భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్‌లో భారతదేశ అధికారిక భాషలు చేర్చబడి ఉన్నాయి?
పన్నెండవ షెడ్యూల్.
ఎనిమిదవ షెడ్యూల్.
ఆరవ షెడ్యూల్.
పదకొండవ షెడ్యూల్.
భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ దేశంలోని 22 అధికారిక భాషల గురించి వివరిస్తుంది. ప్రారంభంలో ఈ షెడ్యూల్‌లో 14 భాషలు ఉండగా, వివిధ సవరణల ద్వారా ప్రస్తుతం వాటి సంఖ్య 22కు చేరింది.
సాంచిలో ఉన్న స్థూపాన్ని ఎవరు నిర్మించారు?
చంద్ర గుప్తుడు.
అశోకుడు.
బింబిసారుడు.
రాజ భోజుడు.
మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపాన్ని మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో నిర్మించారు. బౌద్ధమత సంస్కృతికి చిహ్నమైన దీనిని 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
భారతదేశంలోని ఏ ప్రాంతం కుంకుమపువ్వు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
కులు లోయ.
కాంగ్రా లోయ.
కాశ్మీర్ లోయ.
సుర్మా లోయ.
భారతదేశంలో కుంకుమపువ్వు ఉత్పత్తికి కాశ్మీర్ లోయలోని పాంపోర్ ప్రాంతం అత్యంత ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన కుంకుమపువ్వు పండే అతికొద్ది ప్రాంతాలలో ఇది ఒకటి కావడంతో దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ కూడా లభించింది.
భారతదేశ తూర్పు మరియు పశ్చిమ చివరల మధ్య సమయ వ్యత్యాసం ఎంత?
5:30 గంటలు.
3:00 గంటలు.
2:00 గంటలు.
1:15 గంటలు.
భారతదేశం సుమారు 30 డిగ్రీల రేఖాంశాల విస్తీర్ణాన్ని కలిగి ఉండటం వల్ల తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన ఉన్న గుజరాత్ మధ్య దాదాపు 2 గంటలసమయ వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఒక డిగ్రీ రేఖాంశానికి 4 నిమిషాల సమయం మారుతుంది, కావున 30 డిగ్రీలు x 4 నిమిషాలు = 120 నిమిషాలు (2 గంటల) వ్యత్యాసం వస్తుంది.
ఏ సంఘటన ఫలితంగా హంటర్ కమిషన్ ఏర్పడింది?
చౌరీ-చౌరా.
బార్డోలి.
జలియన్ వాలా బాగ్.
హోమ్ రూల్.
1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోతపై విచారణ జరిపేందుకు బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ హంటర్ అధ్యక్షతన ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని అధికారికంగా 'డిజార్డర్స్ ఎంక్వయిరీ కమిటీ' అని కూడా పిలుస్తారు. ఈ కమిషన్ అల్లర్లకు గల కారణాలను మరియు జనరల్ డయ్యర్ తీసుకున్న చర్యలను పరిశీలించి,నివేదికను సమర్పించింది.
క్రింది వారిలో 1947లో భారతదేశంలో సంస్థానాల విలీనానికి బాధ్యులు ఎవరు?
మహాత్మాగాంధీ.
లోకమాన్య తిలక్.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
జవహర్‌లాల్ నెహ్రూ.
భారతదేశ స్వాతంత్య్ర సమయంలో 560కి పైగా స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశ సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను 'భారత ఉక్కు మనిషి' మరియు 'బిస్మార్క్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు.
క్రింది వారిలో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎవరు?
ఆర్ శ్రీధర్.
గౌతమ్ గంభీర్.
రవి శాస్త్రి.
రాహుల్ ద్రవిడ్.
ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024 జూలైలో రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత BCCI ఈయనను మూడు ఫార్మాట్లకు (టెస్ట్, వన్డే, టీ20) కోచ్‌గా నియమించింది.
కామెర్లు ఏ అవయవం పనిచేయకపోవడం వల్ల వస్తుంది?
మూత్రపిండాలు.
ప్యాంక్రియాస్.
కాలేయం.
కడుపు.
కాలేయం (Liver) సరిగ్గా పనిచేయనప్పుడు రక్తంలో బిలిరుబిన్ అనే పసుపు రంగు పిగ్మెంట్ స్థాయి పెరగడం వల్ల కామెర్లు వస్తాయి. దీనివల్ల కళ్ళు, చర్మం మరియు మూత్రం పసుపు రంగులోకి మారుతాయి.
క్రింది వాటిలో దేనిని "మృత్యుభూమి" (Land of death) అని పిలుస్తారు?
రాజస్థాన్ మైదానాలు.
ఖాదర్ మైదానాలు.
భంగర్ మైదానాలు.
బాబర్ మైదానాలు.
రాజస్థాన్ మైదానాల్లోని ఎడారి ప్రాంతంలో నీటి కొరత మరియు తీవ్రమైన ఎండల కారణంగా పంటలు పండవు. అందుకే దీనిని 'మృత్యుభూమి' అని పిలుస్తారు. దీనిని సంస్కృతంలో 'మరుస్థలి'అని కూడా అంటారు.
సింగూర్ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు?
వర్దా.
మంజీర.
ప్రాణహిత.
ఇంద్రావతి.
సింగూర్ ప్రాజెక్టును తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో గోదావరి నదికి ఉపనది అయిన మంజీరా నదిపై నిర్మించారు. 1989లో పూర్తయిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించడంతో పాటు, నీటిపారుదల మరియు జలవిద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉపయోగపడుతోంది.
ప్రఖ్యాత గుస్సాడీ నృత్యాన్ని తెలంగాణాలోని ఏ జిల్లాలో ప్రదర్శిస్తారు?
హైదరాబాద్.
ఆదిలాబాద్.
వరంగల్.
ఖమ్మం.
గుస్సాడీ అనేది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్ గోండులు దీపావళి పండుగ సందర్భంగా ప్రదర్శించే సాంప్రదాయ గిరిజన నృత్యం. ఈ నృత్యంలో కళాకారులు నెమలి ఈకలతో చేసిన కిరీటాలను ధరించి ప్రత్యేకమైన వాయిద్యాలతో ప్రదర్శన ఇస్తారు .
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో మొత్తం పతకాల జాబితాలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది?
60వ స్థానం.
65వ స్థానం.
70వ స్థానం.
71వ స్థానం.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశం మొత్తం 6 పతకాలతో (1 వెండి, 5 కాంస్యం) 71వ స్థానంలో నిలిచింది.
ఈ క్రింది ఏ సంవత్సరంలో భారతదేశంలోని రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన గుర్తించబడినాయి?
1950.
1956.
1948.
1955.
1956లో చేసిన 'రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం' ద్వారా భారతదేశంలోని రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించారు. దీని ఫలితంగా దేశంలో 14 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
క్రింది వాటిలో ఏది స్థాపించబడి 2024లో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.
ఢిల్లీ హైకోర్టు.
మద్రాస్ హైకోర్టు.
భారత సుప్రంకోర్టు.
భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 28న స్థాపించబడింది. దీనికి గుర్తుగా 2024 జనవరిలో 75వ వార్షికోత్సవ (వజ్రోత్సవాలు) వేడుకలు ప్రారంభమయ్యాయి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు, 2024లో తన 75 ఏళ్ల ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకుంది.
భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
2009.
2011.
2008.
2007.
