📢 ముఖ్యమైన సూచనలు:
📝 మొత్తం ప్రశ్నలు: 30 జనరల్ నాలెడ్జ్ (GK).
⏱️ సమయం: 40 నిమిషాలు.
🎯 మార్కులు: ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.
🚫 నెగటివ్ మార్కింగ్: లేదు (No Negative Marking).
📑 పరీక్షా విధానం:
1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.
2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.
3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.
4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.
భారతదేశంలోని ఏ నగరాన్ని 'సరస్సుల నగరం'అని కూడా పిలుస్తారు?
భోపాల్.
లక్నో.
ఉదయపూర్.
బెంగళూరు.
భారతదేశంలో రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరాన్ని 'సరస్సుల నగరం' (City of Lakes) అని పిలుస్తారు. ఈ నగరంలో పిచోలా సరస్సు, ఫతే సాగర్, ఉదయ సాగర్, రాజ్‌సమంద్ వంటి ఏడు ప్రధానమైన మరియు అందమైన సరస్సులు ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది.
భారతదేశంలో అత్యధికంగా గోధుమ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
పంజాబ్.
గుజరాత్.
పశ్చిమబెంగాల్.
ఉత్తరప్రదేశ్.
భారతదేశంలో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశం మొత్తం గోధుమ ఉత్పత్తిలో సుమారు 30% కంటే ఎక్కువ వాటా ఈ ఒక్క రాష్ట్రానిదే. విశాలమైన సాగు భూమి మరియు గంగా-యమునా నదుల సారవంతమైన మైదానాలు ఇందుకు ప్రధాన కారణం. అయితే హెక్టారుకు సగటు దిగుబడి (Productivity) పరంగా పంజాబ్ మొదటి స్థానంలో ఉంటుంది.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?
మహారాష్ట్ర.
కర్ణాటక.
తెలంగాణ.
ఒడిశా.
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. కోర్ ఏరియా (ప్రధాన ప్రాంతం) పరంగా ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పులుల అభయారణ్యం. ఇది తూర్పు కనుమల్లోని నల్లమల కొండల్లో ఉంది. వైవిధ్యభరితమైన వన్యప్రాణులకు, ముఖ్యంగా పులుల సంరక్షణకు ఇది ప్రధాన కేంద్రం.
ధ్వని యొక్క తీవ్రతను ఎందులో కొలుస్తారు?
డెసిబెల్స్.
హెర్ట్జ్.
పిచ్.
ఫ్రీక్వెన్సీ.
ధ్వని యొక్క తీవ్రతను డెసిబెల్స్‌లో కొలుస్తారు. ధ్వని ఎంత గట్టిగా ఉందో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే ధ్వని తీవ్రత సాధారణంగా 60 dB వరకు ఉంటుంది. అయితే 85 dB కంటే ఎక్కువ తీవ్రత ఉన్న శబ్దాలు నిరంతరం వినడం వల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది మరియు అది ధ్వని కాలుష్యంగా మారుతుంది.
భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను ఏమంటారు?
జీవావరణం.
వాతావరణం.
జలావరణం.
శిలావరణం.
భూమిని చుట్టుముట్టి ఆవరించి ఉన్న వాయువుల సన్నటి పొరను 'వాతావరణం' (Atmosphere) అంటారు. ఇది భూమికి గొడుగులా పనిచేస్తూ, జీవరాశి మనుగడకు అవసరమైన ప్రాణవాయువును (ఆక్సిజన్) అందించడమే కాకుండా, సూర్యుడి నుండి వచ్చే హానికరమైన కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది.
మానవ గుండెలో ఎన్ని గదులుంటాయి?
6.
5.
2.
4.
మానవ గుండె నాలుగు గదులను కలిగి ఉంటుంది. పైన ఉండే రెండు గదులను కర్ణికలు (Atria) అని, కింద ఉండే రెండు గదులను జఠరికలు (Ventricles) అని పిలుస్తారు. ఈ గదుల ద్వారానే రక్తం శరీరమంతటికీ సరఫరా అవుతుంది.
