భారత రాజ్యాంగం – Part 4


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది ఆర్టికల్స్ పరిశీలించండి:
  1. సమానత్వపు హక్కు: ఆర్టికల్స్ 14-18.
  2. పీడనాన్ని నిరోధించే హక్కు: ఆర్టికల్స్ 23-24.
  3. స్వాతంత్ర్యపు హక్కు: ఆర్టికల్స్ 25-28.
  4. మతస్వాతంత్ర్యపు హక్కు: ఆర్టికల్స్ 19-22.
పైవాటిలో సరికానివి ఏవి?
A మరియు C మాత్రమే.
A, C మరియు D మాత్రమే.
B, C మరియు D మాత్రమే.
C మరియు D మాత్రమే.
ఆర్టికల్స్ 25-28 మతస్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించినవి. ఆర్టికల్స్ 19-22 స్వాతంత్ర్యపు హక్కుకి సంబంధించినవి. ఆర్టికల్స్ 14-18 సమానత్వపు హక్కుకు సంబంధించినవి. ఆర్టికల్స్ 23-24 పీడనాన్ని నిరోధించే హక్కుకు సంబంధించినవి.
క్రిందివాటిని పరిశీలించండి:
  1. ఆర్టికల్ 338 – జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఏర్పాటు.
  2. ఆర్టికల్ 339 – జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఏర్పాటు.
  3. ఆర్టికల్ 340 – వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు.
పై వాటిలో సరైనవి ఏవి?
A మరియు B మాత్రమే సరైనవి.
B మరియు C మాత్రమే సరైనవి.
A మరియు C మాత్రమే సరైనవి.
A, B, C అన్నీ సరైనవే.
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (STs) ఏర్పాటు గురించి ఆర్టికల్ 338-A లో ఉంది. ఇది 89వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఏర్పాటు చేయబడింది. ఆర్టికల్ 338 షెడ్యూల్డ్ కులాల (SCs) జాతీయ కమిషన్ ఏర్పాటు, ఆర్టికల్ 340 వెనుకబడిన తరగతుల కమిషన్‌ను (BCs) ఏర్పాటుకు సంబంధించినది.
భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ VII దేనికి సంబంధించింది?
కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార విభజన.
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం.
షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాలలో పరిపాలన.
భూసంస్కరణలకు సంబంధించిన అంశాలు.
భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజనను స్పష్టంగా నిర్దేశించారు. ఈ షెడ్యూల్‌లో మూడు జాబితాలు ఉంటాయి. అవి కేంద్ర జాబితా (Union List), రాష్ట్ర జాబితా (State List) మరియు ఉమ్మడి జాబితా (Concurrent List).
క్రింది వారిలో సుప్రీం కోర్ట్ యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
ఎం. పతంజలి శాస్త్రి.
ఎం.సి. మహాజన్.
హెచ్. జె. కానియా.
బి.పి. సిన్హా.
భారత సుప్రీం కోర్ట్ యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తిగా హెచ్. జె. కానియా 1950 జనవరి 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్వతంత్ర భారత న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలు ప్రసిద్ధమైనవి. ఆయన ఆధ్వర్యంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి.
క్రిందివాటిలో సాంస్కృతిక విద్యావిషయక హక్కును గురించే తెలియజేసే ఆర్టికల్స్ ఏవి?
ఆర్టికల్స్ 28-29.
ఆర్టికల్స్ 29-30.
ఆర్టికల్స్ 30-31.
ఆర్టికల్స్ 31-32.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు ఆర్టికల్ 30 సాంస్కృతిక మరియు విద్యావిషయక హక్కులను తెలియజేస్తాయి. ఆర్టికల్ 29: ఏదైనా వర్గం తమ ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 30: మైనారిటీ వర్గాలకు విద్యాసంస్థలను స్థాపించి, నిర్వహించుకునే హక్కును అందిస్తుంది.
క్రింది వాటిలో పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని సూచించిన కమిటీ ఏది?
ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ.
అశోక్ మెహతా కమిటీ.
జి.వి.కే. రావు కమిటీ.
బల్వంతరాయ్ మెహతా కమిటీ.
పంచాయితీరాజ్ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వీ కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పిస్తూ వాటిని పటిష్టంగా అమలు చేయాలని సూచించింది. పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణలు పార్లమెంటు ఆమోదం పొంది చట్టాలుగా మారాయి.