భారత ప్రభుత్వం UIDAI (Unique Identification Authority of India) ను 2009,జనవరి 28న స్థాపించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం దేశంలోని నివాసితులందరికీ ప్రత్యేకమైన 12 అంకెల గుర్తింపు సంఖ్యను అందించడం. దీనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని మొదటి ఛైర్మన్గా వ్యవహరించారు.
కింది వాటిలో చెత్త ఉష్ణ వాహకం (worst heat conductor) ఏది?
అల్యూమినియం.
రాగి.
గాజు.
వెండి.
అల్యూమినియం, రాగి మరియు వెండి వంటి లోహాలు ఉష్ణాన్ని వేగంగా ప్రసరింపజేసే మంచి ఉష్ణ వాహకాలు. అయితే గాజు ఉష్ణాన్ని తన గుండా సులభంగా ప్రసరింపనీయదు, అందుకే దీనిని అధమ లేదా చెత్త ఉష్ణ వాహకం అని పిలుస్తారు.
భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పౌరుల యొక్క ప్రాథమిక విధులను వివరిస్తుంది?
అధికరణ 51A.
అధికరణ 268A.
అధికరణ 245.
అధికరణ 343.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పార్ట్ IV-A మరియు ఆర్టికల్ 51Aను చేర్చి ప్రాథమిక విధులను పొందుపరిచారు. ప్రారంభంలో 10 ప్రాథమిక విధులు ఉండగా 2002లో 86వ సవరణ ద్వారా మరొకటి కలిపి ప్రస్తుతం మొత్తం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది?
తెలంగాణ.
బీహార్.
ఉత్తరాఖండ్.
ఆంధ్రప్రదేశ్.
సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా (గతంలో నెల్లూరు జిల్లా), శ్రీహరికోటలో ఉంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) యొక్క ప్రధాన ఉపగ్రహ ప్రయోగ కేంద్రం. దీనిని షార్ (SHAR) అని కూడా పిలుస్తారు.
భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు ఎవరు?
ఎం.ఎస్. స్వామినాథన్.
టి.హెచ్. మోర్గాన్.
డాక్టర్ వర్గీస్ కురియన్.
గుల్జారీలాల్ నందా.
భారతదేశంలో పాల ఉత్పత్తిని పెంచిన 'ఆపరేషన్ ఫ్లడ్' రూపకర్త డాక్టర్ వర్గీస్ కురియన్. ఈయనను 'శ్వేత విప్లవ పితామహుడు' మరియు 'మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఈయన కృషికి గుర్తుగా తన పుట్టినరోజైన నవంబర్ 26ను జాతీయ పాల దినోత్సవంగా జరుపుకుంటాము.
తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆనకట్ట ఏది?
లోయర్ మానేర్ ఆనకట్ట.
జూరాలా ఆనకట్ట.
సింగూరు ఆనకట్ట.
నిజాం సాగర్ ఆనకట్ట.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ రాష్ట్రంలోని అతి పురాతనమైన నీటిపారుదల ప్రాజెక్టు. దీనిని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో 1923లో ప్రారంభించి 1931 నాటికి పూర్తి స్థాయి వినియోగంలోకి తీసుకువచ్చారు.
భారతదేశంలో మొదటిసారిగా సుప్రంకోర్టు ఎక్కడ స్థాపించబడింది?
మద్రాస్.
ముంబై.
కలకత్తా.
ఢిల్లీ.
1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో మొదటిసారిగా కలకత్తాలో సుప్రీంకోర్టును స్థాపించారు. సర్ ఎలిజా ఇంపీ దీనికి మొదటి ప్రధాన న్యాయమూర్తి. అయితే ప్రస్తుత భారత సుప్రీంకోర్టు మాత్రం 1950 జనవరి 28న న్యూ ఢిల్లీలో ప్రారంభమైంది.
2025 జనవరి 01న పాంగోంగ్ త్సో (Pangong Tso) ఒడ్డున ఎవరి విగ్రహాన్ని ఆవిష్కరించారు?
చత్రపతి శివాజీ.
జనరల్ జోరావర్ సింగ్.
సర్దార్ వల్లభాయ్ పటేల్.
మహారాజా రంజిత్ సింగ్.
2025 జనవరి 1న లడఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు ఒడ్డున సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత సైన్యం ఆవిష్కరించింది. దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులకు స్ఫూర్తిని నింపేందుకు, శివాజీ జన్మస్థలమైన శివనేరి కోట నుండి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించారు.
కిడ్నీ అధ్యయనాన్ని ఏమంటారు?
హెపటాలజీ.
ఆస్టియాలజీ.
నెఫ్రాలజీ.
హెమటాలజీ.
మూత్రపిండాల (కిడ్నీల) నిర్మాణం, పనితీరు మరియు వాటికి సంబంధించిన వ్యాధుల గురించి చేసే అధ్యయనాన్ని నెఫ్రాలజీ అంటారు. మూత్రపిండంలోని ప్రాథమిక వడపోత విభాగాలను 'నెఫ్రాన్లు' అంటారు. మూత్రపిండాల వ్యాధులకు చికిత్స చేసే వైద్యుడిని 'నెఫ్రాలజిస్ట్' అని పిలుస్తారు.
భారతదేశంలోని ఏ ప్రాంతంలో మనం సజీవ మూల వంతెనలు చూడవచ్చు?
కేరళ.
మేఘాలయ.
కర్ణాటక.
త్రిపుర.
మేఘాలయ రాష్ట్రంలో స్థానిక ఖాసీ మరియు జైంతియా తెగల ప్రజలు నదులు మరియు వాగులను దాటడానికి రబ్బరు చెట్ల వేర్లను అల్లి సజీవ మూల వంతెనలు (Living Root Bridges) నిర్మిస్తారు. ఇవి కొన్ని వందల సంవత్సరాల పాటు దృఢంగా ఉంటాయి. వీటిని స్థానికంగా 'జింగ్ కీంగ్ జ్రి' అని పిలుస్తారు.
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం ఏది?
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.
స్టాట్యూ ఆఫ్ యూనిటీ.
టవర్ ఆఫ్ పీస్.
థాయిలాండ్ యొక్క గొప్ప బుద్ధుడు.
గుజరాత్‌లోని నర్మదా నది తీరాన ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీనిని భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు (597 అడుగులు). ఇది అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీటర్లు) కంటే దాదాపు రెండింతలు పెద్దది.
ఈ క్రింది వాటిలో ఏ వేదము వైద్యానికి సంబంధించినది?
ఋగ్వేదము.
అథర్వణ వేదము.
సామ వేదము.
యజుర్వేదము.
నాలుగు వేదాలలో చివరిదైన అథర్వణ వేదంలో ఆయుర్వేదానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం, మూలికా వైద్యం మరియు వివిధ వ్యాధుల నివారణ మార్గాలు వివరించబడ్డాయి. అందుకే ఆయుర్వేదాన్ని అథర్వణ వేదానికి 'ఉపవేదం' అని కూడా పిలుస్తారు.
స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో ఆర్య సమాజ్‌ను ఏర్పాటు చేశారు?
1874.
1875.
1879.
1888.
స్వామి దయానంద సరస్వతి 1875ఏప్రిల్ 10న బొంబాయిలో ఆర్య సమాజ్‌ను స్థాపించారు. "వేదాలకు తరలిపోండి" (Go back to Vedas) అనే నినాదంతో హిందూ మతంలో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన రచించిన 'సత్యార్థ ప్రకాష్' ఆర్య సమాజ్ సిద్ధాంతాలకు మూలగ్రంథం.