తెలంగాణలో బోనాలు పండుగను తెలుగు నెల _____ లో జరుపుకుంటారు.
ఆషాడం.
ఫాల్గుణం.
చైత్రం.
కార్తీకం.
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బోనాలు, ప్రతి ఏటా తెలుగు నెల ఆషాడంలో అత్యంత వైభవంగా ప్రారంభమవుతాయి. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి సమర్పించే మొదటి బోనంతో ఈ ఉత్సవాలు మొదలై, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్ బోనాలు), హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి వరకు నెల రోజుల పాటు సాగుతాయి.
పల్స్ రేటు ________ కి సమానంగా ఉంటుంది.
హృదయ స్పందన.
శ్వాస రేటు.
1 మరియు 2.
రక్త ప్రవాహం.
గుండె ఒకసారి కొట్టుకున్నప్పుడు రక్తనాళాల్లో కలిగే ఒత్తిడినే 'పల్స్' అంటాం, అందుకే పల్స్ రేటు ఎల్లప్పుడూ హృదయ స్పందనకు సమానంగా ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషిలో ఇది నిమిషానికి 70-80 సార్లు ఉంటుంది. మరోవైపు, శ్వాస రేటు అనేది నిమిషానికి మనం తీసుకునే శ్వాసల సంఖ్యను తెలియజేస్తుంది. ఇది హృదయ స్పందన కంటే చాలా తక్కువగా (12-16 సార్లు) ఉంటుంది.
2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎవరికి లభించింది?
అమితాబ్ బచ్చన్.
షారూఖ్ ఖాన్.
మిథున్ చక్రవర్తి.
జాకీ ప్రాఫ్.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2022 సంవత్సరానికి గాను (2024లో ప్రకటించారు) ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి లభించింది. అక్టోబర్ 2024లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఏ నదిని ‘బీహార్ యొక్క దుఃఖ దాయని అని పిలుస్తారు?
సబర్మతి.
కోసి.
చంబల్.
బానాస్.
బీహార్ రాష్ట్రంలో ప్రవహించే కోసి నదిని 'బీహార్ దుఃఖ దాయిని' (Sorrow of Bihar) అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం, వర్షాకాలంలో ఈ నది తన ప్రవాహ మార్గాన్ని తరచుగా మార్చుకుంటూ భయంకరమైన వరదలను సృష్టించడం. దీనివల్ల బీహార్‌లోని వ్యవసాయ భూములు, గ్రామాలు భారీగా నష్టపోతాయి.
ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ ఎవరు?
సుమిత్రమహాజన్.
ఓం బిర్లా.
యం.ఏ. అయ్యంగార్.
యం. వెంకయ్యనాయుడు.
శ్రీ ఓం బిర్లా ప్రస్తుతం లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 2019 (17వ లోక్‌సభ) మరియు 2024 (18వ లోక్‌సభ) లో వరుసగా రెండుసార్లు స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాజస్థాన్‌లోని కోటా నియోజకవర్గం నుండి ఆయన M.Pగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఏమి అవసరం?
కాంతి.
కార్బన్ డై ఆక్సైడ్.
పత్రహరితం.
పైవన్నీ.
మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకునే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ ప్రక్రియ సూర్యకాంతి సమక్షంలో జరుగుతుంది. దీనికి గాలి నుండి CO₂, నేల నుండి నీరు, మరియు ఆకులలో ఉండే పత్రహరితం అత్యంత అవసరం. వీటిలో ఏది లేకపోయినా మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకోలేవు.
గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది?
బెంగళూరు.
హైదరాబాద్.
చెన్నై.
పుణే.
గూగుల్ సంస్థ తన మొట్టమొదటి ఆసియా-పసిఫిక్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్‌ను (GSEC) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు డిసెంబర్ 2024లో ప్రకటించింది. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 18 జూన్ 2025న హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో అధికారికంగా ప్రారంభించారు.