క్రిందివాటిలో ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యుల్డ్ కులాలకు (SC) రిజర్వ్ అయిన లోకసభ స్థానాలకు సంబంధించి తప్పుగా ఉన్నది ఏది?
అమలాపురం.
చిత్తూరు.
తిరుపతి.
అరకు.
అరకు లోకసభ స్థానం ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యుల్డ్ కులాలకు కాకుండా షెడ్యూల్డ్ తెగలకు (ST) రిజర్వ్ చేయబడింది. అమలాపురం, బాపట్ల, చిత్తూరు మరియు తిరుపతి లోకసభ స్థానాలు షెడ్యుల్డ్ కులాలకు (SC) రిజర్వ్ చేయబడ్డాయి.
లోకసభ సభ్యుడిగా పోటీ చేయడానికి క్రింది అర్హతలను పరిశీలించండి:
  1. భారత పౌరుడై ఉండాలి.
  2. 25 సంవత్సరాలు నిండి ఉండాలి.
  3. 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
  4. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలలో ఆదాయం వచ్చే ఉద్యోగంలో ఉండరాదు.
పై వాటిలో సరైనవి ఏవి?
A మరియు B మాత్రమే.
A మరియు C మాత్రమే.
A, B మరియు D మాత్రమే.
A, C మరియు D మాత్రమే.
లోకసభకు పోటీ చేసేందుకు అభ్యర్థి భారత పౌరుడు అయి ఉండాలి, కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలలో ఆదాయం వచ్చే లాభదాయక ఉద్యోగంలో ఉండరాదు. అయితే 30 సంవత్సరాల వయస్సు అనేది రాజ్యసభకు వర్తిస్తుంది. ఈ అర్హతలు Article 84 మరియు Representation of People Act, 1951 ప్రకారం ఉన్నాయి.
భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం పొందుతారు?
ఆర్టికల్ 123.
ఆర్టికల్ 213.
ఆర్టికల్ 356.
ఆర్టికల్ 226.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 ప్రకారం, రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్‌లను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. ఇది రాష్ట్ర పరిపాలనలో తాత్కాలిక చట్టాలను అమలు చేసే సాధనంగా ఉపయోగపడుతుంది. ఆర్టికల్ 123 భారత రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం, ఆర్టికల్ 356 రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను, ఆర్టికల్ 226 హైకోర్టుల ప్రత్యేక అధికారాలను పేర్కొంటుంది.
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి:
  1. రాష్ట్రపతి అధికారాలను విస్తరించడం.
  2. రాజకీయ పార్టీలు ఎక్కువగా రావడాన్ని ప్రోత్సహించడం.
  3. ప్రజాస్వామ్యంలో స్థిరత్వం మరియు పార్టీ క్రమశిక్షణను పరిరక్షించడం.
పై వాటిలో పార్టీ ఫిరాయింపులను నిరోధించే చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
C మాత్రమే.
A మాత్రమే.
B మాత్రమే.
B మరియు C మాత్రమే.
పదవ షెడ్యూల్‌లో పేర్కొన్న పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రధానంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ స్థిరత్వాన్ని, పార్టీ క్రమశిక్షణను పరిరక్షించేందుకు రూపొందించబడింది. ఇది అధికారం కోసం సభ్యులు పార్టీ మారే చర్యలను నివారిస్తుంది. ఇది 1985లో పదవ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. ఈ చట్టం సభ్యులు తమ పార్టీ మారడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో అస్థిరతను కలిగించకుండా నిరోధిస్తుంది.
క్రింది వాక్యాలను పరిశీలించండి:
  1. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ.
  2. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు.
  3. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.
పైన పేర్కొన్న వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
A. మాత్రమే.
B. మాత్రమే.
C. మాత్రమే.
A మరియు C మాత్రమే.
బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్‌కు 2023 ఫిబ్రవరి 12 వరకు గవర్నర్‌గా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆయన స్థానంలో ఎస్. అబ్దుల్ నజీర్ గవర్నర్‌గా ఉన్నారు. శారదా ముఖర్జీ 1977–78లో ఆంధ్రప్రదేశ్ కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు. ఆమె 1947-49 మధ్య కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి:
  1. ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినవారు – నారా చంద్రబాబు నాయుడు.