వినియోగదారుల రక్షణ చట్టం (Consumer Protection Act) ఎప్పుడు ప్రవేశపెట్టబడింది?
1984.
1986.
1979.
1990.
వినియోగదారుల హక్కులను కాపాడటానికి భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం ఈ చట్టం స్థానంలో మరిన్ని మార్పులతో 'వినియోగదారుల రక్షణ చట్టం, 2019' అమలులో ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు (EVలు) రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది?
కర్ణాటక.
మహారాష్ట్ర.
ఢిల్లీ.
తెలంగాణ.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం నూతన EV పాలసీ 2024ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రాష్ట్రంలో 2026 డిసెంబర్ 31 వరకు కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు (ద్విచక్ర, నాలుగు చక్రాల మరియు కమర్షియల్ వాహనాలకు) రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు లభిస్తుంది.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులలో 'పంజాబ్ కేసరి' (పంజాబ్ సింహం) అని ఎవరిని పిలుస్తారు?
బాల గంగాధర తిలక్.
లాలా లజపత్ రాయ్.
భగత్ సింగ్.
చంద్ర శేఖర్ ఆజాద్.
భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన లాలా లజపత్ రాయ్‌ను ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా 'పంజాబ్ కేసరి' అని పిలుస్తారు. 1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో లాఠీచార్జి వల్ల తీవ్రంగా గాయపడి ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఏ గ్రహాన్ని ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు?
శుక్రుడు.
బుధుడు.
బృహస్పతి.
శని.
సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు. ఇది సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి దీనిని 'ఈవినింగ్ స్టార్' అని, అలాగే సూర్యోదయానికి ముందు కనిపిస్తుంది కాబట్టి 'మార్నింగ్ స్టార్' అని కూడా పిలుస్తారు. దీనిని 'భూమి యొక్క కవల గ్రహం' అని కూడా అంటారు.
భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికి ఉంది?
పార్లమెంటు.
ప్రధానమంత్రి.
ప్రధాన న్యాయమూర్తి.
రాష్ట్రపతి.
భారత రాజ్యాంగంలోని 352, 356 మరియు 360 ఆర్టికల్స్ ప్రకారం దేశంలో లేదా ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అయితే కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి ఈ అధికారాలను వినియోగిస్తారు.
భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది?
లక్షద్వీప్.
పశ్చిమ కనుమలు.
అండమాన్ మరియు నికోబార్.
హిమాలయాలు.
భారతదేశంలోని ఏకైక క్రియాశీల (Active) అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్ ఐలాండ్‌లో ఉంది. ఇది దక్షిణ ఆసియాలోనే ఏకైక క్రియాశీల అగ్నిపర్వతంగా గుర్తించబడింది.
“ప్లేయింగ్ ఇట్ మై వే” ఎవరి ఆత్మకథ?
సచిన్ టెండుల్కర్.
మిల్కా సింగ్.
సానియా మీర్జా.
మేరీ కోమ్.
క్రికెట్ దిగ్గజం'లిటిల్ మాస్టర్' సచిన్ టెండుల్కర్ తన జీవిత విశేషాలు మరియు క్రికెట్ ప్రయాణం గురించి రాసుకున్న ఆత్మకథ “ప్లేయింగ్ ఇట్ మై వే”. దీనిని 2014లో విడుదల చేశారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం, ఈ పుస్తకం విడుదలైన మొదటి రోజే అత్యధికంగా అమ్ముడైన ఆత్మకథ పుస్తకంగా రికార్డు సృష్టించింది.
DNA అణువు నమూనాను ఎవరు కనుగొన్నారు?
హరగోవింద్ ఖోరానా.
క్రిక్-వాట్సన్.
హెచ్.జె.ముల్లర్.
జె.సి. బోస్.
జేమ్స్ వాట్సన్ మరియు ఫ్రాన్సిస్ క్రిక్ 1953లో DNA యొక్క 'డబుల్ హెలిక్స్' (రెండు పోగుల మెలికల) నిర్మాణాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు గాను వీరు 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.
కింది వారిలో సరిహద్దు గాంధీ (Frontier Gandhi) అని ఎవరిని పిలుస్తారు?
మొహమ్మద్ అలీ జిన్నా.
మౌలానా అబుల్ కలాం ఆజాద్.
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్.
దాదాభాయ్ నౌరోజీ.
నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్‌లో గాంధేయవాదాన్ని ప్రచారం చేసినందుకు మరియు అహింసా మార్గంలో పోరాడినందుకు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌ను 'సరిహద్దు గాంధీ' అని పిలుస్తారు. ఆయన 'ఖుదాయ్ ఖిద్మత్ గార్' అనే సంస్థను స్థాపించారు మరియు 1987లో భారతరత్న పొందిన మొదటి విదేశీయుడిగా గుర్తింపు పొందారు.
కింది వారిలో సుభాష్ చంద్రబోస్‌ను "దేశభక్తులలో రాజు" అని ఎవరు పిలుచ్చారు?
రాజేంద్ర ప్రసాద్.
మహాత్మాగాంధీ.
జవహర్‌లాల్ నెహ్రూ.
విపిన్ చంద్ర.
ఇద్దరి మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నప్పటికీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశం కోసం చేసిన త్యాగాలను మరియు ఆయన అంకితభావాన్ని మెచ్చుకుంటూ మహాత్మా గాంధీ ఆయనను "దేశభక్తులలో రాజు" అని కొనియాడారు. దీనికి ప్రతిగా సుభాష్ చంద్రబోస్ కూడా గాంధీజీని మొదటిసారిగా "జాతిపిత" అని పిలిచి గౌరవించారు.
భారతదేశంలో మామిడిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్.
మధ్యప్రదేశ్.
కర్ణాటక.
ఉత్తర ప్రదేశ్.
భారతదేశంలో మామిడి ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలోని మొత్తం మామిడి ఉత్పత్తిలో సుమారు 23% నుండి 25% వాటా ఈ రాష్ట్రానిదే. ఇక్కడ పండించే ‘దశేరి’ మామిడి రకం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది.
భారతదేశ జాతీయ గేయం 'వందేమాతరం' ఏ నవల నుండి సంగ్రహించబడినది?
కపాలకుండల.
ఆనంద్ మఠం.
వైదిక సాహిత్యం.
దుర్గేశనందిని.
భారత జాతీయ గేయం అయిన వందేమాతరం గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ 1882లో రచించిన 'ఆనంద్ మఠం' అనే ప్రసిద్ధ బెంగాలీ నవల నుండి తీసుకున్నారు. దీనిని మొట్టమొదటిసారిగా 1896 కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారు.
భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేస్తుంది?
గుజరాత్.
ఆంధ్రప్రదేశ్.
మహారాష్ట్ర.
తెలంగాణ.
NOTE: As per KEY ప్రకారం “తెలంగాణ” ఆన్సర్ గా ఇచ్చారు. కాని Sources ప్రకారం మాత్రం భారతదేశంలో అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర అవుతుంది. ఇది గమనించగలరు.
ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి చైర్‌పర్సన్‌గా నియమితులైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు?
జస్టిస్ మదన్ బి. లోకూర్.
జస్టిస్ ఎన్.వి. రమణ.
జస్టిస్ కేహర్.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్.
ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయ మండలి (UN-IJC) చైర్‌పర్సన్‌గా భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి. లోకూర్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో నవంబర్ 12, 2028 వరకు కొనసాగుతారు.