ఈ క్రింది వాటిలో శ్రీకృష్ణదేవరాయలు బిరుదు ఏది?
ఛత్రపతి.
సఖీహలుడు.
పరిప్లవ.
ఆంధ్రభోజుడు.
విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలకు సాహిత్యం, కళల పట్ల ఉన్న మక్కువ వల్ల ఆయనకు 'ఆంధ్రభోజుడు' అనే బిరుదు వచ్చింది. ఆయన స్వయంగా 'ఆముక్తమాల్యద' అనే గ్రంథాన్ని రచించిన గొప్ప కవి. రాయల వారి ఆస్థానాన్ని 'భువన విజయం' అని పిలిచేవారు, అక్కడ ఎనిమిది మంది గొప్ప కవులు (అష్టదిగ్గజాలు) ఉండేవారు.
మండల్ కమిషన్ కింది ప్రధాన మంత్రులలో ఎవరి కాలంలో ఏర్పడింది?
ఇందిరా గాంధీ.
రాజీవ్ గాంధీ.
మొరార్జీ దేశాయ్.
వి.పి. సింగ్.
భారతదేశంలో సామాజికంగా మరియు విద్యాపరంగా, వెనుకబడిన తరగతుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి 1979లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం బి.పి. మండల్ అధ్యక్షతన ఈ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనినే 'రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్' అని కూడా పిలుస్తారు.
భారతదేశంలో అతిపెద్ద డెల్టా (మైదాన ప్రాంతం) ఏది?
కావేరి.
సుందర బన్.
మహానది.
గోదావరి.
భారతదేశంలో మరియు ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాగా పేరుగాంచిన సుందర బన్ డెల్టా భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉంది. గంగా మరియు బ్రహ్మపుత్ర నదుల సంగమం వల్ల ఈ అద్భుతమైన డెల్టా ఏర్పడింది. ఈ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధ రాయల్ బెంగాల్ టైగర్లకు నిలయం. సుందర బన్ నేషనల్ పార్క్‌ను 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
1979లో పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకున్న దేశం ఏది?
భారతదేశం.
ఇంగ్లాండ్.
వెస్టిండీస్.
ఆస్ట్రేలియా.
1979లో జరిగిన రెండవ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ (Prudential Cup) ను వెస్టిండీస్ గెలుచుకుంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్‌లో వెస్టిండీస్ జట్టు ఇంగ్లాండ్‌ను 92 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి (1975, 1979) ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
గంగా నది యొక్క ఇతర పేరు ఏమిటి?
ఇండస్.
భగీరథి.
సతోపంతో.
సట్లెజ్.
గంగా నది జన్మస్థానమైన ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హిమనీనదం వద్ద దీనిని 'భగీరథి' అని పిలుస్తారు. దేవప్రయాగ వద్ద భగీరథి మరియు అలకనంద నదులు సంగమించిన తర్వాతే దీనికి 'గంగ' అనే పేరు వస్తుంది. గంగా నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించిన తర్వాత దీనిని 'పద్మ' అని పిలుస్తారు.
ప్రతి సంవత్సరం భారత సైనిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
మార్చి 26.
జనవరి 15.
జనవరి 26.
ఆగస్టు 15.
ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవం జరుపుకుంటారు. 1949లో ఇదే రోజున ఫీల్డ్ మార్షల్ కె.ఎమ్. కరియప్ప గారు బ్రిటిష్ వారి నుండి భారత సైన్యానికి మొదటి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. సైనికుల ధైర్యసాహసాలకు గుర్తుగా ఈ చారిత్రక ఘట్టాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
'జీవ పరిణామ సిద్ధాంతాన్ని' ప్రతిపాదించినవారు ఎవరు?
గ్రెగర్ మెండల్.
ఆల్ఫ్ర్ఫెడ్ రసెల్ వాలెస్.
చార్లెస్ డార్విన్.
