భారత రాజ్యాంగం – Part 5


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
భారత రాజ్యాంగం ఇతర దేశాల రాజ్యాంగాలనుండి గ్రహించిన క్రింది అంశాలను పరిశీలించండి:
  1. బ్రిటన్ రాజ్యాంగం – సమన్యాయ పాలన.
  2. అమెరికా రాజ్యాంగం – ఆదేశిక సూత్రాలు.
  3. ఐర్లాండ్ రాజ్యాంగం – ప్రాథమిక హక్కులు.
  4. ఆస్ట్రేలియా రాజ్యాంగం – ఉమ్మడి జాబితా.
పై వాటిలో సరైనవి ఏవి?
A మరియు D మాత్రమే.
C మరియు D మాత్రమే.
A మరియు B మాత్రమే.
B మరియు C మాత్రమే.
భారత రాజ్యాంగం బ్రిటన్ నుండి:- సమన్యాయ పాలన, క్యాబినెట్ ప్రభుత్వం, ఏక పౌరసత్వం మొదలగు అంశాలను, ఆస్ట్రేలియా నుండి:- ఉమ్మడి జాబితా, ఉభయ సభల సంయుక్త సమావేశం, ఐర్లాండ్ నుండి:- ఆదేశిక సూత్రాలు, రాష్టపతి ఎన్నిక విధానం, అమెరికా నుండి:- ప్రాథమిక హక్కులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, న్యాయసమీక్ష, రాష్ట్రపతి తొలగింపు పద్ధతి మొదలైనవి స్వీకరించబడ్డాయి.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు?
రాష్ట్ర గవర్నర్.
ముఖ్యమంత్రి.
రాష్ట్రపతి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ మరియు సభ్యులను రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు, కానీ ఇది సిఫారసు కమిటీ సూచనల ఆధారంగా జరుగుతుంది. ఆ సిఫారసు కమిటీలో: రాష్ట్ర ముఖ్యమంత్రి (అధ్యక్షుడు), రాష్ట్ర హోం మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు.
ప్రాథమిక విధులకు సంబంధించి క్రిందివాటిని పరిశీలించండి:
  1. జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
  2. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి.
  3. 6 – 14 సంవత్సరాల లోపు పిల్లలకు విద్యావకాశాలను కల్పించాలి.
  4. దేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడాలి.
పై వాటిలో సరైనవి ఏవి?
A, B, C మాత్రమే.
B, C, D మాత్రమే.
A, C, D మాత్రమే.
A, B, C, D అన్నీ సరైనవే.
ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని 4A భాగంలోని ఆర్టికల్ 51-A లో చేర్చబడ్డాయి. జాతీయ చిహ్నాలను గౌరవించడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, హింసను విడనాడడం, భారతదేశ సంస్కృతిని మరియు వారసత్వాన్ని కాపాడడం మొదలైనవి. మొదట రాజ్యాంగంలో 10 ప్రాథమిక విధులు మాత్రమె ఉండేవి. అయితే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కును కల్పించడాన్ని 11వ ప్రాథమిక విధిగా చేర్చినారు.
క్రిందివాటిలో నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 4
ఆర్టికల్ 2
ఆర్టికల్ 1
ఆర్టికల్ 3
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం, పార్లమెంటు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చు లేదా ఉన్న రాష్ట్రాలను విభజించవచ్చు, పేర్లు మార్చవచ్చు, రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు, రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ రాష్ట్రాల అభిప్రాయాన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుంది. ఇది రాష్ట్రాల పునర్విభజనలో కీలకపాత్ర పోషిస్తుంది.
గవర్నర్లుగా పనిచేసిన రాష్ట్రపతులకు సంబంధించి క్రింది పేర్లను పరిశీలించండి:
  1. ద్రౌపదీ ముర్ము.
  2. ప్రతిభా పాటిల్.
  3. తమిళిసై సౌందరరాజన్.
  4. రామ్‌నాథ్ కోవింద్.
సరైనవాటిని గుర్తించండి:
A, B, C మాత్రమే.
A, B, D మాత్రమే.
B, C, D మాత్రమే.
A, C, D మాత్రమే.
ద్రౌపదీ ముర్ము జార్ఖండ్ గవర్నర్‌గా (2015–2021) పనిచేశారు, తరువాత 2022లో భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ప్రతిభా పాటిల్ రాజస్థాన్ గవర్నర్‌గా (2004–2007) పనిచేశారు, తరువాత భారత రాష్ట్రపతిగా (2007–2012) ఎన్నికయ్యారు. రామ్‌నాథ్ కోవింద్ బీహార్ గవర్నర్‌గా (2015–2017) పనిచేశారు, తరువాత రాష్ట్రపతిగా (2017–2022) ఎన్నికయ్యారు. తమిళిసై సౌందరరాజన్ – తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు, కానీ రాష్ట్రపతిగా పనిచెయలేదు.
ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరీ రిట్లను క్రిందివాటిలో ఎవరిపై జారీ చేస్తారు?
ప్రభుత్వ సంస్థలు, అధికారులు.
క్రింది కోర్టులు.
ప్రైవేటు సంస్థలు, అధికారులు.
పైవన్నీ సరైనవే.
ప్రొహిబిషన్ మరియు సెర్షియోరరీ అనే రిట్లు ముఖ్యంగా క్రింది కోర్టులు లేదా ట్రిబ్యూనల్స్ తమ అధికార పరిధిని మించితే లేదా న్యాయ విరుద్ధంగా పని చేస్తే వాటిపై ఉన్నత న్యాయస్థానాలు జారీ చేస్తాయి. ఇవి పరిపాలనా నియంత్రణలో భాగంగా వినియోగించబడతాయి.
నరేంద్ర మోదీకి సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి:
  1. UNO లో మొదటిసారి హిందీలో ప్రసంగించిన ప్రధాని.
  2. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి ప్రధానమంత్రి పదవిని పొందిన మొదటి వ్యక్తి.
  3. 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పై వాటిలో సరైనవి ఏవి?
B, C మాత్రమే.
A, C మాత్రమే.
A, B మాత్రమే.
A, B, C అన్నీ సరైనవే.
నరేంద్ర మోదీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించి ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి. 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ను ప్రారంభించారు. అయితే UNOలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కాగా రెండవ ప్రధాని నరేంద్ర మోదీ.
రాజ్యాంగ పరిషత్ యొక్క క్రింది కమిటీలను పరిశీలించండి.
  1. ప్రాథమికహక్కుల సబ్ కమిటీ – హెచ్.సి. ముఖర్జీ.
  2. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమitee – జె.బి. కృపలానీ.
  3. స్టీరింగ్ కమిటీ – డా. రాజేంద్రప్రసాద్.
  4. ముసాయిదా కమిటీ – డా. బి. ఆర్. అంబేద్కర్.
పైవాటిలో సరైనవి ఏవి?
A, B, C మాత్రమే.
B, C, D మాత్రమే.
C, D మాత్రమే.
A, B, C, D అన్నీ సరైనవే.
రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ మొత్తం 22 కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో 10 విధాన నిర్ణాయక కమిటీలు మరియు 12 విషయ నిర్ణాయక కమిటీలు. స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్, ముసాయిదా కమిటీకి అధ్యక్షుడు డా. బీఆర్ అంబేద్కర్. ప్రాథమికహక్కుల సబ్ కమిటీకి అధ్యక్షుడు జె.బి. కృపలానీ మరియు అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీకి అధ్యక్షుడు హెచ్. సి. ముఖర్జీ.
భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం ఎంత?
1 సంవత్సరం 10 నెలల 22 రోజులు.
2 సంవత్సరాల 8 నెలల 16 రోజులు.
3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.
రాజ్యాంగ సభ 1946 డిసెంబరులో ప్రారంభమై 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ ప్రక్రియకు మొత్తం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మొత్తం 11 సమావేశాలలో 165 రోజుల పాటు చర్చలు జరిగాయి. రాజ్యాంగ రచనకై రాజ్యాంగ పరిషత్ దాదాపుగా 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసింది. భారత రాజ్యాంగ రచనకు అయిన ఖర్చు సుమారు 64 లక్షల రూపాయలు.
స్వతంత్ర భారత మొట్టమొదటి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి:
  1. హోంశాఖ మంత్రి – సర్దార్ వల్లభాయ్ పటేల్.
  2. న్యాయశాఖ మంత్రి – బి.ఆర్. అంబేద్కర్.
  3. ఆరోగ్యశాఖ మంత్రి – రాజకుమారి అమృత్ కౌర్.
  4. విద్యాశాఖ మంత్రి – బల్‌దేవ్ సింగ్.
పై వాటిలో తప్పుగా జతచేయబడినది ఏది?
D మాత్రమే.
C మాత్రమే.
B మాత్రమే.
A మాత్రమే.
స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్. బల్‌దేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. హోంశాఖ మంత్రి - సర్దార్ వల్లభాయ్ పటేల్; న్యాయశాఖ మంత్రి - బి.ఆర్. అంబేద్కర్; ఆరోగ్యశాఖ మంత్రి - రాజకుమారి అమృత్ కౌర్; ఆర్థికశాఖ మంత్రి - ఆర్.కె. షణ్ముఖం చెట్టి; రైల్వే శాఖ మంత్రి - జాన్ మథాయ్; ఆహారం మరియు వ్యవసాయశాఖ మంత్రి – డా. బాబు రాజేంద్ర ప్రసాద్.