భారతదేశంలో మనం మొదట సూర్యోదయాన్ని ఎక్కడ చూస్తాము?
కన్యాకుమారి, తమిళనాడు.
గోపాలపురం, ఒడిశా.
డాంగ్, అరుణాచల్ ప్రదేశ్.
పులికాట్, ఆంధ్రప్రదేశ్.
భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని అంజా జిల్లాలో ఉన్న డాంగ్ గ్రామంలో సూర్యకిరణాలు దేశంలోనే అందరికంటే ముందుగా (సుమారు తెల్లవారుజామున 4:00 గంటలకు) తాకుతాయి. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌ను 'సూర్యుడు ఉదయించే భూమి' అని పిలుస్తారు.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఒలింపిక్ షూటింగ్ పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు?
అంజుమ్ మౌద్గిల్.
ఎలవెనిల్ వలరివన్.
మను భాకర్.
అపూర్వి చందేలా.
2024 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్ కాంస్య పతకం సాధించి షూటింగ్‌లో ఒలింపిక్ పతకం గెలిచిన మొదటి భారతీయ మహిళగా, అలాగే సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మరో కాంస్యం సాధించి, ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
క్రింది వాటిలో ఏ క్రీడ రైడర్ కప్ (Ryder Cup) కి సంబంధించినది?
గోల్ఫ్.
బ్యాడ్మింటన్.
స్విమ్మింగ్.
క్రికెట్.
రైడర్ కప్ (Ryder Cup) అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్ జట్ల మధ్య జరిగే ప్రసిద్ధ పురుషుల గోల్ఫ్ టోర్నమెంట్. బ్రిటీష్ వ్యాపారవేత్త శామ్యూల్ రైడర్ పేరు మీద 1927లో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి.
రాడ్‌క్లిఫ్ లైన్ భారతదేశం నుండి ఏ దేశాలను వేరు చేస్తుంది?
పాకిస్తాన్, చైనా.
చైనా, మయన్మార్.
బంగ్లాదేశ్, పాకిస్తాన్.
ఇండోనేషియా, శ్రీలంక.
1947లో భారతదేశ విభజన సమయంలో బ్రిటిష్ అధికారి సర్ సిరిల్ రాడ్‌క్లిఫ్ నేతృత్వంలో ఈ సరిహద్దు రేఖను నిర్ణయించారు. ఇది అప్పటి పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) దేశాలను భారతదేశం నుండి వేరు చేస్తుంది.
2024 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు?
జో బైడెన్.
నిహాన్ హిడాంక్యో.
హాన్ కాంగ్.
విక్టర్ ఆంబ్రోస్.
2024 నోబెల్ శాంతి బహుమతి జపాన్‌కు చెందిన 'నిహాన్ హిడాంక్యో' సంస్థకు దక్కింది. ఈ సంస్థ హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడుల నుండి ప్రాణాలతో బయటపడిన వారు కలిసి స్థాపించినది. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం వారు చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
కింది వాటిలో భారతదేశంలో భూపరివేష్టిత రాష్ట్రం కానిది ఏది?
జార్ఖండ్.
ఛత్తీస్‌గఢ్.
మధ్యప్రదేశ్.
పశ్చిమ బెంగాల్.
ఏ వైపున కూడా సముద్ర తీరం లేని రాష్ట్రాన్ని 'భూపరివేష్టిత రాష్ట్రం' అని పిలుస్తారు. భారతదేశంలో 5 భూపరివేష్టిత రాష్ట్రాలు కలవు. అవి: హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు తెలంగాణ. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి దక్షిణాన బంగాళాఖాతం సముద్ర తీరం ఉంది, కాబట్టి అది భూపరివేష్టిత రాష్ట్రం కాదు.
ఎన్ని సంవత్సరాల తరువాత రాజ్యసభ యొక్క మూడవ వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు?
ఐదు సంవత్సరాలు.
మూడు సంవత్సరాలు.
నాలుగు సంవత్సరాలు.
రెండు సంవత్సరాలు.
రాజ్యసభ అనేది ఒక శాశ్వత సభ, ఇది ఎప్పటికీ రద్దు కాదు. రాజ్యసభ సభ్యుని పదవీకాలం 6 సంవత్సరాలు. అయితే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త సభ్యులు ఎన్నికవుతారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు?
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
ఎ. రేవంత్ రెడ్డి.
పొన్నం ప్రభాకర్.
మల్లు భట్టి విక్రమార్క.
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ప్రస్తుతం ఆర్థిక మరియు ప్రణాళిక, ఇంధన శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన డిసెంబర్ 2023లో ఈ పదవిని చేపట్టారు. ఆయన ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కింది విప్లవాలలో ఉన్ని తయారీతో సంబంధం కలిగి ఉన్నది ఏది?
గ్రే రివల్యూషన్ (Grey Revolution).
ఎల్లో రివల్యూషన్ (పసుపు విప్లవం).
బ్లూ రివల్యూషన్ (నీలి విప్లవం).
పింక్ రివల్యూషన్.
భారతదేశంలో ఉన్ని (Wool) ఉత్పత్తిని పెంచడానికి చేపట్టిన విప్లవాన్ని గ్రే రివల్యూషన్ అంటారు. ఇది ఉన్నితో పాటు ఎరువుల (Fertilizers) ఉత్పత్తి పెంపుదలకు కూడా సంబంధించింది.
ఈ క్రింది నదులలో పశ్చిమానికి ప్రవహించేది ఏది?
గోదావరి.
నర్మద.
యమున.
కృష్ణ.
నర్మదా నది మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ వద్ద జన్మించి, పశ్చిమ దిశగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించే అతిపెద్ద నదులలో ఇది ఒకటి. ఈ నది పగులు లోయ (Rift Valley) గుండా ప్రవహించడం దీని ప్రత్యేకత.
అభివృద్ధి మరియు శాంతి కొరకు అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని క్రింది ఏ తేదీన జరుపుకుంటారు?
ఏప్రిల్ 1.
ఏప్రిల్ 6.
ఏప్రిల్ 10.
ఏప్రిల్ 4.
సామాజిక మార్పు మరియు శాంతి స్థాపనలో క్రీడల పాత్రను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏప్రిల్ 6న అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 1896లో ఆధునిక ఒలింపిక్ క్రీడలు మొదలైన రోజును పురస్కరించుకుని ఈ తేదీని ఎంపిక చేశారు.
క్రింది వాటిలో మహానదిపై ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ఆనకట్ట ఏది?
హీరాకుడ్.
భాక్రానంగల్.
కాక్రాపర్.
గాంధీసాగర్.
ఒడిశాలోని మహానదిపై నిర్మించిన హీరాకుండ్ ఆనకట్ట ప్రపంచంలోనే అత్యంత పొడవైన మట్టి ఆనకట్టగా (Longest Earthen Dam) గుర్తింపు పొందింది. దీని ప్రధాన ఆనకట్ట పొడవు సుమారు 4.8 కి.మీ కాగా, మొత్తం పొడవు 25.8 కిలోమీటర్లు ఉంటుంది.
ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం (వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే) ఎప్పుడు జరుపుకోబడుతుంది?
10 ఆగష్టు.
21 ఆగస్టు.
5 మార్చి.
12 జూలై.
ప్రతి సంవత్సరం ఆగస్టు 21న ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. వృద్ధులు సమాజానికి చేసిన సేవలను గుర్తించడం మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ప్రతి ఏటా అక్టోబర్ 1న జరుపుకుంటారు.
