Test 1: 4th Class EVS Bits


🕒 35 MCQs | 45 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 35
🟢 0 🔴 0
45:00
గిజిగాడు పక్షులలో గూళ్ళను నిర్మించేవి ఏవి?
ఆడ పక్షులు మాత్రమే.
మగ పక్షులు మాత్రమే.
ఆడ మరియు మగ పక్షులు.
ఏదీ కాదు.
గిజిగాడు పక్షులలో మగ పక్షులు మాత్రమే గూళ్ల నిర్మాణం చేస్తాయి. వాటిలో ఆడ పక్షి తనకు నచ్చిన గూటిలో గుడ్లు పెట్టి పొదుగుతుంది. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి గాలిలోకి ఎగరగానే ఆ పక్షులు గూడును వదిలేస్తాయి.
ట్రాఫిక్ నియమాలకు సంబంధించి క్రిందివాటిలో సరైనది ఏది?
ఎర్రలైటు వెలిగినప్పుడు ఆగడం.
ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు సిద్ధంగా ఉండడం .
గ్రీన్ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం.
పైవన్నీ సరైనవే.
ట్రాఫిక్ నియమాల ప్రకారం, ఎర్రలైటు వెలిగినప్పుడు వాహనాలు ఆగాలి, ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్లేందుకు సిద్దంగా ఉండాలి. అయితే కేవలం గ్రీన్ లైటు వెలిగినప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఈ నియమాలు రోడ్లపై భద్రతకు మూలాధారంగా ఉంటాయి.
పూర్వకాలంలో కుటుంబాలు ఎలా ఉండేవి?
చిన్న కుటుంబాలు.
పెద్ద కుటుంబాలు.
ఒక్క వ్యక్తి మాత్రమే ఉండేవాడు.
సాంకేతిక జీవనం.
పూర్వకాలంలో పెద్ద కుటుంబాలు ఉండేవి. వీటినే ఉమ్మడి లేదా సమిష్టి కుటుంబాలు అని కూడా పిలుస్తారు. ఈ కుటుంబాలలో తాతయ్య, నానమ్మ, పెద్ద నాన్న, పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అత్తమ్మ, తల్లిదండ్రులు, పిల్లలంతా కలసి ఉంటారు.
రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుషులు రోడ్డు దాటడాన్ని ఏమంటారు?
లెవెల్ క్రాసింగ్.
వెహికిల్ క్రాసింగ్.
జీబ్రా క్రాసింగ్.
ఏదీ కాదు.
రోడ్డుపైన చారలు గీసి ఉన్నచోట మనుషులు రోడ్డు దాటడాన్ని “జీబ్రా క్రాసింగ్” అంటారు. ఇది ప్రమాదాలు జరగకుండా ఉండడానికి పాదచారుల భద్రత కోసం ప్రత్యేకంగా సూచించబడిన ప్రాంతం. దీనివద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి.
సైనా నెహ్వాల్ కు ఏ క్రీడతో సంబంధం కలదు?
టెన్నిస్.
బ్యాడ్మింటన్.
హాకీ.
షూటింగ్.
సైనా నెహ్వాల్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె ఒలింపిక్ పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఆమె ఆటతీరు దేశానికి గౌరవం తీసుకొచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ఏ పక్షిని రాష్ట్రపక్షిగా ప్రకటించింది?
నెమలి.
పావురం.
పాలపిట్ట.
గోరింక.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపక్షిగా “పాలపిట్ట” ను ప్రకటించింది. దీనిని ఇండియన్ రోలర్ లేదా బ్లూజే అని కూడా పిలుస్తారు. దసరా ఉత్సవాలలో పాలపిట్టను చూడడం శుభసూచకంగా భావిస్తారు.
జీవవైవిధ్యం దెబ్బ తినడానికి గల ప్రధాన కారణం ఏమిటి?
విచక్షణారహితంగా అడవులను నరకడం.
జంతువులను వేటాడడం.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
జీవవైవిధ్యం దెబ్బ తినడానికి ముఖ్యమైన కారణాలు: - విచక్షణారహితంగా అడవులను నరకడం మరియు జంతువులను వేటాడడం. ఈ రెండు చర్యలు జీవుల నివాసాలను నాశనం చేస్తాయి, వాటి సంఖ్య తగ్గుతుంది, మరియు కొన్ని జాతులు అంతరించిపోతాయి.