వాట్సన్.
చార్లెస్ డార్విన్ తన ప్రసిద్ధ గ్రంథమైన 'ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్' (On the Origin of Species) లో జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జీవులన్నీ ఒకే పూర్వీకుల నుండి సహజ వరణం ద్వారా కాలక్రమేణా మార్పులకు లోనవుతూ, అభివృద్ధి చెందాయని ఆయన వివరించారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏది?
USA.
బ్రిటన్.
భారతదేశం.
జర్మనీ.
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు మరియు అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ ఉన్నందున భారతదేశాన్ని "ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం" (Largest Democracy in the world) అని పిలుస్తారు. 2024 సాధారణ ఎన్నికల నాటికి భారత్‌లో సుమారు 97 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు, ఇది ఏ ఇతర ప్రజాస్వామ్య దేశంలోనూ లేదు.
భారతీయ జాతీయ సైన్యాన్ని ఎవరు ప్రారంభించారు?
బిపిన్ చంద్ర పాల్.
భగత్ సింగ్.
సుభాష్ చంద్ర బోస్.
చంద్రశేఖర్ ఆజాద్.
భారత జాతీయ సైన్యం (INA) మొదటి రూపకల్పన 1942లో జపాన్‌లో కెప్టెన్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనిని రాష్ బిహారీ బోస్ సహాయంతో స్థాపించారు. అయితే 1943లో సింగపూర్‌లో సుభాష్ చంద్ర బోస్ దీని బాధ్యతలు స్వీకరించి, పునరుజ్జీవం పోసి, ఒక శక్తివంతమైన సైన్యంగా పునర్వ్యవస్థీకరించారు. దీనిని 'ఆజాద్ హింద్ ఫౌజ్' అని కూడా పిలుస్తారు.
ఈ క్రింది దేశాలలో ఏది BRICSలో భాగం కాదు?
ఇరాన్.
UAE.
ఇథియోపియా.
ఇండోనేషియా.
2024 జనవరి 1 నుండి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, మరియు UAE అధికారికంగా బ్రిక్స్ (BRICS) లో పూర్తిస్థాయి సభ్యత్వం పొందాయి.
NOTE: ఈ ప్రశ్నపత్రం తయారు చేసిన నాటికి ఇండోనేషియా ఇంకా పూర్తిస్థాయి సభ్యదేశంగా లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం, 2025లో ఇండోనేషియా కూడా బ్రిక్స్ (BRICS) లో పూర్తిస్థాయి సభ్యత్వ దేశంగా చేరింది.
ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి దేనిని ఉపయోగిస్తారు?
అక్షాంశం.
రేఖాంశం.
భూమధ్య రేఖ.
1 & 2.
ఒక ప్రదేశం లేదా ప్రాంతం యొక్క ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించడానికి అక్షాంశాలు మరియు రేఖాంశాలు రెండింటినీ ఉపయోగిస్తారు. ఇవి గ్లోబుపై ఒకదానికొకటి నిలువుగా మరియు అడ్డంగా ఖండించుకుంటూ ఒక గ్రిడ్ లాగా ఏర్పడతాయి. నేడు మనం వాడుతున్న GPS సాంకేతికత కూడా ఈ అక్షాంశ, రేఖాంశాల ఆధారంగానే పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎవరు?
శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
శ్రీ దామోదర రాజనరసింహ.
శ్రీ పొన్నం ప్రభాకర్.
శ్రీ భట్టి విక్రమార్క మల్లు.
తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రిగా శ్రీ భట్టి విక్రమార్క మల్లు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన ఆర్థిక శాఖతో పాటు ప్రణాళికా (Planning) శాఖను కూడా నిర్వహిస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది?
1928.
1948.
1934.