విస్తీర్ణం వారీగా, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఏది?
ఉత్తరప్రదేశ్.
జమ్మూ కాశ్మీర్.
మధ్యప్రదేశ్.
రాజస్థాన్.
విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇది సుమారు 3,42,239 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉండి, దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 10.41% ఆక్రమించింది. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత రాజస్థాన్ మొదటి స్థానానికి చేరుకుంది.
మానవులలో రక్తం గడ్డకట్టడానికి ఎంత సమయం పడుతుంది?
10 నిమిషాలు.
8 నిమిషాలు.
7 నిమిషాలు.
5 నిమిషాలు.
మానవ శరీరంలో గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి సాధారణంగా 2 నుండి 5 నిమిషాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో రక్తంలోని ఫలకికలు (Platelets) మరియు విటమిన్-K కీలక పాత్ర పోషిస్తాయి.
భూమి గోళాకారంగా ఉందని మొదట నిరూపించిన పాశ్చాత్య శాస్త్రవేత్త ఎవరు?
అరిస్టాటిల్.
అనాక్సిమాండర్.
ఇమ్మాన్యుయేల్ కాంట్.
హోమర్.
అరిస్టాటిల్ తన "ఆన్ ద హెవెన్స్" గ్రంథంలో భూమి గోళాకారంగా ఉందని శాస్త్రీయంగా నిరూపించారు. చంద్రగ్రహణం సమయంలో చంద్రునిపై పడే భూమి నీడ వక్రాకారంలో ఉండటాన్ని మరియు ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లే కొద్దీ ఆకాశంలో నక్షత్రాల స్థానాలు మారడాన్ని ఆయన ప్రధాన ఆధారాలుగా చూపారు.
భారతరత్నను అందుకున్న మొదటి మహిళ ఎవరు?
ఇందిరా గాంధీ.
అమృతా ప్రీతమ్.
లతా మంగేష్కర్.
సరోజిని నాయుడు.
భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్న తొలి మహిళ ఇందిరా గాంధీ. ఆమె 1971లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మదర్ థెరిసా (1980), అరుణా అసఫ్ అలీ (1997), ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (1998) మరియు లతా మంగేష్కర్ (2001) ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం ఏది?
చైనా.
పాకిస్తాన్.
బంగ్లాదేశ్.
నేపాల్.
భారతదేశంతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగిఉన్న దేశం బంగ్లాదేశ్. దీని పొడవు సుమారు 4,096.7 కి.మీ. ఇది ప్రపంచంలోనే ఐదవ అతి పొడవైన భూ సరిహద్దు. పశ్చిమ బెంగాల్, మేఘాలయ, మిజోరం, అస్సాం మరియు త్రిపుర అనే ఐదు రాష్ట్రాలు ఈ సరిహద్దును పంచుకుంటున్నాయి.
కింది వారిలో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
డాక్టర్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్.
జస్టిస్ సంజీవ్ ఖన్నా.
జస్టిస్ యు.యు. లలిత్.
జస్టిస్ బి.ఆర్. గవాయ్.
NOTE: 2025 ఏప్రిల్‌లో ఈ పరీక్ష జరిగేనాటికి నాటికి భారతదేశ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు. ఆ తర్వాత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్. గవాయ్ పనిచేశారు. ప్రస్తుతం 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24వ తేదీన బాధ్యతలు చేపట్టారు మరియు ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఆ పదవిలో కొనసాగుతారు.
(61-65) Read the following passage and choose the correct answer for each question.
Did you know that Delhi has a branch of the original Bodhi tree under which Lord Buddha had done penance and received enlightenment?
As history tells us, Emperor Ashoka had gifted a branch of the original Bodhi tree to Sinhalese king Devanampiya Tissa. It was carried to him by Ashoka's daughter and envoy, Princess Sanghamitra. King Tissa planted the tree at Anuradhapura (in Sri Lanka today) in 236 BC, where it remains to this day. But the original one at Bodh Gaya didn't last very long, having been cut down by King Sasanka of Bengal in the 7th century AD. That made the one at Anuradhapura the direct descendant of the original Bodhi tree, and the most revered scion wood associated with the Buddha. Over time, it came to be known as Jaya Sri Maha Bodhi tree.
In 1964, the then Prime Minister of Sri Lanka, Sirimavo Bandarnaike, presented a sapling of the Jaya Sri Maha Bodhi tree to India. It was planted by the then Prime Minister, Lal Bahadur Shastri, at a grove on the Central Ridge while inaugurating the Buddha Jayanti Park. Over 50 years hence, it's a huge, flourishing tree and Delhi's direct link with the Enlightened one.
I saw the tree for the first time during a nature walk recently led by Syed Mohammad Qasim, a management professional turned naturalist and photographer. "At the Buddha Jayanti Park alone, I have identified 92 different species of trees, some of which are unique to Delhi. This park on the Central Ridge is important for another reason: it's part of the Aravalis, the oldest mountain range in the world, so the flora here is quite unique," Qasim explained.
"That's a kusum tree. Its leaves are eaten by lac insects. From their secretions, you get lac that's used as seal by governmental institutions. This one is chilbil or chudailpapri. Its nut is edible and is often called the 'poor man's almond'. This plant is kankauwa. You can make pakodas from its leaves." Qasim kept on informing as the walk progressed.
The group was also shown an anjan tree, a Sita-Ashok tree, and a bistendu tree, the fruit of which is used as fish bait by tribals in Madhya Pradesh. "Fish get intoxicated when they bite on the bait and float. That's how the tribals catch them," Qasim said.
From the leaves of which plant can you make pakodas?
Chilbil.
Kankauwa.
Kusum.
Anjan.
ప్యాసేజ్ ప్రకారం, Kankauwa అనే మొక్క ఆకుల నుండి pakoras (పకోడాలు) చేసుకోవచ్చని వివరించారు.

For what purpose do the tribal people use the fruit of the bistendu tree?
As bait to catch fish.
To feed fish.
To cook fish with it.
To make fish intoxicated.
మధ్యప్రదేశ్ లోని గిరిజనులు చేపలను పట్టడానికి బిస్టెందు చెట్టు పండ్లను 'ఎర' (bait) గా ఉపయోగిస్తారు.
(61-65) Read the following passage and choose the correct answer for each question.
Did you know that Delhi has a branch of the original Bodhi tree under which Lord Buddha had done penance and received enlightenment?
As history tells us, Emperor Ashoka had gifted a branch of the original Bodhi tree to Sinhalese king Devanampiya Tissa. It was carried to him by Ashoka's daughter and envoy, Princess Sanghamitra. King Tissa planted the tree at Anuradhapura (in Sri Lanka today) in 236 BC, where it remains to this day. But the original one at Bodh Gaya didn't last very long, having been cut down by King Sasanka of Bengal in the 7th century AD. That made the one at Anuradhapura the direct descendant of the original Bodhi tree, and the most revered scion wood associated with the Buddha. Over time, it came to be known as Jaya Sri Maha Bodhi tree.
In 1964, the then Prime Minister of Sri Lanka, Sirimavo Bandarnaike, presented a sapling of the Jaya Sri Maha Bodhi tree to India. It was planted by the then Prime Minister, Lal Bahadur Shastri, at a grove on the Central Ridge while inaugurating the Buddha Jayanti Park. Over 50 years hence, it's a huge, flourishing tree and Delhi's direct link with the Enlightened one.