అడవిలోని ఒక్కో ఏనుగుల గుంపులో ఎన్ని ఏనుగులు ఉంటాయి?
12-15 ఏనుగులు.
10-20 ఏనుగులు, వాటి పిల్లలు.
10-12 ఏనుగులు, వాటి పిల్లలు.
20-30 ఏనుగులు.
అడవిలో ఒక్కో ఏనుగుల గుంపులో సాధారణంగా 10 నుండి 12 ఏనుగులు, వాటి పిల్లలు ఉంటాయి, వీటిలో ఎక్కువగా ఆడ ఎనుగులే ఉంటాయి. మగ ఏనుగులు చిన్నవిగా ఉన్నప్పుడు గుంపులోనే ఉండి15 ఏండ్ల వయసు రాగానే గుంపు నుండి వేరుపడుతాయి.
ప్రస్తుతం భూమిపై కనిపించని జంతువులు ఏవి?
డైనోసార్లు.
ఆఫ్రికన్ ఏనుగులు.
అర్జెంటినా ప్యామ్పాస్ టర్టిల్ .
బంగ్లాదేశ్ పటలుకోతి.
భూమి చరిత్రలో అంతరించిపోయిన అత్యంత ప్రసిద్ధ జంతువులలో డైనోసార్‌లు ఒకటి. మానవ కార్యకలాపాలు, ఆవాసాల నష్టం, మరియు వాతావరణ మార్పుల కారణంగా అనేక జంతువులు అంతరించిపోతున్నాయి.
కందిరీగలలో గూళ్ళను నిర్మించేవి ఏవి?
ఆడ కందిరీగలు మాత్రమే.
మగ కందిరీగలు మాత్రమే.
మగ మరియు ఆడ కందిరీగలు.
ఏదీ కాదు.
కందిరీగలలో చాలా రకాలున్నాయి. అవి ఉండే పరిసరాలకు తగినట్లుగా వాటి గూళ్ళను నిర్మించుకుంటాయి. అయితే ఆడ కందిరీగలు మాత్రమే గూళ్లను నిర్మిస్తాయి. మగ కందిరీగలు సాధారణంగా ఆహారం సేకరణలో మరియు రక్షణలో సహాయం చేస్తాయి, కానీ గూళ్ల నిర్మాణంలో పాల్గొనవు.
క్రిందివాటిలో చెవులు బయటకు కనిపించని జీవులు ఏవి?
పక్షులు.
బల్లులు.
మొసళ్ళు.
పైవన్నీ సరైనవే.
పక్షుల చెవులు బయటకు కన్పించవు. పక్షి తలకు ఇరువైపులా రెండు రంధ్రాలు ఉంటాయి.సాధారణంగా ఈ రంధ్రాలు ఈకలతో కప్పబడి ఉంటాయి. ఇవి వినడానికి సహాయపడుతాయి. అలాగే బల్లి తలపై, మొసలి తలపై రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. వాటిద్వారా అవి వినగల్గుతాయి.
ఏనుగుల గుంపుకు ఏ ఏనుగు నాయకత్వం వహిస్తుంది?
పెద్ద వయసున్న ఆడ ఏనుగు.
పెద్ద వయసున్న మగ ఏనుగు.
ఆడ ఏనుగు మరియు మగ ఏనుగు.
చిన్న వయసున్న మగ ఏనుగు.
సాధారణంగా ఏనుగుల గుంపుకు పెద్ద వయసున్న ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. ఇది ఉదయాన్నే పెద్దగా ఘీంకరించి ఆహారం కోసం బయలుదేరుతుంది. గుంపులోని మిగతా ఎనుగులన్నీ దీన్ని అనుసరిస్తాయి. ఈ ఆడ ఏనుగు అనుభవంతో గుంపును రక్షణ, ఆహారం, మరియు మార్గదర్శకత్వంలో ముందుకు నడిపిస్తుంది.
అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమె నివసించే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
వ్యష్టి కుటుంబం.
ఉమ్మడి కుటుంబం.
పెద్ద కుటుంబం.
ఏదీ కాదు.