  2. అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినవారు – నాదెండ్ల భాస్కర్ రావు.
  3. అతి చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయినవారు – దామోదరం సంజీవయ్య.
పైన పెర్కొన్నవాటిలో సరైనవి ఏవి?
A మరియు B మాత్రమే సరైనవి.
A మరియు C మాత్రమే సరైనవి.
B మరియు C మాత్రమే సరైనవి.
A, B, C అన్నీ సరైనవే.
నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1995 నుండి 2004 వరకు ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. నాదెండ్ల భాస్కర్ రావు 1984లో కేవలం ఒక నెల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇది అతి తక్కువ కాలం. దామోదరం సంజీవయ్య 1960లో 39 సంవత్సరాల వయస్సులోనే ముఖ్యమంత్రి అయ్యారు, ఇది అతి చిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన సందర్భం.
న్యాయస్థానాలు జారీ చేసే రిట్లకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి:
  1. మాండమస్ – ప్రభుత్వ అధికారిని తన విధి నిర్వర్తించమని ఆదేశించే రిట్.
  2. కో వారంటో – పదవికి అర్హత లేని వ్యక్తిని పదవి నుండి తొలగించే రిట్.
  3. ప్రొహిబిషన్ – దిగువ కోర్టును తన పరిధిని మించకుండా ఆపే రిట్.
  4. సెర్షియోరరీ – నిర్భందించబడిన వ్యక్తిని కోర్టు ముందు హాజరు పరచమని జారీ చేసే రిట్.
పైవాటిలో తప్పుగా ఉన్నవాటిని గుర్తించండి?
A మరియు B మాత్రమే.
B మరియు C మాత్రమే.
C మరియు D మాత్రమే.
D మాత్రమే.
సెర్షియోరరీ అనగా ‘సుపీరియర్ లేదా To be certified’ అని అర్ధం. దిగువ కోర్టులో జరుగుతున్న కేసు విచారణను తక్షణం నిలిపివేసి, ఆ కేసును తనకుగాని లేదా మరొక కోర్టుకు గాని బదిలీ చేయాలని ఆదేశిస్తూ జారీ చేసే రిట్ ను సెర్షియోరరీ అంటారు. సాధారణంగా రిట్ ను ప్రొహిబిషన్ రిట్ తో కలిపి జారీ చేస్తారు. కొన్ని రకాల కేసులకు తొలి దశలో ప్రొహిబిషన్, చివరి దశలో సెర్షియోరరీ రిట్లు వర్తిస్తాయి. అందుకే ఈ రెండు రిట్లను జుడీషియల్ రిట్లు అంటారు.
భారత రాజ్యాంగంలోని భాగాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి:
  1. 9వ భాగం – పంచాయతీరాజ్ వ్యవస్థ.
  2. 9A భాగం – అధికార భాషలు.
  3. 15వ భాగం – ఎన్నికల వ్యవస్థ.
  4. 2వ భాగం – పౌరసత్వం.
పై వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి.
A మాత్రమే.
B మాత్రమే.
C మాత్రమే.
C మరియు D మాత్రమే.
భారత రాజ్యాంగంలోని 9A భాగం "నగర పాలక సంస్థలు"కు సంబంధించినది. అధికార భాషల గురించి రాజ్యాంగంలోని 17వ భాగంలో వివరించబడింది. 9వ భాగం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినది, 15వ భాగం ఎన్నికల వ్యవస్థకు సంబంధించినది, 2వ భాగం పౌరసత్వానికి సంబంధించినది.
క్రింది వాటిని పరిశీలించండి:
  1. ఎగువ సభ.
  2. దిగువ సభ.
  3. కౌన్సిల్ అఫ్ స్టేట్స్.
  4. శాశ్వత సభ.
పై వాటిలో రాజ్యసభను ఏ పేర్లతో పిలుస్తారు?
A మరియు C మాత్రమే.
B మరియు D మాత్రమే.
A, C మరియు D మాత్రమే.
B, C మరియు D మాత్రమే.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 రాజ్యసభను గురించి తెలియజేస్తుంది. ఈ సభను "ఎగువ సభ"గా, "కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (Council of States)"గా, పెద్దల సభగా మరియు "శాశ్వత సభ"గా కూడా పిలుస్తారు. అయితే "దిగువ సభ" అని లోక్ సభను పిలుస్తారు.