I saw the tree for the first time during a nature walk recently led by Syed Mohammad Qasim, a management professional turned naturalist and photographer. "At the Buddha Jayanti Park alone, I have identified 92 different species of trees, some of which are unique to Delhi. This park on the Central Ridge is important for another reason: it's part of the Aravalis, the oldest mountain range in the world, so the flora here is quite unique," Qasim explained.
"That's a kusum tree. Its leaves are eaten by lac insects. From their secretions, you get lac that's used as seal by governmental institutions. This one is chilbil or chudailpapri. Its nut is edible and is often called the 'poor man's almond'. This plant is kankauwa. You can make pakodas from its leaves." Qasim kept on informing as the walk progressed.
The group was also shown an anjan tree, a Sita-Ashok tree, and a bistendu tree, the fruit of which is used as fish bait by tribals in Madhya Pradesh. "Fish get intoxicated when they bite on the bait and float. That's how the tribals catch them," Qasim said.
Which of the following is NOT a unique quality of Buddha Jayanti Park in Delhi?
The park has a tree which comes from the original Bodhi tree under which Lord Buddha had received enlightenment.
The park is part of the Aravalis, the oldest mountain range in the world.
Being a part of the oldest mountain range in the world, the flora in the park is quite unique.
The park was inaugurated by Lal Bahadur Shastri about 50 years ago.
లాల్ బహదూర్ శాస్త్రి గారు పార్కును ప్రారంభించినప్పుడు బోధి మొక్కను (sapling) నాటారు, కానీ పార్కును ఆయనే ప్రారంభించారనేది (inaugurated the park) సరి కాదు.
(61-65) Read the following passage and choose the correct answer for each question.
Did you know that Delhi has a branch of the original Bodhi tree under which Lord Buddha had done penance and received enlightenment?
As history tells us, Emperor Ashoka had gifted a branch of the original Bodhi tree to Sinhalese king Devanampiya Tissa. It was carried to him by Ashoka's daughter and envoy, Princess Sanghamitra. King Tissa planted the tree at Anuradhapura (in Sri Lanka today) in 236 BC, where it remains to this day. But the original one at Bodh Gaya didn't last very long, having been cut down by King Sasanka of Bengal in the 7th century AD. That made the one at Anuradhapura the direct descendant of the original Bodhi tree, and the most revered scion wood associated with the Buddha. Over time, it came to be known as Jaya Sri Maha Bodhi tree.
In 1964, the then Prime Minister of Sri Lanka, Sirimavo Bandarnaike, presented a sapling of the Jaya Sri Maha Bodhi tree to India. It was planted by the then Prime Minister, Lal Bahadur Shastri, at a grove on the Central Ridge while inaugurating the Buddha Jayanti Park. Over 50 years hence, it's a huge, flourishing tree and Delhi's direct link with the Enlightened one.
I saw the tree for the first time during a nature walk recently led by Syed Mohammad Qasim, a management professional turned naturalist and photographer. "At the Buddha Jayanti Park alone, I have identified 92 different species of trees, some of which are unique to Delhi. This park on the Central Ridge is important for another reason: it's part of the Aravalis, the oldest mountain range in the world, so the flora here is quite unique," Qasim explained.
"That's a kusum tree. Its leaves are eaten by lac insects. From their secretions, you get lac that's used as seal by governmental institutions. This one is chilbil or chudailpapri. Its nut is edible and is often called the 'poor man's almond'. This plant is kankauwa. You can make pakodas from its leaves." Qasim kept on informing as the walk progressed.
The group was also shown an anjan tree, a Sita-Ashok tree, and a bistendu tree, the fruit of which is used as fish bait by tribals in Madhya Pradesh. "Fish get intoxicated when they bite on the bait and float. That's how the tribals catch them," Qasim said.
How did the branch of the Bodhi tree come to Delhi and get planted at the Buddha Jayanti Park?
Emperor Ashoka's daughter Sanghamitra brought it there originally.
The original tree at Bodh Gaya was cut by King Sasanka of Bengal and planted in Delhi.
The Sri Lankan Prime Minister, Sirimavo Bandarnaike, presented a sapling of the Maha Bodhi tree to India, which was planted here.
King Tissa planted the tree after it was brought from Bodh Gaya.
శ్రీలంక ప్రధానమంత్రి సిరిమావో బండారునాయకే మహాబోధి యొక్క ఒక చిన్న మొక్కను ఇండియాకు బహుమతిగా ఇవ్వగా, భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దానిని బుద్ధ జయంతి పార్క్‌లో నాటారు.
(61-65) Read the following passage and choose the correct answer for each question.
Did you know that Delhi has a branch of the original Bodhi tree under which Lord Buddha had done penance and received enlightenment?
As history tells us, Emperor Ashoka had gifted a branch of the original Bodhi tree to Sinhalese king Devanampiya Tissa. It was carried to him by Ashoka's daughter and envoy, Princess Sanghamitra. King Tissa planted the tree at Anuradhapura (in Sri Lanka today) in 236 BC, where it remains to this day. But the original one at Bodh Gaya didn't last very long, having been cut down by King Sasanka of Bengal in the 7th century AD. That made the one at Anuradhapura the direct descendant of the original Bodhi tree, and the most revered scion wood associated with the Buddha. Over time, it came to be known as Jaya Sri Maha Bodhi tree.
In 1964, the then Prime Minister of Sri Lanka, Sirimavo Bandarnaike, presented a sapling of the Jaya Sri Maha Bodhi tree to India. It was planted by the then Prime Minister, Lal Bahadur Shastri, at a grove on the Central Ridge while inaugurating the Buddha Jayanti Park. Over 50 years hence, it's a huge, flourishing tree and Delhi's direct link with the Enlightened one.
I saw the tree for the first time during a nature walk recently led by Syed Mohammad Qasim, a management professional turned naturalist and photographer. "At the Buddha Jayanti Park alone, I have identified 92 different species of trees, some of which are unique to Delhi. This park on the Central Ridge is important for another reason: it's part of the Aravalis, the oldest mountain range in the world, so the flora here is quite unique," Qasim explained.
"That's a kusum tree. Its leaves are eaten by lac insects. From their secretions, you get lac that's used as seal by governmental institutions. This one is chilbil or chudailpapri. Its nut is edible and is often called the 'poor man's almond'. This plant is kankauwa. You can make pakodas from its leaves." Qasim kept on informing as the walk progressed.
The group was also shown an anjan tree, a Sita-Ashok tree, and a bistendu tree, the fruit of which is used as fish bait by tribals in Madhya Pradesh. "Fish get intoxicated when they bite on the bait and float. That's how the tribals catch them," Qasim said.
When was the branch of the original Bodhi tree from Bodh Gaya planted in Anuradhapura, Sri Lanka?
In 236 BC.
In 7th century AD.
In 1964.
In 236 AD.
అశోక చక్రవర్తి కుమార్తె సంఘమిత్ర ద్వారా పంపబడిన అసలు బోధి వృక్షం కొమ్మను శ్రీలంక రాజు టిస్సా (King Tissa) క్రీస్తు పూర్వం (BC) 236లో అనురాధపురంలో నాటారు.
Select the most appropriate ANTONYM of the given word.
RESILIENT
hardy.
tough.
strong.
delicate.
Resilient అంటే కష్టాలను తట్టుకుని నిలబడే శక్తి ఉన్న లేదా దృఢమైన అని అర్థం. దీనికి Antonym (వ్యతిరేక పదం) Delicate, అంటే సున్నితమైన లేదా త్వరగా దెబ్బతినే అని అర్థం.
Select the most appropriate option to fill in the blank.