తల్లి, తండ్రి మరియు పిల్లలతో మాత్రమే ఉండే కుటుంబాన్ని వ్యష్టి కుటుంబం అంటారు. దీనినే చిన్న కుటుంబం అని కూడా పిలుస్తారు.
2011లో క్రికెట్ వన్డే ప్రపంచకప్పును గెల్చుకున్న దేశం ఏది?
శ్రీలంక.
ఆస్ట్రేలియా.
భారతదేశం.
న్యూజీలాండ్.
2011 ICC వన్డే ప్రపంచకప్ ను భారతదేశం గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగింది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో భారత్ విజయం సాధించింది.
గగన్ నారంగ్ ఏ క్రీడలో ఒలంపిక్ పతాకాన్ని సాధించారు?
బాక్సింగ్.
కబడ్డీ.
హాకీ.
షూటింగ్.
గగన్ నారంగ్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత షూటర్. ఆయన 2012 లండన్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించారు.
గుడ్లు పెట్టి పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు?
శిశోత్పాదకాలు.
క్షీరదాలు.
అండోత్పాదకాలు.
ఏదీ కాదు.
ఏ జంతువులకు చెవులు బయటకు కనిపించకుండా, వాటి చర్మంపై వెంట్రుకలు ఉండవో అలాంటి జంతువులు గుడ్లు పెడుతాయి. గుడ్లుపెట్టి పిల్లల్ని కనే జంతువులను “అండోత్పాదకాలు” అని అంటారు. పక్షులు, చేపలు, బల్లులు ఈ విధంగా పిల్లలను ఉత్పత్తి చేస్తాయి.
కబడ్డీ కోర్టులో మధ్యగీతకు వెంటనే రెండువైపులా ఉండే గీతను ఏమంటారు?
చివరి గీత.
కూర్చునే గీత.
తొక్కుడు గీత.
అంచు గీత.
కబడ్డీ కోర్టులో మధ్యగీతకు సరిగా రెండు వైపులా ఉండే గీతను “తొక్కుడు గీత” (డెడ్ లైన్) అంటారు. కూతకు వెళ్ళినవారు వెనుకకు వచ్చేలోగా ఆ తొక్కుడు గీతను తప్పనిసరిగా తాకాలి, లేకపోతే అవుట్ అయినట్లే.
తెలంగాణా ప్రభుత్వం ఏ జంతువును రాష్ట్ర జంతువుగా ప్రకటించింది?
జింక.
పెద్దపులి.
సింహం.
చిరుతపులి.
తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర జంతువుగా “జింక” (Spotted Deer) ను ప్రకటించింది. మన రాష్ట్రంలో నల్లమల అడవుల్లో జింకలు ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన కొమ్ములు, పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా అందంగా, ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటుంది.
భారతదేశ జాతీయ జంతువు ఏది?
ఏనుగు.
పెద్దపులి.
సింహం.
జింక.
భారతదేశం యొక్క జాతీయ జంతువు “పెద్దపులి” (Royal Bengal Tiger). పెద్దపులి శక్తి, ధైర్యం, మరియు ప్రకృతికి నిబద్ధతకు ప్రతీక. ఇది భారతదేశంలో ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మరియు వన్యజీవుల సంరక్షణకు ప్రతీకగా నిలుస్తుంది.
కోనేరు హంపి ఏ ఆటలో ప్రసిద్ధి చెందింది?
టెన్నిస్.
చెస్.
బ్యాడ్మింటన్.
షూటింగ్.
కోనేరు హంపి చెస్ (చదరంగం) ఆటలో ప్రసిద్ధి చెందింది. ఆమె ప్రపంచంలోని అత్యంత నైపుణ్యం కలిగిన చెస్ క్రీడాకారిణులలో ఒకరు మరియు భారతీయ చెస్ గ్రాండ్‌మాస్టర్. ఆమె అనేక అంతర్జాతీయ పోటీల్లో విజయం సాధించి దేశానికి గౌరవం తీసుకొచ్చింది.
చీమ తన బరువుకంటే ఎన్ని రెట్లు బరువు మోయగలదు?
సుమారు 10 రెట్లు.
సుమారు 25 రెట్లు.
సుమారు 50 రెట్లు.
సుమారు 70 రెట్లు.