రాజ్యాంగ పరిషత్‌కు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి:
  1. మొదటి సమావేశం – 1946 డిసెంబర్ 9.
  2. తాత్కాలిక అధ్యక్షుడు – డా. రాజేంద్రప్రసాద్.
  3. శాశ్వత అధ్యక్షుడు – డా. సచ్చిదానంద సిన్హా.
  4. ముఖ్య సలహాదారు – బెనగల్ నర్సింగ్ రావు.
పై వాటిలో తప్పుగా ఉన్నవి ఏవి?
A మరియు B మాత్రమే.
B మరియు C మాత్రమే.
C మరియు D మాత్రమే.
B, C, D మాత్రమే.
రాజ్యాంగ పరిషత్‌ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. ఆ సమావేశంలోనే ఫ్రెంచ్ సంప్రదాయం ప్రకారం వయస్సులో అందరికన్నా పెద్దవాడైన డా. సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగాఎన్నుకున్నారు. డిసెంబర్ 11న శాశ్వత అధ్యక్షుడిగా డా. రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. రాజ్యాంగ పరిషత్‌ ప్రధాన సలహాదారుగా బెనగల్ నర్సింగ్ రావును నియమించారు.
క్రిందివాటిలో 17వ లోకసభ కాలం ఏది?
2009–2014.
2014–2019.
2019–2024.
2024–2029.
17వ లోకసభ ఎన్నికలు 2019లో నిర్వహించబడ్డాయి. 17వ లోకసభ కాలం 2019 నుండి 2024. 15వ లోకసభ:- 2009–2014, 16వ లోకసభ:- 2014–2019. ప్రస్తుతం 2024 నుండి జరిగేది 18వ లోకసభ కాలం.
భారతదేశానికి సంబంధించిన క్రింది అంశాలను పరిశీలించండి:
  1. అత్యంత చిన్న వయస్సులో ప్రధానమంత్రి అయినవారు – రాజీవ్ గాంధీ.
  2. విదేశాల్లో మరణించిన భారత ప్రధానమంత్రి – జవహర్‌లాల్ నెహ్రూ.
  3. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి – మన్మోహన్ సింగ్.
  4. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి – మొరార్జీ దేశాయ్.
పై వాటిలో సరైనవి ఏవి?
A, B, C మాత్రమే.
B, C, D మాత్రమే.
A, D మాత్రమే.
A, B, C, D అన్నీ సరైనవే.
రాజీవ్ గాంధీ అత్యంత చిన్న వయస్సులో, అంటే 40 ఏళ్ళ వయసులోనే ప్రధానమంత్రి అయ్యారు. మొరార్జీ దేశాయ్ 1977 లో జనతా పార్టీ తరఫున ఎన్నికైన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. అయన సూరత్ పార్లమెంటు స్థానం నుండి MPగా గెలుపొందారు. విదేశాల్లో మరణించిన భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి. అయితే పదవిలో ఉండగానే మరణించిన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ. రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి ఇందిరా గాంధీ.
స్వాతంత్ర్యపు హక్కులలోని ఆర్టికల్ 19 ప్రకారం, ఎన్ని రకాల స్వేచ్ఛలు/స్వాతంత్ర్యాలు పొందుపరచబడ్డాయి?
4
5
6
7
భారత రాజ్యాంగం Article 19 ప్రకారం పౌరులకు 6 రకాల స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వీటిని "Right to Freedom" లో భాగంగా గుర్తిస్తారు. అవి 1) వాక్- భావ ప్రకటనా స్వాతంత్ర్యం, 2) సమావేశాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 3) సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 4) దేశవ్యాప్తంగా సంచారం చేసే స్వాతంత్ర్యం, 5) శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్ర్యం, 6) వృత్తి లేదా వ్యాపారం చేసుకునే స్వాతంత్ర్యం.
లౌకిక రాజ్య లక్షణాలకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి.
  1. మత ప్రమేయం లేని రాజ్యం.
  2. మతాలు లేని రాజ్యం.
  3. అన్ని మతాలను సమానంగా ఆదరించడం.
  4. మతప్రాతిపదికన పరిపాలన లేని రాజ్యం.
పై లక్షణాలలో సరైనవి ఏవి?
A, B, C మాత్రమే.
A, C, D మాత్రమే.
B, C, D మాత్రమే.
A, B, C, D అన్నీ సరైనవే.