_________ an untoward event, the Vikram Lander will land on the moon.
Concerning.
Barring.
Considering.
Respecting.
Barring అంటే "అది జరగకపోతే తప్ప" (except for) అని అర్థం. అంటే ఏదైనా అవాంఛనీయ సంఘటన (untoward event) జరగకపోతే తప్ప, విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగుతుంది అని అర్థం.
Select the most appropriate SYNONYM of the given word.
GLUM
dejected.
cheerful.
merry.
glad.
Glum అంటే విచారంగా లేదా దిగులుగా ఉండటం. దీనికి Synonym (పర్యాయ పదం) Dejected, అంటే నిరాశతో లేదా బాధగా ఉండటం. మిగతా మూడు ఆప్షన్స్ సంతోషాన్ని సూచిస్తాయి.
Sentences of a paragraph are given below in jumbled order.
- The sister told him that Pratik was a perpetual nuisance.
- He was lazy, disobedient and wild.
- But Makhan was as good as gold, as quiet as a lamb and very fond of reading.
- Bishamber asked his sister how her two boys were doing.
Arrange the sentences in the right order to form a meaningful and coherent paragraph.
BDAC.
DACB.
ABDC.
DABC.
మొదట బిషంబర్ తన సోదరిని పిల్లల గురించి అడిగాడు (D). దానికి సమాధానంగా ఆమె ప్రతీక్ ఒక విసుగు అని చెప్పింది (A). తర్వాత ప్రతీక్ లక్షణాలు (B), చివరగా మఖాన్ మంచి లక్షణాలను (C) వివరించింది. కాబట్టి DABC సరైన క్రమం.
Select the most appropriate option to fill in the blanks.
Some historians think that civilisations do not necessarily need to be ________ a river in order to grow. In fact, not having river nearby may have ________ as well because people would not have to deal with regular floods.
on; advantages.
near; profits.
on; profits.
near; advantages.
మొదటి ఖాళీలో "నదికి దగ్గరగా" అని చెప్పడానికి 'near' సరిగ్గా సరిపోతుంది. రెండో ఖాళీలో నది దగ్గర లేకపోవడం వల్ల వరదల భయం ఉండదు, అది ఒక 'advantage' (ప్రయోజనం) అని అర్థం. అయితే 'Profits' అనేది వ్యాపారానికి సంబంధించిన పదం, కాబట్టి ఇక్కడ 'advantages' అనేదే కరెక్ట్.
Fill in the blank with the most appropriate phrase.
Gagan ________ his father's company and established his own publishing house.
broke out.
broke away from.
broke off.
broke into.
'Broke away from' అంటే ఒక సంస్థ లేదా గుంపు నుండి విడిపోయి స్వతంత్రంగా మారడం అని అర్థం. గగన్ తన తండ్రి కంపెనీ నుండి విడిపోయి సొంతంగా పబ్లిషింగ్ హౌస్ పెట్టుకున్నాడు కాబట్టి ఇది సరైనది.
Select the most appropriate ANTONYM of the given word.
VAGUE
Definite.
Indefinite.
Sage.
Raging.
Vague అంటే అస్పష్టంగా లేదా స్పష్టత లేని అని అర్థం. దీనికి Antonym (వ్యతిరేక పదం) Definite, అంటే ఖచ్చితమైన లేదా స్పష్టమైన అని అర్థం.
Select the most appropriate SYNONYM of the given word.
POLITE
Impolite.
Police.
Tough.
Courteous.
Polite అంటే మర్యాదగా లేదా వినయంగా ఉండటం. దీనికి Synonym (పర్యాయపదం) Courteous, అంటే ఇతరుల పట్ల గౌరవంగా మరియు మర్యాదగా ప్రవర్తించడం.
Select the most appropriate option to complete the paragraph logically.
"Today, the social fabric of neighbourhoods is being torn asunder because of fights over this most petty issue of parking", the Supreme Court observed on 2 September. "Therefore, we feel there is a need to ________."
tow vehicles from the inner lanes of markets.
have only one vehicle per house.
pass a detailed order on this issue of parking.
open the gates of educational institutions to accommodate more cars.
పార్కింగ్ సమస్యపై తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానిస్తూ, ఈ విషయంపై ఒక వివరణాత్మక ఉత్తర్వు (detailed order) ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
Select the most appropriate option to fill in the blanks.
The plague was responsible ________ many mass killings in history. The deadliest was the Black Death which ________ in Europe during the 14th century and killed about a third of the continent's population.
of; occurring.
for; occurred.
of; occurred.
for; occurring.
Responsible పక్కన ఎప్పుడూ for అనే Preposition వాడాలి. అలాగే 14వ శతాబ్దంలో జరిగిన సంఘటన కాబట్టి Past Tense లో occurred అని ఉండాలి.
Select the most appropriate SYNONYM of the given word.
GENEROUS
Stingy.
Liberal.
Miser.
Friendly.
Generous అంటే ఉదార స్వభావం కలవారు లేదా దానగుణం ఉన్నవారు. Liberal కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. Stingy మరియు Miser అంటే పిసినారి అని అర్థం.
Select the option that can be used as a one-word substitute for the given group of words.
A medical specialist who administers medicine to patients to make them unconscious before surgery.
Radiologist.
Anaesthetist.
Analgesic.
Pathologist.
సర్జరీకి ముందు రోగులకు స్పృహ లేకుండా చేయడానికి మందులు ఇచ్చే వైద్యుడిని Anaesthetist (అనస్థీషియాలజిస్ట్) అంటారు.
Fill in the blank with the most appropriate option.
She writes articles ________.
Creative.
Creatively.
Creativity.
not creatively.
ఇక్కడ writes అనే verb ను వివరిస్తున్నాం కాబట్టి Creatively (adverb) ఉపయోగించాలి. Creative అనేది adjective అలాగే Creativity అనేది noun.
Fill in the blank with the most appropriate phrase.
You can ________ a friend to the party we are having tonight.
bring along.
bring up.
bring out.
bring about.
Bring along అంటే ఎవరినైనా లేదా దేన్నైనా మనతో పాటు తీసుకురావడం. ఇక్కడ పార్టీకి స్నేహితుడిని తీసుకురావడం గురించి చెబుతున్నాం కాబట్టి ఇది సరైనది.
Select the option that can be used as a one-word substitute for the given group of words.
A number of birds of one kind feeding, resting or travelling together.
School.
Band.
Flock.
Herd.
పక్షుల సమూహాన్ని ఇంగ్లీష్ లో Flock అంటారు. School అనేది చేపల సమూహానికి; Herd అనేది పశువుల సమూహానికి ఉపయోగిస్తారు.
Fill in the blank with the most appropriate option.
The ________ of singers sang well.
Pair.
Choir.
Bunch.
Sheaf.
గాయకుల సమూహాన్ని (Group of singers) ఇంగ్లీష్ లో Choir అంటారు. Bunch పూలకు లేదా ద్రాక్షలకు; Sheafఅనేది ధాన్యపు కట్టలకు ఉపయోగిస్తారు.
Select the most appropriate ANTONYM of the given word.
COMPLICATED
Complex.
Sly.
Simple.
Calm.
Complicated అంటే సంక్లిష్టమైన లేదా చిక్కులతో కూడిన అని అర్థం. దీనికి Antonym (వ్యతిరేక పదం) Simple, అంటే సరళమైన లేదా సులభమైన అని అర్థం. Complex అనేది దీనికి Synonym (పర్యాయ పదం).