చీమలు తమ శరీర బరువుతో పోలిస్తే సుమారు 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవు. ఇది వాటి బలమైన కండరాలు మరియు ఎక్సోస్కెలిటన్ అనే శరీర కవచం వల్ల సాధ్యమవుతుంది.
క్రిందివాటిలో మేరీకోమ్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
బాక్సింగ్.
చదరంగం.
టెన్నిస్.
బ్యాడ్మింటన్.
మేరీ కోమ్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె ఒలింపిక్ పతక విజేత, మరియు ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన తొలి మహిళా బాక్సర్. ఆమెను “Magnificent Mary” అని కూడా పిలుస్తారు.
పాము దేనిద్వారా అలికిడి, ధ్వనులను గుర్తిస్తుంది?
నాలుక.
ముక్కు.
చర్మం.
కళ్ళు.
చెవులు చేసే పనిని పాము యొక్క చర్మం చేస్తుంది. పాము ఈ చర్మం ద్వారానే అలికిడిని, ధ్వనులను గుర్తిస్తుంది.
గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కనే జంతువులను ఏమంటారు?
అండోత్పాదకాలు.
శిశోత్పాదకాలు.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
గుడ్లు పెట్టకుండా, తల్లి శరీరంలోనే పిల్లలను పెంచి నేరుగా పిల్లల్ని కనే జంతువులను “శిశోత్పాదకాలు లేదా క్షీరదాలు” అని అంటారు.
క్రిందివాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి?
సాక్షి మాలిక్ – షూటింగ్.
విశ్వనాథన్ ఆనంద్ – చెస్.
పి.వి. సింధు – బ్యాడ్మింటన్.
మిథాలీ రాజ్ – క్రికెట్.
సాక్షి మాలిక్ ఒక ప్రసిద్ధ భారతీయ రెజ్లర్, షూటింగ్ క్రీడలో కాదు. విశ్వనాథన్ ఆనంద్ చెస్ లో, పి.వి. సింధు బ్యాడ్మింటన్ లో, మిథాలీ రాజ్ క్రికెట్ లో ప్రసిద్ధులు.
తేనెటీగలు ఎలాంటి జీవనాన్ని గడుపుతాయి?
వ్యక్తిగత జీవనం.
సామూహిక జీవనం.
పై రెండూ సరైనవే.
ఏదీ కాదు.
కొన్ని వందల తేనెటీగలు కలిసి సామూహిక జీవనం గడుపుతాయి. ఇవి గుంపులుగా కలిసి జీవిస్తూ, గూళ్ళను నిర్మించి, తేనెను తయారుచేస్తాయి. ప్రతి తేనెటీగకు సమూహంలో ప్రత్యేక పాత్ర ఉంటుంది.
జంతువులు మనకు ఏ విధంగా ఉపయోగపడుతాయి?
జంతువుల చర్మంతో చెప్పులు మరియు డోలు వంటి వాయిద్యాల తయారీకీ.
జంతువుల వెంట్రుకలతో ఉన్ని వస్త్రాలు తయారు చేయడానికి.
జంతువుల మాంసంతో ఆహార పదార్థాలు తయారు చేయడానికి.
పైవన్నీ సరైనవే.
జంతువులు మన జీవితంలో బహుముఖ ఉపయోగాలను అందిస్తాయి. జంతువుల చర్మం ద్వారా చెప్పులు, డోలు, వెంట్రుకలతో వస్త్రాలు తయారు చేస్తారు. మాంసం ద్వారా ఆహార పదార్థాలు పొందుతారు.
క్రిందివాటిలో కబడ్డీ ఆట నియమం కానిది ఏది?
అవసరమైతే జుట్టు పట్టుకొని కూడా లాగవచ్చు.
శరీరానికి నూనె లాంటి పదార్థాలు రాసుకొని ఆడరాదు.
ఆటగాళ్ళు గోళ్ళు పెంచుకోరాదు.
అవుటయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి.
కబడ్డీ ఆటలో కూత మధ్యగీత వద్ద మొదలుపెట్టి, మళ్ళీ అక్కడివరకు కొనసాగించాలి. నూనె రాసుకొని, గోళ్ళు పెంచుకొని ఆడకూడదు. అవుటయిన వాళ్ళు కోర్టు వెలుపల కూర్చోవాలి. అయితే జుట్టు పట్టుకొని లాగడం నిషిద్ధం. ఇది ఆటగాళ్లకు గాయాలు కలిగించే ప్రమాదం ఉంది.
