర.
లవకుశ.
మదర్ ఇండియా.
కిసాన్ కన్యా.
భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రంగుల సినిమా 1937లో విడుదలైన కిసాన్ కన్యా. మోతీ గిద్వానీ దర్శకత్వం వహించి, అర్దేశిర్ ఇరానీ నిర్మించిన ఈ హిందీ చిత్రం, సినీకలర్ ప్రక్రియను ఉపయోగించి పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, భారతదేశంలోనే రూపొందించబడింది.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి (Executive Head) ఎవరు?
రాష్ట్ర గవర్నర్.
ముఖ్యమంత్రి.
శాసనసభ స్పీకర్.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 154 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలన్నీ గవర్నర్‌కు సంక్రమిస్తాయి, అందువల్ల ఆయనే రాష్ట్ర రాజ్యాంగబద్ధ అధిపతి. అయితే వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు మాత్రం ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి చేతిలో ఉంటాయి.
RBI గవర్నర్‌గా పనిచేసిన ఏకైక భారత ప్రధానమంత్రి ఎవరు?
పి. వి. నరసింహారావు.
మొరార్జీ దేశాయ్.
డాక్టర్ మన్మోహన్ సింగ్.
చరణ్ సింగ్.
ప్రముఖ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 1982 నుండి 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 15వ గవర్నర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన 2004 నుండి 2014 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించారు.
గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన తొలి భారతీయుడు ఎవరు?
డా. పి.కె. సేన్.
డా. పణంగిపల్లి వేణుగోపాల్.
డా. నగరూర్ గోపీనాథ్.
డా. శరత్ పాండే.
ఢిల్లీలోని ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి చెందిన ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ పణంగిపల్లి వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం 1994 ఆగస్టు 3న భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది.
లడఖ్ ప్రాంతంలో జరుపుకునే 'హేమిస్' పండుగ ఎవరికి సంబంధించింది?
హిందువులకు.
సిక్కులకు.
జైనులకు.
బౌద్ధులకు.
'హేమిస్' అనేది లడఖ్‌లో ప్రసిద్ధ టిబెటన్ బౌద్ధమత గురువైన గురు పద్మసంభవ జన్మదినం సందర్భంగా బౌద్ధులు జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవంలో బౌద్ధ సన్యాసులు రంగురంగుల ముసుగులు ధరించి చేసే సాంప్రదాయ 'చామ్' నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
“ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా” అని ఏ భారతీయ రాష్ట్రాన్ని పిలుస్తారు?
ఆంధ్రప్రదేశ్.
మహారాష్ట్ర.
తమిళనాడు.
పంజాబ్.
భారతదేశంలోనే అత్యధికంగా కోడిగుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడి అధునాతన పౌల్ట్రీ పరిశ్రమలు మరియు భారీ ఉత్పత్తి సామర్థ్యం కారణంగా దీనికి "ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా" (ఆసియా కోడిగుడ్ల గిన్నె) అనే పేరు వచ్చింది.
వానపాముల పెంపకాన్ని ఏమని పిలుస్తారు?
వర్మి కల్చర్.
సెరీ కల్చర్.
పిసి కల్చర్.
మోరి కల్చర్.
వానపాములను శాస్త్రీయ పద్ధతిలో పెంచి, వాటి ద్వారా సేంద్రీయ ఎరువును (వర్మి కంపోస్ట్) తయారు చేయడాన్ని వర్మి కల్చర్ అంటారు. మిగిలిన ఆప్షన్లలో సెరీ కల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం, పిసి కల్చర్ అంటే చేపల పెంపకం, మరియు మోరి కల్చర్ అంటే పట్టు పురుగుల ఆహారం కోసం మల్బరీ మొక్కల పెంపకం.
మణిపూర్ రాష్ట్ర రాజధాని ఏది?
కోహిమా.
ఐజ్వాల్.
ఇంఫాల్.
షిల్లాంగ్.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాజధాని ఇంఫాల్. ఇది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక కేంద్రంగా ఉంది. మిగిలిన ఆప్షన్లలోని కోహిమా నాగాలాండ్‌కు, ఐజ్వాల్ మిజోరాంకు మరియు షిల్లాంగ్ మేఘాలయ రాష్ట్రానికి రాజధానులుగా ఉన్నాయి.
'గాయత్రీ మంత్రం' ఋగ్వేదంలోని ఎన్నవ మండలంలో ఉంది?
1వ మండలం.
9వ మండలం.
5వ మండలం.
3వ మండలం.
గాయత్రీ మంత్రం ఋగ్వేదంలోని మూడవ మండలంలో ఉంది. సూర్య భగవానుడి రూపమైన 'సవితృ' (సావిత్రి) దేవతను స్తుతిస్తూ విశ్వామిత్ర మహర్షి ఈ మంత్రాన్ని రచించారు. దీనిని 'సావిత్రీ మంత్రం' మరియు 'బ్రహ్మ మంత్రం' అని కూడా పిలుస్తారు.
భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ ఎవరు?
ఫాతిమా బీవీ.
లీలా సేథ్.
అన్నా చాంది.
కార్నెలియా సోరాబ్జీ.
కార్నెలియా సోరాబ్జీ 1892లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించిన ప్రథమ మహిళ మరియు భారతదేశపు మొట్టమొదటి మహిళా న్యాయవాది (అడ్వకేట్). మిగిలిన ఆప్షన్లలో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి, లీలా సేథ్ హైకోర్టు మొదటి మహిళా చీఫ్ జస్టిస్, మరియు అన్నా చాంది భారతదేశపు మొదటి మహిళా న్యాయమూర్తి.
భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది?
శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్).
తుంభ (కేరళ).
హసన్ (కర్ణాటక).
బలాసోర్ (ఒడిశా).
భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని 1963లో కేరళలోని తిరువనంతపురం సమీపంలో గల తుంభ అనే ప్రాంతంలో స్థాపించారు. దీనిని 'తుంభ ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్' (TERLS) అని పిలుస్తారు, ఇక్కడి నుంచే 1963 నవంబర్ 21న దేశంలోనే తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించారు.
పింక్ సిటీ అఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
జోధ్‌పూర్.
ఉదయ్‌పూర్.
బికనేర్.
జైపూర్.
రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ నగరాన్ని "పింక్ సిటీ ఆఫ్ ఇండియా" అని పిలుస్తారు. 1876లో బ్రిటన్ యువరాజు (ప్రిన్స్ ఆఫ్ వేల్స్) విజిట్ చేసినప్పుడు, వారికి స్వాగతం పలుకుతూ అప్పటి రాజు మహారాజా సవాయ్ రామ్ సింగ్ నగరం మొత్తానికి గులాబీ రంగు వేయించారు. అప్పటి నుండి దీనికి ఈ పేరు వచ్చింది.
'ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్'ను స్థాపించింది ఎవరు?
వారెన్ హేస్టింగ్స్.
సర్ విలియం జోన్స్.
రాజా రామ్మోహన్ రాయ్.
లార్డ్ విలియం బెంటింక్.
సర్ విలియం జోన్స్ 1784 జనవరి 15న కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో 'ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్'ను స్థాపించారు. అప్పటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ మద్దతుతో ఆసియా ఖండపు ప్రాచీన చరిత్ర, సంస్కృతి, మరియు విజ్ఞానాన్ని పరిశోధించడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ ఏ ప్రసిద్ధ భారతీయ వాయిద్య విద్వాంసుడు?
సారంగి.
సితార్.
సరోద్.
షెహనాయ్.
ఉస్తాద్ సుల్తాన్ ఖాన్ భారతదేశానికి చెందిన అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన సారంగి విద్వాంసుడు మరియు శాస్త్రీయ సంగీత గాయకుడు. భారతీయ సంగీత రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను 2010లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
జాతీయ విద్యా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
నవంబర్ 11.
సెప్టెంబర్ 5.
నవంబర్ 14.
అక్టోబర్ 5.
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న 'జాతీయ విద్యా దినోత్సవం' జరుపుకుంటారు. (సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, నవంబర్ 14న బాలల దినోత్సవం, మరియు అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం).
కుక్కల పట్ల ఉండే విపరీతమైన భయాన్ని ఏమని పిలుస్తారు?
ఫెలినోఫోబియా.
జూఫోబియా.
సైనోఫోబియా.
అక్రోఫోబియా.
కుక్కల పట్ల ఉండే తీవ్రమైన భయాన్ని 'సైనోఫోబియా' అంటారు. మిగిలిన ఆప్షన్లలో ఫెలినోఫోబియా అంటే పిల్లుల పట్ల భయం, జూఫోబియా అంటే సాధారణంగా జంతువుల పట్ల భయం మరియు అక్రోఫోబియా అంటే ఎత్తైన ప్రాంతాల పట్ల ఉండే భయం.
గుండె మరియు దానికి సంబంధించిన వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
నెఫ్రాలజీ.
కార్డియాలజీ.
హెపటాలజీ.
డెర్మటాలజీ.
గుండె మరియు దానికి సంబంధించిన వ్యాధుల అధ్యయనాన్ని 'కార్డియాలజీ' అంటారు, ఈ రంగానికి చెందిన నిపుణులను 'కార్డియాలజిస్ట్' అని పిలుస్తారు. మిగిలిన ఆప్షన్లలో నెఫ్రాలజీ మూత్రపిండాల గురించి, హెపటాలజీ కాలేయం గురించి, డెర్మటాలజీ చర్మం గురించి అధ్యయనం చేస్తాయి.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Model Paper 18 (Part 1): Office Subordinate and Process Server | Telangana Court Jobs Exams

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top