NOTE:- As per KEY ప్రకారం “Complex” ఆన్సర్ గా ఇచ్చారు. కాని Sources ప్రకారం మాత్రం “Simple” కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది గమనించగలరు.
Select the most appropriate ANTONYM of the given word.
VOLUNTARY
Compulsory.
Complement.
Volunteer.
Wise.
Voluntary అంటే స్వచ్ఛందంగా (సొంత ఇష్టంతో) చేసేది. దీనికి Antonym (వ్యతిరేక పదం) Compulsory, అంటే ఖచ్చితంగా లేదా నిర్బంధంగా చేయాల్సింది అని అర్థం.
Parts of a sentence are given below in jumbled order.
- a survey on parking in Delhi
- in the city were under-utilised
- found that several multi-level car parks
- because there was no parking charge on public land
Arrange the parts in the right order to form a meaningful sentence.
ACBD.
ABCD.
ADCB.
ABDC.
మొదట సర్వే గురించి (A), అది ఏం చెప్పిందంటే పార్కింగ్ కేంద్రాల గురించి (C), అవి ఖాళీగా ఉన్నాయని (B), ఎందుకంటే బయట ఫ్రీ పార్కింగ్ ఉండటం వల్ల (D). అందుకే ACBD సరైన వరుస క్రమం.
Select the most appropriate SYNONYM of the given word.
SENSELESS
Clever.
Unreasonable.
Reasonable.
Wise.
Senseless అంటే అర్థం లేని లేదా విచక్షణ లేని అని అర్థం. దీనికి Synonym (పర్యాయపదం) Unreasonable, అంటే హేతుబద్ధం కానిది లేదా సరైన కారణం లేనిది.
Select the most appropriate option to fill in the blank.
The penguins make ________ nests with stones.
its.
her.
their.
them.
ఇక్కడ Penguins అనేది plural (బహువచనం) లో ఉంది, కాబట్టి “వాటి యొక్క” అని అర్థం వచ్చేలా 'their' ఉపయోగించాలి.
Select the most appropriate ANTONYM of the given word.
VACANT
Penchant.
Talkative.
Occupied.
Fleet.
Vacant అంటే ఖాళీగా ఉండటం. దీనికి Antonym (వ్యతిరేక పదం) Occupied, అంటే నిండి ఉండటం లేదా ఎవరైనా కలిగి ఉండటం.
Fill in the blank with the most appropriate option.
He is greedy to earn money ________ he is a billionaire.
In spite of.
Despite.
Yet.
Though.
Though అంటే 'అయినప్పటికీ' అని అర్థం. అతను కోటీశ్వరుడు అయినప్పటికీ (Though he is a billionaire), ఇంకా డబ్బు సంపాదించాలనే అత్యాశతో ఉన్నాడు అని చెప్పడానికి ఇది సరైనది.
Select the most appropriate SYNONYM of the given word.
AGITATED
calm.
relaxed.
flustered.
lenient.
Agitated అంటే ఆందోళనగా లేదా కలవరపడి ఉండటం. దీనికి Synonym (పర్యాయపదం) Flustered, అంటే కూడా కంగారుగా లేదా కలవరపడి ఉండటం.
Fill in the blank with the most appropriate option.
Shankar ________ the rich and the poor alike.
not treats.
treats.
treat.
treating.
Shankar అనేది Third Person Singularకాబట్టి, Simple Present Tense లో verb కు 's' చేర్చి Treats అని వాడాలి.
Select the most appropriate option to complete the sentence.
There was a big disagreement between them ________.
over how to teaching their child.
about how teach their child.
over how teaching their child.
about how to teach their child.
Disagreement తర్వాత about ఉపయోగించడం సరైనది. అలాగే how తర్వాత to + verb (teach) అనే ఫార్మాట్ రావాలి.
Fill in the blank with the most appropriate option.
It is always good ________ fruits and veggies to remain healthy.
consume.
consuming.
to consume.
consumes.
It is good వంటి పదాల తర్వాత పనిని తెలపడానికి to + V1 (Infinitive) వాడాలి. అందుకే to consume సరైనది.
The following sentences when put together form a paragraph. However, one of the sentences does not belong to this paragraph. Identify the sentence.
The chutney is an ubiquitous fact of Indian cuisine no matter where you go.
The chutney is made from a mind-boggling variety of ingredients.
In my travels I have found great enjoyment in interacting with people in the market area.
To turn one kind of chutney into another kind, ingredients can be subtracted or added.
మిగతా మూడు వాక్యాలు 'Chutney' గురించి వివరిస్తుండగా, ఈ వాక్యం మాత్రం 'మార్కెట్‌లోని ప్రజలతో సంభాషణ' గురించి చెబుతోంది. కాబట్టి ఇది పేరాగ్రాఫ్ అంశానికి (Context) సంబంధం లేని వాక్యం.
Select the most appropriate SYNONYM of the given word.
LOYAL
Devoted.
Disloyal.
Troubled.
Faint.
Loyal అంటే విశ్వాసపాత్రమైన లేదా విధేయత కలిగిన అని అర్థం. దీనికి Synonym (పర్యాయ పదం) Devoted, అంటే అంకితభావం లేదా అమితమైన భక్తి/విశ్వాసం కలిగి ఉండటం.
Select the most appropriate SYNONYM of the given word.
DESPISE
Espouse.
Promote.
Hate.
Adore.
Despise అంటే అసహ్యించుకోవడం లేదా తక్కువ చేసి చూడటం అని అర్థం. దీనికి Synonym (పర్యాయ పదం) Hate, అంటే ద్వేషించడం లేదా అసహ్యించుకోవడం.
Select the most appropriate ANTONYM of the given word.
WISDOM
Wise.
Folly.
Clarity.
Candid.
Wisdom అంటే తెలివితేటలు, జ్ఞానం లేదా వివేకం అని అర్థం. దీనికి Antonym (వ్యతిరేక పదం) Folly, అంటే తెలివితక్కువతనం లేదా మూర్ఖత్వం.
Parts of the given sentence have been Highlighted in Red. One of them contains an error.
He remained silently when the teacher asked him a question.
Select the option that contains the error.
remained.
silently.
asked.
a question.
ఇక్కడ remained అనేది linking verb, కాబట్టి దాని పక్కన adjective ఉండాలి. silently (adverb) కి బదులుగా silent (adjective) ఉండటం సరైనది.
Select the most appropriate meaning of the Highlighted in Red idiom in the given context.
The failure of Chandrayaan-2 to land on the moon will be beneficial for our space programme in the long run.
regularly.
ultimately.
immediately.
occasionally.
'In the long run' అనే జాతీయం (idiom) కు అర్థం 'చివరికి' లేదా 'చాలా కాలం తర్వాత' (ultimately అంటే over a long period of time).
Parts of the given sentence have been Highlighted in Red. One of them contains an error.
A mysteriously chamber in an Egyptian pyramid has been recently discovered by scientists.
Select the option that contains the error.
mysteriously.
recently.
discovered.
by scientists.
ఇక్కడ chamber అనేది noun, దానిని వివరించడానికి adjective కావాలి. కాబట్టి mysteriously (adverb) కు బదులుగా mysterious (adjective) ఉండాలి.
Parts of the given sentence have been Highlighted in Red. One of them contains an error.
This diamond has aroused a great deal of curious among the collectors.
Select the option that contains the error.
has aroused.
a great deal of.
curious.
among.
ఇక్కడ curious (adjective) కి బదులుగా curiosity (noun) ఉండాలి. A great deal of తర్వాత ఎప్పుడూ noun రావాలి.