క్రిందివాటిని పరిశీలించండి:
  1. 42వ రాజ్యాంగ సవరణ (1976) ప్రకారం, మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి.
  2. 44వ రాజ్యాంగ సవరణ (1978) ప్రకారం, మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపవచ్చు.
పై వాటిలో:
A మరియు B రెండూ తప్పు.
A మరియు B రెండూ సరైనవి.
A మాత్రమే సరైనది.
B మాత్రమే సరైనది.
1976 లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం కేంద్ర మంత్రిమండలి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనను తీసుకొచ్చారు. అయితే 1978 లో మొరార్జీదేశాయ్ ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాను ఒకసారి పునఃపరిశీలనకై మంత్రివర్గానికి తిరిగి పంపే అధికారం రాష్ట్రపతికి కల్పించారు. అయితే మంత్రిమండలి అదే తీర్మానాన్ని రెండవసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
భారత రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే, ఆ రాజీనామాను ఎవరికి సమర్పించాలి?
లోక్‌సభ స్పీకర్.
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా.
ప్రధాన మంత్రి.
ఉప రాష్ట్రపతి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 56 ప్రకారం రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే, ఆ రాజీనామాను ఉప రాష్ట్రపతికి సమర్పించాలి. రాష్ట్రపతి స్థానం ఖాళీ అయినపుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉప రాష్ట్రపతి బాధ్యతలు తీసుకుంటాడు, అందువల్ల అధికారికంగా ఆయనకే రాజీనామా సమర్పించాలి. ఒకవేళ ఉప రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఆ రాజీనామాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు సమర్పించాలి.
1984లో N.T. రామారావును ముఖ్యమంత్రి పదవినుండి తొలగించి, ఆ స్థానంలో నాదెండ్ల భాస్కర్ రావును నియమించిన అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరు?
రామ్ లాల్.
కృష్ణకాంత్.
శంకర్ దయాల్ శర్మ.
కుముద్ బెన్ జోషి.
1984లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్, నైతిక మెజార్టీ లేదని ఆరోపిస్తూ N.T. రామారావును ముఖ్యమంత్రి పదవినుండి తొలగించారు. ఆయన స్థానంలో నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా నియమించడంతో రాజ్యాంగపరమైన మరియు ప్రజాస్వామ్య పరమైన అభ్యంతరాలు తలెత్తాయి. ఇది రాజ్యాంగ పరమైన చర్చలకు దారి తీసిన వివాదాస్పద నిర్ణయంగా మారింది.
రాజ్యసభలో అత్యధిక స్థానాలు కలిగి ఉన్న రాష్ట్రం ఏది?
ఉత్తరప్రదేశ్.
మహారాష్ట్ర.
తమిళనాడు.
పశ్చిమ బెంగాల్.
రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ అత్యధిక స్థానాలను కలిగి ఉంది. మొత్తం 31 స్థానాలతో, ఇది భారతదేశంలో రాజ్యసభలో అత్యధిక ప్రాతినిధ్యం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. తరువాత రెండవ స్థానంలో మహారాష్ట్ర 19 స్థానాలు, మూడవ స్థానంలో తమిళనాడు 18 స్థానాలు, నాలుగవ స్థానంలో పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ 16 స్థానాలు కలిగి ఉన్నాయి.
క్రిందివాటిలో తప్పుగా జతపరచబడినదాన్ని గుర్తించండి:
లోకసభ మొదటి స్పీకర్ – జి. వి. మౌలాంకర్.
రాజ్యసభ మొదటి చైర్మన్ – జాకీర్ హుస్సేన్.
లోకసభ మొదటి డిప్యూటీ స్పీకర్ – అనంతశయనం అయ్యంగార్.
రాజ్యసభ మొదటి ఉపసభాపతి – ఎస్. వి. కృష్ణమూర్తి రావు.
రాజ్యసభ మొదటి చైర్మన్ భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డా. ఎస్. రాధాకృష్ణన్ గారు. జి. వి. మౌలాంకర్ లోకసభ మొదటి స్పీకర్. అనంతశయనం అయ్యంగార్ లోకసభ మొదటి డిప్యూటీ స్పీకర్. ఎస్. వి. కృష్ణమూర్తి రావు రాజ్యసభ మొదటి ఉపసభాపతి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top