భారత రాజ్యాంగం లౌకిక స్వరూపాన్ని అనుసరిస్తుంది. దీనిలో ప్రభుత్వం ఏ మతానికీ ప్రాధాన్యం ఇవ్వదు, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది. ప్రభుత్వ పరిపాలనలో మతానికి ప్రాధాన్యత ఉండదు. మతపరమైన వ్యవహారాల్లో తటస్థంగా ఉంటుంది. "మతాలు లేని రాజ్యం" అనే భావన భారత లౌకికత్వంలో లేదు.
రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా వర్ణించింది?
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం.
సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.
సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం.
భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం, భారతదేశం “సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం” గా వర్ణించబడింది. ఈ పదాలు భారతదేశ స్వరూపాన్ని మరియు ప్రాథమిక లక్ష్యాలను స్పష్టంగా సూచిస్తాయి. సర్వసత్తాకం:- భారతదేశం స్వతంత్ర దేశం, సామ్యవాదం:- సమానత్వం మరియు సామాజిక న్యాయం, లౌకికత్వం:- మతపరమైన తటస్థత, గణతంత్రం:- ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం.
క్రింది అంశాలను పరిశీలించండి:
  1. ప్రధానమంత్రి రాష్ట్రపతికి, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.
  2. కేంద్ర క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
  3. ప్రధానమంత్రి మంత్రిమండలిలోని సమానులలో ప్రథముడు (First Among Equals).
పైన పేర్కొన్న వాటిలో సరైనవి ఏవి?
B మరియు C మాత్రమే.
A మరియు C మాత్రమే.
A మరియు B మాత్రమే.
A, B, C అన్నీ సరైనవే.
భారత రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి రాష్ట్రపతి, మంత్రిమండలికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆయన క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ, నిర్ణయాలలో కీలకంగా ఉంటారు. అంతేగాక, మంత్రులు అన్ని సమానమైన అధికారాలు కలిగినా, ప్రధాని వారిలో సమానులలో ప్రథముడు (First Among Equals) గా వ్యవహరిస్తారు. ఇది పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ముఖ్యమైన లక్షణం.
రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి
  1. ప్రవేశిక రాజ్యాంగానికి ఉపోద్ఘాతం వంటిది.
  2. ప్రవేశిక రాజ్యాంగమొక్క లక్ష్యాలను తెలుపుతుంది.
  3. ప్రవేశిక రాజ్యాంగంలోని 1వ భాగంలో కలదు.
  4. ప్రవేశిక రాజ్యాంగమొక్క పరిచయం వంటిది.
పై వాటిలో సరైనవి ఏవి?
A, B, C మాత్రమే.
B, C, D మాత్రమే.
A, B, D మాత్రమే.
A, B, C, D అన్నీ సరైనవే.
భారత రాజ్యాంగంలోని పీఠిక/ప్రవేశిక (Preamble) అనేది రాజ్యాంగం యొక్క ఆత్మను ప్రతిబింబించే భాగం. ఇది రాజ్యాంగానికి ఉపోద్ఘాతం లేదా పరిచయం వంటిది. ఇది రాజ్యాంగానికి ముందుమాటగా ఉంటూ రాజ్యాంగ లక్ష్యాలను సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ప్రజల ఆశయాలు, లక్ష్యాలు, విలువలు ఇందులో ప్రతిబింబిస్తాయి.
భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి?
1947–48.
1951–52.
1949–50.
1952–53.
భారతదేశపు మొదటి సాధారణ ఎన్నికలు 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి వరకు కొనసాగాయి. మొత్తం 489 లోకసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ద్వారా జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన తొలి ప్రధానమంత్రి అయ్యారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియగా చరిత్రలో నిలిచింది.
రాజ్యాంగ పీఠిక (Preamble) గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి.
  1. బెరుబారి కేసు (1960)లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
  2. కేశవానంద భారతి కేసు (1973)లో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
పై వాక్యాలలో:
A మాత్రమే సరైనది.
B మాత్రమే సరైనది.
A మరియు B రెండూ సరైనవి.
A మరియు B రెండూ తప్పు.
1960లో బెరుబారి కేసులో సుప్రీం కోర్టు పీఠికను రాజ్యాంగంలో అంతర్భాగం కాదని, కాబట్టి దానిని సవరించలేమని పేర్కొంది. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో తన మునుపటి తీర్పును మార్చుకుని, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని మరియు దానిని సవరించవచ్చని తీర్పునిచ్చింది. అయితే పీఠికలో మార్పులు చేసేటప్పుడు రాజ్యాంగ మౌలికస్వరూపం దెబ్బతినకూడదనిపేర్కొన్నది.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top