1935.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1935, ఏప్రిల్ 1న కలకత్తాలో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం 1937లో శాశ్వతంగా ముంబైకి మార్చబడింది. భారత ప్రభుత్వం దీనిని 1949 జనవరి 1న జాతీయం చేసింది. RBI మొదటి గవర్నర్‌గా సర్ ఓస్బోర్న్ స్మిత్, మొదటి భారతీయ గవర్నర్‌గా సి.డి. దేశ్‌ముఖ్ పనిచేశారు. ప్రస్తుతం 26వ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకుని పదవిని పొందటానికి లోక్‌సభలో ఒక పార్టీకి అవసరమైన కనీస సీట్ల శాతం ఎంత?
10%.
20%.
15%.
25%.
లోక్‌సభలో ఒక రాజకీయ పార్టీ అధికారికంగా 'ప్రతిపక్ష పార్టీ' హోదాను పొందాలంటే, ఆ సభలోని మొత్తం స్థానాల్లో కనీసం 10 శాతం సీట్లను గెలుచుకోవాలి. లోక్‌సభలోని మొత్తం 543 స్థానాలకు గాను కనీసం 55 సీట్లు సాధించిన పార్టీ నాయకుడిని 'ప్రతిపక్ష నాయకుడు' (Leader of the Opposition) గా గుర్తిస్తారు. ప్రస్తుత 18వ లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుగాంచిన వారెవరు?
కాళోజీ.
కె. చంద్రశేఖర్ రావు.
మర్రి చెన్నారెడ్డి.
ప్రొఫెసర్ జయశంకర్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సిద్ధాంతపరమైన పునాది వేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారిని 'తెలంగాణ సిద్ధాంతకర్త' అని పిలుస్తారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను, ఆ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించి, ఆయన ఉద్యమానికి దిశానిర్దేశం చేశారు. ఆయన తన జీవితాంతం తెలంగాణ స్వరాష్ట్ర కాంక్ష కోసమే పోరాడారు.
16వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?
వై.వి. రెడ్డి.
ఎన్. కె. సింగ్.
సి. రంగరాజన్.
డా॥అరవింద్ పనగారియా.
భారత ప్రభుత్వం 16వ ఆర్థిక కమిషన్ (16th Finance Commission) ఛైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియాను నియమించింది. ఈ కమిషన్ 2026 ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీపై సిఫార్సులు చేస్తుంది. 15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్‌గా ఎన్. కె. సింగ్ పనిచేశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్ ఎవరు?
ఇ.ఎస్.ఎల్. నరసింహన్.
డాక్టర్ తమిళసై సౌందరరాజన్.
సి పి రాధాకృష్ణన్.
జిష్ణుదేవ్ వర్మ.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఇ.ఎస్.ఎల్. నరసింహన్ గారే తెలంగాణకు తొలి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️

ఈ ప్రాసెస్ సర్వర్ Test గురించి కొన్ని ముఖ్యమయిన ప్రశ్నలు మరియు వాటి సమాదానాలు:
ఇది ఏ exam question paper?
ఇది 2025 లో జరిగిన TS High Court and District Court Process Server question paper.
ఈ practice exam లో ఏయే subjects questions ఉన్నాయి?
ఈ Question Paper లో GK (జనరల్ నాలెడ్జ్) 30 questions ఉన్నాయి.
ఈ questions ని Free గా practice చేయవచ్చునా?
అవును Free గా practice చేసుకోవచ్చును.
ఈ practice test ఎందుకు మరియు దీని ఉద్దేశం ఏమిటి?
ఈ test లోని previous questions ని practice చేయడం వలన Process Server 2026 TG Court Exam pattern తెలుస్తుంది మరియు ఈ test exam environment లో ఉండడం వలన మీకు time లో exam complete ఎలా చేయాలో తెలుస్తుంది. అంతే కాకుండా ప్రతి question ని clear గా explain చేసాము కావున మీకు subject మీద అదేవిధముగా concept మీద కూడా అవగాహన పెరుగుతుంది.
Mobile లో practice చేసుకోవచ్చునా?
అవును, పూర్తి ఉచితముగా mobile లో practice చేసుకోవచ్చును.