చీమలకు వాటి తల ముందు భాగంలో ఎన్ని ఫీలర్స్ ఉంటాయి?
2 ఫీలర్స్.
4 ఫీలర్స్.
6 ఫీలర్స్.
8 ఫీలర్స్.
చీమలకు వాటి తల ముందు భాగంలో ఏంటినాల వంటి 2 ఫీలర్స్ ఉంటాయి. ఇవి ఆహారం ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మరియు ఇతర చీమలకు సమాచారం అందించడానికి ఉపయోగ పడుతాయి.
కూలి చీమలు ఎలాంటి పనులు చేస్తాయి?
రాణి చీమలు పెట్టిన గుడ్లను రక్షించడం.
చీమ పిల్లలకు, చీమలకు ఆహారాన్ని అందించడం.
గూడు కట్టడం మరియు మరమ్మత్తులు చేయడం.
పైవన్నీ సరైనవే.
కూలి చీమలు రాణి చీమలు పెట్టిన గుడ్లను రక్షిస్తాయి, చీమ పిల్లలకు మరియు ఇతర చీమలకు ఆహారం అందిస్తాయి, మరియు గూడు కట్టడం, మరమ్మత్తులు చేయడంలో సహాయం చేస్తాయి.
మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారుచేసుకునే పక్షి ఏది?
పావురం.
రామచిలుక.
పాలపిట్ట.
దర్జీ పిట్ట.
మొక్కల నారలతో ఆకులను కుట్టి గూడు తయారుచేసుకునే పక్షి దర్జీ పిట్ట. ఈ పక్షులు తమ ముక్కును సూదిలా ఉపయోగించి ఆకుల అంచులను కుట్టి, వాటిని మొక్కల నారలతో కలిపి గూడును నిర్మిస్తాయి.
విజేందర్ సింగ్ ఏ క్రీడలో ఒలంపిక్ పతాకాన్ని గెల్చుకున్నారు?
కబడ్డీ.
బాక్సింగ్.
హాకీ.
రెజ్లింగ్.
విజేందర్ సింగ్ భారతదేశానికి చెందిన ప్రఖ్యాత బాక్సర్. ఆయన 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించారు. ఇది భారత బాక్సింగ్ చరిత్రలో తొలి ఒలింపిక్ పతకం.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు?
మెహబూబ్ అలీ.
డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం.
డా. ఎన్. గోపాలస్వామి.
డా. సలీం అలీ.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త “డా. సలీం అలీ”. ఆయన పక్షుల వివిధ జాతులను పరిశీలించి, పక్షుల పై అనేక గ్రంథాలను రాశారు. ఆయనను “Birdman of India” అని కూడా పిలుస్తారు.
జీవ వైవిధ్యం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది?
పట్టణాలలో.
గ్రామాలలో.
ఎడారిలో.
అడవుల్లో.
జీవ వైవిధ్యం ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. ఇక్కడ వాతావరణం, ఆహారం, నీటి వనరులు సమృద్ధిగా ఉండడం వల్ల జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది. అడవులు అనేక రకాల మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలు, మరియు సూక్ష్మజీవులకు నివాసంగా ఉంటాయి. ఇది జీవ వైవిధ్యానికి ప్రధాన కేంద్రం.
కుటుంబ వ్యవస్థలో మార్పులు రావడానికి ముఖ్య కారణం ఏది?
పెళ్ళిళ్ళు.
పిల్లలు పుట్టడం.
కొత్త ప్రదేశాలలో ఉద్యోగాలు రావడం.
పైవన్నీ సరైనవే.
కుటుంబంలో పెళ్ళిళ్ళు జరగడం, కొత్త పిల్లలు పుట్టడం, ఉద్యోగాల కోసం కొత్త ప్రదేశాలకు వెళ్లడం, బదిలీ కావడం, వ్యాపారం, చదువులు, బ్రతుకు తెరువు కోసం వలసపోవడం, భూకంపాలు – వరదలు రావడం, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం వంటి కారణాల వల్ల కుటుంబంలో మార్పులు వస్తాయి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


Test 1: 4th Class EVS Bits

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top